Homeఆంధ్రప్రదేశ్‌మంగళగిరి ఎమ్మెల్యే సైలెంట్ అయ్యాడెందుకు?

మంగళగిరి ఎమ్మెల్యే సైలెంట్ అయ్యాడెందుకు?


వైసీపీ పార్టీ స్థాపించిన నాటి నుండి జగన్ వెంట నడిచిన నాయకులలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఒకరు. వైసీపీ పార్టీ కోసం నిబద్ధతతో పని చేసిన నేతలలో ఆయన ఒకరు. గత ఐదేళ్ల టీడీపీ పాలనలో అక్రమాలను ఎండగట్టిన సమర్ధత గల నాయకుడు. టీడీపీ ప్రభుత్వంపై అనేక విషయాలపై ఆళ్ల రామకృష్ణా రెడ్డి అలుపెరగని న్యాయపోరాటం చేశారు. ఇక 2019 ఎన్నికలలో కూడా టీడీపీ ఓటు బ్యాంకు అధికంగా ఉన్న మంగళగిరిలో సాక్షాత్తు టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ పై పోటీ చేసి గొప్ప విజయాన్ని అందుకున్నారు. ఆళ్ల రామకృష్ణా రెడ్డిని గెలిపిస్తే రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రిని చేస్తాను అని మంగళగిరి ప్రజలకు వై ఎస్ జగన్ హామీ ఇచ్చారు.

Also Read: రాజధాని రైతులపై పవన్ కి చిత్తశుద్ధి ఉందా?

ప్రభుత్వం ఏర్పడిన తరువాత సామాజిక సమీకరణాల లెక్కలలో ఆళ్ల రామకృష్ణ రెడ్డికి మంత్రి పదవి దక్కలేదు. అధినేత పట్ల విధేయత కలిగిన నాయకుడిగా ఆళ్ల రామకృష్ణ రెడ్డి జగన్ నిర్ణయాన్ని గౌరవించి, మౌనంగా ఉండిపోయారు. ఐతే మూడు రాజధానుల జగన్ నిర్ణయం ఆళ్ల రామకృష్ణ రెడ్డికి తలనొప్పి తెచ్చిపెట్టింది. రాజధాని అమరావతిని ఆనుకొని ఉన్న మంగళగిరి ప్రజలకు మూడు రాజధానుల నిర్ణయం రుచించే అంశం కాదు . పక్కనే ఉన్న రాజధానిని తరలించడం వలన ఆ ప్రాంత ప్రజల ప్రయోజనాలు దెబ్బతింటాయి అనేది అక్షర సత్యం. దీనితో అటు జగన్ నిర్ణయానికి ఎదురు చెప్పలేక, ప్రజలకు నచ్చ చెప్పుకోలేక సతమతం అవుతున్నారు.

Also Read: గవర్నర్ వ్యవస్థతో జగన్ ని ఆపడం సాధ్యమేనా..!

ఈ మధ్య కాలంలో జగన్ కార్యక్రమాలపై గాని, ప్రత్యర్థుల విమర్శలపై కానీ ఆళ్ల రామకృష్ణ రెడ్డి స్పందించిన సంధర్భం లేదు. ఒకప్పుడు ప్రతి విషయంపై ప్రెస్ మీట్స్ పెట్టి ప్రత్యర్థులను హడలగొట్టిన ఆళ్ల ఇలా సైలెంట్ కావడం వైసీపీ వర్గాలకు నచ్చడం లేదు. మంత్రి పదవి విషయంలో ఆళ్ల బయటపడకున్నా అసంతృప్తితో ఉన్నారని ఆయన అనుచరుల ద్వారా అందుతున్న సమాచారం. రెండున్నరేళ్ళ తరువాత క్యాబినెట్ పూర్తి స్థాయిలో మార్చి వేసి కొత్తవారికి అవకాశం ఇస్తాం అని జగన్ చెప్పడం జరిగింది. మరి వచ్చే రెండున్నరేళ్లలో నైనా ఆళ్ళకు సీఎం జగన్ మంత్రి పదవి ఇచ్చి లోలోపల ఉన్న అసహనానికి చెక్ పెడతాడేమో చూడాలి.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular