
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించే విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. ప్రభుత్వ వైఖరి చూసిన రాజకీయ విశ్లేషకులు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి నిమ్మగడ్డ వైఖరిపై మరోమారు విమర్శల వర్షం కురిపించారు. నిమ్మగడ్డకు కేసులు వేసేందుకు, అధిక పారితోషికం పుచ్చుకునే లాయర్లకు చెల్లించేందుకు రూ. కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. ఇతర పార్టీల నాయకులతో ప్రముఖ హోటళ్లలో ములాఖత్ గురించి ప్రస్తావించారు.
Also Read: టిడిపి నుంచి మరో వికెట్ డౌన్..!
హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ను కలిసిన నిమ్మగడ్డ తనను ఎన్నికల కమిషనర్ గా తిరిగి నియమించాలని ప్రభుత్వానికి సూచించాలని కోరుతూ వినతి ప్రతాన్ని సమర్పించారు. అదేవిధంగా ఈ అంశంలో చోటు చేసుకున్న పరిణామాలను ఆయనకు స్వయంగా వివరించారు. దీంతో గవర్నర్ నిమ్మగడ్డ విషయంలో హై కోర్టు ఆదేశాలను అమలు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ లేఖను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడం లేదు. చెప్పాలంటే టేక్ ఇట్ ఈజీ అంటూ పక్కన పెట్టేసినట్లుగా ఉంది.
నిమ్మగడ్డ హై కోర్టులో దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటీషన్ విచారణలో ఉండగా ఈ అంశంపై సుప్రీం కోర్టులో ప్రభుత్వం పిటీషన్ దాఖలు చేసిన విషయం విధితమే. ఈ పిటీషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉందని భావించినా అలా జరగలేదు. శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తుంది. శుక్రవారం సుప్రీం కోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకున్న అంనతరం నిమ్మగడ్డ విషయంలో ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఈ పిటీషన్ ను సుప్రీం కోర్టు విచారించినా అది కోర్టు దిక్కార పిటీషన్ పై మాత్రమే ఆదేశాలు ఉంటాయని, హై కోర్టు ఆదేశించినట్లుగా నిమ్మగడ్డను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా తిరిగి నియమించాలనే తీర్పుపై ఎటువంటి ప్రభావం ఉందని సీనియర్ న్యాయవాదులు అంటున్నారు.
Also Read: మంత్రులకు రోజా స్ట్రాంగ్ వార్నింగ్..!
కేసుల పేరుతో నిమ్మగడ్డను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించుకుండా తాత్సారం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిసుందనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోపైపు హై కోర్టు ధర్మాసనం నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తిగిరి నియమించకపోవడాన్ని తీవ్రంగానే పరిగణిస్తుంది. గత శుక్రవారం విచారణలో వారం రోజులు గడువు ఇస్తున్నామని ఇలోగా ఈ విషయాన్ని తేల్చాలని విచారణలో ప్రభుత్వ న్యాయవాదులకు స్పష్టం చేసింది. హై కోర్టు తదుపరి విచారణలో ఎటువంటి ఆదేశాలు ఇస్తుందనేది ఆసక్తిగా మారింది.




























సుశాంత్ సింగ్ రాజ్ పుట్ మరణంతో బాలీవుడ్ మరొక్కసారి తెరపైకి వచ్చింది. కంగనా రౌత్ రిపబ్లిక్ టీవీ కి ఇచ్చిన ఇంటర్వ్యూ బాలీవుడ్ ని ఒక కుదుపు కుదిపింది. చివరకు భారత ప్రభుత్వం కూడా దీనిపై స్పందించాల్సి వచ్చింది. బాలీవుడ్ సెలబ్రిటీలు పాకిస్తాన్ గూడచారి సంస్థ ఐఎస్ ఐ తో , అలాగే కాశ్మీర్ ప్రత్యెక వాదులు, మిలిటెంట్ల తో సంబంధాలు వున్న వాళ్ళతో దూరంగా వుండాలని హెచ్చరించింది. ఇది చాలా తీవ్రమైన విషయం. మొదట్నుంచీ బాలీవుడ్ తో మాఫియా ముఠాల సంబంధాలు తెలిసిన విషయమే. ఇది ఈ రోజుది కాదు. పేరుమోసిన దావూద్ ఇబ్రహీం లాంటి వాళ్ళ దగ్గరనుంచి చిన్న చిన్న చోట మోటా ముఠాల వరకు బాలీవుడ్ పరిశ్రమ తో సంబంధాలు వున్నాయి. అయినా ప్రభుత్వం ఏమీ చేయలేక పోతుంది. ప్రభుత్వం ఏమాత్రం జోక్యం చేసుకున్నా వెంటనే అది పెను దుమారం గా మారుతుందని అందరూ భయపడి దాని జోలికి వెళ్ళటం లేదు. మొట్టమొదటసారి మోడీ ప్రభుత్వం శివ సేన ఎంపి రాసిన లేఖపై స్పందిస్తూ ఈ దేశ వ్యతిరేక శక్తులతో సెలబ్రిటీలు దూరంగా వుండాలని చెప్పింది. ఇదేమీ చిన్న విషయం కాదు.

నయనతార- ప్రభుదేవా సహజీవనంపై ప్రశ్నించలేదేం..
ప్రముఖ నటుడు విజయ్ కుమార్ కుమార్తె పెద్ద కూతురు.. నటి వనితా విజయ్ కుమార్ ఈ మధ్య తరచూ వార్తల్లో నానుతోంది. ఇటీవలే ఆమె మూడో పెళ్లి చేసుకుంది. ప్రేమించిన పీటర్ పాల్‌ను తన పిల్లల సమక్షంలోనే పెళ్లాడింది. దాంతో, ఆమెపై పలువురు తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఏజ్‌లో మూడో పెళ్లి ఏంటి? అంటూ లక్ష్మీ రామకృష్ణన్, కస్తూరి వంటి సినీ ప్రముఖులు కూడా వనితపై దుమ్మెత్తిపోశారు. సోషల్ మీడియాలో తనపై ఘాటు వ్యాఖ్యలు, ట్రోలింగ్ ఎక్కువ కావడంతో ఆమె పోలీసులను కూడా ఆశ్రయించాల్సి వచ్చింది. అదే సమయంలో సోషల్ మీడియా వేదికగా విమర్శకులకు గట్టిగానే కౌంటర్లు ఇస్తోంది వనిత.
అంతవరకు బాగానే ఉన్నా తన పెళ్లి వ్యవహారంలోకి నయనతారను కూడా లాగిందామె. సౌత్‌లో లేడీ అమితాబ్‌గా పేరు తెచ్చుకున్న నయన్ వ్యక్తిగత జీవితంపై అనవసర కామెంట్లు చేసి మరిన్ని చిక్కులు కొనితెచ్చుకుంది.
Also Read:బాలీవుడా అండర్ వరల్డా?
తన మూడో పెళ్లి గురించి ప్రశ్నించే వారికి కౌంటర్ ఇచ్చే క్రమంలో ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ప్రభుదేవా- నయన్‌లా ప్రేమ వ్యవహారాన్ని ఎత్తి చూపిందామె. ప్రభుదేవా కూడా గతంలో తన భార్యకు విడాకులు ఇవ్వకుండానే నయన తారతో సహజీవనం చేసిన విషయాన్ని గుర్తు చేసింది. ఈ కారణంగా ప్రభుదేవా భార్య రమాలత, ముగ్గురు పిల్లలు ఎన్నో కష్టాలు పడ్డారని చెప్పింది. కానీ, అప్పట్లో ఈ విషయంపై ఒక్క మాట మాట్లాడని వారు, తన మూడో పెళ్లి గురించి ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నారని ప్రశ్నించింది. ఈ క్రమంలో కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసింది. వనితా చెప్పినదానిలో లాజిక్ ఉన్నా… అనవసర టైమ్‌లో, అనవసర విషయంలోకి నయన్‌ను లాగి తేనెతుట్టిని కుదిపిందామె. అంతే.. నయన్ ఫ్యాన్స్ అంతెత్తున లేశారు. మీ వ్యక్తిగత విషయంలోకి నయన్‌ను ఎందుకు తీసుకొస్తారని వనితపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆమెపై ఓ రేంజ్‌లో ట్రోలింగ్ చేస్తున్నారు. కొంత వరకూ సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసిన వనిత.. నయన్ ఫ్యాన్స్ ధాటిని తట్టుకోలేకపోయింది. చివరకు నయన్- ప్రభుదేవ గురించి చేసిన ట్వీట్లను డిలీట్ చేసింది. అయినా.. వాళ్ల ఫ్యాన్స్ శాంతిచలేదు. చివరకు తన ట్విట్టర్ఖాతానే డీయాక్టివేట్ చేసింది వనిత.
Also Read: హాలీవుడ్ వెబ్ సిరీస్ రీమేక్‌లో కాజల్!