
తెలంగాణలో కరోనా పంజా విసురుతోంది. రోజుకురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతుంది. ఇప్పటికే రాష్ట్రంలో 25వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. వీరిలో 14వేలమంది కరోనా నుంచి కోలుకోగా 306మంది మృతిచెందారు. గడిచిన నాలుగైదు రోజులుగా ప్రతిరోజు వెయ్యికిపైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా మహమ్మరి కోరలు చాస్తుండటంతో నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీలో మంత్రి పదవి కోసం ఇన్ని కుట్రలా?
తెలంగాణ ప్రభుత్వం కరోనా విషయంలో చేతులేత్తేసిందనే విమర్శలు వ్యక్తమవుతోన్నాయి. ప్రభుత్వం నిరక్ష్యంగా కారణంగా కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయని విపక్షాలు ఆరోపణలు గుప్పిపిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా ఇంతలా విజృంభిస్తున్నా సీఎం కేసీఆర్ కొద్దిరోజులుగా ఫౌంహౌజ్ కే పరిమితమయ్యారని విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి. ఈ తరుణంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై ఆరా తీయడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో పరిస్థితి చేయిదాటకముందే గవర్నర్ కలగజేసుకోవాలని విపక్షాలు గతంలోనే కోరాయి. తెలంగాణ కరోనా టెస్టులు తక్కువ చేస్తున్నారని గవర్నర్ కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతోపాటు పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తమిళిసై కరోనా పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. ఈ అంశంపై చర్చించేందుకు సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, హెల్త్ సెక్రటరీని రావాల్సిందిగా ఆదేశించారు. అయితే మంగళవారం వస్తామని రాజ్ భవన్ కు విన్నవించారు.
చంద్రబాబుకి పచ్చకామెర్లు.. పవన్ కి కాదు!
కరోనా రోగుల నుంచి ప్రైవేట్ ఆస్పతులు అడ్డగోలుగా ఫీజులను వసూలు చేస్తున్నాయనే విమర్శలు నేపథ్యంలో గవర్నర్ ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. మంగళవారం 11గంటలకు రాజ్ భవన్లో అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే గవర్నర్ ట్వీటర్లో వేదిక అరగంటపాటు నెటిజన్ల నుంచి అభిప్రాయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి హైదరాబాద్లో లేని సమయంలో గవర్నర్ అధికారులతో సమీక్ష నిర్వహించడం ఆసక్తిని రేపుతోంది. ఈ సమావేశం తర్వాత గవర్నర్ ఎలాంటి విషయాలు వెల్లడిస్తారో వేచి చూడాల్సిందే..!






















కరోనా వైరస్ పై చేసిన పరిశోధనలలో కొన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ మహమ్మారి యొక్క అత్యంత ప్రమాదకరమైన లక్షణం ఏమిటంటే.. చాలా మంది రోగులు కోవిడ్ -19 తో బాధపడుతున్నారు. కాని కరోనా యొక్క లక్షణాలు లేవు. ఇది అత్యంత ప్రమాదకరం ఎందుకంటే కరోనా సోకిన రోగులు లక్షణాలు లేకుండా గుర్తించబడరు మరియు సంక్రమణ వ్యాప్తి చెందడం భయాంకరం.








కరోనా భయమో..? అనారోగ్య కారణమో..? తెలియదు గానీ తెలంగాణ సీఎం కేసీఆర్ గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయారు. తెలంగాణలో లాక్ డౌన్ విధించిన తొలి రోజుల్లో ప్రతి రోజు మీడియా ముందుకొచ్చి ప్రజలకు కరోనా పై అవగాహన కల్పించేవారు. తర్వాత తర్వాత మీడియా ముందుకు రావడం తగ్గించారు. గత 10 రోజుల నుండి కనీసం జాడలేకపోవడం గమనార్హం. తానే డాక్టర్ లా మారి కరోనా ఆరోగ్యరహస్యాలు చెబుతూ తెగ హల్ చల్ చేసిన కేసీఆర్ ఇప్పుడు కనిపించడం లేదు, వినిపించడం లేదని జనం తెగబాధపడిపోతున్నారు. అప్పట్లో ప్రెస్ మీట్ లు పెట్టి ధైర్యం చెప్పిన కేసీఆర్ లాక్ డౌన్ ఎత్తేసి ఈ కష్టకాలంలో కనిపించకుండా పోయారన్న టాక్ బాగా నడుస్తోంది. ఆయన ప్రెస్ మీట్లు లేవు.. కరోనా పై తెలంగాణలో చర్యలు లేవంటున్నారు. అందుకే ఇప్పుడు కేసీఆర్ గురించి అందరూ ఆరాతీస్తున్నారు.