
గత నాలుగేళ్లుగా బాలీవుడ్ నిర్మాతల చూపు టాలీవుడ్ సినిమాల స్టోరీల పై పడింది. ఈ మధ్య ఇక్కడ హిట్టైన సినిమాలని హిందీలోకి రీమేక్ చేయడానికి బాలీవుడ్ నిర్మాతలు బాగా ఇంట్రస్ట్ చూపుతున్నారు. ఇప్పటికే ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ భారీ హిట్టై వసూళ్ల వర్షం కురిపించడంతో.. తెలుగులో హిట్ అయిన ‘జెర్సీ, ఆర్ఎక్స్100’, ఎవడు సినిమాలను కూడా రీమేక్ చేస్తున్నారు. అలాగే విజయ్ దేవరకొండ క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న రెండవ సారి జంటగా వచ్చిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రం యొక్క హిందీ రీమేక్ రైట్స్ ను ప్రముఖ బాలీవుడ్ చిత్ర నిర్మాత కరణ్ జోహార్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
కాగా మరొక తెలుగు సినిమాని కూడా హిందీలోకి రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తోన్నట్లు తెలుస్తోంది. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా కూడా రీమేక్ అవుతుందట. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. హీరో రామ్ – పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను రాబట్టింది. దాంతో ఈ చిత్రం రెట్టింపు లాభాలను సొంతం చేసుకుంది. మొత్తానికి, ఇస్మార్ట్ శంకర్ పూరికి మరియు హీరో రామ్ కి సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది,
మరి రణబీర్ కపూర్ కి కూడా ఈ సినిమా సూపర్ హిట్ ని ఇస్తుందా..? అలాగే రామ్ పాత్రలో రణబీర్ కపూర్ ఎలా నటిస్తాడో ! నవంబర్ నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందట. ఇక ఈ సినిమాలో నటించే ఇతర నటీనటుల గురించి, సినిమా వివరాల గురించి తెలియాల్సి ఉన్నాయి.