
బాలీవుడ్ నటి ప్రియాంక చొప్రాకు కుర్రకారులో భారీ క్రేజ్ ఉంది. ఈ భామ బాలీవుడ్లో రాణిస్తూనే హాలీవుడ్లో పలు సినిమాల్లో నటించింది. హాలీవుడ్లోనూ ప్రియాంక నటించిన సినిమాలు భారీ హిట్టవడంతో గ్లోబల్ స్టార్ గా మారింది. ఇదంతా అందరికీ తెల్సిందే.. అయితే ప్రియాం చొప్రా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన తండ్రితో గతంలో జరిగిన గొడవ గురించి బయటపెట్టింది. ప్రియాంక ఎలాంటి దాపరికం లేకుండా ప్రియాంక తన తండ్రితో గొడవపడిన విషయాన్ని బయటపెట్టే అందరూ అవాక్కయ్యేలా చేసింది.
ప్రియాంకా చోప్రాకు తన తండ్రి అశోక్ చోప్రాతో మంచి అనుబంధం ఉంది. ప్రియాంక తన చేతిపై ‘డాడీస్ లిటిల్ గర్ల్’ అని టాటూ కూడా ఉంటుంది. అంతా వీరిమధ్య సన్నిహిత్యం ఉంటుంది. తన డాడీయే తనకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పే ప్రియాంక ఎప్పుడూ చెబుతోంది. అయితే ఓ విషయంలో తన తండ్రితో పెద్ద గొడవ జరిగిందని చెప్పింది. తనకు 16ఏళ్ళ వయస్సు ఉన్నపుడు ఓసారి అమెరికా నుంచి ఇండియాకు తిరిగొచ్చినట్లు తెలిపింది. అప్పుడు తన బట్టలను చూసి తన తండ్రి షాక్ అయినట్లు చెప్పింది.
అప్పుడు తాను చాలా కురచైన బిగుతూ దుస్తులు ధరించినట్లు ఇంటర్వ్యూలో చెప్పింది. అలాగే అక్కడున్న చాలామంది అబ్బాయిలు తననే చూస్తుండిపోవడంతో ఆయన సహించలేకపోయారని చెప్పింది. ఇలాంటి దుస్తులు వేసుకున్నందుకు తనను మందలించినట్లు చెప్పింది. ఈ బట్టల విషయంలో మా ఇద్దరికీ చాలాసేపు గొడవ జరిగిందని ప్రియాంక గుర్తు చేసుకుంది. అయితే ప్రియాంక తండ్రి అశోక్ 2013లో కాలేయ కేన్సర్ కారణంగా మృతిచెందారు. కాగా ప్రస్తుతం ప్రియాంక తన భర్త నిక్ జొనాస్‌తో కలిసి లాస్ ఏంజెలెస్‌లో ఉంటోంది. అప్పుడప్పుడు చుట్టపు చూపుగా భారత్‌కు వస్తుంటుంది.