
కేవలం పెద్ద ఎత్తున కరోనా టెస్టులు చేయలేక, కరోనా బాధితులను గుర్తిస్తే వారికి అవసరమైన వైద్య సదుపాయాలు కలిగించలేకనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లోక్ డోన్ పొడిగింపుకు చేస్తున్నాయా? అవుననే అభిప్రాయాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ లోక్ డౌన్ ఏప్రిల్ 14 తర్వాత పొడిగింపుకు ఎటువంటి వైద్యపరమైన కారణం లేదని స్పష్టం చేసింది.
దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేయవచ్చని చెబుతూనే హాట్ స్పాట్ లో మాత్రం నిషేధపు ఉత్తరువులు జారీ చేయాలని స్పష్టం చేస్తూ, ఈ సందర్భంగా సవివరమైన నివేదికను సమర్పించింది. ఈ నివేదికను యడియూరప్ప ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందని, ఒకట్రెండు రోజుల్లో ఏదో ఒక నిర్ణయం వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
నారాయణ హృదయాలయ ఆస్పత్రుల ఫౌండర్, డాక్టర్ దేవి శెట్టి ఆధ్వర్యంలో కర్ణాటక ప్రభుత్వం హై పవర్డ్ కమిటీని ఏర్పాటు చేసింది . లాక్ డౌన్ వల్ల రాష్ట్రంలో వేలాది మంది వలస కార్మి కులు ఆదాయం, ఆహారం లేక విలవిల్లాడుతున్నారు. ప్రజల్లో నెలకొన్న ఫ్రస్టెసన్ ను నివారించడానికి, వారిలో నమ్మకాన్నికలిగించడానికి, చాలామందికి జీవనోపాధి అందించేందుకు.. దశల వారీగాలాక్ డౌన్ ఎత్తేయడం చాలా అవసరమని వీరు స్పష్టం చేశారు.
ఐటీ, బిజినెస్ టెక్నాలజీ సంస్థలు, ఇతర వ్యాపా ర సంస్థలు తమ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోంచేసేలా ప్రోత్సహించాలని, వర్క్ ఫ్లో 50 శాతం మంది ఆఫీసుల్లో పనిచేసేలా చూసుకోవాలని, ఫ్యాక్టరీలు పలు సంస్థలు తిరిగి తెరుచుకుని 50 శాతం ఉత్పత్తి జరిగేలా చూడాలిని, ప్రతి ఉద్యోగికి పూర్తి జీతం చెల్లించాలని, నిర్మాణ రంగం కూడా తిరిగి ప్రారంభం కావాలని సూచించింది.
ప్రభుత్వం గుర్తించిన హాట్ స్పాట్ లలో రెండు వారాలు లాక్డౌన్ కొనసాగించాలని, ఏప్రిల్ 3 0 వరకు రాష్ట్రంలో ఆంక్షలు కొనసాగించాలని, అంతరాష్ట్ర సరిహద్దులను మూసివేయాలని, విమానాలు, రైళ్లు, ఏసీ బస్సులు, మెట్రో బస్సులు తిప్పవద్దని, కేవలం గూడ్స్ వాహనాలను మాత్రమే అనుమతించాలిని ఈ నిపుణుల బృందం సిఫార్స్ చేసింది. మే 31 వరకు ప్రజలు సాంఘిక దూరం నియమాలను కచ్చితంగా పాటించేలా కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.
బహిరంగ ప్రదేశాలలో ఆరుగురి కన్నా ఎక్కువ మంది ఒకచోట గుమిగూడకుండా చూడాలని, అవసరమైన చోట్ల 144 సెక్షన్ను విధించాలని, జిమ్లు, బార్లు, హోటళ్లు, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, మత సంస్థలు, పెళ్ళ్లిలుసహా ఇతర ఫంక్షన్లు ఏప్రిల్ 30 వరకు ఆపేయాలని, చూయింగ్ గమ్ నమలడాన్ని నిషేధించాలని, పాన్ తినడం పైనా ఆంక్షలు విధించాలని, ఏసీలు వాడకుండా షాప్లు ఇతర, సంస్థలు నడవాలని వివరించారు.
విద్యార్థులకు ఆన్ లైన్ లో తరగతులు నిర్వహించాలని, మరిన్ని టెస్టింగ్ కిట్లను తెప్పించుకోవాలని, ర్యాపిడ్ యాంటీ బాడీ టెస్టింగ్ కిట్ల వాడకంపై ఆన్లైన్ ట్రైనింగ్ ఇవ్వాలని, గ్రామీణ వ్యవ సాయ కార్యకలాపాలను మరింత పెంచాలని, జనం ఎక్కువగా ఉండేప్రాంతాల్లో కామన్ టాయిలెట్లను ఏర్పాటు చేయాలని, సీనియర్ సిటిజన్లు ఇంట్లోనే ఉండాలని కఠిన ఉత్తరువులు జారీ చేయాలని ఈ బృందం సూచించింది.
కొవిడ్-19 అనేది 3 నెలల వయస్సున్న వైరస్ అని చెబుతూ ఏప్రిల్ లో రెండు వారాలు ముగిశాక క్షేత్రస్థాయి వాస్తవాలు ఎలా ఉంటాయనే దాన్ని ఎవరూ అంచనా వేయలేరని పేర్కొన్నది. అందుకే ఈనెల 15 నుంచి 30 వరకు రెండు వారాల ఒక కార్యాచరణ ప్రణాలికను రూపొందించుకోవాలని వీరు సూచించారు.