
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకంలో నిబంధనలు మార్పు చేస్తూ ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్ కు తెలిపిన గవర్నర్ ఆమోదం తెలిపారు. దీంతో ఆర్డినెన్స్ పై ప్రభుత్వం జీవో జారీ చేసినట్లు సమాచారం.
ప్రభుత్వానికి సంక్రమించిన అధికారం తో ఎన్నికల కమిషనర్ గా రమేష్ కుమార్ ను తొలగిస్తూ జీవో జారీ. ఈ రెండు జీవోలను ప్రభుత్వం కాన్ఫిడెన్షియల్ గా ఉంచింది. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడం, ‘కరోనా’ సాయం పంపిణీలో అధికార పార్టీ ఎంపిటిసి అభ్యర్థులు పాల్గొనడంపై విచారణ కు ఆదేశించడం అధికార పక్షానికి నచ్చక పోవడంతో రమేష్ కుమార్ ను తొలగించాలని ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.
మరోవైపు ఈ అంశంపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పందిస్తూ…ఎస్ఈసీ రమేష్ కుమార్ పై వేటు నిర్ణయం చట్ట ప్రకారంగా చెల్లుబాటు కాదన్నారు. సీఎం జగన్ దుర్మార్గంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. కరోనా బారిన పడకుండా 5 కోట్ల ప్రజలను ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ కాపాడారని, జగన్ ప్రభుత్వం తీసుకొచ్చే ఆర్డినెన్స్ లు కోర్టులో నిలబడవన్నారు.
మాస్క్ లు ఇవ్వడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఉద్యోగులను సస్పెండ్ చేస్తున్నారని, ఉద్యోగులపై జగన్ ప్రభుత్వం ప్రతీకార చర్యలకు దిగుతోందని తెలిపారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులపై.. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్ట్‌లు పెడుతున్నారన్నారు.