Home Blog Page 8491

రవితేజకు షాకిచ్చిన మిల్కీ బ్యూటీ..!


మాస్ మాహారాజ్ రవితేజకు గత కొన్నాళ్లుగా చెప్పుకోదగ్గ హిట్లు రావడం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ రికార్డులు తిరిగిరాసిన రవితేజ ప్రస్తుతం ఒక్క హిట్టు కోసం నానాతంటాలు పడుతున్నాడు. ఇటీవల రవితేజ నటించిన ‘నేల టిక్కెట్టు’, ‘డిస్కోరాజా’, ‘అమర్ అక్బర్ అంటోని’ మూవీలు ప్లాప్ టాక్ మూటగట్టుకున్నాయి. అయిప్పటికీ దర్శకులు మాత్రం రవితేజతో సినిమాలు చేసేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. రవితేజ వరుస సినిమాలు చేస్తూ హిట్టు కోసం తనవంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఒక్క హిట్టుకొడితే టాలీవుడ్లో రవితేజ మార్కెట్లో పుంజుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

తాజాగా రవితేజ గోపి మాలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ అనే మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో రవితేజకు జోడీగా శృతిహాసన్ నటిస్తుంది. శృతిహాసన్-రవితేజ కాంబోలో గతంలో ‘బలుపు’ మూవీ రిలీజై మంచి విజయం సాధించింది. వీరిద్దరి జోడీకి ప్రేక్షకుల్లో మంచి స్పందన ఉండటంతో ఈ మూవీపై రవితేజ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఇటీవల ‘క్రాక్’ మూవీ నుంచి రిలీజైన పోస్టర్, టీజర్ మంచి స్పందన లభించింది. ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయింది. థియేటర్లు తిరిగి ప్రారంభంకాగానే ఈ మూవీని రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ఇప్పటికే సన్నహాలు చేస్తుంది.

‘క్రాక్’ తర్వాత రవితేజ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో నటించనున్నాడు. ఈ మూవీలో రవితేజ సరసన తమన్నాను తీసుకోవాలని దర్శక, నిర్మాతలు భావించారట. ఈమేరకు ఆమెను సంప్రదించగా భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందని దానికి నిర్మాతలు ఒప్పుకోలేదని ప్రచారం జరుగుతోంది. రవితేజ పక్కన నటించేందుకు తమన్నా ఏకంగా రూ.3కోట్లు డిమాండ్ చేసిందట. అయితే దర్శక, నిర్మాతలు 2.5కోట్లు ఇస్తామని చెప్పినా మిల్కీబ్యూటీ ఒప్పుకోలేదని ఫిల్మీవర్గాల్లో టాక్ విన్పిస్తోంది. ప్లాపులతో ఉన్న రవితేజతో నటించడం ఇష్టంలేకే తమన్నా రెమ్యూనరేషన్ పేరుతో రిజక్ట్ చేసిందనే వార్తలు విన్పిస్తున్నాయి. గతంలో రవితేజతో నటించిన ‘బెంగాల్ టైగర్’ మూవీ కూడా అంతగా సక్సస్ కాలేదు. ప్రస్తుతం తమన్నా గోపిచంద్ హీరోగా నటిస్తున్న ‘సిటీమార్’ మూవీలో కబడ్డీ కోచ్ గా నటిస్తోంది.

రైతు భరోసా అమలును తప్పు బట్టిన బీజేపీ..!

 

కేంద్రంలో మోడీ సర్కార్ ఇస్తున్న రూ.6 వేలు కలిపి అంతా తామే ఇస్తున్నట్టు వైసీపీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుందని బీజేపీ అంటుంది. ప్రచార ప్రకటనల్లో ప్రధాని బొమ్మను కూడా తీసేయటం రాష్ట్ర ప్రజలను మోసం చేయటమే. పీఎం కిసాన్ – రైతు భరోసా పథకంలో కేంద్రం వాటా 45% పైగా ఉన్నదని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోట సాయి కృష్ణ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నేడు విడుదల చేసిన పీఎం కిసాన్ – వైఎస్సార్ రైతు భరోసా ప్రకటనలో ప్రధాని బొమ్మనే లేకుండా చేసి మొత్తం రూ.13,500 తానే భరిస్తున్నట్టు బాక్స్ కట్టి మరీ ప్రచారం చేసుకుంటున్న వైనం సరైనది కాదన్నారు.

పాదయాత్రలో జగన్ రైతులకు ఇచ్చిన వాగ్దానం సంవత్సరానికి రూ. 12,500/- ఒకే సారి రైతుల ఖాతాలో జమ చేస్తానని ఇప్పుడు కేంద్రం ఇచ్చే సాయాన్ని కలిపి రైతులకు రూ.13,500 ఇవ్వడం రైతులను మోసం చేయడమైనని పేర్కొన్నారు. జగన్ అధికారంలోకి రాక ముందు నుంచే కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతులకు పంట పెట్టుబడి సాయం క్రింద సంవత్సరానికి రూ. 6000 మూడు విడతలుగా ఇవ్వటం జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో రైతులు కేంద్రం ఇస్తున్న ఆరు వేల రూపాయలకు అదనంగా జగన్ హామీ ఇచ్చిన రూ.12,500/- వస్తాయని నమ్మి అధికారం కట్టబెట్టారని చెప్పారు. ఇటువంటి అసత్య ప్రచారాలను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నదని, తక్షణం ఈ అసత్య ప్రకటనను వెనక్కు తీసుకొని, ప్రధాని నరేంద్ర మోడీ బొమ్మతో కూడిన ప్రకటన విడుదల చేయాలని బీజేపీ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టిడిపి అధికారంలో ఉండగా టీడీపీ, బీజేపీ పొత్తు ఉన్న సమయంలో ఆ పార్టీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

1,061 మంది పోలీసులకు కరోనా పాజిటివ్!

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. మహారాష్ట్రలో కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. రోజు వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. సాధారణ ప్రజలే కాదు.. డాక్టర్లు, పోలీసులు కూడా కరోనా బారినపడుతున్నారు. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 1,061 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 112 మంది అధికారి స్థాయి పోలీసులు ఉన్నారు. ఇప్పటికే 9 మంది పోలీసులు చనిపోగా… 174 మంది కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మిగిలిన వారు పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 27,524కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 6059 మంది కోలుకోగా.. 1019 మంది మరణించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 20,441 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలోనే నమోదైన విషయం తెలిసిందే.

పవన్ సరసన కేరళ కుట్టీ?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాక వరుస సినిమాలతో బీజీగా మారారు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’ ను తెలుగులో ‘వకీల్ సాబ్’గా తెరకెక్కిస్తున్నారు. పవన్ కల్యాణ్ తొలిసారి లాయర్ పాత్రలో నటిస్తున్నాడు. దీంతో ఈ మూవీపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీలో లావణ్య త్రిపాఠి, నివేథా థామస్, అంజలి, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘వకీల్ సాబ్’ మూవీ షూటింగ్ చివరిదశకు చేరుకోగా లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. షూటింగ్లు ప్రారంభం కాగానే ఈ మూవీని త్వరగా కాంప్లీట్ చేసి విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. అదేవిధంగా క్రిష్ దర్శకత్వంలో ఓ పీరియాడికల్ మూవీలో పవన్ నటిస్తున్నాడు. మొగల్ సామ్రాజ్య కథాంశంతో ఈ సినిమా ఉండనుంది. ఇందులో పవన్ రాబీన్ హుడ్ తరహా పాత్రలో కన్పిస్తాడనే ప్రచారం జరుగుతోంది.

ఇదిలా ఉంటే పవర్ స్టార్ తో దర్శకుడు హరీష్ శంకర్ ఓ మూవీని తెరకెక్కించనున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లలో గతంలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ టాలీవుడ్ రికార్డులను తిరగరాసింది. పవన్ రీ ఎంట్రీ తర్వాత గబ్బర్ సింగ్ కాంబో సెట్టవడంతో అభిమానులు ఈ మూవీ కోసం ఎంతో అత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో పవన్ సరసన కొత్త భామను తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. పవన్ కు జోడీగా కేరళ బ్యూటీ మానస రాధాకృష్ణన్ అయితే బాగుంటుందని చిత్రబృందం భావిస్తుందట. ఈమేరకు చిత్రబృందం ఆమెకు ఆఫర్లు ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్లో టాక్ విన్పిస్తోంది. అయితే దర్శకుడు హరీష్ శంకర్ దీనిపై స్పందిస్తూ హీరోయిన్ విషయంలో ఇంకా ఎవరూ అనుకోలేదని త్వరలోనే నటీనటులు, టెక్నిషియన్ల వివరాలను ప్రకటించనున్నట్లు చెప్పారు. పవన్-మాసన రాధాకృష్ణన్ జోడీ చూడముచ్చటగా ఉండటంతో ఆమె పేరే ఖరారయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ మూవీ ప్రారంభిస్తే గానీ పవన్ సరసన నటించే లక్కీ భామ ఎవరో క్లారిటీ రానుంది. అంతవరకు వేచిచూడాల్సిందే..!

రైతులందరికీ భరోసా కల్పిస్తా..!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మంగా ప్రవేశపెట్టిన ‘వైఎస్సార్‌ రైతు భరోసా– పీఎం కిసాన్‌’ పథకం ప్రారంభమైంది. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్‌ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ప్రతి రైతు కుటుంబానికి తొలి విడతగా రూ.7,500 ఖాతాలో జమ కానున్నాయి. పథకం ప్రారంభం సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పథకానికి శ్రీకారం చుట్టడం బాధగా ఉందన్నారు. కరోనా పరిస్థితుల కారణంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతు భరోసాను ప్రారంభిస్తున్నాం అని చెప్పారు. రాష్ట్రంలోని 49 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరేలా ఈ పథకాన్ని రూపొందించామని తెలిపారు. సాధారణ పరిస్థితులు ఉంటే రైతులతో కలిసి భారీ సభలో ఈ కార్యక్రమం నిర్వహించేవాళ్లమని సీఎం అన్నారు. రైతులు, రైతు కూలీలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు ఎంత చేసినా తక్కువే అని అభిప్రాయపడ్డారు. వ్యవసాయానికి పెట్టుబడి కోసం రైతులు ఇబ్బంది పడకూడదని, పెట్టుబడి సాయం అందించేందుకే రైతు భరోసా కింద రూ.13500 ఏటా అందిస్తున్నాని స్పష్టం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో రూ. 12500 చొప్పున నాలుగేళ్లు ఇస్తామని చెప్పినా.. రూ.13,500 చొప్పున ఐదేళ్లపాటు ఇస్తామని ప్రకటించారు.

గతేడాది రూ.6350 కోట్లు రైతు భరోసా కింద చెల్లించామని, రైతు భరోసా కింద రూ.5500 నగదు రైతుల అకౌంట్‌లో జమ అవుతాయన్నారు. కౌలు రైతులు, అటవీ భూములు, అసైన్డ్ భూములు సాగు చేస్తున్నవారికి రూ.7500 అందజేస్తామన్నారు. అక్టోబర్‌లో రూ. 4 వేలు, వచ్చే సంక్రాంతికి మరో రూ.2 వేలు అందజేస్తామన్నారు. గ్రామ సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితా ఉంచుతున్నట్లు చెప్పారు. ఎవరైనా పేరు లేకపోతే నమోదు చేయించుకునే అవకాశం కల్పించామన్నారు. రైతులకు మేలు చేయాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యమని, నగదు బదిలీ కాకుంటే 1902 కాల్‌ సెంటర్‌కు రైతులు ఫోన్ చేయొచ్చు అని తెలిపారు. రాష్ట్రంలో 10,641 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, మే 30న రైతు భరోసా కేంద్రాలను ప్రారంభిస్తామని చెప్పారు.

మరో రెండు నెలల్లో భార‌త్‌కు ర‌ఫేల్ యుద్ధ విమానాలు

తీవ్రమైన రాజకీయ దుమారం రేపిన రఫెల్ యుద్ధ విమానాలు చిట్టచివరకు భారత్ భూభాగంపై అడుగుపెట్టనున్నాయి. మరో రెండు నెలలో భార‌త వైమానిక దళంలో చేరనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మొదటగా, జూలై చివ‌రిలోగా నాలుగు ర‌ఫేల్ విమానాలు ఫ్రాన్స్ నుంచి భార‌త్‌కు రానున్న‌ట్లు తెలుస్తున్న‌ది.

పది సంవత్సరాలకు పైగా ఈ విమానాల కోసం మన వైమానిక దళం ఎదురు చూస్తున్నది. గత ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకోవడంలో తీవ్రజాప్యం చేయడం, ప్రస్తుత ప్రభుత్వం అడుగు ముందుకు వేస్తే ప్రతిపక్షాలు పెద్ద రాజకీయ దుమారం లేవదీయడం తెలిసిందే. అన్ని అవాంతరాలను అధిగమించి 36 ర‌ఫేల్ యుద్ధ విమానాల కోసం ఫ్రాన్స్‌తో రూ 60 వేల కోట్ల డీల్‌ను భార‌త్ కుదుర్చుకున్న విష‌యం తెలిసిందే. .

వాస్త‌వానికి మే చివ‌రిలోగా యుద్ధ‌విమానాలు రావలసి ఉన్నప్పటికీ కరోనా వైరస్ కారణంగా జాప్యం జరుగుతున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం అంబాలా ఎయిర్ బేస్ కు రానున్న విమానాలలో మూడు రెండు సీట్ల విమానాలు, ఒక‌టి సింగిల్ సీట‌ర్ ఉన్న‌ట్లు అధికారులు తెలిపారు.

ర‌ఫేల్ కొనుగోలులో కీల‌క పాత్ర పోషించిన మాజీ ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌ ఆర్‌కే బ‌దౌరియాకు స‌ముచిత గౌర‌వం ఇవ్వడం కోసం విమానాల టెయిల్ నెంబ‌ర్ల‌కు ఆర్‌కే సిరీస్ ఇవ్వ‌నున్నారు. 17 గోల్డెన్ ఆర్సో స్క్వాడ్ర‌న్ పైల‌ట్ తొలి విమానాన్ని భార‌త్‌కు తీసుకురానున్నారు.

మార్గ‌మ‌ధ్యంలో మిడిల్ఈస్ట్‌లో ఉన్న ఫ్రెంచ్ ట్యాంక‌ర్‌లో ఇంధ‌న నింప‌నున్నారు. వాస్త‌వానికి సింగిల్ జ‌ర్నీలో ఇండియాకు రావొచ్చు, కానీ చిన్న కాక్‌పిట్‌లో సుమారు 10 గంట‌ల పాటు కూర్చోవ‌డం స‌రికాదు అని అధికారులు పేర్కొన్నారు. ర‌ఫేల్ విమానాల‌ను న‌డిపే భార‌తీయ పైల‌ట్లు కూడా శిక్ష‌ణ పూర్తి చేసుకున్నారు.

అటువైపు చూస్తున్న మెగాస్టార్ కూతురు..!

దేశంలో లాక్డౌన్ కారణంగా చిత్రసీమ గడ్డుపరిస్థితులు ఎదుర్కొంటుంది. థియేటర్లు మూతపడటం, సినిమా షూటింగ్లు వాయిదా పడిన పరిస్థితుల్లోనూ ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఎంటటైన్మెంట్ రంగంలో హవా కొనసాస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లు అందరికీ అందుబాటులోకి రావడంతో ఫోన్లలోనే మూవీలు చూసేందుకు ప్రతీఒక్కరూ ఆసక్తి చూపుతోన్నాయి. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ సరికొత్త వెబ్ సీరిస్ లతో అభిమానులతో అలరిస్తున్నాయి. వీటి కంటెంట్ సినిమాకు మంచి ఉండటంతో అభిమానులు వీటికి అట్రాక్ట్ అవుతోన్నాయి. దీంతో ఇండస్ట్రీకి చెందిన పలువురు నిర్మాతలు ఇప్పటికే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో పెట్టుబడులు పెడుతోన్నారు. మరికొందరు సొంతంగా వెబ్ సీరిస్ లను నిర్మిస్తూ ఆదాయాన్ని గడిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ రంగానికి మంచి భవిష్యత్ ఉండటంతో ప్రతీఒక్కరూ అటువైపు చూస్తున్నారు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి పెద్దకూతురు సుస్మిత ఓటీటీ ప్లాట్ ఫామ్స్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. వందల కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు నిర్మించే బదులు వెబ్ సీరిస్ లు తీస్తే బెటరని సుస్మిత భావిస్తుందట. ఇందులో భాగంగా త్వరలోనే సొంతంగా ఓటీటీ ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేయాలని భావిస్తుంది. అంతేకాకుండా మెగా హీరోలతో వెబ్ సీరిస్ లు నిర్మించి తన ఓటీటీ మాధ్యమంలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తుందట. సుస్మిత ఆలోచనకు మెగాస్టార్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తన కూతురు సుస్మిత తీయబోయే వెబ్ సీరిస్ నటించేందుకు మెగాస్టార్ ఓకే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. కొద్దిరోజుల్లోనే దీనిపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే సుస్మిత మెగాస్టార్ చిరంజీవికి నటించిన ‘ఖైదీ-150’, ‘సైరా’ మూవీలకు సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకొంది.

ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు షాక్..!

ఎంతో కాలంగా ఏపీఎస్ ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పని చేస్తున్న వారికి ఆ సంస్థ షాకిచ్చింది. కరోనా కష్ట కాలంలో ఒకేసారి ఆరువేల మందిపై వేటు వేసింది. శుక్రవారం నుంచి విధులకు హాజరు కావొద్దంటూ వారికి డిపో మేనేజర్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 6 వేల మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించినట్టు తెలిపారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏప్రిల్ నెల వేతనాలు కూడా ఇప్పటి వరకు అందలేదు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు నిర్ణయం పై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆర్టీసీ యాజమాన్యం తీరును ఖండిస్తున్నాయి.

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. బాలకాశి, కార్యదర్శి నూర్ మొహమ్మద్ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు సంస్థను నష్టాల నుంచి గట్టెకించే మార్గాలను ఉన్నతాధికారులు అన్వేషిస్తున్నారు. బస్సుల్లో సిట్టింగ్ కెపాసిటీ భారీగా తగ్గించడం వల్ల తలెత్తే ఇబ్బందులను పూడ్చుకునేందుకు సరుకు రవాణాను మరింత పెంచాలని భావిస్తున్నారు. ఈ మేరకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు.

నిరూపిస్తే మీసం తీయించుకుంటా మంత్రి సవాల్..!

Minister Anil Kumar Yadav
Minister Anil Kumar Yadav

పోలవరం ప్రాజెక్టు 70 శాతం పూర్తి చేసినట్లు టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు నిరూపిస్తే తాను మీసం తీయించుకుని తిరుగుతానని జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా దేవినేని చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. వెలిగొండ, గాలేరు-నగరి పూర్తి చేశామని చెప్పుకోవడాన్ని తప్పు బట్టారు. రాయలసీమకు తీరని నష్టం చేసింది టిడిపి అన్నారు. అందుకే ప్రజలు 10 సీట్లే ఇచ్చారని చెప్పారు.

కృష్ణా జలాల్లో ఏపీకి రావాల్సిన వాటినే వాడకుంటున్నామని, అదే విధంగా సముద్రం పాలయ్యే మిగులు జలాలు మళ్లిస్తామన్నారు. దీంతో తెలంగాణా కు ఎటువంటి సమస్య ఉండదన్నారు. రాయలసీమ సాగు, తాగు నీటి సమస్య తీరుతుందని చెప్పారు. పొలిటికల్ స్టెంట్ లో భాగంగానే కొందరు రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారని తెలిపారు. చరిత్ర సృష్టించాలంటే అప్పుడు రాజశేఖర్ రెడ్డి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. నీళ్లు అమ్ముకునే బుద్ధి వైసీపీ నాయకులది కాదని అది టీడీపీ వారికే చెల్లుతుందన్నారు.

రజకార్లతో పోరాటానికి చిరు ‘సై’ అంటారా?

‘రచ్చ’ డైరెక్టర్ సంపత్ నంది టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకెళుతున్నాడు. ప్రస్తుతం గోపి చంద్-తమన్నా హీరోహీరోయిన్లుగా ‘సీటీమార్ అనే మూవీని తెరకెక్కిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. దర్శకుడు సంపత్ నంది లాక్డౌన్ సమయంలో మెగాస్టార్ కోసం ఓ పవర్ పుల్ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. యదార్థ సంఘటనల తెరకెక్కించే ఈ మూవీ కథను త్వరలోనే చిరంజీవికి విన్పించబోతున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం-రజాకర్ల నేపథ్యంలో స్టోరీ లైన్ ఉండటంతో ఈ మూవీపై మెగా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి తన డ్రీమ్ ప్రాజెక్టు ‘సైరా నర్సింహారెడ్డి’ని తెరకెక్కించారు. బ్రిటిష్ సైన్యాన్ని ఆనాటి పోరాట యోధులు ఎలా ఎదుర్కొన్నారనే ఇతివృత్తంలో ‘సైరా’ మూవీని దర్శకుడు సురేందర్ రెడ్డి అద్భుతంగా తెరకెక్కించాడు. సైరా నర్సింహారెడ్డి పాత్రకు మెగాస్టార్ ప్రాణం పోశారు. ఈ మూవీలో తెలుగులో భారీ విజయం సాధించింది. ఈమేరకు సంపత్ నంది మెగాస్టార్ కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని దృష్టిలో ఉంచుకొని కథను సిద్ధం చేసుకున్నారు. త్వరలోని చిరంజీవిని కలిసి విన్పించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం సంపత్ నంది ‘సిటీమార్’ మూవీతో బీజీగా ఉండగా మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’తో బీజీగా ఉన్నారు.

సంపత్ నంది గతంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో ‘రచ్చ’ మూవీని తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నాడు. ప్రస్తుతం చిరంజీవి దగ్గర దర్శకుల క్యూ భారీగానే ఉంది. ఈనేపథ్యంలోనే సంపత్ నందికి మెగాస్టార్ అవకాశం ఛాన్స్ ఇస్తారా? అనేది తెలియాల్సి ఉంది. సంపత్ నంది స్టోరీ లైన్ ఆకట్టుకునేలా ఉండటంతో అతడికి అవకాశం దక్కుతుందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే ఆ ఛాన్స్ ఎప్పట్లోగా అందిపుచ్చుకుంటారనేది ఆసక్తిని రేపుతోంది.

రూ.5 భోజన పథకానికి ఆరేళ్ళు

హైదరాబాద్ నగరంలో అన్నపూర్ణలా పేదల ఆకలి తీరుస్తున్న రూ. 5 భోజన పథకానికి ఆరేళ్ళు నిండాయి. ఈ ఆరేళ్లలో దాదాపు 5.5 కోట్ల మీల్స్‌ను ఈ క్యాంటీన్లు ద్వారా అందించారు. ముఖ్యంగా పేదలు, అడ్డాల మీద ఉండే కూలీల కొరకు ఈ పథకం ప్రారంభించడం జరిగింది. పేదల ఆకలి తీర్చడానికి ఈ అన్నపూర్ణ క్యాంటీన్లు ప్రారంభించి ఆరేళ్లు పూర్తయిన సందర్బంగా ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ అక్షయపాత్ర ఫౌండేషన్ యాజన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా.. కేటీఆర్ ” తెలంగాణలో పేదల ఆకలి తీర్చడానికి అన్నపూర్ణ క్యాంటీన్లు ప్రారంభించి ఆరేళ్లు అవుతోందన్నారు. ఈ నేపథ్యంలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ‘జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో అన్నపూర్ణ భోజన కేంద్రాలను ఆరేళ్ల క్రితం ప్రారంభించాం. దాదాపు 5.5 కోట్ల మీల్స్‌ను ఈ క్యాంటీన్లు అందించాయన్నారు. దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయలేని అతిపెద్ద కార్యక్రమం ఇది. అక్షయపాత్రకు, కష్టపడి పనిచేస్తోన్న సిబ్బందికి ధన్యవాదాలు” అని కేటిఆర్ తెలిపారు. కాగా, ఈ క్యాంటీన్లు ప్రతిరోజు వేలాదిమంది ఆకలిని తీరుస్తున్నాయి. హైదరాబాద్‌ పరిధిలో సుమారు 150 అన్నపూర్ణ క్యాంటీన్లు ఉన్నాయి. మధ్యాహ్నం, రాత్రి ఈ క్యాంటీన్లలో రూ.5కే భోజనం పెడుతున్నారు. అంతేకాదు, కరోనా విజృంభణ నేపథ్యంలో ఈ క్యాంటీన్లలో ఉచితంగా ఆహారం అందిస్తున్నారు.

రైతు భరోసా డబ్బులు వచ్చాయి..చెక్ చేసుకోండి!

ఏపీలో ‘వైఎస్సార్‌ రైతు భరోసా– పీఎం కిసాన్‌’ పథకం ద్వారా రైతులకు నగదు జమ కార్యక్రమం ఈ రోజు (శుక్రవారం) ప్రారంభమైంది. నగదు బదిలీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ నగదు బదిలీ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఈ పథకం ద్వారా రైతులు, అర్హులైన కౌలుదార్లు, సాగుదార్లకు నగదు జమ చేయడం ఇది రెండోసారి. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు ఏటా రూ.13,500 చొప్పున వరుసగా రైతులకు రెండో ఏడాది అందిస్తున్నారు. ఈసారి దాదాపు 49,43,590కిపైగా రైతు కుటుంబాలకు తొలివిడతగా నేడు రూ.2,800 కోట్ల మొత్తం వారి ఖాతాల్లో జమ కానుంది. కాగా, తొలివిడత కిందే గత నెలలో రూ.2 వేల చొప్పున రూ. 875 కోట్లు జమ చేసింది. గత ఏడాది కన్నా ఈసారి లబ్ధి పొందే రైతు కుటుంబాల సంఖ్య 2.74 లక్షలు అధికం.

నాగాలాండ్ కు తిరిగి రాకపోతే రూ 10 వేల బహుమతి!

 

లాక్ డౌన్ అమలులోకి వచ్చిన సుమారు 50 రోజుల వరకు వలస కార్మికుల గురించి పట్టించుకోకుండా ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకేసారి వారి విషయంలో స్పందిస్తున్నాయి. సొంత ప్రాంతాలకు వెళ్ళాలి అనుకున్న వారికి ప్రత్యేక రైళ్లు, బస్సులు ఏర్పాటు చేసి పంపిస్తున్నారు. ఇప్పడికే లక్షల మంది ఆ విధంగా వెళ్లారు.

అదే సమయంలో కొన్ని ఆర్ధిక కార్యకలాపాలు ప్రారంభం కావడంతో వీళ్లంతా వెళ్ళిపోతే పనులు ఎట్లాగూ సాగుతాయి అంటూ పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తూ, వెళ్లకుండా ఉండేందుకు పలు ప్రోత్సాహకాలను ప్రకటిస్తున్నాయి. ఒకొక్కరికి రూ 5,000 నగదుతో పాటు పలు సదుపాయాలను ప్రకటిస్తున్నారు.

అదే సమయంలో వారంతా తిరిగి వస్తే వారితో పాటు కరోనా వైరస్ కూడా వస్తుందని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భయపడుతున్నాయి. వారిలో కొందరు కరోనా పాజిటివ్ గా తేలడం కూడా తెలిసిందే. అందుకనే నాగాలాండ్ ప్రభుత్వం సొంత రాష్త్రానికి తిరిగి రాకపోతే ఒకొక్కరికి రూ 10,000 నగదు పారితోషికం ఇస్తామని ప్రకటించింది.

ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన నాగాలాండ్ ప్రజలు ఇప్పుడప్పుడే రావొద్దని, వారందరికీ రూ. 10 వేల చొప్పున ఇస్తామని ప్రకటించింది.వలస కార్మికుల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నకారణంగా నాగాలాండ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం నాగాలాండ్ కరోనా రహిత రాష్ట్రంగా ఉంది. ఇటువంటి సమయంలో వలస కూలీలు తిరిగి వస్తే కరోనా ఎక్కడ వ్యాప్తి చెందుతుందోనన్న ఆందోళనతో ఎక్కడి వారు అక్కడే ఉండేలా ఖర్చులు, ఇతర అవసరాల కోసం రూ. 10 వేల ఆర్థిక సాయం ప్రకటించింది

సలహాదారుపై వేటేసిన సర్కార్..!

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుల విషయం ఇటీవల చర్చనీయాంశంగా మారింది. సలహాదారులకు సలహాలు ఇచ్చే పని మాత్రం ఎక్కడ అస్సలు ఉండదనే విషయం స్పష్టమయింది. ఈ విషయంలొనే సలహాదారుడు రామచంద్రమూర్తి విధులకు దూరంగా ఉంటూ జీతం తీసుకోవడం లేదు. ఏ వివాదం ఎలా ఉండగా పోలవరం ప్రాజెక్టు సాంకేతిక, న్యాయ సలహాదారు హెచ్‌కే సాహును విధుల నుంచి తప్పిస్తూ నిర్ణయం కీలక నిర్ణయం తీసుకుంది.

జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌లోని పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయంలో ప్రాజెక్టు సాంకేతిక, న్యాయ సలహాదారుగా సాహుని 2018, ఏప్రిల్‌ 14వ తేదీన కన్సల్టెంట్‌గా ఏపీ ప్రభుత్వం నియమించింది. అయితే ఆయన పనితీరు సంతృప్తికరంగా లేదని ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టు సీఈ నివేదిక పంపారు. ఈ నివేదిక ఆధారంగా ప్రత్యేక కార్యదర్శి సాహును తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కన్సల్టెంట్‌గా సాహును తొలగించే బలమైన కారణం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. కేవలం సిఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ప్రభుత్వం నిర్ణయం తిసుకున్నాకే సిఈతో నివేదిక సిద్ధం చేయించినట్లు సమాచారం.

ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం..!

పరిశ్రమల్లో ప్రమాదాలు చోటు ఇటీవల కాలంలో చేసుకుంటూనే ఉన్నాయి. విశాఖ ఎల్.జి పాలిమర్స్, చత్తీస్ ఘడ్ లో శక్తి పేపర్ మిల్, తమిళనాడులో మరో పరిశ్రమలో, పిడుగురాళ్ల లో సున్నం పరిశ్రమలో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలో మరో ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో కంపెనీలో భారీగా మంటలు పడుతున్నాయి. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలుకు సమీపంలోని పేర్నమిట్టలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామంలో ఉన్న మినోఫాం ఫార్మా పరిశ్రమలో కొంత కాలంగా శానిటైజర్లు తయారు చేస్తున్నారు.

శానిటైజర్లు తయారు చేసే క్రమంలో ఈ ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. శానిటైజర్‌లలో ఉపయోగించే ఆల్కహాల్ కు మండే స్వభావం ఉండటంతో ప్రమాద తీవ్రత అధికంగా ఉంటుందని భావిస్తున్నారు. కాగా పరిశ్రమలోని రెండు ఫోర్లకు దట్టమైన పొగలు వ్యాప్తించడంతో భయంతో సిబ్బంది బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితి అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

చికెన్ ధర ‘న భూతో-న భవిష్యత్’!

కరోనా ఇచ్చిన బలమో, ప్రజలలో ఉన్న బలహీనతో తెలియదుగానీ ప్రస్తుతం కోడి ధర ‘న భూతో న భవిష్యత్’ అయింది. మునుపెన్నడూ లేనివిధంగా, ఇక భవిష్యత్ లో కూడా ఇంత ఉండదేమో అన్నంతగా చికెన్ రేట్ పెరిగింది.
రెండు నెలల కిందట చికెన్‌ తింటే కరోనా సోకుతుందన్న ప్రచారంతో కొనేవాడే లేక అత్యల్పంగా కిలో రూ. 50కే పడిపోయి, కొన్ని చోట్ల ఫ్రీ గా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత ప్రజల్లో అపోహలు తొలగడంతో మాంసం వినియోగం పెరిగింది. అలా 15 రోజుల కిందట రూ. 200కు, వారం కిందట రూ. 250కి చేరింది. అదిప్పుడు ఏకంగా రూ. 310కి పెరిగింది. బ్రాయిలర్‌ కోళ్ల చరిత్రలో ఇదే రికార్డు ధర.

ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాలలో కిలో చికెన్‌ అత్యధిక (రెండేళ్ల కిందట) ధర రూ. 260 పలికింది. ఇదే ఇప్పటివరకు ఉన్న రికార్డు. ఇప్పుడు ఆ రికార్డు చెరిగిపోయింది. కిలో రూ. 310 అనేది దేశంలోకెల్లా అత్యధిక ధర కావడం గమనార్హం. ప్రస్తుతం లాక్‌డౌన్‌ వల్ల పెద్ద, చిన్న హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లు, రోడ్డు పక్కన దుకాణాలూ మూతపడ్డాయి. అవి కూడా తెరచి ఉంటే చికెన్‌ ధర మరింత పెరిగేదని చికెన్‌ సెంటర్ల నిర్వాహకులు చెబుతున్నారు.

కొడుకుని అత్యంత కిరాతకంగా హతమార్చిన తండ్రి!

కన్న తండ్రే, తన కొడుకు మొహం మీద దిండు పెట్టి, ఊపిరాడకుండా చేసి అత్యంత కిరాతకంగా హతమార్చిన సంఘటన టర్కీలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. టర్కీ ఫుట్‌ బాలర్‌ కెవెర్‌ టోక్టాస్‌ గత నెల 23న తన కొడుకు ఖాసిం (5)ను కరోనా వైరస్‌ లక్షణాలతో ఆస్పత్రిలో చేర్పించాడు. చికిత్స జరుగుతుండగానే ఈనెల 4న ఫుట్‌ బాలర్‌..ఆ చిన్నారిని దిండుతో ఊపిరాడకుండా చేసి అత్యంత కిరాతకంగా చంపేశాడు. ఏమీ ఎరుగనట్టుగా డాక్టర్లను పిలవడంతో వారు ఐసీయూకు తరలించి రెండు గంటలపాటు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. నిజానికి ఆ చిన్నారికి కరోనా నెగెటివ్‌ వచ్చినా కూడా అతడి మృతిపై అప్పట్లో ఎవరికీ సందేహం రాలేదు. కానీ, పది రోజుల తర్వాత తీవ్ర పశ్చాత్తాపంతో టోక్టాస్‌ పోలీసులకు లొంగిపోయి అసలు విషయాన్ని తెలిపాడు. ‘15 నిమిషాల పాటు దిండుతో చిన్నారి మొహంపై గట్టిగా అదిమా. కొద్దిసేపయ్యాక తీసేయడంతో కదలికలు ఆగిపోయాయి. వెంటనే డాక్టర్లను పిలవడంతో ఎవరికీ సందేహం రాలేదు. వాడంటే నాకు మొదటి నుంచీ ఇష్టం లేదు. అందుకే చంపాను. మానసికంగా నేను ఆరోగ్యంగానే ఉన్నా’ అని టోక్టాస్‌ వివరించాడు. ఈ విషయం తెలిసిన యావత్ ప్రపంచం నివ్వెరపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.