Home Blog Page 8427

ఎట్టకేలకు నితిన్ పెళ్లి డేట్‌ ఫిక్స్‌ !


కరోనా దెబ్బకు సినిమాలే కాదు నటీనటుల జీవితాలు కూడా మారాయి. వాళ్ల ప్లాన్స్‌ అన్నీ మారిపోయాయి. టాలీవుడ్‌ నటులు నిఖిల్ సిద్దార్థ్‌, దగ్గుబాటి రానా, నితిన్‌లే ఇందుకు ఉదాహరణలు. ఈ ఏడాదిలో వీళ్ల ముగ్గురి పెళ్లిళ్లు ఫిక్స్‌ అయ్యాయి. డబ్బు, హోదా దండిగానే ఉండడంతో వీళ్ల పెళ్లి ఈ వేడుకులు అంగరంగ వైభవంగా జరగాలి. కానీ, కరోనా అది కుదరదు అంటోంది. లాక్‌డౌన్‌ రూల్స్‌ పాటిస్తూ నిఖిల్‌ పెళ్లి ఇప్పటికే చాలా సింపుల్‌గా జరిగిపోయింది. ఆగస్టులో రానా వివాహ వేడుక కూడా అతి తక్కువ మంది సమక్షంలో జరగనుంది. ఇప్పుడు నితిన్‌ పెళ్లి కూడా అలానే జరగనుంది.

హైదరాబాద్ లో నో-లాక్‌డౌన్.. కారణాలివే?

నిఖిల్, రానా సంగతి ఎలా ఉన్నా ఈ విషయంలో నితిన్‌ది బ్యాడ్‌ లక్‌ అనాలి. ఎందుకంటే తన ప్రేయసి షాలినితో అతను ఫిబ్రవరిలోనే ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నాడు. ఏప్రిల్‌ 16న దుబాయ్‌లో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ ప్లాన్‌ చేసుకున్నాడు. ఇంతలో కరోనా రావడంతో దాన్ని వాయిదా వేసుకున్నాడు. అయినా సరే పరిస్థితులు చక్కబడిన తర్వాత ధూంధాంగా పెళ్లి చేసుకుందామని చాన్నాళ్లే వెయిట్‌ చేశాడు. కానీ, కరోనా వైరస్‌ ఉధృతి తగ్గడం లేదు. హైదరాబాద్‌లో వీర లెవెల్లో విజృంభిస్తోంది. ఫారిన్‌కు వెళ్లే చాన్స్‌ లేదు. ఇండియాలోనే ఇతర నగరాలకు వెళ్లి డెస్టినేషన్‌ వెడ్డింగ్ ప్లాన్‌ చేద్దామంటే ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో అతిథులు రిస్క్‌తో కూడిన ప్రయాణాలు చేసే అవకాశం లేదు. పోనీ ఇంకొంత సమయం వేచి చుద్దామా అంటే మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియడం లేదు. దాంతో ఈ నెలలోనే పెళ్లి జరిపించాలని ఇరు కుటుంబాల పెద్దలు నిశ్చయించారు. ఈ నెల 26న ముహూర్తం ఫిక్స్‌ చేసినట్టు తెలుస్తోంది. పెళ్లి కూడా నగర శివారులోని ఓ ఫామ్ హౌజ్‌లో లేదంటే వధువు ఇంటి దగ్గరే జరిపిస్తారాట. లాక్‌డౌన్‌ నిబంధనల ప్రకారం అతి కొద్ది మంది అతిథులు మాత్రమే హాజరవుతారని సమాచారం.

మరో నటికి కరోనా పాజిటివ్..


కరోనా మహమ్మారి దెబ్బకు సినీ పరిశ్రమ ఇప్పటికే చాలా నష్టపోయింది. థియేటర్లు మూత పడ్డాయి. షూటింగ్స్‌ ఆగిపోయాయి. చిత్రీకరణ పూర్తి చేసుకున్న సినిమాల విడుదల నిలిచిపోయింది. సినిమాలే కాదు సీరియల్స్‌ రంగం కూడా చాలా దెబ్బతిన్నది. దాదాపు మూడు నెలలు షూటింగ్స్‌ లేకపోవడంతో వేలాది మంది ఉపాధి కోల్పోయారు. అయితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ సడలింపులు ఇవ్వడంతో ఈ మధ్యమే షూటింగ్స్‌ తిరిగి మొదలయ్యాయి. లాక్‌డౌన్‌ రూల్స్ పాటిస్తూ, అనేక జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రీకరణ చేస్తున్నారు. దాంతో, అనేక మంది నటులతో పాటు కార్మికులకు పని దొరికింది. కానీ, ఇది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలేలా ఉంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా వైరస్‌ ప్రమాదం తప్పడం లేదు. ఇప్పటికే పలువురు సీరియల్‌ ఆర్టిస్టులకు వైరస్‌ సోకడం పరిశ్రమలో అలజడి రేపింది. సీనియర్ నటుడు ప్రభాకర్, ప్రముఖ యాంకర్ ఓంకార్ కూడా కరోనా బారిన పడినట్టు వార్తలు వచ్చినా అవి పుకార్లే అని తేలాయి. కానీ, తాజా ఓ ప్రముఖ నటికి కరోనా సోకడం ఆందోళన కలిగిస్తున్నది. మా టీవీ ‘ఆమె కథ’ సీరియల్‌ హీరోయిన్‌ నవ్య స్వామికి కరోనా పాజిటివ్‌గా తేలింది.

జగన్ ని తిట్టే బాధ్యత పవన్ ఎలా నెరవేర్చుతాడో?

మూడు, నాలుగు రోజులుగా జ్వరం, తలనొప్పితో బాధపడిన ఆమెకు పరీక్షలు నిర్వహించగా కరోనా నిర్ధారణ అయింది. దాంతో, ఆమె క్వారంటైన్‌లో ఉంది.ఈ విషయాన్ని నవ్యనే స్వయంగా వెల్లడించింది. కరోనా అని తేలినప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నానని, తనను చూసి తల్లి కూడా కన్నీటి పర్యంతమైందని చెప్పింది. విషయం తెలిసి చాలా మంది తనకు ఫోన్లు చేస్తున్నారని, కరోనా లక్షణాలు, చికిత్సకు సంబంధించిన మెసేజ్‌లతో తన వాట్సప్‌ నిండిపోయిందని తెలిపింది. తన సహనటులు, ఇతర సిబ్బందిని ఇబ్బందుల్లోకి నెట్టినందుకు చాలా బాధపడుతునని చెప్పింది. అయినా గుండె నిబ్బరం కోల్పోకుండా ధైర్యంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నానని, కరోనా వచ్చిన వారంతా ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నది. కాగా నవ్యతో కలిసి షూటింగ్స్‌లో పాల్గొన ఇతర నటీనటులకు కూడా పరీక్షలు నిర్వహించారు. వారందరినీ హోం క్వారంటైన్‌లో ఉంచారు. ఏదేమైనా హైదరాబాద్‌లో కరోనా విజృంభిస్తున్న సమయంలో షూటింగ్స్‌ జరపడం ప్రమాదం కొనితెచ్చుకోవడమే అనిపిస్తోంది.

హైదరాబాద్ లో నో-లాక్‌డౌన్.. కారణాలివే?


తెలంగాణలో కరోనా పంజా విసురుతోంది. రోజుకురోజుకు కరోనా కేసుల సంఖ్య భారీగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో నగరవాసులు భయాందోళన చెందుతున్నారు. హైదరాబాద్లో సంపూర్ణ లాక్డౌన్ విధించాలని నగర వాసులు కోరుతుండటంతో ప్రభుత్వం కూడా ఆ దిశగా సన్నహాలు చేసింది. లాక్డౌన్ నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కొలుకుంటున్న సమయంలో మరోసారి సంపూర్ణ లాక్డౌన్ విధిస్తే పరిస్థితులు మరింత దిగజారుతాయని ప్రభుత్వం భావిస్తుంది. మరోవైపు ప్రభుత్వం హైదరాబాద్ సంపూర్ణ లాక్డౌన్ విధిస్తే ప్రభుత్వం కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైందనే సంకేతం ప్రజల్లో వెళుతుందని గ్రహించిన ప్రభుత్వం తమ ఆలోచనను చివరి నిమిషంలో మార్చుకుందని సమాచారం.

జగన్ ని తిట్టే బాధ్యత పవన్ ఎలా నెరవేర్చుతాడో?

హైదరాబాద్లో లాక్డౌన్ విధిస్తే ఆ ప్రభావం రాష్ట్ర ఖాజానాపై పడనుంది. దీని వల్ల మళ్లీ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే గడిచిన మూడునెలలుగా ప్రభుత్వ ఉద్యోగులు సగం జీతాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోసారి లాక్డౌన్ విధిస్తే అన్నివర్గాల ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ప్రజలకు ఉపాధి లేకపోతే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే ప్రమాదం లేకపోలేదు. మరోవైపు సంపూర్ణ లాక్డౌన్ వల్ల పోలీస్ శాఖపై మరింత పని ఒత్తిడి పెరుగుతుంది. అంతే కాకుండా కరోనా కట్టడికి లాక్‌డౌన్ మాత్రమే ప్రత్యామ్నాయం కాదనే ప్రభుత్వం భావిస్తోంది.

హైదరాబాద్లో ప్రభుత్వం లాక్డౌన్ విధించకపోయినపోయినప్పటికీ వ్యాపారులే స్వచ్చంధంగా లాక్డౌన్ పాటిస్తున్నారు. వినియోగదారుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని వ్యాపార సంఘాల ఆధ్వర్యంలో మార్కెట్లను మూసీవేస్తున్నారు. చాలాచోట్ల తక్కువ సమయమే దుకాణాలను తెరుస్తున్నారు. ప్రజలే స్వచ్చంధంగా లాక్డౌన్ పాటిస్తున్న తరుణంలో ప్రభుత్వం లాక్డౌన్ విధించే అవసరం లేదని భావిస్తుంది. హైదరాబాద్‌లో కేసులు భారీగా పెరుగుతున్నా మరణాల రేటు తక్కువగా ఉండటం వల్లే లాక్‌డౌన్ అవసరం లేదని నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు సమాచారం. తాజాగా కరోనా టెస్టులు పెంచుతుండటంతోనే సంఖ్య ఎక్కువగా వస్తోందని.. దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతోన్నారు.

కొత్త సచివాలయ నిర్మాణంపై కేసీఆర్ వ్యూహమేంటి?

అయితే హైదరాబాద్ ప్రభుత్వం సంపూర్ణ లాక్డౌన్ విధిస్తుందనే ప్రచారం నేపథ్యంలో ఇప్పటికే చాలామంది సొంతూళ్లకు తరలివెళుతున్నారు. దీంతో హైదరాబాద్-విజయవాడ హైవే రద్దీగా మారింది. తెలంగాణ-ఏపీ సరిహద్దుల్లో కిలోమీటర్ల కొద్ది వాహనాలు భారీగా నిలిచిపోయాయి. నగరవాసులు నుంచి పెద్దఎత్తున విజ్ఞఫ్తులు రావడంతో తొలుత హైదరాబాద్లో సంపూర్ణ లాక్డౌన్ విధించాలని ప్రభుత్వం భావించినప్పటికీ చివరి నిమిషంలో వాయిదా వేసుకున్నట్లు సమాచారం. అయితే ప్రభుత్వం లాక్‌డౌన్ విధించినా.. విధించకపోయినా కరోనాపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

టీడీపీ నేతల దృష్టిలో ఆంబులెన్సులన్నీ గ్రాఫిక్స్ ?


డాక్టర్స్ డే సందర్భంగా నిన్న 108, 104 సర్వీసులకు సంబంధించిన 1088 కొత్త ఆంబులెన్స్ వాహనాలను విజయవాడ వేదికగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. మనిషి ప్రాధమిక అవసరాలలో ముఖ్యమైన వైద్యం విషయంలో జగన్ వేసిన ముందడుగుకు దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం అయ్యింది. పలు జాతీయ మీడియా సంస్థలు ఈ వార్తను ప్రముఖంగా ప్రస్తావించడం జరిగింది. అత్యాధునిక సౌకర్యాలతో అందుబాటులోకి వచ్చిన ఈ వాహనాలు ప్రజల ప్రాణాలను కాపాడంతో పాటు, మెరుగైన సేవలు అందిస్తాయని అందరూ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

జగన్ ని తిట్టే బాధ్యత పవన్ ఎలా నెరవేర్చుతాడో?

జగన్ ఇమేజ్ ని పెంచే ఏ విషయమైనా ప్రతిపక్ష పార్టీగా ఉన్న టీడీపీకి నచ్చని అంశమే. దీనితో 108, 104 వాహనాల ప్రారంభానికి వారు అవినీతి మరక అంటించారు. వైసీపీ పార్టీ ఎంపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆంబులెన్స్ల కొనుగోళ్లు విషయంలో భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా కేటాయింపులు జరిపి తన బంధువులకు భారీగా లబ్ది చేకూర్చారు అని ఆరోపిస్తున్నారు. ఆంబులెన్సుల కొనుగోళ్ళకు వ్యవహారంలో 300 కోట్ల అవినీతి జరిగింది అనేది టీడీపీ నాయకుల వాదన.

ఐతే ఇక్కడ మనం గమనించాల్సింది, కొత్త ఆంబులెన్సు వాహనాల కొనుగోలు మరియు ఆధునికీకరణకు ప్రభుత్వం ఖర్చు చేసింది రూ. 201 కోట్లు మాత్రమే అని ప్రకటించడం జరిగింది. రూ. 201 కోట్ల ప్రాజెక్ట్ లో రూ. 300 కోట్ల అవినీతి ఎలా జరిగింది అనేది..అర్థం కానీ ఆరోపణ. ఒక వేళ ఇది మొత్తంగా రూ. 500 కోట్ల ప్రాజెక్ట్ అయినప్పటికీ రూ. 300 కోట్ల మేర అవినీతి జరిగే అవకాశం లేదు. అసలుకు మించిన అవినీతి ఎలా సాధ్యం అవుతుంది. అలా జరగాలంటే రోడ్లపైకి వచ్చిన ఆంబులెన్సుల గ్రాఫిక్స్ బొమ్మలు అయ్యుండాలి…లేదా ఇంజను లేని డమ్మీ వాహనాలు అయ్యుండాలి.

ఈ ఒక్క పనితో జాతీయస్థాయిలో హీరో అయిన జగన్

మరో వైపు డాక్టర్స్ డే సంధర్భంగా పురస్కరించుకొని ప్రారంభించిన ఈ కార్యక్రమానికి విజయ సాయి రెడ్డి బర్త్ డే ట్యాగ్ వాడుతున్నారు. ఓ వారం రోజులు క్రితం శ్రీకాకుళం జిల్లాలో కరోనా వైరస్ బారినపడి మరణించిన వృద్ధుడి శవాన్ని జేసీబీ లో తరలించడానికి కారణం అంబులెన్సులు ప్రచార ఆర్భాటం కోసం విజయవాడ తరలించడమే అని ఆరోపిస్తున్నారు. ఇది ఒక వేళ నిజం అనుకున్నా…గోదావరి పుష్కరాలలో బాబు ప్రచార ఆర్భాటం వలన మరణించిన 24 మంది అమాయకుల ప్రాణాలతో పోల్చితే శవాన్ని జేసీబీ లో తరలించడం… ఏపాటి అన్యాయంతో కూడిన ఆర్బాటమో టీడీపీ నాయకులు సెలవిస్తే మంచిది.

కొత్త సచివాలయ భవన నిర్మాణానికి రంగం సిద్ధం?


పాత సచివాలయ భవననాలను కూల్చివేసి దాని స్థానంలో కొత్త భవన నిర్మాణానికి రంగం సిద్ధమౌతున్నట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించి అన్ని రకాల అడ్డంకులు తొలిగిపోవడంతో… ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయిచింది. ఇందుకోసం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెలాఖరులోగా భవనాలన్నింటినీ నేలమట్టం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. శ్రావణ మాసంలో టెండర్లు నిర్వహించి కొత్త భవన సముదాయం నిర్మాణ పనులను ప్రారంభించే అవకాశముందని తెలుస్తోంది. హైకోర్టు తీర్పు వచ్చిన రోజే డీ–బ్లాక్‌ లోని ఐటీ శాఖ సర్వర్‌ ను ప్రభుత్వం బీఆర్‌ కేఆర్‌ భవన్‌ కు తరలించడంతో పాటు మీడియా పాయింట్‌ ను సైతం ఖాళీ చేయించి సచివాలయ ప్రధాన ప్రవేశ ద్వారం గేట్లకు తాళాలు వేయించారు. ఏళ్ల తరబడిగా సచివాలయంలో నిరుపయోగంగా ఉన్న వాహనాల తరలింపును సైతం నిన్నటి నుంచి ప్రారంభించింది.

ప్రభుత్వ ఆదేశాల మేరకు నిరుపయోగంగా ఉన్న వాహనాలను క్రేన్ల సహాయంతో సైఫాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు నిజాం కళాశాల మైదానానికి తరలించారు. వందకు పైగా కార్లు, జీపులు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు వీటిలో ఉన్నాయి. రవాణాశాఖ పరిశీలించి ధరలను ఖరారు చేశాక… బహిరంగ వేలం ద్వారా వీటిని విక్రయించే అవకాశముంది. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం పెద్ద సంఖ్యలో కొత్త వాహనాలను కొనుగోలు చేయడంతో చాలా మంది అధికారులు తమ పాత వాహనాలను సచివాలయంలో నిరుపయోగంగా ఉంచారు. వీటిలో పనికి వచ్చే వాహనాలను గుర్తించి వేలం వేయనున్నట్టు తెలుస్తోంది.

జగన్ ని తిట్టే బాధ్యత పవన్ ఎలా నెరవేర్చుతాడో?


సామాజిక న్యాయం, సమసమాజ స్థాపన, రాజకీయ ప్రక్షాళన ఇవి జనసేన పార్టీ అజెండాలోని కొన్ని అంశాలు. చెప్పుకున్న సిద్ధాంతాలు విలువలు ఒక్కొక్కటి గాలికి వదిలేస్తూ వస్తున్నాడు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. 2014 ఎన్నికల ముందు పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ఆదిలోనే హంసపాదన్న తీరున, గతంలో అవినీతి పరుడన్న బాబుని..అనుభవజ్ఞుడు కనుక ఆయనకే నా సపోర్ట్ అని టీడీపీ, బీజీపీ కూటమిలో చేరారు. జనసేన చెప్పుకునే రాజకీయ ప్రక్షాళన అనే అంశం దీనితో ఆయన తుంగలో తొక్కినట్లయ్యింది. ప్రజల్లో జనసేన పార్టీ ఒక ఆశాకిరణం అనే ఆలోచన తొలగించిన అంశం మొదట్లోనే టీడీపీ, బీజేపీకి మద్దతు ఇవ్వడం. అందరూ అవినీతి పరులే అనే పార్టీ పెట్టిన పవన్ వారితో ఎలా చేతులు కలుపుతాడు అనేది ప్రజల మనస్సులోకి చేరింది.

ఈ ఒక్క పనితో జాతీయస్థాయిలో హీరో అయిన జగన్

2019 ఎన్నికలకు సరిగ్గా ఏడాదికి ముందు బీజేపీని, ప్రధాని మోడీని తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రానికి అన్యాయం చేశారని సభలపై పెద్ద పెద్ద ప్రసంగాలు చేశారు. కొంత కాలానికి టీడీపీ ని కూడా విభేదించిన బయటకు రావడం, సోలోగా ఎన్నికల బరిలో దిగడం జరిగింది. ఎన్నికల ఫలితాల అనంతరం ఘోర పరాజయం తరువాత పట్టుమని పదినెలలకు కూడా గడవక ముందే పవన్ సహచర్యం, తోడులేకుండా రాజకీయాలు చేయలేకపోయాడు. తిట్టిన మోడీనే భేష్ అంటూ..మోడీకి మిత్రుడుగా.. ప్రాధాన్యం లేని బీజేపీ సహచర పార్టీగా మిగిలిపోయాడు.

బీజేపీతో చేరిన తరువాత ఆయన మాట తీరు సిద్ధాంతాలు కూడా మారిపోయాయి. హిందూత్వ పార్టీగా పేరున్న బీజేపీలో చేరిన పవన్ సామాజిక న్యాయం, సమసమాజం అనే అంశాలను వదిలేసినట్టే. కాగా నిన్న ఆయన ఏకంగా చాతుర్మాస్య దీక్ష తీసుకున్నారు. దీనిలో భాగంగా నాలుగు నెలలు కఠిన నియమాలు పాటించనున్నారు. బ్రహ్మ చర్యం, ఒంటి పూట భోజనం, నదీస్నానం, నేలపై పడక వంటి నియమాలతో పాటు.. కోపం, ద్వేషం, ఇతరులను నిందించకుండా ఉండడం వంటి కఠిన నియమాలు పాటించాలి.

కొత్త సచివాలయ నిర్మాణంపై కేసీఆర్ వ్యూహమేంటి?

రాజకీయ నాయకుడిగా ఉంటూ ఇతరులను ద్వేషించకుండా ఉండడం సాధ్యమేనా. మరి ఈ నాలుగు నెలలు జగన్ తిట్టే కార్యక్రమం సంగతి ఏమవుతుంది. జగన్ పేరు చెబితే ఊగిపోయే పవన్… కోపం, ద్వేషం అనే ఫీలింగ్స్ కి ఈ నాలుగు నెలలు ఫుల్ స్టాప్ పెడతాడా. కాగా దీక్ష నియమాలలో అబద్దాలు ఆడకూడదనే నియమం కూడా ఉంది. మనసులో మంచిపని అని తెలిసినా, మైకుల ముందు సీఎం ని విమర్శించడం ప్రత్యర్థి పార్టీగా ఆయన లక్ష్యం. మరి ఈ నాలుగు నెలలు మంచిని మంచిగా.. చెడుని చెడుగా…పవన్ విభజించి మాట్లాడుతారా. కోపం ద్వేషం వదిలేస్తే ఆయన దీక్ష కాలంలో జగన్ ఎలా తిట్టడగలడు చెప్పండి. మరి ఈ దీక్షలో పవన్ రాజకీయాలు ఎలా ఉంటాయో చూడాలి.

చైనాకు ఆర్థికంగా మరో షాక్ ఇచ్చిన భారత్?


భారత్-చైనా సరిహద్దుల్లో ఘర్షణ తర్వాత ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. గాల్వానాలోయలో భారత జవాన్లను చైనా దొంగదెబ్బ తీసింది. ఈ ఘటనలో 21మంది భారత జవాన్లు వీరమరణం పొందగా చైనాకు చెందిన 40మంది సైనికులు మృతిచెందినట్లు సమాచారం. చైనా తమ సైనికులు ఎంతమంది చనిపోయారనేది మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఈ ఘర్షణలో చైనాను భారత్ సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టడంతో ఆ దేశానికి భారీగానే నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అయితే భారత జవాన్లను దొంగదెబ్బ తీయడంపై యావత్ భారత్ తోపాటు కేంద్రం కూడా సీరియస్ అయింది. చైనాతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతోంది.

ఈ ఒక్క పనితో జాతీయస్థాయిలో హీరో అయిన జగన్

అమర జవాన్ల మరణం ఊరికేపోదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ప్రధాని మోదీ సైతం స్పష్టం చేశారు. సరిహద్దుల్లో కమాండర్ స్థాయి అధికారులకు పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకునే అధికారాన్ని కల్పించారు. అంతేకాకుండా త్రివిధ దళాలు సిద్ధంగా ఉండాలని ఆదేశాలిచ్చారు. ఈమేరకు త్రివిధ దళాలు అలర్ట్ అయ్యారు. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే యుద్ధరంగంలో దిగేందుకు సన్నద్ధంగా ఉన్నాయి. ఈ ఘర్షణ అనంతరం ఇరుదేశాల మధ్య ఇప్పటివరకు మూడుసార్లు ఆర్మీ, దౌత్య స్థాయి అధికారుల సమావేశాలు జరిగాయి. ఈ మూడుసార్లు కూడా చర్చలు అర్ధాంతంగా ముగినట్లు తెలుస్తోంది.

సరిహద్దుల్లో చైనా వెనక్కి వెళుతున్నట్లు చెబుతూనే సరిహద్దుల్లో తన సైన్యాన్ని మోహరిస్తోంది. దీంతో భారత్ కూడా చైనాను సమర్ధంతంగా తిప్పికొడుతోంది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధమనేనని భారత ఆర్మీ కేంద్రానికి తెలిపింది. అయితే చైనాకు భారత్ సరైన గుణపాఠం చెప్పేందుకు ఎదురుచూస్తున్నారు. చైనాను ఒక రక్షణపరంగానే కాకుండా ఆర్థికంగా, దౌత్యపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. దేశంలో చైనా వస్తువుల బహిష్కరించాలని డిమాండ్ వస్తున్న తరుణంలోనే కేంద్రం తాజాగా చైనాకు చెందిన 59యాప్స్ ను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. వీటికి ముందుగానే చైనాకు చెందిన పలు కాంట్రాక్టులను కేంద్రం రద్దుచేసి చైనాకు గట్టి షాకిచ్చింది.

వావ్.. కరోనాకు ఫేర్ వెల్ పార్టీ.. వైరల్ వీడియో

తాజాగా కేంద్రం చైనాకు మరో షాకిచ్చింది. హైవే ప్రాజెక్టుల్లో చైనా సంస్థలు, చైనాతో భాగస్వామ్యం ఉన్న సంస్థలకు అనుమతి ఇవ్వకూడదని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ బుధవారం తెలిపారు. వీటికి సంబంధించిన విధి విధానాలు త్వరలో రూపొందించనున్నట్లు ఆయన తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు, వివిధ రంగాల్లోనూ చైనా పెట్టుబడిదారులను ప్రోత్సహించకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

మరోవైపు టెలికాం రంగంలో చైనాకు చెందిన 5జీ సేవలను నిలిపివేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ నిర్ణయాల ద్వారా చైనాకు ఆర్థికంగా గట్టి ఎదురుదెబ్బ పడునుంది. దీంతో చైనా కంపెనీలు కలవరానికి గురవుతున్నాయి. రానున్న రోజుల్లో చైనాకు మరిన్ని షాకులు ఇచ్చేందుకు మోడీ సర్కార్ ఈమేరకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు సమాచారం. మున్మందు చైనాకు చుక్కలు చూపించడం ఖాయమనే వాదనలు విన్పిస్తున్నాయి..

సమస్యల్లో అమ్మ బయోపిక్ !


తమిళ ప్రజల ఆరాధ్య ముఖ్యమంత్రి జయలలితగారి జీవితం ఆధారంగా, బాహుబలితో నేషనల్ రైటర్ అయిపోయిన విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో, టాలెంటెడ్ డైరెక్టర్ ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో వస్తోన్న బయోపిక్ ‘తలైవి’. అమ్మ బయోపిక్ అనేసరికి మొదటినుండి ఈ సినిమా పై ఆసక్తి ఎక్కువైంది. అయితే ఈ సినిమాకి కొత్తగా సమస్యలు ఎదురయ్యాయి. తాజాగా ఈ సినిమా ఎడిటింగ్ పూర్తి అయిందట. మళ్ళీ చాలా సీన్స్ ను రీషూట్ చేయాలట. కారణం.. ఈ బయోపిక్ లో జయలలిత పాత్రలో బాలీవుడ్ బోల్డ్ క్వీన్ కంగనా రనౌత్.. ఎం.జి.ఆర్ పాత్ర‌లో ప్ర‌ముఖ న‌టుడు అరవింద స్వామి చేస్తున్నారు. కానీ బోల్డ్ హీరోయిన్ కంగనా పక్కన అరవింద స్వామి సీన్స్ సరిగ్గా సెట్ అవ్వలేదట.

ఈ ఒక్క పనితో జాతీయస్థాయిలో హీరో అయిన జగన్

దానికి తోడు ఎంజీఆర్ ఆవేశం కూడా అరవింద స్వామిలో మిస్ అయిందట. ఇక చేసేదేమి లేక బాగా రాని సీన్స్ ను మళ్ళీ షూట్ చేయాలని డిసైడ్ అయ్యారు మేకర్స్. కరోనా ప్రభావం తగ్గాక ఈ సీన్స్ తోనే షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. నిజానికి బయోపిక్ కాబట్టి పాత్రలకు అనుగుణంగా నటీనటులను తీసుకోవాలి.. అసలు జయలలిత ఆహార్యానికి కంగనా ఫిగర్ ఎక్కడైనా మ్యాచ్ అవుతుందా.. పైగా జయలలిత – ఎంజీఆర్ మధ్య ప్రేమ, సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే. వీరి స్థాయిలో రిలేషన్ ఎస్టాబ్లిష్ అవ్వాలంటే.. కంగనా – అరవింద స్వామి మధ్య కెమిస్ట్రీ ఏ రేంజ్ లో ఉండాలి. మొత్తానికి బోల్డ్ హీరోయిన్ కి కూల్ హీరోకి మధ్య రొమాన్స్ సింక్ అవ్వలేదాయే.

వావ్.. కరోనాకు ఫేర్ వెల్ పార్టీ.. వైరల్ వీడియో

పైగా మేకర్స్ కి మరో సమస్య కూడా ఉంది. కంగనా రనౌత్ ను అచ్చం అమ్మలా మార్చెందుకు హాలీవుడ్ మూవీ ‘డార్కెస్ట్ హవర్’కి మేకప్ మెన్ గా పనిచేసిన ‘గ్యారీ ఓల్డ్ మెన్, ‘అమ్మ’ బయోపిక్ కోసం ఇండియాకి తీసుకువచ్చారు. ఈ కరోనా సమయంలో ఆయన మళ్ళీ హాలీవుడ్ నుండి ఇండియాకి వచ్చే పరిస్థితి లేదు. దాంతో మేకప్ బ్యాచ్ మొత్తాన్ని మార్చాలి. అయితే కంగనాని మాత్రం ఒక విషయంలో అభినందించాలి. ఈ బాలీవుడ్ క్వీన్.. సినిమా కోసం దాదాపు పది కిలోలు వరకూ కంగనా బరువు పెరిగింది. మరి జయలలిత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలతో పాటు ఆమె బాధను ఆమె భావోద్వేగాలను కంగనా ఎంతవరకు పలికించగలదో చూడాలి.

కొత్త సచివాలయ నిర్మాణంపై కేసీఆర్ వ్యూహమేంటి?


సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్త సచివాలయాన్ని నిర్మించాలని భావిస్తున్నారు. ఇప్పటివరకు తెలంగాణ పాత సచివాలయానికి రాకుండా ప్రగతి భవన్ నుంచి అన్ని పనులను కేసీఆర్ చక్కబెడుతున్న సంగతి తెల్సిందే. పాత సచివాలయ స్థానంలో కొత్త సచివాలయం నిర్మించాలని సీఎం కేసీఆర్ గతంలోనే భూమిపూజ చేశారు. దీనిపై ప్రతిపక్ష నేతలు హైకోర్టును ఆశ్రయించడంతో ఈ పనికి బ్రేక్ పడింది.కొన్నినెలలుగా దీనిపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. తాజాగా హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో కొత్త సచివాలయ నిర్మాణానికి ప్రభుత్వానికి అడ్డంకులు తొలగాయి. హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇక ఆలస్యంగా చేయకుండా త్వరగా పనులు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

ఈ ఒక్క పనితో జాతీయస్థాయిలో హీరో అయిన జగన్

హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రతిపక్ష నేతలు సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు రెడీ అవుతున్నాయి. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో సుప్రీంకోర్టు అత్యవసర కేసులను మాత్రమే విచారణ చేపడుతోంది. దీంతో ప్రతిపక్ష నేతలు సుప్రీంను ఆశ్రయించినా ఫలితం ఉంటుందో? లేదో తెలియని పరిస్థితి నెలకొంది. సుప్రీంలో ఆలస్యంగా పిటిషన్ దాఖాలు చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండొదని విపక్ష నేతలు భావిస్తున్నారు. ప్రభుత్వం ఈలోపు పనులు మొదలుపెట్టి సచివాలయాన్ని కూల్చివేస్తే ఇక చేసేదేమీ ఉందబోదని నేతలు భావిస్తున్నారు. దీంతో ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలని పిటిషన్ దారులు మల్లగుల్లాలు పడుతోన్నారు.

మరోవైపు ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని ఆధునిక సాంకేతిక ఉపయోగించి త్వరగా కూల్చివేసేందుకు సన్నహాలు చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ ను అధికార యంత్రాంగం సిద్ధం చేసినట్లు సమాచారం. గతంలోనే సీఎం కేసీఆర్ కొత్త సచివాలయాన్ని నిర్మాణానికి రూ.500కోట్ల రూపాయాలు ఖర్చవుతుందని అంచనా వేసింది. అన్నిహంగులతో సచివాలయాన్ని నిర్మించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. అయితే ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో అన్ని కోట్లు ఖర్చుపెట్టి నిర్మిస్తారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

వావ్.. కరోనాకు ఫేర్ వెల్ పార్టీ.. వైరల్ వీడియో

రాష్ట్రంలో లాక్డౌన్ కారణంగా తెలంగాణ ఆదాయం భారీగా పడింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులందరికీ గడిచిన మూడునెలలుగా సగం జీతంతోనే ప్రభుత్వం సరిపెట్టింది. ఇటీవల లాక్డౌన్ సడలింపుల అనంతరం ఇప్పుడిప్పుడే తెలంగాణకు తిరిగి ఆదాయం సమకూరుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం రూ.500కోట్లతో సచివాలయం నిర్మాణం చేపట్టానికి ముందుకొస్తే విపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం ఖాయంగా కన్పిస్తోంది. ఇప్పటికిప్పుడు కొత్త సచివాలయం నిర్మించాల్సిన అవసరం ఏంటని ప్రతిపక్షాలు ప్రశ్నలు లెవనెత్తే అవకాశం లేకపోలేదు.

మరోవైపు కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం కొత్త సచివాలయ నిర్మాణాన్ని ముందుకు తీసుకెళితే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం తెలంగాణకు మళ్లీ ఆదాయం వస్తుందని సచివాలయ నిర్మాణంలో పెద్దగా అడ్డంకులు ఉండబోవని చెబుతోంది. ఇలాంటి సమస్యలను సీఎం కేసీఆర్ అవలీలాగా చెక్ పెడుతారని వాదనలు విన్పిస్తున్నాయి. దీంతో ప్రతిపక్షాలు కొత్త సచివాలయ నిర్మాణాన్ని ఎంతవరకు అడ్డుకుంటాయనేది వేచి చూడాల్సిందే..!

తెలంగాణ ప్రభుత్వం మారదంతే..?


తెలంగాణ ప్రభుత్వం మారడం లేదు. స్వయంగా హైకోర్టు ఆదేశించినా మేమింతే అంటున్నారు. సీఎం కేసీఆర్ సార్.. అస్సలు తగ్గడం లేదు. అందుకే తాజాగా మరోసారి హైకోర్టు ఆగ్రహానిక గురయ్యారు. ఈసారి కొంచెం కఠినంగా తెలంగాణ ప్రభుత్వానికి హెచ్చరికలు పడ్డాయి. ప్రజారోగ్యం విషయంలో కేసీఆర్ నిర్లక్ష్యంపై ఇప్పుడు సామాన్యుల్లోనే కాదు.. హైకోర్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం తెలంగాణలో చర్చనీయాంశమైంది..

ఈ ఒక్క పనితో జాతీయస్థాయిలో హీరో అయిన జగన్

అసలు మొదట కరోనాపై యుద్ధం ప్రకటించి రోజూ ప్రెస్ మీట్ పెట్టి హల్ చల్ చేసిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు కాడి వదిలేశాడన్నది ఎవరికీ అంతుబట్టని ప్రశ్న. కరోనాను కంట్రోల్ చేయలేం అని చేతులెత్తేశాడా? తెలంగాణలో కరోనా టెస్టులు చేయమని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం దేనికి సంకేతం అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.

కరోనా తెలంగాణలో తీవ్రంగా వ్యాపిస్తుంది. హైదరాబాద్ లో అయితే రోజుకు సగటున 1000 చొప్పున కేసులు నమోదవుతున్నాయి. కరోనాకు హాట్ స్పాట్ గా హైదరాబాద్ తయారైంది. అలాంటి తెలంగాణలో కరోనా టెస్టులకు కేసీఆర్ స్వస్తి పలకడంపై తాజాగా హైకోర్టు మరోసారి సీరియస్ అయ్యింది. కరోనా పరీక్షలను నిలిపివేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాలనే తెలంగాణ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని.. అమలు చేయడం లేదని మండిపడింది. ఈ నెల 17లోగా న్యాయస్థానం ఉత్తర్వులను అమలు చేయకపోతే ఈనెల 20న సీఎస్, వైద్యారోగ్య, మున్సిపల్ ముఖ్యకార్యదర్శులు, జీహెచ్ఎంసీ కమిషనర్ కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని హైకోర్టు తీవ్ర స్వరంతో హెచ్చరికలు జారీ చేసింది.

వావ్.. కరోనాకు ఫేర్ వెల్ పార్టీ.. వైరల్ వీడియో

రాష్ట్రంలో కరోనా పరీక్షలు, మీడియా బులెటిన్ లో అరకొర సమాచారం పై ఇదివరకే హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి అల్టీమేటం జారీ చేసింది. తాజాగా హైకోర్టు చెప్పినా అమలు చేయనందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. మీడియా బులెటిన్ లో వార్డుల వారీగా కీలక సమాచారం ఉండాలన్న ఆదేశాలు అమలు కావడం లేదని వ్యాఖ్యానించింది. కరోనా నుంచి ప్రజలను కాపాడాల్సిన రాజ్యాంగ పరమైన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్న హైకోర్టు.. కరోనా పరీక్షలు నిలిపివేస్తూ ప్రజారోగ్య డైరెక్టర్ ఉత్తర్వులు ఇవ్వడం ఆశ్చర్యకరమని ఆవేదన వ్యక్తం చేసింది. ఐసీఎంఆర్ నిబంధనలకు విరుద్ధంగా పీహెచ్ డైరెక్టర్ ఉత్తర్వులు ఉన్నాయని పేర్కొంది. రాష్ట్రంలో కంటైన్మెంట్ విధానమేంటో తెలపాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో కంటైన్మెంట్ ప్రాంతాల వివరాలు సమర్పించాలని ఆదేశించింది. రాష్ట్రంలో 20 రోజులుగా జరిగిన కరోనా పరీక్షల వివరాలు తెలపాలని కోరింది. కేంద్ర బృందం పరిశీలనలో తేలిన అంశాలను సమర్పించాలంది.

ఇలా హైకోర్టు ఆదేశించినా.. హైదరాబాద్ రోగులు ఆస్పత్రుల్లో వసతులు లేక చనిపోతున్నామని వీడియోల్లో మొత్తుకుంటున్నా నిమ్మకు నీరెత్తినట్టు కేసీఆర్ సర్కార్ వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా హైకోర్టు ఆదేశంతోనైనా తెలంగాణ సర్కార్ కరోనా టెస్టులు చేయడం.. అరికట్టడంపై దృష్టిసారిస్తుందో వేచిచూడాల్సి ఉంది.

స్టార్ హీరో ఫ్యామిలీకి కరోనా లేదు !


కరోనా మహమ్మారికి ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ముఖ్యంగా మతం ప్రాంతం లాంటి వ్యత్యాసాలను కరోనా పట్టించుకోదు. నిర్లక్ష్యంగా దొరికిరా.. కాటు వేయటానికి రెడీగా ఉంటుంది. ఇప్పటికే సామాన్యులతో పాటు ప్రముఖులనూ అది భయపెడుతుంది. డబ్బు ఉంటే వైద్యం.. కానీ కరోనాకి రెండూ ఉన్న మందే లేదు అన్న మాదిరిగా తయారయింది ప్రస్తుత పరిస్థితి. ఇప్పటికే మన తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు కూడా కరోనా బారిన పడి.. బాధ పడుతున్నారు. టాలీవుడ్లోనూ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కూడా కరోనా బాధితుడే.

ఈ ఒక్క పనితో జాతీయస్థాయిలో హీరో అయిన జగన్

అయితే తెలుగు పరిశ్రమలో స్టార్ హీరోలు మాత్రం కరోనాకి దూరంగా జాగ్రత్తగా ఉంటున్నారు. కానీ బాలీవుడ్ టాప్ స్టార్ అమీర్ ఖాన్ అండ్ ఆయన ఫ్యామిలీ గత రెండు రోజులుగా కరోనా టెన్షన్ అనుభవిస్తున్నారు. తాజగా ఆమీర్ కరోనాకి సంబంధించి ట్వీట్ చేస్తూ.. తన తల్లిగారికి కూడా కరోనా టెస్ట్ చేయగా రిజల్ట్ నెగెటివ్ అని వచ్చిందని.. ఎంతో టెన్షన్ తరువాత ఆ వార్త ఆమీర్ కి భరోసా ఇచ్చిందని ఆయన మాటలను బట్టి అర్ధమవుతుంది. అమీర్ అభిమానులను ఉద్దేశించి.. తమ కై ప్రార్ధనలు చేసిన ఫ్యాన్స్ కి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు’ అని తెలిపారు. నిజానికి ఎప్పుడైతే అమీర్ ఖాన్ వ్యక్తిగత సిబ్బందిలో కొందరికి కరోనా పోజిటివ్ అని వచ్చిందో.. అప్పుడే అమీర్ ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కసారిగా టెన్షన్ తో భయపడిపోయారు.

వావ్.. కరోనాకు ఫేర్ వెల్ పార్టీ.. వైరల్ వీడియో

అమీర్ ఖాన్ సైతం చాల కంగారు పడ్డారని బాలీవుడ్ మీడియా రాసుకొచ్చింది. ఏది ఏమైనా అమీర్ ఖాన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కరోనా టెస్ట్ చేయగా.. అందరికీ నెగిటివ్ అని వచ్చింది. ఇక ప్రస్తుతం అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా అనే సినిమా చేస్తున్నాడు. 1994లో వచ్చిన ఫారెస్ట్ గంప్ అనే హాలీవుడ్ మూవీకి రీమేక్ గా ఈ సినిమా వస్తుందని.. దర్శకుడు అద్వైత్ చందన్ ఈ సినిమాని హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది.

 

‘బన్నీ – సుక్కు’ రిస్క్ చేస్తున్నారా.. ?


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో సినిమా వస్తోందంటేనే.. ఆడియన్స్ లో అంచనాలు రెట్టింపు ఆవుతాయి. మరి ఈ సారి సుక్కు ఆ అంచనాలను అందుకుంటాడా ? రాబోతున్న ‘పుష్ప’ సినిమాతో మరో భారీ హిట్ కొడతారా ? మేకర్స్ మాత్రం సినిమా పై విపరీతమైన హోప్స్ పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. ఈ సినిమాకి ఏకంగా 110 కోట్లు బడ్జెట్ వేశారాట. కరోనా తరువాత కూడా బడ్జెట్ లో మార్పు లేదట. బన్నీ – సుక్కు రిస్క్ చేస్తున్నారా.. నిజానికి అంత బడ్జెట్ పెట్టి.. ఎంత గొప్పగా తీసినా.. బన్నీకి తెలుగులో, కొంతవరకు మలయాళంలో తప్ప ఇంకెక్కడా మార్కెట్ లేదు. మరి అన్ని లెక్కలు చూసుకునే భారీ బడ్జెట్ పెడుతున్నారంటే.. సినిమా పై వారికున్న నమ్మకమే కారణమేమో.

రేపు క్యాబినెట్ మీటింగ్.. హైదరాబాద్ ఖాళీ..!

ఇక ఆగ‌స్ట్ నుండి ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ చేసి సాధ్యమైనంత తక్కువ మంది స‌భ్యుల‌తో షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ షెడ్యూల్ లో బన్నీ – రష్మిక పై సాంగ్ షూట్ చేయనున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే సాంగ్స్ కి ఎక్కువ మంది డాన్సర్స్ కావాల్సి రావడం, ఎక్కువ రోజులు షూట్ చేయాల్సి రావడంతో ముందుగా సాంగ్స్ కంటే కూడా.. తక్కువమంది ఆర్టిస్ట్ లు ఉన్న సీన్స్ నే షూట్ చేయాలనుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌ కోసం బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌటెలాను ఫైనల్ చేశారు.

ఈ ఒక్క పనితో జాతీయస్థాయిలో హీరో అయిన జగన్

అయితే రష్మిక మందన్న కథానాయికగా అంటేనే బన్నీ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. మహేష్ పక్కన రష్మిక పెద్దగా సెట్ కాలేదు. మరి బన్నీ సరసన ఎలా ఉంటుందో చూడాలి. దేవీ శ్రీ పుష్ప సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఇప్పటికే నాలుగు ట్యూన్స్ కూడా ఇచ్చాడట. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తుంది.

వావ్.. కరోనాకు ఫేర్ వెల్ పార్టీ.. వైరల్ వీడియో


ప్రపంచ దేశాలు కరోనా మహమ్మరి పేరు చెబితేనే బెంబేలెత్తిపోతున్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ కేసులు కోటిని దాటేశాయి. రోజురోజుకు కరోనా కేసులు లక్షల్లో నమోదవుతున్నాయి. అగ్రరాజ్యాలు సైతం కరోనాను కట్టడి చేయలేక చేతులేత్తేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఓ దేశానికి చెందిన ప్రజలంతా రోడ్లపైకి వచ్చి కరోనా ఫేర్ వేల్ పేరుతో సామూహికంగా సంబురాలు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటన యూరప్ లోని చెక్ రిపబ్లిక్ దేశంలో జరిగింది.

పబ్జి, జూమ్.. చైనా యాప్స్ కాదట..!

ప్రపంచంలోని అన్ని దేశాలకు కరోనా సోకిన మాదిరిగానే యూరప్ లోని చెక్ రిపబ్లిక్ దేశానికి పాకింది. ఆ దేశ జనాభా 10.7మిలియన్లు. వీరిలో 11,960మందికి కరోనా సోకగా 7,776మంది రికవరీ అయ్యారు. 3,835మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా 349మంది మృతిచెందారు. అయితే గడిచిన కొద్దిరోజులుగా చెక్ రిపబ్లిక్ దేశంలో కొత్తగా కరోనా కేసులు నమోదు కావడం లేదు. దీంతో ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తేసింది. స్థానిక ప్రజల్లో కరోనా భయాందోళన దూరం చేసేందుకు ప్రభుత్వమే సామూహిక భోజనాలు చేసేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది.

కరోనాకు ఫేర్ వేల్ చెబుతూ మంగళవారం ప్రజలంతా సంబురాలు చేసుకున్నారు. చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్‌లోని మెడీవల్ చార్లెస్ బ్రిడ్జిపై సామూహిక విందు కార్యక్రమం జరిగింది. బిడ్జిపై 500మీటర్ల పొడవై టేబుల్ ఏర్పాటుచేసి ప్రజలంతా కూర్చొని భోజనం చేశారు. డ్రింక్స్ షేర్ చేసుకున్నారు. తమకు కరోనా భయం లేదని.. మమ్మల్ని కరోనా ఏమి చేయలేదని.. మనం ఇంట్లోనే ఉండిపోకూడదనే ఉద్దేశ్యంతోనే ఈ పార్టీ నిర్వహించినట్లు పార్టీ నిర్వాహాకులు చెబుతున్నారు.

టిక్ టాక్.. మనకు లాభమెంత? నష్టమెంత?

అయితే ఆ దేశంలో పూర్తిగా కరోనా సమసిపోకముందే భారీఎత్తున పార్టీ నిర్వహించడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఆ దేశం కరోనా కట్టడిలోనే ఉందనే అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరీ వాదనలు ఎలా ఉన్నా.. కరోనా ఫేర్ వేల్ పార్టీ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రభాస్ రెండు సినిమాల సంగతులు.. అండ్ పెళ్లి..?


రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన చిత్రీకరణ తాలూకు ఎడిటింగ్ పనులు పూర్తి అయ్యాయని.. కొన్ని సీన్స్ కి సంబంధించిన విజువల్ ఎఫెట్స్ పనులు కూడా మొదలుపెట్టేశారని తెలుస్తోంది. లాక్ డౌన్ కి ముందు జార్జియాలో కొన్ని యాక్షన్ సీన్స్ షూట్ చేశారు. అయితే కరోనా కారణంగా కొంత షూట్ మిగిలి ఉండగానే ఇండియాకు తిరిగివచ్చేసింది టీం. ఆ బ్యాలెన్స్ సీన్స్ ను షూట్ చేయడం కోసమే రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్స్ వేస్తున్నారు. ప్రస్తుతం ఓ సెట్ కి సంబంధించిన నిర్మణ పనులు శరవేగంగా పూర్తి కావస్తున్నాయి.

ఈ ఒక్క పనితో జాతీయస్థాయిలో హీరో అయిన జగన్

ఇక ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలో కూడా రూపొందించి ఇతర భాషల్లోకి అనువదిస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయకిగా నటిస్తోండగా.. ప్రభాస్ డబల్ రోల్స్ లో కనిపించబోతున్నాడు. ఈ సినిమా పిరియాడికల్ బ్యాక్ డ్రాప్లో నడిచే రొమాంటిక్ ఎంటెర్టైనర్ అని.. ప్రభాస్ రెండు క్యారెక్టర్స్ లో ఒకటి రోమియో టైప్ క్యారెక్టర్ అని తెలుస్తోంది. ఈ చిత్రంపై ప్రభాస్ అభిమానులకు భారీ అంచనాలు లేకపోయినా.. సినిమా అవుట్ ఫుట్ మాత్రం అదిరిపోయేలా వస్తుందని టాక్ ఉంది.

రేపు క్యాబినెట్ మీటింగ్.. హైదరాబాద్ ఖాళీ..!

ప్రభాస్ ఈ సినిమా తరువాత తన తర్వాతి సినిమాని నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో చేయబోతున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది చివరిలో సెట్స్ పైకి వెళ్లనుందని.. ఈ సినిమాని కూడా అంతర్జాతీయ స్థాయిలో నిర్మించబోతున్నారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నారు. మరి ప్రభాస్ ఈ రెండు సినిమాల తరువాత పెళ్లి చేసుకుని ఒక సంవత్సరం సినిమాలకు గ్యాప్ ఇస్తాడని అంటున్నారు.

ఈ ఒక్క పనితో జాతీయస్థాయిలో హీరో అయిన జగన్


ప్రజారోగ్యానికి మన ప్రభుత్వాలు ఎంత విలువ ఇస్తుంటాయి.? అమెరికాలో అయితే దేశంలో దిగగానే మొదట హెల్త్ ఇన్స్ రెన్స్ చేయిస్తారట. లేదంటే ఆ దేశంలో రూల్స్ ఒప్పుకోవని చెబుతారు. ఏదైనా జబ్బు పడితే రూపాయి ఖర్చు లేకుండా ఆ ఇన్స్ రెన్స్ తో మనం సేఫ్ కావచ్చు. ఇన్సూరెన్స్ చేయించుకోకపోతే అమెరికాలో బతకడం కష్టం. అందుకే పట్టుబట్టి చేపిస్తారట.. ఇక అమెరికా దేశం కూడా ప్రజారోగ్యానికి అత్యంత భారీగా ఖర్చు చేస్తుంది..

అన్ని దేశాలు ప్రజారోగ్యం విషయంలో కోట్లు ఖర్చు చేస్తుంటాయి. అదేందో భారతదేశానికి వచ్చేసరికి ఈ దరిద్రం ఎక్కువైపోయింది. సంక్షేమానికి, ఉచితాలకు వరద పారిస్తూ ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేస్తుంటారు.

తోక జాడించే వారిపై వైసీపీ అదిరిపోయే ప్లాన్

మన దేశంలో విద్య, వైద్యమే అత్యంత ఖరీదైనవి.. ఈ రెండింటిలో ప్రైవేట్ ఆధిపత్యం ఉంది. కోట్ల రూపాయలు దోపిడీ జరుగుతున్నా మన ప్రభుత్వాలు కల్లు ఉండి చూడలేని దైన్యం కనిపిస్తుంటుంది.

అంతదాకా ఎందుకు దేశంలో కరోనా విజృంభిస్తోంది. వేల ప్రాణాలు పోతున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీల్లో ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. కానీ ఇప్పటికీ ప్రభుత్వాల నిర్లక్ష్యం కనిపిస్తోంది. తెలంగాణలో వైద్యం అందక ఇద్దరు మరణించారు. ఓ జర్నలిస్ట్ వైద్యం అందక కన్నుమూశాడు. మన ప్రభుత్వాలు వైద్యంపై బడ్జెట్ లో కేటాయించేది కనీసం 10శాతం కూడా ఉండడం లేదు..

కానీ ఏపీ సీఎం జగన్ సాధించాడు. తన తండ్రి నెలకొల్పిన 108, 104 సేవలను పునరుద్దరించాడు. విజయవాడ బెంజ్ సర్కిల్ లో 1088 వాహనాలను సీరియల్ గా నిలబెట్టి జాతరలా వాటిని ప్రారంభించిన వీడియోలు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. జగన్ ప్రజారోగ్యానికి ఇచ్చిన విలువ ఏంతనో దీని ద్వారా అందరికీ తెలిసివచ్చింది.

ఎంపీ ఊహించినట్లే.. ప్రభుత్వం షాక్ ఇచ్చిందా?

తాజాగా ఏపీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. జగన్ గట్స్ కు ఢిల్లీ పెద్దలు, జర్నలిస్టులు కూడా కరిగిపోయారు. తాజాగా సీనియర్ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అభినందించారు. జగన్ అద్భుతంగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. దేశంలోని మిగిలిన వారు ఏపీని ఫాలో కావాలంటూ ఆయన ట్వీట్ చేసి ప్రశంసలు కురిపించారు.

ఇలా జగన్ ప్రజాసంక్షేమమే కాదు.. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించారు. 1088 వాహనాలను ప్రతీ మండలం, జిల్లాకు పంపి అందిరికీ వైద్య పరీక్షలు చేయించేందుకు.. కరోనాను అరికట్టేందుకు పూనుకున్నారు. జగన్ చర్య దేశవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంటోంది.

-ఎన్నం

‘బిగ్ బాస్’ గ్లామర్ షోగా మారనుందా?


బుల్లితెర రియల్టీ ‘బిగ్ బాస్’కు ప్రేక్షకుల్లో భారీ క్రేజీ ఉంది. బిగ్ బాస్-1, బిగ్ బాస్-2, బిగ్ బాస్-3 షోలతో నిర్వాహకులు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. దీంతో త్వరలోనే బిగ్ బాస్-4 సీజన్ ప్రారంభించేందుకు నిర్వహాకులు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా కాంటెస్ట్ ఎంపిక కూడా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. నాలుగో సీజన్ పై అంచనాలు పెంచేలా ‘బిగ్ బాస్’ గ్లామర్ భామలను రంగంలోకి దింపుతున్నాడు.

ఎంపీ ఊహించినట్లే.. ప్రభుత్వం షాక్ ఇచ్చిందా?

ఈసారి బిగ్ బాస్ షో చాలా హాట్ ఉండబోతుంది. టాలీవుడ్లో గ్లామర్ తో అదరగొట్టిన పలువురు భామలు ఈ షోలో పాల్గొనేందుకు ఇప్పటికే బిగ్ బాస్ నిర్వహాకులు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్లు పూనమ్ భజ్వా, శ్రద్ధాదాస్, హంసనందిలు ఈ షోకు ఎంపికైనట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళంలో పునమ్ భజ్వాకు మంచి క్రేజ్ ఉంది. టాలీవుడ్, బాలీవుడ్లో గ్లామర్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రద్ధాదాస్, ఐటమ్ భామగా పేరుతెచ్చుకున్న హంసనందినిలు బిగ్ బాస్-4లో ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ హాట్ బ్యూటీలతో బిగ్ బాస్ నాలుగో సీజన్ కు మరింత క్రేజ్ రావడం ఖాయమని నిర్వహాకులు భావిస్తున్నారు.

తోక జాడించే వారిపై వైసీపీ అదిరిపోయే ప్లాన్

12మంది కాంటెస్టులతోపాటు నాలుగురు వైల్డ్ కార్డు ఎంట్రీలతో మొత్తం 16మంది కాంటెస్టులతో బిగ్ బాస్-4 సీజన్ ఉంటుందనుందని సమాచారం. వీరిలో బిత్తిరి సత్తి, సింగర్ సునీత, యాంకర్ ఝాన్సీ, తాగుబోతు రమేష్ పేర్లు కాన్ఫమ్ అయినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో బిగ్ బాస్-4 ప్రారంభించేందుకు నిర్వహాకులు సన్నహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ షోకు సంబంధించిన సెట్ అన్నపూర్ణ స్టూడియోలో వేసినట్లు తెలుస్తోంది. నాలుగో సీజన్ కు హోస్టుగా కింగ్ నాగార్జున లేదా ఆయన కోడలు అక్కినేని సమంతల పేర్లు విన్పిస్తున్నాయి. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేసేందుకు నిర్వాహాకులు సిద్ధమవుతున్నారు.

రేపు క్యాబినెట్ మీటింగ్.. హైదరాబాద్ ఖాళీ..!


తెలంగాణ రాష్ట్రంలో కరోనా పంజా విసురుతోంది. రోజుకురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. ఈ మహమ్మరి కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతున్నా కేసుల సంఖ్య తగ్గకపోవడం ఆందోళన రేపుతోంది. తెలంగాణకు తలమానికంగా నిలిచే భాగ్యనగరం మహమ్మరి గుప్పిట్లో చిక్కుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలోనే కేసులు సంఖ్య ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో నగరవాసులు భయాందోళన చెందుతున్నారు. లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలోనే కరోనా కేసులు పెరిగిపోతున్నాయని ప్రభుత్వం మరోసారి హైదరాబాద్లో సంపూర్ణ లాక్డౌన్ విధించాలని నగరవాసుల నుంచి విజ్ఞఫ్తులు చేస్తున్నారు..

ఎంపీ ఊహించినట్లే.. ప్రభుత్వం షాక్ ఇచ్చిందా?

తాజాగా కేంద్రం ఆన్ లాక్ 2.0ను జూలై 31వరకు కొనసాగుతుందని ప్రకటించింది. తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం జులై 31వరకు రాష్ట్రంలో ఆన్ లాక్ 2.0 ఉంటుందని ప్రకటించారు. అయితే రేపు క్యాబినేట్ సమావేశం కానుండటంతో హైదరాబాద్లో సంపూర్ణ లాక్డౌన్ ఉంటుందా? ఉండదా? అనే ఆసక్తి అందరిలో నెలకొంది. లాక్డౌన్ విధిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై సీఎం కేసీఆర్ అధికారులకు సూచనలు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే లాక్డౌన్ విధిస్తారనే ప్రచారంతో ఇప్పటికే నగరవాసులు మార్కెట్లకు పోటెత్తుతున్నారు. తమకు కావాల్సిన సరుకులను నగరవాసులు ముందుగానే కొనుగోలు చేసి పెట్టుకుంటున్నారు.

తోక జాడించే వారిపై వైసీపీ అదిరిపోయే ప్లాన్

లాక్డౌన్ ప్రచారం నేపథ్యంలో మరికొందరు సొంతఊళ్లకు బయలు దేరుతున్నారు. దీంతో ఆర్టీసీ బస్సులు ప్రయాణీకులతో రద్దీగా మారుతున్నాయి ఆంధ్రప్రాంతానికి చెందిన వాళ్లు ఏపీకి వెళుతుండటంతో సరిహద్దుల్లో భారీగా వాహనాలు నిలిచిపోతున్నాయి. జూన్ 3నుంచి 15రోజులపాటు జీహెచ్ఎంసీ పరిధిలో లాక్డౌన్ విధిస్తారనే ప్రచారం హైదరాబాద్లో జోరుగా సాగుతోంది. ఈసారి లాక్డౌన్ చాలా కఠినంగా అమలు చేసేలా ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కేవలం 2గంటలే నిత్యావసర కొనుగోలుకు అనుమతి ఉంటుందని తెలుస్తోంది. మిగతాదంతా కర్ఫూ కొనసాగుతోందని ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే పలువురు వ్యాపారులు హైదరాబాద్లో స్వచ్చంధ లాక్డౌన్ పాటిస్తున్నారు. వీరి బాటలోనే వ్యాపారులంతా లాక్డౌన్ విధించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈమేరకు రేపు క్యాబినెట్ సమావేశం ఉండటంతో సీఎం కేసీఆర్ సంపూర్ణ లాక్డౌన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది.