
విశాఖ గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై సినీనటి, తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్ పర్సన్ విజయశాంతి స్పందించారు. ఓవైపు కరోనా ఎఫెక్ట్ తో ప్రపంచం భయాందోళన చెందుతున్న తరుణంలో విశాఖలో గ్యాస్ లీకేజీ విషాద సంఘటన చోటుచేసుకోవడం బాధకరమని అన్నారు. విశాఖలోని కొన్ని గ్రామాలు విషవాయువుల బారినపడిన పడటం తనను ఎంతో బాధించిందన్నారు. వృద్ధులు, చిన్నారులు, మహిళలు, మూగజీవాలు గ్యాస్ దుర్ఘటన బారినపడ్డారని తెలిపారు. ఈ ఘటనలో మరణాలు చోటుచేసుకోవడం కలిచివేసిందని పేర్కొన్నారు.
మృతుల కుటుంబాలకు భారీ ఎక్స్‌గ్రేషియా!
బాధిత కుటుంబాలకు ఆమె ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కరోనాపై పోరాడుతున్న విశాఖవాసులు ఈ గ్యాస్ లీకేజీ ఘటనను కూడా గుండె ధైర్యంతో ఎదుర్కొని త్వరగా కోలుకోవాలని విజయశాంతి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. విశాఖలోని ఐదు గ్రామాలు విషవాయువు బారిన పడటం ఆందోళన కలిగిస్తుందన్నారు. ఏపీ ప్రభుత్వం బాధితులకు అన్నిరకాల సహాయ సహకరాలు అందించాలని కోరారు. గ్యాస్ లీకేజీ ఘటనలోని దృశ్యాలు తనను ఎంతో కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులంతా త్వరగా కోలుకోవాలని వేడుకుంటున్నట్లు తెలిపారు. విశాఖవాసులు త్వరగా కోలుకుంటారనే ఆకాంక్షను ఆమె తన ఫేస్ బుక్ లో పోస్టు చేశారు.