
‘రచ్చ’ డైరెక్టర్ సంపత్ నంది టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకెళుతున్నాడు. ప్రస్తుతం గోపి చంద్-తమన్నా హీరోహీరోయిన్లుగా ‘సీటీమార్ అనే మూవీని తెరకెక్కిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. దర్శకుడు సంపత్ నంది లాక్డౌన్ సమయంలో మెగాస్టార్ కోసం ఓ పవర్ పుల్ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. యదార్థ సంఘటనల తెరకెక్కించే ఈ మూవీ కథను త్వరలోనే చిరంజీవికి విన్పించబోతున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం-రజాకర్ల నేపథ్యంలో స్టోరీ లైన్ ఉండటంతో ఈ మూవీపై మెగా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
ఇటీవల మెగాస్టార్ చిరంజీవి తన డ్రీమ్ ప్రాజెక్టు ‘సైరా నర్సింహారెడ్డి’ని తెరకెక్కించారు. బ్రిటిష్ సైన్యాన్ని ఆనాటి పోరాట యోధులు ఎలా ఎదుర్కొన్నారనే ఇతివృత్తంలో ‘సైరా’ మూవీని దర్శకుడు సురేందర్ రెడ్డి అద్భుతంగా తెరకెక్కించాడు. సైరా నర్సింహారెడ్డి పాత్రకు మెగాస్టార్ ప్రాణం పోశారు. ఈ మూవీలో తెలుగులో భారీ విజయం సాధించింది. ఈమేరకు సంపత్ నంది మెగాస్టార్ కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని దృష్టిలో ఉంచుకొని కథను సిద్ధం చేసుకున్నారు. త్వరలోని చిరంజీవిని కలిసి విన్పించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం సంపత్ నంది ‘సిటీమార్’ మూవీతో బీజీగా ఉండగా మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’తో బీజీగా ఉన్నారు.
సంపత్ నంది గతంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో ‘రచ్చ’ మూవీని తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నాడు. ప్రస్తుతం చిరంజీవి దగ్గర దర్శకుల క్యూ భారీగానే ఉంది. ఈనేపథ్యంలోనే సంపత్ నందికి మెగాస్టార్ అవకాశం ఛాన్స్ ఇస్తారా? అనేది తెలియాల్సి ఉంది. సంపత్ నంది స్టోరీ లైన్ ఆకట్టుకునేలా ఉండటంతో అతడికి అవకాశం దక్కుతుందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే ఆ ఛాన్స్ ఎప్పట్లోగా అందిపుచ్చుకుంటారనేది ఆసక్తిని రేపుతోంది.