
ఎస్.ఎస్.రాజమౌళి అనే పేరు ఇప్పుడు ఇండియన్ సినిమాకి ఒక బ్రాండ్ అయిపొయింది. అపజయం ఎరుగని రాజమౌళి, తన విజయ పరంపరకు సాటి లేని విధంగా నేటి మేటి దర్శకుడిగా అప్రహతిహతంగా వెలిగిపోతున్నాడు. అందుకే జక్కన్న సినిమా పై అందరిలోనూ ఆసక్తి. ప్రస్తుతం రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ పనుల్లో బిజీగా ఉన్నారు. వచ్చే యేడాది వేసవిలో ఈ చిత్రం విడుదల చేయడానికి కరోనా కాలంలో కూడా షూటింగ్ ఎలా చేయాలా అని ఆలోచిస్తూ తగిన ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాడు జక్కన్న.
రఘురామకృష్ణం రాజు ఆటలో అరటిపండు అయ్యాడా?
అయితే రాజమౌళి తర్వాతి చిత్రం మహేష్ తో అని ఇప్పటికే స్వయంగా ఆయనే చెప్పడం, దాంతో ఫ్యాన్స్ ఆ సినిమా ఎలా ఉండబోతుంది ? ఏ జోనర్ లో రాబోతుంది ? అంటూ ఇప్పటి నుండే రూమర్స్ ను క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ గమ్మత్తేమిటంటే.. ఆ ప్రాజెక్ట్ ఇదేనంటూ ఫ్యాన్స్ సృష్టిస్తోన్న రూమార్లు కూడా లాజికల్ గా ఉండటంతో అవి కూడా ఆసక్తికరంగా మారాయి. మహష్ తో రాజమౌళి పూర్తి యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేస్తాడట.
కేటీఆర్ కు ట్రైనింగ్ ఇస్తున్న కేసీఆర్.. ఎందుకంటే?
నిజానికి ప్రతి పెద్ద సినిమా తర్వాత మరో భారీ చిత్రం కాకుండా మీడియమ్ రేంజ్ సినిమా చేయడానికే రాజమౌళి ఇంట్రస్ట్ చూపిస్తారు. కానీ, ‘బాహుబలి’ సిరీస్ తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ స్క్రిప్ట్ రెడీగా ఉండటం, దాంతో మరో పెద్ద సినిమాను స్టార్ట్ చేశారు. మొత్తానికి భారీ పిరియాడిక్ మూవీస్ వరుసగా చేస్తున్నారు కాబట్టి, ఈ సారి ఆయన తప్పకుండా రెగ్యులర్ కమర్షియల్ సినిమానే ఉంటుందని.. మహేష్ తో యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ నే చేస్తారని ఫ్యాన్స్ బల్లగుద్ది చెబుతునట్లు కామెంట్స్ చేస్తున్నారు.