Home Blog Page 8396

మాస్కు పెట్టుకోలేదా.. లక్ష కట్టాల్సిందే..!

No mask

No mask
క్రీస్తు పూర్వం.. క్రీస్తు శకం అని మనమంతా పుస్తకాల్లో చదువుకున్నాం.. కానీ ప్రస్తుతం కరోనాకు పూర్వం.. కరోనా శకం అని చెప్పుకోవాల్సి వస్తోంది. ఇదంతా డ్రాగన్ కంట్రీ పుణ్యమేనని చెప్పొచ్చు. ప్రపంచానికి చైనా వస్తువులను ఎంత చౌకగా అందిస్తుందో.. అలాగే వైరసులకు కూడా ప్రపంచానికి బహుమతిగా ఇస్తోంది. గతంలోనూ ఎన్నో మహమ్మరి రోగాలకు చైనా కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన సంగతి తెల్సందే. తాజాగా కరోనా మహమ్మరిని ప్రపంచంపైకి చైనా వదిలింది. ఆదేశంలో కరోనా కట్టడిలో ఉన్నప్పటికీ ప్రపంచ దేశాలు మాత్రం కరోనా ధాటికి అల్లాడిపోతున్నాయి.

Also Read: సుప్రీంలో ఏపీ ప్రభుత్వానికి నిరాశ..!

అగ్రరాజ్యాలు సైతం కరోనా ధాటికి ఏం చేయాలో తెలియక చేతులేత్తేస్తున్నాయి. ఇటలీ లాంటి అందమైన దేశం కరోనా ఎంట్రీతో శవాలదిబ్బగా మారింది. పేద, ధనిక, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా వైరస్ అందరిపై ప్రభావం చూపుతోంది. ఇక భారతదేశంలోనూ కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతుండటంతో ఆందోళన రేపుతోంది. లాక్డౌన్ విధించినప్పుడు కరోనా కట్టడిలోనే ఉంది. అయితే కేంద్రం ఎప్పుడైతే ఆన్ లాక్ విధించిందో నాటి నుంచి కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. అయితే ఇతర దేశాలతో పొలిస్తే మనదేశంలో కరోనా మరణాలు తక్కువగా ఉండటం, రికవరీ రేటు ఎక్కువగా ఉండటంతో కొంత ఊపశమనం కలిగిస్తుంది.

కరోనా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలు కరోనా నిబంధనలు పాటించేలా అవగాహన కల్పిస్తూనే కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. దీంతో ప్రజలంతా మాస్కులు ధరించడం, శానిటైజర్లతో చేతులు శుభ్రంగా కడుక్కోవడం, భౌతికదూరం పాటించడం వంటివి చేస్తున్నాయి. అయితే కొంతమంది తమకేమీ కాదనే ధోరణిలో కరోనా నిబంధనలు పాటించకుండా వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారు. దీంతో వారిపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భారీగానే జరిమానాలు, కేసులు పెడుతూ వారిని కట్టడి చేస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లోనూ మాస్కులు ధరించకుండా బయట తిరిగితే వెయ్యి రూపాయాల వరకు జరిమానా విధిస్తున్నారు. దీంతో ప్రతీఒక్కరూ ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరిస్తున్నారు. తాజాగా జార్జండ్ ప్రభుత్వం కరోనా కట్టడికి సంచలనం నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. మాస్కు ధరించకపోతే ఏకంగా లక్ష రూపాయాల జరిమానా విధించాలని ఆ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా కరోనా నిబంధనలు పాటించకపోతే రెండేళ్ల వరకు జైలు శిక్ష కూడా విధించేలా నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతోన్నారు.

Also Read: కేసీఆర్ కు సరైన ప్రత్యర్థి అతడేనా?

ప్రభుత్వం ముందుగా ప్రజలందరికీ మాస్కులు సరఫరాచేసి ఆతర్వాత వారు పాటించకపోతే జరిమానా విధించాలని పలువురు కోరుతున్నారు. అసలే లాక్డౌన్ కారణంగా పనుల్లేక ప్రజలు అల్లాడిపోతుంటే ప్రభుత్వాలు మాత్రం లక్షల్లో జరిమానాలు, జైలు శిక్షలు విధించడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే కరోనా కట్టడి చేయాలని ఇలాంటి కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

సుప్రీంలో ఏపీ ప్రభుత్వానికి నిరాశ..!

AP SEC issue

AP SEC issue
నిమ్మగడ్డ రమేష్ కుమార్ హై కోర్టులో దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ కేసుపై సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వేసిన స్సెషల్ లీవ్ పిటీషన్ పై సుప్రీం ధర్మాసనం ఈ రోజు విచారించింది. కోర్టు దిక్కరణ కేసులో స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. వచ్చే శుక్రవారం లోగా హై కోర్టు ఆదేశాలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించక తప్పే పరిస్థితి కనిపించడం లేదు.

స్పెషల్ లీవ్ పిటీషన్ పై విచారణ సందర్భంగా ప్రభుత్వం వైఖరిపై సుప్రీం కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. హై కోర్టు ఆదేశాలను అమలు చేయాలని గవర్నర్ ఆదేశించినా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించింది. కేసులో అసలు ఈ పరిస్థతి ఎందుకు వచ్చిందని అని చెప్పాలంది. అదేవిధంగా న్యాయస్థానాలు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చినప్పుడు న్యాయమూర్తులను, తీర్పులను తప్పుబడుతూ సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకరమైన పోస్టుల పెట్టిన విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లడంతో తీవ్రంగా స్పందించింది. ఆ వివరాలను తమకు సమర్పించాలని కోరింది.

Also Read: నిమ్మగడ్డ విషయంలో ప్రభుత్వ వైఖరి మారదా?

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తిరిగి ఎస్ఇసిగా కోనసాగించాలని గతంలో హై కోర్టు ఇచ్చిన తీర్పుపైనా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం విధితమే. ఈ పీటీషన్ లపైన విచారించిన సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. హై కోర్టు ఆదేశాలను అమలు చేయాలని గతంలోనే సూచించింది. అయినప్పటికీ ప్రభుత్వం నిమ్మగడ్డ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటీషన్ పై సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేసింది.

మరోవైపు నిమ్మగడ్డ అభ్యర్ధన మేరకు గవర్నర్ నిమ్మగడ్డ కేసులో హై కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి సూచనలు చేశారు. సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటీషన్ సాకుగా చూపి ప్రభుత్వం ఈ అంశంపై తన నిర్ణయాన్ని ప్రకటించకుండా దాట వేసింది. ప్రస్తుతం సుప్రీం కోర్టులోను ప్రభుత్వానికి నిరాశే ఎదురవడంతో నిమ్మగడ్డను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించే విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం ఆసక్తి కరంగా మారింది.

Also Read: అమ్మకానికి అమరావతి భూములు..!

టీఆర్ఎస్ నేత కోసం బీజేపీ ఎదురుచూపు?

BJP-TRS

BJP-TRS

కేంద్రంలోని బీజేపీకి ఉత్తరాది పార్టీ అనే పేరుంది. ఈ ముద్రను చెరిపేసేందుకు దక్షిణాది రాష్ట్రాల వైపు ఎప్పటి నుంచో చూస్తూనే ఉంది. దక్షిణాదిలోని కర్ణాటక మినహా ఎప్పుడూ సొంతంగా పార్టీ అధికారంలోకి వచ్చిన దాఖలులేవు. ఇటీవల బీజేపీ వరుసగా రెండుసార్లు కేంద్రంలోకి అధికారంలో రావడంతో ఈ అవకాశాన్ని బీజేపీ సద్వినియోగం చేసుకుంటోంది. దక్షిణాదిలోనూ బీజేపీ బలపడేందుకు యత్నిస్తుంది.

Also Read: కేసీఆర్ కు సరైన ప్రత్యర్థి అతడేనా?

ఇందులో భాగంగానే తెలుగు రాష్ట్రాలపై బీజేపీ అధిష్టానం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. కిందటి ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో నాలుగు పార్లమెంట్ స్థానాలు గెలుపొందింది. ఏపీలో మాత్రం ఒక్కసీటు గెలుచుకోలేకపోయినా కేంద్రంలో బీజేపీ ఉండటంతో బీజేపీ నాయకులు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తున్నారు. ఇక తెలంగాణలో బీజేపీ బలపడేందుకు అవకాశాలు ఎక్కువగా ఉండటంతో అధిష్టానం ఇటూవైపు ఫోకస్ పెట్టింది. టీఆర్ఎస్ కంచుకోటైన కరీంనగర్ నుంచి ఎంపీగా గెలుపొందిన బండి సంజయ్ కుమార్ కు బీజేపీ అధిష్టానం తెలంగాణ అధ్యక్ష పదవీని కట్టబెట్టింది. యువతలో బండి సంజయ్ కుమార్ కు మంచి పేరుండటంతో ఆయనకు ఆ పదవీ దక్కినట్లు తెలుస్తోంది.

బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ నియామకం తర్వాత ఆ పార్టీ నేతల్లో జోష్ పెరిగింది. అధికార టీఆర్ఎస్ పై బీజేపీ నేతలు దూకుడుగా వెళుతున్నారు. కేంద్ర మంత్రులు తెలంగాణ బీజేపీ నేతలకు పూర్తి మద్దతు ఇస్తున్నారు. దీంతో తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తుంది. అయితే బీజేపీ అధిష్టానం ఓ టీఆర్ఎస్ నేతను తమవైపు ప్రయత్నిస్తోంది. గతంలోనూ సదరు నేత బీజేపీలో చేరుతారని ప్రచారం జరిగింది. అయితే ఏమైందో ఏమోగానీ ఆ నేత చివరి నిమిషంలో బీజేపీకి హ్యండిచ్చినట్లు తెలుస్తోంది.

Also Read: కేసీఆర్‌లో దూకుడు తగ్గడానికి అదే కారణమా?

టీఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత అంతటి బలమైన నేతగా ఉన్న హరీష్ రావును బీజేపీ గాలంవేస్తోంది. కిందటి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత సీఎం కేసీఆర్ కేటీఆర్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు. కొంతకాలం హరీష్ రావుకు మంత్రి పదవీ ఇవ్వలేదు. అప్పటి నుంచి బీజేపీ అధిష్టానం హరీష్ రావుతో టచ్లో ఉందనే ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత కేసీఆర్ హరీష్ రావుకు ఆర్థిక మంత్రి పదవీ కట్టబెట్టారు. దీంతో హరీష్ రావు టీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారు. దీంతో బీజేపీ ఆశలు నెరవేరలేదు.

బీజేపీ పెద్దలు మాత్రం హరీష్ రావు ఎప్పుడొచ్చినా బంపర్ ఆఫర్ ఇస్తామంటూ ఆయనకు సంకేతాలు పంపుతున్నారు. అయితే హరీష్ రావు ఇప్పట్లో టీఆర్ఎస్ ను వీడే పరిస్థితులు మాత్రం ఎక్కడా కన్పించడం లేదు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని నానుడి బలంగా ఉండటంతో బీజేపీ నేతలు హరీష్ రావు రాకకోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. మరీ బీజేపీ ఆశలు ఫలిస్తాయో లేదో వేచి చూడాల్సిందే..!

కేసీఆర్ కు సరైన ప్రత్యర్థి అతడేనా?

Revanth reddy
Revanth reddy
తెలంగాణలో సీఎం కేసీఆర్ కు సరైన ప్రత్యర్థి ఎవరైనా ఉన్నారా? అంటే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. కేసీఆర్ మాటల తూటలకు ధీటుగా బదులిచ్చే నేతలు భూతాద్దంలో పెట్టిన చూసినా ఒక్క నేత కూడా కన్పించరు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఆరేళ్లు  గడిచిపోతున్నా టీఆర్ఎస్ హవానే కొనసాగుతోంది. రాష్ట్రంలో ఏ ఎన్నికలొచ్చినా వార్ వన్ సైడ్ అన్నట్లు గెలుపు ఏకపక్షంగా మారిపోతుంది. టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఏ ఎన్నికలోనూ కారు స్పీడుకు బ్రేకులు వేయలేక చతికిలబడిపోయింది.

గత ఆరేళ్లలో టీఆర్ఎస్ రాష్ట్రంలో బలమైన శక్తిగా మారింది. సరైన క్యాడర్ లేని దగ్గర నుంచి ప్రతిపక్షాలన్నీ జట్టుకట్టి టీఆర్ఎస్ పై పోటీకి దిగినా ఒంటరిగానే సమాధానం చెప్పే స్థాయికి ఆపార్టీ చేరుకుంది. అసెంబ్లీ, పార్లమెంట్, కార్పొరేషన్, మున్సిపల్, సర్పంచ్ ఇలా ఏ ఎన్నిక తీసుకున్న గులాబీ పార్టీ హవానే. ఎక్కడో ఒకచోట కాంగ్రెస్, బీజేపీలు ఒకటి అర సీట్లు గెలిచి పోటీలో మేముకూడా ఉన్నామని సంకేతాలిచ్చేవి. ప్రతిపక్షాల్లో బలమైన గొంతువిన్పించే నాయకులంతా పదవుల కోసం టీఆర్ఎస్ లో చేరడంతో తెలంగాణలో కేసీఆర్ కుటుంబానికి ఎదురులేకుండా పోతుంది.

అయితే పరిస్థితులన్నీ ఎప్పుడు ఒకలా ఉండవు. ఎంతటి బలమైన నాయకుడికైనా ఏదోఒకసారి ప్రతికూల పరిస్థితులు తప్పవు. ప్రస్తుతం తెలంగాణలో కరోనా ఎంట్రీ తర్వాత టీఆర్ఎస్ పరిస్థితి కూడా అలానే మారేలా కన్పిస్తుంది. ఈ సమయంలో సీఎం కేసీఆర్ ను ధీటుగా ఎదుర్కొనే నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే రేవంత్ రెడ్డి పేరు మాత్రమే విన్పిస్తోంది. ఆయన టీడీపీలో ఉన్నా, కాంగ్రెసులో ఉన్నా కేసీఆర్ పై పోరాటం చేస్తూనే ఉన్నారు. కేసీఆర్ మాటలతూటలకు ధీటుగా విమర్శలు చేస్తూ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

గతంలో ప్రగతిభవన్ గడిని టచ్ చేస్తానని ఛాలెంజ్ చేసి రేవంత్ రెడ్డి చూపించారు. పోలీసుల కళ్లుగప్పి ప్రగతిభవన్లోకి ఎంట్రీ చూపించడంతో కేసీఆర్ కు ఇతడే సరైన ప్రత్యర్థి అనే భావన ప్రజల్లోకి వెళ్లింది. అలాగే టీఆర్ఎస్ సర్కార్ కరోనా కట్టడిలో విఫలమైందని రేవంత్ రెడ్డి గళంఎత్తుతున్నారు. టీమ్స్ ఆస్పత్రికి ఆకస్మికంగా సందర్శించడం, తన ఎంపీ నిధులు నుంచి ఆస్పత్రి కోసం 50లక్షలు కేటాయించడం, సచివాలయాన్ని కోవిడ్ ఆస్పత్రిగా మార్చాలని డిమాండ్ చేయడం, కేటీఆర్ ఫౌంహౌజ్ పై పోరాటాలతో తన గళాన్ని గట్టిగానే విన్పించారు. మరోవైపు కాంగ్రెస్ లో జనాకర్షణ నేతలు ఎవరు లేకపోవడంతో రేవంత్ రెడ్డికి కలిసొచ్చింది.

టీడీపీ నుంచి కాంగ్రెస్ లో సత్తాచాటుతున్న రేవంత్ రెడ్డికి ఆపార్టీలోని సీనియర్లు మొకాలు అడ్డుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డికి పీసీసీ పదవీ కట్టబెట్టాలని ప్రయత్నిస్తుంటే సీనియర్లంతా ఒక్కటై రేవంత్ రెడ్డికి పదవీ రాకుండా చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇదంతా ఎలా ఉన్నా.. ప్రస్తుతం టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ ఏమేరకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుందనే ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెసులోని గ్రూపు రాజకీయాలే ఆ పార్టీకి పెద్ద మైనస్ గా మారుతోన్నాయి. అయితే కాంగ్రెస్ నేతలంతా ఒక్కతాటిపై వచ్చి పోరాడితే టీఆర్ఎస్ ను ఎదుర్కోవడం పెద్ద సమస్య కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరీ మున్ముందు ఏం జరుగుతుందో..!

తండ్రికి తగ్గ తనయుడిగా కేటీఆర్ ఎలా ఎదిగారు?

Happy Birthday to KTR
Happy Birthday to KTR
అది 2009 టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమారుడిగా కేటీఆర్ రాజకీయ అరంగేట్రం చేసిన రోజులు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లను ఎంచుకున్నారు. అక్కడ టీఆర్ఎస్ ఇన్ చార్జి మహేందర్ రెడ్డిని పక్కనపెట్టి కేటీఆర్ పోటీచేశారు. రెబల్ గా బరిలోకి దిగిన మహేందర్ రెడ్డి.. కేటీఆర్ కు సిరిసిల్లలో మూడుచెరువుల నీళ్లు తాగించాడు. ఓటమి అంచున నిలబెట్టారు. ఎట్టకేలకు కేటీఆర్ కేవలం 171 ఓట్లతో బతుకుజీవుడా అంటూ గెలిచాడు. అలాంటి కేటీఆర్ మొన్నటి 2019 ఎన్నికల్లో ఏకంగా 96వేలకు పైగా మెజార్టీ సాధించారు. ఇలా ఒక చిన్న నేతగా మొదలైన కేటీఆర్ ప్రస్థానం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను.. ప్రభుత్వాన్ని శాసించే నంబర్ 2 స్థానం వరకు ఎలా సాగిందో తెలుసుకుందాం.. కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనపై స్పెషల్ ఫోకస్..

నాన్న పరిచిన బాట.. సులువుగానే రాజకీయ అధికారం దక్కింది. కానీ నడిపించేది నాన్న కాదు.. కేవలం ప్రోత్సాహాన్ని మాత్రమే ఇచ్చారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా.. మంత్రిగా నిరూపించుకొని కేటీఆర్ ఇప్పుడు తిరుగులేని ఖ్యాతిని సంపాదించారు. తెలంగాణలో రెండోసారి అధికారం చేపట్టిన కేసీఆర్ గత ఏడాది   డిసెంబర్ 17న కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పజెప్పి సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా  కేటీఆర్  అటు పార్టీలో.. ఇటు ప్రభుత్వంలోనూ చెరగని ముద్ర వేశారు.

కేటీఆర్ రాజకీయ ప్రవేశమే ఆసక్తిగా మొదలైంది. అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదులుకొని 2006లో క్రియాశీల రాజకీయాల్లోకి కేటీఆర్ వచ్చారు. 2008లో 39మందిలో ఒకడిగా టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 2009లో సిరిసిల్ల ఎమ్మెల్యేగా కేవలం 171 ఓట్ల  మెజార్టీతో అతి కష్టం మీద గెలిచారు. ఆ తర్వాత జరిగిన 2010,2014,2018 ఎన్నికల్లో  వరుసగా గెలిచారు. తెలంగాణ ప్రభుత్వంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రిత్వ శాఖలను నిర్వహించారు.

కేటీఆర్ గడిచిన ఆరున్నరేళ్లలో మంత్రిగా ఐటీపై చెరగని ముద్రవేశారు. ఐటీని ప్రోత్సహించడానికి దేశాలు తిరిగారు. దిగ్గజ సంస్థలను కలిసి కీలక నిర్ణయాలు తీసుకొని తెలంగాణ ఐటి పురోభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు. కేటీఆర్ ప్రారంభింపచేసిన టీహబ్, ఐటీ రంగం అభివృద్ధికి దోహదపడింది. ఇక మిషన్ భగీరథ, గ్రామ జ్యోతి వంటి పథకాలను అమలు చేసిన కేటీఆర్ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు.

కేటీఆర్ రాజకీయంగానూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తనను తాను నిరూపించుకున్నాడు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ సొంతంగా 99 సీట్లు గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించారు.2018 అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా 55 అసెంబ్లీ స్థానాల్లో ప్రచారం చేసి టీఆర్ఎస్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యాక జరిగిన  జరిగిన పంచాయతీ ఎన్నికల్లో, హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లోనూ పార్టీని విజయతీరాలకు చేర్చారు.  పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఆశించిన విజయాలను సొంతం చేసుకోలేకపోయారు.ఇక పార్టీ సభ్యత్వాన్ని 60 లక్షలు దాటించి, బూత్, గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటుకు చొరవ తీసుకున్నారు. ఇక త్వరలోనే 22 జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణాలను చేపట్టారు.

కేటీఆర్.. గడిచిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖమంత్రిగా ఎన్నో సంస్కరణలు అమలు చేసి ఎంతో పేరు సంపాదించారు. చాలా స్టిక్ట్ గా వాటిని ఆచరణలో పెట్టి ప్రజల మనసు చూరగొన్నారు. కేటీఆర్ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా జాతీయంగా.. అంతర్జాతీయంగా తనదైన ముద్రవేసి ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. అంతర్జాతీయ సదస్సుల్లో అనర్గళంగా మాట్లాడి శభాష్ అనిపించుకున్నారు. తెలంగాణకు మరింత గుర్తింపు దక్కేందుకు చొరవ చూపారు. ఐటీ మున్సిపల్, పరిశ్రమలు శాఖల్లో సంస్కరణలకు పెద్దపీట వేశారు. ఎన్నో పెట్టుబడులను తెలంగాణకు రప్పించారు. గూగుల్, ఫేస్ బుక్, అమేజాన్, వాల్ మార్ట్ వంటి దిగ్గజ సంస్థలను హైదరాబాద్ రప్పించారు. దేశవిదేశాల్లో ‘బ్రాండ్ హైదరాబాద్’ ను ప్రమోట్ చేశారు.


ఇక సోషల్ మీడియాలోనూ కేటీఆర్ చురుకైన పాత్ర పోషిస్తూ ఎవ్వరూ ఆపదలో ఉన్నామని ట్వీట్ చేసినా ఆదుకుంటున్నారు.  ఎంత ఖర్చు అయనా సరే భరిస్తూ వారికి చికిత్సనందిస్తూ గొప్ప మనసును చాటుకుంటున్నారు. మంత్రిగా కేటీఆర్ ఆరేళ్ల ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు సాధించారు.

 ప్రభుత్వంలోనూ కేటీఆర్ కీలకంగా ఎదిగారు.  టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా  ఎన్నో విజయాలను అందుకున్నారు. సవాళ్లను స్వీకరించారు. ఒక్క పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రమే 16 సీట్లను గెలుచుకుంటానని చెప్పి తొమ్మిదికే పరిమితం చేశారు. ఆ ఒక్క అపజయం తప్పితే ఏడాదిలో కేటీఆర్ విజయాల శాతం 90శాతంపైనే ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.

-నరేశ్ ఎన్నం

అమ్మకానికి అమరావతి భూములు..!

Amaravathi-lands

Amaravathi-lands

బిల్డ్ ఏపీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భూములు విక్రయించాలని నిర్ణయించడం సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.  రాష్ట్రంలో విశాఖ, గుంటూరు, ఇతర ముఖ్యనగరాల్లోని విలువైన 200 ఎకరాలపైగా భూములను విక్రయించేందుకు గతంలో టెండర్లు పిలిచింది. ప్రతిపక్షాల నిరసనలతో కొన్ని చోట్ల భూములు విక్రయించే విషయంలో వెనక్కి తగ్గింది. గుంటూరులో జిఎంసి చెందిన నాయుడు మార్కెట్ స్థలాన్ని విక్రయించడంపై జనసేన పోరాటంతో జాబితా నుంచి ఆ స్థలాన్ని తప్పించింది. అప్పడే మొత్తం 2 వేల ఎకరాలను ప్రభుత్వం విక్రయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వార్తలు వచ్చాయి. ప్రసుతం హైకోర్టుకు బిల్డ్ ఏపీ మిషన్ డైరెక్టర్ ప్రవీణ్ సమర్పించిన వివరాలను పరిశీలిస్తే రాజధాని అమరావతిలో పెద్ద ఎత్తున భూములు విక్రయించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.

రాజధాని అమరావతిలో గత ప్రభుత్వం హయాంలో సింగపూర్ కన్సార్టియంతో ఒప్పందం చేసుకుని అభివృద్ధి చేసేందుకు 1,600 ఎకరాలను కేటాయించారు. పనులు ప్రారంభమయ్యే సమయంలో ఎన్నికలు జరగడం రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడటం  జరిగింది. జగన్ ప్రభుత్వం ఈ కస్పార్టియంను రద్దు చేసుకుని, కేటాయించిన భూమిని వెనక్కి తీసుకుంది. అనంతరం ఆ 1,600 ఎకరాల భూమిని విక్రయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి నాయకత్వం వహిస్తున్న ఉన్నత స్ధాయి కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది.

రాష్ట్ర ప్రభుత్వం కార్యనిర్వాహక రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో అమరావతిని శాసన రాజధానిగా ప్రకటించింది. ప్రస్తుతం ఇక్కడ తాత్కాలిక అసెంబ్లీ ఉంది. శాశ్వత భవనం నిర్మించినా 50 ఎకరాల ఉంటే చాలు. దీంతో రాజధాని కోసం గత ప్రభుత్వం సమీకరించిన భూములను విక్రయించడంతో నిధులు సమీకరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావించి ఈ నిర్ణయానికి వచ్చింది.

రాజధాని అమరావతిలో ఇంత పెద్ద మొత్తంలో భూములను అమ్మలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేయడంపై రాజధాని ప్రాంత రైతులు, అక్కడి ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైతులు రాజధాని నిర్మాణం కోసం త్యాగం చేసిన భూములను జగన్ ప్రభుత్వం విక్రయించాలను కోవడం దారుణమంటున్నారు. ఇటువంటి చర్యలను మానుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రభుత్వ భూముల విషయంలో జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం సరైంది కాదని ఆర్ధిక రంగ నిపుణులు వెల్లడిస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా విజయవాడలోని పి.డబ్ల్యూ.డి గ్రౌండ్ అభివృద్ధి చేసేందుకు విదేశీ సంస్థతో ఒప్పందాలు చేసుకుంటే వైసీపీ వ్యతిరేకించింది. ప్రవేటు సంస్థల  భాగస్వామ్యంతో  ప్రభుత్వ భూమిని అభివృద్ధి చేసే విషయంలో వ్యతిరేకించిన వైసీపీ ఇప్పుడు నేరుగా వేలాది ఎకరాలను విక్రయించేందుకు ముందుకెళ్ళడం ప్రజలకు విస్మయాన్ని కలిగిస్తుంది. ఇటువంటి సంస్కృతి ఏ రాష్ట్రంలోనూ చూసిన దాఖలాలు లేవనే వాధనలు వినిపిస్తున్నాయి.

నేపాల్ లో చైనా జోక్యాన్ని కమ్యూనిస్టులు ఖండించరా?

నేపాల్ లో జరుగుతున్న పరిణామాలు ప్రపంచానికి కనువిప్పు కలిగిస్తున్నాయి. ఒకనాడు అమెరికా గూడచారి సంస్థ సి ఐ ఎ ఇతరదేశాల ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుందని ఇది నయా వలసవాద విధానం లో భాగమని చదువుకున్నాం. చదువుకోవటమే కాదు ఈ విధానానికి వ్యతిరేకంగా నిరసనలు కూడా చేసేవాళ్ళం. అమెరికా నయావలసవాద దోపిడీ పై దేశ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మేధావులు, ముఖ్యంగా వామపక్ష మేధావులు నిరంతరం ప్రచారం చేసేవారు. అదే ఒరవడి ఇప్పటికీ కొనసాగుతూనే ఉందనుకోండి. అది ఎక్కడదాకా వెళ్లిందంటే చైనా మన భూభాగం పైకి వచ్చి మన జాతీయ భద్రతకు ప్రమాదం గా మారినా మనం మాత్రం మన అవసరాల కోసం అత్యాధునిక ఆయుధాలు అమెరికా నుంచి కొనుగోలుచేస్తే తప్పుపట్టేదాకా. అదేసమయంలో ఆ ఆయుధాలు లేకుండా చైనా కు దీటుగా ఎలా ధైర్యంగా నిలబడగలమో చెప్పరు. అసలు చైనా దురాక్రమణను ఖండించటానికే  నోరురానప్పుడు అంతకన్నా ఎక్కువ ఆశించలేమనుకోండి. సరే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం.

ఈరోజు నేపాల్ లో జరుగుతున్నదేమిటి? ఒకనాడు సి ఐ ఎ చేసిన పనే ప్రత్యక్షంగా చైనా కమ్యూనిస్టు పార్టీ చేస్తుంది. అదేమంటే సోదర కమ్యూనిస్టు పార్టీ కాబట్టి సంప్రదింపులు జరుపుతున్నామని చెబుతుంది. మరి సంప్రదింపులు జరుపుతున్న దెవరు? కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధులు కాదుగదా. చైనా రాయబారి నేపాల్ కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకులతో సంప్రదింపులు జరిపి నేపాల్ ప్రధానమంత్రి ఓలి ని కొనసాగించాలని ఒత్తిడి తెచ్చింది. ఇంతకన్నా ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం ఇంకేముంటుంది? అసలు అక్కడ ఏం జరుగుతుంది. గత ఎన్నికలముందు నేపాల్ కమ్యూనిస్టుపార్టీ, నేపాల్ మావోయిస్టు పార్టీలు విలీనం అయ్యాయి. అప్పుడు ఒప్పందం షరతుల్లో ఒకవేళ పార్టీ అధికారం లోకి వస్తే మొదటి రెండున్నర సంవత్సరాలు పాత కమ్యూనిస్టు పార్టీ నాయకుడు ప్రధాన మంత్రిగా మిగతా రెండున్నర సంవత్సరాలు గత మావోయిస్టు పార్టీ నాయకుడు ప్రచండ ప్రధానమంత్రిగా వుండాలని నిర్ణయించుకున్నారు. దాని ప్రకారమే ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలి ప్రధాన మంత్రి పదవి చేపట్టాడు. ఒప్పందం ప్రకారం ఈ జూలై లో తను తప్పుకొని ప్రచండ కు ప్రధానమంత్రి పదవి అప్పచెప్పాలి. కానీ ప్రధాన మంత్రి ఓలి పదవినుంచి తప్పుకోవటానికి ఇష్టపడటం లేదు. దానితోపాటు తన పాత పార్టీ లోని సీనియర్ నాయకులు కూడా ఓలి పై తీవ్ర అసంతృప్తి లో వున్నారు. కారణం తన హయాం లో పరిపాలన అస్తవ్యస్తంగా తయారుకావటమే. దానికి తోడు తీవ్ర అవినీతి ఆరోపణలు కూడా రావటం. అందుకనే ప్రచండతో పాటు తన పాత పార్టీ సహచరులు కూడా ఒప్పందం ప్రకారం ఓలి తప్పుకోవాలని కోరారు.

పదవి కోసం భారత్ వ్యతిరేక ప్రచారం 

ఓలి కి ఎలాగైనా పదవిలో కొనసాగాలని వుంది. అందుకని తెలివిగా తన పదవిని నిలబెట్టుకోవటం కోసం పడరాని పాట్లు పడుతున్నాడు. ఒప్పందాన్ని తుంగలో తొక్కాడు. కమ్యూనిస్టు పార్టీ స్టాండింగ్ కమిటీ లో తను పూర్తిగా మైనారిటీలో పడ్డాడు. అయినా పదవిలో కొనసాగటానికి భారత వ్యతిరేక ప్రచారానికి తెర తీసాడు. భారత్ తో అపరిష్కృతంగా వున్న సరిహద్దు సమస్యను ముందుకు తెచ్చాడు. సంప్రదింపులకు బదులు ఏకంగా ఆ భూభాగం తనదేనని మ్యాపులను తయారు చేసి పార్లమెంటులో తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. తన ఎత్తుగడ ఏమిటంటే పార్టీలో ఈ దుందుడుకు వాదాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తే భారత అనుకూలురుగా ముద్రవేసి దేశ ప్రయోజనాల రీత్యా తను పదవిలో వుండటం అవసరమని చెప్పాలనుకున్నాడు. అయితే రాజకీయాల్లో అందరూ ఉద్దండులే  కదా. ఆ పాచిక పారకుండా ఏకగ్రీవంగా పార్లమెంటులో తీర్మానాన్ని ఆమోదించటంతో ఏమి చేయాలో దిక్కు తోచలేదు. చివరకు చైనా రాయబారిని కలిసి మొరపెట్టుకున్నాడు. అప్పటికే ఆవిడ నేపాల్ ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూనే వుంది. ప్రోటోకాల్ తో సంబంధం లేకుండా ఆవిడ ఎప్పుడైనా ఎవరినైనా కలుసుకోగలదు, ఎక్కడికైనా వెళ్ళగలదు. ఓలి హయాంలో ఆవిడ సూపర్ ప్రధాన మంత్రిగా వుందని నేపాలి పత్రికలే కోడై కూస్తున్నాయి. చివరకు  ఆవిడ ప్రత్యక్షంగా కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకులందరిని వ్యక్తిగతంగా కలిసి ఓలి ని ప్రధాన మంత్రిగా కొనసాగించాలని కోరింది. మొదట్లో ప్రచండ కలవటానికి తటపటాయించినా చివరకు కలవటం జరిగింది. ఈ విషయమే ఆవిడతో పత్రికా విలేఖరులు ప్రస్తావిస్తే దానిలో తప్పేముంది మా సోదర పార్టీ లో సఖ్యత కోసం మా ప్రయత్నాలు మేము చేస్తామని సమాధానమిచ్చింది. ఇక్కడ ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. ఆవిడ చైనా ప్రభుత్వ రాయబారి. చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధి కాదు. అంత మొహమాటం లేకుండా నిసిగ్గుగా వేరే దేశపు అంతరంగిక వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం చేసుకోవటం ఏవిధంగా చూసినా గర్హనీయం. అదీ మన పొరుగుదేశం లో, మనతో సరిహద్దు ఆంక్షలు లేని దేశంలో. భారత్ వ్యతిరేక కార్యకలాపాలు జరగాలంటే ఓలి ప్రధానమంత్రిగా కొనసాగటం అవసరమని చైనా ప్రత్యక్షంగా జోక్యం చేసుకొని కమ్యూనిస్టు పార్టీ నాయకులపై ఒత్తిడి తెచ్చి ఓలి ని తాత్కాలికంగా రక్షించిన సంగతి ప్రపంచమంతా చూసింది. ఈ చర్యలు అంతకుముందు సి ఐ ఎ చేసిన కార్యకలాపాలతో సమానమే కదా. అటువంటప్పుడు దీన్ని ఎందుకు ఇక్కడ ‘నయా వలసవాద వ్యతిరేక చాంపియన్లు’ ఖండించరు?

నేపాల్ లో జరిగింది భారత్ లో జరగదని గ్యారంటీ ఏమిటి?

కమ్యూనిస్టులపై మిగతా పార్టీలు ఆరోపణలు చేస్తుంటే అదంతా కావాలని పనిగట్టుకొని వాళ్ళపై కక్ష తో చేస్తున్నారని అందరం అనుకునే వాళ్ళం. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిస్టు నాయకులు నిస్వార్ధంగా పనిచేసి పేద ప్రజలకోసం పనిచేసేవారు. కాబట్టి వాళ్ళు ఏమి చెప్పినా వాళ్ళమీద విశ్వాసం తో నమ్మేవాళ్ళ సంఖ్య గణనీయంగా వుండేది. సిద్ధాంతపరమైన లోతైన అవగాహన మేధావులకే పరిమితంగా వుండేది. అదీగాక కొత్తగా స్వాతంత్రం పొందిన దేశంలో పొరుగున వున్న చైనావిప్లవం పై, రష్యా లో వచ్చిన అక్టోబర్ విప్లవంపై విపరీతమైన క్రేజ్ వుండేది. అక్కడ మానవ హక్కుల ఉల్లంఘనలపై ఎవరైనా చెప్పినా ఇదంతా ప్రాశ్చాత్య ప్రచారం గా కొట్టిపారేసే వాళ్ళం. కానీ ఈ అధునాతన సమాచార యుగం లో దాచేస్తే ఏదీ దాగదు. మానవహక్కుల ఉల్లంఘనలపై పత్యేకంగా మాట్లాడుకుందాం. ప్రస్తుతం మన పొరుగు దేశంలో కమ్యూనిస్టులు అధికారం లోకి వస్తే దేశ ప్రయోజనాలు ఎలా ఒత్తిడికి లోనవుతున్నాయోననే అంశంకి పరిమితమవుదాం. తన పదవిని కాపాడుకోవటం కోసం రోజు రోజు ఏ విధంగా భారత్ వ్యతిరేక ప్రచారానికి ఒడిగడుతున్నాడో చూస్తున్నాం. కరోనా మహమ్మారికి చైనా కారణం కాదని భారత్ దే భాద్యతంతా నని ప్రచారం చేయటం మొదలుకొని రాముడు అసలు అయోధ్యలో పుట్టలేదని నేపాల్ లో పుట్టాడనే దాకా వెళ్ళింది ఈ ప్రచారం. ఇక్కడ మనందరం ఆలోచించాల్సింది ఒక్కటే. ఈరోజు నేపాల్ లో జరిగింది భారత్ లో జరగదని గ్యారంటీ ఏమిటి? అదృష్టవశాత్తు భారత్ లో కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చే అవకాశాలు ఒక్క శాతం కూడా లేవు( రావాలని కోరుకున్న వాళ్ళలో ఈ రచయిత కూడా ఒకరు ). లేకపోతే ఇక్కడ కూడా నేపాల్ లో లాగా భారత్ లో సోదర కమ్యూనిస్టు పార్టీ పేరుతో మన ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకొని వుండే వాళ్ళే కదా! కాదని ఎలా చెప్పగలం. నేపాల్ లో జరిగిన పరిణామాల్ని ఇక్కడ కమ్యూనిస్టులు ఖండించనప్పుడు వీళ్ళ నిజాయితీ పై నీలి నీడలు కమ్ముకోవటం సహజమే కదా. సి ఐ ఎ చేసినా , చైనా కమ్యూనిస్టు పార్టీ చేసినా తప్పు తప్పే కదా. సి ఐ ఎ చేస్తే తప్పు చైనా కమ్యూనిస్టు పార్టీ చేస్తే ఒప్పు అవ్వదు కదా. ఇప్పటికైనా కమ్యూనిస్టు పార్టీ లో నిజాయితీగా పనిచేస్తున్న ఎంతోమంది క్యాడర్ పునరాలాచించు కోవలసిన అవసరం వుంది. ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమం పేరుతో దేశ ప్రయోజనాలకి విఘాతం కలిగించే బదులు మన దేశ కమ్యూనిస్టులు, సోషలిస్టులు ఏకమై దేశీయ ప్రజాస్వామ్య సోషలిస్టు పార్టీగా అవతరించాల్సిన అవసరం ఎంతయినా వుంది. పొరుగు దేశ పరిణామాలు చూసిన తర్వాత నయినా ఆత్మ పరిశీలన చేసుకుంటారని ఆశిద్దాం.

ట్రాక్ తప్పిన చైతు.. గైడ్ చేయనున్న నాగ్ !

Naga Chaitanya

Naga Chaitanya

మనం కాంబినేషన్ లో సినిమా రాబోతోంది. అయితే నాగ్ అండ్ చైతు మాత్రమే సినిమాలో ఉంటారు. పైగా నాగ్ ది జస్ట్ గెస్ట్ రోల్ మాత్రమే. ట్రాక్ తప్పిన చైతు పాత్రను గైడ్ చేస్తూ.. ఆ పాత్రను విజయతీరాలకు చేర్చే లెక్చరర్ పాత్రలో నాగ్ కనిపించబోతున్నాడు. కాస్త డిఫరెంట్ కాన్సెప్ట్ లతో పాటు మంచి క్రియేటివిటీ ప్లేతో సినిమాలు చేసే డైరెక్టర్ విక్రమ్ కె కుమార్. మరి ల‌వ‌ర్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరో నాగ‌చైత‌న్యతో ఓ రొమాంటిక్ క్రైమ్ డ్రామాను తెర‌కెక్కించబోతున్నాడని.. సినిమాలో కాస్త బోల్డ్ కంటెంట్ కూడా ఉండబోతుందని తెలుస్తోంది. నిజానికి విక్రమ్ కుమార్ చైతుతో ఒక స్పోర్ట్స్ డ్రామాను తీయాలనుకున్నాడు. కానీ నాగ్ సలహాతో మంచి రొమాంటిక్ ఎంటర్ టైనర్ చేయాలని ఫైనల్ గా ఫిక్స్ అయ్యాడు.

Also Read: బాలయ్యకు ఇప్పుడు ఒక హీరో కావాలి..!

అన్నట్టు విక్రమ్ తన సొంత క‌థ‌లుతోనే సినిమాలు చేస్తాడు. కానీ ఈ సారి నాగ్ కి నచ్చిన వేరే వాళ్ళ కథను చేయబోతున్నాడు. ఈ మధ్య హిట్ లేని రైటర్ వక్కంతం వంశీ, ఎప్పుడో ఆ మధ్య అనగా దిల్ రాజు జ‌మానాలో రెడీ చేసిన స్క్రిప్ట్‌ ను విక్రమ్ తీసుకుని త‌న స్ట‌యిల్‌లో మార్పులు చేసుకుంటున్నాడని, ఈ కథ నాగ్ కి బాగా నచ్చిందని.. అందుకే విక్రమ్ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ స్క్రిప్ట్ కే కట్టుబడి ఉన్నాడని తెలుస్తోంది. అయితే ఈ సినిమా పై ఇప్పటికే అనేక రూమర్స్ వచ్చాయి. వాటిలో ఎలాంటి వాస్తవం లేదు. చైతు – విక్రమ్ సినిమా రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో రాబోతోంది. లాక్ డౌన్ ముగిసిన వెంటనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధం అవుతోంది.

Also Read: విజయ్ బిజినెస్ స్పీడ్ ఏ హీరోకి లేకపాయే !

కాగా రామోజీ ఫిల్మ్ సిటీలో ఇప్పటికే షూట్ కు అవసరమైన సెట్స్ ను కూడా నిర్మించడానికి చిత్రబృందం సన్నాహాలు చేసుకుంటూ.. పనులను కూడా మొదలుపెట్టింది. మరి చైతుకి విక్రమ్ ఈ సారి ఎలాంటి హిట్ ని ఇస్తాడో.. అక్కినేని ఫ్యామిలీకి ‘మనం’ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని ఇచ్చి.. అక్కినేని ఫ్యామిలీ మెంబర్లకు ఆప్తుడు అయిపోయిన విక్రమ్, అఖిల్ కు మాత్రం ‘హలో’ అంటూ హిట్ ఇవ్వలేకపోయాడు. మరి చైతుకన్నా హిట్ ఇవ్వాలని ఆశిద్దాం.

వ్యాక్సిన్ మార్కెట్లోకి రాకముందే నో స్టాక్..!

Corona Vaccine

Corona Vaccine

కరోనా.. కరోనా.. కరోనా.. ఇప్పుడెక్కడ చూసినా ఇదే చర్చ. చైనాలోని వూహాన్లో సోకిన కరోనా ప్రపంచంలోని అన్నిదేశాలకు పాకింది. అగ్రదేశాలు సైతం కరోనా ధాటికి విలవిలాడిపోతున్నాయి. పేద, ధనిక, సామాన్యులు, సెలబ్రెటీలనే తేడా లేకుండా కరోనా బారినపడి మృతిచెందుతున్నారు. దీంతో ప్రజలంతా బెంబేలెత్తిపోతున్నారు. ఆయా దేశాలు లాక్డౌన్ పాటిస్తూ కొంతమేర కరోనా కట్టడి చేసున్నాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల్లో ప్రతీరోజు లక్షల్లో నమోదవుతుండటం శోచనీయంగా మారింది.

Also Read: రోగనిరోధక శక్తి వర్సెస్ కోవిద్

అగ్రరాజ్యం అమెరికా కరోనా కేసుల్లో తొలిస్థానంలో ఉండగా భారత్ రెండో ప్లేసు కోసం పోటీపడుతోంది. దేశంలో కరోనా కేసులు రోజుకు వేలల్లో నమోదువుతున్నాయి. మహరాష్ట్ర, గుజరాత్, చెన్నై, హైదరాబాద్, పుణే వంటి మెట్రోనగరాలతోపాటు పలు నగరాల్లో కరోనా కేసులు అత్యధికంగా నమోదువుతున్నారు. ఇటీవల కాలంలో పల్లెల్లోనూ కేసులు సంఖ్య భారీగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి చర్యలు చేపడుతున్నా కేసులు సంఖ్య మాత్రం తగ్గడం లేదు. దీంతో ప్రజలంతా కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తున్నారు.

కరోనా విషయంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాక్సిన్ సమాచారాన్ని తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. త్వరలోనే కరోనా వ్యాక్సిన్ వస్తుందని సైంటిస్టులు చెబుతుండటంతో ప్రజలు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కరోనాకు కొన్ని మందులు మార్కెట్లోకి వచ్చాయి. కరోనా చికిత్స కోసం అమెరికాకు చెందిన గిలాడ్ సైన్సెస్ అనే సంస్థ ‘రెమ్ డిసీవర్’ ఔషధాన్ని తయారు చేసింది. దీనిని ఇండియాలోని హెట్రో, జుబిలెంట్ లైఫ్ సైన్సెస్, సిప్లా, మిలన్ ఎన్వి ఫార్మా కంపెనీల ద్వారా మార్కెట్లో అందుబాటులో ఉంచేందుకు గెలాడ్ సంస్థ నిర్ణయించింది.

Also Read: కరోనా టెస్ట్ చేసినట్లు సర్టిఫికెట్ ఉంటేనే 108 వచ్చేది?

ఈ మందును కేవలం కరోనా లక్షణాలు ఉన్నవారికి మాత్రమే విక్రయిస్తున్నారు. మెడికల్ ప్రిస్క్రిప్షన్, వైద్యుల సూచన డాక్యుమెంట్ అప్లోడ్ చేసి ఆన్లైన్లో పేమెంట్స్ చేస్తే హెట్రో ఫార్మా హోం డెలివరీ చేస్తుంది. చాలామంది కరోనా పేషంట్లు ఆన్ లైన్లోనే ఈ ఔషధాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఎన్నిసార్లు ప్రయత్నించినా అవుటాఫ్ స్టాక్ అని చూపిస్తుందట. డిమాండ్ కు తగ్గ సప్లయ్ కాకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తున్నట్లు తెలుస్తోంది. దీంతో చాలామంది నిరాశ చెందుతోన్నారు.

పీవీ కూతురుకు ఎమ్మెల్సీ.. కేసీఆర్ వ్యూహం ఇదేనా?

Narasimha Rao's Daughter

Narasimha Rao's Daughter

కర్రవిరగకుండా పామును చంపే ఎత్తుగడలను కేసీఆర్ వేస్తుంటారు. ఎప్పుడూ ప్రతి అడుగులోనూ ప్రత్యర్థులను దెబ్బతీసే వ్యూహాలు కేసీఆర్ లో ఉంటాయి. ఇటీవల కాంగ్రెస్ మాజీ ప్రధాని అయిన పీవీ నరసింహారావును ఆ పార్టీ వ్యతిరేకి అయిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నెత్తిన బెట్టుకున్నాడు. ఏకంగా పీవీ శతజయంతిని ఏడాది పాటు చేయడానికి రెడీ అయ్యారు. తాజాగా కాంగ్రెస్ కు షాకిచ్చేలా మరో నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణలో త్వరలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాల్సి ఉంటుంది. దీంతో ఇప్పటినుంచే కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నట్టు తెలిసింది.

Also Read: కేసీఆర్‌లో దూకుడు తగ్గడానికి అదే కారణమా?

ఎమ్మెల్సీలు రాములు నాయక్, నర్సింహారెడ్డిలతోపాటు కర్నెప్రభాకర్ పదవీకాలం కూడా వచ్చే నెలతో పూర్తి కానుంది. ఈ క్రమంలోనే ఈ మూడు స్థానాలను భర్తీ చేయాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. ఇందులో నాయిని నర్సింహారెడ్డి, కర్నె ప్రభాకర్ ల పేర్లు ఖరారైనట్టు సమాచారం. ఇక మూడో స్థానానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూతురు వాణీదేవి దయాకర్ రావు పేరును ప్రతిపాదించనున్నారని విశ్వసనీయ సమాచారం.

మాజీ ప్రధాని పీవీ కూతురును కేసీఆర్ ప్రతిపాదించడం వెనుక కేసీఆర్ రాజకీయ వ్యూహం ఉందని అంటున్నారు. తెలంగాణలో ప్రతిపక్ష కాంగ్రెస్ ను ఏకాకిని చేసి దెబ్బతీయడమే పెద్ద ఎజెండా అని రాజకీయవర్గాల్లో చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ ఈ తెలుగు యోధుడు పీవీని చరిత్రలో చాలా అవమానించాయి. ఇప్పటికీ ఈయనను పట్టించుకోవడం లేదు. పీవీకి క్రెడిట్ దక్కకుండా కాంగ్రెస్ చేసింది. ఇప్పుడు రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ ను కేసీఆర్ ఈ చర్యతో ఇరుకునపెట్టడానికి రెడీ అవుతున్నాడని తెలిసింది..

పీవీ శతజయంతి ఉత్సవాల ద్వారా కాంగ్రెస్ పట్టించుకోని ఈ తెలంగాణ యోధుడిని కేసీఆర్ నెత్తిన పెట్టుకుంటున్నారు. సోనియా గాంధీ సహించని పీవీ జయంతిని తెలంగాణ పండుగలా కేసీఆర్ నిర్వహించడం ద్వారా కాంగ్రెస్ ను డిఫెన్స్ లోకి నెట్టేయబోతున్నారు. ప్రధాన ప్రతిపక్షం తమ పార్టీకే చెందిన పీవీ జయంతిని చేయలేని నిస్సహాయతలో ఉంది. చేస్తే సోనియా ఆగ్రహ జ్వాలలకు బలికావాల్సి ఉంటుంది.

Also Read: అక్కడ కాంగ్రెస్ అనాథ..!

సోనియాగాంధీ పీవీకి సరైన గౌరవం ఇవ్వలేదనే అసంతృప్తి పీవీ కుటుంబంలో ఉంది. ఇలాంటి పరిస్తితుల్లో పీవీ కుమార్తెకు టీఆర్ఎస్ తరుఫున ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం టీఆర్ఎస్ పార్టీకి బాగా కలిసి వస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు.

-ఎన్నం

రెండు బిల్లుల వివరాలు కోరిన పిఎంఒ ..!

AP govt over 3-capitals

AP govt over 3-capitals

రాష్ట్రంలో ప్రస్తుతం రెండు అంశాలు కీలకంగా ఉన్నాయి. అవి ఏంటంటే మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వం రూపొందించిన బిల్లులకు గవర్నర్ అనుమతి, రెండవది నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమిస్తారా అనేవి. మూడు రాజధానులకు అనుమతి లభిస్తే అమరావతి నుంచి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ను విశాఖ తరలించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. అమరావతినే రాజధానిగా ఉంచాలని కోరుతూ అక్కడి రైతులు 218 రోజులుగా నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అమరావతి రాజధానిగా కొనసాగించాలని ప్రధాన ప్రతిపక్షం టిడిపితో సహా అన్ని పార్టీలు కోరుతున్నాయి.

Also Read: బోగాపురం పరిసరాల్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్..!

కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రైతులు గతంలో బీజేపీ రాష్ట్ర నేతలను కోరారు. ఆ సమయంలో జాతీయ స్థాయి నాయకులు రాజధాని రాష్ట్రానికి సంబంధించిన అంశమని.. తాము జోక్యం చేసుకోమని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ వద్దకు పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులో చేరుకున్నాయి. న్యాయ సలహా కోసం ఆయన వాటిని న్యాయ శాఖకు పంపారు. తిరిగి మళ్లీ అవి గవర్నర్ వద్దకు చేరాయి. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఒ) బిల్లులకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని ఏపీ రాజ్ భవన్ అధికారులను ఆదేశించింది. దీంతో అధికారులు బిల్లులకు సంబంధించిన వివరాలను పిఎంఒ అధికారులకు అందించనున్నారు.

ఇన్నాళ్లు రాజధాని అంశం రాష్ట్రం పరిధిలోనే ఉంటుందని ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని బీజేపీ నాయకులు చెప్పినా… ఇప్పుడు పిఎంఒ అధికారులు పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల వివరాలు అందజేయాలని కోరడం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన ఎంపీలు ఈ విషయంలో చక్రం తిప్పి ఉండవచ్చా… అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అమరావతి విషయంలో కొన్ని హిందుత్వ సంస్థలు సానుకూలంగా ఉండటం, ప్రధాని కార్యాలయానికి టిడీపీ, బీజేపీ, నాయకులు, ఇతరులు పలువురు లేఖలు వెళ్లడంతో ఈ అంశంపై పిఎంఒ దృష్టి సారించినట్లుగా చెబుతున్నారు.

Also Read: నిమ్మగడ్డ విషయంలో ప్రభుత్వ వైఖరి మారదా?

మూడు రాజధాని విషయంలో పిఎంఒ జోక్యం చేసుకోవడంతో అమరావతి రైతుల్లో ఆశలు చిగురిస్తునాయి. ఎంతో కాలంగా నిరసనలు వ్యక్తం చేసినా ఏ ఫలితం లేకపోవడం, మరోవైపు విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా మార్చడానికి వైసీపీ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేయడంతో అమరావతి రైతులు, ఆ ప్రాంత వాసుల్లో నిరుత్సాహం నెలకొంది. మరోవైపు పాలనా వికేంధ్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై రాష్ట్రపతితో చర్చించిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు చిత్రపటానికి అమరావతిలో పాలాబిషేకం నిర్వహించారు. ప్రభుత్వ ధ్వంధ వైఖరిని రాష్ట్రపతికి వివరించి గవర్నర్ బిల్లులను ఆమోదించకుండా చూడాలని రాష్ట్రపతికి సూచించడంపై అక్కడి రైతులు, ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఇంత మంది నాయకులు ఉన్నా ఎవరూ రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లలేదని అక్కడివారు అంటున్నారు.

అక్కడ కాంగ్రెస్ అనాథ..!

Congress Party

Congress Party

ఒక సంవత్సరం క్రితం వరకు కాంగ్రెస్ లో వాళ్లు అతిపెద్ద నాయకులు.. కీరోల్ పోషించే కీలక పాత్రధారులు.. ఆ జిల్లా రాజకీయాలనే కాదు.. ఏకంగా రాష్ట్ర రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించారు. కానీ ఇప్పుడు ఆ జిల్లాలోనే ఉండడం లేదు.. కనీసం జిల్లా ప్రజలను పలకరించడం లేదు. హైదరాబాద్ కే పరిమితమై జిల్లాను వదిలేశారు.

నిజామాబాద్ కు చెందిన ఇద్దరు కాంగ్రెస్ దిగ్గజ నేతలు ఇప్పుడు దాదాపు ఆ జిల్లా రాజకీయాల నుంచి నిష్క్రమించారు. ఉమ్మడి నిజామాబాద్ వ్యవహారాల్లో ఎటువంటి ఆసక్తి చూపడం లేదు. వారే నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ.

Also Read: కాంగ్రెస్ కు షాకిచ్చిన పెద్దాయన..!

వైఎస్ఆర్ ప్రోద్బలంతో ఎన్ఆర్ఐగా.. ప్రముఖ లాయర్ గా ఉన్న మధుయాష్కీ గౌడ్ నిజామాబాద్ ఎంపీగా వరుసగా రెండు సార్లు పోటీచేసి గెలిచారు. కాంగ్రెస్ హయాంలో అధిష్టానంతో సన్నిహితంగా మెలుగుతూ జాతీయ స్థాయి నేతగా మారారు. 2014 ఎన్నికల్లో కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత చేతిలో ఓడిపోయాక మధుయాష్కీ కాస్త తగ్గాడు. ఇక 2019 ఎన్నికల్లో ఏకంగా నిజామాబాద్ ఎంపీగా బీజేపీ నేత ధర్మపురి అరవింద్ గెలవడం.. నిజామాబాద్ లో 3వ స్థానానికి పరిమితం కావడంతో మధుయాష్కీ ఇక నిజామాబాద్ పై ఆశలు వదిలేశాడు. అప్పటి నుంచి నిజామాబాద్ రాజకీయాలకు దూరంగా జరిగాడు. జిల్లా సందర్శనలు అస్సలే ఉండడం లేవు.

ఇక షబ్బీర్ అలీ కాంగ్రెస్ పీసీసీ రేసులో కూడా నిలిచినా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కామారెడ్డి ప్రజల మదిని మాత్రం దోచుకోవడం లేదు. ఎన్నిసార్లు పోటీచేసినా టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించలేకపోవడంతో ఇక నిజామాబాద్ జిల్లాకు వెళ్లడమే మానేశాడు.ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటూ రాజకీయాలను వదిలేసి తన వ్యాపారాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నాడని తెలిసింది.

Also Read: కేసీఆర్‌లో దూకుడు తగ్గడానికి అదే కారణమా?

ఇలా ఒకప్పుడు నిజామాబాద్ ను ఏలిన ఇద్దరు నేతలు ఇప్పుడు కాలక్రమేణ రాజకీయాల్లో కనుమరుగు కావడం నిజంగా విధి వైచిత్యమే.

బాలయ్యకు ఇప్పుడు ఒక హీరో కావాలి..!

Balakrishna Next Movie

Balakrishna Next Movie

బాలయ్య బాబు సినిమాలో బాలయ్య ఒక్కరే హైలైట్ అవుతారు.. ఇది ఆనవాయితీగా వస్తోన్న బాలయ్య సినిమాల వ్యవహారశైలి కూడా. కానీ, బాలయ్యకు ఇప్పుడు ఒక హీరో కావాలి. తన అసిస్టెంట్ పాత్రకి. ముందుగా నవీన్ పొలిశెట్టిని తీసుకుందామనుకున్నా.. ఇంకా బెటర్ అప్షన్ అయితే బాగుంటుందని మేకర్స్ ఫీల్ అవుతున్నారు. జస్ట్ గెస్ట్ రోల్ లాగా ప్లాష్ బ్యాక్ లో వచ్చే ఆ అసిస్టెంట్ రోల్ కాస్త మొదట ఫన్నీగా సాగిన చివర్లో ఎమోషనల్ గా ముగుస్తుందట. పైగా ఆ పాత్ర చుట్టే సినిమా సాగుతుంది.. బాలయ్య పాత్ర తాలూకు యాక్టివిటీస్ అన్ని ఆ పాత్ర కోసమే ఆధారపడి ఉంటాయట. అందుకే కొంచెం ఫామ్ లో ఉన్న హీరో అయితేనే సినిమా నిలబడుతుంది. మరి ఫామ్ లో ఉన్న ఎవరేజ్ హీరోలు అంటే.. నాని, విజయ్ దేవరకొండ, నిఖిల్, శర్వానంద్ లాంటి హీరోలు ఉన్నారు. మరి వీరిలో బాలయ్య సినిమాలో అసిస్టెంట్ పాత్ర చేయడానికి ఎవరు ముందుకు వస్తారన్నదే ఇప్పుడు మరో ప్రశ్న.

Also Read: జపాన్ లో నెం.1 హీరో.. మన తెలుగు స్టారే !

మాస్ డైరెక్టర్ గా బోయపాటి శ్రీనుకు ఉన్న బ్రాండ్ కోసమైనా ఎవరో ఒకరు ఒప్పుకుంటారనే హోప్ ఉంది నిర్మాతలకు. కానీ నాని, లేదా శర్వానంద్ అయితే బాగుంటుందని బోయపాటి ఫీల్ అవుతున్నారు. నాని చెయ్యను అంటే, శర్వానంద్ దగ్గరకు వెళ్తుంది. శర్వా కూడా నో అంటే.. నిఖిల్ ను ఫిక్స్ చేస్తారట. నిఖిల్ చేయడానికి ఆసక్తి చూపొచ్చు. ఎంతలేదన్నా బాలయ్య ఒకప్పటి టాప్ స్టార్ హీరో. అలాంటి హీరో సినిమాలో సెకెండ్ లీడ్ చేయడానికి వెనుకడుగు వేయక్కర్లేదు. కానీ నాని మాత్రం, బాలయ్య సినిమాలో చేయడానికి ఇంట్రస్ట్ గా లేడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. మరి శర్వానంద్ అన్నా ఒప్పుకుంటాడేమో చూడాలి.

Also Read: వెబ్‌ బాటలో సుక్కూ.. మరి ‘పుష్ప’ పరిస్థితేంటి?

ఇక ఈ సినిమా టీజర్ లో బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్ అండ్ దుమ్ము రేపే యాక్షన్ తో అభిమానులను బాగానే ఆకట్టుకున్నా.. ఎప్పటిలాగే అదే కొట్టుడు… అవే డైలాగ్ లు లాగా అనిపించాయి. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ సినిమాతో ఓ కొత్త హీరోయిన్ ను పరిచయం చేయబోతున్నామని బోయపాటి రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పినట్లుగానే ఓ మలయాళీ భామను హీరోయిన్ గా పరిచయం చేయబోతున్నారు. ఆమె ఇంతకు ముందు మలయాళీ సీరియల్ లో నటించిందట. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా.. మ్యూజిక్ సెన్సేషనల్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్లాప్ లతో బాధ పడుతున్న బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి, ఆ తర్వాత ‘లెజెండ్’తో మరో భారీ విజయాన్ని కూడా అందించాడు. మరి ఈ సారి కూడా ప్లాప్ ల్లో ఉన్న బాలయ్యకు సూపర్ హిట్ ఇస్తాడేమో చూడాలి.

విజయ్ బిజినెస్ స్పీడ్ ఏ హీరోకి లేకపాయే !

Vijay Devarakonda

 

Vijay Devarakonda

టాలెంట్ ఉన్నోడికి సపోర్ట్ అక్కర్లేదని ఈ జనరేషన్ లో నిరూపించిన హీరో విజయ్‌ దేవరకొండే. తన మొదటి సినిమాలో గుంపులో ఒకడిగా నటించాడు. అలాంటి వ్యక్తి అతి తక్కువ టైంలోనే సౌత్ క్రేజీ హీరోగా మారతాడంటే.. నమ్మశక్యం కానీ విషయం. అయితే విజయ్ సక్సెస్ అయ్యాడు. పైగా హీరోగా నటిస్తూనే అటు బిజినెస్ మేన్ గానూ రాణిస్తున్నాడు. హీరోల్లో నాగార్జున మంచి బిజినెస్ మెన్ అని పేరు ఉంది. నిజానికి నాగార్జున కూడా విజయ్ ముందు తక్కువే అని చెప్పాలి. ఎందుకంటే విజయ్ బిజినెస్ కి పెట్టుబడి విజయ్ దే. దానికి తోడు ఐడియా దగ్గర నుండి దాన్ని ముందుకు తీసుకుపోయే ప్లానింగ్ వరకూ అంతా విజయ్ దే. అయినప్పటికీ ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా తన బిజినెస్ ను చాల కూల్ గా హ్యాండిల్ చేస్తూ.. తన ఫ్యాషన్ బ్రాండ్ ‘‘రౌడీ వేర్’’ను జనంలోకి బాగానే తీసుకువెళ్లగలిగాడు.

Also Read: సూర్య ఫ్యాన్స్‌కు డబుల్‌ ట్రీట్‌..

ఇప్పుడు కొన్ని కొత్త బిజినెస్ లకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ లాక్ డౌన్ లో వచ్చిన ఖాళీ సమయాన్ని తన కొత్త బిజినెస్ ల పనులకు వాడుకుంటున్నాడు. ఇప్పటికే సినిమా నిర్మాణం మొదలుపెట్టిన విజయ్, కరోనా అనంతరం టీవీ నిర్మాణంలోకి కూడా ప్రవేశించబోతున్నాడు. అలాగే ఓ స్టోర్ ను పెట్టాలని చూస్తున్నాడు. ఏమైనా విజయ్ దేవరకొండ ఊపు చూస్తుంటే.. టాలీవుడ్ లో తన ముద్ర బలంగానే వేసేలా కనిపిస్తున్నాడు. మొత్తానికి తన యాట్యిటూడ్ తో యూత్ లో బలమైన క్రేజ్ ను తెచ్చుకున్న విజయ్ దేవరకొండ స్పీడ్ ప్రస్తుతం మరే హీరోకి లేదనే చెప్పాలి.

Also Read: ‘రైడ్‌’కు రెడీ అవుతున్న నాగార్జున!

అవును, ఫ్యాషన్ ప్రపంచానికే రౌడీ బ్రాండ్ తో స్టైయిల్ స్టెట్మెంట్ గా మారడం అంటే… ఆ క్రెడిట్ విజయ్ కే దక్కుతుంది. అయినా, సెలబ్రిటీగా తన ఇమేజ్ తో నడిపిస్తున్న తొలి బ్రాండ్.. రౌడీ బ్రాండ్ ఫుట్ వేరే. ఏమైనా తన స్టైయిల్ తో తన ప్యాషన్ అభిరుచితో రౌడీ బ్రాండ్ కి పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చిన ఘనత కూడా విజయ్ కే దక్కుతుంది. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ, పూరి దర్శకత్వంలో రానున్న పాన్ ఇండియా మూవీ ‘ఫైటర్’ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా సక్సెస్ అయితే.. విజయ్ రేంజ్ మరింతగా పెరిగిపోతుంది.

చిరును కలిసిన పూరి… సినిమా కోసమేనా?

Puri-Chiru

Puri-Chiru

రామ్‌ గోపాల్‌ వర్మ దగ్గర శిష్యరికం చేసిన దర్శకుల్లో పూరి జగన్నాథ్‌ ఒకడు. ఆర్జీవీ తాలూకు భావజాలం పూరిలో చాలా ఎక్కువే ఉంటుంది. రాము మాదిరిగా సెన్సేషనల్‌ డైరెక్టర్గా ఎదిగాడు పూరి. అతి తక్కువ కాలంలో టాప్‌ హీరోలందరితో సినిమాలు చేశాడు. దానికంటే చాలా మందిని స్టార్లను చేశాడని చెప్పొచ్చు. ఆర్జీవీ మాదిరిగానే చాన్నాళ్లు ఫెయిల్యూర్స్‌లో ఉన్నాడు. కానీ, తనదైన స్టయిల్లో బౌన్స్‌ బ్యాక్‌ అయ్యాడు. ఇస్మార్ట్‌ శంకర్తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఇప్పుడు విజయ్‌ దేవరకొండ హీరోగా ఓ పాన్‌ ఇండియా మూవీ తీస్తున్నాడు. జీవితంలో అనేక ఎత్తుపల్లాలు, సక్సెస్‌ ఫెయిల్యూర్స్‌ చూసిన పూరి కెరీర్లో ఓ లోటుంది. ఏకంగా బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ను డైరెక్ట్‌ చేసిన జగన్‌…

Also Read: విజయ్ బిజినెస్ స్పీడ్ ఏ హీరోకి లేకపాయే !

తన అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవితో మాత్రం కలిసి పని చేయలేకపోయాడు. చాలా ఏళ్ల నుంచి చిరుతో మూవీ చేయాలని అతను చేయని ప్రయత్నం లేదు. తను ఫుల్‌ ఫామ్‌లో ఉన్నప్పుడు కూడా రెండు మూడు సార్లు చిరుతో ప్రాజెక్ట్‌ ఓకే అయినట్టు వార్తలు వచ్చినా.. అవి పట్టాలెక్కలేకయాయి. జగన్‌ స్టామినా తెలిసిన చిరు.. తన రీఎంట్రీ, 150వ మూవీని అతనితో చేయాలని అనుకున్నాడు. కథ రెడీ చేయమని కూడా చెప్పాడు. దాంతో, ఉబ్బితబ్బిబ్బైన పూరి.. ముఠామేస్త్రీ లాంటి కథతో ‘ఆటో జానీ’ స్ర్కిప్టు వినిపించాడు. సెకండాఫ్‌లో కొన్ని మార్పులు చేయమంటే చేసి మళ్లీ వినిపించాడు.

కానీ, రీఎంట్రీ టైమ్‌లో ప్రయోగాలు ఎందుకని భావించిన చిరు.. సేఫ్‌సైడ్‌గా తమిళ హిట్‌ మూవీ ‘కత్తి’ని ఎంచుకున్నాడు. ఖైదీ నం.150గా రీమేక్ చేసి హిట్‌ ఖాతాలో వేసుకున్నాడు. అయితే, ఆటోజానీ ని రిజెక్ట్‌ చేసిన విషయాన్ని చిరు తనతో నేరుగా చెప్పలేని పూరి మీడియా ముందే వెల్లడించాడు. అయినా సరే తన అభిమాన హీరోతో సినిమా చేస్తానని స్పష్టం చేశాడు. ఈ క్రమంలో ఇస్మార్ట్‌ శంకర్తో బ్లాక్‌బస్టర్ కొట్టి తన సత్తా మరోసారి చాటుకున్న పూరికి మెగా కాంపౌండ్‌ నుంచి పిలుపొచ్చింది. కొరటాల శివ డైరెక్షన్‌లో చేస్తున్న ‘ఆచార్య’ షూటింగ్‌ కరోనా కారణంగా ఆగిపోవడంతో తన తదుపరి సినిమాలపై చిరు దృష్టి పెట్టాడు. ఈ క్రమంలో కథ రెడీ చేసుకొమ్మని పూరికి చెప్పాడట.

Also Read: నయనతార- ప్రభుదేవా సహజీవనంపై ప్రశ్నించలేదేం..

దాంతో, రీసెంట్‌గా పూరి… మెగాస్టార్ ఇంటికి వెళ్లినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కథ చెప్పేందుకే పూరి… చిరును కలిశాడని టాక్‌. అయితే, మరిన్ని మార్పులు చేసిన ఆటోజానీ కథనే పూరి మరోసారి వినిపించాడా? లేదా కొత్త కథ చెప్పాడా? అన్నది తేలాల్సి ఉంది. ఏదేమైనా చిరు, పూరి మీట్‌ అవడంతో ఇద్దరూ కలిసి పని చేయబోతున్నారని ఇండస్ట్రీ సర్కిల్స్‌లో చర్చ నడుస్తోంది. అదే జరిగితే ఓ క్రేజీ కాంబినేషన్‌ ఫ్యాన్స్‌ను అలరించడం పక్కా అనొచ్చు.

నువ్వొక హీరో.. నీకు మళ్ళీ అభిమానులూ.. !

Akash Puri

Akash Puri

స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి ఒక ట్వీట్ చేశాడు. కాకపోతే ఆ ట్వీట్ మరీ కామెడీగా ఉంది. ప్రియమైన అభిమానులందరికి అంటూ ఆకాష్ ఏదేదో రాసుకొచ్చాడు. అసలు ఇతనికి అభిమానులు ఎక్కడ ఉన్నారో అతనికే తెలియాలి. ఏదో తండ్రి సపోర్ట్ తో రెండు సినిమాల్లో నటిస్తే.. అభిమానులు పుట్టుకొస్తారా.. అసలు వీళ్లను హీరోలు ఆనడమే మనం చేస్తోన్న తప్పు ఏమో. ఇంతకీ ఈ బాబు, ఆయనగారి అభిమానులను ఏమి కోరాడు అంటే..బాబు పుట్టిన రోజు అట. దాంతో ఆయనగారి అభిమానులు ఎక్కడ తన పోస్టర్లకు పాలాభిషేకాలు, బ్యానర్లు కట్టి.. ఫ్యాన్స్ ఎక్కడ ఉపవాసాలు ఉంటారో అని బాబుకు తెగ దిగులు పుట్టింది.

Also Read: చిరును కలిసిన పూరి… సినిమా కోసమేనా?

సో.. తనకు పుట్టిన మిక్కిలి దిగులతో.. దయచేసి తన పుట్టినరోజును జరపకండి అంటూ ఫ్యాన్స్ కి ఆదేశాలు జారీచేశాడు. అసలు ఈ ఆకాష్ పూరి అంటేనే సగం మంది పల్లె ప్రేక్షకులకు తెలియదు. అయినా మనోడికి ఇంకా హీరో ట్యాగ్ కూడా రాలేదు. అయినప్పటికీ అభిమానులు ఉన్నట్లు మనోడు ఊహల్లో విహరిస్తూ కాలాన్ని నెట్టుకొస్తున్నాడేమో. ఈ కరోనా వైరస్ నేపథ్యంలో ఫ్యాన్స్ అంటూ ఇలాంటి విజ్ఞప్తి చేసే ముందు, ఆకాష్ తన తండ్రికి ఒక మాట చెప్పాల్సింది. ఏముంది ఇప్పుడు నెటిజన్లు మనోడిని ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. నా ఫ్యాన్స్ అని మనోడు పొరపాటున అన్నందుకు మరీ మోసేస్తున్నారు.

Also Read: విజయ్ బిజినెస్ స్పీడ్ ఏ హీరోకి లేకపాయే !

అన్నట్లు బాబు తాను పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు చెప్పి.. అధికారులు, పోలీసులు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, సామాజిక దూరం పాటించాలని.. అబ్బో ఏకంగా పోలీసులకే రూల్స్ గుర్తు చేశాడు. ఇంకా నయం డాక్టర్స్ కి వైరస్ గురించి స్పీచ్ లు ఇవ్వలేదు. ఇచ్చినా ఇస్తాడు… తానూ హీరోని అని అనుకుంటున్నాడు కదా.. హీరో ఏమైనా అనొచ్చు అని ఫీలింగ్ లో ఉన్నాడు. సినిమా ఇండస్ట్రీలో హీరో అని పిలిపించుకోవాలంటే.. ఇక నుండి ఒక కండిషన్ పెట్టాలి. మినిమమ్ మూడు హిట్స్ ఉన్న వారినే హీరో అని పిలవాలని. లేకపోతే ప్రతి ఒక్కడు ఇక ఆకాష్ పూరి లాగా అభిమానులకు పాలాభిషేకాలు వద్దు అని ట్వీట్ చేస్తారు.

https://twitter.com/ActorAkashPuri/status/1286238208615833601

కేసీఆర్‌లో దూకుడు తగ్గడానికి అదే కారణమా?

CMKCR

CMKCR

తెలంగాణలో కేసీఆర్ హవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉద్యమ నాయకుడిగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ దూకుడుగానే వ్యవహరించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ వ్యవహరించిన తీరు పలుసార్లు వివాదాస్పదంగా మారినా ఎన్నడూ తనలోని దూకుడును తగ్గించిన సందర్భాలు లేవనే చెప్పొచ్చు. ఇక సీఎం అయిన తర్వాత ప్రతిపక్షాలపై కేసీఆర్ తనదైన శైలిలో మాటలతుటాలను పేల్చుతూ కేసీఆర్ రూటే సెపరేట్ అన్నట్లుగా వ్యవహరించేవారు.

తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా కారు హవానే కొనసాగడంతో కేసీఆర్ మాటకు తిరుగులేకుండా పోయింది. కేసీఆర్ ధాటికి తట్టుకోలేక ప్రతిపక్షాలు తోకముడిచిన సందర్భాలున్నాయి. అయితే కరోనా ఎంట్రీ తర్వాత కేసీఆర్ కు పరిస్థితులు వ్యతిరేకంగా మారుతోన్నాయి. రాష్ట్రంలోకి కరోనా ఎంట్రీ ఇచ్చిన తొలినాళ్లో కేసీఆర్ నిత్యం మీడియా సమావేశాలు పెట్టి ప్రజలు అప్రమత్తం చేశారు. ప్రజారోగ్యం ఎన్ని కోట్లయినా ఖర్చుడుతామని భరోసా కల్పించారు. దేశంలో అందరికీ కంటే ముందు లాక్డౌన్ విధించారు. రేషన్ కార్డుదారులకు ఉచిత రేషన్, రూ.1500లను ముందుగా ప్రకటించింది కూడా కేసీఆరే. నిత్యం సమీక్షలు, ప్రెస్ మీట్లతో ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టించారు.

Read More: కేసీఆర్ ని విమర్శించే ధైర్యం బాబుకు లేదా..?

అయితే ఇప్పుడు కరోనా విషయంలో అలాంటి హడావుడి పెద్దగా కన్పించడం లేదు. నిజానికి ఆన్ లాక్ ముందువరకు కూడా తెలంగాణలో కరోనా కంట్రోల్లోనే ఉంది. హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో కేసులు నామమాత్రంగానే ఉంది. అయితే కరోనా నిబంధనల విషయంలో కేసీఆర్ ఉదాసీనంగా వ్యవహరించడం వల్లనే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కరోనా కేసులు సంఖ్య పెరిగాయనే వాదనలు విన్పిస్తున్నాయి. ప్రభుత్వం కరోనా కట్టడి చేయకపోగా కరోనాతో సహజీవనం అనే కొత్త పల్లవి పాడటంతో కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయాయి.

దీంతో జీహెచ్ఎంసీ పరిధిలో రోజుకు 2వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో దూరప్రాంతాల నుంచి హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తున్న వారంతా సొంతూళ్లకు వెళుతున్నారు. దీంతో వీరి నుంచి ఆయా జిల్లాలకు కరోనా వేగంగా వ్యాప్తిచెంది తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు సైతం కరోనా బారిన పడటంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. టీఆర్ఎస్ సర్కార్ కరోనా విషయంలో చేతులేత్తిసిందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ప్రభుత్వం కరోనా కట్టడికి చర్యలు చేపట్టకుండా సచివాలయం కూల్చివేత, హరితహారం వంటి పనులు చేపట్టడంపై విమర్శలు వెల్లువెత్తాయి.

Also Read: కాంగ్రెస్ కు షాకిచ్చిన పెద్దాయన..!

తెలంగాణలో కరోనా టెస్టులు తక్కువగా చేయడంపై హైకోర్టు కూడా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాలతో కరోనా టెస్టులు పెంచినప్పటికీ అప్పటికే రాష్ట్రంలో కరోనా పరిస్థితి చేయిదాటిపోయింది. కరోనాకు కేరాఫ్ గా అడ్రస్ భాగ్యనగరం మారిన సమయంలోనే సీఎం కేసీఆర్ హైదరాబాద్లో కన్పించడం పోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రగతి భవన్లో సిబ్బందికి కరోనా రావడంతో సీఎం కేసీఆర్ కూడా కరోనా సోకిందని ప్రచారం జరిగింది. దీంతో కేసీఆర్ ఎక్కడా? అంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున నెటిజన్లు నిలదీశారు. కొందరైతే ఏకంగా కేసీఆర్ కన్పించడం లేదంటూ హైకోర్టు పిటిషన్ కూడా దాఖలు చేశారు.

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ సీఎం కేసీఆర్ చేయాల్సిన స‌మీక్ష‌లను గ‌వ‌ర్న‌ర్ తమిళ సై చేశారు. దీంతో రాష్ట్రంలో ఏం జరుగుతుందా? అనే ప్రశ్నలు తలెత్తాయి. ఇటీవల సీఎం కేసీఆర్ మళ్లీ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు చేరుకొని పాలన పనులపై దృష్టిసారించారు. రోజువారీ సాధార‌ణ కార్య‌క్ర‌మాలతోపాటు కరోనాపై సమీక్షలు చేస్తున్నారు. అయితే కరోనాపై ఇంతముందు చూపిన దూకుడు మాత్రం ఆయనలో ఎక్కడ కన్పించకపోవడం గమనార్హం.