
పెళ్లి అయ్యేదాకా ‘పెళ్లి ఎప్పుడూ’ అనే ప్రశ్నలతో ఒక బాధ అయితే.. పెళ్లి తరువాత ‘పిల్లలు ఎప్పుడూ’ అనే ప్రశ్నతో మరో బాధ. అసలు మనిషి ప్రాధమిక బాధ్యతలా మారిపోయిన ఈ పెళ్లి వ్యవస్థ ఏమి లేని వాడి దగ్గర నుండి అన్ని ఉన్నవాడి వరకూ అందర్నీ ప్రభావితం చేస్తోంది. ప్రస్తుతం అలాంటి ప్రబావితంతోనే ఇబ్బంది పడుతున్నారు ‘అనుష్క శర్మ’ జంట. చాలా ఏళ్ల నుండి గ్యాప్ లేకుండా గ్లామర్ ప్రపంచలో తన అందచందాలను అలుపుసోలుపు లేకుండా అవలీలగా ప్రదర్శిస్తూ వచ్చిన ‘అనుష్క శర్మ’ కొంత విరామాన్ని తీసుకోవాలనే ఉద్దేశ్యంతోనే గత సంవత్సరం నుండి సినిమాలను తగ్గించుకుంది.
భారత – చైనా గొడవల్లో కమ్యూనిస్టులు ఎక్కడ?
అయితే గత కొన్ని నెలలుగా ‘అనుష్క శర్మ’ తల్లి కావడానికే విరామం తీసుకుందని.. సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అయితే తాజాగా ఓ బాలీవుడ్ ప్రముఖ పత్రిక కూడా అనుష్క శర్మ తల్లి కాబోతుందనే విషయాన్ని రూమర్స్ లా కాకుండా డైరెక్ట్ గానే రాసింది.. పైగా నిజమనట్టు రాసుకోచ్చింది. అయితే ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని బాలీవుడ్ డిజిటల్ మీడియా స్పష్టం చేసింది. ప్రస్తుతం ‘అనుష్క శర్మ’ సినిమాలు చేయడం లేదంటే దానికి కారణం ఆమెకు నచ్చిన కథ లేకపోవడమేనట.
కాగా ‘అనుష్క శర్మ’ త్వరలోనే రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఇక విరాట్-అనుష్కల వివాహం డిసెంబర్ 11న ఇటలీలోని 800 ఏళ్ల నాటి గ్రామంలో ఉన్న బోర్గో ఫినోచీటీ రిసార్ట్ లో వైభవోపేతంగా జరిగింది. పైగా ఈ వివాహం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహాల్లో ఒకటిగా నిలిచింది.