Home Blog Page 8407

జేసీ తండ్రి కొడుకుల బండారం బట్టబయలు?


ఇన్నాళ్లు అనంతపురం జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి అక్రమాలు చేయలేదని టీడీపీ అధినేత చంద్రబాబు,లోకేష్, టీడీపీ నేతలు ధర్నాలు, రాస్తారోకోలతో హోరెత్తించారు. కానీ ఇప్పుడు వారే స్వయంగా నేర అంగీకారపత్రం పోలీసులకు రాసిచ్చినట్టు తెలిసింది. దీంతో టీడీపీ శిబిరంలో పచ్చి వెలక్కాయ పడ్డ చందంగా మారింది. దీనిపై చంద్రబాబు అండ్ కో ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది.

జేసీ ట్రావెల్స్ బస్సుల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో బుక్కైన జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డిలను జగన్ సర్కార్ అన్యాయంగా అరెస్ట్ చేసిందని చంద్రబాబు.. టీడీపీ అనుకూల మీడియా మొసలి కన్నీరు కారుస్తూ దుష్ర్పచారాన్ని చేసింది. మొదట్లో వీరిద్దరూ కూడా మాకేం తెలియదు.. మేం ఏం చేయలేదంటూ బుకాయించారు. కానీ తాజాగా విచారణలో మొత్తం నిజాలు కక్కేసారని తెలిసింది. దీంతో జేసీ ట్రావెల్స్ అక్రమాల గుట్టు బయటపడినట్టు సమాచారం.

ఆధ్యాత్మికత కోసం బాలయ్య కసరత్తులు !

సుప్రీం కోర్టు 2017 ఏప్రిల్ 1 నుంచి నిషేధించిన దాదాపు 154 బీఎస్-3 వాహనాలను నాగాలాండ్ లో స్క్రాప్ కింద కొని వాటిని బీఎస్-4 వాహనాలుగా మార్చి జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు బీఎస్4గా పేర్కొంటూ నాగాలాండ్ లో రిజిస్ట్రేషన్ చేయించారు. ఇందుకోసం పెద్ద ఎత్తున గోల్ మాల్ చేశారు. తెలంగాణ, ఏపీ సహా ఎన్ఓసీ దేశమంతా తీసుకొని తిప్పారు. కొన్నింటిని అమ్మేశారు కూడా.. వీటిపై ఫిర్యాదు రావడంతో విచారించిన ఏపీ పోలీసులు తీగ లాగితే జేసీ ట్రావెల్స్ డొంక కదిలింది.

టీడీపీ మరో స్కాం వెలుగులోకి.. మాజీ మంత్రి బుక్

తాజాగా పోలీసుల విచారణలో మొండికేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఆయన కుమారుడు అసలు నిజాలను కక్కినట్టు తెలిసింది. ఇందులో నిజాలు ఒప్పుకున్నట్టు సమాచారం. స్క్రాప్ వాహనాల కింద రిజిస్ట్రేషన్ కోసం ప్రభాకర్ రెడ్డి మొదట చెన్నైకి చెందిన ముత్తుకుమార్ ను సంప్రదించాడు. అతడు నాగాలాండ్ ఆర్టీఏ బ్రోకర్ సంజయ్ ద్వారా ఈ బీఎస్3 వాహనాలను బీఎస్4 వాహనాలుగా అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించారు. నాగాలాండ్ తీసుకెళ్లకుండానే మొత్తం 154 వాహనాలను రిజిస్ట్రేషన్ ను చేయించారు. ఇందుకోసం జేసీ ప్రభాకర్ రెడ్డి భారీగా డబ్బులను ముత్తుకుమార్, సంజయ్ లకు ముట్టజెప్పాడు.

ఈ తతంగం ముగిశాక జేసీ అనుచరుడు నాగేంద్ర.. నకిలీ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్లు తయారు చేశారు. వీటితోనే ఎన్ఓసీ తీసుకున్నారు. ఫోర్జరీ పత్రాలతో తెలంగాణ, కర్ణాటకల్లో 8 వోల్వో బస్సులు.. లారీలు విక్రయించారు. ఇలా స్క్రాప్ కింద 154 వాహనాలు కొని నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు చేయించినట్టు పోలీసుల ఎదుట నేర అంగీకారపత్రం రాసిచ్చినట్టు తెలిసింది.

దీంతో ఈ కుంభకోణంలో ఏ1గా జేసీ ప్రభాకర్ రెడ్డి సతీమణి ఉమారెడ్డిని, ఏ2గా జేసీ ప్రభాకర్ రెడ్డి, ఏ3గా నాగేంద్ర, ఏ4గా బాబయ్య, ఏ5గా జేసీ దివాకర్ రెడ్డి సతీమణి విజయ, ఏ6గా జేసీ అస్మిత్ రెడ్డిపై అనంతపురం తాడిపత్రి పోలీస్ స్టేషన్లలో మొత్తం 27 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. నేరం అంగీకరించడంతో జేసీ ఫ్యామిలీ మొత్తం జైలు పాలు కావడం ఖాయంగా కనిపిస్తోంది.

జీ బ్లాక్ కింద నిజాం నిధి? అందుకే రహస్యంగా కూల్చారా?

Treasure Under G Block

Treasure Under G Block
తెలంగాణ హైకోర్టు సచివాలయం కూల్చివేతకు అనుమతి ఇవ్వగానే అర్ధరాత్రి కేసీఆర్ సర్కార్ పనులు ఎందుకు మొదలుపెట్టింది.? ఒకేసారి బాంబులతో కుప్పకూల్చకుండా జీ బ్లాక్ ను ప్రొక్లెయినర్లతో ఎందుకు పడగొట్టింది.? అర్ధరాత్రి గుప్త నిధుల కోసం తవ్వినట్టు అందరినీ అటు వైపు రాకుండా నిషేధించి ఎందుకు తవ్వింది. అసలు ఆ జీ బ్లాక్ రహస్యమేంటి? ఇప్పుడు ఇవే అనుమానాలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి..

*జీ బ్లాక్ చరిత్ర
తెలంగాణ సచివాలయంలోని ‘జీ బ్లాక్’కు సుధీర్ఘ చరిత్ర ఉంది. అది 132 ఏళ్ల కిందట 1888లో ఆరో నిజాం నవాబు మహబూబ్ అలీఖాన్ దీన్ని నిర్మించారు. నాడు సైఫాబాద్ ప్యాలెస్ గా దీన్ని పిలిచేవారు. నాడు నిజాం రాజ్యం ఆర్థిక వ్యవహారాలు, ట్రెజరీ కార్యకలాపాలు ఈ జీ బ్లాక్లోనే జరిగేవి. నిజాం రిజర్వ్ బ్యాంక్ గా జీ బ్లాక్ ఉండేది. 2012,2016లో సచివాలయం సమీపంలోని హోంసైన్స్ కాలేజీ, విద్యారణ్య పాఠశాలల ఆవరణల్లో నిర్మాణాల కోసం తవ్వకాలు జరిగినప్పుడు సొరంగాలు బయటపడ్డాయి. దీంతో రంగ ప్రవేశం చేసిన పురావస్తు శాఖ మింట్ కాంపౌండ్ నుంచి మరో సొరంగం ఉన్నట్టు గుర్తించింది. ఈ మూడు సొరంగాలు జీ బ్లాక్ కింద వరకు ఉండడాన్ని గుర్తించారు.

బీజేపీపై కేసీఆర్ కాంగ్రెస్ అస్త్రం.. ఫలిస్తుందా?

ఈ జీ బ్లాక్ ను నాడు నిజాం రిజర్వ్ బ్యాంక్ గా ఉపయోగించాడు. భూగర్భంలో స్ట్రాంగ్ రూములు నిర్మించినట్టు పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. జి బ్లాక్ కింద నిధి ఖచ్చితంగా ఉంటుందని పురావస్తు శాఖ అంటోంది. నిజాం సంపద విలువ వేల కోట్ల మేరకు ఉంటుందని అంచనా..సొరంగాలపై పరిశోధనకు పురావస్తుశాఖ అనుమతి కోరినా కేసీఆర్ సర్కార్ అప్పట్లో ఇవ్వలేదు. తాజాగా సచివాలయం కూల్చివేతను రహస్యంగా చేపట్టడంపై అందరిలోనూ అనుమానాలు కలుగుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కూడా జీ బ్లాక్ కింద నిజాం సంపద కొల్లగొట్టడానికే రహస్యంగా కూలుస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.

కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ బాగానే పడిందిగా?

*నిజాం సంపద కొల్లగొట్టడానికా?
పైగా ఈ జీ బ్లాక్ కూల్చివేసే సమయాల్లో కేసీఆర్ హైదరాబాద్ లో లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. పైగా సీఎస్, డీజీపీలు స్వయంగా అక్కడ ఉండి మరీ పనులు అర్ధరాత్రి పర్యవేక్షించారు. ఎవరినీ లోపలికి రానీయకుండా ఆ రోడ్డునే మూసేశారు. మీడియాను అనుమతించలేదు. దీంతో ‘ఈ జీ బ్లాక్’ రహస్యం ఇప్పుడు గండికోట రహస్యంగా మారింది. నిజంగానే నిజాం నిధులు కొల్లగొట్టే స్కెచ్చా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

పాపులర్ సెక్స్‌ వర్కర్ పాత్రలో రకుల్‌!

Rakul-Preet-Singh

Rakul-Preet-Singh

ఢిల్లీ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్టాలీవుడ్‌లో షార్ట్‌ టైమ్‌లోనే టాప్‌ హీరోయిన్‌గా ఎదిగింది. రకుల్‌ హీరోయిన్‌గా నటించిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ హిట్‌ కావడంతో తెలుగులో ఆమె కెరీర్కు గట్టి పునాది పడింది. అక్కడి నుంచి ఆమె వెనుదిరిగి చూసింది లేదు. వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా మారింది. దాదాపు స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిందామె. గ్లామర్ షోతో యువత హార్ట్‌ బీట్‌ పెంచింది అయితే, కొన్నాళ్లుగా ఆమె టాలీవుడ్‌కు దూరంగా ఉంటుంది. మహేష్‌ బాబు సరసన స్పైడర్, నాగార్జునతో కలిసి చేసిన మన్మధుడు-2 ఫ్లాప్‌ కావడంతో ఆమెకు నిరాశ ఎదురైంది. అప్పటి నుంచి ఎక్కువగా హిందీ, తమిళ్‌ సినిమాలే చేస్తోంది కమల్‌ హాసన్‌- శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఇండియన్‌-2లోనూ ఆమె నటిస్తోంది. తెలుగు నుంచి అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్‌లో ఎలాంటి సినిమాలకైనా ఓకే అంటోంది. బోల్డ్ పాత్రల్లో క‌నిపించేందుకు కూడా రెడీ అయింది.

సుశాంత్ ఆత్మహత్యలో ఊహించని ట్విస్ట్!

తెలుగుతో పోలిస్తే ఇప్పటికే తన బాలీవుడ్‌ చిత్రాల్లో ఎక్కువ అందాలు ఆరబోసిన ఆమె ఇప్పుడు ఓ వేశ్య పాత్రలో నటించేందుకు ఓకే చెప్పిందట. ఇది చాలా ప్రెస్టీజియల్‌ ప్రాజెక్ట్‌ అని తెలుస్తోంది. ఒక సెక్స్‌ వర్కర్ బయోపిక్‌లో లీడ్‌ రోల్‌ చేసేందుకు రకుల్‌ సిద్ధపడిందని సమాచారం. ముంబై రెడ్ లైట్ ఏరియాకు చెందిన ఓ ప్రముఖ వేశ్యగా ఆమె న‌టించ‌నుంద‌ట‌. ఇలాంటి పాత్ర చేయడం రకుల్‌ కు కొత్తేం కాదు. ‘మర్జావా’లో చిత్రంలో బార్ డ్యాన్సర్ రోల్‌ చేసింది. కానీ, దానితో పోలిస్తే తాజా చిత్రం పూర్తి భిన్నంగా ఉండనుంది. రెడ్‌ లైట్‌ ఏరియాలో జీవితాలు, పాపులర్ సెక్స్‌ వర్కర్గా రకుల్‌ పాత్ర చాలా బోల్డ్‌ అండ్‌ బ్యూటిఫుల్‌గా ఉంటుందట. అందుకు మంచి ఫిజిక్‌ ఉన్న రకుల్‌ను దర్శక నిర్మాతలు సంప్రదించగా.. కథ నచ్చడంతో ఆమె వెంటనే ఓకే చెప్పేసినట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఆలియా భట్‌ టైటిల్‌ రోల్‌లో స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ ‘గంగూబా కథియావాడి’ మూవీ తీస్తున్నాడు. ఇది కూడా సెక్స్‌ వర్కర్ జీవితకథే. రకుల్‌ అంత ఎత్తు, శరీరాకృతి లేకపోయినా నటనలో ఆలియా రేంజే వేరు. మరి, ఒకే పాయింట్‌ రాబోతున్న ఈ చిత్రాల్లో ఆలియా, రకుల్‌లో ఎవరి పెర్ఫామెన్స్‌ బాగుంటుందో చూడాలి.

చిరు చెల్లి పై రూమర్స్.. ఫైనల్ చేయలేదు !

సచిన్ పైలట్ దారెటు?

Sachin pilot
రాజస్థాన్ లో గత కొన్ని రోజులుగా రాజకీయ పరిస్థితులు వేడి పుట్టిస్తున్నాయి. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్‌ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. కాంగ్రెస్ పైనే తిరుగుబాటు బావుటా ఎగురవేసిన పైలట్ తన వర్గం ఎమ్మెల్యేతో ఢిల్లీలో తిష్ట వేశాడు. సీఎల్పీ సమావేశానికి రెండు సార్లు ఆహ్వానం పంపినప్పటికీ…. పైలట్ మాత్రం రాలేదు. ఢిల్లీలోనే తన 21 మంది ఎమ్మెల్యేలతో ఉన్నాడు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అతనితో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ…. అది జరగలేదు. సచిన్ పైలట్ తాను ఆత్మ గౌరవం కోసం పోరాడుతున్నానని, తాను కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేయాలనుకోవడం లేదని అంటున్నాడు. అయితే సచిన్ పైలట్ నిజంగానే ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నట్లయితే సొంత పార్టీని నెలకొల్పే ప్రయత్నం చేయొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పరిస్థితులను చూడబోతుంటే కూడా అలానే కనబడుతున్నాయి.

ప్రస్తుతం సచిన్ పైలట్ ని చూస్తుంటే… 2009 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఏపీ రాజకీయాలలో చోటుచేసుకున్న పరిస్థితులు గుర్తొస్తున్నాయి. ప్రస్తుత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తనకు సీఎం పదవి ఇవ్వలేదని, ఆత్మగౌరవం పేరుతో కాంగ్రెస్ పార్టీ పైన తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. అలాగే గతంలో రాష్ట్రంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకొని, బలమైన, సామాజికవర్గ నేతగా పార్టీలో మంచి పేరును తెచ్చుకొని, సీఎం పోస్ట్ తనకు దక్కలేదని, కాంగ్రెస్ పై తిరుగుబాటు జెండా ఎగురవేసి చివరికి బీజేపీ లో చేరారు కిరోరి సింగ్ గుజ్జర్. సచిన్ పైలట్ ఇప్పుడు ఎం చేస్తాడన్న విషయంపై సర్వత్రా ఆసక్తికర చర్చ నడుస్తుంది. సచిన్ పైలట్ నెక్స్ట్ స్టెప్ ఏమిటి అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జగన్ వలే మరో కొత్తపార్టీని ఏర్పాటు చేసి రాజస్థాన్ రాజకీయాల్లో నూతన ఒరవడికి శ్రీకారం చూడతారా…? లేక రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలకే ఛాన్స్ ఉందని గ్రహించి బీజేపీలో చేరిపోతారా తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాలి..

రాష్ట్రానికి అప్పు ఇచ్చేది ఆ సంస్థేనా..!


ప్రభుత్వం అప్పుల కోసం విదేశీ సంస్థల చుట్టు తిరుగుతున్న అంశంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో విదేశీ సంస్థల నుంచి అప్పు తీసుకుంటే తప్పేంటని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి   ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం విదేశీ సంస్థల నుంచి అప్పు పొందేందుకు కేంద్రాన్ని గ్యారంటీ ఉండాలని కోరినట్లు చెప్పారు. అప్పు ఇచ్చె అమెరికా సంస్థ పేరును మాత్రం ఆయన వెల్లడించేందుకు నిరాకరించారు. గత ప్రభుత్వం రూ.44 వేల కోట్లు బిల్లులు పెండింగ్ పెట్టిందని, డిస్కంలకు రూ.22 వేల కోట్లు చెల్లించాల్సి ఉందని.. మరి అప్పు తీసుకోకుండా ఎలా చెల్లించాలని టిడిపి నేతలను ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితిపై మాజీ మంత్రి యనమల చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.

రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన అమెరికాలోని ప్రవేటు ట్రస్ట్ పేరు సిఐజి క్యాప్ (CIG CAP)గా విశ్వసనీయంగా తెలిసింది. ఈ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి 9 వేల కోట్ల డాలర్లు అప్పగా ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లు చెబుతున్నారు. ఈ మెత్తాన్ని 40 ఏళ్లలోగా 4 శాతం వడ్డీతో తిరిగి చెల్లించడం, కేంద్ర ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చే విషయంలో సంస్థ షరతులు విధించింది. ఆర్ధిక వనరుల సమీకరణలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి ఇది సువర్ణావకాశంగానే కనిపించింది. దీంతో ఎలాగైనా ఈ ప్రవేటు ట్రస్టు నుంచి అప్పు పొందేందుకు ప్రయత్నాలు చేస్తోంది. వాస్తవానికి ఈ సంస్థ వివిధ ప్రాజెక్టులను గతంలో చేపట్టినా ఎప్పడూ ఇంత పెద్దమొత్తంలో పెట్టబడి పెట్టిన దాఖలాలు లేవని ఆర్ధిక నిఫుణులు చెబుతున్నారు. ఇతర సంస్థలకు చిన్న మొత్తంలో తప్ప ఇంత పెద్ద మొత్తంలో ఇవ్వలేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో సంస్థ ఆఫర్ పై అనుమానాలు రేకెత్తుతున్నాయి.

విదేశీ సంస్థల నుంచి అప్పు తీసుకునే సమయంలో అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉండటంతో కేంద్రం విదేశీ సంస్థల అప్పులను ప్రోత్సహించడం లేదు. స్వదేశీ బ్యాంకులు, ఇతర సంస్థల నుంచే అప్పులు తీసుకోవాలని సూచిస్తుంది. విదేశీ సంస్థ వద్ద అప్పు తీసుకుంటే డాలర్ల రూపంలో అప్పు ఇస్తారు.. డాలర్ల రూపంలోనే చెల్లించాలి. డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ క్షీణిస్తూ పోతుంది. దీని వల్ల అప్పు చెల్లించే సమయంలో రూపాయి విలువ మరింత తగ్గితే ఆ భారం మరింత పెద్దమొత్తంగా మారే అవకాశం ఉంది. స్వదేశీ సంస్థల వద్ద అప్పు తీసుకుంటే ఈ సమస్య ఉండదు. డాలర్ కు రూపాయి విలువతో సంబంధం ఉండదు.

రాష్ట్రానికి భారీ మొత్తంలో అప్పు ఆఫర్ ఇచ్చిన ట్రస్ట్..

ప్రస్తుత పరిస్థితుల్లో అధిక మొత్తంలో అప్పులు చేయడం వల్ల భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పేలా కనిపించడం లేదు. గత ఏడాది సంక్షేమ పథకాల కోసం రాష్ట్ర పభుత్వం రూ.42,603 కోట్లు ఖర్చు చేసింది. ఈ ఏడాది ఇందుకు కోసం అంత కంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సి ఉంది. కరోనా వైరస్ ఉధృతి కారణంగా ప్రభుత్వానికి పన్నుల రూపంలో వచ్చే ఆదాయం బాగా తగ్గిపోయింది. మరోవైపు కేంద్ర ఆర్ధిక పరిస్థితి ఇదే విధంగా ఉండటంతో కేంద్ర సాయం ఆశించే పరిస్థితి లేదు. ప్రభుత్వం అప్పు తెచ్చినా సంక్షేమ పథకాల కోసమే ఖర్చే చేయాల్సి వస్తే ఏ విధమైన ప్రయోజనం ఉండదని అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

కరోనా ఎఫెక్ట్.. నగరం వెలవెల.. పల్లెలు కళకళ


భారతదేశానికి పల్లెలు పట్టుకొమ్మలుగా నిలుస్తున్నాయి. లక్షల కోట్లతో దేశాన్ని అభివృద్ధి చేస్తున్నమని గొప్పలు చెప్పే పాలకులు మాత్రం పల్లెల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించిన పాపానా పోవడం లేదు. ప్రభుత్వాలు ఎన్నిమారినా పల్లెల్లో అభివృద్ధి ఎడారిలో ఒయాసిస్ లా మారుతోంది. నేటికి పల్లెలు కేవలం వ్యవసాయం మీదనే ఆధాపడుతోన్నాయి. పల్లెల్లో కుటీర పరిశ్రమలు నెలకొల్పి అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వాలు మాత్రం వాటిని పట్టించుకోకపోవడంతో ఉపాధి కోసం పల్లెవాసులు నగరాలకు పయనమవుతున్నారు.

నగరాలు అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చిది పెద్దపెద్ద భవంతులు.. హంగులు, ఆర్భాటాలు, మల్టిఫెక్సులు, షాపింగులు వగైరా.. ఇక మెట్రోనగరాల్లో అయితే నగరవాసులది ప్రత్యేక కల్చర్ అన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు. ఇక పల్లెవాసులకు నగరం అనేది భూతలస్వర్గంలా కన్పిస్తుంది. దూరం నుంచి చూసి ఎప్పుడెప్పుడు నగరాలకు వెళ్లిపోదామా అంటూ ఎదురుచూస్తుంటారు. పల్లెల్లో వ్యవసాయ పనులు ఒంటికిపట్టనివారు, చదువుకున్న వారంతా నగరాల్లో సెటిలయ్యేందుకే మొగ్గుచూపుతుంటారు.

కరోనాకు గబ్బిలాలే దారి చూపిస్తున్నాయా?

నగర నిర్మాణాల ప్రతీఒక్కరి భాగస్వామ్యం అవసరమే. వలస కూలీల దగ్గరి నుంచి ఇంజనీరింగ్ పట్టభద్రుల వరకు ప్రతీఒక్కరి భాగస్వామ్యాన్ని నగరాలు కోరుకుంటాయి. వీరందరికీ ఉపాధి కల్పించి అక్కున చేర్చుకుంటాయి. అయితే ఇదంతా కూడా కరోనా రాక ముందుమాట. ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయాయి. కరోనా ఎఫెక్ట్ తో అన్నిదేశాలు లాక్డౌన్ విధించాయి. భారత్లోనూ లాక్డౌన్ విధించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆన్ లాక్ 2.0లో కరోనా ఎఫెక్ట్ తీవ్ర ప్రభావం చూపుతోంది.

దేశంలో నమోదవుతున్న 89శాతం కరోనా కేసులు 49నగరాల్లో ఉన్నాయని కేంద్రం లెక్కలు చెబుతోన్నాయి. ప్రధానంగా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చైన్నె, బెంగళూరు నగరాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో ఉపాధి కోసం వచ్చిన జనం ఇప్పుడు సొంతూళ్లకు పయమనవుతున్నారు. జీహెచ్ఎంసీ లెక్కల ప్రకారం హైదరాబాద్ నుంచి ఇప్పటికే 25లక్షల మంది జనం సొంతూళ్లకు వెళ్లినట్లు అంచనా వేస్తున్నారు. ఇక బెంగూళూరులో దాదాపు 15లక్షల మంది తరలివెళ్లినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీంతో నగరాల్లో ఎక్కడ చూసిన టూలెట్ బోర్డులే దర్శనమిస్తున్నాయి.

కరోనా కేసుల్లో తప్పుడు లెక్కలు?

వలస కార్మికులంతా పల్లెలకు తిరిగి వెళుతుండటంతో ఆ ప్రభావం నగరాలపై తీవ్రంగా చూపుతోంది. నగరంలోని నిర్మాణ రంగాలు, వివిధ పరిశ్రమల్లో మ్యాన్ పవర్ లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. లాక్డౌన్ ప్రభావం నగరాలపై ప్రభావం చూపడంతో అన్నిరంగాలు కుదేలవుతున్నాయి. కరోనా కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమవుతుండటంతో నగరాలన్నీ కూడా వెలవెలబోతున్నాయి. లాక్డౌన్ ఎత్తినప్పటికీ పల్లెవాసులు ప్రస్తుత పరిస్థితుల్లో నగరాలకు వెళ్లేందుకు జంకుతున్నారు.

కరోనా సమయంలో పల్లెలే సేఫ్ అని జనాల్లో నాటుకుపోయింది. నగరవాసుల కంటే పల్లెవాసులే కరోనా నిబంధనలు పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. దీంతో నగరాల్లో సెటిలైనవారు సైతం ప్రస్తుత పరిస్థితుల్లో పల్లెలకు తరలి వెళుతున్నారు. మహమ్మరి పూర్తిగా వెళ్లేంత వరకు కూడా వారంతా నగరాలకు వెళ్లేలా కన్పించడం లేదు. ప్రభుత్వాలు పల్లెల్లో కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి అభివృద్ధి చేసి జీవనోపాధి కల్పించాలని కోరుతున్నారు.

ఓట్ల సమయంలో పాలకులకు గుర్తొచ్చే పల్లెజనాల అవసరాలు గద్దెనెక్కాక మరిచిపోవడం శోచనీయంగా మారుతోంది. ఇప్పటికైనా పాలకులు పల్లెలను అభివృద్ది చేయాలని డిమాండ్లు పెద్దఎత్తున విన్పిస్తున్నాయి. కరోనా పుణ్యమా అని పల్లెలైనా అభివృద్ధి చెందుతాయో లేదో వేచి చూడాల్సిందే..!

విశాఖ ఘటనపై పవన్ ప్రశ్నల దాడి..!


విశాఖకు ఎలాగైనా రాజధాని తరలించుకోపోయే పట్టుదలలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉండగా, వరుస పారిశ్రామిక ప్రమాదాలు ఆయనకు తలనొప్పిగా మారాయి. అమరావతి రాజధానిగా కొనసాగించాల్సిందే అని పట్టుబట్టుకొని కూర్చున్న టీడీపీ నేతలకు ఈ ప్రమాదాలు ఆయుధంగా మారుతున్నాయి. ఈ ప్రమాదాలను సాకుగా చూపుతూ ఆ పార్టీ నేతలు విశాఖ రాజధానికి అనువైన ప్రాంతం కాదని, నొక్కివక్కాణిస్తున్నారు. అదే సమయంలో ఇది పూర్తిగా జగన్ ప్రభుత్వం వైఫల్యం అంటున్నారు. ఎల్ జి పాలిమర్స్, సాయినార్ ప్రమాద ఘటనల విషయంలో ద్రోషులపై చర్యలు తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరించడం వలనే…మరో మారు రాంకీ పార్మా కంపెనీలో ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు.

కాగా జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ప్రమాద ఘటనపై లేఖ ద్వారా స్పందించారు. పవన్ కళ్యాణ్ గాజువాక, పరవాడ పారిశ్రామిక ప్రాంతాల్లో వరుసగా ప్రమాదాలు సంభవించడం ఆందోళన కలిగిస్తుందని అన్నారు. వరుస ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? భద్రతా ప్రమాణాలు ఎందుకు పాటించడంలేదు? ప్రభుత్వం ఎందుకు ఉదాసీనంగా ఉంటోంది? ప్రజా ప్రతినిధులు ఏం చేస్తున్నారు? అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరిలోనూ తలెత్తుతున్నాయి అన్నారు. సాల్వెంట్ పరిశ్రమలో ప్రమాదకరమైన, మండే స్వభావం గల ఆయిల్స్ రసాయనాలు నిల్వ చేస్తున్నప్పుడు రక్షణ ఏర్పాట్లు అత్యంత పటిష్టంగా ఉండాలి కదా అని ప్రశ్నించారు. రక్షణ ఏర్పాట్లు సరిగా ఉంటే ప్రమాదం ఎందుకు జరిగిందో ప్రభుత్వం వివరణ ఇవ్వాలి అన్నారు. బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వడంతో పాటు, ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.

విశాఖ ప్రమాదంపై రాజకీయాలు చేయడం భావ్యమా?

పరిశ్రమలలో జరుగుతున్న ఈ వరుస ప్రమాదల వలన జగన్ ప్రభుత్వంపై ముప్పేట దాడి జరుగుతుంది. ఎల్ జి పాలిమర్స్ ఘటనలో విచారణకు ఆదేశించిన సీఎం జగన్, ప్రమాదానికి బాద్యులైన 12మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అది ప్రతిపక్షాల ఒత్తిడి వలన జరిగిన అరెస్టులే, ప్రభుత్వం కంపెనీ యాజమాన్యంతో లాలూచి పడ్డారని ఆరోపిస్తున్నారు. ఇక స్థానిక ప్రజలు కూడా ఈ ప్రమాదాలపై కోపంతో ఉన్నారని తెలుస్తుంది. స్థానిక ఎమ్మెల్యే అదీప్ రాజ్ పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. సదరు వీడియోలను ప్రదర్శిస్తూ ప్రతిపక్షాలు విమర్శల ఉదృతి పెంచారు.

సోనియా గాంధీని నమ్ముకుంటే నిండా మునిగినట్లే

మొదట్నుంచీ కుటిలనీతినే పాటించిన సోనియా గాంధీ

కాంగ్రెస్ పార్టీ గత చరిత్ర ఘనమైనా ఇటీవలికాలంలో పూర్తిగా మసకబారింది. సోనియా గాంధీ 1998లో అధ్యక్షపదవి చేపట్టిన తర్వాత అది పూర్తిగా దాని పూర్వ ప్రభ కోల్పోయింది. అయినా 2004 లో అధికారంలోకి వచ్చింది. అంతకుముందు అయిదు సంవత్సరాలు వాజపాయి ప్రధానమంత్రిగా అధికారంలో వున్నా, పరిపాలనలో మార్కులు సంపాదించినా ప్రజలు మాత్రం తిరస్కరించారు. అదొక్కటే ఆవిడ అధ్యక్షురాలిగా సాధించిన ఘనకార్యం. దానికి అనేక కారణాలున్నాయి. అప్పట్నుంచే ఆవిడ కుటిలనీతి రాజకీయాలు ప్రారంభమయ్యాయి. ఆవిడ ప్రధాన మంత్రి పదవి చేపట్టటం పై చెలరేగిన వివాదం తో ఎవరిని ప్రధానమంత్రి ని చేయాలనే దగ్గరే ఆవిడ ఆలోచనలు పక్కదారి పట్టాయి. అందరూ అనుకుంటున్నట్లు మన్మోహన్ సింగ్ మంచి ఆర్దికమంత్రిగా పనిచేసిన రికార్డు చూసి ఆయనను ఎంచుకోలేదు. వాస్తవానికి ఆరోజుకి పార్టీలో సోనియా గాంధీ తర్వాత పాపులర్ నాయకుడుగా ప్రణాబ్ ముఖర్జి వున్నాడు. అందరినీ కలుపుకొని పోగలిగిన సమర్ధత వున్నవాడు. అయినా మన్మోహన్ సింగ్ ని ఎంపికచేసింది . దానికి వున్న ఒకే ఒక కారణం విధేయత. ప్రణాబ్ ముఖర్జీ సమర్దుడైనా ముందు ముందు ఏకు మేకవుతాడేమోనని అభద్రతా బావంతో తనన్ని పక్కనపెట్టింది. మన్మోహన్ సింగ్ ఆర్దికమంత్రిగా పేరు తెచ్చుకున్నా ప్రధానమంత్రి కి కావాల్సిన నాయకత్వ లక్షణాలు లేవు. అదే ఆయనకు వరమయ్యింది. వాస్తవానికి ప్రణాబ్ ని ప్రధానమంత్రిని చేసి ఆయన కింద మన్మోహన్ సింగ్ ని ఆర్ధికమంత్రిని చేసుంటే బాగుండేది. సోనియా గాంధీ ప్రణాబ్ ని మన్మోహన్ కింద పనిచేయించటం సీనియర్ నాయకుడ్ని అవమానించటమే. కాకపోతే ప్రణాబ్ అయితే ఫైళ్ళు అనధికారికంగా 10 జన్ పద్ కి పంపించి ఉండేవాడు కాదుకదా. ఎటువంటి జవాబుదారీతనం లేకుండా రిమోట్ కంట్రోల్ పరిపాలన చేయాలంటే మన్మోహన్ సింగ్ అయితేనే సాధ్యమవుతుంది. కాబట్టి సోనియా గాంధీ కుటిలనీతి 2004 లోనే మొదలయ్యింది. రాజకీయ నాయకుడే ప్రధానమంత్రి అయితే సమాజాన్ని గురించి పూర్తి అవగాహనతో నిర్ణయాలు తీసుకుంటారు. అయినా పది సంవత్సరాలు అధికారం లో ఉండటంతో ఆవిడలోని లోపాలు పెద్దగా బయటపడలేదు. కాకపోతే ఆవిడ చెప్పింది వినకపోతే పరిణామాలు ఎలావుంటాయో పివి నరసింహారావు మరణం అప్పుడు అందరికీ బహిరంగంగా తెలిసింది. అయిదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానమంత్రిగా వున్న వ్యక్తి ని అంత్యక్రియలకు కూడా డిల్లీ లో అనుమతి ఇవ్వకుండా, చివరకు ఆయన పార్ధీవ దేహాన్ని కడసారి చూపులకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లోకి కూడా రానివ్వకపోవటం చూసిన తర్వాత నైనా నిజమైన కాంగ్రెస్ వాదులు అప్పుడే ప్రతిస్పందించక పోవటం వాళ్ళు గాంధీ కుటుంబానికి ఎంతగా విధేయులుగా మారారో అర్ధమవుతుంది. గాంధీ కుటుంబం లేకపోతే కాంగ్రెస్ లేదు అనేదాకా వాళ్ళు మానసికంగా సిద్ధమయిపోయారు. అవునుమరి ఇండియా ఇందిరా , ఇందిరా ఇండియా అన్న సంస్కృతికి అలవాటుపడ్డారు కదా.

అసమర్ధ నాయకురాలు సోనియా గాంధీ 

సోనియా గాంధీ కి సమర్ధత లేదనేదానికి మన తెలుగు రాష్ట్రాలే ఉదాహరణ. వై ఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం కాంగ్రెస్ రాజకాయాల్ని నిర్వహించటం చేతకాక రెండు రాష్ట్రాలని కాంగ్రెస్ రహిత రాష్ట్రాలుగా చేసుకుంది. ముందుగా రాజశేఖర రెడ్డి కుమారుడిని దూరంచేసుకుంది. తర్వాత వచ్చిన ప్రత్యేక తెలంగాణా, సమైక్య ఆంద్ర ఉద్యమాల్ని పరిష్కరించటం లో వేసిన తప్పటడుగులు అటు తెలంగాణాలో, ఇటు ఆంధ్రలో పార్టీని నామరూపాల్లేకుండా చేసింది. అయినా తెలంగాణాలో ఎక్కడో ఆశ కొట్టుమిట్టాడుతుంది. కానీ రాను రాను ఇక్కడకూడా బలహీన పడుతుంది. ఇప్పుడు దేశంలో జరిగే పరిణామాలు భవిష్యత్తు లో తెలంగాణాలోనూ ప్రతిబింబిస్తాయి. ఒకనాడు వుమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కి పెట్టనికోట. మరి ఈరోజు?

వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకున్న రాహుల్ గాంధీ 

ఇదే మిగతా చోట్లకూడా జరుగుతుంది. అస్సాం లో హిమంత బిస్వా శర్మ ని దూరం చేసుకొని పూర్తిగా ఈశాన్య భారతాన్ని పోగొట్టుకుంది. హర్యానాలో భూపేంద్ర హుడా కోసం దళిత నాయకుడ్ని వదిలేసుకుంది. అయినా ప్రజలు కాంగ్రెస్ ని పూర్తిగా విస్మరించ లేదు. మధ్య ప్రదేశ్,  రాజస్తాన్, చత్తీస్ గడ్ లలో పట్టం కట్టారు. గుజరాత్ లో గట్టి పోటీ ఇచ్చారు. అధ్యక్షపదవి వదిలిన తర్వాత రాహుల్ గాంధీ కి పూర్తి స్వేచ్చనివ్వాలి. అంతేగానీ మన్మోహన్ సింగ్ ని కట్టడి చేసినట్లు రాహుల్ గాంధీ ని కూడా తను చెప్పినట్లే వినాలని కంట్రోల్ చేయటమే ఈ పరిస్థితి కి కారణమని అనుకుంటున్నారు. ఒక టైములో పార్టీ నిర్మాణాన్ని సమూలంగా మార్చి కొత్త నాయకత్వం తో నింపాలని తను భావించినట్లు తెలుస్తుంది. అదే జరిగివుంటే కాంగ్రెస్ కి ఈ గతి పట్టేది కాదు. కురువృద్ధులందరూ సోనియా గాంధీని ఆశ్రయించి ఆ సంస్కరణలు జరగకుండా ఆపినట్లు తెలుస్తుంది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ లోనూ యువ రక్తాన్ని నింపుతారనే ప్రచారం జోరుగా సాగింది. అది జరక్కుండా చేసింది సోనియా గాంధీ అని చెప్తున్నారు. చివరకు రాహుల్ గాంధీ రాజీనామా చేసి కొత్త నాయకుడ్ని ఎన్నుకోవాలని పిలుపునిచ్చినా అది జరక్కుండా తిరిగి ఆపధర్మ అధ్యక్షురాలిగా తనే రావటం తో పార్టీ యువ నాయకత్వానికి కష్టాలు మొదలయ్యాయి.

కొత్త నాయకత్వాన్ని బలిపశువుల్ని చేసిన సోనియా గాంధీ 

మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాలనే తీసుకుందాం. కమల్ నాథ్ మధ్యప్రదేశ్ లో సోనియా గాంధీ దగ్గర చక్రం తిప్పి తనే నాయకుడు అయ్యాడు. కనీసం ఆ తర్వాతనైనా జ్యోతిరాదిత్య సిందియా కి  సరైన గౌరవమిచ్చి అసంతృప్తిని పారద్రోలే పనిచేయలేదు. ఎప్పటికైనా తనకు పోటీ అవుతాడని దిగ్విజయ్ సింగ్ తో కలిసి తనని ఒంటరి చేయాలని ప్రయత్నం చేసాడు. ఇంతజరుగుతున్నా కమలనాథ్ ని వారించే ప్రయత్నం సోనియా గాంధీ చేయలేదు. దానితో తనదారి తాను చూసుకున్నాడు. అలాగే రాజస్తాన్ లో సచిన్ పైలట్ అందరిలాగా కాకుండా 2014 లో అధ్యక్షుడైన దగ్గర్నుంచి నివాసం కూడా మార్చుకొని అక్కడే వుండి పార్టీని కిందస్థాయి నుంచి తిరిగి నిర్మించాడు. అయినా ఎన్నికలోచ్చేటప్పటికి అశోక్ గెహ్లాట్ సోనియా గాంధీ దగ్గర చక్రం తిప్పి ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ సారి ప్రియాంక గాంధీ కూడా తన తల్లితో పాటు రాహుల్ గాంధీ పై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తుంది. అందరూ అనుకోవటం హర్యానాలో భూపేంద్ర హుడా లాగా రాజస్తాన్ లో అశోక్ గెహ్లాట్ కూడా రాబర్ట్ వాద్రా భూ కొనుగోళ్లలో సహాయం చేసాడు కాబట్టి అశోక్ గెహ్లాట్ నే ముఖ్యమంత్రి చేసారనేది. అదే నిజమయితే స్వంత ప్రయోజనాల కోసం పార్టీ ప్రయోజనాల్ని తాకట్టు పెట్టినట్లు అనుకోవాలి. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితంగా వున్న ఇద్దరూ ఇలా దూరం కావటం రాహుల్ గాంధీ వ్యక్తిత్వానికి దెబ్బనే. ఎందుకంటే అప్పటికి తనే అధ్యక్షుడిగా వుండి మిత్రుల ప్రయోజనాల్ని కాపాడకుండా తల్లిమాట కే విలువిచ్చాడు. అందుకే వాళ్లకు తన మీద గురి పోయింది. అలాకాని పక్షంలో వీళ్ళిద్దరూ ఎప్పటికైనా పార్టీలో తనకు పోటీ అవుతారని అభద్రతాభావం తో ఇలా చేసివుండొచ్చు. ఎందుకంటే 2019 లో రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నప్పుడు  సచిన్ పైలట్ కానీ, జ్యోతిరాదిత్య సిందియా కానీ ఆ పదవిని చేపడతారని వూహించారు. ఇక్కడే కాంగ్రెస్ శ్రేణులు అమాయకంగా సోనియా గాంధీ ని, రాహుల్ గాంధీ ని నమ్మారు. 2004 లోనే ప్రణాబ్ ముఖర్జీ ని కాకుండా చేసినప్పుడు ఇప్పుడు పాపులర్ నాయకుల్ని చేస్తారని ఊహించటం గొర్రె కసాయివాడిని నమ్మినట్లే వుంది. సోనియా గాంధీ తన కొడుక్కి ఇంకొకరు పోటీగా తయారవ్వటం సహించలేదు కదా. ఈ విషయం తెలియక పాపం కాంగ్రెస్ శ్రేణులు సోనియా గాంధీ ని అమాయకంగా నమ్మారు.

సోనియా గాంధీ ని నమ్ముకుంటే కుక్క తోక పట్టుకొని గోదారి ఈదినట్లే 

ఇంతవరకు ఎప్పటికైనా కాంగ్రెస్ లో అంతరంగిక ప్రజాస్వామ్యాన్ని పాటిస్తారని యువకులను నాయకత్వ స్థానానికి ప్రోత్సహిస్తారని ఎక్కడో కొంత ఆశ వుండేది. ఈ ఇద్దరు నాయకుల్ని ముఖ్యంగా సచిన్ పైలట్ బయటకు పోయే పరిస్థితులు సృష్టించటం చూసిన తర్వాత కాంగ్రెస్ తిరిగి పునరుజ్జీవం పొందుతుందనే ఆశలు అడుగంటాయి. సోనియా గాంధీ చివరకు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయటానికే పూనుకున్నట్లు తెలుస్తుంది. వుంటే తన కుటుంబం వుండాలి లేకపోతే కాంగ్రెస్ నాశనమైనా పర్వాలేదనే తరహాలోనే పావులు కదపటం చూస్తున్నాం. ఇంకా ఎవరికైనా సోనియా గాంధీ ని నమ్ముకొని కాంగ్రెస్ ని తిరిగి అధికారం లోకి తీసుకురాగలమని అనుకుంటే కుక్కతోక పోక పట్టుకొని గోదావరి ఈదినట్లే నని గ్రహించాలి.

‘ఆర్ఆర్ఆర్’ నుంచి సెన్సేషనల్ అప్‌డేట్..


పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా రానున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్‘ పై హీరోల ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతోంది.. తారక్ గెటప్ ఎలా ఉండనుందని ఇప్పటికే తారక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చేస్తోన్న హడావుడి గురించి తెలిసిందే. తాజాగా ఎన్టీఆర్ గెటప్ కు సంబంధించి ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఎన్టీఆర్ ఈ సినిమాలో మొత్తం ఆరు గెటప్స్ లో కనిపిస్తాడని.. శత్రువులు గుర్తు పట్టకుండా ఉండటానికి భీమ్ తరుచూ తన వేషాన్ని మారుస్తూ ఉంటాడని.. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ లుక్స్ కూడా సినిమాలో ఆరు రకాలుగా ఉండబోతున్నాయని టాక్.

ఎన్టీఆర్ ఒక్కడే పాన్ ఇండియా రేంజ్ ను..

ఇక ఎన్టీఆర్ యాక్షన్ సీన్స్ ను అద్భుతంగా వచ్చేలా రాజమౌళి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చేస్తున్నాడట. రాజమౌళికి పర్సనల్ గా తారక్ పై అభిమానం ఉంది. అందుకే ఎన్టీఆర్ ను సినిమాలో హైలైట్ చెయ్యటానికే రాజమౌళి మొదటినుండి ప్లాన్ చేస్తున్నాడట. అందులో భాగంగానే తారక్ కోసం ప్రత్యేకంగా డైలాగ్స్ రాయించాడట. ఎన్టీఆర్ డైలాగ్ లన్నీ అద్భుతంగా ఉంటాయని.. మొత్తం సినిమాలోనే ప్రధాన హైలెట్స్ లో తారక్ డైలాగ్ లే మెయిన్ హైలెట్ అవుతాయని.. తెలంగాణ యాసలో తారక్ పలికే మాడ్యులేషన్ చాలా గొప్పగా ఉంటుందని తెలుస్తోంది. పైగా ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించబోతున్నాడు. ఆ పాత్రలోనే స్వతహాగా మంచి ఆవేశం ఉంటుంది.

ఇక ఖర్చుకు ఏ మాత్రం భయపడకుండా డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాడు. కానీ కరోనా ప్రభావం ఈ సినిమా పై ఎక్కువ పడనుంది. ఇక ఈ సినిమానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే సాంగ్స్ తో పాటు చాలా వరకూ నేపథ్య సంగీతాన్ని కూడా కీరవాణి పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా పై అన్ని ఇండస్ట్రీల నుండి అత్యంత భారీ అంచనాలు ఉండటంతో అవుట్ ఫుట్ విషయంలో ఎక్కడా విశ్వసనీయత తగ్గకుండా సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఓ హీరోయిన్ గా శ్రీయా శరణ్ నటిస్తోందని ఆమె ఇటీవలే సోషల్ మీడియాలో ఘనంగా చెప్పుకున్న సంగతి తెలిసిందే.

అదేంటి కేటిఆర్ గారూ.. మాట మార్చారు!

Ktr

తెలంగాణ మంత్రి కేటీఆర్ కరోనా కేసుల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. “కష్టకాలంలో దుష్ప్రచారం చేయొద్దని చెబుతూ… కరోనాతో రాజకీయం చేయడం సరికాదని, కరోనాకి ధనిక పేద అనే తేడాలు లేవని, ఎవరికైనా రావొచ్చన్నారు. తెలంగాణలో వేలల్లో కరోనా కేసులు వచ్చినా 98 శాతం మంది కోలుకున్నారని కేటిఆర్ తెలిపారు” అయితే ఇదంతా రెండు రోజుల క్రితం మాటలు. ఇప్పుడు ఆయన మాటలు మారిపోయాయి.

ఇప్పుడు కరోనా పై కేటిఆర్ మాట్లాడుతూ..
“కరోనా విషయంలో సీఎం కేసీఆర్‌ విఫల మయ్యారని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. కొన్ని పత్రికలూ అదే రాస్తున్నాయి. మరి పాస్‌ అయిందెవరో, కరోనాను పూర్తిగా ఎవరు నిర్మూలించారో ప్రపంచంలో.., అలాగే దేశంలో ఒక్కరిని చూపించండి. ఎవరైనా నాయకుడు లేదా ఏదైనా ఒక ప్రభుత్వం గొప్పగా ఏ పనైనా చేసిందా? ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చేత సాయం, మాట సాయం చేయాలే తప్ప విమర్శలు తగవు” అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో 98 శాతం కరోనా కేసులు తగ్గుతున్నాయని చెప్పిన కేటిఆర్, అంతలోనే మాటమార్చి దేశంలో ఏ రాష్ట్ర సీఎం కరోనాని కట్టడి చేశారో చెప్పామనడం హాస్యస్పందంగా ఉందని పలువురు ఆశ్చర్య పోతున్నారు. సీఎం కేసీఆర్ కూడా గతంలో కరోనా గూర్చి మాట్లాడుతూ.. తెలంగాణ గడ్డపైన కరోనా అడ్డుపెట్టదని వ్యాఖ్యానించారు. ఇప్పుడు కరోనా తెలంగాణని ఏలుతుంటే.. కేటిఆర్ గాని, కేసీఆర్ గాని ఎందుకు మౌనంగా ఉన్నారో తెలపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

పాపం నయనతార పై మళ్లీ పుకార్లు !

లేడీ సూపర్ స్టార్ గా నయనతార ఎంతవరకు స్టార్ డమ్ ను ఎంజాయ్ చేస్తోందో తెలియదు గానీ, తన ఇమేజ్ వల్ల వచ్చే పుకార్ల పరంపర పై మాత్రం కచ్చితంగా ఫీల్ అవుతుంది. ఆమె వ్యక్తిగత జీవితంలోని ప్రేమ కథల గురించి కథలుకథలుగా రాస్తుంటారు రాతల రాయళ్లు. అయినా సౌత్ సినీ ఇండస్ట్రీలోనే ఏ స్టార్ హీరోయిన్ కు లేనివిధంగా ఈ ముదురు భామకు ఫుల్ క్రేజ్ ఉందయ్యే.. దాన్ని క్యాష్ చేసుకోవడానికి మీడియా కూడా బాగానే అత్యుత్సాహం చూపిస్తోంది అనుకోండి. ఇక ప్రస్తుత పుకారుకు వస్తే.. విఘ్నేష్ శివన్ తో నయనతార పెళ్లి అయిపోయిందనే వార్త ప్రస్తుతం తమిళ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

గత నాలుగైదు ఏళ్ల నుండి విఘ్నేష్ శివన్ ప్రేమలో మునిగితేలుతున్న నయనతారకు, అతనితో పెళ్లి అయిందని వార్త వస్తే మాత్రం తెగ ఫీల్ అయిపోతుందట. ఎప్పటికపుడూ అతనితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ మీడియాకి ఇన్నాళ్లు మంచి కంటెంట్ ను ఇస్తూ వస్తోన్న నయనతార, పెళ్లిని మాత్రం అస్సలు ఇష్టపడట్లేదట. అసలు పెళ్లి చేసుకోకుండా ఎన్నాళ్ళు అతనితో ప్రేమాయణం నడిపిస్తుందో మరి. ఇప్పటికే తరుచూ హాలీడే ట్రిప్పులకు, పార్టీలకు వెళ్తూ ఉండే ఈ జంట పై మీడియా కన్ను ఎప్పుడూ ఉంటుంది. ఏదొక పుకార్లు రాస్తూ ఉంటారు. అదే వీరి వ్యక్తిగత బంధానికి శుభం కార్డ్ పడేస్తే..ఎవ్వరూ వారి బంధం పై కామెంట్స్ చెయ్యరు కదా.

నయనతార, విఘ్నేశ్‌కు కరోనా…?

మరి ఇప్పటికైనా ఈ జోడీ వివాహం చేసుకుంటే మంచింది. పెళ్లికి ఎలాగూ నయనతార తొందరపడదు కాబట్టి, విఘ్నేష్ శివనే ఆమెను తొందరపెట్టి పెళ్లికి ఒప్పిస్తే.. నయనతార పెళ్లికి రెడీ అవుతోందేమో. మరి మనోడు ఆ పని చేయగలడా.. అసలుకే నయనతార పేమ విప్లవకారుణి అయ్యే. ఏ మాత్రం హార్ట్ అయినా.. మనోడి ప్లేస్ లో మరొకడు ఉండే అవకాశం లేకపోలేదు. అందుకే వివాహం విషయంలో మనోడు కూడా కాస్త అటు ఇటుగా సర్దుకుపోతున్నాడట. ఏమైనా నయనతారకు పెళ్లికి వార్తలు బాగా అలవాటు అయిపోయి ఉంటాయి కదా.. మళ్ళీ అలాంటి వార్తలు వస్తే ఫీల్ అవ్వడం ఎందుకు..?

కేసీఆర్ ను వెంటాడుతున్న ఆ ‘అర్థరాత్రి’ భయం


తెలంగాణ సీఎం కేసీఆర్ ఏదీ చేసినా అత్యంత పకడ్బందీగా.. నాటకీయంగా చేస్తుంటారు. అందుకే ఆయన చేసేవరకు మూడో కంటికి కూడా తెలియదు.. తెలిశాక అది సంచలనమవుతోంది. ఇటీవల తెలంగాణ సెక్రటేరియట్ ను కూడా అర్థరాత్రి 12 గంటలకు స్టార్ట్ చేసి అందులోని మత ప్రార్థనాలయాలు అయిన నల్లపోచమ్మ గుడి.. మసీదును అత్యంత చాకచక్యంగా కూలగొట్టించేశాడు. సచివాలయం నిర్మాణానికి ఉన్న అడ్డంకులను తొలగించేశాడు.

అయితే కూల్చివేసిన మసీదు సమస్య ముఖ్యమంత్రి కేసీఆర్ ను వెంటాడుతున్నట్టు కనిపిస్తోంది. సెక్రటేరియట్ భవనం కూల్చివేత సమయంలో దెబ్బతిన్న మసీదును పునర్నిర్మిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. దీంతో తన స్నేహితుడు.. ఆ వర్గానికే చెందిన ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఏకంగా దీనికి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. కానీ ఇతర ముస్లిం నాయకులు మాత్రం యుద్ధం మొదలుపెట్టడం కేసీఆర్ కు మింగుడుపడని వ్యవహారంగా మారిందట..

సచివాలయం నిర్మాణం.. తెరపైకి కొత్త డిమాండ్..!

హైదరాబాద్ పాతబస్తీలోని ముస్లింల అత్యున్నత సంస్థ ‘తెహ్రీక్ ముస్లిం షబ్బాన్’ తాజాగా సెక్రటేరియట్ కాంప్లెక్స్ లోని మసీదు దెబ్బతినడాన్ని సీరియస్ గా తీసుకుంది. దీన్ని నిరసిస్తూ జంట నగరాల్లోని మసీదులపై నల్లజెండాలను ఎగురవేయాలని ముస్లింలను కోరింది. దీనిపై పోరుబాట పట్టారు. సచివాలయ ప్రాంగణంలో వేరే ప్రదేశంలో మసీదును పునర్నిర్మిస్తానన్న కేసీఆర్ ప్రతిపాదనను తెహ్రీక్ ముస్లిం షబ్బాన్ అధ్యక్షుడు మహ్మద్ ముస్తాక్ మాలిక్ ఖండించారు. మసీదును ఒకే చోట నిర్మించాలని.. అది ఒకసారి ఒకే చోట మాత్రమే ఉంటుందని ఆయన అన్నారు. సంప్రదాయాలు పాటించాలని కొత్త మెలిక పెట్టారు. ముస్లిం నాయకుల ప్రతినిధి ప్రతినిధి బృందాన్ని కూల్చివేత స్థలాన్ని సందర్శించడానికి అనుమతించాలని డిమాండ్ చేశారు.

సోనియా గాంధీని నమ్ముకుంటే నిండా మునిగినట్లే

ఈ తెహ్రీక్ సంస్థ అనేక రెబల్ ఇస్లామిక్ గ్రూపుల మద్దతును కలిగి ఉంది. ముస్లింలలోనే అత్యున్నత సంస్థ. ఆ సంస్థ కేసీఆర్ నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్లడం గులాబీ దళపతిని కలవరపాటుకు గురిచేస్తోంది. పైగా ఎంఐఎంను, అసదుద్దీన్ మసీదు పునర్నిర్మాణాన్ని స్వాగతించడాన్ని ఈ తెహ్రీక్ సంస్థ తీవ్రంగా వ్యతిరేకించింది. అంతేకాదు.. తాజాగా రాష్ట్రంలో షియా ఆస్తులను పరిరక్షించడంలో బోర్డు విఫలమైందని మంగళవారం వక్ఫ్ బోర్డు సమావేశాన్ని షియా ముస్లింలు బహిష్కరించి పోరుబాట పట్టారు. దీంతో మసీదు కూల్చివేత అల్లర్లకు దారితీస్తుందేమోనన్న భయం కేసీఆర్ ను వెంటాడుతోందట..

సచిన్ పైలట్ కు రెడ్ కార్పెట్ పరుస్తున్న బీజేపీ?


ఎడారి రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి. రోజురోజుకు రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. సీఎం అశోక్ గెహ్లట్ , పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య నెలకొన్న విబేధాలు తారాస్థాయికి చేరాయి. సచిన్ పైలట్ ఆయన మద్దతుదారులతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు యత్నిస్తున్నారని గెహ్లట్ వర్గంలో ఆరోపిస్తుంది. ఈనేపథ్యంలో సచిన్ పైలట్ తో కాంగ్రెస్ అధిష్టానం సంప్రదింపులకు ప్రయత్నించింది. అయితే సచిన్ పైలట్ నుంచి స్పందన కరువడంతో సచిన్ పైలట్ ను పీసీసీ చీఫ్, డిప్యూటీ పదవీ నుంచి తొలగిస్తున్నట్లు కాంగ్రెస్ అధిష్టానం తాజాగా ప్రకటించింది.

కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న బీజేపీ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. సచిన్ పైలట్ పై కాంగ్రెస్ అధిష్టానం వేటువేసిన వెంటనే బీజేపీ సీనియర్ నేత ఓం మాథుర్ స్పందించారు. బీజేపీ విధివిధానాలు నచ్చినవారు తమ పార్టీలోకి రావొచ్చని ఆహ్వానం పలికారు. అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందని ప్రకటించిన గెహ్లాట్ అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు.

సచిన్ పైలెట్ పై కాంగ్రెస్ వేటు.. తర్వాత ఏంటీ?

కాంగ్రెస్ అధిష్టానం తనపై వేటువేయడంపై సచిన్ పైలట్ కూడా స్పందించారు. సత్యాన్ని వక్రీకరించగలరేమో కానీ ఓడించలేరంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. అయితే పార్టీ మారే విషయంపై ఆయన ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. నేటి సాయంత్రం లోపు సచిన్ తన రాజకీయ భవిష్యత్ పై కీలక నిర్ణయం తీసుకుంటారని ప్రచారం రాజస్థాన్లో జోరుగా సాగుతోంది.

బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిక కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలన్నీ ఒక్కొక్కటిగా బీజేపీ వశమవుతున్నాయి. కర్ణాటక, మధ్యప్రదేశ్ తరహాలోనే రాజస్థాన్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని అనుమానాలు కలుగుతున్నారు. మధ్యప్రదేశ్ తరహాలోనే రాజస్తాన్లో కూడా బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు పావులు కదుపుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈమేరకు సచిన్ పైలట్, ఆయన మద్దతుదారులకు బీజేపీ రెడ్ కార్పెట్ పరుస్తుందనే వాదనలు విన్పిస్తున్నాయి.

అయితే సచిన్ పైలట్ బీజేపీ చేరుతారా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ సచిన్ పైలట్ తన మద్దతుదారులతో బీజేపీలో చేరితే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు సచిన్ సొంతపార్టీ పెడుతారని ప్రచారం కూడా జరుగుతుంది. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. నేటి సాయంత్రంలోగా ఆయన రాజకీయ భవిష్యత్ పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఏది ఏమైనా ప్రస్తుతం రాజస్థాన్లో జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించేలా కన్పిస్తున్నాయి. ఇప్పటికే కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను కొల్పోయిన కాంగ్రెస్ మరో రాష్ట్రం చేజారిపోకుండా ఎలాంటి చర్యలు తీసుకుందో వేచి చూడాల్సిందే..!

ఎవ్వరూ తగ్గట్లేదుగా…!

sachin pilot

రాజస్థాన్‌ లో అధికార కాంగ్రెస్‌ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం సంక్షోభం ముంగిట నిలిచింది. తిరుగుబాటు చేసిన రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలెట్‌ ను బుజ్జగించే ప్రయత్నాలకు కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపించడం లేదు. పార్టీ కార్యకలాపాలకు ఆయన కూడా దూరంగా ఉన్నారు. ఆయన తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలతో కలిసి గురుగ్రామ్‌ లో ఒక హోటల్లో ఉన్నట్టు చెబుతున్నారు.

మంగళవారం జరగబోయే రెండో సమావేశానికి తప్పకుండా హాజరు కావాలని అంతకుముందు జరిగిన కాంగ్రెస్ పార్టీ లెజిస్లేచర్ సమావేశంలో పార్టీ సీనియర్ నేతలు సచిన్ పైలట్‌ ను కోరారు. కానీ సచిన్ దానికి కూడా వెళ్లలేదు. జైపూర్‌ లోని హోటల్ ఫెయిర్ మౌంట్‌ లో మంగళవారం ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి సచిన్ పైలట్, ఆయనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు రాలేదు.

“మేం సచిన్ పైలెట్‌ కు మరో అవకాశం ఇస్తున్నాం. ఆయన పార్టీ సమావేశంలోకి రావాలని చెబుతున్నాం. ఆయన వస్తారని, రాజస్థాన్ ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తారని మేం ఆశిస్తున్నాం” అని మంగళవారం ఉదయం శాసనసభా పక్ష సమావేశంలో మొదట రాజస్థాన్ కాంగ్రెస్ ఇంచార్జ్ అవినాశ్ పాండే అన్నారు.

మరోవైపు తనకు రాహుల్ గాంధీని కలవాలనే ఆలోచనలు ఏమాత్రం లేవని సచిన్ పైలెట్ చెప్పారు. ఒక టీవీ చానల్‌ తో మాట్లాడిన ఆయన పార్టీ బుజ్జగింపు ప్రయత్నాలకు తను దూరంగా ఉన్నానని చెప్పారు.

నిత్యామీనన్ లిప్ లాక్.. వైరల్


కేరళ కుట్టీ నిత్యామీనన్ ను ఎన్నడూ చూడని పాత్రలో అభిమానులు చూసి అవాక్కవుతున్నారు. వెండితెరపై అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ భామలో ఇలాంటి కోణం కూడా ఉందా? అని ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ‘బీత్ ఇన్ టు ది షాడోస్’ అనే వెబ్ సీరీస్ నిత్యమీనన్ లెస్బియన్ గా నటించింది. ఓ యువతీతో లిప్ లాక్ చేసి ఔరా అనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగులు నిలిచిపోగా థియేటర్లు మూతపడ్డాయి. దీంతో ప్రేక్షకులంతా వెబ్ సీరిసులు, ఓటీటీలకు అలవాటు పడ్డారు. నిత్యమీనన్ కూడా లాక్డౌన్ సమయాన్ని చాలా ఎంజాయ్ చేస్తున్నానని తెలిపింది. లాక్డౌన్ సమయంలో రచయితగా మారి తన సినిమా కోసం ఓ కథను కూడా రాసుకున్నట్లు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్న సంగతి తెల్సిందే.

వెండితెరపై సంప్రదాయ పాత్రల్లో కన్పించిన నిత్యామీనన్ వెబ్ సీరిసులో మాత్రం హాట్ హాట్ గా నటించింది. ఆమెను ఇలా చూసిన అభిమానులు మాత్రం ఖుషీ అవుతున్నారు. ‘బీత్ ఇన్ టు ది షాడోస్’ వెబ్ సిరీస్‌లో అభిషేక్ బచ్చన్, నిత్యామీనన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇందులో నిత్యమీనన్ లెస్బియన్‌గా నటించింది. ఓ యువతితో కారులో ఘాటైన లిప్ లాక్ చేసి ఆకట్టుకుంది. అయితే ఇప్పటివరకు నిత్యామీనన్ ఇలాంటి పాత్రలో చూడని వారు మాత్రం ఒకింత షాక్ కు గురవుతున్నారు..

ఓహో ఛాన్స్ కోసం.. లావణ్య బికినీ !

ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది. కొందరు నిత్యమినన్ ట్రోల్ చేస్తుండగా కుర్రకారు మాత్రం పదేపదే ఆ సన్నివేశాన్ని రిపీట్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. గతంలో నిత్యామీనన్ ‘అ’ చిత్రంలో ఇలాంటి వివాదాస్పద లెస్పిబియన్ పాత్రలో నటించింది. ప్రస్తుతం నిత్యామీనన్ తమిళంలో జయలలిత జీవితంపై తెరకెక్కుతోన్న ‘ది ఐరన్ లేడీ’లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. తాజాగా నిత్యమీనన్ నటించిన వెబ్ సీరిస్ మాత్రం విశేషంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతుండటం గమనార్హం.

బాబుకు సైతం ఆ నేతలు దొరకడం లేదుగా?


టీడీపీ హయాంలో అధికార దర్పాన్ని ప్రదర్శించి నేతలంతా ఇప్పుడు సైలంటయ్యారు. ప్రధానంగా చంద్రబాబు క్యాబినెట్లో స్థానం సంపాదించుకున్న నేతలు ఇప్పుడు పత్తాకు కూడా కన్పించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓటమిపాలైంది. 175సీట్లలో పోటీచేసి కేవలం 23సీట్లు సాధించింది. వైసీసీ ఫ్యాన్ గాలి ఏపీలో జోరుగా వీయడంతో 151సీట్ల బంపర్ మెజార్టీతో ఆపార్టీ అధికారంలోకి వచ్చింది.

సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఇటీవలే ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు. తొలి నుంచి దూకుడు స్వభావం కలిగిన జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచే ప్రత్యర్థులను చెడుగుడు ఆడుకుంటున్నాడు. ఒకవైపు ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూనే ప్రజల మన్నలను పొందుతూనే మరోవైపు టీడీపీని టార్గెట్ చేస్తున్నాడు. చంద్రబాబు హయాంలో జరిగిన స్కాములను బయటికితీసి టీడీపీ నేతలకు జైళ్లకు పంపుతున్నారు. దీంతో టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.

చంద్రబాబు బినామీ… టీడీపీకి గుడ్ బై చెవుతున్నాడా?

ప్రధానంగా టీడీపీ హయాంలో మంత్రులుగా చేసిన నేతలంతా ప్రస్తుతం సైలంటవడం చర్చనీయాంశంగా మారింది. కనీసం చంద్రబాబు, లోకేష్ లకు కూడా అందుబాటులోకి రావడంలేదనే టాక్ విన్పిస్తుంది. మీడియా ఎక్కువగా ఫోకస్ అయితే తమ పరిస్థితి కూడా అచ్చెన్నాయుడిలా మారుతుందని ఆందోళన చెందుతున్నారట. దీంతోపాటు టీడీపీలో లోకేష్ పెత్తనం నచ్చక నేతలంతా సైలంట్ అయినట్లు తెలుస్తోంది.

టీడీపీ ప్రభుత్వంలో యాక్టివ్ గా వ్యవహరించిన పరిటాల కుటుంబం పూర్తిగా మౌనం దాల్చింది. చిత్తూరులో అమర్ నాథ్ రెడ్డి, నెల్లూరులో నారాయణ సైలంటయ్యారు. ఇక ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరే గంట శ్రీనివాసరావు ఇంక గంటకొట్టడం లేదు. కృష్ణా జిల్లాలో దేవినేని ఉమ, గుంటూరులో ఒకరిద్దరు నేతలు తప్ప ఎవరూ యాక్టివ్ గా కన్పించడం లేదని టీడీపీ వర్గాల్లో టాక్ విన్పిస్తుంది.

మరోవైపు జగన్మోహన్ రెడ్డి టీడీపీ నేతలను టార్గెట్ చేస్తుండటంతో ఆ పార్టీ నేతలు ప్రస్తుతం స్తబ్ధుగా ఉంటున్నారు. టీడీపీ హయంలోని స్కాములన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతూ నేతలంతా జైళ్లకు వెళుతుండటంతో ఇప్పుడు మౌనంగా ఉండటమో బెటరని ఆలోచిస్తున్నారట. ఎన్నికల ముందువరకు యాక్టివ్ కావచ్చని టీడీపీ నేతలు చంద్రబాబుకే చెబుతున్నారట. మరికొందరేమో తమ వ్యాపారాలు, ఆర్థిక అవసరాల కోసం టీడీపీని వదిలి వైసీపీలో చేరుతున్నారు.

ఇప్పటికైనా చంద్రబాబు ఇలాంటి నేతలను దూరంపెట్టి పార్టీ కోసం కష్టపడేవారికే పదవులు ఇవ్వాలని కోరుతున్నారు. మరీ బాబు ఇలాంటి వారి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే..!

కరోనాకు గబ్బిలాలే దారి చూపిస్తున్నాయా?


కరోనా(కోవిడ్-19) వైరస్ పేరు చెబితే ప్రపంచ దేశాలు బెంబేలెత్తిపోతున్నాయి. చైనాలోని వూహాన్లో సోకిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచంలోని అన్నిదేశాలకు పాకింది. ఈ వైరస్ ధాటికి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ లాంటి అగ్రదేశాలు సైతం విలవిలలాడిపోయాయి. రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్యలో పెరిగిపోతోంది. సెలబ్రెటీలు సైతం కరోనా నుంచి తప్పించుకోలేకపోతున్నారు. దీంతో చాలాదేశాలు లాక్డౌన్ విధించి కరోనా కట్టడికి తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి.

కరోనా లక్షణాల లిస్టు రోజురోజుకు పెరిగిపోతుందా?

కరోనా వైరస్ పుట్టుకను పరిశీలిస్తే అది గబ్బిలాల నుంచి మనుషులకు సోకిందని నిపుణులు చెబుతున్నారు. కరోనాతోపాటు చాలా వైరస్ లకు గబ్బిలాలు ఆవాసాలుగా మారుతుండటంతో గబ్బిలాల శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. గబ్బిలాలపై ప్రభావం చూపని వైరస్ లు మనుషుల ఎలా ప్రభావం చూపుతున్నాయనే కోణంలో అమెరికన్ సైంటిస్టులు అధ్యాయనం చేపట్టారు. వీరి అధ్యాయనంలో చాలా విషయాలు వెల్లడైనట్లు తెలుస్తోంది. ఇందులోని విషయాలు తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తిని చూపుతున్నారు.

కరోనా వైరస్ ప్రభావం గబ్బిలాల్లోని రోగ నిరోధక వ్యవస్థపై పరిమిత స్థాయిలోనే ఉంటుందని తేలిందట. గబ్బిల్లాల్లో వైరస్ విజృంభించకుండా ఉండేందుకు వాటిలో ప్రత్యేక వ్యవస్థ క్రియాశీలకంగా పని చేస్తుందని గుర్తించారు. అదే సమయంలో మనుషుల్లో మాత్రం ఈ వైరస్ సోకిన వెంటనే రోగనిరోధక వ్యవస్థ వెంటనే స్పందిచటంతో విజృంభిస్తుందని తమ పరిశోధనల్లో వెల్లడిందని సైంటిస్టులు చెబుతున్నారు.

కరోనా తెచ్చిన బద్ధకం!

ఈ కారణంగానే మానవుడిలో జ్వరం, దగ్గు, జలుబు, వాపులు వంటి ఇతర లక్షణాలు బయటపడుతున్నాయని అంటున్నారు. రోగనిరోధక శక్తి స్పందించి తిప్పికొట్టే క్రమంలో బయటపడుతున్న పలు వ్యాధులకు కారణమవుతున్న జన్యువులు గబ్బిలాల్లో లేవని వారంటున్నారు. అంతేకాకుండా గబ్బిల్లాల్లోని ఎగిరే గుణం కూడా వాటిలో వైరస్ వ్యాప్తికి అవకాశం లేకుండా చేస్తున్నాయని చెబుతున్నారు. మనుషుల్లోని ఈ జన్యువుల స్పందనల్ని నియంత్రించే మందులను ఉత్పత్తిచేస్తే కరోనా కంట్రోల్ చేసే అవకాశం ఉందంటున్నారు. ఈ పరిశోధన ఆధారంగానే వ్యాక్సిన్ తయారు చేయనున్నట్లు అమెరికన్ సైంటిస్టులు చెబుతున్నారు.