Home Blog Page 8436

‘కరోనా’ ఉన్నా.. ‘బాలయ్య’ షూటింగ్ అక్కడే !


కరోనా మహమ్మారి దెబ్బకు మొదలైన సీరియల్ షూటింగ్ లు మళ్ళీ దేశవ్యాప్తంగా స్తంభించిపోయే పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి సినీ లోకం నానా కష్టాలు పడాల్సి వస్తోంది. కాగా బాలయ్య – బోయపాటి సినిమాలో ఓ ముఖ్యమైన సీక్వెన్స్ ను వారణాసి మరియు హిమాలయాలలో విస్తృతంగా షూట్ చేయాల్సి ఉందని.. ఆ సీక్వెన్స్ లు కథకు చాలా కీలకమైనవి అని ఇటివలే మేము రివీల్ చేసిన సంగతి తెలిసిందే.

నిమ్మగడ్డ నిజాయితీపై నీలినీడలు

అందుకే ఎట్టి పరిస్థితుల్లో అక్కడే షూట్ చేయటానికి బోయపాటి ప్లాన్ చేస్తున్నాడట. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడ షూటింగ్ చేయడం అసాధ్యం. అందుకే బోయపాటి ముందుగా వేరే సీన్స్ ను ఆగష్టు నుండి ప్లాన్ చేసి.. నవంబర్ నుండి వారణాసి మరియు హిమాలయాల సీన్స్ ను షూట్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారట.

చంద్రబాబు కోటరీ బీజేపీని దెబ్బతీస్తుందా?

ఏది ఏమైనా కరోనా ఎఫెక్ట్ బాలయ్య సినిమా పై బాగానే పడినట్టు కనిపిస్తోంది. కరోనా లేకపోయి ఉండి ఉంటే ఇప్పటికే బాలయ్య చాల భాగం షూటింగ్ ను పూర్తి చేసేవాడు. ఇక ఈ సినిమాతో ఓ కొత్త హీరోయిన్ ను పరిచయం చేయబోతున్నారు. ఆ హీరోయిన్ ఎలా ఉండబోతుందో.. బాలయ్యకు ఎలా సూట్ అవుతుందో చూడాలి.

ఇక తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. బాలకృష్ణకు ‘సింహ’ రూపంలో ఆ తర్వాత దాన్ని మించి ‘లెజెండ్’ రూపంలో మరో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి ఈసారి ‘లెజెండ్’ను మించిన హిట్ ఇస్తాడని బాలయ్య ఫ్యాన్స్ ఆశ పడుతున్నారు. మరి హిట్ వస్తోందా !

భారతీయులకు గుణపాఠం చెప్పిన ట్రంప్


ఏదైనా ఓ స్థాయి వరకు చేస్తే అది అందరికీ మంచిది. వ్యాపారం కోసమో.. ఉద్యోగాల కోసమో ఒక దేశం వెళ్లి బుద్దిగా పనిచేసుకుంటే ఎవరూ కాదనరు. కానీ వారినే శాసించాలనుకుంటే పరిస్థితి ఇలానే తిరగబడుతుంది. అమెరికాలో ఇప్పుడు భారతీయులు సహా విదేశీయులకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తలుపులు మూసేశాడు. వీసాలను నిషేధించి అమెరికా ఆశలు పెంచుకున్న భారతీయుల కలలు కల్లలు చేశాడు.

ప్రపంచంలోనే టెక్నాలజీ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, గూగుల్ కు సీఈవోలు మన భారతీయులు. అందుకే ట్రంప్ వలసలు నిషేధించగానే గూగుల్ సీఈవో ఖండించారు. ట్రంప్ నిషేధించినా తాము నిపుణులైన వలసవాదులకు ఖచ్చితంగా ఉద్యోగాలిస్తామని.. వలసలతోనే అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇంతలా ఎదిగిందన్నారు. నిజానికి ఈ మాటలు అమెరికన్లకు రుచించలేదు. ఆయన అమెరికన్ లా వారి కోణంలో ఆలోచించలేదు.

చైనాతో ఫైట్.. మోడీనే సరైనోడా?

అమెరికా ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. కరోనా, ఆర్థిక మాంద్యంతో కునారిల్లుతోంది. అందుకే పెరిగిన నిరుద్యోగం అరికట్టడానికి ఇప్పటికే ఉద్యోగాలు కోల్పోయిన 4 కోట్ల మందికి వాటిని ఇవ్వడానికి ట్రంప్ వలసలను నిషేధించారని అంటున్నారు. హెచ్1బీతో పాటు విదేశీ వర్క్ వీసాలను ఈ ఏడాది చివరి వరకూ ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసింది. తాజాగా నిర్ణయంతో కొత్తగా 5.25 లక్షల మంది అమెరికన్లకు తక్షణం ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని వైట్ హౌస్ తెలిపింది.

ట్రంప్ నిర్ణయాన్ని కార్పొరేట్ కంపెనీలు, ప్రతిపక్షాలు, ప్రజాప్రతినిధులు, వ్యాపార, వాణిజ్య సంఘాలు తప్పుపట్టాయి. ఎందుకంటే అమెరికన్లు తక్కువ జీతాలకు, కష్టమైన పనులు చేయరు. విదేశీయులైన భారత్, చైనా వారు తక్కువ జీతాలకు ఎక్కువ పనిచేస్తారు. పని చేసే సామర్థ్యం అమెరికన్లకు లేకపోవడం, వారు ఆ ఉద్యోగాల్లోకి రావడానికి ఇష్టపడకపోవడం కూడా ఈ కార్పొరేట్ కంపెనీ యజమానుల్లో ఆందోళన పెంచుతోంది. అందుకే ట్రంప్ నిర్ణయాన్ని వారంతా వ్యతిరేకిస్తున్నారు.

భారత – చైనా గొడవల్లో కమ్యూనిస్టులు ఎక్కడ?

భారత ప్రభుత్వం, ప్రజల సొమ్ముతో దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీలు చదువుకొని మన దేశం కోసం కష్టపడకుండా..మన అభివృద్ధికి సోపానంగా నిలవకుండా చాలామంది నిపుణులైన టెకీ విద్యార్థులు డాలర్ల వేట పడి అమెరికా చెక్కేస్తున్నారు. కోట్లు సంపాదిస్తున్నారు. కానీ వారి వల్ల మన భారతదేశానికి రూపాయి ఆదాయం లేదు. అదే వారంతా భారత బాగు కోసం పనిచేస్తే దేశం ఇప్పుడు ఓ రేంజిలో ఉండేది. కానీ డాలర్ల వేట మన భారతీయులకు పిచ్చిగా పట్టింది. దేశం విడిచి విదేశాలకు పోయేలా చేసింది. ఇదే అక్కడి దేశాల్లోని ప్రజలకు ఉద్యోగ, ఉపాధిని దూరం చేసింది.

కానీ ట్రంప్ ఇప్పుడు విదేశీయులతో తమ దేశంలో పెద్దఎత్తున ఉద్యోగాలు కోల్పోతున్నారని గ్రహించి వలసలు నిషేధించాడు. ఏడాది పాటు ఇలాగే కంటిన్యూ చేయనున్నాడు. తద్వారా అమెరికా ఆశలతో ఊరేగే భారతీయులు ఇప్పుడు భారత్ లోనే ఉద్యోగాలు వెతుక్కోవాలి. వారి ఆలోచన సామర్థ్యాలు స్వదేశం కోసం వెచ్చించాలి. తద్వారా దేశం బాగుపడుతుంది. ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమెరికాకే కాదు.. భారత్ కు లాభదాయకమే. మనోళ్ల డాలర్ల వేటకు చెక్ పడినట్టే..

-నరేశ్ ఎన్నం

తల్లి కాబోతుందంటూ స్టార్ హీరోయిన్ పై.. !


పెళ్లి అయ్యేదాకా ‘పెళ్లి ఎప్పుడూ’ అనే ప్రశ్నలతో ఒక బాధ అయితే.. పెళ్లి తరువాత ‘పిల్లలు ఎప్పుడూ’ అనే ప్రశ్నతో మరో బాధ. అసలు మనిషి ప్రాధమిక బాధ్యతలా మారిపోయిన ఈ పెళ్లి వ్యవస్థ ఏమి లేని వాడి దగ్గర నుండి అన్ని ఉన్నవాడి వరకూ అందర్నీ ప్రభావితం చేస్తోంది. ప్రస్తుతం అలాంటి ప్రబావితంతోనే ఇబ్బంది పడుతున్నారు ‘అనుష్క శర్మ’ జంట. చాలా ఏళ్ల నుండి గ్యాప్ లేకుండా గ్లామర్ ప్రపంచలో తన అందచందాలను అలుపుసోలుపు లేకుండా అవలీలగా ప్రదర్శిస్తూ వచ్చిన ‘అనుష్క శర్మ’ కొంత విరామాన్ని తీసుకోవాలనే ఉద్దేశ్యంతోనే గత సంవత్సరం నుండి సినిమాలను తగ్గించుకుంది.

భారత – చైనా గొడవల్లో కమ్యూనిస్టులు ఎక్కడ?

అయితే గత కొన్ని నెలలుగా ‘అనుష్క శర్మ’ తల్లి కావడానికే విరామం తీసుకుందని.. సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అయితే తాజాగా ఓ బాలీవుడ్ ప్రముఖ పత్రిక కూడా అనుష్క శర్మ తల్లి కాబోతుందనే విషయాన్ని రూమర్స్ లా కాకుండా డైరెక్ట్ గానే రాసింది.. పైగా నిజమనట్టు రాసుకోచ్చింది. అయితే ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని బాలీవుడ్ డిజిటల్ మీడియా స్పష్టం చేసింది. ప్రస్తుతం ‘అనుష్క శర్మ’ సినిమాలు చేయడం లేదంటే దానికి కారణం ఆమెకు నచ్చిన కథ లేకపోవడమేనట.

చైనాతో ఫైట్.. మోడీనే సరైనోడా?

కాగా ‘అనుష్క శర్మ’ త్వరలోనే రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఇక విరాట్‌-అనుష్కల వివాహం డిసెంబర్‌ 11న ఇటలీలోని 800 ఏళ్ల నాటి గ్రామంలో ఉన్న బోర్గో ఫినోచీటీ రిసార్ట్‌ లో వైభవోపేతంగా జరిగింది. పైగా ఈ వివాహం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహాల్లో ఒకటిగా నిలిచింది.

ఎంత సూపర్ స్టార్ అయితే మాత్రం.. ?


ఎంత సూపర్ స్టార్ మహేశ్ బాబు అయితే మాత్రం, మాకేంటి అనే దోరణి ఉంటుంది తోటి పరిశ్రమల్లోని స్టార్ హీరోల్లో. ముఖ్యంగా విలన్ గా యాక్ట్ చెయ్యమంటే వారు చేస్తారా.. పైగా తన్నులు తినే క్యారెక్టర్ అంటే కాస్త ఇబ్బందే. ఒక భాషలో స్టార్ హీరోగా ఉంటూ.. ఇదేం దౌర్భాగ్యంరా బాబు.. విలన్ గా మేము చేయడం ఏమిటి అని అనుకుంటారు. ఇప్పుడు అలాగే అంటున్నాడు కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర.

లాక్ డౌన్ విధించాలంటున్న నెటిజన్లు.. పట్టించుకోని సర్కార్

మహేశ్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో రాబోతున్న ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘సర్కారు వారి పాట’లో విలన్ గా కన్నడ హీరో ఉపేంద్ర అయితే బాగుంటుందని చిత్రబృందం ఆయనను సంప్రదించిందట. దాంతో ఉపేంద్ర నేను కూడా సూపర్ స్టార్ హీరోనే కదా, నన్ను విలన్ గా చేయమనడం ఏమిటి ? సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నా పాత్ర కీలకం.. ముఖ్యంగా విలన్ క్యారెక్టర్ కాదు, అందుకే ఆ సినిమా చేశాను’ అని మహేష్ సినిమా చేయను అని ఉపేంద్ర చెప్పినట్లు తెలుస్తోంది.

నిజానికి ఉపేంద్ర చెప్పింది కూడా నిజమే కదా, కన్నడ నాట స్టార్ హీరోగా కొనసాగుతూ.. మహేష్ సినిమాలో విలన్ గా చేయడానికి ఆయకేం అవసరం. ఇక ఈ సినిమాలో ఓ సామాజిక అంశాన్ని ప్రదానంగా ప్రస్తావించబోతున్నారట. ఇక మహేష్ సరసన కథానాయకురాలిగా కీర్తి సురేష్ నటించబోతుందని వార్తలు వస్తున్నాయి గానీ, ఇంకా ఫైనల్ కాలేదు.

భారత – చైనా గొడవల్లో కమ్యూనిస్టులు ఎక్కడ?

అయితే ఈ చిత్రంలో ఆహ్లాదకరమైన ఓ లవ్ ట్రాక్‌ కూడా ఉందని, ఆ ట్రాక్ లో చాలా కాలం తర్వాత మహేష్ లవర్ బాయ్‌ గా నటించనున్నారని.. అందుకే కీర్తి సురేష్ లాంటి టాలెంటెడ్ బ్యూటి అయితేనే బాగుంటుందని మేకర్స్ బావన. మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ ప్రెస్టీజియస్ మూవీని భారీగా నిర్మిస్తున్నాయి.

‘బన్నీ’కి సారీ.. తమిళ్ స్టార్ హీరో !


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, తనకిష్టమైన క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో చేస్తోన్న సినిమా ‘పుష్ప’. కాగా ‘పుష్ప’లో తమిళ స్టార్ విజయ్‌ సేతుపతి ఓ పవర్ ఫుల్ పోలీస్‌ ఆఫీసర్‌ గా నటిస్తున్నాడు. అయితే విజయ్ సేతుపతి బన్నీకి సారీ చెబుతున్నాడట. నిజానికి విజయ్ పుష్ప కోసం ఏప్రిల్ లో ఇరవై రోజులు, జూన్ లో పదిహేను రోజులు డేట్స్ ఇచ్చాడు.

చైనాతో ఫైట్.. మోడీనే సరైనోడా?

అయితే కరోనా వైరస్ కారణంగా షూట్ క్యాన్సల్ అవ్వడం, విజయ్ సేతుపతి డేట్స్ క్లాష్ అవ్వడం జరిగిపోయింది. ఇప్పుడు డేట్స్ కుదరక ఈ సినిమా నుండి విజయ్ తప్పుకున్నాడట. అయితే ఈ వార్తకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు గానీ, పుష్ప టీంకి సంబంధించిన వ్యక్తుల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం అయితే ‘విజయ్ సేతుపతి’ పుష్ప సినిమా నుండి తప్పుకున్నాడు అని.

బన్నీ కలలు కన్న పాన్ ఇండియా సినిమా ‘పుష్ప’తో తీరాలంటే పాన్ ఇండియా స్టార్స్ ఈ సినిమాలో యాక్ట్ చెయ్యాలి. ఈ సినిమా అప్పుడే పాన్ ఇండియా రేంజ్ లో ఉంటుంది. మరి సుకుమార్ స్టార్ కాస్ట్ ను పాన్ ఇండియా లెవల్ లోనే తీసుకోవటానికి ఇప్పటి నుండే ప్లాన్ చేసుకోవడం బెటర్. సినిమాలోని ఓ ఐటమ్ సాంగ్‌ కోసం అయితే బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌటెలాను తీసుకోబోతున్నారని తెలుస్తోంది.

ఎంపీకి షోకాజ్ నోటీసు ఇచ్చిన వైసీపీ..!

అలాగే విలన్ గా కూడా ఏ సంజయ్ దత్ నో, సునీల్‌ శెట్టినో ఒప్పించాలని సుకుమార్ అనుకుంటున్నాడట. ఇక ఈ చిత్రంలో బన్నీకి జోడీగా క్యూట్ బేబీ రష్మిక మందన్న నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. బన్నీ ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అందుకోవాలని ఆశిద్దాం.

మరోసారి హైకోర్టును ఆశ్రయించిన నిమ్మగడ్డ..!


రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. తనను ఎస్‌ఈసీగా తిరిగి నియమించాలన్న హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. హైకోర్టు తీర్పు పై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిగా సుప్రీం కోర్టు స్టే ఇచ్చేదిలేదని స్పష్టం చేసిందని, హైకోర్టు తీర్పును అమలు చేయాలని సూచించిందని తన పిటీషన్ లో పేర్కొన్నారు.

చైనాతో ఫైట్.. మోడీనే సరైనోడా?

నిమ్మగడ్డ తరపున లాయర్ అశ్వనీ కుమార్‌ ఈ పిటిషన్‌ ను హైకోర్టులో దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఎన్నికల సంఘం కార్యదర్శిలను ప్రతివాదులుగా రమేష్‌ కుమార్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

నిమ్మగడ్డ రమేష్ కుమార్, బీజేపీ ఎంపీ సుజనాచౌదరిని, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ను హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో కలిసిన సంఘటన ఈ విషయంలో రాజకీయంగా వేడి రాజేసింది. ఈ నేపథ్యంలో రమేష్ కుమార్ హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వంపై కోర్టు ధిక్కారణ పిటీషన్ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఎంపీకి షోకాజ్ నోటీసు ఇచ్చిన వైసీపీ..!

రాజకీయ నాయకులతో నిమ్మగడ్డ భేటీనికి సంబంధించి వెలుగులోకి వచ్చిన సీసీ టివి పుటేజ్ లను కోర్టుకు ఇవ్వడం, ఆయనకు రాజకీయ పార్టీలతో ఉన్న సంబంధాలను, ఒక పార్టీకి లబ్ధిచేకూరే విధంగా తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు దృష్టికి తెచ్చి కేసునుంచి గట్టెక్కాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. నిమ్మగడ్డ, కామినేని, సుజనా చౌదరి భేటీ అంశం హైకోర్టులో నిలబడదనే వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ కేసులో ఏమి జరుగుతుందనేది విచారణ వరకూ వేచి చూడాల్సిందే.

అప్పట్లో స్పానిష్ ఫ్లూ.. నేడు కరోనా.. ఏం చెబుతున్నాయి?


కరోనా.. కరోనా.. కరోనా.. ఎక్కడా చూసిన ఈ మాయదారి రోగం గురించే చర్చ. టీవీల్లో, పేపర్లలో, సోషల్ మీడియాలో ఎక్కడి చూసిన కరోనా వార్తలే.. చైనాలోని వూహాన్లో సోకిన కరోనా వైరస్ క్రమంగా ప్రపంచ దేశాలకు సోకింది. కరోనా పేరుచెబితేనే అగ్రరాజ్యాలు సైతం ఉలికిపడిపోతున్నాయి. అమెరికా, ఇటలీ, బ్రిటన్, యూకే వంటి అభివృద్ధి చెందిన దేశాలు సైతం కరోనా దాటికి విలవిలలాడిపోతున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు కోటికి చేరువలో ఉన్నాయి. ఒకట్రెండు రోజుల్లో కోటిని దాటేసిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

ఎంపీకి షోకాజ్ నోటీసు ఇచ్చిన వైసీపీ..!

ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ కంటే ముందే ఇలాంటి వైరస్ ప్రపంచానికి సవాల్ విసిరింది. దానిపేరు స్పానిష్ వైరస్. ఇది తొలుత స్పెయిన్లో రావడంతో దీనికి ఆ పేరు వచ్చింది. కరోనా వైరస్ మాదిరిగానే ఈ వైరస్ జంతువుల నుంచి మానవులకు సోకలేదు. మానవుడి వ్యక్తిగత అపరిశుభ్రతే ఈ వైరస్ పుట్టుక కారణం. 1918లో తొలిసారి ఈ వైరస్ ను గుర్తించారు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఓ సైనికుడికి ప్లూ లక్షణాలు వచ్చాయి. అతడి నుంచి సైనికులందరికీ ఈ వైరస్ వచ్చింది. ఆ తర్వాత యూరప్ దేశాలకు అక్కడి నుంచి ఇండియాకు పాకింది స్పానిష్ వైరస్.

చైనాతో ఫైట్.. మోడీనే సరైనోడా?

భారత్లోకి కరోనా వైరస్ ఎలా ఎంట్రీ ఇచ్చిందో అదేమాదిరిగా స్పానిష్ వైరస్ కూడా అప్పట్లో వచ్చింది. యూరప్ కు చెందిన నౌకా సిబ్బంది నుంచి బాంబే పోర్టులో పని చేసే ఉద్యోగికి స్పానిష్ వైరస్ సోకింది. అంటే విదేశీయులను ఈ వైరస్ దిగుమతి అయిందన్నమాట. సదరు ఉద్యోగి నుంచి ఒక్కొక్కరిగా బాంబే అంతటా వ్యాపించింది. క్రమంగా దేశమంతా ఈ వైరస్ సోకింది. ప్రజలకు ఈ వైరస్ అవగాహన లేకపోవడంతో దాదాపు 2కోట్ల మంది వైరస్ బారినపడి మృతిచెందినట్లు సమాచారం. అప్పట్లో మృతదేహాలను కాల్చేందుకు కూడా కట్టెలు దొరకని పరిస్థితి ఏర్పడిదంటే ఈ వైరస్ ఎంతలా విజృంభించి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

స్పానిష్ వైరస్ ను యూరప్, అమెరికా దేశాలు సామాజిక దూరం పాటించడం కట్టడి చేయగలిగాయి. ప్రసార మాధ్యమాల్లో ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించారు. అప్పట్లోనే ప్రజలు మాస్కులు ధరించడం.. సబ్బుుతో చేతులు కడుక్కోవడం వంటి జాగ్రత్తలు తీసుకున్నారు. భారత్లో అప్పటివరకు సామాజిక దూరంపై అవగాహన లేకపోవడంతో ఈ వైరస్ దేశమంతా విజృంభించింది. ప్రజలు పెద్దఎత్తున మృత్యువాత పడుతుండటంతో పాలకులపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఆస్పతుల్లో సదుపాయాలు కల్పించడం వంటి చర్యలు చేపట్టారు. ఆ తర్వాత దీనికి మందురావడంతో ఈ వైరస్ ను కట్టడి చేయగలిగారు.

భారత – చైనా గొడవల్లో కమ్యూనిస్టులు ఎక్కడ?

దాదాపు రెండేళ్లపాటు ప్రపంచంపై ప్రభావం చూపింది. నాటి స్పానిష్ వైరస్ తో పొలిస్తే ఇప్పుడున్న కరోనా అంత ప్రభావమైనది కాదని నిపుణులు అంటున్నారు. కరోనా వైరస్ ను ఒకరి నుంచి మరొకరికి సోకకుండా బ్రేక్ చేస్తే దీనిని నివారించడం సులభమని అంటున్నారు. మనమంతా మన ఇళ్లల్లో 15రోజులపాటు ఉంటే కరోనా నివారించవచ్చని అంటున్నారు. అలా కాకుండా ఇష్టానుసారంగా బయట తిరిగితే కరోనాను కట్టడి చేయలేమని అంటున్నారు.

స్పానిష్ ప్లూ మాదిరిగానే కరోనాను కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. సామాజిక దూరం పాటించడం.. వ్యక్తిగత శుభ్రత పాటించడం.. మాస్కులు ధరించడం, శానిటైజర్లు వాడటం.. కరోనా లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం చేస్తే ఈ మహమ్మరిని కట్టడి చేయచ్చని వైద్యులు సూచిస్తున్నారు. స్పానిష్ ప్లూతో పొల్చుకుంటే ఇప్పుడొచ్చిన కరోనా వైరస్ అంత డేంజర్ కాదని నిపుణులు అంటున్నారు.

చైనాతో ఫైట్.. మోడీనే సరైనోడా?


ఇన్నేళ్ల స్వంతంత్య్ర భారత దేశంలో పాకిస్తాన్ చేసే దాడులను కాచుకోవడం.. ఆ దేశం పంపే ఉగ్రవాదుల చర్యలను మౌనంగా భరించడమే భారత్ చూసింది. కానీ బీజేపీ వచ్చాక కాస్తా మార్పు వచ్చింది. ఒక చెంపపై కొడితే మరో చెంప చూపించాలన్న కాంగ్రెస్ సిద్ధాంతాన్ని వదిలేసి రెండు చెంపలపై వాయ గొట్టాలన్న బీజేపీ ఉడుకునెత్తురు సిద్ధాంతం దేశ ప్రజల్లోకి ఎక్కింది. ఏకంగా పాకిస్తాన్ భూభాగంలోకి విమానాలను పంపి మరీ దాడులు చేయగల పోరాట పటిమను బీజేపీ ప్రభుత్వం పుణికిపుచ్చుకుంది. ఎప్పుడూ ఇతర దేశాలపైకి వెళ్లని భారత్ తొలిసారి పాకిస్తాన్ లోకి వెళ్లి మరీ బాంబులు వేసి వచ్చింది. ఇది ఇన్నేళ్ల చరిత్రలోనే భారత్ సాధించిన అరుదైన సాహసం అని చెప్పవచ్చు.

తాజాగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు చేశారు. చైనా చేతిలో 20మంది భారత జవాన్ల మృతికి మోడీనే కారణమని.. సరిహద్దుల్లో ఏం జరిగిందో బయటపెట్టాలని నినదించారు. ప్రతిపక్షాలు కూడా మోడీని చైనాతో డీల్ విషయంలో సరిగ్గా వ్యవహరించలేదని విమర్శించాయి. అందరూ వేలెత్తి చూపినా కూడా మోడీనే దేశ ప్రజలు నమ్ముతున్నట్టు తాజా సర్వేలో తేలింది.

చైనాతో ఫైట్ లో 20 మంది భారత సైనికులు మరణించినా కూడా ప్రధాని నరేంద్రమోడీకే దేశ ప్రజలు మద్దతునిస్తున్నారని ఒక సర్వేలో తేలింది. చైనాకు వ్యతిరేకంగా పోరాడడానికి.. నాయకత్వం వహించడానికి మోడీ సరైన వ్యక్తి అని భారత ప్రజలు భావిస్తున్నారు. నరేంద్రమోడీ చేతిలోనే భారత్ సురక్షితంగా ఉంటుందని వారు భావిస్తున్నారు.

భారత్ -చైనా ఉద్రికత్తల నేపథ్యంలో ఇటీవల ప్రముఖ జాతీయ న్యూస్ చానెల్ ఏబీపీ-సీఓటర్ కలిసి సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో మోడీ నాయకత్వంలోనే భారత్ సురక్షితంగా ఉంటుందని దాదాపు 72.6శాతం మంది ప్రజలు అభిప్రాయపడడం విశేషం.ఇక చైనాతో ఇలాంటి ఘర్షణ పరిస్థితుల్లో రాహుల్ గాంధీ చక్కగా నిర్వహించగలరని 14.4శాతం మంది అభిప్రాయపడ్డారు. అయితే ఇందులో ఇప్పటివరకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సరికాదని 39శాతం మంత్రి అభిప్రాయపడ్డారు.

ఆసక్తికర విషయం ఏంటంటే పాకిస్తాన్ కంటే కూడా చైనానే భారత్ కు అతిపెద్ద శత్రువుగా చూస్తున్నారు. పాకిస్తానే భారత్ కు నంబర్ 1 శత్రువు అని కేవలం 32శాతం మంది అభిప్రాయపడగా.. చైనానే ప్రధాన శత్రువు అని ఏకంగా 68శాతం మంది చెప్పడం విశేషం. చైనా ఉత్పత్తులను నిషేధించాలని చాలా మందిగా గట్టిగా సమర్థించారు.31శాతం మంది చైనా ఉత్పత్తులను కొనుగోలు చేయమని తెలిపారు.

దీన్ని బట్టి పాకిస్తాన్ కానీ.. చైనా కానీ భారత్ ధీటుగా ఎదురించాలన్నా.. వాటితో ఫైట్ చేయాలన్నా ప్రధాని మోడీనే సరైనవాడు అని.. ఆయన నాయకత్వంలోనే వాటితో సరిగా డీల్ చేస్తున్నారని.. భారత్ పూర్తిగా మోడీకే మద్దతుగా ఉందని తాజా సర్వేతో తేటతెల్లమైంది.

-నరేశ్ ఎన్నం

ఎంపీకి షోకాజ్ నోటీసు ఇచ్చిన వైసీపీ..!


వైసీపీలో ఉంటూ ఆ పార్టీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై ఆ పార్టీ చర్యలు చేపట్టింది. ప్రాధమికంగా షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఇటీవల పార్టీ ఎమ్మెల్యేలపై చేసిన వ్యాఖ్యలకు వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని కోరారు. వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయ సాయి రెడ్డి పేరుతో షోకాజ్ నోటీస్ ను జారీ చేశారు.

భారత – చైనా గొడవల్లో కమ్యూనిస్టులు ఎక్కడ?

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో జిల్లా మంత్రి రంగనాథ రాజు, ఎమ్మెల్యేలు ప్రసాదరాజు, తదితరులు జగన్ తో సమావేశమైనప్పుడు రఘురామ కృష్ణంరాజు వ్యవహారాన్ని ఏదో ఒకటి తేల్చాలంటూ పట్టుబట్టారు. అదే సమయంలో అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వారు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు పందులే గుంపులుగా వస్తాయి…అంటూ వైసీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తాను జగన్ బొమ్మ పెట్టుకుని గెలవలేదని, నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు అందరూ తన బొమ్మతో గెలిచారని, వారు రాజీనామా చేస్తే తాను రాజీనామా చేస్తానని, అందరం ఎన్నికల్లో నిలబడదామని సవాల్ విసిరారు.

చంద్రబాబు కోటరీ బీజేపీని దెబ్బతీస్తుందా?

అంతే కాకుండా తాను వైసీపీలోకి రానంటే కాళ్ళు పట్టుకుని బ్రతిమాలాడితే పార్టీలోకి వచ్చానని చెప్పిన విషయం విదితమే. ఈ వ్యాఖ్యలతో వైసీపీ మరింత ఇరుకున పడింది. అదేవిధంగా సీఎం జగన్ చుట్టూ కోటరీ, టిటిడి భూముల విక్రయం, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, ఇసుక సరఫరా, ఇళ్ల స్థలాల సేకరణ, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంపీ రఘురామ కృష్ణంరాజు గళం విప్పారు. ఎట్టకేలకు పార్టీ ఆయనకు షోకాజ్ జారీ చేయడం ఆసక్తిగా మారింది. దీనికి రఘురామ కృష్ణంరాజు ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశం.

భారత – చైనా గొడవల్లో కమ్యూనిస్టులు ఎక్కడ?

భారత-చైనా సరిహద్దు ఘర్షణలపై ప్రతిరోజూ తీవ్ర చర్చలు , వాదోపవాదాలు జాతీయ మీడియాలో చూస్తున్నాము. అందులో గమనించాల్సిన అంశమేమంటే ఎప్పుడూ చురుకుగా పాల్గొనే కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధులు కనబడకపోవటం. అదేదో కాకతాళీయంగా జరిగిందికాదు. సిపిఎం వారి అధికార ప్రతినిధులను పంపటానికి నిరాకరించింది. దానికి కారణాలు అందరికీ తెలిసిందే. టీవీ మాధ్యమాల్లో కూర్చొని చైనా తో తగాదా పెట్టుకోవద్దని చెప్పటం వివాదాస్పదం అవుతుందని భావించటమే. తప్పులేదు , ఎవరి అభిప్రాయాలు వారివి. కాకపోతే సమస్యల్లా ద్వంద ప్రమాణాలు పాటించటమే. అమెరికా తో భారత్ కి వివాదం వస్తే ఒంటికాలుమీద లేచే వాళ్ళు చైనా విషయం వచ్చేసరికి అదే వైఖరి తీసుకోకపోవటానికి కారణం చైనా లో అధికారం లో వుంది సోదర కమ్యూనిస్టు పార్టీ కావటమే.

ఈ విధానం ఈరోజు కొత్తేమీ కాదు. మొదట్నుంచీ ఈ ద్వంద ప్రమాణాలు పాటిస్తూనే వచ్చారు. సామ్రాజ్యవాదాన్ని సిద్ధాంతపరంగా వ్యతిరేకించే వాళ్ళు స్వతంత్ర టిబెట్ ని 1951లో చైనా ఆక్రమించినప్పుడు అందులో సామ్రాజ్యవాదం కనబడలేదు. ఎందుకంటే అది సోదర కమ్యునిస్టు పార్టీ కాబట్టి. అలాగే సోవియట్ యూనియన్ సైన్యాలు 1979 లో ఆఫ్ఘనిస్తాన్ పై దాడిచేసి ఆక్రమించినప్పుడు అది సమర్ధనీయమే . ఎందుకంటే ఆక్రమించింది సోదర కమ్యూనిస్టు పార్టీ కాబట్టి. అదే అమెరికా వియత్నాంని ఆక్రమిస్తే భారత్ లో  నిరసన ప్రదర్శనలు చేస్తాం. అమెరికా చేసినా , రష్యా చేసినా, చైనా చేసినా భౌతిక ఆక్రమణ తప్పే. అంతేగానీ మన సోదర పార్టీ అధికారంలో వుంటే ఒకలాగా వేరే వాళ్ళు చేస్తే ఇంకోలాగా ప్రతిస్పందిస్తే అర్ధం ఆ సిద్ధాంతం మీద చిత్తశుద్ది లేదనే చెప్పాలి. మరి ఈరోజు కార్ల్ మార్క్స్ బతికుంటే ఈ ద్వంద ప్రమాణాల్ని ఒప్పుకునేవాడో కాదో ప్రజల ఊహలకు వదిలేస్తున్నాం.

ఈ ద్వంద ప్రమాణాలే భారత-చైనా సంబంధాలలోనూ కనబడుతున్నాయి. చైనా 1949లో కమ్యూనిస్టుల ఆధ్వర్యాన ప్రజా రిపబ్లిక్ గా అవతరించింది. అంతకుముందు వున్న కొమింగ్ టాంగ్ పార్టీ నాయకుడు చాంగ్ కై షేక్ జపాన్ తో రాజీ పడి ప్రజావ్యతిరేకిగా మారిన నేపధ్యం లో మావో సే టుంగ్ ఆధ్వర్యాన ఎర్ర సైన్యం అధికారాన్ని చేపట్టటం జరిగింది. అంతవరకూ బాగానే వున్నా ఆ తర్వాత జరిగిన పరిణామాలే అందరిని ఆశ్చర్య పరిచాయి. జాతులు విముక్తి కోరతాయి కానీ అది మాకు వర్తించదు. ఇదీ మావో సిద్ధాంతం. పక్కనున్న టిబెట్ ఎప్పట్నుంచో స్వతంత్ర దేశంగా వున్నా , ప్రత్యెక దేశానికి కావాల్సిన అన్ని లక్షణాలు కలిగి వున్నా దాన్ని బలవంతంగా ఆక్రమించటానికి తను చెప్పిన సిద్ధాంతాలు అడ్డురాలేదు. అప్పుడే చైనా విస్తరణ వాదాన్ని, జాతీయ దురభిమానాన్ని మనదేశంలోని జాతీయవాదులు, వామపక్షవాదులు పసిగట్ట లేకపోయారు. కానీ ఒకేఒక వ్యక్తి దీనిపై పూర్తి స్పష్టత లో వున్నాడు. ఆయనే డాక్టర్ రామ్ మనోహర్ లోహియా . భారతీయ సమాజాన్ని గురించి విస్తృతంగా అధ్యయనం చేయటమే కాకుండా , చైనా విషయం లోనూ మొదట్నుంచీ స్పష్టత తో హెచ్చరిస్తూనే వస్తున్నాడు. వల్లభాయ్ పటేల్ నెహ్రూ తో తన అభిప్రాయాలు పంచుకున్నా బయటపడి దానిపై బహిరంగ విమర్శలకు దిగే అవకాశం లేదు.

ఇక కమ్యూనిస్టుల విషయానికి వస్తే ప్రపంచ సూత్రాలకు వ్యతిరేక మైనా అది కమ్యూనిస్టు విప్లవాన్ని ఎగుమతి చేయటానికి చేస్తున్న పని కాబట్టి తప్పులేదనే భావన. అది మాతృ దేశమైన భారత్ అయినా సరే. అందుకనే చైనా దురాక్రమణ ను తప్పు అని ఒక్కసారి కూడా ఖండించిన పాపాన పోలేదు. అవేమిటో ఒక్కసారి చూద్దాం.

  1. 1954 లో లడఖ్ లో భాగమైన ఆక్సాయ్ చిన్ ని రహస్యంగా ఆక్రమించినా దాని నిర్వాకం తెలిసిన తర్వాత అన్ని పార్టీలు ముక్త కంఠంతో పార్లమెంటులో ఖండించినా కమ్యూనిస్టులు మాత్రం శాంతి వచనాలే పలికారు తప్పితే చైనా చర్యని ఖండించిన పాపాన పోలేదు. 1842 ఒప్పందం ప్రకారం ఆక్సాయ్ చిన్ మనదేనని ఒక్కమాట అనలేకపోయారు.
  2. 1959 లో చైనా అక్రమంగా మన భూభాగం నుంచి కారకోరం నడవా ని నిర్మించటానికి పాకిస్తాన్ తో ఒప్పందం చేసుకుంటే ఆ భూభాగం మాది అక్కడ నిర్మించాలంటే భారత్ తో ఒప్పందం చేసుకోవాలని ఒక్క మాట అనలేకపోయారు. ఆ మాట అని శాంతి వచనాలు పలికినా అది ఓ పద్దతిగా వుండేది. 1947 అక్టోబర్ లో కాశ్మీర్ మహారాజా భారత్ లో విలీనంపై సంతకం పెట్టిన తర్వాత కాశ్మీర్ ఉత్తర ప్రాంతాలలో రహదారి నిర్మించాలంటే భారత్ తో సంప్రదించాలనే కనీస మాట భారత్ లోని పార్టీ మాట్లాడక పోవటాన్ని ఏ విధంగా అర్ధం చేసుకోవాలి.
  3. 1962 భారత-చైనా యుద్ధం లో భారత్ తరఫున మాట్లాడక పోవటాన్ని ఏ విధంగా అర్ధం చేసుకోవాలి? ఇదే చైనా కాకుండా ఇంకే దేశమైనా అయివుంటే ఇదే ధోరణి అవలంబించే వారా? భారత్ ప్రభుత్వం ఏ విధంగా దుందుడుకుగా ప్రవర్తించిందో పుంఖానుపుంఖాలుగా వారి అధికార పత్రికల్లో వ్యాసాలు రాయటాన్ని ఏ కోణం లో చూడాలి? నిజంగా విశ్వశాంతి కోరుకునే వారయితే అందరితో అదే వైఖరి అవలంబించాలి. చైనా ప్రభుత్వం వేరు , ప్రజలు వేరని మరిచిపోవద్దు. తగాదా చైనా విస్తరణ వాదం తోనే ప్రజలతో కాదు.
  4. 1963 లో వ్యూహాత్మకంగా లబ్ది పొందొచ్చనే దుర్బుద్ధితో చైనా పాకిస్తాన్ తో ఒప్పందం పేరుతో మన భూభాగం షాక్స్ గం లోయను వశపర్చుకున్నప్పుడు ఇది తప్పు అనకపోవటం ఏ విధంగా అర్ధం చేసుకోవాలి? అసలు భూమి స్వంతదారు కాని పాకిస్తాన్ ఇంకొకకరికి అమ్మే హక్కు ఎక్కడదని ప్రశ్నించటం జాతి దురహంకారం కిందకు వస్తుందా ? యుద్ధాలు, శాంతులు తర్వాత ఈ భూమి మాది మీరెలా వశపరుచుకుంటారని ఎప్పుడైనా ప్రశ్నించారా?
  5. ఆ తర్వాత ఎన్నోసార్లు భారత భూభాగాన్ని కబ్జా చేస్తుంటే ఎప్పుడైనా ప్రశ్నించారా?
  6. 2013 లో కారకోరం నడవాని చైనా-పాకిస్తాన్ ఆర్ధిక నడవా కింద వున్నత స్థాయికి మార్చటానికి పాకిస్తాన్ తో ఒప్పందం చేసుకుంటే ఇది ఆక్రమిత కాశ్మీర్ లో వుంది కాబట్టి భారత్ అనుమతి లేకుండా ఎలా నిర్మిస్తారని ఎప్పుడైనా ప్రశ్నించారా?                                                            సరే భారత మీడియా లో మాట్లాడకపోతే పోయారు మీ ద్వైపాక్షిక చర్చల్లో ఎప్పుడైనా మాట్లాడారా ? ఎందుకంటే సోదర కమ్యూనిస్టు పార్టీగా మీరు చైనా కమ్యూనిస్టు పార్టీతో క్రమం తప్పకుండా అభిప్రాయాలు పంచుకుంటారు కదా. అప్పుడన్నా మీ నిరసన తెలిపారా?

తెలపకపోగా చైనా పై ఎవరైనా మాట్లాడితే వాళ్ళు జాతీయ దురహంకారులు గా ముద్ర వేసే వాళ్ళు. అదేమంటే దేశ భక్తీ వేరు , జాతీయత వేరని ఉపన్యాసాలు దంచేస్తారు. దేశ భక్తి అంటే ప్రజల ఆర్తనాదాలు పట్టించుకోవటం, పేదరికాన్ని పారదోలటం అని వూదర కొట్టటం అలవాటయ్యింది. మీరు చెప్పే ప్రజా సమస్యల పై మీ చిత్త శుద్ధిని శంకించటం లేదు. కాకపోతే వీటికి దేశ భద్రత కి లంకె పెట్టటాన్నే జీర్నించుకోలేకపోతున్నాము.

ఇక ప్రస్తుత విషయానికి వద్దాం. చైనా తో జరుగుతున్న ఘర్షణలపై మీ వైఖరేమిటి? చైనా భారత ప్రయోజనాలకి వ్యతిరేకంగా పనిచేస్తుందని నమ్ముతున్నారా లేదా? ఉగ్రవాదుల విషయం లో పాకిస్తాన్ ని వెనకేసుకు రావటం , భారత్ కి వ్యతిరేకంగా నేపాల్ ని రెచ్చగొట్టటం, అందుకు అధికారం లోవున్న సోదర కమ్యూనిస్టులతో కలిసి కుట్ర పన్నటం, ఈశాన్య భారతం లో వేర్పాటువాదులకు మిలిటరీ, ఆర్ధిక సహాయం చేయటం, హిందూ మహా సముద్రం లో భారత్ వ్యతిరేక స్థావరాలు ఏర్పాటు చేసుకోవటం, భారత సరిహద్దుదేశాలను డబ్బులతో ఆకట్టుకొని భారత్ ని ఇబ్బందుల్లోకి నెట్టటం లాంటి అనేక చర్యలకు చైనా పాల్పడటం కూడా తీవ్రమైన విషయంగా అనిపించటం లేదా? అంతమాత్రాన చైనా తో రోజూ తగాదా పెట్టుకోమనో, యుద్ధం పెట్టుకోమనో కాదు. అది చైనా తో ఎలా వ్యవహరించాలనే విషయం కిందకు వస్తుంది. ముందుగా చైనా భారత్ ప్రయోజనాలకి వ్యతిరేకంగా పనిచేస్తుందనే విషయంలో స్పష్టత వుంటే అటువంటి దేశంతో ఎలా వ్యవహరించాలో తర్వాత ఆలోచించవచ్చు. అసలు మొదటి విషయాన్ని దాట వేసి రెండో విషయాన్ని గురించి ఆలోచించలేము. చైనా భారత్ ప్రయోజనాలకి వ్యతిరేకంగా పనిచేస్తుందనే విషయం లో అన్ని పార్టీలు ఒక్క కమ్యూనిస్టులు తప్ప ఒకే బాటలో వున్నారు.  కానీ కమ్యూనిస్టులు మాత్రం ఈ విషయం లో భిన్నంగా ఆలోచిస్తున్నారు. ఇప్పటికైనా మన కమ్యూనిస్టులు మనసు మార్చుకొని చైనా విధానం పూర్తిగా వారి జాతీయ, విస్తరణ వాద మనస్తత్వంతో వుందని గ్రహిస్తే మంచిది. ఈ విషయంలో లోహియా రచనలు , ఆలోచనలు ( భారతీయ సమకాలీన మేధావులు కదా అని చులకనగా చూడకపోతే ) ఒక్కసారి పరిశీలిస్తే , ముఖ్యంగా  India, China and Northern Frontiers అనే పుస్తకం కొంతమేర ఉపయోగపడుతుంది. కీలకమైన అంశమేమంటే భారత్ విదేశాంగ విధానం పాకిస్తాన్ కేంద్రంగా కాకుండా చైనా కేంద్రంగా వుండాలని లోహియా అప్పట్లోనే అభిప్రాయ పడ్డాడు. ఇప్పటికైనా కమ్యూనిస్టులు మనసు మార్చుకొని జాతీయ విధానం పై కొత్త పంధా తీసుకుంటారని ఆశిద్దాం.

‘రాధే శ్యామ్’ కోసం హాస్పిటల్ లో ప్రభాస్ !


నేషనల్ రేంజ్ లో స్టార్ డమ్ సాధించాక కూడా ప్రభాస్, హిట్ అండ్ ఫేమ్ కూడా లేని రాధాకృష్ణ కుమార్ అనే ‘జిల్’ మూవీ డైరెక్టర్ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ అనే ఓ పీరియాడిక్‌ రొమాంటిక్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. నిజానికి ఈ సినిమా పట్ల ప్రభాస్ ఫ్యాన్స్ కి పెద్దగా నమ్మకం లేకపోయినా, వాళ్ళు మాత్రం సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో 6 కోట్ల రూపాయల ఓ భారీ హాస్పిటల్ సెట్‌ ను ప్రస్తుతం మేకర్స్ నిర్మిస్తున్నారు.

లాక్ డౌన్ విధించాలంటున్న నెటిజన్లు.. పట్టించుకోని సర్కార్

మరో నలబై రోజుల్లో ఈ సెట్ పూర్తి చేయనున్నారు. ఆ తరువాత ఆ హాస్పిటల్ సెట్‌ లోనే ప్రభాస్ పై కొన్ని కీలక యాక్షన్ సీన్స్ ను షూట్ చేయనున్నారు. అన్నట్టు ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ గాసిప్ కూడా ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. సినిమాలో ప్రభాస్ పాత్ర వెరీ ఎమోషనల్ గా ఉంటుందని, మెయిన్ గా క్లైమాక్స్ లో చాలా భావోద్వేగంతో సాగుతూ ఎమోషనల్ గా ముగుస్తోందని.. అనగా సినిమాలో ప్రభాస్ వి రెండు క్యారెక్టర్స్.. అందులో ఒక క్యారెక్టర్ చనిపోతుందని.. కొంతమంది సినిమా మిత్రుల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

చంద్రబాబు కోటరీ బీజేపీని దెబ్బతీస్తుందా?

ఇక జిల్ సినిమాని బాగానే తెరకెక్కించిన డైరెక్టర్ రాధాకృష్ణ‌, ఆ సినిమాతో హిట్ ను మాత్రం అందుకోలేకపోయాడు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కిస్తోన్న ఈ పీరియాడిక్‌ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ తో హిట్ కొడితేనే రాధాకృష్ణకు డైరెక్టర్ గా లైఫ్ ఉంటుంది. మరి రాధాకృష్ణ ఏం చేస్తాడో చూడాలి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాని నాలుగు భాషల్లో గోపికృష్ణ మూవీస్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

‘పవన్ – క్రిష్’ సినిమా పై బిగ్ అప్ డేట్ !


సెన్స్ బుల్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అనగానే పవర్ స్టార్ ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. ఈ సినిమాకి సంబందించి అప్ డేట్ కోసం పవన్ ఫ్యాన్స్ ఇంకా ఆసక్తిగా ఎదురుచూస్తూనే ఉన్నారు. అయితే కరోనా కారణంగా ‘పవన్ – క్రిష్’ సినిమాలో ఒక పెద్ద మార్పు చేయబోతున్నారు. మొదట ఈ సినిమా క్లైమాక్స్ ను మొరాకోలో భారీ సెట్లలో భారీ స్థాయిలో షూట్ చేయాలని క్రిష్ భారీగా ప్లాన్ చేసుకునప్పటికీ.. కరోనా దెబ్బకు ఇప్పుడు ఆ ప్లాన్ సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు.

బీజేపీ దోస్తీ పవన్ కి బలమా… భారమా?

అందుకే మొరాకో ఎపిసోడ్ ను హైదరాబాద్‌లోనే భారి సెట్స్ వేసి క్లైమాక్స్ ను షూట్ చేయాలని క్రిష్ ఫిక్స్ చేశాడట. ఆగష్టు 20న నుండి షూట్ స్టార్ట్ చేయనున్నారట. కాగా ఇప్పటికే ఈ సినిమా క్లైమాక్స్ సెట్స్ కి సంబంధించి గ్రౌండ్ వర్క్ ను ప్రారంభించారని, హైదరాబాద్ లోని అల్యూమినియమ్ ఫ్యాక్టరీలో సెట్స్ వేయబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ పిరియాడిక్ డ్రామాలో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా.. అలాగే సినిమాలో యువరాణిగా నటించబోతుందని తెలుస్తోంది.

లాక్ డౌన్ విధించాలంటున్న నెటిజన్లు.. పట్టించుకోని సర్కార్

అంటే ఈ చిత్రంలో జాక్వెలిన్ పేరున్న ఓ రాజుకి సోదరి పాత్రలో నటించబోతుంది. ఇక పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారనే వార్తలు ఫ్యాన్స్ లో సినిమా పై ఆసక్తిని బాగా పెంచుతున్నాయి. అన్నట్టు ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ అనే పేరును అనుకుంటున్నారు. ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం ఈ భారి చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

కరోనా భయంతో పోలీస్ స్టేషన్ మూసివేత..!


తెలంగాణ రాష్ట్రంలో కరోనా పంజా విసురుతోంది. రోజురోజుకు కరోనా కేసులు విజృంభిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా కరోనా భయంతో ఏకంగా పోలీస్ స్టేషనే మూసివేయాల్సి వచ్చింది. ఈ సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ప్రజల్లో కరోనా భయం ఎంతలా ఉందో ఈ ఒక్క సంఘటన అర్థంపడుతోంది. ఈ వార్త ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.

కరోనా పరీక్షల పేరుతో వల పన్నుతున్న సైబర్ కేటుగాళ్లు

కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడలో ఓ మహిళకు కరోనా పాజిటివ్ వచ్చింది. సదరు మహిళ చైతన్య కాలనీలోని కుమారుడితో నివాసం ఉంటోంది. దీంతో ఆమె కుమారుడు తనకు కూడా కరోనా పరీక్షలు చేయాలని ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులను కోరాడు. తల్లికి ప్రైమరీ కాంట్రాక్ట్ అయిన కుమారుడికి కరోనా టెస్టులు చేసేందుకు వైద్యులు నిరాకరించారు. కరోనా లక్షణాలు ఉంటేనే టెస్టులు చేస్తామని వైద్యులు తెగేసి చెప్పారు. దీంతో సదరు వ్యక్తి బాన్సువాడ పోలీస్ స్టేషన్ కు వెళ్లి వైద్యులపై ఫిర్యాదు చేశాడు.

లాక్ డౌన్ విధించాలంటున్న నెటిజన్లు.. పట్టించుకోని సర్కార్

తన తల్లికి కరోనా పాజిటివ్ వచ్చిందని పోలీసులకు వివరించారు. ఆమెతో ప్రైమరీ కాంట్రాక్ట్ అయిన తనకు కూడా కరోనా టెస్టులు చేయించాలని కోరారు. ఆ యువకుడికి పోలీసులు నచ్చజెప్పిన వినకపోవడంతో చివరికి ఆస్పత్రికి తరలించారు. కరోనా పాజిటివ్ వచ్చిన మహిళకి ఆ యువకుడు ప్రైమరీ కాంట్రాక్ట్ కావడంతో పోలీసులు పోలీస్ స్టేషన్ ను మూసివేశారు. మహిళతో కాంటాక్టు ఉన్నవారు భయాందోళన చెందుతున్నారు. ఈ విషయం బాన్సువాడలో ప్రచారం కావడంతో కొంతమంది వ్యాపారులు స్వచ్చంధంగా లాక్డౌన్ విధించుకున్నారు. కాగా మంగళవారం కామారెడ్డిలో పది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రభుత్వానికి సమస్యలు..


రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు చేయాలని జగన్ ప్రభుత్వం భావిస్తోంది. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా చేయాలని ఆలోచన ప్రభుత్వానికి ఉంది. ఇదే జరిగితే రాష్ట్రంలో ఇప్పుడున్న 13 జిల్లాలు కాస్త 25 జిల్లాలకు పెరిగే అవకాశం ఉంది. కలెక్టర్ లతో వీడియో కాన్ఫెరెన్ లో సీఎం ఈ అంశాన్ని ప్రస్తావించారు. అయితే ఉమ్మడి ఆంద్రప్రదేశ్ విభజన అనంతరం ఏర్పడిన తొలి ప్రభుత్వమైనా చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం కొత్త జిలాలకు కలెక్టర్ ల నుంచి ప్రతిపాదనలు కోరింది, వారిచ్చిన ప్రతిపాదనలపై ముందుకు వెళ్ళకుండానే ఐదేళ్లు పూర్తయ్యాయి. మరోవైపు తెలంగాణా పాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాల ఏర్పాటు ఎప్పుడో పూర్తి చేసినా ఏపీలో మాత్రం ఆ దిశగా ముందడుగు పడలేదు.

కరోనా పరీక్షల పేరుతో వల పన్నుతున్న సైబర్ కేటుగాళ్లు

కొత్త జిల్లాల వ్యవహారం అంత తేలిగ్గా సాగిపోయేది కాదు. భౌగోళికంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి. విజయవాడకు కొత్త వేటు దూరంలో ఉన్న గన్నవరం మండలం మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉంది. గన్నవరం నుంచి మచిలీపట్నం వెళ్లాలంటే కనీసం 70 నుంచి 80 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఇదే విధంగా పలు జిల్లాలో భౌగోళిక సమస్యలు ఉన్నాయి. కొన్ని చోట్ల పార్లమెంట్ నియోజకవర్గంకు సంబందంలేని ప్రాంతాలను జిల్లాలుగా చేయాలనే డిమాండ్ ఉంది. ఈ సమస్యలు అన్నింటినీ ముందు పరిష్కరించాల్సి ఉంది.

నిమ్మగడ్డ నిజాయితీపై నీలినీడలు

కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే వాటికి పేర్లు పెట్టె విషయంలోను ఎన్నో ఇబ్బందులు తప్పని పరిస్థితి ఉంది. తెలంగాణా లోను ఈ విషయంలో సర్కారు సమస్యలను ఎదుర్కొంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తారనే వాదనలు వినిపించినా ఏడాది వరకూ ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టింది.

తాజాగా సీఎం ఈ విషయాన్ని ప్రస్తావించడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికలకు ముందు కృష్ణా జిల్లా పర్యటనలో ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు వెళ్లిన జగన్ ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెడతానని హామీ ఇచ్చారు. కొత్త జిల్లా ఏర్పాటు చేస్తే మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఏర్పడే కొత్త జిల్లాకు ఈ పేరు పెట్టి తన హామీ నెరవేర్చుకుంటారని సమాచారం. మూడు రాజధానుల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రభుత్వం జిల్లాల పునర్విభజన విషయంలో ఎంత వరకూ ముందుకు వెళుతుందనేది ప్రశ్నర్ధకంగా మారింది.

లాక్ డౌన్ విధించాలంటున్న నెటిజన్లు.. పట్టించుకోని సర్కార్


దేశంలో, రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు విజృంభిస్తున్నాయి. దీంతో మరోసారి పూర్తిస్థాయి లాక్డౌన్ విధించాలని డిమాండ్ పెద్దఎత్తున వస్తోంది. సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రభుత్వ పెద్దలకు రిక్వెస్ట్ పెడుతున్నారు. లాక్డౌన్ విధించినపుడు కరోనా కట్టడిలోనే ఉందని.. సడలింపుల అనంతరమే కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతుందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కరోనా కేసులను కట్టడి చేసేందుకు ప్రస్తుతం ఇది ఒక్కటే మార్గమని సూచిస్తున్నారు.

కరోనా పరీక్షల పేరుతో వల పన్నుతున్న సైబర్ కేటుగాళ్లు

నగరాల్లో కరోనా పంజా..
దేశంలోని ప్రముఖ నగరాల్లో కరోనా పంజా విసురుతోంది. ఢిల్లీ, ముంబై, కోలకత్తా, అహ్మదాబాద్, చైన్నె, హైదరాబాద్ వంటి నగరాల్లో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నగరాల్లో జనాభా ఎక్కువగా ఉండటంతో ఒకరిని నుంచి ఒకరికి త్వరగా వ్యాప్తి చెందుతోంది. అంతేకాకుండా లాక్డౌన్ సడలింపుల అనంతరం నగరాల్లో వలస కార్మికులు సొంత ఊళ్లకు వెళ్లడంతో ఆయా గ్రామాల్లోనూ కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో కరోనా వైరస్ చాపకిందులా విస్తరిస్తోంది. నిన్న ఒక్కరోజు కొత్తగా 15,968 కొత్త కేసులు నమోదుకాగా 456మంది ప్రాణాలు కోల్పోయారు. జూన్ తొలివారంలో రోజుకు 10వేల కేసులు నమోదవగా ప్రస్తుతం రోజుకు 15వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.

బీజేపీ దోస్తీ పవన్ కి బలమా… భారమా?

జీహెచ్ఎంసీలో..
తెలంగాణలోనూ కరోనా పంజా విసురుతోంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గతవారం రోజులుగా టెస్టుల సంఖ్య పెంచడంతో కేసులు కూడా భారీగా నమోదవుతున్నాయి. జూన్ 21న తెలంగాణలో 730కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలోనే 659 కేసులు ఉన్నాయి. 22న కొత్తగా 872 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలోనే 713కేసులు, రంగారెడ్డిలో 107కేసులు నమోదయ్యాయి. మంగళవారం కొత్తగా 879పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 652కేసులు నమోదుకాగా మేడ్చల్‌లో 112 కేసులు నమోదుకావడం గమనార్హం.

చంద్రబాబు కోటరీ బీజేపీని దెబ్బతీస్తుందా?

స్వచ్చంధంగా లాక్డౌన్..
రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో కొన్ని పట్టణాలు, గ్రామాల్లో స్వచ్ఛందంగా లాక్‌డౌన్ విధించుకుంటున్నారు. కొద్దిరోజులుగా జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో పూర్తిస్థాయి లాక్డౌన్ విధిస్తారనే ప్రచారం జరిగింది. దీనిని ప్రభుత్వ వర్గాలు ఖండించాయి. ఇక జీహెచ్ఎంసీ కార్యాలయంలో సైతం ఉద్యోగులు, సిబ్బంది కరోనా బారిన పడటంతో ప్రజలెవరూ ఆఫీసుకు రావొద్దని సూచించింది. ఏవైనా సమస్యలుంటే ఆన్ లైన్లో ఫిర్యాదు చేయాలని కోరింది. ప్రస్తుత పరిస్థితుల్లో మరోసారి లాక్డౌన్ విధిస్తేనే కరోనా కట్టడి అవుతుందనే నగర వాసులు వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో విజ్ఞప్తులు..
ఈమేరకు తెలంగాణ ప్రభుత్వానికి నగర వాసులు సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేస్తున్నారు. మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, హరీష్ రావు, ప్రభుత్వ ఉన్నతాధికారులకు నెటిజన్లు ట్యాగ్ చేస్తూ విన్నవిస్తున్నారు. నగరంలో పరిస్థితి చేయిదాటకముందే మెల్కోవాలని కోరుతున్నారు. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుంటంతో నగరవాసులు భయాందోళన చెందుతున్నారు. మరోవైపు తమిళనాడు, ఏపీలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాలో లాక్డౌన్ విధించారని ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నారు. లాక్డౌన్ విధించాలని సోషల్ మీడియాలో ప్రజల నుంచి పెద్దఎత్తున విజ్ఞప్తుల వస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ ప్రతీఒక్కరిలో నెలకొంది.

‘ఆర్ఆర్ఆర్’లో కీరవాణి బెస్ట్.. !


విజువల్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ ట్రయల్ షూట్ చేస్తారని, లేదు మళ్లీ షూట్ చేయాలనే ఆలోచనను విరమించుకున్నారని సోషల్ మీడియాలో ప్రస్తుతం రకరకాల వార్తలు వస్తున్నాయి. అయితే లాక్ డౌన్ లో కూడా రాజమౌళి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో బిజీగా గడిపేశాడు. మెయిన్ గా కీరవాణితో మ్యూజిక్ సిట్టింగ్స్ లో కూర్చున్నాడు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ నేపథ్య సంగీతం పై కీరవాణి వర్క్ చేస్తున్నాడు. కాగా ఇప్పటికే ఈ చిత్రం మెయిన్ బి.జి.ఎమ్ ను పూర్తి చేశాడట, కీలకమైన సన్నివేశాల్లో వచ్చే ఈ బి.జి.ఎమ్ బిట్ సినిమా మొత్తంలోనే హైలైట్ గా నిలుస్తోందట.

బీజేపీ దోస్తీ పవన్ కి బలమా… భారమా?

కీరవాణి కెరీర్ లోనే ఈ బి.జి.ఎమ్ బిట్ బెస్ట్ అట. అలాగే ఇప్పటివరకూ షూట్ చేసిన సీన్స్ ను ఎడిటర్ తమ్మిరాజు తన ఇంటిలోని ఎడిటింగ్ చేశారు. అవుట్ ఫుట్ విషయంలో రాజమౌళి పూర్తి సంతృప్తిగా ఉన్నట్లు, తారక్ యాక్టింగ్ ఓ రేంజ్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు రచయిత సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగ్స్.. మెయిన్ గా తెలంగాణ యాసలో ఎన్టీఆర్ పలికే డైలాగ్ లు చాలా బాగుంటాయట. నిజానికి రాజమౌళి తన సినిమాల్లో ఎక్కువుగా విజువల్స్ ని తప్ప.. డైలాగ్ లను పెద్దగా నమ్ముకొరనేది వాస్తవం. కానీ ఈ చిత్రంలో రాజమౌళి డైలాగ్ లకి కూడా ప్రత్యేకంగా ఎన్టీఆర్ డైలాగ్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారట.

చంద్రబాబు కోటరీ బీజేపీని దెబ్బతీస్తుందా?

డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కాగా ‘బాహుబలి’ తరవాత జక్కన్న చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రం పై ఆరంభం నుండి భారీ అంచనాలు భారతీయ అన్ని సినీ పరిశ్రమల్లో నెలకొన్నాయి.

కరోనా పరీక్షల పేరుతో వల పన్నుతున్న సైబర్ కేటుగాళ్లు


కరోనా వైరస్ సోకకుండా ప్రజలంతా ఇళ్లకే పరిమితమై ప్రాణాలను కాపాడుకుంటుంటే మరోవైపు సైబర్ నేరగాళ్లు దానినే క్యాష్ గా మార్చుకుంటున్నారు. కోవిడ్-19 ఫ్రీ టెస్టుల పేరిట మొయిల్ పంపుతూ హ్యకింగ్ కు పాల్పడుతున్నారు. ఇప్పటికే దేశంలోని 20లక్షల మందికి హానికర మొయిల్ వెళ్లినట్లు కేంద్రం గుర్తించి అప్రమత్తం చేస్తోంది. కోవిడ్ ఫ్రీ టెస్టుల పేరిట వస్తున్న నకిలీ మొయిల్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుది. ఈ మొయిల్స్ తెరిస్తే వ్యక్తిగత సమాచారం హ్యకింగ్ గురయ్యే ప్రమాదం ఉందని కేంద్రం హెచ్చరిస్తోంది.

చంద్రబాబు కోటరీ బీజేపీని దెబ్బతీస్తుందా?

దేశంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాలనే సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌, చెన్నై, అహ్మదాబాద్‌ వంటి నగరాల్లోని ప్రజలందరికీ ఉచితంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తామంటూ పెద్దఎత్తున నకిలీ మెయిల్స్‌ వస్తున్నట్లు ద ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీం(Cert-In) గుర్తించింది. ఈ సంస్థ కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, సమాచార సాంకేతిక మంత్రిత్వశాఖ కింద సైబర్‌ సెక్యూరిటీకి సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షించే ఓ నోడల్‌ ఏజెన్సీ.

ఇప్పటికే దేశంలోని దాదాపు 20లక్షల ఖాతాలకు ఈ హానికర మొయిల్స్ వెళ్లినట్లు సెర్ట్ ఇన్ గుర్తించింది. ఈ నకిలీ ఈ- మెయిల్స్‌ను ఓపెన్ చేస్తే అవి మనల్ని నకిలీ వెబ్‌సైట్ల వైపు తీసుకెళ్తాయని పేర్కొంది. ఆ తర్వాత హానికర ఫైల్స్‌ మన డివైజ్లోకి డౌన్‌లోడ్‌ అవుతాయని తెలిపింది. దీనిద్వారా వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు తస్కరించి మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరించింది.

బీజేపీ దోస్తీ పవన్ కి బలమా… భారమా?

నకిలీ మొయిల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సెర్ట్ ఇన్ సూచించింది. కంప్యూటర్, మొబైల్స్ లో యాంటీవైరస్ టూల్స్ ఉపయోగిస్తే ఇలాంటి మోసాలను నుంచి బయటపడే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే మొయిల్స్ ఓపెన్ చేయకపోవడం మంచిదని సూచిస్తున్నారు. నకిలీ ఈమొయిల్స్ వస్తే https://www.cert-in.org.in/ సమాచారం పంపించాలని సూచిస్తున్నారు. కరోనా భయంతో ప్రజలు అల్లాడుతుంటే దానినే సైబర్ నేరగాళ్లు అనుకూలంగా మార్చుకొని హ్యాకింగ్ పాల్పతుడటంతో ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో కేంద్రం కరోనా ఫ్రీ టెస్టుల పేరిట వచ్చే మొయిల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ చేస్తుంది.