Home Blog Page 8540

మద్యానికి లాక్ (డౌన్) లేదు!


కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు కేంద్రం ప్రకటించిన లాక్ డౌన్ కారణంగా ఏపీలో మద్యం దుకాణాలు తీర్చుకోవడం లేదు. అయినప్పటికీ రాష్ట్రంలో మద్యం అక్రమ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కొందరు అధికారులు, ఇతర సిబ్బంది సహకారంతో అనధికారకంగా విక్రయాలు జరుపుతున్నారు. గతంలో బెల్టుషాపులు నిర్వాహకులు, కొన్ని చోట్ల చోటమోటా రాజకీయ నాయకులు, అధికారులు సైతం ఈ చర్యలకు పాల్పడి లాక్ డౌన్ సమయంలో నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని చూస్తున్నారు. మద్యానికి బానిసలైన వారి నిస్సహాయత వీరికి వరంగా మారింది. రాష్ట్ర రాజధాని కేంద్రమైన గుంటూరు, విజయవాడ ఈ నగరాలకు సమీపంలో ఉన్న మండల కేంద్రాలు, గ్రామాల్లో యథేచ్ఛగా విక్రయాలు జరుగుతున్నాయి. అదీ లాక్ డౌన్ అమలులో ఉండే సాయంత్రం వేళల్లో జరగడం ఆచర్యానికి గురిచేస్తోంది.

మద్యం అక్రమంగా తరలిస్తున్న, నిల్వ ఉంచిన ఘటనలు లాక్ డౌన్ ప్రకటించిన తూర్పుగోదావరి, ప్రకాశం, చిత్తూరు తదితర జిల్లాలో వెలుగులోకి వచ్చాయి. మద్యం షాపుల్లో మద్యం సీసాలు చోరీ చేసిన సంఘటనలు కృష్ణా, కడప తదితర జిల్లాలో వెలుగు చూశాయి. ఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్ని అక్రమ రవాణా చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి హెచ్చరికలను ఖాతరు చేయకుండా రాష్ట్రంలో జోరుగా మద్యం విక్రయాలు సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎటువంటి సంఘటనలు కరోనా వైరస్ వ్యాప్తికి మరింత అవకాశాన్ని ఇస్తాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

మరోవైపు మద్యం విక్రయాలు చేసున్న అక్రమార్కులు వాటి ధరలను రెండు లేక మూడింతలు పెంచి విక్రయిస్తున్నారు. గతంలో రూ.1200 ఉన్న మద్యం బాటిల్ ప్రస్తుతం రూ. 3 వేల నుండి 5,500 వరకూ వసూలు చేసున్నారు. క్వాటర్ బాటిల్ పైన రూ. 250 వరకూ అధనంగా వసూలు చేస్తున్నారు. తాగుబోతుల బలహీన వారికి వరం గా మారింది. చాలా మద్యం షాపులలో మద్యం నిల్వలు మాయం అయినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై విచారణ నిర్వహించి, ఇందుకు బాద్యులైన వారిపై చర్యలు తీసుకోవడంతోపాటు, మద్యం షాపుల్లో నిల్వపై విచారణ జరిపితే గాని మొత్తం వ్యవహారం బయటకు వస్తుందంతున్నారు.

రైల్వే రిజర్వేషన్స్… నిజమెంత?

 

 

కరోనా దెబ్బతో 21 రోజుల లాక్ డౌన్ ఈ నెల 14న ముగుస్తున్న నేపథ్యంలో 15వ తేదీ నుంచి రైలు ప్రయాణాలకు సంబంధించి రైల్వేశాఖ రిజర్వేషన్లను ప్రారంభించిందని వ‌స్తున్న వార్త‌ల‌పై రైల్వే మంత్రిత్వ‌ శాఖ క్లారిటీ ఇచ్చింది. రిజర్వేషన్ల ప్రారంభ తేదీలు అంటూ కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న‌ వార్తలు పూర్తిగా అవాస్త‌వం అని తెలిపింది. లాక్ డౌన్ న‌డుస్తున్న వేళ ఇలాంటి వార్త‌లు ప్ర‌జ‌ల‌ను గంద‌ర‌గోళానికి గురి చేస్తాయ‌ని తెలిపింది. రైలు ప్రయాణాలపై ప్ర‌భుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా తక్షణమే రైల్వేశాఖ తెలియజేస్తుంద‌ని పేర్కొంది.

కోవిడ్‌-19 నేపథ్యంలో దేశ‌మంతటా లాక్ డౌన్ ఉండ‌గా ప్రయాణికులకు మార్గదర్శకాలు, రిజర్వేషన్ల ప్రారంభ తేదీలు అంటూ మీడియాలో కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయని చెప్పిన మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్… ఏదైనా ప్రసారం చేసేప్పుడు సంబంధిత వర్గాల నుంచి అధికారికంగా తెలుసుకొని ప్రసారం చేయాలని చెప్పింది. లాక్‌డౌన్ పొడిగింపుపై శనివారం మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రధాని న‌రేంద్ర మోడీ .. రేపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ను నిర్వహించబోతున్నారు. లాక్‌ డౌన్‌ పై నిర్ణయం తీసుకోవడానికే ప్రత్యేకంగా ఆయన ఈ కాన్ఫరెన్స్‌ ను ఏర్పాటు చేయనున్నారు.

Sakshi Agarwal Quarantine Pics

Adah Sharma Latest Photos

కరోనా బాధితుల కోసం సీఎం జగన్ కీలక నిర్ణయం!

రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో.. ప్రతి జిల్లాకు ఐదు ఆసుపత్రులను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. కోవిద్19 నియంత్రణకు సంబంధించిన చర్యలపై సీఎం జగన్ ఈ రోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. లాక్‌ డౌన్‌ సహా, కోవిద్19 విస్తరణ ఉన్న ప్రాంతాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమీక్షించారు. రాష్ట్రంలో కేసుల పరిస్థితి, వ్యాధి నియంత్రణ చర్యలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. కరోనా నియంత్రణలో ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లాకు అదనంగా ఐదు ఆసుపత్రుల చొప్పున గుర్తిస్తున్నామని అధికారులు తెలిపారు. క్రిటికల్‌ కేర్‌ కోసం నాలుగు ప్రధాన ఆసుపత్రులు, ప్రతి జిల్లాకు ఒక ఆసుపత్రి సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులో వచ్చే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు జిల్లాలకు అదనంగా ఐదు ఆసుప్రతుల చొప్పున సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు.

క్వారంటైన్, ఐసోలేషన్‌ వార్డుల్లో సదుపాయాలపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్షించారు. ఐసోలేషన్‌ లో ఉంచే వారికి మంచి సదుపాయాలు ఉన్న గదులు ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. దీనిపై అధికారులు దృష్టిసారించాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడోసారి జరుగుతున్న కుటుంబ సర్వే వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. జలుబు, గొంతునొప్పి, జ్వరం, దగ్గు లాంటి లక్షణాలతో ఉన్నవారి అందరికీ పరీక్షలు చేయించాలని మరోసారి సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

సాయం చేయడంలో ముందున్న సందీప్ కిషన్


వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ఫేమ్ హీరో సందీప్ కిషన్ తన పరిధిలో చేతనైనంత మందికి సాయం చేస్తున్నాడు. కరోనా మహమ్మారి పై పోరాటంలో తన వంతు సాయంగా సందీప్ కిషన్ రూ. 3 ల‌క్ష‌లు విరాళాన్ని సి సి సి కి అందించడం చేసాడు. అదేవిధంగా తన ‘వివాహ భోజనంబు రెస్టారెంట్‌’ లో పనిచేస్తున్న 500 పైగా ఉద్యోగులకు మరియు వారి కుటుంబాలకు కూడా ఆర్ధిక సహాయం అందిస్తూ అందరి మన్ననలు అందుకొంటున్నాడు మళ్ళీ తాజాగా కొన్ని వేలమందికి మాస్కులు మరియు శానిటైజర్ లను సందీప్ కిషన్.అందించడం జరిగింది. ఇక తన అభిమాని కడప శ్రీను ఆకస్మిక మరణం తరువాత, అతని కుటుంబానికి అండగా నిలబడుతూ ప్రతి నెల ఆ కుటుంబ ఆర్ధిక అవసరాలు నిమిత్తం నెల నెల 10,000 వేలు అందిస్తున్నాడు.. ఈ లాక్ డౌన్ క్లిష్ట పరిస్థితుల్లో కూడా సందీప్ కిషన్ కడప శ్రీను తల్లికి పది వేలు పంపించడం జరిగింది.. కడప శ్రీను తల్లికి ఏ అవసరం ఉన్నా..పెద్ద కొడుకుగా ఆమెకు అండగా నిలబడుతూ సందీప్ కిషన్ తన మంచి మనసు నిరూపించుకున్నాడు.

ఇగత ఏడాది `నిను వీడ‌ని నీడ‌ను నేనే` చిత్రంతో మంచి విజయం సాధించిన సందీప్ కిష‌న్ ప్రస్తుతం `A1 ఎక్స్‌ప్రెస్‌` అనే సినిమాలో నటిస్తున్నాడు. కాగా ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి కథా నాయిక. హాకీ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి దర్శకత్వ భాద్యతలను ‘డెన్నిస్ జీవ‌న్ క‌నుకొలను’ వహించడం జరుగుతోంది .

కొత్త పార్టనర్ తో ఎంజాయ్ చేస్తున్న అంజలి!


దేశంలో లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లన్నీ వాయిదాపడ్డాయి. దీంతో సెలబట్రీలంతా ఇళ్లకే పరిమితమయ్యాయి. వాళ్లంతా ఫ్యామిలీతో కాలం గడుపుతున్నారు. వీటికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ అభిమానులతో వాళ్ల అనుభవాలను పంచుకుంటున్నారు. పలువురు సెలబ్రెటీలు కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. కాగా కొందరు హీరోయిన్లు అయితే హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ కుర్రకారు మతిని పొగొడుతున్నారు. మరికొందరు యోగా, ఫిట్ నెస్, వంటలు, వైగరా వంటివి చేస్తూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇక తెలుగమ్మాయి అంజలి ఏకంగా కొత్త పార్టనర్ తన క్వారంటైన్లోకి రప్పించుకొని ఎంజాయ్ చేస్తుండటం ఆసక్తిని రేపుతోంది.

ఈమేరకు అంజలి తన కొత్త పార్టనర్ తో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ముద్దుగమ్మ పార్టనర్ పేరు షిహ్ జు(పొలో). ఇదొక పెంపుడు కుక్క. దీంతోనే అంజలి సమయం గడుపుతోంది. ఈ లాక్డౌన్లో తనకు పోలోతోనే ఆడుకోవడానికి సమయం సరిపోతుందని చెబుతోంది. ఫస్టు టైమ్ పోలో ఇన్ స్ట్రాగ్రామ్లోకి వచ్చిందంటూ అంజలి అభిమానులకు పోలోను పరిచయం చేసింది. మీరంతా కూడా క్వాలిటీ టైంతో గడపాలని అంజలికి సలహా ఇస్తుంది. తన పార్టనర్ తో అసలు బోరు కొట్టదని.. హాయిగా ఎంజాయ్ చేస్తున్నట్లు పేర్కొంది. కాగా అంజలి నటించిన నిశబ్దం మూవీ ఏప్రిల్ 2న విడుదల కావాల్సి ఉండగా కరోనా ఎఫెక్ట్ తో వాయిదా పడింది.

https://www.instagram.com/p/B-y5AL8JZV3/

ఎన్నికల కమిషనర్ తొలగింపు?


రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకంలో నిబంధనలు మార్పు చేస్తూ ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్ కు తెలిపిన గవర్నర్ ఆమోదం తెలిపారు. దీంతో ఆర్డినెన్స్ పై ప్రభుత్వం జీవో జారీ చేసినట్లు సమాచారం.

ప్రభుత్వానికి సంక్రమించిన అధికారం తో ఎన్నికల కమిషనర్ గా రమేష్ కుమార్ ను తొలగిస్తూ జీవో జారీ. ఈ రెండు జీవోలను ప్రభుత్వం కాన్ఫిడెన్షియల్ గా ఉంచింది. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడం, ‘కరోనా’ సాయం పంపిణీలో అధికార పార్టీ ఎంపిటిసి అభ్యర్థులు పాల్గొనడంపై విచారణ కు ఆదేశించడం అధికార పక్షానికి నచ్చక పోవడంతో రమేష్ కుమార్ ను తొలగించాలని ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.

మరోవైపు ఈ అంశంపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పందిస్తూ…ఎస్ఈసీ రమేష్ కుమార్ పై వేటు నిర్ణయం చట్ట ప్రకారంగా చెల్లుబాటు కాదన్నారు. సీఎం జగన్ దుర్మార్గంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. కరోనా బారిన పడకుండా 5 కోట్ల ప్రజలను ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ కాపాడారని, జగన్ ప్రభుత్వం తీసుకొచ్చే ఆర్డినెన్స్ లు కోర్టులో నిలబడవన్నారు.

మాస్క్ లు ఇవ్వడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఉద్యోగులను సస్పెండ్ చేస్తున్నారని, ఉద్యోగులపై జగన్ ప్రభుత్వం ప్రతీకార చర్యలకు దిగుతోందని తెలిపారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులపై.. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్ట్‌లు పెడుతున్నారన్నారు.

తెలంగాణలో మాస్కుల వాడకంపై కీలక ఉత్తర్వులు


దేశంలో కరోనా మహమ్మరి విజృంభిస్తుంది. లాక్డౌన్ అమలుతో దేశంలో కరోనా కేసులు పెరగకుండా అదుపు చేయగలిగింది. అయితే గడిచిన వారంరోజులుగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశంలో 6వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో పలు రాష్ట్రాలు లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తున్నాయి. దీంతోపాటు కరోనా రాకుండా చేపట్టాల్సిన అన్ని చర్యలను తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా పలు రాష్ట్రాలు మాస్కు వాడకాన్ని తప్పనిసరి చేశాయి. తాజాగా తెలంగాణ కూడా ఇంట్లో నుంచి బయటికి వచ్చే ప్రజలు తప్పనిసరిగా మాస్కు ధరించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రంలో కొందరిలో కరోనా లక్షణాలు లేకున్నా పాజిటివ్ వస్తుందని చెబుతుంది. ఈ నేపథ్యంలో ప్రతీఒక్కరు ఇళ్లలోనే ఉండాలని, అవసరమైతేనే బయటికి రావాలని ప్రభుత్వం చూస్తుంది. బయటికి వచ్చేవారు తప్పనిసరిగా ముఖానికి మాస్కు ధరించాలని ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ఈమేరకు విధుల్లో ప్రతీ ఉద్యోగి మాస్క్ ధరించాలని పేర్కొంది. మాస్కులు ధరించకుండా రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఇళ్లలో తయారీచేసిన క్లాత్ మాస్క్ లకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 471 కరోనా కేసులు నమోదయ్యాయి. 12మంది మృతిచెందగా 45మంది రికవరీ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 414 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

కామెడీయే కరెక్ట్ అంటున్న గోపీచంద్


కామెడీ ఇపుడు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతోంది. ఒక పక్క టి వి షోలు , మరో పక్క టిక్ టాక్ షోలు, వాట్సాప్ మెసేజ్ లు , సోషల్ మీడియా …ఇలా అనేక రూపాల్లో హాస్యం దర్శనమిస్తోంది. కామెడీ కోసం థియేటర్ల కు వెళ్లకుండా ‘జబర్దస్త్’ ‘అదిరింది’ వంటి కామెడీ షో లు బాగా అడ్డు పడుతున్నాయి. అలాంటి సమయం లో కామెడీ ని నమ్ముకొని ఒక హీరో ముందు కెళ్తున్నాడు .

శ్రీను వైట్ల, నాగేశ్వర రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి వంటి పేరున్న హాస్యదర్శకులు తమ పంధా మార్చుకొంటున్న తరుణం లో ఈ రకమైన ప్రయోగానికి గోపీచంద్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంకా చూస్తే అల్లరి నరేష్ వంటి కామెడీ హీరో కూడా తన దారి మార్చుకొని ముందుకెళ్లాలను కొంటున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో కామెడీ మీద ఆధార పడి ఒక సినిమా చెయ్యడం అంటే కాస్త రిస్కే ….అయినప్పటికీ హీరో గోపీచంద్ తనను హాస్యమే గట్టెక్కిస్తుందని గట్టిగా నమ్ముతున్నాడు. ఈ మధ్య వరుస ప్లాప్ లతో గోపీచంద్ కెరీర్ చాలా డల్ అయ్యింది. ప్రస్తుతం హీరో సంపత్ నంది డైరెక్షన్లో ‘సీటీమార్’ అనే చిత్రం చేస్తున్నాడు. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం కబడ్డీ నేపధ్యంలో సాగుతుందని తెలుస్తోంది

ముందు యాక్షన్ ప్యాక్డ్ సన్నివేశాలతో రూపొందిన ఈ చిత్రాన్ని హీరో కోరిక మేరకు దర్శకుడు సంపత్ నంది ఫుల్ కామెడీ తో నింపేస్తున్నాడు ఆ క్రమంలోఇపుడు సెకండ్ హాఫ్ లో వెన్నెల కిశోర్ , హీరో గోపీచంద్ ల మధ్య కామెడీ ఓ రేంజ్ లో తీయడం జరిగిందట.. . అయితే ఈ టైములో కామెడీ చిత్రాలు వర్కౌట్ అవుతాయా లేదా అనేది పెద్ద మీమాంస. అయితే గతంలో వరుస ప్లాప్ లతో ఉన్న గోపీచంద్ ‘లౌక్యం’ అనే చిత్రంతో హిట్ కొట్టాడు. అదీ ఆయన గారి ధీమా .

విజ‌య‌సాయి పెత్తనంపై వై ఎస్ భారతి చెక్!


వైసిపిలో, ఏపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తర్వాత అంతా తానే అన్నట్లు వ్యవహరిస్తూ, ప్రభుత్వం, పార్టీ లపై పూర్తి ఆధిపత్యం వహిస్తూ వచ్చిన పార్టీ ప్రధాన కార్యదర్శి పార్లమెంటరీ నాయకుడు పెత్తనంకు ముఖ్యమంత్రి సతీమణి వై ఎస్ భారతి ఇప్పుడు చెక్ పెడుతున్నట్లు తెలుస్తున్నది. పాలన, పార్టీ వ్యవహారాలలో శృతిమించిన జోక్యం చేసుకోవద్దని వారిస్తున్నట్లు చెబుతున్నారు.

దానితో విజయసాయిరెడ్డి వైభవం తగ్గి విలవిలా లాడుతున్నట్లు పార్టీ వర్గాల కధనం. మొదటి నుండి విజయసాయి వ్యవహారంపై అసహనంగా ఉన్న భారతి ఇప్పుడు ఆయనను అదుపులో పెడుతున్నారు. ముఖ్యమంత్రి సహితం ఈ విషయంలో ఏమీ చేయలేక ఏ విషయంపై అయినా కలిస్తే భారతి తో మాట్లాడమని చెబుతూ ఉండడంతో విజయసాయి ఖంగు తింటున్నారు.

పైగా, ప్రభుత్వంలో అధికార పదవులలో నామినేషన్ విషయంలో సహితం విజయసాయిరెడ్డి మాటలు చెల్లుబాటు కావడం లేదని చెబుతున్నారు. హై కోర్ట్ మందలించినా గ్రామా పంచాయతి కార్యాలయాలుకు సహితం పార్టీ రంగులు వేస్తున్న సమయంలో ఈ మధ్య విశాఖలో కరోనా బాధితులకు విజయసాయి రెడ్డి అందిస్తున్న సహాయంకు సంబంధించిన కవర్లపై ముఖ్యమంత్రి బొమ్మ లేకుండా, ఆయన బొమ్మ మాత్రమే ఉండటం పార్టీ వర్గాలకు విస్మయం కలిగిస్తున్నది.

గతంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొత్తం ప్రభుత్వ వ్యవహారాలు అన్ని నడిపిస్తూ, వై ఎస్ కుటుంబాన్ని దూరంగా ఉంటూ వచ్చిన కెవిపి వలే ఇప్పుడు విజయసాయి రెడ్డి సహితం విశాఖలో జరుపుతున్న దందాలు అన్ని స్వయంగా చేసుకొంటూ ఉండడాన్ని గ్రహించిన భారతి ఆయన ప్రాబల్యాన్ని కట్టడి చేస్తూ వచ్చారని చెబుతున్నారు.

విశాఖ‌లో కూర్చుని ఏపీని శాసిస్తూ, ఢిల్లీ పెద్ద‌ల‌ని గుప్పిట్లో పెట్టుకుని త‌న భ‌ర్త‌ను బొమ్మ‌లాగ ఆడించ‌డం మానుకోవాల‌ని ఆమె నేరుగా హెచ్చరించారని సోషల్ మీడియాలో కధనాలు వెలువడుతున్నాయి. ప్రభుత్వ వ్యవహారాలలో విజయసాయిని పక్కకు నెట్టి, బంధువు, క‌డ‌ప జిల్లావాసి అయిన స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఈ మధ్య క్రియాశీలకంగా ఉండటం అంతా ఆమె వల్లనే అని చెబుతున్నారు.

కాగా, సాక్షిలో రెసిడెంట్ ఎడిటర్ గా భారతి తీసుకు వచ్చిన కడప జిల్లాకు చెందిన ధ‌నుంజ‌య్‌రెడ్డిని మొన్నటి ఎన్నిక‌ల్లో బాగా అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై సాక్షి నుండి తొలగించేటట్లు విజయసాయి చేయగలిగారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి హవాను తొలగించడం కోసం భారతి వత్తిడితో ఏపీ ప్రభుత్వంలో సలహాదారుడిగా నియమించారు.

గ్రామా వలంటీర్లను ఏర్పాటు చేసి, వారందరి నుండి గ్రామాల వారి డాటా తెప్పించుకొని, మొత్తం ప్రభుత్వంపై అదుపు సాధించే ప్రయత్నం చేస్తున్న విజయసాయిని కట్టడి చేయడం కోసం ఇప్పుడు ఆ వ్యవస్థ పర్యవేక్షణ బాధ్యతను ధనుంజయ రెడ్డికి అప్పజెప్పారు.

కరోనాపై టిక్ టాక్.. ఆస్పత్రిపాలైన జనం!


కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని బెంబెలేత్తిస్తోంది. కరోనా మహమ్మరి దాటికి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. దీంతో కరోనా అంటేనే జనం గజగజ వణికిపోతున్నారు. ప్రభుత్వాలు ప్రజలకు కరోనాపై అవగాహన కల్పిస్తున్నాయి. ఇదిలా ఉండగానే కరోనాపై సోషల్ మీడియాలో పలురకాల తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. ముందు వెనుక ఆలోచించకుండా ఈ పుకార్లను నమ్మి కొందరు ఆస్పత్రి పాలవుతోన్నారు. కరోనా రాకుండా ఈ పదార్థాలను తీసుకోవాలని టిక్ టాక్ లో వీడియో వచ్చింది. ఈ వీడియోలోని పదార్థాలను తిని పలువురు ఆసుప్రతిపాలైన సంఘటనలో ఆంధప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని ఆలపల్లికి చెందిన రెండు కుటుంబాలు కరోనాపై వచ్చిన టిక్ టాక్ వీడియోను తిలకించారు. ఉమ్మెత్త పువ్వు జ్యూస్ తాగితే కరోనా వ్యాప్తి చెందదని ఈ వీడియోలో ఉంది. ఇందులో చెప్పింది నిజమేనని నమ్మిన ఈ రెండు కుటుంబాల్లోని వ్యక్తులు ఉమ్మెత్త పువ్వు జ్యూస్ చేసుకుని తాగేశారు. వీరంతా కొద్దిసేపటికి తీవ్ర అస్వస్థత పాలుకావడంతో గమనించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. 10మంది వరకు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. వీరిలో చిన్నపిల్లల నుంచి వృద్ధులదాకా ఉన్నట్లు తెలుస్తోంది. వారికి ప్రాణహాని కలుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

ఈ నేపథ్యంలో వైద్యాధికారులు కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కరోనాపై కేవలం ప్రభుత్వ సూచనలు మాత్రమే ప్రజలు పాటించాలని కోరుతుంది. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు నమ్మవద్దని సూచించారు. శుభ్రతను పాటించడం, ముఖానికి మాస్కు ధరించడం, శానిటైజర్ వాడడం, తరచూ చేతులు శుభ్రంగా కడుకోవడం, స్వీయనియంత్రణ పాటించడం ద్వారా కరోనా మహమ్మరికి దూరంగా ఉండొచ్చని వైద్యులు, పోలీసులు సూచిస్తున్నారు. ఎవరైనా కరోనాపై తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన శిక్షలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

మూడు నెలల పాటు స్కూల్ ఫీజ్ కట్టొద్దు!

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని పాఠశాలు వచ్చే మూడు నెలల వరకు విద్యార్థుల నుండి ఎటువంటి రుసుము తీసుకోకుండా రాజస్థాన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 10 మరియు 12 తరగతుల మినహా మిగిలిన విద్యార్థులను తదుపరి తరగతులకు ప్రోత్సహించాలని పాఠశాలలను ఆదేశించింది.

మార్చి 15 నుండి పెండింగ్‌ లో ఉన్న మొత్తాన్ని రికవరీ చేయడాన్ని పాఠశాలలు నిలిపివేస్తాయి అంతే కాకుండా రాబోయే మూడు నెలల వరకు ప్రస్తుత మరియు ముందస్తు రుసుమును తీసుకోవు. విద్య యొక్క కొనసాగింపు కోసం పాఠశాలలు మరియు కళాశాలలు ఆన్‌ లైన్ తరగతులు మరియు ఇ-లెర్నింగ్‌ లను ఏర్పాటు చేయాలని గెహ్లాట్ తెలిపారు. విశ్వవిద్యాలయాల పరీక్షల షెడ్యూల్‌ ను నిర్ణయించడానికి ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసినట్లు ఉన్నత విద్యాశాఖ మంత్రి భన్వర్ సింగ్ భాటి తెలిపారు.

సాంకేతిక పుస్తకాలలో మిడ్ సెమిస్టర్ పరీక్షలు ఆన్‌ లైన్‌ లో జరిగాయని, విద్యార్థులకు ఇ-కంటెంట్‌ ను అందించడానికి యూట్యూబ్ ఛానల్‌ ను ప్రవేశపెట్టినట్లు గార్గ్ సిఎంకు తెలిపారు.

ఇదిలా ఉంటే.. తెలుగు రాష్ట్రాలలో కూడా కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. దీంతో లాక్ డౌన్ మరికొంత కాలం పొడిగించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు కూడా ఎటూ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. మర్చి వరకు పెండింగ్ లో ఫీజులతో పాటు మరి కొన్ని నెలల ఫీజు కట్టకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోనులాగున సామాన్య ప్రజలు కోరుతున్నారు.

మొదటి చూపు లోనే బన్నీ టాప్ లేపేసాడు


రోజు రోజుకి బన్నీ మరింత బలవంతుడవు తున్నాడు .ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెంచు కొంటున్నాడు. రీసెంట్ గా వచ్చిన అల వైకుంఠపురములో’ చిత్రం తో అల్లు అర్జున్ క్రేజ్ ఆకాశాన్ని తాకింది. ఇపుడు అదే ఊపుతో బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ తో సినిమా మొదలెట్టాడు. ఆ క్రమంలో అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ కొత్త చిత్రం యొక్క టైటిల్ ని కూడా ప్రకటించారు. కాగా ఈ చిత్రానికి ‘పుష్ప’ అనే టైటిల్ ఖరారు చేయడం జరిగింది. ఆ విషయాన్ని ఫస్ట్ లుక్ మరియు పోస్టర్ ద్వారా తెలియ చేశారు.

కాగా ఈ పోస్టర్లో అల్లు అర్జున్ ఊర మాస్ గెటప్ లో అందర్నీ ఆకట్టు కొన్నాడు. గుబురుగా, మాసిన గెడ్డం మీసాలతో ఉన్న బన్నీ లుక్ చాలా కొత్తగా ఉండి సినిమా ఫై ఆసక్తి పెంచేలా ఉంది.దరిమిలా ‘పుష్ప’ ఫస్ట్ లుక్ పోస్టర్ కి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఇక దర్శకుడు సుకుమార్..తాను విడుదల చేసిన రెండో పోస్టర్లో మాత్రం గంధపు చెక్కలు స్మగ్లింగ్ చేస్తుండగా బన్నీ పట్టుబడినట్లు చూపించాడు. అంతేకాదు ఆ పోస్టర్ లో బన్నీ కాలికి ఆరు వేళ్లు ఉండడం హాట్ టాపిక్ అయ్యింది .

దీంతో ఆ పోస్టర్ సోషల్ మీడియాలో ఒక సరికొత్త రికార్డుని సొంతం చేసుకుంది. ఇప్పటివరకు టాలీవుడ్ లో రిలీజ్ అయిన సినిమాల ఫస్ట్ లుక్ పోస్టర్ల లో రికార్డు నమోదు చేసింది. ట్విట్టర్ లో 84.1 K లైక్స్ తో అత్యధిక లైక్స్ అందుకున్న పోస్టర్ గా ‘పుష్ప’ రికార్డుల కెక్కింది. దీంతో గతంలో ఎన్టీఆర్ ‘అరవింద సమేత.. వీరరాఘవ’ ఫస్ట్ లుక్ పోస్టర్ కి ఉన్న 70.20K లైక్స్ రికార్డ్ ని బన్నీ బ్రేక్ చేసినట్లయింది. మేథ్స్ మాస్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్, ముత్యంశెట్టి మీడియా సంయుక్తం గా నిర్మిస్తోంది ఇందులో బన్నీకి జోడీగా రష్మిక మందన్న నటిస్తుంటే , తమిళ నటుడు విజయ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నాడు. వెరసి ” పుష్ప ” చిత్రం క్రేజీ మూమెంట్ ని సొంతం చేసుకొంది. .

ఓ పోలీసు బిడ్డగా వారికి నా సెల్యూట్‌: మెగాస్టార్


లాక్ డౌన్ నేప‌థ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు ఎంత‌గా శ్రమిస్తున్నారో చెప్పాల్సిన ప‌నిలేదు. జిల్లాల బోర్డ‌ర్స్ లోనూ..రాష్ట్రాల స‌రిహ‌ద్దుల్లోనూ పోలీసులు నిద్రాహారాలు మాని క‌ఠోరంగా శ్ర‌మిస్తున్నారు. ఇక నిరంత‌రం పల్లెటూళ్ల నంచి ప‌ట్ట‌ణాల వ‌ర‌కూ పోలీసులు రేయింబ‌వ‌ళ్లు ప‌హ‌రా కాస్తూనే ఉన్నారు. క‌రోనా మ‌హ‌మ్మారిని త‌రిమి కొట్ట‌డానికి మేము సైతం అంటూ ప్రాణాల‌కు తెగించి ప‌నిచేస్తున్నారు. తాజాగా ఇదే స‌న్నివేశాన్ని స్వ‌యంగా చూసిన మెగాస్టార్ చిరంజీవి పోలీసుల‌పై త‌న అభిప్రాయాన్ని ట్విట‌ర్ లో ఓ వీడియో ద్వారా పంచుకున్నారు.

`రెండు తెలుగు రాష్ట్రాల పోలీసుల ప‌నితీరు అద్భుతం. నిద్రాహారాలు మాని వాళ్లు ప‌డుతోన్న క‌ష్టం అంతా ఇంతా కాదు. నేను హైద‌రాబాద్ పోలీసుల‌ చూస్తున్నాను. వారి ప‌ని తీరువ‌ల్ల లాక్ డౌన్ చాలా స‌క్సెస్ పుల్ గా జ‌రుగుతుంది. అలా జ‌ర‌గ‌బ‌ట్టే ఈ క‌రోనా విజృంభ‌ణ చాలా వ‌ర‌కూ అదుపులోకి వ‌చ్చింది. అలాగే నేను ప్ర‌తీ ఒక్క‌రికి వేడుకుంటున్నాను. సామాన్య జ‌నం కూడా పోలీసుల‌కి స‌హ‌క‌రించి ఈ క‌రోనాని అంత మొందించ‌డంలో వాళ్ల‌కి చేదోవు..వాదోడుగా మ‌నమంద‌రూ స‌హ‌క‌రించాలి. పోలీసులు చేస్తున్న ఈ అమోఘ‌మైన ప్ర‌య‌త్నానికి..వారికి ఓ పోలీసు బిడ్డ‌గా చేతులెత్తి సెల్యూట్ చేస్తున్నాను. జైహింద్` అని చిరంజీవి ఓ వీడియా ద్వారా షేర్ చేసారు.

ఆ ట్విట‌ర్ వీడియో చూసిన తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఎమ్. మ‌హీంద‌ర్ రెడ్డి స్పందించారు. `మీరు మాకే కాదు. మా పోలీసు ఫోర్స్ మొత్తానికి స్ఫూర్తి. పోలీసు కుటుంబానికి చెందిన స‌భ్యుడిగా మీ నుంచి ప్రేర‌ణ పొందిన వారంతా చాలా విష‌యాలు అర్ధం చేసుకుంటున్నారు. కొవిడ్-19 మ‌హ‌మ్మారిని ఎదుర్కునే యుద్ధంలో మీ మాట‌లు అంద‌రికి ఎంతో స్ఫూర్తినిస్తున్నాయ‌ని` తెలిపారు.

లారెన్స్ గ్రేట్ నెస్ కి అందరూ ఫిదా..


తమిళ నటుడు ,దర్శకుడు , డాన్స్ మాస్టర్ అయిన రాఘవ లారెన్స్ మరోసారి తన జాలిగుండె తో ప్రజల మనసులు దోచు కొన్నాడు. కరోనా విలయానికి తన వంతు సాయంగా Rs 3 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించడం జరిగింది ఇందులో పి . ఎం .కేర్స్ ఫండ్ కి Rs 50 లక్షలు , తమిళనాడు ముఖ్య మంత్రి సహాయ నిధికి Rs 50 లక్షలు , ఫెప్సి యూనియన్ కి Rs 50 లక్షలు , డాన్సర్స్ యూనియన్ కి Rs 50 లక్షలు , తన దగ్గర ఉన్న దివ్యాంగులకు Rs 25 లక్షలు ఇస్తున్నా అని ప్రకటించడం జరిగింది. ఇవన్నీ ఒకెత్తు అయితే తాను పుట్టి పెరిగిన ఊరికి కూడా Rs 75 లక్షలు ఇచ్చి ఋణం తీర్చుకోనున్నట్టు తెలిసింది.

కరోనా విపత్తు నేపథ్యంలో దర్శకుడు రాఘవ లారెన్స్ ప్రకటించిన మూడు కోట్ల విరాళం తమిళ సినీ స్టార్స్ అందరినీ తల దించుకునేలా చేసింది. స్టార్స్.. సూపర్ స్టార్స్ అని పిలిపించు కొనేవారు కూడా కోటికి అటు ఇటుగానే సాయం చేశారు. కాని లారెన్స్ మాత్రం ఏకంగా మూడు కోట్ల విరాళంను ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు. ఒక సామాన్య డాన్సర్ స్థాయి నుండి డైరెక్టర్ స్థాయికి ఎదిగిన లారెన్స్ ఇచ్చిన విరాళం నిజంగా హర్షించదగ్గ విషయం. లారెన్స్ కేవలం ఈ విపత్తు సమయంలోనే కాదు మాములుగా కూడా వందలాది మంది అనాధలను, వికలాంగులను తన ఛారిటీ ద్వారా సాకుతున్నాడు. కోట్ల రూపాయలు సంపాదించే సూపర్ స్టార్స్ విరాళం ఇచ్చేందుకు కిందా మీదా పడుతున్నారు. అలాంటిది లారెన్స్ మూడు కోట్లు ఇవ్వడం నిజంగా గొప్ప విషయమే … అందులో ఎటువంటి సందేహం అక్కరలేదు.