
వైసిపిలో, ఏపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తర్వాత అంతా తానే అన్నట్లు వ్యవహరిస్తూ, ప్రభుత్వం, పార్టీ లపై పూర్తి ఆధిపత్యం వహిస్తూ వచ్చిన పార్టీ ప్రధాన కార్యదర్శి పార్లమెంటరీ నాయకుడు పెత్తనంకు ముఖ్యమంత్రి సతీమణి వై ఎస్ భారతి ఇప్పుడు చెక్ పెడుతున్నట్లు తెలుస్తున్నది. పాలన, పార్టీ వ్యవహారాలలో శృతిమించిన జోక్యం చేసుకోవద్దని వారిస్తున్నట్లు చెబుతున్నారు.
దానితో విజయసాయిరెడ్డి వైభవం తగ్గి విలవిలా లాడుతున్నట్లు పార్టీ వర్గాల కధనం. మొదటి నుండి విజయసాయి వ్యవహారంపై అసహనంగా ఉన్న భారతి ఇప్పుడు ఆయనను అదుపులో పెడుతున్నారు. ముఖ్యమంత్రి సహితం ఈ విషయంలో ఏమీ చేయలేక ఏ విషయంపై అయినా కలిస్తే భారతి తో మాట్లాడమని చెబుతూ ఉండడంతో విజయసాయి ఖంగు తింటున్నారు.
పైగా, ప్రభుత్వంలో అధికార పదవులలో నామినేషన్ విషయంలో సహితం విజయసాయిరెడ్డి మాటలు చెల్లుబాటు కావడం లేదని చెబుతున్నారు. హై కోర్ట్ మందలించినా గ్రామా పంచాయతి కార్యాలయాలుకు సహితం పార్టీ రంగులు వేస్తున్న సమయంలో ఈ మధ్య విశాఖలో కరోనా బాధితులకు విజయసాయి రెడ్డి అందిస్తున్న సహాయంకు సంబంధించిన కవర్లపై ముఖ్యమంత్రి బొమ్మ లేకుండా, ఆయన బొమ్మ మాత్రమే ఉండటం పార్టీ వర్గాలకు విస్మయం కలిగిస్తున్నది.
గతంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొత్తం ప్రభుత్వ వ్యవహారాలు అన్ని నడిపిస్తూ, వై ఎస్ కుటుంబాన్ని దూరంగా ఉంటూ వచ్చిన కెవిపి వలే ఇప్పుడు విజయసాయి రెడ్డి సహితం విశాఖలో జరుపుతున్న దందాలు అన్ని స్వయంగా చేసుకొంటూ ఉండడాన్ని గ్రహించిన భారతి ఆయన ప్రాబల్యాన్ని కట్టడి చేస్తూ వచ్చారని చెబుతున్నారు.
విశాఖలో కూర్చుని ఏపీని శాసిస్తూ, ఢిల్లీ పెద్దలని గుప్పిట్లో పెట్టుకుని తన భర్తను బొమ్మలాగ ఆడించడం మానుకోవాలని ఆమె నేరుగా హెచ్చరించారని సోషల్ మీడియాలో కధనాలు వెలువడుతున్నాయి. ప్రభుత్వ వ్యవహారాలలో విజయసాయిని పక్కకు నెట్టి, బంధువు, కడప జిల్లావాసి అయిన సజ్జల రామకృష్ణారెడ్డి ఈ మధ్య క్రియాశీలకంగా ఉండటం అంతా ఆమె వల్లనే అని చెబుతున్నారు.
కాగా, సాక్షిలో రెసిడెంట్ ఎడిటర్ గా భారతి తీసుకు వచ్చిన కడప జిల్లాకు చెందిన ధనుంజయ్‌రెడ్డిని మొన్నటి ఎన్నికల్లో బాగా అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై సాక్షి నుండి తొలగించేటట్లు విజయసాయి చేయగలిగారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి హవాను తొలగించడం కోసం భారతి వత్తిడితో ఏపీ ప్రభుత్వంలో సలహాదారుడిగా నియమించారు.
గ్రామా వలంటీర్లను ఏర్పాటు చేసి, వారందరి నుండి గ్రామాల వారి డాటా తెప్పించుకొని, మొత్తం ప్రభుత్వంపై అదుపు సాధించే ప్రయత్నం చేస్తున్న విజయసాయిని కట్టడి చేయడం కోసం ఇప్పుడు ఆ వ్యవస్థ పర్యవేక్షణ బాధ్యతను ధనుంజయ రెడ్డికి అప్పజెప్పారు.