Home Blog Page 8507

వైరల్ అవుతున్న రిషీ కపూర్ చివరి వీడియో


బాలీవుడ్ అగ్రనటుడు రిషీకపూర్ గురువారం మృతిచెందిన విషయం తెల్సిందే. లాక్డౌన్ కారణంగా సాయంత్రం 4గంటల ప్రాంతంలో ముంబైలోని చందన్వాడి శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. రణబీర్ కపూర్ తన తండ్రికి దహన సంస్కారాలు నిర్వహించగా కొంతమంది కుటుంబ సభ్యులు, పలువురు బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. రిషీకపూర్ కూతురు రిధిమా కపూర్ సహ్ని తండ్రి చివరి చూపుకు నోచుకోలేకపోయారు. రిషీకపూర్ కూతురు ఢిల్లీలో ఉండటంతో ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా ముంబై వెళ్లేందుకు పర్మిషన్ తీసుకుంది. అయితే రోడ్డుమార్గంలో ఆమె 1800కిలోమీటర్లు ప్రయాణించి ముంబై చేరుకోవాల్సి ఉంది. దీంతో ఆమె రేపు ముంబైకు చేరుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉండే రిషీకపూర్ చివరి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చిరంజీవి రాజకీయాలపై తమ్ముడి షాకింగ్ కామెంట్

https://www.instagram.com/p/B_mcx3eFNnz/

రిషీకపూర్ బుధవారం రాత్రి అనారోగ్యానికి గురవడంతో ముంబైలోని ఓ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు అతడికి చికిత్స చేసిన అనంతరం ఆస్పత్రి సిబ్బంది ఒకరు రిషీకపూర్‌ను ఆప్యాయంగా పలకరించి వీడియో తీశాడు. ఈసందర్భంగా అతడు రిషీకపూర్ నటించిన ఓ మూవీలోని ‘తేరే దర్ద్ సే దిల్ ఆబాద్ రహా’ పాటను పాడి విన్పించారు. ఈ పాట విన్నంత సేపూ రిషీకపూర్ మంచంపైనే పడుకుని నవ్వులు చిందించారు. ఆ వెంటనే ఆ యువకుడికి రిషీకపూర్ తన ఆశీస్సులు అందించారు.

పుష్ప చిత్రం లో యాక్షన్ సీన్స్ అదరహో

జీవితంలో కష్టపడి పైకి రావాలని సూచించారు. కష్టపడటమే మన వంతు అని.. పేరు ప్రఖ్యాతులు వాటంతటవే వస్తాయని రిషీకపూర్ అన్నారు. చివరి క్షణంలో ఆయన చెప్పిన మాటలకు అభిమానులు ఫిదా అవుతోన్నారు. ఆయన చివరి మజిలోనూ ఆయన నవ్వుతూనే వెళ్లిపోయారని అభిమానులు అంటున్నారు. అయితే ఈ వీడియో గురువారం ఉదయం రికార్డు చేసి ఉండొచ్చని కొందరు అంటుండగా మరికొందరు ఈ ఏడాది ప్రారంభంలో రిషీకపూర్ ఆస్పత్రికి వెళ్లినపుడు ఈ వీడియోను తీసి ఉండొచ్చని మరికొందరు అంటున్నారు. ఏదిఏమైనా రిషీకపూర్ చివరి మజిలి నవ్వులతోనే సెండాఫ్ ఇవ్వడంతో అభిమానులు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.

పోలీస్ పాత్రలో నందిత శ్వేతా


కన్నడ హుడిగి అయిన నందిత శ్వేతా తన మాతృ భాషలో కన్నా తమిళ ,తెలుగు చిత్రాల్లోనే ఎక్కువగా రాణించింది. తెలుగులో నిఖిల్ సిద్దార్ధ్ హీరోగా గా నటించిన `ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమా తో పరిచయమై ఘన విజయాన్ని అందుకొంది. అలా తొలి సినిమాలో గొప్పగా నటించిన ఆమెకు తరవాత నటించిన సినిమాలు గొప్పగా ఆడక పోవడం వలన కొంచెం వెనుక బడింది. తమిళం లో మాత్రం ఆమె నటించిన సినిమాలు బాగానే ఆడాయి. కాగా నేడు ” నందిత శ్వేతా పుట్టిన రోజు “. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఆమె తాజా చిత్రం ‘ఐపీసీ 376’ యొక్క సినిమా యూనిట్ శుభాకాంక్షలు తెలియ జేస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేసింది.

చిరంజీవి రాజకీయాలపై తమ్ముడి షాకింగ్ కామెంట్

కదా నాయిక ప్రాధాన్యత కలిగిన కథ ఇది. కాగా ‘ఐపీసీ 376’ సినిమాలో నందిత శ్వేతా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. నేరస్థుల ఆటకట్టించడానికి సిద్ధమైన పోలీస్ ఆఫీసర్ గా రివాల్వర్ పట్టుకుని ఆమె ఈ పోస్టర్లో దర్శనమిస్తోంది పవర్ కింగ్ స్టూడియో సమర్పణలో ఎస్ . ప్రభాకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి రామ్ కుమార్ సుబ్బ రామన్ రచన, దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ చిత్రం తెలుగు .. తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. .

చిరంజీవి రాజకీయాలపై తమ్ముడి షాకింగ్ కామెంట్


కరోనా ఎఫెక్ట్ తో సెలబ్రెటీలంతా ఇంటికే పరిమితమయ్యారు. సోషల్ మీడియా ద్వారా అభిమానులతో తమ అనుభవాలను షేర్ చేసుకుంటున్నారు. మెగా బ్రదర్ నాగబాబు యూట్యూబ్లో ‘అంతా నా ఇష్టం’ అనే ఛానల్ ద్వారా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. తాజాగా లాక్డౌన్ సమయంలో జనసేన సైనికులు, మెగా ఫ్యాన్స్ సందేహాలను తీర్చేందుకు ‘మన ప్రయాణం’ అనే కాన్సప్ట్ ను ఆయన ప్రారంభించారు. మెగా అభిమానులు, నెటిజన్లు వీడియో మేసేజ్ ద్వారా ప్రశ్నలు అడిగితే వాటికి నాగబాబు ఆ తర్వాత తన ఛానల్లో ఆ ప్రశ్న అడిగినవారిని చూపించి సమాధానం చెప్పనున్నారు. ఈ కార్యక్రమంలో ఓ నెటిజన్ చిరంజీవి జనసేనలోకి వస్తే చూడాలని ఉంది.. అలాంటి అవకాశం ఉందా? అని ప్రశ్నించారు. దీనిపై నాగబాబు తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

కరోనా మరణాలను మించిపోనున్న ఆకలి మరణాలు!

అన్నయ్య చిరంజీవిగారు ప్రజలకు సేవ చేయాలనే ‘ప్రజారాజ్యం’ పార్టీని స్థాపించారని తెలిపారు. అనేక కారణాలతో ఆపార్టీని కొనసాగించలేక కాంగ్రెస్‌లో విలీనం చేశారని తెలిపారు. ఆ తర్వాత టూరిజం మంత్రిగా చేసినా.. ఆయనకు ఎక్కడో ఇండస్ట్రీకి దూరం అయ్యానే అనే బాధ.. తాజా పొలిటికల్ సిస్టమ్ నచ్చకపోవడంతోనే తిరిగి కళారంగానికి వెళ్లారని చెప్పారు. ఒకసారి రాజకీయాలు వద్దని వెళ్లిపోయాక తిరిగి మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనే చేయరని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఆయన సినిమాల్లో మెగాస్టార్ గానే కొనసాగుతారని ఆయన అన్నారు.

జగన్ పై జేడీ ప్రశంసలు!

ఇక అన్నయ్య చిరంజీవి జనసేనలోకి వస్తారా? అని కొందరు పదేపదే అడుగుతున్నారని చెప్పారు. నిజానికి జనసేన మంచి ఐడియాలజీ ఉన్న పార్టీ. తమ్ముడు పవన్ కల్యాణ్ పెట్టిన స్థాపించిన పార్టీ. ఇందులో తాను కూడా యాక్టివ్‌గానే ఉన్నానని చెప్పారు. రాజకీయాలు వద్దనుకొని సినిమాల్లోకి వెళ్లిపోయాక చిరంజీవిగారు జనసేనలోకి వచ్చే అవకాశం లేదని చెప్పారు. మళ్లీ ఆయన రాజకీయాల్లోకి రారనేది తన నమ్మకం. అయితే భవిష్యత్ ఎలా ముందే ఊహించలేమని చెప్పారు. తనవరకైతే ఆయన రాడనే అనుకుంటున్నానని స్పష్టం చేశారు. ఒకవేళ చిరంజీవిగారు జనసేనలోకి రావాలనుకుంటే రావొచ్చని.. లేదంటే మరేవిధంగా సేవ చేయచ్చని నాగబాబు తెలిపారు. ప్రస్తుతం నాగబాబు వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

లాక్ డౌన్ పొడిగింపుపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!

దేశంలో లాక్ డౌన్ పొడిగింపుపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డికీలక వ్యాఖ్యలు చేశారు. కరోనాను అరికట్టాలన్న లక్ష్యంతో కేంద్రం పనిచేస్తోందని, దేశంలో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయని , కాబట్టి ఈ పరిస్థితుల్లో లాక్‌ డౌన్‌ పూర్తి స్థాయిలో ఎత్తివేయడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కచ్చితంగా దీనిని పొడిగిస్తాం. పొడిగించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజలు దీనికి మానసికంగా సిద్ధం కావాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి అన్నారు.

వైరస్‌ తీవ్రత ఉన్న ప్రాంతాల్లో, రెడ్‌ జోన్లలో మరింత కఠినంగా లాక్‌ డౌన్‌ అమలు చేయాలని పలువురు ముఖ్యమంత్రులు చెబుతున్నారని . కేంద్రం కూడా అదే దృక్పథంతో ఉందని కేంద్ర కిషన్ రెడ్డి చెప్పారు. రెడ్ జోన్లలో ఎలాంటి మినహాయింపులు ఉండవు. గ్రీన్‌ జోన్లలో ఇప్పటికే అనేక సడలింపులు ఇచ్చాం. ప్రజా రవాణా, మాల్స్, థియేటర్లు వంటివి తప్ప దాదాపు అన్నింటికి అనుమతి ఇచ్చాం..’అని ఆయన వివరించారు. గ్రీన్‌ జోన్లలో మరిన్ని వెసులుబాట్లు కల్పించే ప్రయత్నం చేస్తారు. విమానాలు, రైళ్లు, ఆర్టీసీ బస్సులు వంటి ప్రజారవాణా వసతి మాత్రం ఇప్పుడే ప్రారంభించే పరిస్థితి లేదని భావిస్తున్నానని ఆయన చెప్పారు.

వలస వచ్చినవారు చిక్కుకుపోయిన రాష్ట్ర ప్రభుత్వాలు మరియు వారి స్వదేశీ ప్రభుత్వాలు వారిని తిరిగి పంపించే ముందు చర్చలు జరపాలి మరియు బస్సులకు కూడా ఏర్పాట్లు చేయాలి “అని రెడ్డి అన్నారు.

“విద్యార్ధులు మరియు వలస కూలీలందరూ ఎక్కడ ఉన్నా అక్కడే ఉండాలని నేను అభ్యర్థిస్తున్నాను. వీధుల్లోకి వెళ్లవద్దు, వారిని తిరిగి తీసుకురావడానికి కేంద్రం ఇప్పటికే కృషి చేస్తోంది. కొంత ఓపిక కలిగి ఉండండి, ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుంది. మీరు ఇంతకాలం వేచి ఉన్నారు కాబట్టి మరికొన్ని రోజులు ఓపికపట్టండి. దయచేసి రాష్ట్ర ప్రభుత్వాలతో సహకరించండి “అని ఆయన అన్నారు.

కరోనా మరణాలను మించిపోనున్న ఆకలి మరణాలు!

కరోనా విజృంభన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను అమలుచేస్తున్నారు. అయితే ఈ లాక్‌ డౌన్‌ పొడిగిస్తే మరిన్ని కష్టాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 37 రోజులపాటు అమలు చేస్తున్నారని ఇంకా పొడిగిస్తే ఆకలితోనే ఎక్కువ మంది చనిపోయే ప్రమాదముందని ఇన్పోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఆందోళన వ్యక్తం చేశారు.

అనేక అభివృద్ధి చెందిన దేశాల కంటే భారతదేశంలో కరోనా మరణాల రేటు చాలా తక్కువగా ఉన్నప్పటికీ, లాక్‌ డౌన్‌ ఆంక్షలను ఎక్కువ కాలం కొనసాగించే అవకాశం లేదని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో సంక్రమణకు గురయ్యే వారిని జాగ్రత్తగా చూసుకుంటూ, సామర్థ్యం ఉన్నవారికి తిరిగి పనిని ప్రారంభించే వీలు కల్పించాలని నారాయణ అన్నారు. లేదంటే ఆకలి కారణంగా సంభవించే మరణాలు కరోనా వైరస్ మరణాలను మించిపోతాయన్నారు. చాలా సంస్థలు తమ ఆదాయంలో 15-20 శాతం కోల్పోయారన్నారు. అసంఘటిత రంగం, స్వయం ఉపాధి పొందుతున్న వారు సుమారు 20 కోట్లమంది ఉన్నారని, లాక్‌ డౌన్ పొడిగిస్తే వీరంతా మరింత సంక్షోభంలోకి కూరుకు పోతారని మూర్తి హెచ్చరించారు.

బ్యాంకు రుణాల రద్దుపై ఆత్మరక్షణలో మోదీ ప్రభుత్వం


ఆర్ టి ఐ దరఖాస్తుకు సమాధానంగా రిజర్వు బ్యాంకు వెల్లడించిన బ్యాంకులు రద్దు చేసిన మొదటి 50 మంది జాబితా వెలుగులోకి రావడంతో మోదీ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నది.

కేవలం సాంకేతికంగా బ్యాంకులు రద్దు చేశాయి గాని, వారి రుణాలు రద్దు చేసిన్నట్లు కాదని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన వివరణ విమర్శకులకు తగు సమాధానం చెప్పలేక పోతున్నది.

సహజంగానే ఈ పరిణామం కాంగ్రెస్ నేతలకు చక్కటి అవకాశం ఇచ్చిన్నట్లు అవుతున్నప్పటికీ, బిజెపి మద్దతు దారులను సహితం గందరగోళంలో పడవేస్తున్నది.

కేంద్రం తీరుపై ఫైర్ అవుతున్న మంత్రి తలసాని

ఇవ్వన్నీ యుపిఎ హయాంలో ఇచ్చిన రుణాలన్నీ, అప్పుడే ఎగవేసే వారికి ఇచ్చారని అంటూ సీతారామన్ చేస్తున్న వాదనలకు బలమైన ఆధారాలు లభించడం లేదు.

బ్యాంకు ఉద్యోగుల సంఘ నాయకుల వాదనల ప్రకారం 2014 నాటికి బ్యాంకుల మొండి బకాయిలు రూ 2.5 లక్షలు మాత్రమే కాగా, గత ఆరేళ్లలో మూడు, నాలుగు రేట్లు పెరిగింది.

పైగా గతంలో ఎన్నడూ లేని విధంగా కీలకమైన ఎగవేత దారులు విదేశాలకు పారిపోయారు. వారిని స్వదేశానికి రప్పించడం కోసం ప్రయత్నం చేస్తున్నామని ప్రభుత్వం చెడుబుతున్నా ఇప్పటి వరకు చెప్పుకోదగిన ఫలితం చూపలేక పోతున్నారు.

మత సామరస్యం సాధ్యమేనా?

బీజేపీ మద్దతుతో రాజ్యసభకు ఎన్నికైన సమయంలో విదేశాలకు పారిపోయే ముందు విజయ్ మాలవ్య ఇద్దరు కీలకమైన కేంద్ర మంత్రులను కలిసి వెళ్లడం గమనార్హం.

బ్యాంకురుణాలు ఎగవేసి విదేశాలకు పరారైన వారి రుణాలను సాంకేతిక కారణాలతో రద్దు చేయాలని ఎందుకు నిర్ణయించారని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత పి. చిదంబరం ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా నిలదీశారు.

ఈ సందర్భంగా, వాజ్‌పేయి, మన్మోహన్‌ సింగ్‌, మోదీ హయాంలో రుణాల ఎగవేతదారుల జాబితాను వేర్వేరుగా వెల్లడించాలని తాను పార్లమెంట్‌లో కోరితే ప్రభుత్వం జవాబివ్వలేదని చిదంబరం తెలిపారు.

రుణాలను సాంకేతిక కారణాలపై మాఫీ చేసే నిబంధనను నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీ, విజయ్‌ మాల్యాలకు ఎలా వర్తింపచేస్తారని ఆయన ప్రశ్నించారు.

వాహనదారులకు ఇక్కట్లు.. పోలీసులకు కష్టాలు!

లాక్‌ డౌన్‌ టైంలో అటు ప్రజలకు ఇటు పోలీసులకు ఇబ్బందులు తప్పడం లేదు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ట్రాఫిక్‌ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అదే సమయంలో లాక్ డౌన్ వేళ వాహనదారులను దూషించారని.. దాడిచేశారని.. డబ్బులు వసూలు చేశారనే వివిధ కారణాలతో పోలీసు సిబ్బందిపై చర్యలకు ఉపక్రమించారు.

హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో లాక్ డౌన్ రూల్స్ ని అతిక్రమించిన వహణదారులపై బుధవారం ఒక్కరోజే 14427 కేసులు నమోదు చేశారు పోలీసులు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన 1,475 ద్విచక్రవాహనాలు, 83 ఆటోలు, 234 కార్లను స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్రవాహనంపై ఇద్దరు, ముగ్గురు ప్రయాణం చేస్తున్న వారిని, డ్రైవింగ్‌ చేస్తున్న మైనర్లను, పత్రాలు లేని వాహనాలను, లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేశారు.

అదే సమయంలో లాక్ డౌన్ వేళ వాహనదారులను దూషించారని.. దాడిచేశారని.. డబ్బులు వసూలు చేశారని నలుగురు పోలీసు సిబ్బందిపై ఆరోపణలు రావడంతో హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లు అంజనీకుమార్, సజ్జనార్ వారిపై చర్యలకు ఉపక్రమించారు. లాఠీలకు పని చెప్పవద్దని.. సంయమనంతో విధులు నిర్వహించాలని ఉన్నతాధికారులు చెబుతున్నా.. కొందరు కిందిస్థాయి సిబ్బంది వినడం లేదు. ఇలాంటి ఘటనలే గోల్కొండ, మొఘల్ పురా, షాద్ నగర్, చార్మినార్, పాతబస్తీలో చోటుచేసుకున్నాయి.

పుష్ప చిత్రం లో యాక్షన్ సీన్స్ అదరహో


సుకుమార్ చిత్రాలు నవ్యతకు పెద్ద పీట వేస్తాయి అనడంలో సందేహం అక్కరలేదు. ఆర్య దగ్గరనుంచి రంగస్థలం వరకు అన్ని ఒకదానితో ఒకటి సంబంధం లేని కదాంశాలే…. కాగా ఇప్పుడు అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ ‘పుష్ప’ సినిమాను రూపొందించనున్నాడు. కరోనా లాక్ డౌన్ తరువాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

కేంద్రం తీరుపై ఫైర్ అవుతున్న మంత్రి తలసాని

చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో తరచుగా జరిగే .. అక్రమ కలప రవాణా ప్రధాన కథాంశంగా ఈ సినిమా నిర్మితం కానుంది. కాగా ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కి అధిక ప్రాధాన్యం ఉంటుందట …

మత సామరస్యం సాధ్యమేనా?

మరీ ముఖ్యంగా .. ఛేజింగ్ సీన్స్ ఒక రేంజ్ లో , అదరహో అనే స్థాయిలో వుంటాయని అంటున్నారు. ముఖ్యంగా బన్నీ లారీని ఫారెస్టు అధికారులు ఛేజ్ చేసే సీన్ ఇంతవరకు మీరు ఎపుడు కనీవినీ ఎరుగని స్థాయిలో ఉంటుందని చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే సినిమా హైలెట్స్ లో ఇదొకటి అవుతుందని చెబుతున్నారు . అసలు ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ ను హాలీవుడ్ ఫైట్ మాస్టర్ల పర్యవేక్షణలో తీయాలని అనుకొన్నారు కానీ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో, పీటర్ హెయిన్స్ ను గానీ .. కణల్ కణ్ణన్ ను గాని తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారట…. అల్లు అర్జున్ జోడీగా రష్మిక మందన్న నటించే ఈ చిత్రంలో బహు బాషల తారలు నటించనున్నారు .

స్వీయ నిర్బంధంలో నలుగురు కర్ణాటక మంత్రులు


దేశంలో మరెక్కడా లేని విధంగా నలుగురు కర్ణాటక మంత్రులు స్వీయనిర్బంధంలోకి వెళ్లారు. వారిలో ఒకరు ఉప ముఖ్యమంత్రి కూడా ఉన్నారు. ఒక వీడియో జర్నలిస్ట్ కు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఈ నెల 21 నుండి 24 వరకు అతనిని కలిసిన మంత్రులు అందరు ముందు జాగ్రత్తగా స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఆయా మంత్రులు ఈ విషయాన్నీ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

మత సామరస్యం సాధ్యమేనా?

ఆ విధంగా స్వీయ నిర్బంధంలోకి వెళ్ళాను వారిలో ఉప ముఖ్య‌మంత్రి అశ్వ‌త్ నారాయ‌ణ్‌, హోంమంత్రి బస్వరాజ్ బొమ్మాయి, వైద్య విద్య మంత్రి డాక్టర్ సుధాకర్, పర్యాటక శాఖ మంత్రి సిటి రవి ఉన్నారు. కోవిడ్ ప‌రీక్ష‌లో నెగిటివ్ అని తేలినప్పటికీ ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌లో భాగంగా తామంతా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

మంత్రులతో పాటు, ఆ వీడియో జ‌ర్న‌లిస్టు కుటుంబ స‌భ్యుల‌తో పాటు అత‌ను స‌న్నిహితంగా మెలిగిన ఇత‌ర మీడియా సంస్థ‌ల జ‌ర్న‌లిస్టులు స‌హా మొత్తం 40 మందిని స్వీయ నిర్బంధంలో ఉంచిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు.

తబ్లీగ్ చీఫ్ అరెస్ట్ పై ఢిల్లీ పోలీసుల వెనుకడుగు!

ఇటీవ‌ల త‌న‌ను క‌లిసిన ఓ జ‌ర్న‌లిస్టుకు కోవిడ్ పాజిటివ్ అని తేల‌డంతో త‌న‌ను తాను స్వీయ నిర్బంధంలో ఉంటున్నట్లు గుజ‌రాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

క‌ర్ణాట‌క‌లో ఇప్ప‌టివ‌ర‌కు 532 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదుకాగా, వారిలో 215 మంది కోలుకొని డిశ్చార్జ్ అయిన‌ట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఈ వైర‌స్ ధాటికి రాష్ట్రలో ఇప్ప‌టివ‌ర‌కు 20 మంది ప్రాణాలు కోల్పోయార‌ని వెల్ల‌డించింది.

కేంద్రం తీరుపై ఫైర్ అవుతున్న మంత్రి తలసాని


కరోనా ఎఫెక్ట్ తో కేంద్రం దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేస్తుండంతో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. వలస కూలీల దుస్థితిని అర్థం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి వారిగోడు విన్నవించడంతో సొంత ఊళ్లు వెళ్లేందుకు కేంద్రం అనుమతించింది. అయితే వలస కూలీలను తరలింపు బాధ్యత రాష్ట్రాలదేనని కేంద్రం చేతులు దులుపుకోవడంపై పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్ అయ్యారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం మంచిదే అయినప్పటికీ కార్మికుల తరలింపు బాధ్యతను కేవలం రాష్ట్రాలపై నెట్టడంం సమంజసంగా లేదని విమర్శించారు. విదేశాల్లో ఉన్న వారిని విమానాల్లో తీసుకుచ్చేందుకు మొగ్గుచూపుతున్న ప్రభుత్వం రాష్ట్రాల్లోని వలస కార్మికుల గురించి ఆలోచించకపోవడం శోచనీయమన్నారు. కేంద్రం వెంటనే వలస కార్మికుల కోసం ఉచితంగా ప్రత్యేక రైళ్లు నడపాలని ఆయన డిమాండ్ చేశారు.

మత సామరస్యం సాధ్యమేనా?

తెలంగాణలో బీహార్, ఝార్ఖండ్, ఛతీస్ గడ్ తదితర రాష్ట్రాలకు చెందిన సుమారు 15లక్షల మంది వలస కార్మికులు ఉన్నారని తెలిపారు. వీరందరినీ తమ సొంత రాష్ట్రాలకు బస్సుల్లో తరలించాలంటే మూడు నుంచి ఐదురోజుల సమయం పడుతుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలా చేయడం వల్ల మరికొన్ని సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. వలస కార్మికులు రైళ్లలో సొంత రాష్ట్రాలకు చేరుకున్నాక ఆయా రాష్ట్రాల్లో బస్సుల్లో తరలించేలా కేంద్రం చర్యలు తీసుకునేలా చర్యలు కోరారు. కేంద్రం కేవలం సడలింపులిచ్చి చేతులు దులుపుకోకుండా ఆయా రాష్ట్రాలకు వలస కూలీలను తరలించే ఏర్పాట్లు చేయాలని ఆయన కోరారు.

జగన్ పై జేడీ ప్రశంసలు!

ఏపీ సీఎం జగన్ పై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ ప్రశంసల వర్షం కురిపించారు. కరోనా మహమ్మారి కట్టడి విషయంలో వైఎస్ జగన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్ లో తీసుకుంటున్న చర్యలను జేడీ సమర్థించారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరిగినా మరణాల సంఖ్య తక్కువే అని ఆయన అన్నారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మిన్నగా లాక్ డౌన్ సమయంలో మరిన్ని టెస్టులను చేయడం మంచిదేనని, ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు కనిపించినా, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.

ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటానికి కారణం, అక్కడ జరిపించిన పరీక్షలేనని లక్ష్మీ నారాయణ అభిప్రాయపడ్డారు. కరోనా పరీక్షలను చేయడంలో ఏపీ ప్రభుత్వం మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మిన్నగా ఉందని కితాబిచ్చిన ఆయన, కరోనాపై జగన్ చేసిన వ్యాఖ్యలనూ సమర్థించారు. లాక్ డౌన్ తో ప్రభుత్వాలకు కొంత వెసులుబాటు కలిగిందని, ప్రజారోగ్యంపై దృష్టిని సారించే సమయం లభించిందని, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచనల ప్రకారం, ఎన్ని ఎక్కువ టెస్ట్ లు చేస్తే అంత మంచిదని లక్ష్మీ నారాయణ వ్యాఖ్యానించారు. టెస్టులు ఎక్కువగా జరిగిన ప్రాంతాల్లో కేసులు అధికంగా నమోదవుతున్నా, మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉందని గుర్తు చేశారు. కరోనా మృతుల్లో ఇతర సమస్యలున్న కారణంగా మరణించిన వారే అధికమని అన్నారు. సాధ్యమైనంత వరకూ వీలైనన్ని ఎక్కువ పరీక్షలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆయన సూచించారు.

మే 3 తరువాత పంజాబ్, ఒడిశాలు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నామని వెల్లడించాయని, తెలంగాణలో మరో 4 రోజులు లాక్ డౌన్ ఉంటుందని కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారని, ఈ లాక్ డౌన్ పీరియడ్ లో ఆరంజ్ జోన్లను గ్రీన్ జోన్లుగా మార్చేందుకు కృషి చేయాలని లక్ష్మీ నారాయణ సూచించారు. ఆపై రెడ్ జోన్లపై మరింత దృష్టి సారించి, మిగతా ప్రాంతాల్లో లాక్ డౌన్ ను దశలవారీగా ఎత్తివేయవచ్చని సూచించారు.

తబ్లీగ్ చీఫ్ అరెస్ట్ పై ఢిల్లీ పోలీసుల వెనుకడుగు!


దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ఉధృతం కావడానికి ప్రధాన కారకుడిగా భావిస్తున్న తబ్లీగ్ జమాత్ చీఫ్ మౌలానా సాద్‌ పట్ల ఢిల్లీ పోలీసులు మెతక వైఖరి అవలంభించడం పలువురికి విస్మయం కలిగిస్తున్నది. ఢిల్లీ పోలీసులు నేరుగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఆధీనంలో ఉండడంతో సాద్ అరెస్ట్ కు కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేస్తున్నదా అనే అనుమానం కలుగుతున్నది.

మత సామరస్యం సాధ్యమేనా?

అప్పటికే దేశం కరోనా వైరస్ పట్ల ఆందోళనకరంగా ఉన్న సమయంలో భారీ సంఖ్యలో విదేశాల నుండి కూడా పాల్గొన్న తబ్లీఘి జమాత్ సదస్సు ఢిల్లీలో జరుగుతున్నా పట్టించుకోని కేంద్ర హోమ్ శాఖ ఇప్పుడు అందుకు సంబంధించిన కేసు విషయంలో సహితం తప్పటడుగులు వేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తున్నది.

సాద్ కు ప్రభుత్వ యంత్రంగంతో పాటు ముస్లిం దేశాలలో ఉన్న పలుకుబడి కారణంగా కేంద్రం ఈ విషయంలో జంకుతున్నదా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

కేవలం విచారణకు హాజరు కమ్మనమని నోటీసులు ఇచ్చి ఉరుకొంటున్నారు. ఈ రోజు వరుసగా నాలుగోసారి అటువంటి నోటీసు జరీ చేశారు.

మౌలానా సాద్ ప్రభుత్వ లాబోరేటరీకి వచ్చి కరోనా పరీక్ష చేయించుకోవడంతోపాటు దర్యాప్తునకు హాజరు కావాలని కోరుతూ ఢిల్లీ పోలీసులు గతంలో మూడు నోటీసులు జారీ చేశారు. అయితే ఢిల్లీ పోలీసుల నోటీసులను అతను ఖాతరు చేయడం లేదు. కరోనా పరీక్ష చేయించుకునేందుకు ప్రభుత్వ లాబోరేటరీకి రాకపోగా, పోలీసుల దర్యాప్తునకు హాజరుకావడం లేదు.

కరోనా రహిత జిల్లాలను ప్రకటించిన ప్రభుత్వం

ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌లో తబ్లీగ్ జమాత్ సమావేశం నిర్వహించి దేశంలో కరోనా ప్రబలేందుకు కారణమయ్యారని మౌలానా సాద్ పై పోలీసులు కేసు నమోదు చేయడం తెలిసిందే. మరోవంక మౌలానా సాద్ ప్రైవేటు లాబోరేటరీలో కరోనా పరీక్ష చేయించుకోగా, అతనికి నెగిటివ్ వచ్చిందని అతని న్యాయవాది ఫుజైల్ అయూబీ ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులకు నివేదిక సమర్పించారు.

అంటువ్యాధుల చట్టం 1897 కింద మౌలానాపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతోపాటు తబ్లీగ్ జమాత్ కు విదేశాల నుంచి మనీలాండరింగ్ నిబంధనలు ఉల్లంఘించి హవాలా ద్వార విరాళాలు సేకరించారని ఆరోపిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సాద్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ప్రతీ కుటుంబానికి రూ.5వేల సాయమందించాలి: విపక్షాలు


రాష్ట్రంలో లాక్డౌన్ కారణంగా ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారని వారిని ప్రభుత్వం ఆదుకోవాలని అఖిలపక్షం నేతలు డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ తో అఖిలపక్షం నేతలు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ తదితరులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజాగా నెలకొన్న తాజాగా పరిస్థితులపై చర్చించి ప్రభుత్వానికి పలు సూచనలు, సలహాలిచ్చారు.

సారూ…లాక్ డౌన్ సొమ్ము లూటీ అయింది?

తెలంగాణలో ప్రభుత్వం కరోనా సాయం కింద పేదలకు అందిస్తున్న రూ.1,500లు సరిపోవని దానిని 5వేలకు పెంచాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. తరుగు పేరుతో రైతులను మార్కెటింగ్ అధికారులు మోసం చేస్తున్నారని ఈ విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కొనుగోలు చేసిన వెంటనే ధాన్యానికి రైతులకు డబ్బులు చెల్లించాలని ఆయన సీఎస్ ను కోరారు. టీటీడీపీ అధ్యక్షుడు రమణ మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల్లో, విదేశాల్లో ఉన్న తెలంగాణ వారిని రాష్ట్రానికి తీసుకు రావాలన్నారు. కరోనాపై ప్రభుత్వం పెట్టిన ఖర్చుకు లెక్కలు చూపించాలని ఆయన డిమాండ్ చేశారు. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ దరఖాస్తు చేసుకున్న వారందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతప్రతం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

తెలంగాణలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసు సంఖ్యపై విపక్ష నేతలు అనుమానం వ్యక్తం చేశారు. ఏపీలో ఇప్పటివరకు 80వేలకు పైగా కరోనా వైరస్ పరీక్షలు చేస్తే తెలంగాణలో మాత్రం 20వేలకు మించి పరీక్షలు చేయకుండా కరోనా తగ్గుతుందని ప్రచారం చేస్తున్నారి మండిపడ్డారు. కరోనా కేసుల్లో కేంద్రం చెప్పే లెక్కలకు రాష్ట్ర ప్రభుత్వం లెక్కలకు పొంతన కుదరడం లేదని ఆరోపించారు. కరోనాతో మృతి చెందినవారి కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా అందించి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.

సారూ…లాక్ డౌన్ సొమ్ము లూటీ అయింది?

Kcr

తెలంగాణలో కరోనా కట్టడి నేపథ్యంలో లాక్ డౌన్ వల్ల ఇండ్లకే పరిమితమైన ప్రజలకు ఆర్థిక సహాయం అందించడం కోసం ప్రతి కుటుంబానికి రూ.1500 అకౌంట్లో వేస్తున్నట్లు కేసీఆర్ సర్కార్ ప్రకటించింది. ఇదే విషయాన్ని మంత్రి కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. ఏప్రిల్ 16నే రూ.1500 బ్యాంకు అకౌంట్లో వేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆ డబ్బులొస్తే తిండి ఖర్చులకు సరిపోతాయని పేదలు భావించారు. అనుకున్నట్లుగానే రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మందికి ఆ డబ్బులు వచ్చాయి. కానీ ఇప్పటికీ పలువురికి డబ్బులు అందక పోవడం గమనార్హం. ఎన్ని రోజులు ఎదురుచూసినా బ్యాంకుల్లో జమకాలేదు. బ్యాంక్ అకౌంట్లో పడని వారికి పోస్టాఫీసుల్లో ఇస్తున్నారని తెలిసి.. చాలా మంది అక్కడికి వెళ్లారు. ఎండలో క్యూలో నిలబడి డబ్బుల కోసం ఎదురుచూశారు. కానీ అక్కడ కూడా అదే పరిస్థితి. మీకు బ్యాంకులోనే పడ్డాయి.. ఇక్కడ ఇవ్వరని తిప్పి పంపారు.

ఈ విధంగా డబ్బుల కోసం ప్రజలు పలు చోట్లకు తిరిగారు. కానీ వారికి నిరాశే మిగిలింది. అలాంటి వారిని ఉద్దేశించి ఇటీవల మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. 1500 డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకునేందుకు epos.telangana.gov.in వెబ్‌ సైట్‌ కి వెళ్లి స్టేటస్ చెక్ చేసుకోవాలని చెప్పారు. మంత్రి సూచించినట్లు చాలా మంది ఆ వెబ్‌ సైట్‌ కు వెళ్లి చెక్ చేసుకున్నారు. అక్కడ స్టేటస్ చూసి షాక్ తిన్నారు. ఏప్రిల్ 16నే రూ.1500 బ్యాంకు అకౌంట్లో జమ అయినట్లు స్టేటస్ చూపింది. కానీ బ్యాంకుల్లో మాత్రం ఇప్పటికీ జమ కాలేదు. ప్రభుత్వం వేశామని చెబుతోంది.. బ్యాంకు అకౌంట్లో మాత్రం పడలేదు. మరి ఆ డబ్బులు ఎక్కడికి వెళ్లినట్లు..? ఇదే డౌట్‌ తో మంత్రి హరీష్ రావును చాలా మంది ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. సార్.. ఇదీ సమస్య.. ఏం చేయాలో చెప్పాలని తమ గోడు వెళ్లబోసుకున్నారు.

ఇలాంటి సమస్యలుంటే 1967 టోల్ ఫ్రీ నెంబరు లేదా 040-23324614, 040-23324615 నెంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని మంత్రి సమాధానం ఇచ్చారు. మంత్రి హరీష్ రావు చెప్పడంతో తమ సమస్య తీరుతుందని చాలా మంది ఆ నెంబర్లకు ఫోన్ చేశారు. కానీ అందులో ఏ ఒక్కటి స్పందించడంలేదు. 1967 నెంబర్ అసలు మనుగడలోనే లేదట. మిగతా ఫోన్ నెంబర్లు ఎప్పుడు చేసినా బిజీ అని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పేదలు నిరుత్సాహానికి గురవుతున్నారు. మన అదృష్టం బాగాలేదు.. ఆ డబ్బులు ఇక రావులే.. అని బాధపడుతున్నారు. ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టి.. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అందరికీ చేరేలా చూడాలని మరికొందరు కోరుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించి కష్టకాలంలో తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

వాహన యజమానులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..!


రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ ప్రభావం కారణంగా నెల రోజులపాటు సరుకు రవాణా లేకపోవడంతో లారీలు నిలిచిపోయాయి. దీంతో లారీ యజమానులు తీవ్రంగా నష్టపోయారు ప్రస్తుతం వాహన పన్ను చెల్లించాల్సిన సమయంలో వారు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం వెహికల్ ట్యాక్స్ చెల్లింపుల గడువును జూన్ 30వ తేదీ వరకూ పొడిగించింది. వాస్తవానికి ఏప్రిల్ 30వ తేదీ నాటికి వెహికల్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంది. అయితే దీన్ని మూడు నెలలు పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కరోనా పోకడతో కాపుసారా పడగ!

లాక్‌డౌన్‌తో ప్రజలకు ఆదాయం లేని కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ మేరకు రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు ఈ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా వాస్తవానికి వెహికల్ పన్నును అడ్వాన్స్‌గా చెల్లిస్తారు. ప్రతీ త్రైమాసికానికి చెల్లింపులు ఉంటాయి. ఒకవేళ సక్రమంగా ట్యాక్స్ చెల్లించకపోతే 50 శాతం నుంచి 200 శాతం వరకూ జరిమానాలు ఉంటాయి. అయితే ప్రభుత్వం గడువును పొడిగిస్తూ కొంచెం ఊరటను కల్పించింది. కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ నెలకొనడంతో ఎక్కడికక్కడ సరుకు రవాణా లారీలు నిలిచిపోయాయి. దీంతో ట్యాక్ష్ చెల్లింపుల విషయంలో వెలుసుబాటును కల్పించాలని లారీ ఓనర్స్ అసోసియేషన్ కోరడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై లారీ యజమానుల సంఘము నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.