Home Blog Page 8394

‘నిమ్మగడ్డ’ వ్యవహారంలో మరో మలుపు?


నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చిందా అంటే రాలేదనే చెప్పక తప్పడం లేదు. ఈ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతుంది. ఎస్ఇసి కేసులో నమోదైన పిటీషన్ ల విచారణ అనంతరం హై కోర్టు నిమ్మగడ్డను తిరిగి ఎన్నికల కమిషనర్ గా నియమించాలని తీర్పు ఇచ్చిన విషయం విధితమే. నిమ్మగడ్డను ఎన్నికల కమిషనర్ గా నియమించకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం శత విధాలా ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో హై కోర్టు తీర్పుపై సుప్రీం కోర్టులో పిటీషన్ వేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ తో పిటీషన్ వేయించింది.

Also Read: మంగళగిరి ఎమ్మెల్యే సైలెంట్ అయ్యాడెందుకు?

హై కోర్టు తీర్పు అమలు చేయడం లేదని నిమ్మగడ్డ హై కోర్టులో పిటీషన్ దాఖలు చేస్తే ఈ అంశంపైనా స్పెషల్ లీవ్ పిటీషన్ వేసింది. ఈ పిటీషన్ పై విచారణలో ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఆదేశాలు రావడంతో ఇప్పడు ఆలోచనలో పడింది. నిమ్మగడ్డను అడ్డకునేందుకు ఉన్న మార్గాలను అన్వేషిస్తుంది. ఈ క్రమంలో జస్టిస్ కనగరాజ్ తో సుప్రీం కోర్టులో మరో పిటీషన్ ను ప్రభుత్వం వేయించనుందని సమాచారం. వచ్చే శుక్రవారంలోగా నిమ్మగడ్డ నియామకం వ్యవహారాన్ని తేల్చాలని సుప్రీం కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో శుక్రవారంలోగానే కనగరాజ్ పిటీషన్ వేసే అవకాశం లేకపోలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సమస్య నుంచి తాత్కాలికంగా బయట పడేందుకు నిమ్మగడ్డకు వ్యతిరేకంగా కనగరాజ్ తో పిటీషన్ వేయించడం తప్ప ప్రభుత్వానికి మరో మార్గం కనిపించడం లేదు. కనగరాజ్ పిటీషన్ ను సాకుగా చూపి మరికొన్నాళ్లు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించకుండా ఉండాలని ప్రభుత్వం భావిస్తోన్నట్లు సమాచారం.

ఎస్ఇసి పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదిస్తూ ఆర్డినెన్స్ తెచ్చిన ప్రభుత్వం నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం ఆర్డినెన్స్ ప్రకారం పూర్తయ్యిందని, ఆయన స్థానంలో జస్టిస్ కనగరాజ్ ను నియమిస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చింది. కనగరాజ్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. హై కోర్టు ప్రభుత్వం తెచ్చిన ఆర్ధినెన్స్, కనగరాజ్ నియామకం కోసం ఇచ్చిన జిఓలను రద్దు చేసింది. దీంతో కనగరాజ్ ఎస్ఇసి బాధ్యతల నుంచి తప్పుకున్నారు.

Also Read: మీడియాకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది?

కనగరాజ్ పిటీషన్ వ్యవహారం ఇప్పడు చర్చనీయాంశంగా మారింది. నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇదే విషయాన్ని మీడియాకు వెల్లడించారు. కనగరాజ్ తో ప్రభుత్వం పిటీషన్ వేయించనుందనే సమాచారం తనకు అందిందని తెలిపారు. ఈ అంశాన్ని కొట్టిపారేసే అవకాశం లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయనను తిరిగి ఎస్ఇసిగా నియమించకూడదనే విషయంలో ఖచ్ఛితమైన నిర్ణయంతో ఉన్నారని సమాచారం. కోర్టు ఆదేశాలపై పిటీషన్లతో కాలక్షేపం చేస్తే వచ్చే మరో ఏడాదిలో నిమ్మగడ్డ పదవీ కాలం పూర్తవుతుంది. కాబట్టి అప్పడు ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు, కరోనా కారణంగా ఈలోగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. కాబట్టి ఎటువంటి సమస్య ఉండదని భావిస్తున్నారు.

ఏపీ ప్రజలపై మరో భారం..!


కరోనా వైరస్ కారణంగా కేంద్రం విధించిన లాక్ డౌన్ తో వ్యవస్థలన్నీ స్ధంబించాయి. దీంతో ఆదాయాన్ని కోల్పోయిన రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ పెంపు మార్గాలను అన్వేషిస్తుంది. ప్రభుత్వానికి ఆదాయ వనరుల్లో ప్రధానమైనవి వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్ స్టాంపు డ్యూటీలు. ఖజానాకు రాబడిని పెంచుకునేందుకు భూముల మార్కెట్ విలువను పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల చమురు ఉత్పత్తులపై వ్యాట్ ట్యాక్స్ పెంచిన రాష్ట్ర ప్రభుత్వం.. కొద్ది రోజుల వ్యవధిలోనే భూముల మార్కెట్ విలువలను పెంచేందుకు సిద్ధమయ్యింది. భూముల క్రయ విక్రయాల సమయంలో ప్రభుత్వానికి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. భూముల మార్కెట్ విలువ పెంచడంతో రిజిస్ట్రేషన్ ఫీజులు భారీగా పెరిగనున్నాయి. దీంతో ప్రభుత్వ ఖజానాకు ఆదాయం లభించనుంది.

Also Read: జగన్ ను ఇరుకున పెడుతున్న వైసీపీ ఎంపీ?

ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో తొలి త్రైమాసికంలో ప్రభుత్వం ఆదాయం భారీగా పడిపోయింది. ఈ సమయంలో లాక్ డౌన్ కొనసాగడమే ఇందుకు కారణంగా చెప్పొచ్చు. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో రూ.39,529 కోట్లు ఆదాయం లభించాల్సి ఉండగా… కేవలం రూ.7,555 కోట్లు మాత్రమే వివిధ మార్గాల్లో ఆదాయం లభించింది. ఏప్రిల్ నెలలో రూ.1,123 కోట్లు, మే నెలలో రూ.2,498 కోట్లు, జూన్ నెలలో రూ.3,934 కోట్లు ఆదాయం వచ్చినట్లుగా ఆర్ధిక శాఖ ఇటీవల ప్రకటించింది. ప్రభుత్వం రూ.31,974 కోట్ల ఆదాయం కోల్పోయింది. లక్ష్యంలో కేవలం 19 శాతం మాత్రమే ఆదాయం లభించింది. దీంతో ప్రభుత్వం అప్పలు చేయక తప్పడం లేదు. ఏప్రిల్ లో రూ.5,000 కోట్లు, మే లో రూ.6,000 కోట్లను ప్రభుత్వం మార్కెట్ నుంచి రుణాలు తెచ్చింది. ఈ మొత్తాన్ని 13 ఏళ్లలో తిరిగి చెల్లించాల్సి ఉంది. తోలి త్రైమాసికంలో ప్రభుత్వానికి రోజుకు రూ. 400 నుంచి 500 కోట్లు ఆదాయం రావాల్సి ఉండగా కేవలం రూ. 70 నుంచి 80 కోట్లు మాత్రమే లభించింది. దీంతో ప్రభుత్వం ఆదాయం పెంచుకోకపోతే భవిష్యత్తులో ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

Also Read: మీడియాకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది?

ప్రభుత్వ నిర్ణయం ప్రకారం భూముల విలువ ప్రాంతాల ఆధారంగా 5 నుంచి 50 శాతం వరకూ పెరిగే అవకాశాలు ఉన్నాయని స్పష్టమవుతుంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ ల శాఖ ఆ వివరాలను పెంచనున్న భూముల మార్కెట్ విలువల వివరాలను ఇంకా వెల్లడించలేదు. నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువ ఓక్కో రకంగా పెంచే అవకాశం ఉంది. స్థలాలో నిర్మాణాలు ఉంటే వాటి విలువను ప్రభుత్వం పెంచింది. భూమి మార్కెట్ విలువకు అధనంగా నిర్మాణల విలువ కట్టి ఫీజు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కరోనా కారణంగా రిజిస్ట్రేషన్ ల సంఖ్య తగ్గిపోయింది. భూముల క్రయవిక్రయాలు జరగడం లేదు. ఫలితంగా గడచిన మూడు నెలల్లో స్టాంపు డ్యూటీ రూపంలో ప్రభుత్వానికి పెద్దగా ఆదాయం లభించలేదు. భూముల మర్కెట్ విలువ పెంపు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇది ప్రజలకు భారంగానే మారనుంది. భూములు కొనుగోలు చేయడమే గగనంగా ఉన్న పరిస్థితిలో ప్రభుత్వానికి చెల్లించాల్సిన స్టాంపు డ్యూటీ ఎక్కువ మొత్తంలో ఉండటంతో ప్రజలు భారంగా భావిస్తున్నారు.

ఏపీ పోలీస్ పై ఎంపీ రఘురామ గురి..!


మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్నేహితుడు నలంద కిషోర్ మృతి చెందడం రాజకీయంగా కలకలం రేపింది. ఆయన గుండెపోటులో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఏపీ పోలీసుల వేదింపుల వల్లే నలంద కిషోర్ చనిపోయారని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆరోపిస్తున్నారు. నలంద కిషోర్ పేరు నిన్నటి వరకూ పెద్దగా తెలిసిన పేరు కాదు. అయితే సోషల్ మీడియాలో విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ లకు వ్యతిరేకంగా వచ్చిన పోస్టును ఆయన షేర్ చేయడంతో సిఐడి అధికారులు అతనని అరెస్టు చేశారు. విశాఖ నుంచి కర్నూలు తరలించి అక్కడ విచారించి వదిలి పెట్టారు. నలంద కిషోర్ అరెస్టుపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు.. పోలీసుల తీరును తప్పుబట్టారు.

Also Read: ఓట్లు లేవు.. పార్టీకి నేతల పోట్లు మాత్రం ఉన్నాయి

సోషల్ మీడియా కేసులో అరెస్ట్ అయి విడుదలైన నలంద కిషోర్ మృతి రాజకీయ అంశంగా మారిపోయింది. ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ఏ అంశం దొరికినా వదిలిపెట్టని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు కిషోర్ మృతిపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనికితోడు ఏపీ పోలీసులపై అసంతృప్తితో ఉన్న ఆయనకు ఈ అంశంలో అటు ప్రభుత్వంపైనా, ఇటు పోలీసులపైనా గురిపెట్టేదిగా ఉండటంతో వెంటనే రంగంలోకి దిగిపోయారు. అనారోగ్యంగా ఉన్నానని చెప్పినా పోలీసులు వినిపించుకోకుండా విశాఖ నుంచి కర్నూలుకు తరలించారని తెలిపారు. కిషోర్ షేర్ చేసిన పోస్టులో ఎవరి పేరు లేదని, అయినా పోలీసులు అయనను అరెస్టు చేయడం, కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో కర్నూలుకు తరలించి అక్కడ వదిలి పెట్టడం దారుణమన్నారు.

Also Read: ఆ రాష్ట్రానికి కరోనా తలవంచనుందా?

మరోవైపు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాత్రం ఈ వ్యవహారంపై స్పందించలేదు. త్వరలో ఆయన వైసీపీ తీర్ధం పుచ్చుకోవడమే ఇందుకు కారణం కావచ్చు. ఇదిలా ఉండగా నలంద కిషోర్ కు కరోనా టెస్టులో పాజిటివ్ వచ్చిందని పరీక్ష నిర్వహించిన వైద్యులు చెబుతున్నారు. కరోనా కారణంగానే కిషోర్ మృతి చెంది ఉండవచ్చనే అనుమానం వైద్యులు వ్యక్తం చేస్తున్నారు. అయితే అనారోగ్యంతో మృతి చెందారని కుటుంబ సభ్యులు చెప్పడం విశేషం. దీంతో కిషోర్ మృతిపై మిస్టరీ కోనసాగుతుంది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం గాని, పోలీసులు గాని స్పందించలేదు.

జగన్ ను ఇరుకున పెడుతున్న వైసీపీ ఎంపీ?


2019 ఎన్నికల్లో ఏపీలో ఫ్యాన్ గాలి జోరుగా వీయడంతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్ సీఎంగా పదవీ చేపట్టి సంవత్సరం పూర్తయింది. ఈ ఏడాదిలో అనేక ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి సీఎం జగన్ ప్రజల్లోకి దూసుకెళుతోన్నారు. మరోవైపు ప్రత్యర్థులకు తనదైన శైలిలో చెక్ పెడుతున్నారు. అయితే జగన్ ప్రభంజనంలోనూ స్వల్ప మెజార్టీతో గట్టెక్కిన నర్సాపురం ఎంపీ రఘురామరాజు వ్యవహార శైలిలో ఆపార్టీకి ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. సదరు ఎంపీ విషయంలో సీఎం జగన్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఏపీలో చర్చనీయాంశంగా మారింది.

Also Read: జగన్ కు కీలకమైన సూచనలు చేసిన ఏంపీ..!

2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున నర్సాపురం ఎంపీగా పోటీచేసి రఘురామ కృష్ణంరాజు గెలుపొందారు. నాటి నుంచి ఆయన బీజేపీకి రకరకాల దగ్గరవుతూ సొంతపార్టీపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడంతో పార్టీ అధిష్టానం షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆపార్టీ ఎంపీలంతా ఇటీవల లోక్ సభ స్పీకర్ ను కలిసి అతడిపై అనర్హత వేటు వేయాలని కోరారు.

వైసీపీ ఎంపీలు లోక్ సభ స్పీకర్ ను కలిసిన తర్వాత రఘురామ కృష్ణంరాజు కూడా ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను, కేంద్రమంత్రులను కలిసి వచ్చారు. దీంతో ఆయన బీజేపీలోకి వెళుతారనే ప్రచారం జరిగింది. తాజాగా మరోసారి సీఎం జగన్ కు ఇరుకున పెట్టేలా రఘురామరాజు వ్యహరిస్తున్నారు. తాజాగా నర్సాపురం నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కు ఆహ్వానించడం ఆసక్తిని రేపుతోంది.

Also Read: నాటి మంత్రులు.. నేడు ఎక్కడ ఉన్నారు?

నర్సాపురం అసెంబ్లీ పరిధిలో 4కోట్లతో నిర్మించనున్న భవనాలను ప్రారంభించాలని నిర్మలా సీతారామన్ కు ఆహ్వానం పలికారు. అలాగే అక్టోబరులో ఒకరోజు తన నియోజకవర్గంలో పర్యటించాలని కోరారు. అలాగే సముద్రతీరంలో కోతకు గురవుతున్న రివిట్మెంట్ పనుల కోసం రూ.200కోట్లు కేటాయించాలని కేంద్రమంత్రిని రఘురామ కృష్ణంరాజు విన్నించారు. నిర్మ‌ల సీతారామన్ గతంలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న సమయంలో నర్సాపురం నియోజకవర్గంలోని మైనపువానిలంక గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.

అయితే ఎంపీ రఘురామరాజు తనపై వైసీపీ సస్పెన్షన్ వేటువేసేలా ఇలా వ్యవహరిస్తున్నారనే టాక్ విన్పిస్తుంది. అయితే సదరు ఎంపీ తీరును ముందే గ్రహించిన జగన్ అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. అయితే ఇలా ఎంతకాలం రఘురామ కృష్ణంరాజు విషయంలో సీఎం జగన్ సహనంగా ఉంటారనేది వేచి చూడాల్సిందే..!

10 ఏళ్లు.. 11 మిలియన్ల ఫాలోవర్లు


టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా వెలుగొందుతున్న అక్కినేని సమంత ఇండస్ట్రీలో అడుగుపెట్టి పదేళ్లు అవుతోంది. ఆమె మొదటి సినిమా ‘ఏం మాయ చేశావే’ 2010లో రిలీజైంది. అక్కడి నుండి ఈ మధ్య వచ్చి ‘జాను’ వరకూ ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో టాలీవుడ్‌పై తనదైన ముద్ర వేసిందామె. గ్లామర్రోల్స్‌తో పాటు నటనకు ఆస్కారం ఉన్నా చిత్రాలు, నాయికా ప్రాధాన్యం ఉన్న చిత్రాలతో మెప్పించింది. అందం, నటనతోనే కాకుండా సామాజిక కార్యక్రమాలతో కూడా మంచి పేరు తెచ్చుకుంది. ప్రత్యూష ఫౌండేషన్‌ ద్వారా ఎంతో మంది అనాథ చిన్నారులకు ఆపన్న హస్తం అందిస్తోందామె.

Also Read: నా కొత్త మూవీ టైటిల్ ని‌ గెస్‌ చేయండి: ఆదా శర్మ

అన్నింటికి మించి వివాదాలకు, విమర్శలకు దూరంగా ఉంటుంది. మొహంపై ఎప్పటికీ చెరగని చిరునవ్వుతో అందరినీ ఆప్యాయంగా పలకరిస్తుంది. దాంతో, తెలుగు నాటే కాదు తమిళ్‌లో కూడా సమంతకు విపరీతమైన ఫాలోయింగ్‌ ఏర్పడింది. సోషల్‌ మీడియా పరిధి పెరిగిన తర్వాత రెగ్యులర్ అప్‌డేట్స్‌తో ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోందామె. సినిమాలతో పాటు పర్శనల్ విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటోంది. వీలుచిక్కినప్పుడల్లా లైవ్‌లోకి వస్తూ ఫ్యాన్స్‌ అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానాలు ఇస్తోంది.

దాంతో, సోషల్ మీడియాలో సమంతను అనుసరించే అభిమానుల సంఖ్య అమాంతం పెరిగింది. ఒక్క ఇన్‌స్టాగ్రామ్‌లోనే సమంత ఫాలోవర్ల సంఖ్య ఇంతితై అన్నట్టు కోటి దాటి ఎప్పుడో దాటింది. లేటెస్ట్‌గా ఆమె ఇన్‌స్టా ఖాతాలో ఫాలోవర్స్‌ నంబర్ 11 మిలియన్ల మార్కు చేరింది. అంటే కోటి పది లక్షల మంది ఆమెను ఫాలో అవుతున్నారు. ఈ మార్కు చేరడం పట్ల సమంత ఎంతో సంతోషం వ్యక్తం చేసింది. అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ప్రత్యేక వీడియో ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది.

Also Read: గెటప్‌ మార్చేసి.. మాస్‌ ట్రాక్‌లోకి నాగశౌర్య

తన మొదటి సినిమా, అది వచ్చిన ఏడాది నుంచి పలు చిత్రాల్లోని ఫొటోలతో పాటు ఆయా ఇయర్స్‌లో తన ఫాలోవర్ల సంఖ్యను తెలుపుతూ చేసిన వీడియోను అభిమానులతో పంచుకుంది. దానికి ‘మంచి వాళ్లతో మంచి ప్రయాణం. నాతో ఎప్పటికి ఉంటే టీమ్‌ ఇది. 11 మిలియన్ల స్ట్రాంగ్‌ టీమ్‌. అది ఇంకా బలపడుతూనే ఉంది. ఈ ప్రయాణంలో ఎన్నో అప్స్‌, డౌన్స్‌.. గుడ్‌, బ్యాడ్‌. అన్ని సమయాల్లో మీరు నాకు తోడుగా ఉన్నట్టు నేను కూడా మీకు తోడుగా ఉన్నానని భావిస్తున్నా’ అని రాసుకొచ్చింది.

https://www.instagram.com/p/CDDa2ssBBfM/

‘పుష్ప’లో బిగ్గెస్ట్‌ ట్విస్ట్‌ అదే!


‘ఆర్య’ మూవీతో కెరీర్‌ స్టార్టింగ్‌లోనే తనకు బిగ్గెస్ట్‌ హిట్‌ ఇచ్చిన సుకుమార్ అంటే స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్‌కు ఎంతో ఇష్టం. ఆ టైమ్‌లోనే వీరిద్దరి మధ్య స్నేహం కుదిరింది. ‘ఆర్య2’తో ఆ బంధం మరింత బలపడింది. అప్పటి నుంచి ఇద్దరూ ముచ్చటగా మూడోసారి కలిసి పని చేయాలని ఎన్ని ప్లాన్స్‌ వేసుకున్నా వర్కౌట్‌ కాలేదు. 2011లో నాగచైతన్య హీరోగా వచ్చిన ‘100 పర్సెంట్‌ లవ్‌’ మూవీని తొలుత బన్నీతోనే తీద్దామనుకున్నాడు సుక్కూ. కథ కూడా వినిపించాడు. కానీ, ఆ టైమ్‌లో ‘బద్రీనాథ్‌’కు కమిట్‌ కావడంతో డేట్స్‌ అడ్జస్ట్‌ చేయలేకపోయాడు అల్లు వారి హీరో. అయితే, 11 ఏళ్ల తర్వాత బన్నీ, సుక్కూ కలిసి పని చేయబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ‘పుష్ప’పై ఇండస్ట్రీలో ఇప్పటికే భారీ హైప్‌ క్రియేట్‌ అయింది.‘రంగస్థలం’తో సుకుమార్, ‘అలవైకుంఠపురములో’తో అర్జున్‌ ఖాతాలో రీసెంట్‌గా భారీ విజయాలు చేరడంతో వీరిద్దరి కాంబోపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా ఇది పాన్‌ ఇండియా మూవీగా రాబోతోంది.

Also Read: హాట్ బ్యూటీకి పోలీస్ క్యారెక్టర్ !

గంధం చెక్కల స్మగ్లింగ్‌ నేపథ్యంలో, ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో బన్నీ ‘పుష్పరాజ్‌’ అనే పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్‌ చేసిన ఫస్ట్‌ లుక్‌లో బన్నీ రగ్‌డ్‌ లుక్‌లో ఆకట్టుకున్నాడు. అతని సరసన హాట్‌ బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. సినిమాలో ఆమె పోలీసు పాత్ర చేస్తోందని టాక్‌. విలన్‌గా తమిళ విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతిని తీసుకున్నారు. కానీ, ఇతర సినిమాలతో బిజీగా ఉండడంతో అతను ఆ ప్రాజెక్ట్‌ నుంచి వైదొలిగాడు. ప్రకాశ్‌ రాజ్‌, జగపతి బాబు, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ ఫస్ట్‌ షెడ్యూల్‌ను కేరళలో పూర్తి చేశారు. కానీ, కరోనా కారణంగా షూటింగ్‌కు బ్రేక్‌ పడింది. వచ్చే నెల నుంచి తిరిగి షూటింగ్‌ ప్రారంభించాలని బన్నీ, సుక్కూ ప్లాన్‌ చేస్తున్నారు.

Also Read: పద్మం వికసించని నవరస నట సార్వభౌముడు !

రీసెంట్‌గా ఈ మూవీ గురించి ఓ ఆసక్తికర విషయం తెలిసింది. ‘పుష్ప’లో బన్నీ క్యారెక్టర్లో రెండు డిఫరెంట్‌ షేడ్స్‌ ఉంటాయట. ఆ రోల్‌లో అనూహ్యమైన ట్విస్ట్‌ ఉంటుందని, మూవీలో ఇదే బిగ్గెస్ట్‌ సర్ప్రైజ్‌ అని ఫిల్మ్‌ సర్కిల్‌లో చర్చ నడుస్తోంది. రంగస్థలం మాదిరిగా క్లైమాక్స్‌కు ముందు ఈ ట్విస్ట్‌ రివీల్‌ అవుతుందట. దాంతో, ప్రేక్షకులు ఆశ్చర్యపోతారని, ఈ మూవీని వాళ్లు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారట. బన్నీ, రష్మిక తొలిసారి జోడీగా నటిస్తున్న ఈ మూవీని ఐదు భాషల్లో రిలీజ్‌ చేయనున్నారు. తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళంతో పాటు ఫస్ట్‌టైమ్‌ బన్నీ మూవీ హిందీలో కూడా నేరుగా రిలీజ్‌ కాబోతోంది.

మంగళగిరి ఎమ్మెల్యే సైలెంట్ అయ్యాడెందుకు?


వైసీపీ పార్టీ స్థాపించిన నాటి నుండి జగన్ వెంట నడిచిన నాయకులలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఒకరు. వైసీపీ పార్టీ కోసం నిబద్ధతతో పని చేసిన నేతలలో ఆయన ఒకరు. గత ఐదేళ్ల టీడీపీ పాలనలో అక్రమాలను ఎండగట్టిన సమర్ధత గల నాయకుడు. టీడీపీ ప్రభుత్వంపై అనేక విషయాలపై ఆళ్ల రామకృష్ణా రెడ్డి అలుపెరగని న్యాయపోరాటం చేశారు. ఇక 2019 ఎన్నికలలో కూడా టీడీపీ ఓటు బ్యాంకు అధికంగా ఉన్న మంగళగిరిలో సాక్షాత్తు టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ పై పోటీ చేసి గొప్ప విజయాన్ని అందుకున్నారు. ఆళ్ల రామకృష్ణా రెడ్డిని గెలిపిస్తే రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రిని చేస్తాను అని మంగళగిరి ప్రజలకు వై ఎస్ జగన్ హామీ ఇచ్చారు.

Also Read: రాజధాని రైతులపై పవన్ కి చిత్తశుద్ధి ఉందా?

ప్రభుత్వం ఏర్పడిన తరువాత సామాజిక సమీకరణాల లెక్కలలో ఆళ్ల రామకృష్ణ రెడ్డికి మంత్రి పదవి దక్కలేదు. అధినేత పట్ల విధేయత కలిగిన నాయకుడిగా ఆళ్ల రామకృష్ణ రెడ్డి జగన్ నిర్ణయాన్ని గౌరవించి, మౌనంగా ఉండిపోయారు. ఐతే మూడు రాజధానుల జగన్ నిర్ణయం ఆళ్ల రామకృష్ణ రెడ్డికి తలనొప్పి తెచ్చిపెట్టింది. రాజధాని అమరావతిని ఆనుకొని ఉన్న మంగళగిరి ప్రజలకు మూడు రాజధానుల నిర్ణయం రుచించే అంశం కాదు . పక్కనే ఉన్న రాజధానిని తరలించడం వలన ఆ ప్రాంత ప్రజల ప్రయోజనాలు దెబ్బతింటాయి అనేది అక్షర సత్యం. దీనితో అటు జగన్ నిర్ణయానికి ఎదురు చెప్పలేక, ప్రజలకు నచ్చ చెప్పుకోలేక సతమతం అవుతున్నారు.

Also Read: గవర్నర్ వ్యవస్థతో జగన్ ని ఆపడం సాధ్యమేనా..!

ఈ మధ్య కాలంలో జగన్ కార్యక్రమాలపై గాని, ప్రత్యర్థుల విమర్శలపై కానీ ఆళ్ల రామకృష్ణ రెడ్డి స్పందించిన సంధర్భం లేదు. ఒకప్పుడు ప్రతి విషయంపై ప్రెస్ మీట్స్ పెట్టి ప్రత్యర్థులను హడలగొట్టిన ఆళ్ల ఇలా సైలెంట్ కావడం వైసీపీ వర్గాలకు నచ్చడం లేదు. మంత్రి పదవి విషయంలో ఆళ్ల బయటపడకున్నా అసంతృప్తితో ఉన్నారని ఆయన అనుచరుల ద్వారా అందుతున్న సమాచారం. రెండున్నరేళ్ళ తరువాత క్యాబినెట్ పూర్తి స్థాయిలో మార్చి వేసి కొత్తవారికి అవకాశం ఇస్తాం అని జగన్ చెప్పడం జరిగింది. మరి వచ్చే రెండున్నరేళ్లలో నైనా ఆళ్ళకు సీఎం జగన్ మంత్రి పదవి ఇచ్చి లోలోపల ఉన్న అసహనానికి చెక్ పెడతాడేమో చూడాలి.

ఆ విషయంలో మోదీని ఫాలో అవుతున్న కేసీఆర్


కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో కాంగ్రెస్ నేతలు చేసిన తప్పులను ప్రత్యర్థులు నేడు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ చెందిన ముఖ్యనేతలను ఇతర పార్టీలు తమ నాయకుడిగా మలుచుకుంటున్నా ధైర్యంగా తిప్పికొట్టలేని ధైన్యస్థితిలో కాంగ్రెస్ అధిష్టానం వెళ్లడం శోచనీయంగా మారింది. భారత తొలి ఉప ప్రధాని, హోంమంత్రి వల్లభాయ్ పటేల్, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుల ఇమేజ్ లను కాంగ్రెస్ పార్టీ సరైన విధంగా వాడుకోకపోవడం ప్రత్యర్థులకు వరంలా మారింది.

Also Read: కేసీఆర్ పై కోదండరాం పైచేయి సాధిస్తారా?

బీజేపీ కేంద్రంలోకి అధికారంలోకి వచ్చాక ప్రధాని మోదీ తన ప్రచారంలో ఎక్కువగా వల్లభాయ్ పటేల్ ప్రస్తావన తీసుకొచ్చేవారు. వల్లభాయ్ పటేల్ ఇమేజ్ ను మోదీ వాడుకున్నంతగా మరే నాయకుడు కూడా వాడుకోలేదనే చెప్పొచ్చు. గుజరాత్లోని నర్మదా నదీతీరంలో వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించి మోదీ అందరి దృష్టిని ఆకర్షించారు. కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబానికి చెందిన నాయకులకు తప్ప మరేవరికీ ప్రాధాన్యం ఇవ్వదనే సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. ఇలా మొత్తంగా వల్లభాయ్ పటేల్ ఇమేజ్ ను మొత్తాన్ని బీజేపీ హైజాక్ చేసింది. తమ పార్టీ నాయకుడిని బీజేపీ అంతలా వాడుకుంటున్నా కాంగ్రెస్ ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్లింది.

తాజాగా సీఎం కేసీఆర్ కూడా మోదీ బాటలోనే వెళుతున్నారు. మోదీ ఏవిధంగానైతే వల్లభయ్ పటేల్ ను కాంగ్రెస్ దూరంచేసి లబ్ధిపొందేరో సేమ్ టూ సేమ్ కేసీఆర్ అదే ప్లాన్ వర్కౌట్ చేస్తున్నారు. తెలంగాణ బిడ్డ పీవీ నర్సింహారావును కేసీఆర్ భుజాన వేసుకుంటున్నారు. పీవీ శతజయంతి ఉత్సవాలను ఏడాదిపాటు నిర్వహిస్తామంటూ కేసీఆర్ ప్రకటించారు. అంతేకాకుండా పీవీ కూతురుకు ఎమెల్సీ పదవీ కట్టబెట్టి పీవీ నర్సింహారావుపై తనకున్న చిత్తశుద్ధిని చాటాలనుకుంటున్నారు. జాతీయ నాయకుడైన పీవీని కేసీఆర్ ఒన్ చేసుకోవడం ద్వారా తెలంగాణతోపాటు జాతీయ స్థాయిలో టీఆర్ఎస్ కు అడ్వాంటేజ్ కానుంది.

Also Read: రాజధాని రైతులపై పవన్ కి చిత్తశుద్ధి ఉందా?

ఈ పరిణామాలను స్థానిక నేతలు కాంగ్రెస్ అధిష్టానం దృష్టికెళ్లారు. దీంతో తాజాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు సైతం పీవీ కాంగ్రెస్ నాయకుడని, ఆయనను కొనియాడుతూ తెలంగాణ పీపీసీకి లేఖరాశారు. దీనిని ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ చదివి విన్పించారు. తెలంగాణవాడైన పీవీని ప్రధాని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని స్థానిక నేతలు చెబుతుండగా టీఆర్ఎస్ నేతలు మాత్రం పీవీకి కాంగ్రెస్ సరైన గౌరవం ఇవ్వలేదని అంటున్నారు.

ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ తమ నాయకులపట్ల చేసిన నిర్లక్ష్యం ఇప్పుడు ఆ పార్టీకి శాపంగా మారుతోంది. దీంతో కాంగ్రెస్ చెందిన వల్లభయ్ పటేల్, పీవీ నర్సింహారావులు ఇతర పార్టీలకు ఆరాధ్యులుగా కాంగ్రెస్ కు విలన్లుగా మారుతున్నారు. మోదీ, కేసీఆర్ లు కాంగ్రెస్ నేతలను తమకు అనుకూలంగా మలుచుకుంటూ ఆపార్టీకే చెక్ పెడుతుండటం గమనార్హం. ఒకే దెబ్బకు రెండుపిట్టలంటే ఇదే కాబోలు..!

బిగ్‌బాస్‌4 కోసం పూనమ్‌ బజ్వా అంత తీసుకుంటోందా?


మంచి అందం, అభినయం ఉన్నా టాలీవుడ్‌లో అంతగా సక్సెస్‌ సాధించలేకపోయిన నటి పూనమ్‌ బజ్వా. 2005లో ‘మొదటి సినిమా’తో టాలీవుడ్‌తోనే తెరంగేట్రం చేసిన ఈ ముంబై భామ అప్పట్లో తన అంద చందాలతో యూత్‌ను తెగ ఆకట్టుకుంది. ‘ప్రేమంటే ఇంతే’, ‘బాస్‌’, ‘వేడుక’, ‘పరుగు’ చిత్రాలు చేసిందామె. ఆ తర్వాత తెలుగులో అవకాశాలు రాకపోవడంతో తమిళ్‌, ఆపై మళయాల సినిమాలతో బిజీగా మారింది. టాలీవుడ్‌కు దూరమైన ఆమె తమిళ్‌లో మంచి పేరు తెచ్చుకుంది. కానీ, ఎక్కువ కాలం కొనసాగలేకపోయింది. లాస్ట్‌ ఇయర్ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’లో ఓ గెస్ట్‌ రోల్‌ చేసింది. వయసు మీద పడడంతో ఈ మద్య కాలంలో ఏ భాషలోనూ ఆమెకు చాన్స్‌లు రావడం లేదు. దాంతో, ఎలాగైనా లైమ్‌ లైట్‌లోకి రావాలని ప్రయత్నిస్తున్న పూనమ్‌ ఓ డేరింగ్‌‌ స్టెప్‌ వేస్తోంది.

రియాలిటీ షోస్‌ ద్వారా మళ్లీ ప్రేక్షకులకు చేరువ కావాలని చూస్తున్న ఈ హాట్‌ బ్యూటీ తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌4లో ఓ కంటెస్టంట్‌గా ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. బిగ్‌బాస్‌ ఇప్పటికే బజ్వాను సంప్రదించడం, ఆమె సంతకం చేయడం కూడా జరిగిపోయాయని సమచారం. ‘బాస్‌’ సినిమాలో నాగార్జున సరసన సెకండ్‌ హీరోయిన్గా‌ నటించడం ఆమెకు కలిసొచ్చిందని టాక్‌ నడుస్తోంది. ఆమె వస్తే గత సీజన్లకంటే ఎక్కువ గ్లామర్, కలర్ తోడవుతుందని నిర్వాహకులు భావిస్తున్నారట. అయితే, ఈ షో కోసం పూనమ్‌ భారీగానే డిమాండ్‌ చేసిందని సమాచారం. ప్రైజ్‌ మనీతో సంబంధం లేకుండా ఏకంగా 45 లక్షల రెమ్యునరేషన్‌ అందుకుంటోందని టాక్‌. అయితే ఇదే మొత్తం రెమ్యునరేషనా? లేదంటే మళ్లీ రోజుకు ఇంత అని ఎక్స్‌ట్రా అమౌంట్‌ కూడా ఇస్తారా? అన్నది మాత్రం సస్పెన్స్.

కాగా, స్టార్ మాలో ప్రసారం కానున్న బిగ్‌బాస్‌ ఆగస్టు సెకండ్‌ వీక్‌లో మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కంటెస్టంట్స్‌ జాబితా పూర్తయిందని, కరోనా నేపథ్యంలో వారిని 14 రోజుల ప్రీ క్వారంటైన్‌ కోసం రెడీ చేస్తున్నారని సమాచారం. థర్డ్‌ సీజన్‌ మాదిరిగా నాలుగో సీజన్‌కు కూడా కింగ్‌ నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరించబోతున్నాడు.

గెటప్‌ మార్చేసి.. మాస్‌ ట్రాక్‌లోకి నాగశౌర్య


చందమామ కథలు, ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్యా, జ్యో అచ్యుతానంద, చలో, ఓ బేబీ.. రీసెంట్‌గా అశ్వథ్థామ. యువ కథానాయకుడు నాగశౌర్య ఖాతాలో మంచి విజయాలే ఉన్నాయి. మంచి హైట్‌, ఫిజిక్ ఉంది. యాక్టింగ్‌ స్కిల్స్‌ ఉన్నాయి. వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. కానీ, కెరీర్ను మలుపు తిప్పే సక్సెస్‌ మాత్రం రావడం లేదు. ఇన్ని సినిమాలు చేసినా ఇంకా లవర్ బాయ్‌గా, పక్కింటి కుర్రాడి లుక్‌లోనే కనిపిస్తున్నాడు శౌర్య. తానే స్టోరీ అందించిన ‘అశ్వథ్థామ’తో ఆ ముద్ర చెరిపేసుకొనే ప్రయత్నం చేసి కొంత సక్సెస్‌ అయ్యాడు. ఇప్పుడు పూర్తిగా మాస్‌ ట్రాక్‌లోకి వస్తున్నాడు.

Also Read: పద్మం వికసించని నవరస నట సార్వభౌముడు !

సుమంత్‌, ఈషా రెబ్బా హీరో, హీరోయిన్లుగా సుబ్రమణ్యపురం మూవీ తీసిన సంతోష్‌ జాగర్లమూడి డైరెక్షన్‌లో నాగశౌర్య ఇప్పుడు ఓ సినిమా చేస్తున్నాడు. స్పోర్ట్స్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీలో అతని సరసన ‘రొమాంటిక్‌’ మూవీ ఫేమ్‌ కేతికా శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ ప్రీ లుక్‌ను చిత్ర బృందం ఈ రోజు (శనివారం) రిలీజ్‌ చేసింది. హీరో నాగ శౌర్య వెనక్కి తిరిగి ఉన్న ఈ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ఇందులో కండలు తిరిగిన దేహంతో ఉన్న శౌర్య గత చిత్రాలకు పూర్తి భిన్నంగా కనిపించాడు. పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో అతను పూర్తిగా మాస్‌ లుక్‌లోకి వచ్చేశాడు. అశ్వథ్థామ టైమ్‌లో బాడీ పెంచిన శౌర్య ఈ మూవీ కోసం స్పోర్ట్స్‌ పర్సన్‌లా మేకోవర్ అయ్యాడు. సిక్స్‌ లేదా ఎయిట్‌ ప్యాక్‌ బాడీతో కనిపించబోతున్నాడు.

Also Read: తెలుగు వెబ్‌ సిరీస్‌లా.. అయితే ఓ కండీషన్.. సమంత!

నాగశౌర్యకు ఇది 20వ చిత్రం. ఇది మన ప్రాచీన క్రీడ ఆర్చరీ చుట్టూ అల్లిన కథ అని తెలుస్తోంది. ప్రీ లుక్‌ పోస్టర్ పై ది గేమ్‌ నెవర్ బి ద సేమ్‌ (ఆట ఇక మునుపటిలా ఉండబోదు) అనే క్యాప్షన్‌ ఇచ్చారు. ప్రతిభావంతుడైన ఓ ఆర్చర్ అనేక అడ్డంకులను దాటి తన లక్ష్యాన్ని ఎలా నెరవేర్చుకున్నాడనేదే కథ అని సమాచారం. సినిమాకు ఇంకా టైటిల్ ఖారారు చేయలేదు. మూవీ ఫస్ట్‌ లుక్‌ ను సోమవార (ఈ నెల 27న) రిలీజ్‌ చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. నారాయణ్‌ దాస్‌, రామ్‌మోహన్‌ రావు, శరత్‌ మరార్ సంయుక్త నిర్మిస్తున్న ఈ మూవీకి కీరవాణి కొడుకు కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు. ప్రీ లుక్‌ పోస్టర్ను శౌర్య సోషల్‌ మీడియాలో షేర్ చేయగా.. వెంటనే వైరల్‌గా మారింది.

https://www.instagram.com/p/CDDbdFJpWRK/

మీడియాకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది?


హైకోర్టు అనుమతివ్వడమే ఆలస్యం.. తెలంగాణ సర్కార్ వెంటనే రాత్రికి రాత్రి అందరూ పడుకున్నాక సచివాలయాన్ని కూలగొట్టడం మొదలుపెట్టింది. అలా ఎందుకు చేసిందన్నది ఇప్పటికీ అంతుచిక్కని విషయంగా మారింది. జీ బ్లాక్ కింద గుప్త నిధుల కోసం అలా చేశారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి లాంటి వారు ఆరోపిస్తుంటారు. అయితే మీడియాను కూడా ఈ కూలగొట్టే చోటకు అనుమతులు ఇవ్వలేదు కేసీఆర్ సర్కార్. మీడియా అంటే ఏ వార్ జోన్ లోకైనా వెళ్లే స్వేచ్ఛ ఉందని.. ఎందుకు అనుమతించరని తాజాగా కేసీఆర్ సర్కార్ ను హైకోర్టు ప్రశ్నించింది.

Also Read: కేసీఆర్ పై కోదండరాం పైచేయి సాధిస్తారా?

తెలంగాణ ప్రభుత్వం సెక్రటేరియట్ కూల్చివేతలో కనీసం ఫొటోలు తీయడానికి కూడా అనుమతించకపోవడంపై మీడియా వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. చారిత్రాత్మక జీ బ్లాక్ నిర్మాణాలను కూల్చివేసిన సమయంలోనూ ఫొటోలు తీయకుండా నిలువరించింది. మీడియాను ఆ చోటకు ప్రవేశించకుండా నిషేధించింది.

ఇక ఈ కూల్చివేతకు వచ్చిన కూలీలు.. బందోబస్తుకు వచ్చిన కానిస్టేబుళ్లను కూడా ఈ ఫొటోలు క్లిక్ మనిపించడానికి ప్రభుత్వం అనుమతించలేదు. కొంతమంది డేరింగ్ జర్నలిస్టులు.. సచివాలయం చుట్టుపక్కల భవనాలపైకి ఎక్కి ఫొటోలు తీయడానికి ప్రయత్నించారు. కానీ ఏ మీడియా జర్నలిస్టులను , వ్యక్తులను సచివాలయ భవనాల కూల్చివేతను తీసేందుకు అనుమతించవద్దని భవన యజమానులను పోలీసులు హెచ్చరించినట్టు తెలిసింది. తీవ్ర పరిణామాలుంటాయని పోలీసులు బెదిరించినట్టు సమాచారం.

Also Read: కేసీఆర్ పై ఆర్కే మౌనం.. రామోజీ ఎటాక్

ఈ నేపథ్యంలోనే మీడియా ప్రతినిధులు తమను అనుమతించకపోవడంపై హైకోర్టును ఆశ్రయించారు. మీడియాను అనుమతించాలని.. భవన యజమానులను వేధించవద్దని కోరింది.

నిజానికి ప్రభుత్వం మీడియాను చూసి ఎందుకు భయపడుతుందో.. ఎందుకు నిరోధించడానికి ప్రయత్నిస్తుందో ఎవరికీ అంతుచిక్కడం లేదు. వైట్ హౌస్ ను తలదన్నేలా నిర్మిస్తున్న ఒక కొత్త సెక్రటేరియట్ నిర్మాణం కోసం కేసీఆర్ ఇన్ని ఆంక్షలు పెట్టడాన్ని ఎవ్వరూ జీర్ణించుకోవడం లేదు. మీడియాను చూసి కేసీఆర్ భయం వెనుక ఏదో మర్మం ఉందని జర్నలిస్ట్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.

నా కొత్త మూవీ టైటిల్ ని‌ గెస్‌ చేయండి: ఆదా శర్మ


పూరి జగన్నాథ్‌ టాలీవుడ్‌కు పరిచయం చేసిన ముంబై హీరోయిన్లలో ఒకరు ఆదా శర్మ. మోడలింగ్‌ నుంచి బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఆదా.. 2013లో పూరి డైరెక్షన్‌లో వచ్చిన ‘హార్ట్‌ ఎటాక్‌’లో నితిన్‌కు జోడీగా తెలుగులో తెరంగేట్రం చేసింది. తర్వాత సన్నాఫ్‌ సత్యమూర్తి, సుబ్రమణ్యం ఫర్ సేల్‌, గరం, క్షణం లాంటి సినిమాల్లో నటించినా.. తెలుగులో పెద్దగా బ్రేక్ రాకపోవడంతో మళ్లీ హిందీ సినిమాల బాట పట్టింది. కమాండో 2, కమాండో, బైపాస్‌ రోడ్‌ వంటి మూవీస్‌లో నటించింది. రెండు వెబ్‌ సిరీస్‌లు కూడా చేసింది. మధ్యలో తమిళ్‌లో కూడా అడుగుపెట్టిన ఆమె సీనియర్ హీరో రాజశేఖర్ సరసన కల్కితో టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చింది. లాస్ట్‌ ఇయర్ రిలీజైన ఈ మూవీకి మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

Also Read: పవన్ కళ్యాణ్, ట్రాప్ లో పడకండి

కానీ, ఈ మధ్య ఆమె చేతిలో వేరే సినిమాలేమీ లేవు. దాంతో, ఈ మధ్య సోషల్‌ మీడియాలో హాట్‌హాట్‌ ఫొటోలు పోస్ట్‌ చేస్తూ ఫ్యాన్స్‌కు అందాల ట్రీట్‌ ఇచ్చింది. అదే టైమ్‌లో దర్శక, నిర్మాతలను ఆకర్షించే ప్రయత్నం చేసింది. దానికి ఫలితం దక్కినట్టుంది. ఓ తెలుగు ప్రాజెక్ట్‌ ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో వెరైటీగా పంచుకుంది ఆదా. తాను ఓ తెలుగు సినిమాకు సంతకం చేశానని చెప్పిన ముంబై భామ చేతిలో స్క్రిప్టు పట్టుకుని తెగ సంతోషంగా ఉన్న ఫొటోలనూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. బ్యాక్‌గ్రౌండ్‌లో గ్రీనరీ ఉన్న ఫొటోలు, ఒక చోట ధ్యానం చేస్తున్నట్టు కూర్చున్న మరో ఫొటోను షేర్ చేసింది. అంతేకాదు.. ఈ మూవీ హీరో, టైటిల్‌ ఏంటో గెస్‌ చేయండి అంటూ ఫ్యాన్స్‌ను అడిగింది. అందుకు కొన్ని హింట్స్‌ కూడా ఇచ్చింది.

Also Read: హిట్ లేకపోయినా ఎమ్మెల్యే కూతుర్ని పట్టాడు !

‘నా నెక్ట్స్‌ తెలుగు ఫిల్మ్‌కు సైన్‌ చేశా. నా సినిమాలో హీరోకు సంబంధించిన కొన్ని ఫొటోలివి (కొన్ని ఫొటోల్లో హీరో లేడు. కానీ, వెనకాల పచ్చదనం ఉండడం నచ్చి పోస్ట్‌ చేశా). కావాలంటే చివరి ఫొటోను జూమ్‌ చేసి చూడండి… నా నుదిటిపై ఉన్న స్పైడర్ (సాలె పరుగు) కూడా సినిమాలో ఓ క్యారెక్టరే. ఇది ఎలాంటి సినిమానో మీరు ఊహించగలరా?’ అని రాసుకొచ్చింది. దానికి #100yearsofAdahSharma #1920to2020 #theresacluehiddeninthecaption. అనే హ్యాష్ ట్యాగ్‌లను జత చేసింది. అందులో సినిమా టైటిల్‌ ఉంది గెస్‌ చేయండి అని ఆదా రాసుకొచ్చింది. కాసేపటికే తన నుదిడిపై స్పైడర్ను జూమ్‌ చేసిన ఫొటోను కూడా షేర్ చేసిన ఆదా.. అది నిజమైన స్పైడర్ అని చెప్పింది. కానీ, మూవీ టైటిల్‌ స్పైడర్ కాదు అని స్పష్టం చేసింది. దాంతో, మూవీ పేరు ఏంటా? అని ఫ్యాన్స్‌ ఆలోచనలో పడ్డారు. అయితే, విజయ్‌ దేవరకొండ హీరోగా తమిళ దర్శకుడు ఆనంద్‌ అన్నమలై లాస్ట్‌ ఇయర్ అనౌన్స్‌ చేసిన మూవీలో ఆదా శర్మ చాన్స్‌ కొట్టేసిందని ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. తమిళ్‌, తెలుగు భాషల్లో ప్లాన్‌ చేసిన ఈ మూవీలో మాళవికా మోహనన్‌ను హీరోయిన్‌గా ఎంచుకున్నారు. కానీ, ఈ మూవీ పట్టాలెక్కలేదు.

https://www.instagram.com/p/CDB3ZNln24a/

ఆ రాష్ట్రానికి కరోనా తలవంచనుందా?


కరోనా పేరు చెబితేనే ప్రపంచ దేశాలు బెంబేలెత్తిపోతున్నారు. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరిగిపోతుండటంతో ప్రజలు ఇళ్లల్లోంచి బయటికి వచ్చేందుకే జంకుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతీరోజు లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇండియాలోనూ రోజుకు వేలల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. అయితే దేశంలో రికవరీ రేటు కూడా మెరుగ్గా ఉండటం భారతీయులకు కొంత ఊరటనిచ్చే అంశం.

Also Read: గవర్నర్ వ్యవస్థతో జగన్ ని ఆపడం సాధ్యమేనా..!

దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, పుణే, అహ్మదాబాద్ తదితర నగరాల్లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. కరోనా తొలినాళ్లలో ముంబై, ఢిల్లీ రాష్ట్రాలు పోటాపోటీగా పాజిటివ్ కేసుల్లో పోటీపడ్డాయి. అయితే ప్రస్తుతం మహారాష్ట్ర కరోనా కేసుల్లో తొలిస్థానంలో ఉండగా ఢిల్లీ మాత్రం కరోనాను జయించే దిశగా వెళుతోంది. దేశంలో ఆన్ లాక్ 2.0లో అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండగా ఢిల్లీలో మాత్రం కరోనా కేసులు తగ్గముఖం పడుతుండటంపై హర్షం వ్యక్తమవుతోంది.

ప్రస్తుతం ఢిల్లీలో యాక్టివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పడిపోతుంది. ఒకద‌శ‌లో ఏకంగా ల‌క్ష‌కుపైగా పాజిటివ్ కేసుల‌తో ఆందోళన కలిగించిన ఢిల్లీ కొద్దిరోజుల్లో కరోనా రహిత రాష్ట్రంగా మారబోతుంది. ప్ర‌భుత్వ లెక్క‌ల ప్ర‌కారం ఢిల్లీలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య ల‌క్షా27వేల వ‌ర‌కు చేరింది. అయితే వీరిలో దాదాపు ల‌క్షా 10వేల మంది కరోనా నుంచి రికవరీకాగా 3,745మంది మృత్యువాతపడ్డారు.

ప్రస్తుతం ఢిల్లీలో యాక్టివ్ కేసుల సంఖ్య 14,554 ఉన్నాయి. గ‌డిచిన 24గంట‌ల్లో దాదాపు వెయ్యి కొత్త కేసులు న‌మోదుకాగా 1400మంది రికవరీ అయ్యారు. ఈలెక్కన యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూపోతుంది. ప్ర‌స్తుతం ఉన్న 14వేల యాక్టివ్ కేసుల్లో ఆసుప‌త్రుల్లో చికిత్స పొందుతున్నవారు 4వేలమందికాగా మిగతా వారంగా స్వల్ప లక్షణాలతో హోంక్వారంటైన్లో ఉన్నారు. దీంతో ఆస్పత్రుల్లో ఉన్నవారు రికవరీ అయితే ఢిల్లీ క‌రోనా మహమ్మరిపై విజయం సాధించినట్లేననే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Also Read: ఓట్లు లేవు.. పార్టీకి నేతల పోట్లు మాత్రం ఉన్నాయి

అయితే కరోనాపై ఢిల్లీ విజయం సాధించడానికి ప్రధాన కారణంగా ప్లాస్మా థెరపీ అని తెలుస్తోంది. కరోనా బాధితులకు ఢిల్లీలో ఫ్లాస్మా థెరిపీ చేస్తుండటంతో రోగులంతా త్వరగా కోలుకుంటున్నారు. మరోవైపు కరోనా నుంచి కోలుకున్న వారు సైతం ప్లాస్మా దానం చేసేందుకు పెద్దసంఖ్యలో ముందుకొస్తుండటం కూడా ఒక కారణమని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే ఢిల్లీ కరోనా రహిత రాష్ట్రంగా మారుతుందనే ఆశాభావాన్ని ఢిల్లీవాసులు వ్యక్తం చేస్తున్నారు.

ఢిల్లీ మాదిరిగానే అన్ని రాష్ట్రాల్లో ఈ తరహా ప్రయోగాలు చేస్తే కరోనా బాధితులకు మేలు జరుగుతుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాస్మా థెరపీకి ముందుకొస్తాయో లేదో వేచి చూడాల్సిందే..!

పద్మం వికసించని నవరస నట సార్వభౌముడు !


కైకాల సత్యనారాయణ.. ఆయనొక నటసార్వభౌమ నవరసాల నటచక్రవర్తి.. నటనలో గొప్ప హుందాతనం, స్వరంలో ఘనమైన గాంభీర్యం.. మాటల్లో స్పష్టమైన తెలుగుతనం.. కర్కశమైన విలనిజానికి.. అలాగే భార్యకు భయపడే అతిసాధారణ భర్తగా.. యముడిగా.. నరకాసురుడిగా, రావణుడిగా, కీచకుడిగా, ఒక ఊరు పెద్దగా, మహాశివుడులో పరమ భక్తుడిగా ఇలా అనేక రకాలుగా సమస్త దక్షిణ భారత ప్రేక్షకుల ముందు ఒక గొప్ప నటుడిగా ప్రత్యక్షమయ్యే ఆ నట సార్వభౌముడు పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆ మహా నటసార్వభౌముడికి జన్మదినం శుభాకాంక్షలు తెలుపుకుందాం.

Also Read: పవన్ కళ్యాణ్, ట్రాప్ లో పడకండి

పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేసి, అందరి మన్ననలు పొందిన ఈ నవరసాల మేటి నటుడి గురించి ఎంత చెప్పినా త‌క్కువే. నటనలో ఆయనొక శిఖ‌రం, కెరీర్‌లో ఎన్నో విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల్లో న‌టించి తెలుగు ప్రేక్షకులను అలరించారు.. ఇంకా అలరిస్తూనే ఉన్నారు. కైకాల సత్యనారాయణ కృష్ణా జిల్లాలోని కౌతరం అనే గ్రామంలో 1935 జూలై 25న పుట్టారు. ఆయన ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్య కూడా గుడివాడలోనే సాగింది. గుడివాడ కళాశాల నుండే ఆయన పట్టభద్రుడయ్యారు. ఆయన 25వ ఏట నాగేశ్వరమ్మతో వివాహమైంది. ఆయనకు ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ఇక కైకాల భారత పార్లమెంటు సభ్యుడుగా కూడా పనిచేయడం విశేషం. ఇప్పటిదాకా కైకాల దాదాపు 779 సినిమాల్లో పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపదలలో అనేక వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించారు. ప్రతినాయక పాత్రల్లో అరితేరిపోయిన ఒక నటుడు, హాస్య పాత్రల్లో కూడా అద్భుతంగా రాణించడం అంటే గొప్ప అసాధారణమైన ప్రతిభే. అయితే మన సౌత్ సినీ పరిశ్రమలు ఆయనకు సరైన గౌరవం ఇవ్వలేదనే అనుకోవాలి. అంతటి మహానుభావుడికి ఇంకా పద్మశ్రీ లాంటి అవార్డ్ లు రాకపోవడం మన తెలుగు ప్రేక్షకులు చేసుకున్న దురదృష్టం.

Also Read: హాట్ బ్యూటీకి పోలీస్ క్యారెక్టర్ !

నిజానికి కైకాలగారి కంటే చాల జూనియర్స్ అయిన మోహన్ బాబు, బ్రహ్మానందం లాంటి నటులకు కూడా పద్మశ్రీలు ఇచ్చి.. ఇంకా ఈ విశ్వ నటసార్వభౌముడికి ఇవ్వకపోవడం పద్మశ్రీ లాంటి ఉన్నతమైన అవార్డులు చేసుకున్న దౌర్భాగ్యమే. ఆ అవార్డ్ ల స్థాయిని తగ్గించడమే. అయినా కైకాల సత్యనారాయణ గాంభీర్యం, ఆయన విలక్షణ పోషణ ముందు, ఆయన అసమాన నటనా కౌశలం ముందు ఎంతగొప్ప అవార్డ్ అయిన అతి సాధారణమైనదే.

కేసీఆర్ పై కోదండరాం పైచేయి సాధిస్తారా?


టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంపై ప్రతీసారి సీఎం కేసీఆర్ దే పైచేయి అవుతూ వస్తోంది. అయితే ఈసారి కోదండరాం వంతు వచ్చిందనే టాక్ విన్పిస్తోంది. వార్డు మెంబర్ గా కూడా గెలువలేడని సీఎం కేసీఆర్ గతంలో కోదండరాంను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్రదుమారం రేపాయి. దీంతో 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేసి తన సత్తా చూపించాలని కోదండరాం అనుకున్నారు. అయితే ప్రజాకూటమి రాజకీయ సమీకరణాల్లో భాగంగా నాడు కోదండరాం చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్నారు. అయితే ఇప్పుడు మళ్లీ ప్రత్యక్ష ఎన్నికల్లో సత్తాచాటేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

Also Read: బాబుకు శ్రావణమాసం టెన్షన్..!

తెలంగాణ ఉద్యమంలో కోదండరాం కీలకంగా వ్యవహరించారు. కేసీఆర్-కోదండరాంలు ఇద్దరు కూడా ఉద్యమానికి రెండుకళ్లలా వ్యహరించారు. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ సీఎం అయ్యారు. కోదండరాం కాంగ్రెస్ పార్టీకి సన్నిహితంగా ఉండటంతో కేసీఆర్, కోదండరాంల మధ్య కొద్దిరోజులు మాటలయుద్ధం నడిచింది. ఒకరిపై ఒకరు తీవ్రపదజాలంతో దూషించుకునేంత వరకు వెళ్లింది. ఉద్యమ సమయంలో టీజేఎస్ అధ్యక్షుడిగా కొనసాగిన కోదండరాం కిందటి ఎన్నికల్లో టీజేఎస్ పార్టీని ప్రకటించి కేసీఆర్ కు వ్యతిరేకంగా పని చేశారు.

ఈ సమయంలోనే కోదండరాం కనీసం వార్డుమెంబర్ గా కూడా గెలవలేని కేసీఆర్ వ్యాఖ్యలు చేయడం అప్పట్లో చర్చనీయాంశంగా మారాయి. దీంతో కోదండరాం గత ఎన్నికల్లో జనగామ నుంచి పోటీచేయాలని భావించారు. అయితే అది మాజీ మంత్రి, మాజీ పీసీసీ పొన్నాల లక్ష్మీనారాయణ నియోజకవర్గం కావడంతో రాజకీయ సమీకరణాల్లో భాగంగా ఆ సీటు చివరికీ పొన్నాలకే దక్కింది. దీంతో ఈ ఎన్నికల్లో కోదండరాం పోటీ చేయలేదు. దీంతో కేసీఆర్ వ్యాఖ్యలకు ప్రత్యక్షంగా కోదండరాం సమాధానం చెప్పలేకపోయారు. అయితే తాజాగా ఆయన ఎమ్మెల్సీ బరిలో నిలిచి కేసీఆర్ షాకిచ్చేందుకు రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Also Read: ఓట్లు లేవు.. పార్టీకి నేతల పోట్లు మాత్రం ఉన్నాయి

తెలంగాణలో వచ్చే ఫిబ్రవరి నాటికి రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. వాటిలో ఒకటి వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానంకాగా మరొకటి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ స్థానం. ఇందులో వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానం నుంచి కోదండరాం బరిలో నిలువాలని భావిస్తున్నారట. ప్రస్తుతం ఈ స్థానంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండగా మార్చినాటికి ఆయన పదవీకాలం ముగియనుంది.

ఈ ఎన్నికల్లో పట్టాభద్రులే ఓటుహక్కు వినియోగించుకోనుండటంతో ఇదే సరైన వేదికగా కోదండరాం భావిస్తున్నారు. ఉపాధ్యాయులు, విద్యావంతులు టీఆర్ఎస్ పాలనపై వ్యతిరేకంగా ఉండటం తనకు కలిసి వస్తుందని భావిస్తున్నారట. వరంగల్, ఖమ్మం, నల్గొండ ప్రాంతంలోని నేతలందరితో కోదండరాంకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో ఈ స్థానంలో పోటీచేస్తే తన గెలుపు ఖాయమని కోదండరాం భావిస్తున్నారట. తాను ఎమ్మెల్సీగా గెలిచి సీఎం కేసీఆర్ కు షాక్ ఇవ్వాలని కోదండరాం భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

గవర్నర్ వ్యవస్థతో జగన్ ని ఆపడం సాధ్యమేనా..!


తాను పునాది వేసిన రాజధాని అమరావతి, దానిని కదలకుండా చేసి…తన పేరు సార్ధకం చేసుకోవాలనేది చంద్రబాబు పట్టుదల. దానికి తోడు అమరావతి భూముల అవకతవకలు, అయినవారికి కట్టబెట్టిన ఆస్తుల లెక్కలు బయటకి రాకుండా ఉండాలంటే, రాజధాని మార్పు కానీ, సిఆర్డిఏ చట్టము రద్దు కానీ జరగకూడదు. దీనికోసం అసెంబ్లీ సాక్షిగా జగన్ ని వేడుకున్న బాబు…వినడని తెలుసుకొని తన దగ్గర ఉన్న ఒక్కొక్క ఆయుధం పదునుపెట్టి వదులుతున్నాడు. రాజధానిని వైజాగ్ కి తరలించకుండా ఎవరూ ఆపలేరని జగన్ గట్టి పట్టుదలతో ఉన్నారు. అందుకే ఉద్యమాలు జరిగినా, విమర్శల దాడి ఎక్కువైనా తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు.

Also Read: నాటి మంత్రులు.. నేడు ఎక్కడ ఉన్నారు?

ఇక ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో మూడు రాజధానుల తీర్మానం చేయడంతో పాటు, సీఆర్డీఏ బిల్లును రద్దు చేస్తూ బిల్లును ఆమోదించడం జరిగింది. కీలకమైన ఈ రెండు బిల్లులు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ వద్దకు చేరాయి. గవర్నర్ ఆమోదిస్తే జగన్ నిర్ణయానికి మార్గం సులభం అవుతుంది, దీనితో ఆయన వీలైనంత తొందరగా వైజాగ్ ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా మార్చివేస్తారు. ఒక వేళ గవర్నర్ ఆమోదం తెలుపకపోతే బాబుగారి అమరావతి ఉద్యమానికి మరింత బలం చేకూరినట్లు అవుతుంది.

Also Read: తెలంగాణ సర్కార్ కరోనా మరణాలను దాస్తోందా?

ఐతే గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటాడో స్పష్టత లేని నేపథ్యంలో జగన్ మరియు బాబు ఈ విషయంపైనే బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. తమ నిర్ణయాలకు వ్యతిరేకంగా గవర్నర్ నిర్ణయం ఉన్న నేపథ్యంలో వాడవలసిన అస్త్రాలేమిటి అనేది వారి ఆలోచనగా తెలుస్తుంది. మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా గవర్నర్ నిర్ణయం ఉన్నప్పటికీ జగన్ కి వచ్చిన నష్టం తక్కువే… కారణం… శాసన సభ చేసిన చట్టాలకు గవర్నర్ సూచనలు మాత్రమే ఇవ్వగలడు కానీ పూర్తిగా రద్దు చేయలేడు. ఒకసారి సూచనల తరువాత శాసన సభ మరలా ఆ బిల్లును గవర్నర్ అనుమతికి పంపితే ఆయన ఖచ్చితంగా ఆమోదించాల్సి ఉంటుంది. కాబట్టి చంద్రబాబు అండ్ టీమ్ కి ఈ విషయంలో ఆశాభంగం తప్పేలా లేదు. గవర్నర్ నేరుగా ఈ బిల్లులకు ఆమోదడం తెలిపితే మాత్రం జగన్ నిర్ణయానికి మరింత బలం చేరుకూరుతుంది. అలాగే ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టినట్లు అవుతుంది.

మీడియా ముందుకు ప్రధాని.. ఏం చెప్పబోతున్నారు?


ఈనెల 31తో ఆన్ లాక్ 2.0 ముగియనుంది. దీంతో ప్రధాని మరోసారి మీడియా ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. దీంతో ప్రధాని మోదీ దేశ ప్రజలకు ఏం చెబుతారనే ఆసక్తి నెలకొంది. మరోసారి లాక్ డౌన్ ఉంటుందా? లేదా ఆన్ లాక్ 3.0పైనే మరో ప్రకటన చేస్తారా? అనే చర్చ నడుస్తోంది. ఈనేపథ్యంలో ప్రధాని మోదీ సీఎంలతో మరోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వారి అభిప్రాయాలను తెలుసుకునేందుకు రెడీ అవుతున్నారు.

Also Read: నేపాల్ లో చైనా జోక్యాన్ని కమ్యూనిస్టులు ఖండించరా?

ప్రధాని మోదీ చివరిసారిగా జూన్ 16, 17తేదిల్లో అన్ని రాష్ట్రాల సీఎంలతో మాట్లాడారు. వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఆన్ లాక్ 2.0ను జూలై 31వరకు అమలు చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఆన్ లాక్ 2.0లో దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగిపోవడంతో కరోనా కట్టడి చేసేందుకు ప్రధాని మోదీ ఈనెల 27న సీఎంలతో మరోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. అయితే ఈసారి కేవలం మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సీఎంలతోనే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

దాదాపు నెలన్నర తర్వాత ప్రధాని మోదీ ఈ మూడు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడనుండటం ఆసక్తి రేపుతోంది. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తదితరులు పాల్గొననున్నారు. ఇందులో ప్రధానంగా అన్‌లాక్ 2.0పై రాష్ట్రాల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు. అనంతరం కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై పలు కీలక సూచనలు చేయనున్నారని సమాచారం. కాగా ఇటీవలే కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్‌ గౌబా తొమ్మిది రాష్ట్రాల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి ఆయా రాష్ట్రాల్లో కరోనాపై తీసుకోవాలని జాగ్రత్తలపై కీలక సూచనలు చేశారు.

Also Read: కాంగ్రెస్ చివరి అస్త్రాన్ని ప్రయోగిస్తుందా?

అయితే జూలై నెలలోనే దాదాపు 8లక్షల పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. దీంతో కరోనా కట్టడికి ప్రధాని మోదీ మరోసారి లాక్డౌన్ విధిస్తారా? లేక ఆన్ లాక్ 3.0కే మొగ్గుచూపుతారా? అనే ఆసక్తి నెలకొంది. దాదాపు నెలన్నర తర్వాత సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తుండటంతో ఈ భేటీకి ప్రాధాన్యతను సంతరించుకుంది. కరోనా విజృంభిస్తుండటం వేళ ప్రధాని మరోసారి మీడియా ముందుకు రానుండటంతో ఆయన ఏం ప్రకటన చేస్తారా? అనే ఆసక్తి అందరిలో నెలకొంది.