Homeఎంటర్టైన్మెంట్సమస్యల్లో అమ్మ బయోపిక్ !

సమస్యల్లో అమ్మ బయోపిక్ !

తమిళ ప్రజల ఆరాధ్య ముఖ్యమంత్రి జయలలితగారి జీవితం ఆధారంగా, బాహుబలితో నేషనల్ రైటర్ అయిపోయిన విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో, టాలెంటెడ్ డైరెక్టర్ ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో వస్తోన్న బయోపిక్ ‘తలైవి’. అమ్మ బయోపిక్ అనేసరికి మొదటినుండి ఈ సినిమా పై ఆసక్తి ఎక్కువైంది. అయితే ఈ సినిమాకి కొత్తగా సమస్యలు ఎదురయ్యాయి. తాజాగా ఈ సినిమా ఎడిటింగ్ పూర్తి అయిందట. మళ్ళీ చాలా సీన్స్ ను రీషూట్ చేయాలట. కారణం.. ఈ బయోపిక్ లో […]


తమిళ ప్రజల ఆరాధ్య ముఖ్యమంత్రి జయలలితగారి జీవితం ఆధారంగా, బాహుబలితో నేషనల్ రైటర్ అయిపోయిన విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో, టాలెంటెడ్ డైరెక్టర్ ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో వస్తోన్న బయోపిక్ ‘తలైవి’. అమ్మ బయోపిక్ అనేసరికి మొదటినుండి ఈ సినిమా పై ఆసక్తి ఎక్కువైంది. అయితే ఈ సినిమాకి కొత్తగా సమస్యలు ఎదురయ్యాయి. తాజాగా ఈ సినిమా ఎడిటింగ్ పూర్తి అయిందట. మళ్ళీ చాలా సీన్స్ ను రీషూట్ చేయాలట. కారణం.. ఈ బయోపిక్ లో జయలలిత పాత్రలో బాలీవుడ్ బోల్డ్ క్వీన్ కంగనా రనౌత్.. ఎం.జి.ఆర్ పాత్ర‌లో ప్ర‌ముఖ న‌టుడు అరవింద స్వామి చేస్తున్నారు. కానీ బోల్డ్ హీరోయిన్ కంగనా పక్కన అరవింద స్వామి సీన్స్ సరిగ్గా సెట్ అవ్వలేదట.

ఈ ఒక్క పనితో జాతీయస్థాయిలో హీరో అయిన జగన్

దానికి తోడు ఎంజీఆర్ ఆవేశం కూడా అరవింద స్వామిలో మిస్ అయిందట. ఇక చేసేదేమి లేక బాగా రాని సీన్స్ ను మళ్ళీ షూట్ చేయాలని డిసైడ్ అయ్యారు మేకర్స్. కరోనా ప్రభావం తగ్గాక ఈ సీన్స్ తోనే షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. నిజానికి బయోపిక్ కాబట్టి పాత్రలకు అనుగుణంగా నటీనటులను తీసుకోవాలి.. అసలు జయలలిత ఆహార్యానికి కంగనా ఫిగర్ ఎక్కడైనా మ్యాచ్ అవుతుందా.. పైగా జయలలిత – ఎంజీఆర్ మధ్య ప్రేమ, సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే. వీరి స్థాయిలో రిలేషన్ ఎస్టాబ్లిష్ అవ్వాలంటే.. కంగనా – అరవింద స్వామి మధ్య కెమిస్ట్రీ ఏ రేంజ్ లో ఉండాలి. మొత్తానికి బోల్డ్ హీరోయిన్ కి కూల్ హీరోకి మధ్య రొమాన్స్ సింక్ అవ్వలేదాయే.

వావ్.. కరోనాకు ఫేర్ వెల్ పార్టీ.. వైరల్ వీడియో

పైగా మేకర్స్ కి మరో సమస్య కూడా ఉంది. కంగనా రనౌత్ ను అచ్చం అమ్మలా మార్చెందుకు హాలీవుడ్ మూవీ ‘డార్కెస్ట్ హవర్’కి మేకప్ మెన్ గా పనిచేసిన ‘గ్యారీ ఓల్డ్ మెన్, ‘అమ్మ’ బయోపిక్ కోసం ఇండియాకి తీసుకువచ్చారు. ఈ కరోనా సమయంలో ఆయన మళ్ళీ హాలీవుడ్ నుండి ఇండియాకి వచ్చే పరిస్థితి లేదు. దాంతో మేకప్ బ్యాచ్ మొత్తాన్ని మార్చాలి. అయితే కంగనాని మాత్రం ఒక విషయంలో అభినందించాలి. ఈ బాలీవుడ్ క్వీన్.. సినిమా కోసం దాదాపు పది కిలోలు వరకూ కంగనా బరువు పెరిగింది. మరి జయలలిత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలతో పాటు ఆమె బాధను ఆమె భావోద్వేగాలను కంగనా ఎంతవరకు పలికించగలదో చూడాలి.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper