రాష్ట్రంలో ప్రస్తుతం రెండు అంశాలు కీలకంగా ఉన్నాయి. అవి ఏంటంటే మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వం రూపొందించిన బిల్లులకు గవర్నర్ అనుమతి, రెండవది నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమిస్తారా అనేవి. మూడు రాజధానులకు అనుమతి లభిస్తే అమరావతి నుంచి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ను విశాఖ తరలించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. అమరావతినే రాజధానిగా ఉంచాలని కోరుతూ అక్కడి రైతులు 218 రోజులుగా నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అమరావతి రాజధానిగా కొనసాగించాలని ప్రధాన ప్రతిపక్షం టిడిపితో సహా అన్ని పార్టీలు కోరుతున్నాయి.
Also Read: బోగాపురం పరిసరాల్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్..!
కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రైతులు గతంలో బీజేపీ రాష్ట్ర నేతలను కోరారు. ఆ సమయంలో జాతీయ స్థాయి నాయకులు రాజధాని రాష్ట్రానికి సంబంధించిన అంశమని.. తాము జోక్యం చేసుకోమని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ వద్దకు పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులో చేరుకున్నాయి. న్యాయ సలహా కోసం ఆయన వాటిని న్యాయ శాఖకు పంపారు. తిరిగి మళ్లీ అవి గవర్నర్ వద్దకు చేరాయి. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఒ) బిల్లులకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని ఏపీ రాజ్ భవన్ అధికారులను ఆదేశించింది. దీంతో అధికారులు బిల్లులకు సంబంధించిన వివరాలను పిఎంఒ అధికారులకు అందించనున్నారు.
ఇన్నాళ్లు రాజధాని అంశం రాష్ట్రం పరిధిలోనే ఉంటుందని ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని బీజేపీ నాయకులు చెప్పినా… ఇప్పుడు పిఎంఒ అధికారులు పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల వివరాలు అందజేయాలని కోరడం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన ఎంపీలు ఈ విషయంలో చక్రం తిప్పి ఉండవచ్చా… అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అమరావతి విషయంలో కొన్ని హిందుత్వ సంస్థలు సానుకూలంగా ఉండటం, ప్రధాని కార్యాలయానికి టిడీపీ, బీజేపీ, నాయకులు, ఇతరులు పలువురు లేఖలు వెళ్లడంతో ఈ అంశంపై పిఎంఒ దృష్టి సారించినట్లుగా చెబుతున్నారు.
Also Read: నిమ్మగడ్డ విషయంలో ప్రభుత్వ వైఖరి మారదా?
మూడు రాజధాని విషయంలో పిఎంఒ జోక్యం చేసుకోవడంతో అమరావతి రైతుల్లో ఆశలు చిగురిస్తునాయి. ఎంతో కాలంగా నిరసనలు వ్యక్తం చేసినా ఏ ఫలితం లేకపోవడం, మరోవైపు విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా మార్చడానికి వైసీపీ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేయడంతో అమరావతి రైతులు, ఆ ప్రాంత వాసుల్లో నిరుత్సాహం నెలకొంది. మరోవైపు పాలనా వికేంధ్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై రాష్ట్రపతితో చర్చించిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు చిత్రపటానికి అమరావతిలో పాలాబిషేకం నిర్వహించారు. ప్రభుత్వ ధ్వంధ వైఖరిని రాష్ట్రపతికి వివరించి గవర్నర్ బిల్లులను ఆమోదించకుండా చూడాలని రాష్ట్రపతికి సూచించడంపై అక్కడి రైతులు, ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఇంత మంది నాయకులు ఉన్నా ఎవరూ రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లలేదని అక్కడివారు అంటున్నారు.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Pmo seeks clarification from ap govt over 3 capitals
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com