
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును నాటి ఆంధ్రప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేసినప్పటికీ కాంగ్రెస్ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. అయితే కాంగ్రెస్ నేతల ఓవర్ కాన్ఫిడెన్స్ కారణంగా ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయింది. మరోవైపు ఆంధ్రాలోనూ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. దీంతో రెంటికి చెడ్డరెవడిలా కాంగ్రెస్ పరిస్థితి మారింది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటై లక్ష్యంగా ఆవిర్భావించిన టీఆర్ఎస్ 2014ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. దీంతో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు మరింత చేరువయ్యారు. ఐదేళ్ల పాలన పూర్తికాకుండానే కేసీఆర్ వ్యూహంలో భాగంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లి కాంగ్రెస్ పార్టీని మరోసారి దెబ్బకొట్టారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబుతో కాంగ్రెస్ పొత్తుపెట్టుకోవడం కూడా కాంగ్రెస్ కలిసిరాలేదు. దీంతో 2018 ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా ఓటమిపాలైంది. నాటి నుంచి కాంగ్రెస్ నేతల్లో నిరుత్సాహం నెలకొంది.
దీంతో తెలంగాణలో ఏ ఎన్నిక జరిగిన కాంగ్రెస్ ఢీలా పడిపోతూ వస్తోంది. మున్సిపల్, కార్పొరేషన్, సర్పంచ్, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ సత్తాచాటలేకపోయింది. అయినప్పటికీ కాంగ్రెస్ అక్కడడక్కడ సత్తాచాటింది. సీఎం కేసీఆర్ పాలనపై ఇప్పుడిప్పుడే వ్యతిరేకత వస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ అలర్టయింది. కాంగ్రెస్ గ్రూపు రాజకీయాలకు స్వస్తి చెప్పి ఐక్యతరాగం ఆలపిస్తున్నారు. నిన్నటి వరకు ఉప్పునిప్పులా ఉన్న నేతలంతా ఒకటే అనే సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నారు.
బీజేపీపై కేసీఆర్ కాంగ్రెస్ అస్త్రం.. ఫలిస్తుందా?
ఇటీవల కాంగ్రెస్ చేపట్టిన జలదీక్షకు కాంగ్రెస్ శ్రేణులే కాకుండా ప్రజాసంఘాల నుంచి పెద్దఎత్తున మద్దతు లభించడంతో కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. పొతిరెడ్డిపాడు ఎత్తు పెంచడం వల్ల దక్షిణ తెలంగాణ ఎడారి మారుతుందని తెల్సినా ప్రభుత్వం స్పందించడం లేదని కాంగ్రెస్ నేతలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కరోనా విజృభిస్తున్నవేళ కేసీఆర్ అదృశ్యం, సచివాలయం కూల్చివేత వంటి అంశాలను హైలెట్ చేసి కాంగ్రెస్ ప్రజల కోసం పనిచేస్తుందనే ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు.
తాజాగా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పాలనపై అంతర్గత సర్వే చేయగా ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టమైందనట్లు తేలిందట. దీంతో నేతలంతా పదవుల కోసం పంతాలుమాని ఉమ్మడిగా వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, సీఎల్పీ భట్టీ, ఎంపీలు రేవంత్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ వీహెచ్, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, విజయశాంతి లాంటి నేతలంతా ఇప్పుడు ఒక్కతాటిపైకి వస్తున్నారు. ఉమ్మడిగా ప్రభుత్వంపై పోరుకు సిద్ధమవుతున్నారు. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లోనూ నూతనోత్సాహం కన్పిస్తుందని టాక్ విన్పిస్తోంది. అయితే ఈ ఐక్యత రాగం అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగుతుందా? అనేది వేచి చూడాల్సిందే..!