Home Blog Page 8499

రాష్ట్ర ప్రభుత్వం ఎలా తొలగిస్తుంది?


రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు రాజ్యాంగంలో రక్షణ కల్పించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆయనను ఎలా తొలగిస్తుంది అనేది స్పష్టం చేయాలని హైకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ను ఆదేశించింది. ఇందుకు ఆయన కొంత సమయం కోరడంతో కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది. అంతకుముందు అడ్వకేట్ జనరల్ తన వాదనలను వినిపిస్తూ ఎస్‌ఇసి యొక్క సేవలను  నియంత్రించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని తెలిపారు. ఆర్టికల్ 243(కె) లో అటువంటి పాలన నియమాలకు వ్యతిరేకంగా ఎలాంటి ఆంక్షలు రాజ్యాంగంలో పేర్కొనలేదని ఆయన అన్నారు. ఆర్టికల్ 243 కె (2) లో పేర్కొన్న విధంగా ఎస్‌ఇసి ని నియంత్రించడానికి ఎటువంటి నియమాలు రూపొందించబడనందున, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధం కాదని ఆయన వాదించారు. ఆయన వాదనలకు మద్దతుగా కొన్ని తీర్పులను ఉటంకించారు. ప్రిల్ సెక్రటరీ కేడర్ లో నియమింపబడిన కమిషనర్ లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ విధులకు సంబంధించి విమర్శలు అధిక సంఖ్యలో వచ్చాయని, ఇలాంటి విమర్శలకు ఎపి హైకోర్టు తీర్పులను సూచించిందని ఆయన అన్నారు. ఆర్డినెన్స్ ప్రకటించాల్సిన ఆవశ్యకత ఉందని, ఎన్నికల సంస్కరణలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు.

మృతుల కుటుంబాలకు భారీ ఎక్స్‌గ్రేషియా!

రాష్ట్ర ఎన్నికల కమిషన్ పై వస్తున్న బహిరంగ విమర్శలకు అడ్డుకట్ట వేయడానికి, న్యాయబద్ధంగా ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తిని ఎన్నికల కమిషనర్ గా నియమించాలని తీసుకున్న నిర్ణయం సరైనాదెన్నని ఎజి వాదించారు. ఇదే సమయంలో కమిషనర్ పదవీకాలం 5 సంవత్సరాల నుండి 3 సంవత్సరాలకు తగ్గించబడిందని తెలిపారు. పంచాయతీ రాజ్ చట్టం యొక్క సెక్షన్ 200 ప్రకారం ఇందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాన్ని గవర్నర్ అంగీకరించారని తెలిపారు. తన వాదనలకు మద్దతుగా సుప్రీంకోర్టు తీర్పులను కోట్ చేశారు.

పది పరీక్షలు, ఇంటర్ ఫలితాలపై క్లారిటీ!

 

తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు, ఇంటర్మీడియట్‌ పరీక్షా ఫలితాలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి క్లారిటీ ఇచ్చారు. జూన్‌ రెండో వారంలో ఇంటర్ పరీక్షల ఫలితాలు ప్రకటిస్తామని సబితా ఇంద్రారెడ్డి స్పష్టంచేశారు. జవాబు పత్రాల కోడింగ్‌ ఇవాళ మొదలైందని.. ఈ నెల 12 నుంచి తెలంగాణలో ఇంటర్మీడియట్‌ పరీక్షా వ్యాల్యూషన్ ప్రక్రియ చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. అలాగే వాయిదా పడిన ఇంటర్‌ మోడ్రన్‌ లాంగ్వెజెస్‌, జాగ్రఫీ పరీక్షలను ఈ నెల 18న నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

అదే విధంగా కరోనా వైరస్‌ ప్రభావం కారణంగా నిలిపివేసిన పదోతరగతి పరీక్షలను హైకోర్టు అనుమతిస్తే అన్ని జాగ్రత్తలో నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థులందరికీ మాస్కులు, శానిటైజర్లు ఇస్తామని చెప్పారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న దృష్ట్యా పదోతరగతి పరీక్ష కేంద్రాలను రెట్టింపు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో పాఠశాలలు ఎప్పటి నుంచి ప్రారంభించాలనే అంశంపై కసరత్తు చేసి లాక్ డౌన్ అనంతరం నిర్ణయిస్తామని మంత్రి పేర్కొన్నారు.

దేవరకొండ దెబ్బకు వెనక్కి తగ్గిన మీడియా దిగ్గజం


మామూలుగా ప్రధాన మీడియా సంస్థలైన పత్రికలు, టీవీ చానెళ్లను చూసి అందరూ భయపడుతారు. జర్నలిస్టులతో ఎందుకు పెట్టుకోవడం అని బెదిరిపోతారు. వాళ్లతో పెట్టుకుంటే మన గుట్టు మట్లు అన్ని బయటకు లాగుతారని.. ఎక్కడైనా దొరికితే చీల్చిచెండాడుతారని వెనక్కి తగ్గుతారు. కానీ అందరూ నడిచే దారిలో నడిస్తే ఏముంటుంది. సంచలన ఫైర్ బ్రాండ్ హీరో విజయ్ దేవరకొండ మీడియాతో సై అన్నాడు. తొడగొట్టాడు. తనపై తప్పుడు వార్తలు రాసిన ఓ తెలుగు టాప్ వెబ్ సైట్ ను ఢీకొట్టాడు. అసలే అగ్రెసివ్ గా ఉండే విజయ్ ఆధారాలతో సహా ఏకిపారేసే సరికి.. చాన్నాళ్లుగా మీడియా చేష్టలకు విసిగి వేసారిన టాలీవుడ్ కూడా అతడితో ఏకమైంది.. చిరంజీవి నుంచి మహేష్ సహా అగ్రహీరోలు.. కొరటాల నుంచి హరీష్ శంకర్ దాకా అగ్రదర్శకులు, నటులు సినీ ప్రముఖులు విజయ్ దేవరకొండకు అండగా నిలిచారు. దీంతో సినీ ఇండస్ట్రీ యుద్ధం ప్రకటించేసరికి సదురు వెబ్ సైట్ కు ఫేస్ గా ఉండే సీనియర్ జర్నలిస్ట్ బెదిరిపోయాడు. తనే అభాసుపాలయ్యానని కలత చెంది ఏకంగా రాజీనామా చేశాడు. ఇప్పుడు జర్నలిస్ట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

విశాఖలో భారీ ప్రమాదం…!

*విజయ్ దేవరకొండతో వెబ్ సైట్ కు అసలు ఏంటీ వివాదం.?
టాలీవుడ్ తెరపైకి దూసుకొచ్చిన విజయ్ దేవరకొండ తెరమీదే కాదు.. తెర బయట కూడా అంతే అగ్రెసివ్ గా ఉంటారని పేరుంది. కరోనా టైంలో ఉపాధి లేక తెలుగు రాష్ట్రాల్లో ఇబ్బందులు పడుతున్న మధ్య తరగతి కుటుంబాలకు సహాయం అందించేలా ‘ది దేవరకొండ ఫౌండేషన్ ’ స్థాపించి అందులో మధ్యతరగతి ప్రజలకు తన సంస్థ ద్వారా సహాయం అందిస్తున్నాడు. దీనిపై తాజాగా తెలుగు టాప్ వెబ్ సైట్ తప్పుడు కథనాలు రాసింది. తనను ఇంటర్వ్యూ అడిగారని.. ఇవ్వను అన్నందుకు కక్షగట్టి ఇలా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని విజయ్ ఆరోపించారు. తాజాగా విడుదల చేసిన వీడియోలో ఆ టాప్ వెబ్ సైట్ రాసిన కథనాలు చదివి మరీ వాటిని కడిగిపారేశారు. ఓ ముసాలాయన సీనియర్ జర్నలిస్టు ఉన్నాడని.. ఆయనకు కళ్లు కనిపించక రాశాడో తెలియదని దుమ్మెత్తిపోశాడు. విజయ్ వీడియో వైరల్ అయ్యింది. ఈ విషయంలో టాలీవుడ్ మొత్తం కదిలివచ్చి విజయ్ కు అండగా నిలబడింది.

వైజాగ్ ఘటనపై కేటీఆర్ దిగ్భ్రాంతి!

*విజయ్ కి అండగా సినీ ఇండస్ట్రీ
విజయ్ దేవరకొండ రేపిన కామెంట్స్ టాలీవుడ్ లో చర్చనీయాంశమయ్యాయి. ఆ వేడి మెల్లిగా అంటుకొని టాలీవుడ్ లో అంటుకుంది. ఒక్కరొక్కరుగా బయటకు వచ్చి విజయ్ కి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటికే మహేష్ సహా కొరటాల, హరీష్ శంకర్, చిరు, అనిల్ రావిపూడి, రవితేజ అల్లరి నరేష్ ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం విజయ్ కు తమ మద్దతు ప్రకటించారు. తాజాగా నాగబాబు అయితే జలగల్లా మమ్మల్ని పట్టుకొని రక్తం తాగుతున్నారని ధ్వజమెత్తారు.

*ఆ టాప్ జర్నలిస్టు రాజీనామా..
తెలుగులోనే టాప్ వెబ్ సైట్ కు ఇప్పుడు ఆ సీనియర్ జర్నలిస్టు వీఎస్ఎన్ మూర్తి అన్నీ తానై నిలుస్తున్నారు. ఆ సైట్ ముఖంగా ఆయన పేరే వినిపిస్తోంది. ఎవరిని ఇంటర్వ్యూ చేయాలన్నా.. ప్రత్యేకమైన వ్యాసాలు రాయాలన్నా ఆయనే చేస్తారు. ఓ రకంగా ఆ సైట్ కు కర్త కర్మ క్రియ ఆయనే లాగా బయటకు కనపడుతారు. ఆ సైట్ లో ఎంతో మంది జర్నలిస్టున్నా.. బయటకు ఫోకస్ అయ్యింది మాత్రం వీఎస్ఎన్ మూర్తినే. విజయ్ దేవరకొండ కూడా ఈయనే నానా మాటలు అనడంతో మూర్తి నొచ్చుకున్నాడు. ఇన్నేళ్ల జర్నలిజంలో తాను ఇంతలా అభాసుపాలు కాలేదని.. సినీ ఇండస్ట్రీ మొత్తం అనడంతో కలత చెందానని.. ఈ 70 ఏళ్ల వయసులో తనకు ఇంత అవమానాలు అవసరమా అని సదురు టాప్ వెబ్ సైట్ కు రాజీనామా ప్రకటించాడు. ఈ సందర్భంగా సినిమా జర్నలిస్టుల వాట్సాప్ గ్రూపులో ఆయన రాసిన లేఖ ఆయన ఆవేదనకు అద్దం పట్టింది..

మృతుల కుటుంబాలకు భారీ ఎక్స్‌గ్రేషియా!

*వెబ్ సైట్ అండగా ఉన్నా అవమానంతో వైదొలిగాడు..
నిజానికి మూర్తి లాంటి సీనియర్ జర్నలిస్టు ఆ వెబ్ సైట్ కు బలం.. బలగం.. ఎంతో మంది రాజకీయ నేతలు, సినీ ప్రముఖులను బట్టలూడదీసినట్టు చెడమడా రాతలు రాసి డేరింగ్ వెబ్సైట్ గా పేరున్న ఆ సైట్ కు విజయ్ ఆరోపణల వేడి గట్టిగానే తగిలింది.విజయ్ ఆరోపణల తర్వాత రాసిన కథనం డిలీట్ చేసింది. అయితే సినీ ఇండస్ట్రీపై, విజయ్ పై ఘాటుగా కథనాలు రాసి కౌంటర్ ఇచ్చింది. కానీ సీనియర్ జర్నలిస్టు మూర్తి మాత్రం ఆ వెబ్ సైట్ ముఖంగా అందరికీ విలన్ అయ్యారు. అభాసుపాలయ్యారు. సదురు వెబ్ సైట్ యాజమాన్యం మూర్తికి మద్దతు తెలిపి కొనసాగాలని కోరినా.. విజయ్ చేసిన ఆరోపణలు.. వచ్చిన అపఖ్యాతిని ఆయన తట్టుకోలేదు. చివరకు రాజీనామా చేస్తూ వైదొలిగారు.

*మీడియాలో ఇదో అరుదు
తమపై విమర్శలు చేసిన సెలెబ్రెటీలు, రాజకీయ నేతలను ముప్పుతిప్పలు పెట్టే మీడియాలు ఇలా వెనక్కి తగ్గడం చాలా అరుదనే చెప్పాలి. చాలా మీడియాలు, పత్రికలు పంతం పట్టి మరీ వారిని టార్గెట్ చేసి హింసింస్తాయి. తెలంగాణ సీఎం కేసీఆరే ఏం చేయలేక మీడియాను ఆడిపోసుకుంటున్నారు. అలాంటిది విజయ్ దేవరకొండ దెబ్బకు ఒక దమ్మున్న టాప్ వెబ్ సైట్ వెనక్కితగ్గడం.. సీనియర్ జర్నలిస్ట్ మూర్తి వైదొలగడం నిజంగా సంచలనమనే చెప్పాలి. మీడియా చరిత్రలోనే ఇలా వెనకడుగు వేయడం అరుదుగా కనిపిస్తుంటుంది.

-నరేశ్ ఎన్నం

విశాఖ గ్యాస్ లీకేజీపై స్పందించిన విజయశాంతి


విశాఖ గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై సినీనటి, తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్ పర్సన్ విజయశాంతి స్పందించారు. ఓవైపు కరోనా ఎఫెక్ట్ తో ప్రపంచం భయాందోళన చెందుతున్న తరుణంలో విశాఖలో గ్యాస్ లీకేజీ విషాద సంఘటన చోటుచేసుకోవడం బాధకరమని అన్నారు. విశాఖలోని కొన్ని గ్రామాలు విషవాయువుల బారినపడిన పడటం తనను ఎంతో బాధించిందన్నారు. వృద్ధులు, చిన్నారులు, మహిళలు, మూగజీవాలు గ్యాస్ దుర్ఘటన బారినపడ్డారని తెలిపారు. ఈ ఘటనలో మరణాలు చోటుచేసుకోవడం కలిచివేసిందని పేర్కొన్నారు.

మృతుల కుటుంబాలకు భారీ ఎక్స్‌గ్రేషియా!

బాధిత కుటుంబాలకు ఆమె ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కరోనాపై పోరాడుతున్న విశాఖవాసులు ఈ గ్యాస్ లీకేజీ ఘటనను కూడా గుండె ధైర్యంతో ఎదుర్కొని త్వరగా కోలుకోవాలని విజయశాంతి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. విశాఖలోని ఐదు గ్రామాలు విషవాయువు బారిన పడటం ఆందోళన కలిగిస్తుందన్నారు. ఏపీ ప్రభుత్వం బాధితులకు అన్నిరకాల సహాయ సహకరాలు అందించాలని కోరారు. గ్యాస్ లీకేజీ ఘటనలోని దృశ్యాలు తనను ఎంతో కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులంతా త్వరగా కోలుకోవాలని వేడుకుంటున్నట్లు తెలిపారు. విశాఖవాసులు త్వరగా కోలుకుంటారనే ఆకాంక్షను ఆమె తన ఫేస్ బుక్ లో పోస్టు చేశారు.

జనసైనికులరా.. సాయం చేయండి:పవన్

విశాఖలో గ్యాస్‌ లీక్‌ ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ దుర్ఘటన విని తాను ధోగ్భ్రాంతికి గురైనట్లు పవన్ వెల్లడించారు. ఎల్జీ కంపెనీ నుండి విడుదలైన స్టైరీన్‌ విష వాయువు పీల్చడం వల్ల అనేకమంది అపస్మారక స్థితిలో ఎక్కడబడితే అక్కడ పడిపోవడం బాధకలిగించిందని పవన్ తెలిపారు. ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటనపై విశాఖపట్నం జనసేన నాయకులతో టెలి కాన్ఫరెన్స్‌ లో మాట్లాడిన పవన్, పలు కీలక సూచనలు చేశారు. ప్రజలు భయాందోళనకు గురి కాకుండా ధైర్యం చెప్పాలని పార్టీ శ్రేణులకు సూచించారు. మంటపాలు, సమావేశ మందిరాల్లో భోజన వసతి కల్పించాలని, వైద్య సదుపాయాలకు సహాయపడాలని కోరారు. కాలుష్య నియంత్రణ మండలి, పర్యవేక్షణ విభాగాలు  ప్రభావవంతంగా పని చేయకపోవడం వల్లే ఇలాంటి దురదృష్టకర ఘటనలు జరుగుతున్నాయని పవన్‌ అభిప్రాయపడ్డారు.

ఈ దుర్ఘటనలో మృతిచెందిన వారి సంఖ్య 11కి చేరినట్టు ఎన్డీఆర్‌ఎఫ్‌ డీజీ  ఎస్‌ఎన్‌ ప్రధాన్‌  వెల్లడించారు. ఢిల్లీలో పలువురు కీలక అధికారులు ఈ ఘటనపై మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్‌ఎన్‌ ప్రధాన్‌ మాట్లాడుతూ.. ‘‘విశాఖలో ప్రస్తుత పరిస్థితి అదుపులోనే ఉంది. గ్యాస్‌ లీకేజీ నియంత్రించడంపై దృష్టిపెట్టాం. ఈ గ్యాస్‌ ప్రభావానికి గురైన 200 మందికి పైగా వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. వీరిలో 25 నుంచి 30 మంది ప్రజల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. అలాగే, 80మందికి పైగా వెంటిలేటర్లపైనే ఉన్నారు. 500 మందికి పైగా ప్రజల్ని ఖాళీ చేయించాం’’ అని వివరించారు.

గంటల వ్యవధిలో మరో విషవాయువు ప్రమాదం..!


విశాఖ లోని ఎల్.జి ప్రరిశ్రమలో చోటు చేసుకున్న విధంగానే లాక్ డౌన్ అనంతరం పరిశ్రమలో పనులు ప్రారంభిస్తుండగా ప్రమాదకర వాయువులు వెలువడిన సంఘటన చత్తీస్ గడ్ రాష్ట్రంలోని ఒక పేపర్ కర్మాగారం నుంచి ప్రమాదకరమైన వాయువు వెలువడింది.

విశాఖలో భారీ ప్రమాదం…!

రాష్ట్రంలో ఉన్న రాయ్ గర్ జిల్లాలోని తెట్ల గ్రామంలో శక్తి పేపర్ మిల్లును లాక్ డౌన్ మినహాయింపు కారణంగా గురువారం పునఃప్రారంభించారు. ప్లాంట్ క్లినింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదకర వాయువు విడుదల కావడంతో ఏడుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారని జిల్లా ఎస్పీ దీపాన్షు కబ్రా వెల్లడించారు. కార్మికులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న ముగ్గురిని రాయ్ గర్ ఆసుపత్రికి తరలించారు.

జగన్ నో కాంప్రమైజ్.. విజయసాయిరెడ్డి ఔట్

వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కేవీపీ ఎలానో.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డి కూడా అలానే.. వీరి మధ్య విడదీయరాని బంధం ఉంటుంది. కానీ ఆపద వేళ.. ప్రొటోకాల్ వేళ మాత్రం తాను రూల్స్ మాత్రమే పాటిస్తానని.. ఈ విషయంలో ప్రాణ మిత్రుడు విజయసాయిరెడ్డి కూడా అందుకు అతీతుడు కాదని ఏపీ సీఎం జగన్ నిరూపించారు. తాజాగా బయటపడ్డ ఒక వీడియో వైరల్ అయ్యింది. జగన్ ఎంత నిక్కచ్చగా ఉంటాడో తేటతెల్లమైంది..

మృతుల కుటుంబాలకు భారీ ఎక్స్‌గ్రేషియా!

*జైలు జీవితం నుంచి అధికారం వరకూ కలిసే..
జగన్ ఆర్థిక సామ్రాజాన్ని నిలిపిన వ్యక్తిగా విజయసాయిరెడ్డికి పేరుంది. ఓ ఆర్థిక నిపుణుడు అయిన విజయసాయిరెడ్డి మొదట జగన్ సాక్షి మీడియా సంస్థలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన వ్యాపార వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించారు. వాటిపై నమోదైన కేసుల్లో జగన్ పాటు జైలుకు వెళ్లాడు. నమ్మిన బంటుగా విజయసాయిరెడ్డి జగన్ వెంట ఆది నుంచి నడిచాడు.

*అధికారంలోకి వచ్చాక జగన్ స్టిక్ట్
అయితే ఎంత దగ్గరి మనిషి అయినా కూడా అధికారంలోకి వచ్చాక జగన్ మాత్రం స్టిక్ట్ గానే ఉంటున్నారు. అధికారంలో ఎవరిని తలదూర్చనివ్వడం లేదన్న ప్రచారం ఉంది. ప్రతిపక్షంలో కీలకంగా వ్యవహరించిన ఎమ్మెల్యే రోజాను సైతం పక్కనపెట్టారు. ఆమెకు మంత్రి పదవి ఇవ్వకపోవడం పెద్ద దుమారమే రేపింది. ఇక విజయసాయిరెడ్డిని సైతం ఢిల్లీ రాజకీయాలకు పరిమితం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న కూడా జగన్ నిర్ణయమే ఇక్కడ కీలకంగా ఉంది. ప్రజాపాలన, సంక్షేమం, బడుగు బలహీన వర్గాలకు న్యాయం విషయంలో జగన్ నిక్కచ్చగా వెళుతున్నారు. అందుకే ఆయనపై ఎవరి ప్రభావం లేదంటారు.

కొంపలు మునిగిపోతున్నా.. రాజధానిపై రాజకీయాలు!

*విజయసాయిరెడ్డిని పక్కనపెట్టిన జగన్
తాజాగా విశాఖలో గ్యాస్ లీక్ అయ్యింది. సీఎం జగన్ దీనిపై వేగంగా స్పందించారు. హుటాహుటిన తాడేపల్లి నుంచి బయలుదేరారు. ఆయనతోపాటు విజయసాయిరెడ్డి, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని కూడా వెంట కారువద్దకు వచ్చారు. అయితే విజయసాయిరెడ్డి జగన్ వెనుకాల సీట్లో ఆల్ రెడీ కూర్చున్నారు. నేను ఇక్కడే ఉంటాను మీరు వెళ్లండి అని ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని అన్నారు. విమానంలో ఇద్దరు మాత్రమే ప్రయాణించే వీలుండడంతో జగన్ ఇక్కడ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రొటోకాల్ ప్రకారం.. ఏదైనా విశాఖలో ప్రకటన చేయాలన్నా.. ఇన్ ఫర్ మేషన్ పొందాలన్న ఆరోగ్య మంత్రి అవసరం. అందుకే విజయసాయిరెడ్డిని కారు దించి మరీ ఆళ్ల నానిని వెంటబెట్టుకొని విశాఖకు విమానంలో వెళ్లిపోయారు.

*ఎంత సన్నిహితుడైనా ప్రొటోకాల్ తప్పని జగన్
ఏపీ సీఎం జగన్ తర్వాత నంబర్ 2 విజయసాయిరెడ్డినే. పార్టీలో, ప్రభుత్వంలో ఆయనే కీలకంగా ఉన్నారు. అలాంటి విజయసాయిరెడ్డిని ప్రొటో కాల్ ప్రకారం కారు దించి ఆళ్ల నానిని ఎక్కించుకొని తాను పాలన, అధికారం విషయంలో చాలా స్టిక్ట్ అని జగన్ నిరూపించారు. తన పాలనలో భవ బంధాలు.. పక్షపాతానికి తావులేదని జగన్ నిరూపించారు. ఇప్పుడు జగన్ చేసిన ఈ పనికి ప్రశంసలు కురుస్తున్నాయి..

గ్యాస్ లీకేజీలో కొత్త పాయింట్ లేవనెత్తిన సీఎం జగన్


విశాఖలో జరిగిన ఎల్జీ గ్యాస్ లీకేజీ ఘటనపై సీఎం జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లీకేజీ ఘటన తర్వాత సీఎం విశాఖ బయలుదేరి వెళ్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గ్యాస్ లీకేజీ ఘటనలో ఆయన కొత్త పాయింట్ లేవనెత్తారు. ఎల్జీ పాలిమార్స్ కంపెనీలో గ్యాస్ లీకేజీ అయినపుడు అలారం ఎందుకు మోగలేదని అనుమానాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యక్తం చేశారు.

మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన సీఎం జగన్

మల్టి నేషనల్ కంపెనీ అయిన ఎల్జీలో గ్యాస్ లీకయినపుడు అలారం ఎందుకు మోగలేదనే ప్రశ్న తన మనసును కలవర పరుస్తుందని ఆయన అన్నారు. ఈ ఘటనపై లోతుగా అధ్యాయనం చేసేందుకు కమిటీ వేసినట్లు తెలిపారు. ఈ నివేదిక వచ్చిన తర్వాత కంపెనీ చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. ఎల్జీ కంపెనీ నుంచి బాధితులకు నష్టపరిహారం రాబట్టడంతోపాటు బాధిత కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఆ కంపెనీలో ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేస్తామని ఆయన అన్నారు.

యాజమాన్యం నిర్లక్ష్యంతోనే గ్యాస్ లీక్: బీజేపీ

ఈ సందర్భంగా బాధితుల కుటుంబాలను ప్రభుత్వం అన్నివిధలా ఆదుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ దుర్ఘటనలో మృతిచెందిన ఒక్కో కుటుంబానికి కోటి రూపాయాల పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. బాధితులకు చికిత్స కోసం అయ్యే ప్రతీ ఖర్చు ప్రభుత్వమే భరిస్తాయని ఆయన స్పష్టం చేశారు. అయితే గ్యాస్ లీకేజీలో అలారం ఎందుకు మోగలేదని ప్రశ్నకు ఎల్జీ కంపెనీ ఎలాంటి సమాధానం ఇవ్వనుందో వేచి చూడాల్సిందే..!

కొంపలు మునిగిపోతున్నా.. రాజధానిపై రాజకీయాలు!

“ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే.. చుట్ట కాల్చుకోవడానికి ఇంకొకడు వచ్చాడట” ప్రస్తుతం వైసీపీ, టీడీపీ నేతల పరిస్థితి ఇలానే ఉంది. గ్యాస్ లీక్ అయ్యి విశాఖ వాసులు విషాదంలో ఉంటే.. వైసీపీ, టీడీపీ మధ్య రాజధాని పై రాజకీయ దుమారం రేగడం బాధాకరం.

“వైజాగ్ రాజధాని కావాలని కోరిన వైసీపీ నేతలకి బాగా జరిగిందంటూ కొందరు ట్విట్టర్‌ లో పోస్టులు పెట్టారు. టీడీపీ నేతలే పెట్టినట్టుగా హ్యాష్ ట్యాగ్స్ కూడా క్రియేట్ అయ్యాయి. అవి మేము పెట్టలేదు వైసీపీ వాళ్ళే కావాలని దుష్ప్రచార నిమిత్తం పెట్టారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని ఊటంకిస్తూ.. టీడీపీ నేత నారా లోకేష్ కూడా వైసీపీ నేతలపై మండిపడుతూ పలు పోస్టులు పెట్టడం గమనార్హం. సేవ్ అమరావతి, మై క్యాపిటల్ అమరావతి పేరుతో హ్యాష్ ట్యాగ్స్ ఉన్న ఫేక్ ఫొటోలను లోకేష్ ట్వీట్ చేశారు.

గ్యాస్‌ లీకై విశాఖ వాసులు విషాదంలో వుంటే వైకాపా విష‌ప్ర‌చారానికి తెర‌లేపిందని నారా లోకేష్ పలు ట్వీట్లు చేయడం ఆశ్ఛర్యం. “పేటీఎం పుత్రులు క‌నీస మాన‌వ‌తాదృక్ప‌థం లేకుండా ప్రాంతీయ విద్వేషాలు రేపేలా ఫేక్ ట్వీట్లు వేసి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేస్తున్నారు. “డ‌బ్బులిస్తామంటే క‌న్న‌త‌ల్లిని కూడా చంపేసే టైపు పేటీఎం బ్యాచులే ఇటువంటి విద్వేషాలు పెంచే విష‌ప్ర‌చారానికి దిగుతాయి. 5 రూపాయ‌ల కోసం రాష్ట్రాన్ని, ప్ర‌జ‌ల్ని తాక‌ట్టు పెట్టేందుకైనా వెనుకాడ‌ని పేటీఎం బ్యాచుల ఫేక్ ప్ర‌చారానికి విజ్ఞ‌త‌తో బ‌దులిద్దాం..’ అని నారా లోకేష్ పలు ట్వీట్లు చేయడం ఆయన రాజధాని రాజకీయ క్రీడకు పరాకాష్ట!

‘ఎల్.జి’ ఘటనపై ప్రభుత్వాలకు నోటీసులు…!


విశాఖపట్నంలో చోటుచేసుకున్న దుర్ఘటనపై రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది. 10 మృతికి, కొన్ని వందల మంది అస్వస్థతకు కారణమైన ఈ సంఘటనను సుమోటోగా విచారణకు స్వీకరిస్తున్నట్లు పేర్కొంది. ఈ సంఘటన ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్నందున సుమోటోగా స్వీకరించడానికి కారణమని వెల్లడించింది. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ దుర్ఘటనను సుమోటోగా స్వీకరించలేదని స్పష్టం చేసింది. జనావాసాల మధ్య ఇంత ప్రమాదకరమైన రసాయన కర్మాగారం ఎందుకు ఉందని ప్రశ్నించింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిని ఈ సంఘటనకు సంబంధించి అమికస్ క్యూరీగా నియమించింది.

మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన సీఎం జగన్

మరోవైపు వైజాగ్‌ స్టైరిన్ గ్యాస్‌ లీక్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హచ్‌ఆర్సీ) స్పందించింది. ఈ ఘటనపై స్పందించాలంటూ కేంద్ర, ఏపీ ప్రభుత్వాలకు ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు జారీ చేసింది. కాగా ఎల్.జి పాలిమర్స్‌లో గ్యాస్ లీకైన ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరింది. అస్వస్థతకు గురైన వేలాది మంది పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గ్యాస్ ని అదుపులోకి తెచ్చినప్పటికీ.. అప్పటికే వాయువును పీల్చిన చాలా మంది ఎక్కడికక్కడే స్పృహ కోల్పోయి పడిపోతున్నారు. మూగజీవులు సైతం మృత్యువాతపడ్డాయి.

షూటింగ్ ఆరెంజ్ మెంట్స్ లో వకీల్ సాబ్

pawan


కొద్దిరోజుల క్రితం సినిమా షూటింగ్స్ కి పర్మిషన్ ఇవ్వాలంటూ నిర్మాతలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని కలవడం జరిగింది. దానికి ఆయన ముఖ్యమంత్రితో మాట్లాడి చెబుతానడం జరిగింది. ఆ క్రమంలో ముఖ్యమంత్రి ఇంకా షూటింగ్స్ గురించి క్లారిటీ ఇవ్వలేదు. జూన్ నుంచి లాక్ డౌన్ తీసి వేస్తారని , అపుడు షూటింగ్స్ కి పర్మిషన్ దొరుకుతుందని నిర్మాతలు ఆశ గా ఎదురు చూస్తున్నారు ఒకవేళ షూటింగ్స్ కి పర్మిషన్ ఇచ్చినాగాని తక్కువ మంది యూనిట్ సభ్యులతో జరుపుకోవాల్సి ఉంటుంది.

యాజమాన్యం నిర్లక్ష్యంతోనే గ్యాస్ లీక్: బీజేపీ

అందుకే షూటింగ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేదానిపై నిర్మాతలు, దర్శకులు తీవ్రంగా చర్చిస్తున్నారు .. ఆ క్రమంలో “వకీల్ సాబ్ ” చిత్రానికి సంబంధించి కోర్ట్ రూమ్ సన్నివేశాల చిత్రీకరణ ఇంకా పెండింగ్ ఉంది. కోర్ట్ సీన్ అంటే జూనియర్ ఆర్టిస్టులు బాగానే కావాలి. దాన్ని నివారించాలి అంటే కేవలం క్లోజప్ షాట్స్ లేదా ఒకరిద్దరు నటీనటులు మాత్రమే అవసరం అయ్యే సజెషన్ షాట్స్ లాంటివి ప్లాన్ చేసుకొని సినిమా ఫినిష్ చేయాలని చూస్తున్నారట. అలా అయితేనే ఆగష్టు లోగా సినిమా పూర్తి చేయ గలుగుతామని వకీల్ సాబ్ చిత్ర యూనిట్ భావిస్తోంది .

ముందుకు వెళ్లలేక పోతున్న ‘గీత’


2016 లో కన్నడ చిత్రం `కిరాక్ పార్టీ ` తో సినీ పయనం స్టార్ట్ చేసిన రష్మిక మందన్న కెరీర్ లో విజయాల శాతం ఎక్కువే …2018 లో తెలుగు నాట అడుగు పెట్టి ఇక్కడ కూడా వూహించ విజయాలు అందుకొంది/ మొదటి చిత్రం `చలో` తరవాత ” గీత గోవిందం ” చిత్రం తో బ్లాక్ బస్టర్ విజయాన్నిఅందుకొంది తరువాత `దేవదాస్ . డియర్ కామ్రేడ్ ` చిత్రాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఇక 2020 లో వచ్చిన ” సరిలేరు నీకెవ్వరు ” , ” భీష్మ” చిత్రాలు సూపర్ సక్సెస్ సాధించాయి .

విశాఖలో భారీ ప్రమాదం…!

అలా వరుస హిట్ లతో రష్మిక మందన్న దూసుకు పోతుంటే నిర్మాతలు మునుపటి కంటే ఎక్కువ పారితోషికం ఆఫర్ చేస్తున్నారు .. అయితే కరోనా సంక్షోభం వల్ల చిత్ర పరిశ్రమ పరిస్థితి బాగా దెబ్బ తినడంతో మళ్ళీ అందరి పారితోషికాలు తగ్గే సూచనలు కనపడుతున్నాయి. ..ముఖ్యంగా హీరో , హీరోయిన్ల పారితోషికాలలో భారీ కోతలు పడనున్నాయి . ఆ ప్రాసెస్ లో హీరోలు కూడా ఇప్పటికే తమ సమ్మతం తెలిపినట్టు తెలుస్తోంది . రష్మిక మందన్న కూడా అగ్ర హీరోయిన్ కనుక ఆమె కూడా పారితోషికం తగ్గించుకోక తప్పదు. వెరసి రష్మిక మందన్న పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు అయ్యింది .హిట్ చిత్రా లున్నప్పటికీ పారితోషకం పెంచడానికి వీలు లేకుండా పోతోంది .

బాధిత కుటుంబ సభ్యులకు రాష్ట్రపతి సానుభూతి!

విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు రాష్ట్రపతి సానుభూతి ప్రకటించారు. అందరి క్షేమం కోరుతూ, బాధితులు త్వరగా కోలుకోవాలని పేర్కొంటూ భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు రామ్‌నాథ్‌ కోవింద్‌ తెలిపారు.

మరోవైపు వైజాగ్ లో విష వాయువు ప్రభావం కారణంగా గొంతు, చర్మ సంబంధ సమస్యలతో స్థానికులు బాధపడ్డారు. దీంతో పోలీసులు, అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలకు ఉపక్రమించారు. 1000 నుంచి 1500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 800 మందికిపైగా ఆస్పత్రికి తరలించారని ఎన్‌డీఆర్‌ఎఫ్‌ డీజీ ఎస్‌ఎన్‌ ప్రధాన్‌ తెలిపారు.

యాజమాన్యం నిర్లక్ష్యంతోనే గ్యాస్ లీక్: బీజేపీ


యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి కారణం చేతనే విశాఖలో గ్యాస్ లీకేజి జరిగిందని బీజేపీ నేత, మాజీ ఎమ్యెల్యే విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. ఈ సంఘటన చాలా దురదృష్టకరమని, ఈ ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

విశాఖలో భారీ ప్రమాదం…!

ఈ సందర్భంగా తమ తప్పిదాన్ని కప్పి పుచ్చుకునేందుకు యాజమాన్యం చేస్తున్న వాదనలను రాజు కొట్టిపారేసారు. యాజమాన్యం వైపు నుంచి కొంతమంది మాట్లాడుతూ.. కెమికల్ స్టోర్ చేశామని, 45 రోజులు దాటిందని, రియాక్షన్స్ ఉంటాయని, కంపెనీ తెరవటానికి పర్మిషన్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని చెప్పడం విస్మయం వ్యక్తం చేశారు.

యాజమాన్యం చేస్తున్న వాదన వాస్తవమా? కాదా? అన్నదానిపై విచారణ చేయాలని విష్ణుకుమార్ రాజు కోరారు. 45 రోజుల తర్వాత కెమికల్ రియాక్ట్ అయి గ్యాస్ రూపంలో బయటకు వచ్చే పరిస్థితి ఉందని ఇంజనీర్లు చెప్పినప్పుడు ప్రభుత్వం వెంటనే కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళాలి గదా అని విస్మయం వ్యక్తం చేశారు.

వైజాగ్ ఘటనపై కేటీఆర్ దిగ్భ్రాంతి!

కనీసం మీడియా దృష్టికైనా ఈ అంశాన్ని తీసుకువెళ్లి ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని చెప్పాలి గదా అని విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు. ఈ ఘటనపై ప్రభుత్వం పూర్తి విచారణ జరిపి ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు.

మరోవంక, డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. విశాఖపట్నం గ్యాస్ లీక్ ప్రాంతంలో సందర్శించడానికి అనుమతి ఇప్పించాలని కోరారు. బీజేపీ తరపున ఆ స్థలాన్ని సందర్శించి బాధితులను కలవాలనుకుంటున్నానని కన్నా వెల్లడించారు. కాబట్టి విశాఖపట్టణం, గుంటూరుకు తన ప్రయాణానికి అనుమతి ఇవ్వమని డీజీపీ సవాంగ్‌ను కన్నా లేఖలో కోరారు.

ప్రమాదానికి కారణమదేనా…?


విశాఖ దుర్ఘటనకు నిర్లక్షమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. లాక్ డౌన్ కారణంగా ఈ ఏడాది మార్చి 25 నుంచి పరిశ్రమను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇది రసాయన పరిశ్రమ కావడంతో నిరంతర పర్యవేక్షణ అవసరం ఉంది. లాక్ డౌన్ సమయంలో అన్ని అనుమతులు మంజూరు చేసిన సక్రమ నిర్వహణ లేనికారణంగా ప్రమాదం చోటు చేసుకుంది.

విశాఖలో భారీ ప్రమాదం…!

లాక్‌డౌన్‌ ఉన్నకారణంగా మెయింటెనెన్స్‌ కోసం ప్రభుత్వం పాస్‌లు కూడా ఇచ్చింది. 45 మందికి మెయింటెనెన్స్‌ పాస్‌లు ఇచ్చినప్పటికీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. గురువారం రాత్రి పరిశ్రమను పునఃప్రారంభించడానికి యాజమాన్యం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రమాదం చోటుచేసుకుంది.

వైజాగ్ ఘటనపై కేటీఆర్ దిగ్భ్రాంతి!

పరిశ్రమ ట్యాంకుల్లో దాదాపు 2 వేల మెట్రిక్‌ టన్నుల స్టైరెన్‌ను నిల్వ చేసింది. అక్కడ 20 డిగ్రీల లోపు ఉష్ణోగ్రత ఉంచడంలో ఫ్యాక్టరీ యాజమాన్యం విఫలమైంది. ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో స్టైరెన్‌ లీక్‌ అయి మంటలు చెలరేగాయి. దీంతో ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాలకు స్టైరెన్‌ గ్యాస్‌ వేగంగా వ్యాప్తి చెందింది. రెండ సారి స్టైరెన్‌ గ్యాస్ వెలువడటంతో చుట్టుపక్కల ప్రాంతాల వారిని తరలించే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమయ్యింది. పరిస్థితి చక్కబడే వరకూ ఎవరు ఈ ప్రాంతానికి తిరిగి రావద్దని పరిశ్రమ నిర్వాహకులు ప్రకటించారు.

మృతుల కుటుంబాలకు భారీ ఎక్స్‌గ్రేషియా!

విశాఖపట్నం గ్యాస్‌ లీకేజీ వల్ల అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను ఏపీ సీఎం జగన్ పరామర్శించారు. ఈ ఘటనలో మృతిచెందిన ఒక్కో కుటుంబానికి రూ. కోటి ఎక్స్‌గ్రేషియాగా ఇవ్వనున్నట్లు సీఎం జగన్‌ ప్రకటించారు. ఆస్పత్రుల్లో వెంటిలేటర్‌ మీద ఉన్నవాళ్లకు రూ. 10 లక్షలు, చికిత్స పొందుతున్న వారికి రూ. లక్ష, ప్రాథమిక చికిత్స పొందిన వారికి రూ. 25 వేలు నష్టపరిహారంగా అందించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఒక్కో జంతువుకు రూ. 25 వేలు నష్టపరిహారం ఇవ్వనున్నట్లు చెప్పారు. బాధిత గ్రామాల్లోని 15 వేల మందికి ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున అందిస్తామన్నారు. బాధిత కుటుంబాలకు  ఎల్‌జీ కంపెనీలో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. మంత్రి కన్నబాబు సహా మరికొందరు మంత్రులు ఇక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించనున్నట్లు తెలిపారు.

ఘటన జరిగాక వెంటనే స్పందించిన అధికారులకు సీఎం జగన్‌ అభినందనలు తెలిపారు. ఉదయం 4.30 గంటలకే కలెక్టర్‌, డీసీపీ చేరుకుని ప్రమాద స్థలంలో సహాయ చర్యలు చేపట్టారన్నారు. 340 మందికి పైగా స్థానికులను ఆస్పత్రులకు తరలించారని.. వందల సంఖ్యలో స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సీఎం పేర్కొన్నారు. లీకైన గ్యాస్‌ ప్రభావం కొన్ని రోజులపాటు ఉంటుందన్నారు. వెంకటాపురం, ఎస్సీ, బీసీ కాలనీ, నందమూరి నగర్‌, పద్మనాభపురంలో ఈ ప్రభావం కనిపిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో అవసరమైతే కంపెనీని అక్కడి నుంచి తరలిస్తామని పేర్కొన్నారు.

విశాఖ గ్యాస్ లీకేజీపై విచారం వ్యక్తం చేసిన టాలీవుడ్


విశాఖలో గ్యాస్ లీకేజీ ఘటన దేశవ్యాప్తంగా ఆందోళనను రేకెత్తించింది. ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి వెలువడిన ప్రమాదకర స్టైరీస్ గ్యాస్ దుర్ఘటనతో ఇప్పటికే తొమ్మిది మంది ప్రాణాలను కొల్పోయారు. వేలాది మంది అనారోగ్యంపాలై ఆసుప్రతుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనపై టాలీవుడ్ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ఘటనలో బాధితులైన వారంతా తిరిగి త్వరగా కోలువాలనే ఆకాంక్షను సెలబ్రెటీలు వ్యక్తం చేశారు.

విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, జనసేన అధినేత పవన్ కల్యాణ్, దర్శకుడు రాజమౌళి, మెగాపవర్ స్టార్ రాంచరణ్ తదితరులు స్పందించారు. ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరమన్నారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నత్వరగా కోలువాలంటూ ట్వీట్ చేశారు. ఈ ఘటనలో తమ బంధువులను కోల్పోయినవారికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

వైజాగ్ గ్యాస్ లీకేజీ ఘటన దృశ్యాలు కలిచి వేస్తున్నాయని మెగా పవర్ స్టార్ రాంచరణ్ అన్నారు. బాధితులంతా త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థించినట్లు ట్వీట్ చేశారు. వీరితోపాటు హీరో రవితేజ, రామ్ పోతినేని, సాయి ధరమ్ తేజ్, నాని, అఖిల్ అక్కినేని, కొరటాల శివ, అల్లు శిరీష్, సునీల్, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్, ఈషా రెబ్బా, నిధి అగర్వాల్, ప్రణీత, శ్రీముఖి తదితరులు ఈ దుర్ఘటనపై ట్వీటర్లో విచారం వ్యక్తం చేశారు.