Home Blog Page 8451

ఇది హాట్ టాపిక్.. ‘డాక్టర్ లీ’ కి మగబిడ్డ…!

Doctor lee

Doctor lee

‘డాక్టర్ లీ వెన్లియాంగ్’ చైనాలో ఆప్తమాలజిస్ట్ వైద్యుడు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ ను మొట్టమొదట గుర్తించి చైనాను అప్రమత్తం చేసి, వైరస్ సోకిన వారికి వైద్యం అందించే క్రమంలో ఆ మహమ్మారి కోరల్లో చిక్కుకొని ఫిబ్రవరిలో ఈ లోకాన్ని విడిచి వెళ్లిన అసాధారణ హీరో డాక్టర్ లీ. లీ కరోనా గురించి మొదట్లో హెచ్చరించినప్పుడు.. అసత్య ప్రచారాలతో ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాడంటూ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టారు. కానీ ఆ తర్వాత లీ చెప్పిన మాటలే నిజమవడంతో.. చైనీయులు ఆయన్ను హీరో అంటూ కొనియాడారు. లీ హెచ్చరికలను పట్టించుకోని చైనా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. లీ చనిపోయే నాటికి గర్భంతో ఉన్న ఆయన భార్య.. తాజాగా ఓ మగ శిశువుకు జన్మనిచ్చింది. ఆ శిశువు 3.45కి.గ్రా బరువుతో ఆరోగ్యంగా ఉన్నాడు.

ఈ విషయాన్ని డాక్టర్ లీ భార్య ‘ఫైనల్ గిఫ్ట్’ పేరుతో చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్ విచాట్‌ ద్వారా అందరితో పంచుకున్నారు. ‘నువ్వు స్వర్గం నుంచి చూడగలవా.. నాకు నువ్విచ్చిన చివరి బహుమతి ఈరోజు ఈ లోకంలోకి వచ్చింది. నేను మన బిడ్డను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. ‘అని ఆమె పేర్కొన్నారు. ఆమె ఈ వార్త చెప్పడమే ఆలస్యం చైనీయుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. లీ వెన్లియాంగ్-ఫు జుజీకి కలిగిన రెండో సంతానంపై చాలామంది సంతోషం వ్యక్తం చేశారు. ఆ చిన్నారి ఎప్పుడూ సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు.

వెన్లియాంగ్‌ కి కొడుకుకి పుట్టిన విషయం తెలిసి చాలామంది నెటిజన్స్ సంబరపడిపోతున్నారు. ‘ఈరోజుకి నాకు అన్నింటికంటే ఇదే బెస్ట్ న్యూస్… ప్రజలు ఇంకా లీ వెన్లియాంగ్‌ ని మర్చిపోలేదు… తలుచుకుంటేనే దు:ఖం తన్నుకొచ్చినట్టు అనిపిస్తోంది.’ అని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డారు. మరో నెటిజన్.. ‘లీ వెన్లియాంగ్ స్ఫూర్తిని ఆయన కొడుకు కూడా కొనసాగిస్తాడని ఆశిద్దాం.’ అంటూ కామెంట్ చేశారు. గత ఫిబ్రవరిలో కరోనా కారణంగా మృత్యువాతపడ్డ లీ వెన్లియాంగ్‌ ను.. చైనీస్ ప్రభుత్వం కరోనాపై పోరులో ప్రాణ త్యాగం చేసిన వైద్యుడిగా గుర్తించి ఆయన కుటుంబానికి మెడల్ అందజేసింది.

చైనాలో ఆస్పత్రులకు క్యూ కడుతున్న ప్రజలను చూసి.. దేశంలో అంతుచిక్కని అసాధారణ పరిస్థితులేవో నెలకొన్నాయని లీ వెన్లియాంగ్ భావించాడు. తన ఆస్పత్రిలో చేరిన ఏడుగురు పేషెంట్లలో 2003లో ప్రపంచాన్ని వణికించిన సార్స్ లక్షణాలను గుర్తించాడు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో తన మిత్రులతో పంచుకుని వారిని అప్రమత్తం చేశాడు. ఆ మెసేజ్‌ లు బయటకు లీకై వైరల్‌ గా మారడంతో.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడంటూ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురిచేశారు.

కాంగ్రెస్ నేతల అరెస్టుల పరంపర!

Congress Leaders

Congress Leaders

తమ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో జల యజ్ఞంలో భాగంగా తెలంగాణలో గోదావరి నదిపై చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల పనులు జరగట్లేదంటూ ఆరోపిస్తోన్న కాంగ్రెస్ నేతలు జలదీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ క్రమంలో గోదావరి పరిధిలోని సాగునీటి ప్రాజెక్టుల సందర్శనకు పిలుపునిచ్చిన కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఆయా ప్రాజెక్టుల వద్దకు వెళ్తుండగా వారిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా దుమ్మగూడెం ప్రాజెక్టు వద్దకు వెళ్తున్న కాంగ్రెస్‌ నేతలను అడ్డుకుని వెనక్కి వెళ్లాలని సూచించారు.

వైరాలో భట్టి విక్రమార్కను అడ్డుకోవడంతో పాటు కొత్తగూడెంలో కాంగ్రెస్‌ నేత వీహెచ్‌ ను అడ్డుకుని పోలీసుస్టేషన్‌ కు తరలించారు. కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌ ను, భద్రాచలంలో ఎమ్మెల్యే వీరయ్యను గృహనిర్బంధం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.

కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం సిద్దిపేట, గజ్వేల్‌, సిరిసిల్లకేనా? అని కాంగ్రెస్ నేత షబ్బీర్‌ అలీ ప్రశ్నించారు. కామారెడ్డి, నిజామాబాద్‌ కి నీళ్ల కోసం… కేవలం రెండు వేల కోట్లు ఖర్చు చేస్తే 3లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు లైఫ్‌ లైన్‌ అయిన… ఎల్లంపల్లి, మిడ్‌ మానేరు, లోయర్‌ మానేరు కాంగ్రెస్‌ పార్టీ కట్టినవేనన్నారు. సెక్షన్‌-8 ప్రకారం గవర్నర్‌ తన అధికారాలను వినియోగించుకోవాలని షబ్బీర్‌ అలీ పేర్కొన్నారు.

మత సామరస్యం – పరిష్కారమార్గాలు(చివరి భాగం)

ఇప్పటివరకు వైవిధ్యభరితమైన భారత దేశంలో మతాలూ, మత ఘర్షణలు ఎలా పరిణతిచెందాయో దానివలన దేశం ఏ విధంగా నష్ట పోయిందో చూసాము. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాల్సి వుంది. భారత భూమి ప్రపంచంలో ఎన్నో మతాల పుట్టుకకు కూడా పుట్టినిల్లు. సనాతన వైదిక మతం దగ్గర్నుంచి ఆధునిక యుగం లో ఉద్భవించిన సిక్కు మతం దాకా అన్నింటినీ ఆదరించిన పుణ్య భూమి మనది. ప్రపంచ చరిత్రలో జరూసలెం కు వచ్చినపేరు భరత భూమికి రాలేదు. ఎందుకంటే చరిత్ర అంతా ఎవరి ఆధిపత్యంలో వుంటే వారి పక్షానే వుంటుంది. ఎక్కడిదాకా ఎందుకు ఆధునిక చరిత్రలో అత్యంత మానవ విషాద సంఘటనల్లో బ్రిటిష్ బహుమానంగా ఇచ్చిన భారత విభజన ఒకటి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మానవ తప్పిదంతో జరిగిన మానవ వినాశనం గా చెప్పొచ్చు. అయినా చరిత్రలో దానికి సరయిన ప్రాధాన్యం లేదు. ఇన్ని లక్షల మంది విషాదానికి కారణమైన బ్రిటిష్ ని నేరస్థుల బోనులో ముద్దాయిగా నిలబెట్టి శిక్షించాల్సింది. విభజన చేయాలనుకుంటే అన్ని రకాలా సంసిద్ధం చేసి ప్రాణ నష్టం జరక్కుండా చేయకుండా హడావిడిగా తేదీని ముందుకు జరిపి ఎప్పుడూ భారత్ ని సందర్శించని, భారత్ గురించి ఏమీ తెలియని ఒక సర్వేయర్ కి అప్పగించి గదిలో మ్యాపుల పై గీతలు గీసి చేసిన          ‘ ఘనకార్యం’ క్షమించరాని నేరం. ఆ రావణా కాష్టం ఇంకా రగులుతూనే వుంది. ఎప్పటికైనా ఇంతటి మానవాళి వినాశనానికి కారణమైన బ్రిటిష్ ప్రభుత్వాన్ని నేర ముద్దాయిగా ప్రకటిస్తారని ఆశిద్దాం.

ఇదంతా ఎందుకు చెప్పాల్సివచ్చిందంటే ఇన్ని మతాల పుట్టుకకు నిలయమైన భారత్ కు రావాల్సిన ఖ్యాతి రాలేదు. హిందూ మతం భారత ఉపఖండంతో పాటు ఆగ్నేయ ఆసియాలో కూడా విస్తృతంగా వ్యాప్తి చెందటం తెలిసిందే. ఇటీవలే వియత్నాంలో శివలింగం బయటపడటం అన్ని పత్రికల్లో చూసాము. ఇండోనేషియా, కంబోడియా ల్లోని హిందూ దేవాలయాలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా యాత్రికుల్ని అలరిస్తున్నాయి. ఇక బౌద్ధమత వ్యాప్తి గురించి చెప్పాల్సిన పని లేదు. ఒకనాడు మొత్తం ఆసియా లో విస్తరించిన ఏకైక మతం బౌద్ధం. ఈ రోజుకీ చైనా, తూర్పు,ఆగ్నేయ ఆసియాల్లో వ్యాపించివున్న మతం బౌద్ధం. జైన మతం అత్యంత ప్రాచీన మతాలలో. ఒకటి. అలాగే భౌతిక వాదానికి కూడా పుట్టినిల్లు మన గడ్డనే. ఇన్ని విభిన్న ఆలోచనలను, విశ్వాసాలను అక్కున చేర్చుకొని ఆదరించిన భూమి మనది. అటువంటిది ఇప్పుడు ఎదురవుతున్న సవాళ్ళను కూడా పరిష్కరించగల సత్తా మన భూమికి, మన ప్రజలకి వుంది. ఆ విషయం మరిచిపోవద్దు. మత విశ్వాసాలు మనుగడ సాగించటం కష్టమనుకున్నప్పుడు మన గడ్డ మీదకు వచ్చి తలదాచుకున్న గొప్ప వారసత్వ సంపద మనది. పార్సీలు , బహాయి మతస్తులు పారిపోయి భారత్ లో ఆశ్రయం పొందిన సంగతి చెప్పాల్సిన పనిలేదు. అంతెందుకు అబ్రహాం మతాలైన యూదులు, క్రైస్తవులు, ముస్లిం లు ఎప్పట్నుంచో మన గడ్డ పై సహజీవనం చేస్తున్న సంగతిని కూడా గుర్తు పెట్టుకుందాం. 8 వ శతాబ్దంలో పశ్చిమ సరిహద్దుల్లో నుంచి వచ్చిన ఇస్లాం, 15 వ శతాబ్దం నుంచి వచ్చిన యూరప్ క్రైస్తవం తోనే ఘర్షణ వాతావరణం పెరిగింది. స్వాతంత్రానంతరం ఆ వాతావరణాన్నుంచి  బయటపడి మనిషిని మనిషిగా చూసే ఆధునిక భావాలకు ప్రతీకలుగా కలిసి మెలిసి బతకలేమా? మతం పేరుతో కొట్టుకు చావాల్సిందేనా? ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా గుండె మీద  చేయివేసుకొని ఒక్క నిముషం ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది. మనిషి పుట్టినప్పుడు మతం లేదు, మనిషి చచ్చిన తర్వాత మతాన్ని మోసుకొని వెళ్ళడు. వున్న కొన్నాళ్ళు  నాగరికంగా బతకలేమా? అదే అమెరికా వెళ్లి ప్రశాంతంగా బతుకుతున్నప్పుడు ఇక్కడ మనం ఆ పని చేయలేమా? మనిషి అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. మన మనసుల్లోంచి తుప్పు వదిలించుకుంటే ఆరోగ్యకరమైన వాతావరణం లో బతకొచ్చు. ఎవరిమత విశ్వాసాలు వారు పాటిస్తూ హాయిగా బతకొచ్చు. ఒక్కసారి కాశ్మీర్ చరిత్ర చూడండి. ఇబ్బందులు తలెత్తినప్పుడు అందరూకలిసి కూర్చొని ఎలా బతకొచ్చో నేర్పారు. కలిసి మాట్లాడుకొని  గో మాంసాన్ని , పంది మాంసాన్ని కాశ్మీర్ భోజనం నుంచి నిషేదించారు. మనిషి కలిసి వుండటం కన్నా ఇవి ముఖ్యంకాదని తీర్మానించారు. ఒకరి మత పండగలకి మరొకరు హాజరయ్యే వారు. ఈ మిశ్రమ సంస్కృతి నే ‘కాశ్మీరియత్’ అనేవారు. ఇది మన కళ్ళముందే 15 వ శతాబ్దం లో జరిగింది. అటువంటి మంచి సంస్కృతిని పోగొట్టుకొని విభేదాలతో , కక్షలతో బతికి సాధించేదేమిటి? ఇప్పటికైనా ఆ స్పూర్తితో కలిసి మెలిసి ఉందాం, అన్ని మత విశ్వాసాలను కొంతమేర సడలించుకొని భారతీయ ప్రత్యేకతో ఆదర్శ మానవ సంబధాలను కొనసాగిద్దాం.

రాజకీయ పార్టీల పాత్ర

దురదృష్టవశాత్తు భారత రాజకీయపటం లో మత సామరస్యం కోసం రాజకీయ పార్టీలు కృషి చేసిన దానికన్నా సామరస్య వాతావరణాన్ని చెడగొట్టిందే ఎక్కువ. ఒకవైపు ప్రభుత్వం మతాలతో సంబంధం లేకుండా అందరికోసం పనిచేస్తుందని చెబుతూనే ఆచరణలో విభజించు పాలించు సిద్ధాంతాన్ని అమలుచేశారు. సెక్యులర్ నినాదాలిస్తూనే రెండోవైపు ఓటు రాజకీయాలు చేసారు. నిజంగా సెక్యులరిజాన్ని తూచా తప్పకుండా పాటించి వుంటే ప్రజలు మతపరంగా విభజనకు గురయ్యేవారు కారు. సమస్య ఎదురైనప్పుడు ధైర్యంగా పరిష్కరించకుండా ప్రతిదానిని ఓటు రాజకీయాలతో చూడటంతో క్రమ క్రమేణా ప్రజలు కూడా ఆ వాతావరణానికి అలవాటుపడ్డారు. ఉదాహరణకు మత ఘర్షణలు జరిగినప్పుడు ముద్దాయిలు ఏ మతస్తులని చూడకుండా న్యాయం చేయగలగాలి. అంతేగాని ఒకవైపు కొమ్ముకాయటం చేయకూడదు. నేరం నేరమే . ఇది రాజకీయ పార్టీల్లో లోపించింది. అందుకే విభజనకు బ్రిటిష్ వాడు ఎలా ముద్దాయో మత విభజన కొనసాగటానికి రాజకీయ పార్టీలు ముద్దాయిలు.

ఇది నిజంగా దురదృష్టం. అదే యూరప్ లో, అమెరికాలో చూడండి. రాజకీయ పార్టీలు మితవాద, అతివాద, మధ్యేవాద పార్టీలుగా విడిపోయి వుండొచ్చు. కానీ సమాజాన్ని మతం పేరుతో విడదీయ లేదు. అది సమాజానికి రాజకీయపార్టీలు చేసిన మేలు. ఉదాహరణకు జర్మన్ క్రిస్టియన్ డెమోక్రటిక్ పార్టీ నాయకురాలు ఏంజెలా మెర్కెల్ సంప్రదాయ, మితవాద పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తుంది. అయినా సిరియా శరణార్ధుల విషయంలో అందరికన్నా ఔదార్యంగా వ్యవహరించింది. ఆ కాంట్రిబ్యూషన్ భారతీయ పార్టీలు చేయలేదు. ఎక్కువకాలం పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ దీనికి బాధ్యత వహించాలి. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడే ఒరవడే  సంప్రదాయంగా కొనసాగుతుంది. ఈరోజు బిజెపి అధికారం లోకి వచ్చిందంటే అది మెజారిటీ హిందువులు కాంగ్రెస్ బుజ్జగింపు , వివక్ష రాజకీయాలు విసుగు చెంది సమీకరించబడ్డారు. బిజెపి ప్రధానంగా హిందువుల మద్దత్తు తోనే అధికారం లోకి వచ్చిందనేది బహిరంగ రహస్యం. దాని పూర్వ పార్టీ అయిన భారతీయ జన సంఘ్ ని ఆదరించని ప్రజలు ఇప్పుడే ఎందుకు ఆదరించారో కాంగ్రెస్ , మిగతా ‘సెక్యులర్’ పార్టీలు ఆత్మ విమర్శ చేసుకోవాలి. మనదేశంలో సెక్యులరిజమంటే హిందూ మత వ్యతిరేక వైఖరిగా మారిపోయింది.ఇప్పటికైనా నిజమైన సెక్యులర్ విధానాలు అవలంబిస్తే ప్రజలు మతాన్ని పక్కన బెట్టి ప్రజా సమస్యల పై సమీకరించబడతారు. .అందుకే ఇంతటి ‘ఘన చరిత్ర గలిగిన ఈ సెక్యులర్ పార్టీలు’ మత సామరస్యాన్ని సాధించలేకపోయారు.

మరి సమస్యను ఎలా పరిష్కరించాలి?

ముందుగా వివాదాస్పద అంశాలను మూడుగా వర్గీకరించాలి . ఇప్పటికే కోర్టుల్లో విచారణలో వున్న అంశాలు, ప్రభుత్వం తక్షణం నిర్ణయం తీసుకోదగ్గ అంశాలు, చివరగా విస్తృత సంప్రదింపులు జరపాల్సిన అంశాలుగా విభజించుకుందాం. అవేమిటో ఒక్కసారి చూద్దాం.

కోర్టులో విచారణలో వున్న అంశాలు

సుప్రీం కోర్టు స్థాయిలో విచారణలో ఇప్పటికే ఇస్లాం పౌర స్మృతికి చెందిన బహుభార్యత్వం , నిఖా హలాలా అంశాలు వున్నాయి. అలాగే హిందూ దేవాలయాల ప్రభుత్వ నియంత్రణ పై కూడా సుప్రీం కోర్టు లో కేసు విచారణలో వుంది.

ప్రభుత్వం తీసుకోదగ్గ నిర్ణయాలు

గోవధ పేరుతో హత్యలు, సామూహిక హత్యల ( mob lynching) పై  మరింత కఠిన చట్టాలు చేయటం పై ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అమలుచేయవచ్చు. హేతువాదుల హత్యల విషయం లో కూడా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో దోషులను పట్టుకొని శిక్షించవచ్చు. పూజారుల, ఇమాంల, పాస్టర్ల వేతనాలు; మత తీర్ధ యాత్రల ఖర్చులు; దేవాలయాలు , మసీదులు, చర్చీల నిర్మాణాలకు, మరమత్తులకు ఖర్చులు ఇత్యాది అంశాలపై ప్రభుత్వం విధానపర నిర్ణయం తీసుకోవచ్చు. జనాభా నియంత్రణ అంశంపై కూడా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవటానికి అడ్డంకి లేదు. వీటన్నింటిపై ప్రభుత్వపరంగా నిర్ణయాలు తీసుకొని అమలుచేస్తే సరిపోతుంది. ఇది ప్రాధమికంగా ప్రభుత్వ పరిధిలోని అంశాలే.

విస్తృత సంప్రదింపులు జరపాల్సిన అంశాలు

వుమ్మడి పౌర స్మృతి;  మత మార్పిడులు;  మత ప్రార్ధనలు , మత పండుగలు, కార్యక్రమాల పేరుతో లౌడ్ స్పీకర్ల వినియోగం;  విద్యా సంస్థల నియంత్రణ పై వుమ్మడి విధానం; మైనారిటీ నిర్వచనం పై పునఃసమీక్ష ; దళిత క్రైస్తవుల రిజర్వేషన్లు; ఇస్లాం పౌర స్మృతి లో సంస్కరణలు; పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ జనాభా పట్టిక, జాతీయ పౌరసత్వ పట్టిక లాంటి అంశాలు సున్నితమైన అంశాలు. వీటిపై అందరి హక్కుదారులతో విస్తృత చర్చలు జరపాలి. పై రెండింటిని కోర్టులకు, ప్రభుత్వాలకు వదిలిపెడితే ఈ అంశాలపై ఓ అవగాహనకు రావాల్సిన అవసరం వుంది.

విస్తృత అవగాహనకు కావల్సిన భూమిక 

అన్నింటికన్నా ముందుగా కావాల్సింది ప్రభుత్వం లో నాయకత్వం వహించే వారికి వీటిని పరిష్కరించాలనే చిత్తశుద్ధి , నిజాయితీ . అది లేకుండా ఓటు బ్యాంకు రాజకీయాలతో చూసేటట్లయితే ఇవి ఎప్పటికీ పరిష్కారం కావు. రెండోది, హిందువులు, ముస్లింల ప్రతినిధులలో తాము పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళు చందంలా కాకుండా పట్టువిడుపులు వుండటం. మూడోది , జాతీయ దృక్పధంతో , జాతిహితాన్ని దృష్టిలో పెట్టుకొని కఠిన నిర్ణయాలు తీసుకోగలగటం, వాటిని అమలు చేయగలగటం.

మోడీ 2019 లో తిరిగి ఎన్నికయ్యాడు. ఇప్పటికి ఒక సంవత్సరం గడిచింది. ఇంకా నాలుగు సంవత్సరాలు ఈ ప్రభుత్వమే వుంటుంది. కాబట్టి సమయం సరిపోతుంది. రెండోది , నాయకత్వానికి చిత్తశుద్ది, నిజాయితీ, దృఢ నిర్ణయాలు తీసుకోగల శక్తి . వీటిల్లో మోడీకి నూటికి నూరు మార్కులు వేయొచ్చు. కాబట్టి కావాల్సిన అర్హతలు సరిపోతున్నాయి. నాలుగు సంవత్సరాలు సమయం వుండటం , గట్టి నిర్ణయాలు చిత్తశుద్ధితో తీసుకునే నాయకత్వం వుండటం తో 72 సంవత్సరాల నుండి పేరుకుపోయిన ఈ చిక్కుముడిని విప్పటానికి ఇంతకన్నా మంచి అవకాశం వుండదు. అయితే ఇక్కడ వచ్చిన చిక్కల్లా ముస్లింలలో మోడీ పై అనుమానాలుండటం. ఇది చిన్న విషయమేమీ కాదు. దీనికి ప్రభుత్వ పెద్దగా మోడీనే చొరవ తీసుకొని ముస్లిం వర్గాల్లో సానుకూల వాతావరణం ఏర్పడే చర్యలు చేపట్టాలి. అంటే పాత ప్రభుత్వాల లాగా బుజ్జగింపు చర్యలో, సంతుష్టీకరణ చర్యలో చేయమని కాదు. తను ముస్లింలకి వ్యతిరేకం కాదనేది మరింత  ప్రజా సంబంధాల ద్వారా , విస్తృత సంప్రదింపుల ద్వారా తెలియజేసే కార్యక్రమం చేపట్టాలి. ఉదాహరణకు ముమ్మూరు తలాక్ ని రద్దుచేయటం, మహిళలు ఒంటరిగా హజ్ యాత్రకు వెళ్ళే సదుపాయం కల్పించటం , మదరసాలలో ఆధునిక విద్యను ప్రవేశపెట్టటం లాంటి ముస్లిం అనుకూల నిర్ణయాలు తీసుకున్నా మత చాందసుల ప్రచారం తో ముస్లిం వ్యతిరేకిగా ముద్రపడ్డాడు. తను తీసుకున్న సంక్షేమ పధకాలు కూడా అత్యంత పేదరికంలో మగ్గుతున్న పేద ముస్లిం ప్రజలకు ఉపయోగపడుతున్నాయి. తన ఆరు సంవత్సరాల పరిపాలనలో ముస్లిం వ్యతిరేక చర్య ఒక్కటి కూడా చేపట్టిన దాఖలాలు లేవు. అందరినీ కలుపుకెల్లే ప్రయత్నమే చేశాడు. లేనిపోని ఆరోపణలతో మత ఛందస వాదులు , మోడీ బద్ద వ్యతిరేకులు ప్రచారమే ఎక్కువగా జరిగింది. గో పరిరక్షణ పేరుతోనో, పుకార్ల మీద ఆధారపడి జరిగే mob lynching పైనో ఆధారపడి మోడీని ఇరికించటం ఎంతవరకు సబబు? ఇవి ఉత్తరాది లో ఎప్పటినుంచో వస్తున్న సామాజిక ఉద్రిక్తతలు. ఇటీవల జరిగిన డిల్లీ అల్లర్లలో ఇటు హిందువులు, అటు ముస్లిం లు అందరిపై కేసులు పెట్టటం హర్షించదగ్గ పరిణామం. ఎవరు తప్పుచేసినా చట్టం ముందు అందరూ సమానమేనని ఆచరణలో నిరూపించినప్పుడే ప్రజలు హర్షిస్తారు.

మోడీలో కొన్ని లోపాలున్నాయి. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు వెంటనే స్పందించకపోవటం. దానివలన అవతలివారు బురద చల్లే అవకాశాలు కల్పించినట్లవుతుంది. ఒక్క గో పరిరక్షణ వాదుల పేరుతో జరిగే హింస విషయం లోనే కాదు , హిందువుల కు సంబంధించి పాల్ఘార్ స్వామీజీ హత్య సమయంలో కూడా స్పందించలేదు. అయితే రెండోది హిందువులకు సంబంధించినది కావటం తో ఉదారవాదులు మోడీ పై బురదచల్లలేదు. ఈ సంఘటనలు రాష్ట్ర ప్రభుత్వ శాంతి భద్రతలకు సంబంధించినవయినా అపోహలు తలెత్తినప్పుడు స్పందిస్తే ప్రధానమంత్రి హామీ ఇచ్చాడనే సంతృప్తి ముస్లిం ప్రజల్లో వుంటుంది. ఇటువంటి చిన్న చిన్న చర్యలే విశ్వాసం పెరగటానికైనా, పోవటానికైనా కారణమవుతుంటాయి. రెండోది, రెచ్చగొట్టే ప్రకటనలు ఇచ్చే నాయకుల్ని కట్టడి చేయకపోవటం. అధికారం లో వున్నప్పుడు అందరినీ కలుపుకుపోయే చర్యలతో పాటు, కలుపుకుపోతున్నామనే భావన కూడా కల్పించాల్సిన అవసరం వుంది. ఇటువంటి ప్రకటనలు ఇచ్చే నాయకుల్ని హెచ్చరించటం, ఒకరిద్దరి పై క్రమశిక్షణా చర్యలు తీసుకొనివుంటే సామాన్య ముస్లిం ప్రజానీకంలో ఒక నమ్మకం ఏర్పడేది. ఈరోజు మనదేశానికే కాదు ప్రపంచ నాయకుల్లో ఒకడుగా మోడీ గుర్తింపు పొందాడు. ముస్లిం దేశాలతో కూడా తన హయాం లో సంబంధాలు మెరుగుపరిచిన ఘనత మోడీది. చాలామంది ముస్లిం పాలకులతో వ్యక్తిగత సంబంధాలు వున్నాయి. ఇంతటి గుడ్ విల్ సంపాదించినప్పుడు దేశంలోని ముస్లిం ప్రజానీకంలో కూడా గుడ్ విల్ సంపాదించుకొని వుండాల్సింది. ఆ విషయం లో వెనకబడి పోవటానికి కొన్ని చర్యలు తీసుకొనివున్నట్లయితే ఇంత అపనమ్మకం వచ్చేది కాదు. ఛాందస వాదులు ఎప్పుడూ మద్దత్తివ్వరు. కానీ సామాన్య ప్రజానీకంలో గుడ్ విల్ వచ్చివుండేది. ఇప్పటికైనా సమయం మించి పోయిందేమీలేదు. తన ప్రవర్తనతో , ప్రజా సంబంధాలు మెరుగు పరచుకోవటంతో ఈ గుడ్ విల్ ని పొందవచ్చు. మిగతా రాజకీయనాయకులు ముస్లిం ప్రజానీకానికి పెద్దగా ఒరగబెట్టిందేమీ లేదు, ఈయన ఒరగపెట్టందేమీ  లేదు. ఒకవిధంగా ముస్లిం మహిళలకు ఈయన హయాంలోనే కొంతయినా న్యాయం జరిగింది. తేడా అల్లా ప్రజా సంబంధలలోనే. ఆ విషయంలో మోడీ ప్రవర్తనలో మార్పు రావాలి. సున్నితమైన అంశాలపై తన అభిప్రాయాల్ని ఎప్పటికప్పుడు వ్యక్తపరిచినప్పుడే ఆ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా వుంటుంది.

హిందువులు దేశంలో 75 శాతం జనాభాతో పూర్తి మెజారిటీలో వున్నారు. అటువంటప్పుడు వారిమీద మరింత బాధ్యత వుంది. అందరినీ కలుపు కెల్ల గలిగితే సమాజం మొత్తం ప్రశాంతంగా వుంటుంది. ఇంతకుముందు హిందువులపై వివక్ష చూపింఛి , మిగతా మతస్తులకు పెద్దపీట వేసారనే భావం వుండటంతో అలా ప్రవర్తించారనుకున్నా ప్రస్తుతం అలా వివక్ష చూపించే ఆస్కారం లేనప్పుడు రెచ్చగొట్టే ప్రకటనలతో సాధించేదేమిటో తెలియదు. వివాదాస్పద అంశాలుంటే సావధానంగా వినే ప్రభుత్వముంది, సామరస్యపూర్వకంగా పరిష్కరించుకొనే వాతావరణాన్ని నెలకొల్పాల్సిన బాధ్యత మెజారిటీ వర్గంపై అధికంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. మైనారిటీలను కలుపుకొని వెళ్ళకుండా దేశం ఎలా పురోగతి చెందుతుందో ఒక్కసారి మెజారిటీ వర్గం ఆలోచించుకోవాలి. ప్రాచీనకాలం నుంచి హిందూ సమాజం అందరినీ , అన్ని భావాలను ఆదరించిందని చెప్పటమే కాదు ఇప్పుడు కూడా అదే ఒరవడి కొనసాగించాల్సిన అవసరం వుంది.

ముస్లిం ప్రజానీకం కూడా గుర్తుంచుకోవాల్సిన అంశాలు కొన్ని వున్నాయి. వెయ్యి సంవత్సరాలు ఈ దేశం లో పాలకులుగా వున్నారు. అయినా మెజారిటీ ప్రజానీకం ఇప్పటికీ హిందువులుగానే వున్నారు. అది ఈదేశ ప్రత్యేక పరిస్థితి. ఈరోజు 15 శాతం జనాభా తో వున్న దేశంలో  ఇస్లాం రాజ్యం స్థాపించాలనే వాదనలను,వాదులను దూరం పెట్టాల్సిన అవసరం వుంది. ఉదాహరణకు జాకీర్ నాయక్ లాంటి వారు  కొన్ని దశాబ్దాలు ఇస్లాం రాజ్యం స్థాపించాలని ప్రచారం చేస్తే ఎంతమంది ముస్లిం మేధావులు ఈ వాదనను ఖండించారు? ఇప్పుడుకూడా మత చాందస వాదులు ఇస్లాం రాజ్యమని , షరియత్ చట్టాన్ని అమలుచేస్తామని మాట్లాడుతుంటే ఎంతమంది ఖండించారు? ఈ వాదనలు భారత్ లో ఆచరణ సాధ్యం కాదని, మెజారిటీ మతస్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వున్నాయని గ్రహించి ఇటువంటివారిని దూరంపెట్టక పోతే నష్టపోయేది మైనారిటీ ప్రజలేకదా? ఆ విషయం మరిచిపోయి మత చాందస వాదుల భ్రమల్లో కొట్టుకుపోకూడదు కదా? 21వ శతాబ్దపు ఆలోచనలకు అనుగుణంగా ఇస్లాం సమాజం లో సంస్కరణలు రావాలని వుద్యమించాల్సింది పోయి ఈ చాందస వాదుల వెనకాల నడవటం తిరోగమన ఆలోచన కాదా? ఒక్కసారి ఆలోచించండి. అటు హిందువులు, ఇటు ముస్లింలు పట్టువిడుపులు విడనాడి కలిసి మెలిసి జీవనం సాగించాలంటే మొంకుపట్టు పట్టకుండా వుమ్మడి పౌర స్మృతి ని ఆమోదించటమే ఉత్తమం. అమెరికాలో, యూరప్ లో వుమ్మడి పౌర స్మృతి ని ఆమోదించి జీవనం సాగిస్తున్నప్పుడు భారత్ లో వచ్చిన అడ్డంకేమిటి? ఒక్కసారి ఆలోచించండి.

కార్యాచరణ ఎలా వుండాలి ?

ముందుగా ప్రభుత్వం విధానపరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు ( అవేమిటో పైన వివరించాము) వెంటనే తీసుకోవాలి. భారత రాజ్యాంగ సెక్యులర్ స్ఫూర్తి కి అనుగుణంగా ఈ నిర్ణయాలు వుండాలి. మతాన్ని రాజ్యంతో విడదీసే విధంగా నిర్ణయాలు వుండాలి. అప్పుడే ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది.

తర్వాత వివాదాస్పద అంశాలపై విస్తృత సంప్రదింపులు జరపాలి . దానికి అవసరమయితే సమయం పట్టినా ఓపికతో వేచిచూడాలి. అయితే అదివరకు ప్రభుత్వాలలాగా సమస్యను శాశ్వతంగా వాయిదా వేసే పద్దతిలో వుండకూడదు. ఇప్పటికే 72 సంవత్సరాలు వృధా అయ్యింది. వచ్చే నాలుగు సంవత్సరాల లోపు ఈ వివాదాస్పద అంశాలకు పరిష్కారం కనుక్కొనే కాల పరిమితి పెట్టుకోవాలి. విస్తృత సంప్రదింపుల్లో అన్నిరకాల అభిప్రాయాలు వ్యక్తపరిచే వాతావరణం కలిగించాలి. అన్ని మతస్తుల అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకోవాలి, హేతువాదుల అభిప్రాయాలతో సహా . ఒకసారి కాకుండా వారందరితో అనేక పర్యాయాలు సంప్రదింపులు కొనసాగించాలి. సాధ్యమైనవరకు అందరినీ ఒప్పించటానికి ఓపికతో ప్రయత్నం చేయాలి. అందుకు అన్నిరకాల మధ్యవర్తిత్వాన్ని ఉపయోగించుకోవాలి.

ప్రభుత్వం సర్వ సమ్మతితో నడుస్తుందనే భావన కలిగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై , ముఖ్యంగా మోడీపై వుంది. ఇది ఒక వర్గానికి వ్యతిరేకమనో, మరొక వర్గానికి అనుకూలమనో భావన రాకుండా నిస్పక్షపాతంగా విధాన నిర్ణయాలు తీసుకుంటుందనే భావన ప్రజల్లో వచ్చే విధంగా కార్యాచరణ వుండాలి. ఉదాహరణకు పౌరసత్వ సవరణ చట్టం పై కొంతమంది కిందిస్థాయి నాయకులు రెచ్చగొట్టే ప్రకటనలు , ఉపన్యాసాలు ఇవ్వటం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. అటువంటి సమయంలో అధికార పార్టీ నాయకత్వం స్పందించి వాటిని ఖండించి వుండాల్సింది. అలా చేయకపోవటం వలన నాయకత్వం కూడా పరోక్షంగా వారికి మద్దతిస్తుందనే భావన ముస్లిం ప్రజానీకం లో ఏర్పడటానికి దోహదపడింది. ఇకనైనా మోడీ ఈ విషయాల్లో దృష్టి పెట్టకపోతే సామాజిక ఐక్యతకు నష్టం జరుగుతుంది.

చివరగా ఈ విస్తృత సంప్రదింపుల ప్రక్రియ అనంతరం వీటన్నింటినీ సమీక్షించి నిర్ణయాలు తీసుకోవాలి. ఒకవైపు విభిన్న వర్గాల అభిప్రాయాలకు విలువ ఇస్తూనే సెక్యులర్ స్పూర్తితో రాజ్యాంగానికి లోబడి నిర్ణయాలు తీసుకోవాలి. దేశహితం, జాతీయ సమగ్రత , మనిషి ని మనిషిగా గౌరవించే సంబంధాల వృద్ధి  లక్ష్యంగా నిర్ణయాలు వుండాలి. ఏదో ఒక మతానికి అనుకూలంగానో కాకుండా మానవాభివృద్ధి ఏకైక లక్ష్యంగా ఈ నిర్ణయాలు వుండాలి. దీర్ఘకాలంలో మానవులందరూ మతాతీతంగా, లింగ సమానత్వం ప్రాతిపదికగా ఒకరినొకరు ప్రేమాభిమానాలతో కలిసి మెలిసి జీవించే విధంగా నిర్ణయాలు వుంటే భవిష్యత్తు తరాలు కలకాలం చరిత్రలో గుర్తుపెట్టుకుంటాయి. ఆ పని మోడీ చేయగలడని నమ్మకముంది. సమయమూ, అధికారమూ , అవకాశమూ తనకు అనుకూలంగా వున్నాయి. విశాల దృక్పధంతో ఈ ప్రక్రియను చేస్తాడని ఆశిద్దాము. గట్టి నాయకుడు, మెజారిటీతో నడిచే ప్రభుత్వం లేకుండా ఈ పని సాధ్యం కాదు. అందుకే అన్నీ అనుకూలంగా వున్న మోడీ ఈ పరిష్కారం చేసి ప్రజల మన్ననలు పొందుతాడని ఆశిద్దాం. నిర్ణయాలు దేశాహితాని దృష్టిలో పెట్టుకొని, అందరినీ కలుపుకెల్లే విధంగా ఉంటాయని ఆశిద్దాం. నిజమైన సెక్యులర్ సమాజం నిర్మాణం అవుతుందని అదే దేశాన్ని ప్రపంచం లో అగ్రగామిగా నిలబెడుతుందని ఆశిద్దాం.

72 సంవత్సరాల తర్వాత కూడా ప్రజలు మతాలు, కులాలు, వర్గాలు, ప్రాంతాలు పేరుతో విభజించబడటం చూసి ఆవేదనతో ఈ సమస్యను సమగ్రంగా, లోతుగా చర్చించి పరిష్కారమార్గాలు కనుక్కోవాలనే ఉద్దేశంతో చేసిన చిన్ని ప్రయత్నమే ఇది. హర్షిస్తారని ఆశిస్తూ సెలవు.

మీ రామ్

 

 

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కన్నన్ మృతి


2020 సంవత్సరం చిత్రసీమకు పెద్దగా కలిసిరావడం లేదు. కరోనాతో సినిమా షూటింగులు వాయిదా పడగా, థియేటర్లు మూతపడ్డాయి. దీంతో సినీ కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిని ఆదుకునేందుకు సెలబ్రెటీలు చేతనైనంత సాయం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది చిత్రసీమకు చెందిన పలువురు ప్రముఖులు మృతి చెందాడం విషాదంగా మారింది. శనివారం నాడు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ బి.కన్నన్(69) మృతి చెందాడం శోచనీయంగా మారింది.

కన్నన్ గత కొన్నిరోజులుగా గుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్నాడు. ఇటీవలే దీనికి ఆయన శస్త్రచికిత్స చేయించుకున్నారు. అయినప్పటికీ ఆరోగ్యం కుదటపడకపోవడంతో శనివారం చైన్నెలో మృతిచెందాడు. ఆయన మృతిపట్ల సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. కన్నన్ తెలుగులో ‘పగడాల పడవ’, ‘కొత్త జీవితాలు’, ‘సీతాకోక చిలుక’, ‘ఆరాధన’ మూవీలకు సినిమాటోగ్రర్ గా పని చేశారు. తమిళం, మలయాళంలో 50కిపైగా మూవీలకు సినిమాటోగ్రఫర్ గా పని చేశారు. ప్రముఖ దర్శకుడు భారతీరాజాతో కన్నన్ కు మంచి అనుబంధం ఉంది. భారతీరాజాతో కలిసి దాదాపు 40 సినిమాలకు కన్నన్ పని చేశారు.

కన్నన్ మృతిపై ప్రముఖ నటి ఖుష్బూ సోషల్ మీడియాలో స్పందించారు. ‘2020 సంవత్సరం ఏ మాత్రం బాలేదు.. మరో గొప్ప వ్యక్తి, ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కన్నన్‌ను కోల్పోయాం.. ‘కెప్టెన్‌ మగళ్‌’ సినిమా కోసం ఆయనతో కలిసి పనిచేశా.. భారతీరాజా సర్ పర్మనెంట్‌ కెమెరామెన్‌ ఆయన.. ఆయన కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలుపుతున్నా.. మిమ్మల్ని చాలా మిస్‌ అవుతున్నాం కన్నన్‌ సర్‌’ అని ఖుష్బూ ట్వీట్‌ చేశారు. కాగా శనివారం సాయంత్రం 6గంటలకు కన్నన్ పార్థివదేహాన్ని అల్వార్ పేటలోని ఆయన నివాసం వద్ద ఉంచుతారు. ఆదివారం అంత్యక్రియలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కన్నన్ కు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు.

సీనియర్ హీరోయిన్ కారులో భారీగా పట్టుబడిన మద్యం


సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కారులో భారీగా మద్యం పట్టుబడటం సంచలనంగా మారింది. ఈ సంఘటనలో రమ్యకృష్ణ కారు డ్రైవర్ సెల్వకుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ విషయంలో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ మారింది. రమ్యకృష్ణ కారులో మద్యం భారీగా పట్టుబడటంపై పలు అనుమానాలు రెకేత్తిస్తున్నాయి. అయితే దీనిపై రమ్యకృష్ణ ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం.

ట‌యోటా ఇన్నోవా క్రిస్టా(టీఎన్‌07క్యూ 0099) కారు రమ్యకృష్ణ పేరుపై రిజిస్టర్ అయినట్లు తెలుస్తోంది. కారు డ్రైవర్ సెల్వకుమార్ మహాబలిపురం నుంచి చెంగల్పట్టుకు వస్తుండగా పోలీసులు తనిఖీ చేపట్టారు. ఈక్రమంలో రమ్యకృష్ణ కారులో 96బీర్ బాటిళ్లు, ఎనిమిది ఫుల్ బాటిళ్ల మద్యం ఉన్నట్లు పోలీసులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు.

అయితే చెన్నైలో మద్యం లభించపోవడంతో పుదుచ్చేరి నుంచి మద్యం తెస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. దీంతో డ్రైవర్ సెల్వకుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సెల్వకుమార్ కు పోలీసులు బెయిల్ మంజూరు చేశారు. రమ్యకృష్ణ కారులో భారీగా మద్యం దొరకడంపై ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

దేవదాసిగా మారనున్న హాట్ యాంకర్ !


బుల్లితెర నుండి వెండితెర మీదికి ఎంట్రీ ఇచ్చిన హాట్ యాంకర్ అనసూయ ‘రంగస్థలం’ సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా తర్వాత ఆమెకు చాలానే ఆఫర్లు వచ్చినా అమ్మడు ఆచితూచి పాత్రల్ని ఎంచుకుంటోంది. ప్రధానంగా లేడీ ఒరియెంటెడ్ కథల్ని, ప్రత్యేకత, కథలో ప్రాధాన్యం కలిగిన పాత్రల్ని మాత్రమే చూజ్ చేసుకుంటూ వస్తోన్న అనసూయకు కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ సినిమాలో ఆఫర్ వచ్చిన సంగతి తెలిసిందే.

తన ఫేవరెట్ దర్శకుడు కృష్ణవంశీ నుండి ఆఫర్ అందుకున్న అనసూయ ఆయన చెప్పిన పాత్ర కథలో కీలకంగా ఉండటంతో వెంటనే ఓకే చెప్పేసిందట. కాగా ఈ సినిమాలో అనసూయ పాత్ర విషయానికి వస్తే… దేవదాసిగా నటిస్తోందట. అంటే గుడిలోని దేవుడి ఉత్సవాలలో నాట్య సేవ చేస్తూ జీవితాంతం అవివాహిత గానే ఉండే స్త్రీ పాత్రలో అనసూయ నటిస్తోందట. అలాగే సినిమాలో సీన్స్ కి అనుగుణంగా ఓ ప్రత్యేక సాంగ్ లో కూడా అనసూయ నటించాల్సి ఉంటుందట.

కాగా ఒరిజినల్ వెర్షన్ లో నానా పటేకర్ పోషించిన పాత్రను ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ చేస్తుండగా.. ఇక ప్రకాష్ రాజ్ సరసన రమ్యకృష్ణ నటిస్తోంది. కృష్ణవంశీ దాదాపు 20 సంవత్సరాల తరువాత తన సతీమణిని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమాని అభిషేక్ అండ్ మధు నిర్మిస్తున్నారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ‘కృష్ణ వంశీ’ సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేకపోతున్నాయి. మరి ఈ సినిమాతోనైనా మళ్ళీ కృష్ణవంశీ ఫామ్ లోకి వస్తారేమో చూడాలి.

రైతు రాజ్యామా? ఈ లెక్కలేంటి కేసీఆర్ సార్.?


తనది రైతు రాజ్యమని కేసీఆర్ గొప్పగా చెప్పుకొన్నాడు. మొన్నటి ప్రెస్ మీట్ లో ప్రశ్నించిన విలేకరులతో ‘తెలంగాణలో ఏ రైతైనా రోడ్డెక్కుతడా.. దేశంలోనే రైతులకు అన్ని సమకూర్చిన రాజ్యం తెలంగాణ’ అని ఘనంగా చాటాడు. అయితే కేసీఆర్ ఎంత ధీమాగా చెబుతున్నా క్షేత్రస్థాయి పరిస్థితి మాత్రం అంత ఆశాజనకంగా లేదని తెలుస్తోంది.

పంటనష్టం, అప్పుల బాధతో తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని సంస్కరణలు తీసుకువచ్చినా దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదని ఓ కఠిన వాస్తవం బయటపడింది.

తెలంగాణలో ఈ ఏడాది ఇప్పటిదాకా దాదాపు 85మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని రైతు స్వరాజ్య వేదిక సంచలన నివేదికను వెల్లడించింది. పంట నష్టం, అప్పుల భారంతోనే వీరు ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపింది.

బీ.కొండల్ రెడ్డి నిర్వహించిన ‘ఆర్ఎస్వీ’ నివేదికలో ఆదిలాబాద్, మెదక్, నల్గొండ, భూపాలపల్లి జిల్లాల్లో అత్యధిక రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని తెలిపింది. అంతేకాదు.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన నాటి నుంచి తెలంగాణలో దాదాపు ఈ ఆరేళ్లలో 4600 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని సర్వే తెలిపింది. వారిలో పత్తి రైతులే ఎక్కువమంది ఉన్నారు.అయితే ఈ ఆర్ఎస్వీ నివేదికపై స్ట్రేట్ క్రైం బ్యూరో ఇంతవరకు ఎటువంటి నివేదిక విడుదల చేయలేదు. ఆర్ఎస్వీ నివేదికపై వారు స్పందించలేదు.

ఇలా తెలంగాణలో ప్రతి జిల్లాల్లోనూ ఆత్మహత్యలు జరిగినట్టు ఓ నివేదిక సంచలనం రేపుతోంది.కేసీఆర్ మాత్రం తెలంగాణను రైతు రాజ్యం అభివర్ణించి చాలా వసతులు పథకాలు పెట్టారు. మరి కేసీఆర్ మాటలకు.. ఈ లెక్కలకు పొంతన లేకపోవడమే అందరిలోనూ అనుమానాలకు కారణమవుతోంది.

ఇది చాలు.. టీడీపీ, జనసేన వేర్వేరు అని చెప్పడానికి..!


తెలుగుదేశం శాసనసభ్యుడు అచ్చెన్నాయుడు అరెస్టుపై జనసేన స్పందన చూస్తుంటే.. ఆ పార్టీ టీడీపీకి మద్దతు కాదని చెప్పడానికే అన్నట్లు తెలుస్తుంది. అచ్చెన్నాయుడు అరెస్ట్ అవినీతికి పాల్పడినందుకా? లేదా రాజకీయ కక్ష సాధింపు కోసమా అనే విషయంలో జగన్ ప్రభుత్వం తన చిత్తశుద్దిని నిరూపించుకోవాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. అవినీతి ఏ రూపంలో ఉన్నా.. దానికి బాధ్యులు ఎంతటి వారైనా జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అయితే అసెంబ్లీ సమావేశాలకు నాలుగైదు రోజుల ముందు అచ్చెన్నాయుడు అరెస్టు చేయడం సందేహాలకు తావిస్తోంది.

అదే విధంగా ఒక శాసనసభ్యుడిని అరెస్ట్ చేసే ముందు రాజ్యాంగ నియమ నిబంధనలను పాటించవలసిన అవసరం ప్రభుత్వంపై ఉంది. అచ్చెన్నాయుడు అరెస్టులో అవి లోపించినట్లు కనిపిస్తున్నాయి. ఈ.ఎస్.ఐ.లో జరిగిన అవకతవకలతోపాటు ఇప్పటి వరకు జరిగిన అన్ని అక్రమాలపై దర్యాప్తు జరిపించాలని జనసేన డిమాండ్ చేస్తోందని నాదెండ్ల మనోహర్ తెలిపారు.

రాజమౌళి కోసం సీన్స్ రాసిన టాలెంటెడ్ డైరెక్టర్ !


విజువల్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తుతం షూటింగ్ కి రెడీ అవుతొంది. కాగా ఈ సినిమాకు రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. అయితే సినిమాలో డైలాగ్ లు చాలా బాగుంటాయని.. సినిమాలో ప్రధాన హైలెట్స్ లో డైలాగ్ లు కూడా హైలెట్ అవ్వనున్నాయని తెలుస్తోంది. మెయిన్ గా తెలంగాణ యాసలో ఎన్టీఆర్ పలికే డైలాగ్ లు చాలా కొత్తగా ఉంటాయట. రాజమౌళి తన సినిమాల్లో విజువల్స్ ని తప్ప.. డైలాగ్ లను పెద్దగా నమ్ముకొరు. కానీ ఈ చిత్రంలో రాజమౌళి డైలాగ్ లకి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారట.

కాగా సాయిమాధవ్ చేత మూడు వెర్షన్స్ రాపించారట. అయినా కొన్ని సన్నివేశాల్లో రాజమౌళి డైలాగ్స్ విషయంలో సంతృప్తి పడలేదని అందుకే తనకు మాటల సాయం అందించే టాలెంటెడ్ డైరెక్టర్ దేవ కట్టాతో కూడా ఆ సన్నివేశాల వరకూ మళ్ళీ రాపించాడని తెలుస్తోంది. దేవ కట్టా ‘బాహుబలి 2’లో కూడా కీలక సన్నివేశాలకు డైలాగ్స్ రాసిన సంగతి తెలిసిందే. అలాగే ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’కి కూడా కీలక సీన్స్ వరికి రాశాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ధృడంగా ఉండే కొమరం భీం పాత్రలో కనిపించేందుకు ఎన్టీఆర్ కఠినమైన కసరత్తులు కూడా చేశాడు.

కాగా సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, శ్రీయా, సముద్రఖని నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు. 2021 లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కాగా ‘బాహుబలి’ తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం, ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి.

కరోనా బారినపడ్డ విధ్వంసకర బ్యాట్స్ మెన్!


చైనాలోని వూహాన్లో సోకిన కరోనా వైరస్ క్రమంగా అన్నిదేశాలకు పాకింది. ప్రపంచంలోని అన్నిదేశాల్లో కరోనా విజృంభిస్తోంది. అమెరికా, ఇటలీ, బ్రిటన్, యూకే, భారత్, పాకిస్థాన్ తదితర దేశాల్లో కరోనా పంజా విసురుతోంది. తాజాగా భారత్ 3లక్షల కరోనా కేసుల మార్కును దాటేసింది. భారత్-చైనాలతో సరిహద్దును పంచుకుంటున్న పాకిస్థాన్ లో కరోనా కేసులు రోజుకు విజృంభిస్తుంది. దీంతో ప్రజలందరూ భయాందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే పాకిస్థాన్ క్రికెటర్లు వరుసగా కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తుంది. కరోనాతో పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు జాఫర్ సర్ఫరాజ్, రియాజ్ షేక్ ఇప్పటికే మృత్యువాత పడిన సంగతి తెల్సిందే.

తాజాగా మరో క్రికెటర్ కరోనా బారినపడ్డారు. పాకిస్థాన్ కెప్టెన్, మాజీ కెప్టెన్ గా ఆ జట్టుకు సేవలందించిన అఫ్రిది కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆఫ్రిదినే స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేశాడు. గత గురువారం నుంచి ఆరోగ్యం బాగోలేకపోవడంతో టెస్టులు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలిందని ఆఫ్రిది తన ట్వీటర్లో ట్వీట్ చేశాడు.

ఆఫిద్రి క్రికెట్లో విధ్వంసకర బ్యాట్స్ మెన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 16ఏళ్ల వయస్సులోనే ఆఫ్రిది అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు 27 టెస్టులు, 398వన్డేలు, 99టీ20 మ్యాచ్‌లాడాడు. 2011వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టుని కెప్టెన్‌గా వ్యవహరించాడు. క్రికెట్లో పలు రికార్డులు ఆఫ్రిది పేరిట ఉన్నాయి. అంతేకాకుండా పాకిస్థాన్లో ఎన్నో సేవా కార్యక్రమాల్లో తనవంతు సహకారం అందిస్తుంటాడు. ఆఫ్రిది కరోనా బారినపడటంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

హీరోయిన్ని వెతికే పనిలో ఉన్నారట !


యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ చందు మొండేటి డైరెక్షన్ లో యంగ్ హీరో నిఖిల్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా ‘కార్తికేయ – 2 ‘ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. అయితే అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమా నుండి తప్పుకుందట. దాంతో చిత్రబృందం ఈ సినిమా హీరోయిన్ గా ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో హిట్ అందుకున్న శృతి శర్మను తీసుకున్నట్లు ఇటివలే వార్తలు వచ్చాయి. తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం నిఖిల్ సరసన హీరోయిన్ గా శృతి శర్మను ఫైనల్ చేయలేదట.

ఈ వార్తలు కేవలం రూమర్స్ అని తెలుస్తోంది. చిత్రబృందం ఇంకా హీరోయిన్ని వెతికే పనిలో ఉందట. ఇప్పటికే పుర్తయిన ఈ సినిమా స్క్రిప్ట్ లో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అలాగే ఓ కొత్త కాస్పెక్ట్ హైలెట్ అవునున్నాయట. ఎలాగు ‘కార్తికేయ’ సినిమాతోనే డైరెక్టర్ గా మంచి డిమాండ్ తెచ్చుకున్న చందు.. మళ్ళీ నిఖిల్ తో ‘కార్తికేయ 2’ తీసి… తిరిగి మళ్ళీ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.

ఈ చిత్రాన్ని ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ఆగష్టు రెండో వారం నుండి మొదలెట్టనున్నారు.

టిఆర్ఎస్ నేతకు కరోనా పాజిటివ్!


రాష్ట్రంలో టిఆర్ఎస్ నేతకు కరోనా పాజిటివ్ అని తేలింది. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కరోనా వైరస్ సోకినట్లు సమాచారం. ఆయనకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్ అని వచ్చిందని వైద్యులు వెల్లడిచారు.

నిజానికి ఆయన గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ లక్షణాలతో బాధపడుతూ వచ్చారు. దీంతో కరోనా టెస్ట్ చేయించుకోగా, అది పాజిటివ్ అని తేలిందని వైద్యులు ప్రకటించారు.

ఇతర రాష్ట్రాల్లో పలువురు ప్రజాప్రతినిధులు కోవిడ్-19 బారిన పడినప్పటికీ తెలంగాణలో మాత్రం అలాంటి సంఘటనలు జరగలేదు. మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి కరోనా బారిన పడి విజయవంతంగా కోలుకున్నారు.

అయితే, తమిళనాడు రాష్ట్రంలో మాత్రం విపక్ష డీఎంకేకు చెందిన చెప్పాక్కం నియోజకవర్గ ఎమ్మెల్యే జె. అన్బళగన్ కరోనా వైరస్ సోకి కన్నుమూసిన విషయం తెల్సిందే. దేశంలో కోవిడ్ వైరస్ సోకి చనిపోయిన తొలి ప్రజా ప్రతినిధి ఈయనే.

సీఎం జగన్ వేట.. కదిలొస్తున్న చంద్రబాబు


కరోనా రాకతో రెండు నెలలపాటు పక్కరాష్ట్రంలోని జూబ్లీహిల్స్ లోని తన సొంతింట్లో కడుపులో చల్ల కదలకుండా ఉన్న ఏపీ ప్రతిపక్ష నేత ఎట్టకేలకు లాక్ డౌన్ సడలింపులతో ఏపీకి వచ్చారు. కొద్దిరోజులు హడావుడి చేసి మళ్లీ హైదరాబాద్ లోని తన నివాసానికి కొడుకు లోకేష్ తో సహా వెళ్లిపోయాడు. హైదరాబాద్ వెళ్లిన చంద్రబాబును ప్రశాంతంగా ఉండనీయడం లేదు జగన్. తాజాగా మళ్లీ అమరావతి నివాసానికి చంద్రబాబును రప్పించేలా చేస్తున్నాడు.

ఏపీ సీఎం జగన్ టీడీపీ నేతలను వేటాడేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండగా తనను ముప్పుతిప్పలు పెట్టిన వారిని ఏరేస్తున్నారు. తాజాగా వైఎస్ జగన్ సర్కార్ టీడీపీ ముఖ్య నాయకులను ఒకేరోజు అరెస్ట్ చేయడం కలకలం రేపింది. ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడు, జేసీ ట్రావెల్స్ మోసంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో మీడియా ఫోకస్ అంతా టీడీపీపై పడింది. టీడీపీ నేతలు, శ్రేణులంతా షాక్ కు గురై ఆందోళనలో ఉన్నారు.

ఇద్దరు దిగ్గజ టీడీపీ నేతల అరెస్ట్ టీడీపీ నాయకులు, క్యాడర్ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నందున హైదరాబాద్ నుంచి టీడీపీ కార్యకలాపాలను కొనసాగిస్తున్న చంద్రబాబు ఇక ఇక్కడి నుంచి నిర్వహించలేమని గ్రహించినట్టు తెలిసింది. ఏపీకి రాక తప్పని పరిస్థితిని జగన్ కల్పించారని అర్థమవుతోంది. దీంతో ఈ మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి అమరావతికి బయలుదేరారు. సాయంత్రం 4 గంటలకు అమరావతికి చంద్రబాబు చేరుకుంటారు.

14 రోజుల రిమాండ్ తో జైలు పాలై..గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అచ్చెన్నాయుడును చంద్రబాబు పరామర్శించే అవకాశం ఉంది. ఈ మేరకు విజయవాడ జైలు సూపరింటెండెంట్, జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ ను చంద్రబాబు అనుమతి కోరారు.

ఇక చంద్రబాబు కుమారుడు నారాలోకేష్ అనంతపురం బయలు దేరాడు.టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబసభ్యులను లోకేష్ పరామర్శించనున్నాడు. అనంతపురంలో జేసీ అరెస్ట్ కు నిరసనగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు సమాచారం.

ఇలా తండ్రీకొడుకులు చంద్రబాబు-లోకేష్ లు హైదరాబాద్ లో ఉండి ఏపీలో పార్టీ కార్యక్రమాలు ఇన్నాళ్లు పర్యవేక్షించారు. కానీ నేడు ఇద్దరు టీడీపీ నేతల అరెస్ట్ తో వారిని వైఎస్ జగన్ సొంత రాష్ట్రానికి రప్పిస్తుండడం విశేషంగా మారింది.

అచ్చెన్నాయుడు ఆరోగ్యంపై వైద్యులు ఏమన్నారంటే..!


ఇఎస్ఐ కేసులో ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని అనారోగ్య కారణాల దృష్ట్యా ఈ రోజు ఉదయం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోని మొదటి అంతస్తులో ఉన్న వార్డులో ఒక గదిలో ఆయనను ఉంచారు. ఆసుపత్రి వైద్యుల బృందం ఆయనను పరీక్షించారు. పరీక్షల అనంతరం ప్రస్తుతం అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వెల్లడించారు.

ఆయనకు ఈ నెల 11వ తేదీ తేలికపాటి శస్త్ర చికిత్స జరిగిందని, మరుసటి రోజే శ్రీకాకుళం నుంచి విజయవాడ ప్రయాణం చేయడం వల్ల చిన్న గాయం అయ్యిందని గుంటూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ సుధాకర్‌ తెలిపారు. రెండు లేదా మూడు రోజుల్లో గాయం నయమయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఎక్కువసేపు ప్రయాణం వల్ల గాయం కాస్త పెరిగిందని తెలిపారు. ఇన్‌ఫెక్షన్‌ పెద్దదైతే మరోసారి ఆపరేషన్‌ చేయాల్సి రావొచ్చని అన్నారు. 90 శాతం మేరకు మళ్లీ ఆపరేషన్‌ అవసరం లేదని చెప్పారు.

అయితే, ఇప్పుడే చెప్పడం కుదరదని, నొప్పి తగ్గడానికి రెండు, మూడు రోజులు సమయం పడుతుంది. పూర్తిగా కోలుకోడానికి కొన్ని రోజులు పట్టొచ్చని అన్నారు. ప్రస్తుతం ఆయనకు విశ్రాంతి అవసరమని అందుకు అవసరమైన ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

మరోవైపు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుణ్ని పరామర్శించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ జైళ్ల శాఖ ఐజికి అనుమతి కొరకు దరఖాస్తు చేశారు. దరఖాస్తులను పరిశీలించిన జైళ్ల శాఖ ఐజి అనుమతి నిరాకరించారు. కరోనా నిబంధనలు కారణంగా అనుమతి ఇవ్వలేమని చెప్పారు. రెండు నెలలుగా ఖైదీలను కలిసేందుకు ఎవ్వరికీ అనుమతి ఇవ్వడం లేదని స్పష్టం చేశారు.

చాలా మంది బెడ్‌ రూమ్‌కు రమ్మన్నారు..


సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి తెలిసిందే. భాష, ప్రాంతంతో తేడాలేకుండా అన్ని చోట్లా ఈ పాడు సంస్కృతి ఉంది. హాలీవుడ్‌ నుంచి టాలీవుడ్ వరకు.. అవకాశాల పేరుతో లైంగిక వాంఛ తీర్చుకునే వాళ్లు ఉన్నారు. దీనిపై ‘మీ టూ’ పేరుతో అప్పట్లో పెద్ద ఉద్యమమే జరిగింది. లైంగిక వేధింపులు ఎదుర్కొన్నామని చాలా మంది ప్రముఖ హీరోయిన్లు ప్రకటించారు. దాంతో, హాలీవుడ్, బాలీవుడ్‌తో పాటు అనేక భాషల దర్శక, నిర్మాతలు, హీరోలు, సాంకేతిక నిపుణుల దుర్భుద్ధి బట్టబయలైంది. క్యాస్టింగ్‌ కౌచ్‌ పై పలువురు తెలుగు హీరోయిన్లు సైతం గళం విప్పారు. శ్రీరెడ్డి, మాధవీలత తదితరులు దీనిపై పోరాడారు.

తాజాగా బిగ్‌బాస్ ఫేమ్, హీరోయిన్ తేజస్వి కాస్టింగ్ కౌచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. తన తాజా చిత్రం ‘కమిట్‌మెంట్’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన ఆమె తాను కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని తెలిపింది. సినీ పరిశ్రమలో 90 శాతం కాస్టింగ్ కౌచ్ ఉందని, కమిట్‌మెంట్ పేరుతో కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే హీరోయిన్స్‌ని లైంగికంగా లొంగదీసుకుంటున్నారంది. అలా కమిట్‌మెంట్లకు ఒప్పుకున్న వాళ్లకే అవకాశాలు ఇస్తారని షాకింగ్ విషయాలు బయటపెట్టింది. తనను కూడా చాలా మంది బెడ్‌ రూమ్‌కు పిలిచారని.. అందుకు ఒప్పుకోకపోవడం వల్లే కెరీర్లో తగిన సక్సెస్ సాధించేకపోయానని వెల్లడింది. అంతేకాదు తనకు తెలిసిన హీరోయిన్లలో చాలా మందికి ఇలాంటి చేదు అనుభవాలే ఉన్నాయని చెప్పింది. అయితే, ఇలాంటి అనుభవాలను బయటకు చెప్పేందుకు వాళ్లు ముందుకు రావడం లేదని తెలిపింది.

ముంబై హీరోయిన్లు అన్నింటికీ రెడీ
ముంబై నుంచి టాలీవుడ్‌కు దిగుమతి అవుతున్న హీరోయిన్లు దేనికైనా సిద్ధపడే వస్తున్నారని తేజస్వి చెప్పింది. వాళ్లు కమిట్ మెంట్లకు సిద్ధంగా ఉంటారు కాబట్టే ఎక్కువ అవకాశాలు లభిస్తున్నాయని కుండబద్దలు కొట్టింది. బెడ్‌ రూమ్‌కు వస్తామంటే బ్రేక్‌ ఇచ్చేందుకు టాలీవుడ్‌లో చాలా మంది ఉన్నారని చెప్పింది. అలాంటి వాళ్లను దాటి వెళ్తేనే అసలైన సినిమా వాళ్ళు కనిపిస్తారని తెలిపింది. కానీ, ముంబై నుంచి వస్తున్న హీరోయిన్లు కమిట్‌మెంట్స్‌కు ఒప్పుకోవడం వల్లే తెలుగు అమ్మాయిలకు కూడా చెడ్డపేరు వస్తోందని తేజస్వి వాపోయింది. గతంలో తాను ఒక అబ్బాయిని ప్రేమించానని, పెళ్లికి కూడా సిద్ధమయ్యామని చెప్పిన యువ నటి.. కాస్టింగ్‌ కౌచ్‌ అంశం కారణంగానే ఇద్దరం విడిపోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో ఓ బాలీవుడ్‌ వెబ్‌ సిరీస్‌లో తనకు ఆఫర్ వచ్చిందని తేజస్వి తెలిపింది. నవాజుద్దీన్ సిద్దిఖీ నటించిన ఆ సిరీస్‌లో తాను నగ్నంగా నటించాల్సి ఉంటుందని చెప్పారంది. అది ఇషం లేక ఆ ఆఫర్ వదులుకున్నానని తెలిపింది.

అచ్చెన్న, జేసీ ఔట్.. నెక్ట్స్ ఇతడే!


టీడీపీకి బలమైన నేతలుగా ఉన్న అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డిలను వైసీపీ ప్రభుత్వం విజయవంతంగా మూసేసింది. ఇప్పుడు నెక్ట్స్ వైసీపీ ప్రభుత్వం టార్గెట్ ఎవరు? ఎవరు? అని ఆరాతీస్తుంటే అడ్డంగా బుక్కయ్యారట.. మన టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు. తాజాగా వెతకబోయే తీగ కాలికి తగిలినట్టు యనమల రామకృష్ణుడి మీద ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో ఆయనను మూసేసేందుకు వైసీపీ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది.

టీడీపీలో సీనియర్ నేతలు, కీరోల్ పోషించే ఇద్దరు మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చిన్నరాజప్పలపై తాజాగా ఒక దళిత మహిళ తూర్పుగోదావరి ఎస్పీకి ఫిర్యాదు చేసింది. తన భర్తకు వేరే మహిళను ఇచ్చి వివాహం చేసేందుకు యనమల, చిన్నరాజప్ప ప్రయత్నించారని.. తనను కలవనీయకుండా అడ్డుకున్నారని ఆమె ఆరోపించారు.

దళిత మహిళ ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ లో యనమల, చిన్నరాజప్పపై స్ట్రాంగ్ కేసు పెట్టింది.

తన భర్త రాధాకృష్ణతో అనంత లక్ష్మీ అనే మహిళ రెండో పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించిందని.. ఇద్దరు మాజీ మంత్రులు యనమల, చిన్నరాజప్పలు ఆమెకు సహాయం చేశారని ఆమె ఫిర్యాదు చేసింది. అనంతలక్ష్మిని అడ్డుకొని తన భర్తను తన దరికి చేర్చాలని ఆమె డిమాండ్ చేస్తోంది.

ఇప్పటికే అచ్చెన్నాయుడు అరెస్ట్ ను బీసీలపై దాడిగా టీడీపీ ఫోకస్ చేసింది. ఇప్పుడు దళిత మహిళ స్వయంగా టీడీపీ నేతలపై కేసులు పెట్టడం.. వైసీపీ ప్రభుత్వం వారి అరెస్ట్ కు సిద్ధం అవుతోందన్న ప్రచారం నేపథ్యంలో ఈ కోణాన్ని టీడీపీ ఎలా మెయింటేన్ చేస్తుందన్నది ఆసక్తిగా మారింది.

జీహెచ్ఎంసీలో సంపూర్ణ లాక్డౌన్.. క్లారిటీ ఇచ్చిన మంత్రి!


రాష్ట్రంలో కరోనా మహమ్మరి రోజురోజుకు విజృంభిస్తున్న సంగతి తెల్సిందే. గడిచిన పదిరోజులుగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య భారీగా నమోదవుతున్నాయి. ఇందులో ఎక్కవుగా జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదవుతున్నాయి. అయితే ఇటీవల రాష్ట్రంలో లాక్డౌన్లో భారీగా సడలింపులు ఇవ్వడంతో ఇతర జిల్లాల్లోనే కేసుల సంఖ్య క్రమంగా పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తుంది. శుక్రవారం నాటికి తెలంగాణలో కేసుల సంఖ్య 4,484కు చేరింది. వీరిలో 449మంది విదేశీయులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు ఉన్నారు. వీరిలో 2,278మంది వైరస్ నుంచి కోలుకోగా 2,278మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇదిలా ఉంటే హైదరాబాద్ మహానగరంలో సంపూర్ణ లాక్డౌన్ విధిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మంత్రి తలసాని ఓ టీవీ ఛానల్లో జీహెచ్ఎంసీలో సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించనున్నారని చెప్పినట్లు న్యూస్ రావడంతో ఇది వైరల్ అయింది. రాష్ట్రంలో కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండటంతో తెలంగాణలో మరోసారి పూర్తిస్థాయిలో లాక్డౌన్ ఉంటుందని.. రెండు మూడు రోజుల్లో సీఎం కేసీఆర్ దీనిపై నిర్ణయం తీసుకోనున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వయంగా చెప్పినట్లు ప్రచారం జరిగింది. ఈ ప్రచారంపై మంత్రి తలసాని స్పందించారు.

రాష్ట్రంలో సంపూర్ణ లాక్డౌన్ ఉంటుందని తాను చెప్పినట్లు ప్రచారం అవుతున్న వార్తలో నిజం లేదని చెప్పారు. సంపూర్ణ లాక్డౌన్ ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఇదిలా ఉంటే శుక్రవారం కూడా భారీగానే కేసులు నమోదయ్యాయి. కొత్తగా 164 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కేసులు సంఖ్య పెరుగుతుండటంతో నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో సంపూర్ణ లాక్డౌన్ అమలు చేయాలని నగరవాసులు కోరుతున్నారు. ప్రస్తుతం దేశంలో, రాష్ట్రాల్లో కరోనా సహజీవనం అనే కొత్త స్లోగన్ నడుస్తుండటంతో రాష్ట్రంలో లాక్డౌన్ అమలు చేయకపోవచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.