
దేవి శ్రీ ప్రసాద్ అంటేనే ఎనర్జీ.. కీరవాణి, మణిశర్మ లాంటి మెలోడీ బ్రహ్మల జమానాలో కూడా, తనకంటూ ఓ పత్యేకమైన బాణిని సృష్టించుకున్న అద్భుత నైపుణ్యం దేవిది. ఒకప్పుడు వరుస హిట్స్ తో టాలీవుడ్ కే ఏకైక సంగీత సంచలనంగా ఒక వెలుగు వెలిగిన దేవి, గత కొన్ని సినిమాలతో మాత్రం తన ప్రభావాన్ని వైభవాన్ని కోల్పోయాడు. నిజానికి కోల్పోయాడు అనడం కంటే, తమన్ ఫుల్ ఫామ్ లోకి వచ్చి.. దేవి స్థానాన్ని ఎగరేసుకుపోయాడు అనడం కరెక్ట్ ఏమో.
కేటీఆర్ కు ట్రైనింగ్ ఇస్తున్న కేసీఆర్.. ఎందుకంటే?
అయితే దేవి టాలెంట్ ను తక్కువ చేయలేం. మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’కు దేవి అందించిన మ్యూజిక్ కి పెద్దగా నేమ్ రాకపోవచ్చు. కానీ మాస్ లో దేవి సాంగ్స్ ఒక ఊపు ఊపాయి. అయితే బుట్టబొమ్మ ప్రవాహంలో దేవి సాంగ్స్ తేలిపోయిన మాట కూడా వాస్తవమే. గతంలో బ్రహ్మాండమైన సంగీతం అందించిన దేవి శ్రీ ఈ మధ్య మాత్రం ఆ స్థాయిలో మ్యూజిక్ ఇవ్వలేకపోతున్నాడనేది నిజమే. వరుస స్టార్ హీరోల సినిమాలు చేయడం, అంచనాలు కూడా సినిమా సినిమాకి పెరిగిపోతుండటం దేవి గ్రాఫ్ తగ్గడానికి ఒక కారణం కావొచ్చు.
రఘురామకృష్ణం రాజు ఆటలో అరటిపండు అయ్యాడా?
పైగా మరో పక్క తమన్ అద్భుతమైన సాంగ్స్ ఇస్తూ వరుస హిట్స్ తో రెచ్చిపోతుంటే.. దేవి మాత్రం రొటీన్ మ్యూజిక్ తంతుతో ఇటు సూపర్ హిట్ కొట్టలేక, అటు ప్లాప్ అని అనిపించుకోలేక ఇబ్బంది పెడుతూ.. ప్రస్తుతం బన్నీ ‘పుష్ప’ సినిమాకి పని చేస్తున్నాడు. అయితే, పుష్ప మ్యూజిక్ మాత్రం ఓ రేంజ్ లో ఉండబోతుందట. దేవిలో కసి పెరిగింది. ఈ సారి సాంగ్స్ తో అదరగొట్టేశాడట, ఇప్పటికే పుష్ప కోసం నాలుగు సాంగ్స్ ను పూర్తి చేశాడని, సాంగ్స్ అన్నీ ఆల్ టైం హిట్స్ గా నిలిచిపోయేలా ఉన్నాయని తెలుస్తోంది.
అన్నిటికీ మించి దేవి – సుకుమార్ – బన్నీ కాంబినేషన్ అంటేనే అదిరిపోయే ఐటమ్ సాంగ్ ఉంటుంది. వీరి కలయికలో గతంలో వచ్చిన సాంగ్స్ ఏ రేంజ్‌లో హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి ఈ సారి రాబోయే సాంగ్ ఇక ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.