Home Blog Page 8389

రికార్డుల ‘మగధీర’కు 11 ఏళ్లు


రెండు జాతీయ అవార్డులు, ఏడు ఫిల్మ్ ఫేర్ అవార్డులు, తొమ్మిది నంది పురస్కారాలు… వంద కోట్ల కలెక్షన్స్‌.. మరెన్నో రికార్డులు.. ఇదీ స్టార్ డైరెక్టర్ ఎస్‌ఎస్‌ రాజమౌళి, రామ్‌ చరణ్‌ కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ హిట్‌ మూవీ ‘మగధీర’ ట్రాక్‌ రికార్డు. ఈ చిత్రం విడుదలై ఈ రోజు (శుక్రవారం)తో 11 ఏళ్లు పూర్తయింది. 2009లో జులై 31వ తేదీని విడుదలైన ఈ యాక్షన్‌, రొమాంటిక్‌ డ్రామా ఎంత పెద్ద హిట్‌ అయిందో అందరికీ తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌కు ఇది రెండో చిత్రమే. అయినా అతను ఎంతో పరిణతితో నటించాడు. హర్ష పాత్రలో అల్లరి ప్రేమికుడిగా. కాలభైరవ పాత్రలో పోరాట యోధుడిగా మెప్పించాడు. తన డ్యాన్స్, ఫైట్స్‌తో ఆల్‌రౌండ్‌ షో చేశాడు. అంతకుముందే పలు చిత్రాల్లో నటించిన హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌కు మగధీర బ్రేక్‌ ఇచ్చింది. తెరపై చెర్రీ, కాజల్‌ కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఈ మూవీ తర్వాత ఇద్దరికీ స్టార్డమ్‌ వచ్చింది.

Also Read: మహేష్‌… ఆ వైబ్రేషన్స్‌ మొదలై 21 ఏళ్లు

తనకు ఏడో చిత్రమైన ఈ మూవీని రాజమౌళి ఎప్పట్లాగే ప్యాషనేట్‌గా తీశాడు. పునర్జన్మల నేపథ్యంలో తండ్రి విజయేంద్ర వర్మ ఇచ్చిన అద్భుతమైన స్టోరీని అంతకంటే అద్బుతంగా తెరకెక్కించాడు రాజమౌళి. దాంతో, అప్పటిదాకా ఉన్న తెలుగు ఫిల్మ్‌ బాక్సాఫీస్‌ రికార్డులను బద్దలు కొట్టిన మగధీర సరికొత్త బెంచ్‌ మార్క్‌ క్రియేట్‌ చేసింది. రాజమౌళి తీస్తున్నది కావడంతో రిలీజ్‌ ముందే ఈ మూవీకి భారీ హైప్‌ ఏర్పడింది. విడుదయ్యాక రాజమౌళి పేరు మార్మొగింది. సినిమా పాటలు కూడా సూపర్ హిట్‌ అయ్యాయి. ఎంఎమ్ కీరవాణి సంగీతం, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోరు సినిమాకు మరింత ప్లస్‌ అయింది. బంగారు కోడిపెట్ట రీమేక్‌తో పాటు పంచదార బొమ్మ, ధీర ధీర పాటలైతే చాన్నాళ్లు ట్రెండింగ్‌లో ఉన్నాయి. బంగారు కోడిపెట్ట సాంగ్‌లో చిరంజీవి గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఇచ్చాడు. ఇక, ఈ మూవీలో దేవ్‌ గిల్‌ చేసిన విలన్‌ పాత్ర, దివంగత శ్రీహరి చేసిన షేర్ ఖాన్‌ పాత్రలు కూడా హైటైల్‌ అయ్యాయి. సెంథిల్‌ కుమార్ సినిమాటోగ్రఫీ, పీటర్హెయిన్స్‌ స్టంట్స్‌ ముఖ్యంగా వంద మందిని చంపే యుద్ధం, గుర్రపు స్వారీ సీక్వెన్స్‌లు ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేశాయి. ఇలా అన్నీ పర్ఫెక్ట్‌గా కుదరడంతో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్‌, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ 35 కోట్లతో మగధీర తీస్తే ఏకంగా 100 కోట్ల రాబట్టింది.

Also Read: స్టైలిష్‌ స్టార్+ సక్సెస్‌ఫుల్‌‌ డైరెక్టర్.. క్రేజీ కాంబో

ఇంతటి ఘన విజయం సాధించి తన కెరీర్ను మలుపు తిప్పిన మగధీర రిలీజై 11 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని హీరో రామ్‌ చరణ్‌ గుర్తు చేసుకున్నాడు. ‘ఇది నా కెరీర్లో మధురమైన జ్ఞాపకం. నన్ను చాలా మార్చిన, నాలోని ప్రతి ప్రతిభకు పరీక్ష పెట్టిన సినిమా ఇది. మగధీర చిత్ర బృందం, ఆడియన్స్‌ చూపించిన ప్రేమానురాగాలకు నేను విధేయుడై ఉంటాను. రాజమౌళి గారు.. మీరు నా సామర్థ్యానికి మించి పని చేసేలా ప్రోత్సహించారు. ఆ కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుందని చెప్పారు’ అని ట్వీట్‌ చేశాడు. ఆ మూవీలో పలు వర్కింగ్ స్టిల్స్‌తో పాటు పోస్టర్లతో రూపొందించిన ఓ స్పెషల్‌ వీడియోను కూడా పోస్ట్‌ చేశాడు. కీరవాణి, సెంథిల్‌కుమార్ తదితరులు కూడా మగధీరను గుర్తు చేసుకున్నారు.

https://twitter.com/AlwaysRamCharan/status/1289092827985539078

ఏపీలోనూ పీవీ పేరు మార్మోగనుందా?


మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా మరోసారి దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారారు. పీవీ బ్రతికున్నప్పుడు.. చనిపోయిన తర్వాత కూడా ఆయన మావాడు కాదని దూషించిన వాళ్లే నేడు ఆయనను వేయినోళ్ల పొగుడుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ పీవీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత సీఎం కేసీఆర్ పీవీ విషయంలో మనస్సు మార్చుకున్నాడు. తెలంగాణ వాడైన పీవీ ప్రధాని కావడం గొప్పవిషయమని ఆయన శతజయంతి ఉత్సవాలను ఏడాదిపాటు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పీవీని తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా మలుచుకొని జాతీయ స్థాయిలో కేసీఆర్ చక్రం తిప్పేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నారు.

Also Read: రంజుగా అరకు రాజకీయం..!

సీఎం కేసీఆర్ పీవీని తమ నేతగా మలుచుకోవడంతో కాంగ్రెస్ అలర్టయింది. స్థానిక నేతలు కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతో పీవీని ఎన్నడూ పొగడని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఆయన సేవలను ప్రశంసిస్తూ తెలంగాణ నేతలకు లేఖ రాశారు. ఈ లేఖలను పీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చదివి విన్పించారు. అయితే పీవీ బ్రతికున్న రోజుల్లోనూ ఆయనపై కుట్రలు చేసి, ఆయన చనిపోయిన తర్వాత పీవీ ఇమేజ్ తమకు అవసరం లేదనుకున్న నేతలు ఇప్పుడు పీవీ నామస్మరణ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

తెలంగాణలో పీవీ మావాడంటే.. మావడని కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు కొట్లాడుకుంటున్నారు. పీవీ తెలంగాణకు చెందిన వాడు కావడంతో ఆయన ఇమేజ్ ఎవరికీవారు క్యాష్ చేసుకునేందుకు తహతహలాడుతోన్నారు. సీఎం కేసీఆర్ పీవీ కూతురుకు ఎమ్మెల్సీ ఆఫర్ ఇవ్వనున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే ఏపీలోనూ పీవీ నర్సింహారావు పేరు త్వరలో మార్మోగడం ఖాయమనే టాక్ విన్పిస్తుంది. ఏపీ సీఎం జగన్ నూతన ఏర్పాటు చేయబోయే జిల్లాలకు పీవీ పేరును పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామరావు పేరును ఓ జిల్లాకు సీఎం జగన్ పెట్టానున్నారని టాక్ విన్పిస్తోంది. దీని వల్ల జగన్ పేరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు చిరకాలం గుర్తిండిపోనుంది.

Also Read: టీడీపీ కోవర్టుల చీటీ చిరిగేలా ఉందే..!

తెలంగాణవాడు, తెలుగువాడైన పీవీ పేరును ఏపీలోని జిల్లాకు పెట్టడం ద్వారా సీఎం జగన్ దివంగత రాజశేఖర్ లా తెలంగాణవారికి మరింత దగ్గరవడం ఖాయమనే ప్రచారం జరుగుతుంది. ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడంతో తెలంగాణలోనూ వైసీపీ బలపర్చాలని జగన్ భావిస్తున్నారు. పీవీ పేరు ఏపీలోని జిల్లాకు పెట్టడంతో ద్వారా తెలంగాణలోనూ వైసీపీకి మరింత మైలేజ్ రావడం ఖాయమని వాదనలు విన్పిస్తుంది. దీంతో సీఎం జగన్ కొత్తగా ఏర్పడనున్న జిల్లాల్లో ఒక జిల్లాకు పీవీ పేరు పరిశీలిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రభుత్వం త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంతవరకు మనం వేచి చూడాల్సిందే..!

ఇంతలోనే అంత మార్పు ఏంటబ్బా..!


రాజకీయ పార్టీలో వ్యక్తులు మారతారు… కాని సిద్ధాంతాలు మారవని నాయకులు తరచూ చెబుతుంటారు. నిర్ణీత కాలంలో పార్టీ అధ్యక్షులు, ఇతర ముఖ్యనాయకులు మారినా పార్టీ సిద్ధాంతాల ప్రకారమే వారు నడుస్తారు. బీజేపీ వ్యవహారంలో మాత్రం అలా జరగడం లేదు. పార్టీలో వ్యక్తులు మారినప్పుడల్లా సిద్ధంతాలు మారిపోతున్నాయి. ఒక్కోక్కరికి ఒక సిద్ధాంతం ప్రాధాన్యత ఉంటే… మరోకరు వచ్చినప్పడు మరో సిద్ధంతానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో బీజేపీ నూతన అధ్యక్షుడు వెల్లడించిన విషయాలు ఇదే రకంగా ఉండటం ఇప్పుడు చర్చనీయాశంగా మారింది.

Also Read: మీడియాకు చంద్రబాబు ఎంత పంచాడో తెలుసా?

బీజేపీలో నిన్నటి వరకూ అధ్యక్షుడిగా కొనసాగిన కన్నా లక్ష్మీనారాయణ రాజధాని అమరావతికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. రాజధాని అమరావతి నుంచి తరలించకుండా ఉండేందుకు తన వంతు ప్రయత్నం చేశారు. రాజధాని రైతుల నిరసన దీక్షలకు సంఘీభావం తెలిపారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయడం, ఇటీవల పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు అమోదం కోసం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వద్దకు చేరడంతో ఆ రెండు బిల్లులను ఆమోదించవద్దని గవర్నర్ కు లేఖ రాశారు.

రెండు రోజుల కిందట కొత్తగా బాధ్యతలు చేపట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మాత్రం రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని మీడియాకు స్పష్టం చేశారు. రాజధాని ఎక్కడ ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమని, నాడు చంద్రబాబు అమరావతిని ఎంపిక చేసినప్పుడు కేంద్రం జోక్యం చేసుకోలేదని, ప్రస్తుతం జోక్యం చేసుకోదని తెలిపారు. అమరావతికి భూములు ఇచ్చిన రైతులు నష్టపోకుండా పోరాటం చేస్తామని మాత్రం ఆయన చెప్పుకొచ్చారు. దీంతో ఇంతలో బీజేపీ పార్టీలో ఎంత మార్పు వచ్చిందని రాజధాని ప్రాంత వాసులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

Also Read: రంజుగా అరకు రాజకీయం..!

బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నాను తప్పించి ఆయన స్థానంలో సోము వీర్రాజును నియమించిందనే వాదనులు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. సోము వీర్రాజు వాఖ్యలు ఈ వాదనలు నిజమే అనేవిగా ఉండటం విశేషం. మరోవైపు బీజేపీ-జనసేన కూటమి తృతీయ ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని సోము చెబుతున్నారు. వైసీపీకి అనుకూలంగా నడుస్తూపోతుంటే తృతీయ కూటమిగా బలపడేదెప్పుడన్నదే ప్రశ్నార్ధకంగా మారింది.

మరోవైపు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి మాత్రం ఇందుకు భిన్నంగా వ్యాఖ్యానించారు. అమరావతి విషయంలో కేంద్రం జోక్యం చేసుకుటుందని స్పష్టం చేశారు. శాసన మండలి ఆమోదించని బిల్లులను గవర్నర్ ఆమోదించడానికి వీలు లేదని, వీటిని రాష్ట్రపతికి పంపాలని అన్నారు. ఆయన అమరావతికి పూర్తి అనుకూలంగా మాట్లాడారు. బీజేపీ నాయకుల మధ్య రాజధాని అమరావతి విషయంలో పరస్పర వైరుద్య భావాలు, అభిప్రాయాలు నెలకొన్నాయి. వీటిని పరిష్కరించాల్సిన బాధ్యత ఆ పార్టీ జాతీయ నాయకత్వానిదే.

మీడియాకు చంద్రబాబు ఎంత పంచాడో తెలుసా?


మీడియా అంతా చంద్రబాబు సీఎంగా రావాలని ఎందుకు కోరుకుంటారో ఇప్పుడు తెలిసింది. ఏపీ సీఎం జగన్ పర్యటనలో మీడియాకు అంతగా ప్రకటనలు ఇవ్వడం లేదు. కానీ చంద్రబాబు మాత్రం సీఎంగా ఉన్నన్నీ రోజులు నెలకోసారి సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున మీడియాకు ప్రకటనలు గుప్పించారు. మీడియాపై ఎంతో ప్రేమను చూపే నాయకుడు చంద్రబాబు అనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగు రాష్ట్రాల్లోని పలు మీడియా హౌస్ లకు హాట్ ఫేవరేట్ అని అందరికీ తెలిసిన విషయమే..

Also Read: జల వివాదాల పరిష్కారంపై ముఖం చాటేస్తున్న కేసీఆర్

చంద్రబాబు తన పాలనలో మీడియాకు పెద్ద ఎత్తున ప్రకటనలు ఇవ్వడం ద్వారా వారికి ప్రోత్సహాన్నిచ్చాడు. ఎందుకంటే చంద్రబాబు చేసిన ప్రతి చిన్న పనికి ప్రచారం అవసరం. అతను తన పాలనలో భారీ మీడియా కవరేజీని పొందడానికి పెద్ద ఎత్తున మీడియాకు ప్రకటనలు ఇచ్చాడని తాజాగా లెక్కలు చెబుతున్నాయి.

ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవీకాలం ముగిసిన చివరి సంవత్సరంలో టిడిపి చీఫ్ భారీగా ప్రకటనలు గుప్పించారు. సాధారణ ఎన్నికలు వేగంగా సమీపిస్తున్నందున ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి తాను ప్రారంభించిన వివిధ ప్రజాదరణ పథకాలపై ప్రకటనలపై డబ్బును కుమ్మరించారని లెక్కలు చెబుతున్నాయి. మీడియా కూడా బాబు విజయాలను హైలైట్ చేసింది. అతని సమావేశాలకు విస్తృతమైన కవరేజ్ ఇచ్చింది. అతనితో ప్రత్యేక ఇంటర్వ్యూలు చేసింది. చంద్రబాబు పందేరంలో ఛానెల్‌లు వార్తాపత్రికల కంటే ఎక్కువ డబ్బు సంపాదించాయి.

Also Read: టీడీపీకి మరో కోలుకోలేని షాక్‌

ఏప్రిల్ 2018- మార్చి 2019 మధ్య గత చంద్రబాబు ప్రభుత్వం నెలకు రూ .5 లక్షల నుండి 50 లక్షల వరకు ఛానెళ్లకు భారీ ప్రకటనలు ఇచ్చిందని నివేదికలు చెబుతున్నాయి. టిడిపి అనుకూల ఛానెళ్లైన ఏబిఎన్-ఆంధ్రజ్యోతి, ఈటివి, టివి9, టివి5, ఎన్‌టివిలకు నెలకు రూ .50 లక్షల మేరకు ప్రకటనలు ఇచ్చారు.

కొన్ని ఛానెళ్లకు రూ.25 లక్షల విలువైన ప్రకటనలు లభించగా.. మరికొన్నింటికి నెలకు రూ.10 లక్షల నుంచి 30 లక్షలు చెల్లించారు. వైఎస్‌ఆర్‌సి చీఫ్ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి యాజమాన్యంలోని సాక్షి టెలివిజన్ ఛానెల్‌కు సైతం నెలకు రూ .10 లక్షలు ఇవ్వడం ఆశ్చర్యపరిచే నిర్ణయం. చంద్రబాబు ఈ ఛానెళ్లలో చాలా మందికి చాలా దగ్గరైన నేత. ఎందుకంటే అప్పటి ప్రభుత్వం ఇచ్చిన యాడ్స్ డబ్బు కారణంగా ఎన్నో చానెల్స్ బాగుపడ్డాయి. అందుకే చంద్రబాబు అంటే మీడియాకు ఎంత ప్రేమో దీనిద్వారా తెలిసింది.

స్టైలిష్‌ స్టార్+ సక్సెస్‌ఫుల్‌‌ డైరెక్టర్.. క్రేజీ కాంబో


రైటర్ నుంచి మెగాఫోన్‌ పట్టి ఫుల్‌ సక్సెస్‌లో దూసుకెళ్తున్న దర్శకుడు కొరటాల శివ. యూత్‌, మాస్‌ తో పాటు క్లాస్‌ ఆడియన్స్‌ను కట్టిపడేస్తూ ఫుల్‌ జోష్‌లో ఉన్న హీరో అల్లు అర్జున్‌. వీరిద్దరివీ భిన్న కోణాలు. సక్సెసే కాదు సెన్సిబుల్‌ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నాడు శివ. సమకాలీన రాజకీయలపై పరిజ్ఞానం, సామాజిక స్పృహ ఉన్న అతి కొద్ది మంది డైరెక్టర్లలో ఒకడు. తన ప్రతీ సినిమాలో సమాజానికి ఏదో ఒక సందేశం ఇవ్వడం కొరటాల స్టయిల్. అదే టైమ్‌లో హీరోయిజాన్ని ఎలావేట్‌ చేయడంలో దిట్ట. కమర్షియల్‌ హంగులూ పర్ఫెక్ట్‌గా ఉండేలా చూసుకుంటాడు. పది బ్లాక్‌బస్టర్ హిట్స్ తీయడమే తన టార్గెట్‌ అని చెప్పే శివ.. ఇప్పటికే నాలుగు పూర్తి చేశాడు. మిర్చితో డైరెక్టరగా పరిచయమై ఫస్ట్‌ మూవీతోనే తన స్టామినా ఏంటో టాలీవుడ్‌కు చూపించాడు. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్‌, భరత్‌ అనే నేను మూవీస్‌ విజయాలు శివను సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్గా చేశాయి. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘ఆచార్య’తో ఐదో హిట్‌ కొట్టే ప్రయత్నంలో ఉన్నాడు.

Also Read: బాలీవుడ్ హీరోయిన్ కావాలంటే ‘రష్మికా’ని తీసేయ్

మరోవైపు బడా నిర్మాత అల్లు అరవింద్‌ వారసుడిగా టాలీవుడ్‌లో ఈజీగానే ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ విజయాలు సాధిస్తున్నాడు. ట్రెండ్‌కు తగ్గట్టుగా బాడీని, బాడీ లాంగ్వేజ్‌ను మార్చుకుంటూ టాలీవుడ్‌లో ఓ టాప్‌ హీరోగా వెలుగొందుతున్నాడు. యాక్టింగ్‌, డ్యాన్స్‌, ఫైట్స్‌లో తనదైన స్టయిల్‌ క్రియేట్‌ చేసుకున్న బన్నీ.. అన్ని వర్గాల ఆడియన్స్‌ మెప్పు పొందాడు. రీసెంట్‌గా ‘అల వైకుంఠపురములో’తో కెరీర్ బెస్ట్‌ హిట్‌ అందుకున్నాడు.

Also Read: ‘రొమాంటిక్’లో ‘ఎన్టీఆర్ అత్త’ !

‘నా పేరు సూర్య’ మినహాయిస్తే అల్లు వారి వారసుడు ఇప్పటిదాకా లవ్‌ స్టోరీస్‌, రొమాంటిక్‌ థ్రిల్లర్స్‌ మాత్రమే చేశాడు. ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్‌లో ‘పుష్ప’లో గంధం చెక్కల స్మగ్లర్గా డిఫరెంట్‌ లుక్‌లో కనిపించబోతున్నాడు. ఇప్పుడు సోషల్‌ మెసేజ్‌ ఇచ్చే మూవీ చేయబోతున్నాడు. బన్నీ, కొరటాల శివ కాంబినేషన్లో మూవీ రాబోతోంది. దీనిపై శుక్రవారం అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చింది. బన్నీ స్నేహితులు సుధాకర్ మిక్కిలినేని, సాండీ, స్వాతి, నట్టీ ఈ మూవీకి ప్రొడ్యూసర్స్‌. ఈ పాన్‌ ఇండియా మూవీ 2022 మొదట్లో పలు భాషల్లో రిలీజ్‌ కానుంది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా బన్నీ ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు. తన 21వ సినిమాను కొరటాలతో చేస్తున్నందుకు సంతోషంగా ఉందని, ఆయనతో పని చేసేందుకు ఆతృతగా ఉన్నానని ట్వీట్‌ చేశాడు. ఆచార్య, పుష్ప షూటింగ్స్‌ కంప్లీట్‌ అయిన తర్వాత ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. జోరుమీదున్న బన్నీ, శివ క్రేజీ కాంబో నుంచి పక్కా హిట్‌ ఆశించవచ్చు.

రంజుగా అరకు రాజకీయం..!


ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు జగన్ సర్కార్ శ్రీకారం చుట్టింది. జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతీ పార్లమెంట్ నియోజకర్గ కేంద్రాన్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఈమేరకు ప్రభుత్వం సీఎస్ ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి కొత్త జిల్లాల ప్రక్రియను వేగవంతం చేస్తోంది. ఆయా జిల్లాలోని రెవిన్యూ అధికారులతో అధికారులు సమీక్షలు నిర్వహించి ఇప్పటికే ప్రభుత్వం అన్ని మండలాలకు సంబంధించిన నివేదికలను తెప్పించుకుంది. ఆయా జిల్లాలో వస్తున్న డిమాండ్ల మేరకు ప్రభుత్వం జిల్లాల విభజన చేపట్టేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది.

Also Read: టీడీపీకి మరో కోలుకోలేని షాక్‌

కొత్త జిల్లాల తేనెతుట్టును జగన్ సర్కార్ కదపడంతో తమ నియోజకవర్గాన్ని జిల్లాగా చేయాలని పెద్దఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. అలాగే తమ ప్రాంతాన్ని ఇతర నియోజకవర్గాల్లో కలుపొద్దంటూ వ్యతిరేకతలు కూడా విన్పిస్తున్నాయి. దీంతో ప్రభుత్వానికి కొత్త సమస్యలు ఏర్పడేలా కన్పిస్తున్నాయి. అయితే కొత్త జిల్లాల ఏర్పాటు కొందరి సంతోషాన్నిస్తుండగా మరికొందరికీ కంటగింపుగా మారుతోంది. ప్రతిపక్ష పార్టీల నేతలతోపాటు అధికార పార్టీల నేతలకు కొత్త జిల్లాల ఏర్పాటుతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి విన్నపం మేరకు అరకును కొత్త జిల్లాగా ఏర్పాటు చేసేందుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే అరకును రెండు జిల్లాలు విభజించాలనే ప్రతిపాదన కూడా ఉంది. అరకు విజయనగరంలో పరిధిలో ఉండటంతో ఈ ప్రాంతంలో మంత్రి బోత్స సత్యనారాయణ మంచిపట్టుంది. దీంతో కురుసాం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీవాణిపై బోత్స పైచేయి సాధిస్తూ వస్తున్నారు. అన్నివిషయాల్లో బోత్స కలుగజేసుకుండటంతో ఆమె ప్రాధాన్యత తగ్గుతుందని విజయసాయి గతంలో ఆవేదన చెందినట్లు సమాచారం.

Also Read: జల వివాదాల పరిష్కారంపై ముఖం చాటేస్తున్న కేసీఆర్

విజయనగరం అసెంబ్లీ పరిధిలోని పార్వతీపురం, కురుసాం, సాలురులు అరకులో కలువనున్నాయి. అరకు జిల్లాగా ఏర్పడితే ఈ ప్రాంతం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీవాణి ఇక్కడ బలమైన నేతగా మారిపోనున్నారు. ఈ ప్రాంతంలో శ్రీవాణిని చెక్ పెట్టేందుకు బోత్స గతంలోనే టీడీపీకి చెందిన మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శోభా స్వాతిరాణిని పార్టీలోకి తీసుకొచ్చారు. అరకు జిల్లా ఏర్పాటుతో బొత్స కేవలం విజయనగరం పరిధికే పరిమితం అవాల్సి ఉంటుంది. దీంతో శ్రీవాణికి బోత్స నుంచి అడ్డంకులు తొలిగిపోనున్నాయి. ఈ పరిణామం బోత్సకు కంటగింపుగా మారుతుండగా శ్రీవాణికి మాత్రం కలిసిరానుంది.

టీడీపీ కోవర్టుల చీటీ చిరిగేలా ఉందే..!

Three crore offer to Mla to keep the party unchanged
Three crore offer to Mla to keep the party unchanged


టీడీపీకి అన్ని దారులు మూసుకుపోయిన వేళ, బీజేపీలో కొనసాగుతున్న ఆయన కోవర్టులకు కూడా గడ్డుకాలమే అన్నమాట గట్టిగా వినిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియామకం తరువాత రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. గత నాలుగు రోజులుగా సోము వీర్రాజు వ్యాఖ్యలు, ముక్కుసూటి సమాధానాలు అధికార వైసీపీ కంటే టీడీపీని కలవరపెట్టేవిగా ఉండడం విశేషం. ఇక రాజధాని విషయంలో అయన వైఖరి వైసీపీ నిర్ణయానికి అనుకూలంగా ఉండగా, టీడీపీ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయ్యింది. రాష్ట్ర రాజధాని నిర్ణయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అంశమే అని ఆయన కుండబద్దలు కొట్టారు. దీనితో కనీసం కేంద్ర జోక్యంతో మూడు రాజధానుల ప్రతిపాదన అడ్డుకోవాలని చూసిన టీడీపీ ప్రభుత్వానికి చివరి ఆశకూడా ఆవిరైపోయింది.

Also Read: కేశినేనిపై అసమ్మతి.. ఆయన కూతురే టార్గెట్..!

కాగా సోమువీర్రాజు దూకుడు చూశాక, బీజేపీలో కొనసాగుతున్న టీడీపీ కోవర్టులకు కాలం చెల్లినట్లే అన్న వాదన వినిపిస్తుంది. కేంద్ర అనుమతి లేకుండా జగన్ రాజధానిని కదిలించలేరని సుజానా చౌదరి సవాలు చేసిన గంటల వ్యవధిలో సోము వీర్రాజు ఇచ్చిన స్టేట్మెంట్, బీజేపీలో సుజనా స్థానం ఏమిటో తెలియజేసింది. రాష్ట్రంలో వైసీపీ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంతో చంద్రబాబుకు ఆర్థిక వనరులు సమకూర్చే రాజ్యసభ సభ్యులైన సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ వంటి వాళ్ళని బాబు ముందు చూపుతో బీజేపీలోకి పంపించారు. బీజేపీలో వీరు చేరడానికి అసలు కారణాలు ప్రజలందరికీ తెలుసు. టీడీపీ ప్రభుత్వంలో వీరు చేసిన ఆర్థిక నేరాల చిట్టా బయటపడుతున్న క్రమంలో తమనుతాము కాపాడుకోవడానికి, టీడీపీకి కొమ్ముకాయడానికి బీజేపీ పంచన చేరారు.

Also Read: నిమ్మగడ్డ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం..!

ఇక పార్టీ మారినా వీరి లక్ష్యాలు, ఆశించే ప్రయోజనాలు ఒకటే. చంద్రబాబు సంక్షేమమే ధ్యేయంగా వీరి రాజకీయం సాగింది. ముఖ్యంగా సుజనా చౌదరి బీజేపీలో ఉంటూ టీడీపీ గళం వినిపిస్తున్నారు. టీడీపీ అనుకూలుడుగా విమర్శలు ఎదుర్కొన్న కన్నా బీజేపీ రాష్ట్ర అధ్యాకుడిగా ఉన్నంత కాలం, సుజనా ఆరోపణలు, వ్యాఖ్యలకు బలం చేకూరింది. సోము వీర్రాజు రాక తరువాత ఆయన స్వరం, బీజేపీ స్వరం వేరుగా వినిపిస్తున్నాయి. తాజా పరిణామాలు చూస్తుంటే బీజేపీలో ఉన్నప్పటికీ సుజనా, సీఎం రమేష్ వంటి నాయకుల ఆర్థిక నేరాలు బయటపెట్టే అవకాశం కలదన్న మాట వినిపిస్తుంది. వీరి అరెస్టులు కానీ జరిగితే చంద్రబాబు ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టినట్లు అవుతుంది. బాబుకు మాత్రం తాజా పరిణామాలు కునుకు లేకుండా చేస్తున్నాయి.

జల వివాదాల పరిష్కారంపై ముఖం చాటేస్తున్న కేసీఆర్

CMKCR


రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాల పరిష్కారానికి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చొరవ తీసుకొని ఆగష్టు 5న ఎపెక్స్ మండలి సమావేశం ఏర్పాటు చేస్తే ఈ సమావేశంపై ముఖం చాటేయడం ద్వారా వివాదాల పరిష్కారం పట్ల తనకు ఆసక్తి లేదనే సంకేతం ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఇచ్చిన్నట్లు అయింది. పైగా వివాదాలు పరిష్కరించడం లేదని కేంద్రాన్ని నిందించడం ఆయన ద్వంద ధోరణులను వెల్లడి చేస్తుంది.

Also Read: కాంగ్రెస్ వైపు చూస్తున్న డీఎస్?

ఇటువంటి వివాదాల పరిష్కారంపై గల అత్యున్నత చట్టబద్ధ సంస్థ ఇదే. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి సమక్షంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొని వివాదాల గురించి పరస్పరం తమ అభిప్రాయాలు చెప్పుకొనే అవకాశం ఉంటుంది. వివాదాల పరిష్కారం పట్ల కేసీఆర్ లో ఆత్రుత వ్యక్తం కావడం లేదు.

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలు తామిద్దరమే పరిష్కరించుకొంటామని, బైటవారి జోక్యం అవసరం లేదని అంటూ గత ఏడాది ఒకటికి మూడు సార్లు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రశేఖరరావు అధికారిక నివాసంలో గత ఏడాది సమావేశాలు జరిపి ప్రకటించారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు సహితం సమాలోచనలు జరిపారు.

అయితే ఇప్పటి వరకు ఒక వివాదాన్ని కూడా పరిష్కరించుకొనే ప్రయత్నం వారిద్దరూ చేయనే లేదు. పైగా ఈ సమావేశాలను అర్ధాంతరంగా ముగించివేసి, ఆ తర్వాత ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకోవడం ప్రారంభించారు. కృష్ణ, గోదావరి నదుల యాజమాన్య బోర్డులకు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. పొరుగు రాష్ట్రం అక్రమంగా జలాలను ఉపయోగించుకొనే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపణలు చేసుకున్నారు.

అంతేకాదు, ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ముందుగా అనుమతి లేకుండా సాగునీటి పధకాలను చేపడుతున్నట్లు కూడా ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారు. అయితే ముందుగా 2014 తర్వాత చేబడుతున్న సాగునీటి పధకాలకు సంబంధించిన సవివర ప్రాజెక్ట్ రిపోర్ట్ లను ఇవ్వమని గోదావరి, కృష్ణ బోర్డులు రెండు రాష్ట్రాలను పలుసార్లు కోరినా, ఒక్క ప్రాజెక్ట్ కు సంబంధించిన రిపోర్ట్ ను కూడా ఏ రాష్ట్రం ఇవ్వడం లేదు.

ఈ విషయమై బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఫిర్యాదు చేయడంతో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చొరవ తీసుకొని రెండు రాష్ట్రాల మధ్య గల జలవివాదాలు పరిష్కారం కోసం ఎపెక్స్ మండలి సమావేశం జరపాలని నిర్ణయించారు.

ఈ సమావేశానికి అజెండా అంశాలను సూచించామని కోరినా ఎవ్వరు పంపలేదు. అంటే వివాదాలను సామరస్యంగా పరిష్కరించు కోవడం పట్ల ఇద్దరు ముఖ్యమంత్రులకు ఆసక్తి లేదని స్పష్టం అవుతున్నది. దానితో కేంద్రమే నాలుగు అంశాలతో ఆగష్టు 5న సమావేశం జరపాలని ప్రతిపాదించింది.

ఈ విషయమై ఉన్నతాధికార సమావేశం జరిపిన కేసీఆర్ ఈ సమావేశంపై హాజరు కావడం పట్ల విముఖత వ్యక్తం చేశారు. సమావేశాన్ని వాయిదా వేయమని కోరారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో ఆ తేదీని వాయిదావేయాలని, స్వాతంత్య్ర దినోత్సవం పూర్తయ్యాక ఆగస్టు 20 తరువాత సమావేశం ఉండేలా తేదీని నిర్ణయించాలని కోరుతూ కేంద్ర జలవనరులశాఖకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి సూచించారు.

Also Read: అయ్యో పాపం చంద్రబాబు నాయుడు

అంతటితో ఆగకుండా, జలవివాదాలు కొనసాగించడానికి కేంద్రందే బాధ్యత అన్నట్లు ఆరోపణలు చేశారు. ఈ వివాదాలను పరిష్కరించే బాధ్యతను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ గాలికి వదిలివేసిన్నట్లు చెప్పుకొచ్చారు. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ మోహన్ రెడ్డి కూడా తమ వివాదాలను చట్టబద్ధ సంస్థల ద్వారా పరిష్కరించుకొనే ప్రయత్నం చేయడం లేదు.

తమ ఇష్టం వచ్చిన్నట్లు చేసుకొంటూ, పరస్పరం ఆరోపణలు చేయూసుకొంటూ తమ తమ రాష్ట్రాలలోని ప్రజలను రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ లబ్ది పొందే కుటిల ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టం అవుతున్నది.

వాస్తవానికి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తలపెట్టిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ, సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్ స్కీంల కారణంగా దక్షిణ తెలంగాణ ప్రాంతం ఎడారిగా మారిపోతుందని రైతులు ఆందోళన చెందుతుంటే కేసీఆర్ ఒక ఫిర్యాదు కృష్ణ బోర్డు కు చేసి ఊరుకున్నారు.

ఈ విషయమై సుప్రీం కోర్ట్ కు వెళతానని చెప్పిన కేసీఆర్ ఆ తర్వాత పట్టించుకోలేదు. దానితో ఆ ప్రాంత రైతులే నేషనల్ గ్రీన్టీ ట్రిబ్యునల్ ను ఆశ్రయించి స్టే తెచ్చారు. సుప్రీం కోర్ట్ ను కూడా ఆశ్రయించారు.

పైగా ఈ ప్రాజెక్ట్ లను ఆపివేయమని కృష్ణ బోర్డు గత రెండు నెలల్లో మూడు సార్లు ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసినా జగన్ పట్టించుకోవడం లేదు. టెండర్ల పక్రియ కూడా పూర్తి చేసే ఆగస్టు లోనే నిర్మాణం పనులు ప్రారంభించడం కోసం సన్నాహాలు చేస్తున్నారు. కేసీఆర్, జగన్ లోపాయికారి అవగాహనతోనే ఈ విధంగా చేస్తున్నట్లు కనిపిస్తున్నది.

కృష్ణ చైతన్య

టీడీపీకి మరో కోలుకోలేని షాక్‌


సాధారణంగా ఏపీ ప్రభుత్వ నిర్ణయాలన్నింటిపై వరుసగా కోర్టులకు ఎక్కుతూ జగన్ సర్కార్ ముందరి కాళ్లకు బంధం వేస్తోంది టీడీపీ. చంద్రబాబు నుంచి మొదలుపెడితే ఆ పార్టీ నాయకులంతా జగన్ సర్కార్ ఏం నిర్ణయం తీసుకున్నా హైకోర్టుకు ఎక్కుతూ నిర్ణయాలను అడ్డుకుంటున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. అయితే కాలం అన్ని వేళలా ఒకేలా ఉండదు. అప్పుడప్పుడూ టీడీపీకి షాక్ తగిలేలా ఉంటుంది.

Also Read: కేశినేనిపై అసమ్మతి.. ఆయన కూతురే టార్గెట్..!

తాజాగా కొల్లు రవీంద్ర బెయిల్ పిటీషన్ ను కోర్టు తిరస్కరించింది. అచ్చెన్న, జేసీ, కొల్లులు అరెస్ట్ అయినప్పటి నుంచి బెయిల్ పీటషన్లను టీడీపీ నేతలు వేస్తూనే ఉన్నారు. కానీ కోర్టుల్లో మాత్రం వీరికి ఊరట దక్కడం లేదు. బెయిల్ దొరకడం లేదు. హత్య కేసు విచారణలో ఉందని.. ఇలాంటి సమయంలో కొల్లు రవీంధ్రకు బెయిల్ ఇస్తే ఆయన సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ప్రొసిక్యూషన్ వాదనకు కోర్టు అంగీకరించి కొల్లు రవీంద్ర బెయిల్ పిటీషన్ ను తిరస్కరించింది.

మచిలీపట్నం వైయస్ఆర్సిపి నాయకుడు మోకా భాస్కర్ రావు హత్య కేసులలో ఏ4గా ఉన్నారు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర . ఈయన బెయిల్ పిటిషన్ ను కోర్టు రద్దు చేయడంతో ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.

కొద్ది రోజుల క్రితం ఇఎస్‌ఐ కుంభకోణాల కేసులో అరెస్టయిన టిడిపి సీనియర్, మాజీ మంత్రి అచెన్నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు రద్దు చేసింది. ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు వేసిన బెయిల్ పిటీషన్లను కోర్టులు కొట్టివేస్తున్నాయి.

Also Read: అయ్యో పాపం చంద్రబాబు నాయుడు

ఈ ముగ్గురు టీడీపీ నాయకుల నుంచి జైలు నుంచి విడుదల చేయాలని టీడీపీ శిబిరం అంతా బెయిల్స్ మీద బెయిల్స్ కోసం పిటీషన్లు వేస్తూనే ఉన్నాయి. కానీ కోర్టుల్లో చుక్కెదురు అవుతోంది. టిడిపి నాయకుల బెయిల్ పిటిషన్లు తిరస్కరిస్తుండడంతో పార్టీ అధినేత చంద్రబాబులో అసహనం పెరిగిపోతున్నట్టు కనిపిస్తోందని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. కోర్టుల ద్వారా ఎంతో చాకచక్యంగా మేనేజ్ చేసే పేరున్న చంద్రబాబుకు ఈ పరిణామాలు మింగుడు పడడం లేదని అంటున్నారు. తెలుగు దేశమ్ పార్టీ తప్పులే ఈ పరిస్థితికి కారణమని ఆడిపోసుకుంటున్నారు.

కేశినేనిపై అసమ్మతి.. ఆయన కూతురే టార్గెట్..!


టీడీపీ గతంలో ఎన్నడూలేని ఒడిదుడుకులను ప్రస్తుతం ఎదుర్కొంటోంది. 2019 ఎన్నికల్లో ఏపీలో ఫ్యాన్ గాలి ప్రభంజనం సృష్టించడంతో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. ఇటీవలే జగన్ ఏడాది పాలన కూడా పూర్తి చేసుకున్నా టీడీపీ మాత్రం గత ఎన్నికల ఓటమి నుంచి బయటపడటం లేదనే టాక్ విన్పిస్తోంది. ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యలపై పోరాడాల్సిన విజయవాడ టీడీపీ నేతలు ఆధిపత్య పోరుకు సిద్ధమవుతున్నారు. ఒకరిపై ఒకరు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసుకుంటుండటం చర్చనీయాంశంగా మారింది.

Also Read: నిమ్మగడ్డ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం..!

విజయవాడలో నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. కిందటి ఎన్నికల్లో విజయవాడ నుంచి టీడీపీ ఎంపీగా కేశినేని నానీ, తూర్పు ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్ మాత్రమే గెలుపొందారు. దీంతో వీరిద్దరే విజయవాడలో పార్టీని ముందుకు నడుపుతున్నారు. గద్దె కొంత సైలంట్ ఉన్నా కేశినేని నాని మాత్రం బెజవాడలో దూకుడుగా వెళుతున్నారు. దీంతో కొందరు నేతలు ఆయన తమపై చేస్తున్న పెత్తనాన్ని సహించలేక పోతున్నారట. ఈ విషయాన్ని ఇప్పటికే చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా ఆయన పట్టించుకోకపోవడంతో స్థానిక నేతలే ఆయనకు ఆదిపత్యానికి చెక్ పెట్టేందుకు పావులు కదుపుతున్నారు.

Also Read: అయ్యో పాపం చంద్రబాబు నాయుడు

కేశినేని పెత్తనం తమపై ఎక్కువైందని రగిలిపోతున్న టీడీపీ నేతలు ఆయన కూతురుని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే ఆయన తమపై పెత్తనం చేస్తున్నారని.. ఇక ఆయన కూతురు విజయవాడ మేయర్ అయితే మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. దీంతో ఆయన కూతురుని మేయర్ ఎన్నికల్లో ఓడించేందుకు పావులు కదుపుతున్నారు. ఈ విషయం కేశినేనికి తెలియడంతో సదరు నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

దీంతో బెజవాడలో టీడీపీ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. పార్టీ గడ్డుపరిస్థితుల్లోనూ నేతలు ఆధిపత్య పోరుకు తెరలేపడంతో చంద్రబాబు తలపట్టుకుంటున్నారట. ఈ సమస్యను బాబు ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాల్సిందే..!

నిమ్మగడ్డ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం..!


నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించకుండా ఉండేందుకు అన్ని మార్గాల్లో ప్రయత్నం చేసిన ప్రభుత్వం… చివరి ఏ మార్గం లేకపోవడం, సుప్రీం కోర్టు ఇచ్చిన గడువు పూర్తి కావడంతో వెనక్కి తగ్గక తప్పలేదు. ఎట్టకేలకు నిమ్మగడ్డను ఎస్ఇసిగా నియమిస్తూ గురువారం అర్ధరాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి నుంచి సాగుతున్న ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్లయ్యింది. నిమ్మగడ్డ హై కోర్టులో ప్రభుత్వంపై దాఖలు చేసిన కోర్టు దిక్కార పిటీషన్ పై సుప్రీం కోర్టుకు స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్ పై గత శుక్రవారం సుప్రీం కోర్టు విచారణ ప్రారంభించింది. కోర్టు దిక్కార పిటీషన్ పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేది లేదని సుప్రీం తేల్చి చెప్పింది. వచ్చే శుక్రవారంలోగా ఈ వ్యవహారాన్ని తేల్చాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీం కోర్టులో ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన ప్రభుత్వం చివరి నిముషంలో గురువారం అర్ధరాత్రి నిమ్మగడ్డను ఎన్నికల కమిషనర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు ఇచ్చింది. ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో తనకు ఓ అవకాశాన్ని అట్టిపెట్టుకుంది. సుప్రీంలో కోర్టులో విచారణలో ఉన్న కేసు తుది తీర్పును అనుసరించి ఉత్తర్వులు అమలు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. సుప్రీం కోర్టులు తమకు అనుకూలంగా తీర్పువస్తే నిమ్మగడ్డను తొలగించాలనే ఆలోచనతో ఉంది.

Also Read: అయ్యో పాపం చంద్రబాబు నాయుడు

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను టిడిపి ప్రభుత్వం 2106లో ఎన్నికల కమిషనర్ గా నియమించింది. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఆయన ఐదేళ్ళ పాటు పదవిలో కొనసాగుతారు. 2020 మార్చిలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ ను ఇచ్చారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన హింసాత్మక సంఘటనలు, భారీ స్థాయిలో పదవులు ఏకగ్రీవం కావడం వంటి విషయాలు అసాధారణంగా ఉండటం, ప్రతిపక్ష్లాలు ఆయనకు వినతిపత్రాలు అందజేయడంతో అభ్యంతరాలు ఉన్న చోట్ల విచారణకు ఆదేశించారు. ఇదే సమయంలో రాష్ట్రంలోకి కరోనా వైరస్ ప్రవేశించడం, కేసులు నమోదు అవుతున్న సమయంలో… ఇతర ప్రాంతాల్లో పరిస్థితులను గుర్తించిన రమేష్ కుమార్ ఎన్నికలను నిర్వహిస్తే వైరస్ వ్యాప్తి ఎక్కువ అవుతుందని అంచనా వేసి ఎన్నికలను వాయిదా వేస్తూ మార్చి 15వ తేదీన నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో ప్రభుత్వాన్ని సంప్రదించలేదు. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిమ్మగడ్డను తొలగించే అవకాశాలపై దృష్టి పెట్టారు. తరువాతి కాలంలో నిమ్మగడ్డను తొలగించేందుకు ప్రత్యేకంగా ఆర్డినెన్స్ ను తీసుకువచ్చింది.

Also Read: కాంగ్రెస్ పార్టీకి మాయావతి జలక్?

ఆర్డినెన్స్ ఆధారంగా నిమ్మగడ్డను ఎస్ఇసి పదవి నుంచి తొలగించిన ప్రభుత్వం ఆ స్థానంలో తమిళనాడుకు చెందిన జస్టిస్ కనగరాజ్ ను ఎన్నికల కమిషనర్ గా నియమించింది. కొద్ది రోజుల పాటు కమిషనర్ గా పని చేసిన ఆయన హై కోర్టు ఎస్ఇసి పదవి కాలాన్ని కుదిస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ చెల్లదని కొట్టేసింది. ప్రభుత్వం కనగరాజ్ ను ఎస్ఇసిగా నియమిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. దీంతో కనగరాజ్ ఎస్ఇసి పదవి నుంచి తప్పుకున్నారు. తీర్పు ఇచ్చిన నాటి నుంచి ఎస్ఇసిగా నిమ్మగడ్డ పదవిలో కొనసాగుతారని హై కోర్టు ఆదేశించింది. అనంతరం ప్రభుత్వం నిమ్మగడ్డను ఎస్ఇసిగా నియమించకుండా తీర్పుపై సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్ పై విచారించిన సుప్రీం కోర్టు మధ్యంత ఉత్తర్వులు ఇవ్వకపోగా, హై కోర్టు తీర్పును సమర్ధించింది. అనంతరం సుప్రీం కోర్టు, హై కోర్టులలో పలు పిటీషన్ లను ప్రభుత్వం దాఖలు చేసినా ప్రభుత్వానికి ఎక్కడా ఊరట లభించలేదు. హై కోర్టు ఆదేశాల ప్రకారం గవర్నర్ ను నిమ్మగడ్డ కలిసి తనను ఎన్నికల కమిషనర్ గా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ హై కోర్టు తీర్పును అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఇటీవల ప్రభుత్వానికి సూచించారు. ఈ వ్యవహారంలో ఎట్టకేలకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ దే పైచేయి అయ్యింది.

అయ్యో పాపం చంద్రబాబు నాయుడు

చంద్రబాబు నాయుడు ఈ పేరు నిన్న మొన్నటిదాకా ప్రతిష్టతో ఓ వెలుగు వెలిగింది. కానీ ఇప్పుడు రోజు రోజుకూ మసకబారుతుంది. వరసగా ఎదురుదెబ్బలు తగులుతూనే వున్నాయి. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ దెబ్బ దెబ్బమీద తీస్తూనే వున్నాడు. జగన్ దెబ్బకు భయపడి తిరిగి మోడీ కి దగ్గర కావటానికి పడరానిపాట్లు పడుతున్నాడు. ముందుగా ఎన్నికల్లో మోడీ కి వ్యతిరేకంగా ప్రచారం చేసి తప్పుచేశానని బహిరంగంగా లెంప లేసుకున్నాడు. దానితోపాటు తనకు కుడి ఎడమ భుజాలనుకున్న వాళ్ళను బిజెపి లోకి పంపించాడు. అంతటితో ఆగలేదు. తిరిగి మోడీ-అమిత్ షా లకు దగ్గరకావటానికి చేయని ప్రయత్నమంటూ లేదు. పద్మశ్రీ గ్రహీత ప్రజ్ఞా భారతి చైర్మన్ హనుమాన్ చౌదరి ని వాళ్ళ దగ్గరకు రాయబారం పంపించాడు. ఆయనే స్వయంగా పెట్టిన పోస్టింగ్ ప్రకారం ఇంకెప్పుడూ చంద్రబాబు నాయుడు ప్రస్తావన తేవద్దని చెప్పారని, ఇంకెప్పుడు జీవితంలో తనను నమ్మలేమని కరాఖండిగా చెప్పినట్లు ప్రకటించాడు. అయినా తను చెయ్యని ప్రయత్నం లేదు. నాగపూర్ వెళ్లి ఆర్ ఎస్ ఎస్ పెద్దలని మచ్చిక చేసుకోవాలని ప్రయత్నం చేసినట్లు వార్తలు వచ్చాయి. అయినా ఏమీ సత్ఫలితం వచ్చినట్లు లేదు. బిజెపి వైపునుంచి తలుపులు మూసుకుపోయినట్లేనని చెబుతున్నారు.

దానికి బలం చేకూరేవిధంగా ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడుగా చంద్రబాబు నాయుడు కి బద్ద వ్యతిరేకయిన సోము వీర్రాజు ని నియమించారు. ఆయన నియామకం తర్వాత మొదటిసారి టివి చానలుకు ఇంటర్వ్యూ ఇస్తూ చంద్రబాబు నాయుడు పై విరుచుకు పడ్డాడు. ఆయన ఆగ్రహానికి అర్ధంలేకపోలేదు. 2014 ఎన్నికల్లో మోడీ గాలి లో మోడీ మద్దత్తు తో ఎన్నికల్లో గెలిచి రాష్ట్రం లో బిజెపి ని దెబ్బ తీయాలని ప్రయత్నించాడు. ఒకవైపు కేంద్రం తో సఖ్యత తో వుంటూనే తన అనుకూల పత్రికల్లో ప్రతిరోజూ బిజెపి ని, కేంద్రాన్ని విలన్ గా చూపించే ప్రయత్నం చేసాడు. ఇదంతా తన మేధావితనం గా భావించాడు. కానీ బిజెపి లోని పాతకాపులకు ఇది అర్ధమయ్యింది. అందుకే రామ్ మాధవ్  చంద్రబాబు నాయుడు విషయం లో కటువుగానే మాట్లాడాడు. ఈ వ్యూహాలు అర్ధం చేసుకోలేనంత అమాయకులేం కాదు బిజెపి నాయకులు. ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు బిజెపి పై, మోడీ పై ఒక్కపెట్టున దాడి మొదలుపెట్టాడు. అప్పటికే ఆ భూమికను తయారుచేసిన అనుకూల పత్రికలూ, చానళ్ళు ఇంకేముంది రెచ్చిపోయారు. అసలు ఆంధ్ర సమస్యలన్నింటికీ మూలం మోడీ నే నని ప్రచారం చేసారు. అందుకోసం రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తో కూడా కలిసిపోయారు. మోడీ కన్నా తనే సీనియర్ నని మోడీ వ్యతిరేక కూటమి అధికారం లోకి వస్తే ప్రధానమంత్రి అభ్యర్ధుల్లో తనకే అవకాశం వుందని కూడా ఈ మీడియా ప్రచారం చేసాయి. కోల్ కతా బహిరంగ సమావేశం లో మమతా బెనర్జీ తో కలిసి మోడీని తిట్టారు. ఇదంతా బిజెపి, ఆర్ ఎస్ ఎస్ నాయకత్వం గమనిస్తూనే వుంది. అందుకే మరలా దగ్గర కావాలని చేసిన లాబీ కి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. దీని పర్యవసానమే వీర్రాజు చంద్రబాబు పై నిప్పులు చెరగటం.

సోము వీర్రాజు వ్యాఖ్యలతో ఖంగు తిన్న చంద్రబాబు కి అంతకన్నా పెద్ద షాక్ తగిలింది. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఇండియన్ ఎక్స్ ప్రెస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చంద్రబాబు పై విరుచుకు పడ్డాడు. అసలు చంద్రబాబంత పచ్చి అవకాశవాది ఇంకొకరు ఉండరని ఏకి పారేశాడు. ఎన్నికల్లో జగన్ గెలుస్తాడని తెలిసి కూడా తన నియోజక వర్గ ప్రచారాన్ని వదిలిపెట్టి చంద్రబాబు కోసం తన తండ్రి ఫరూక్ అబ్దుల్లా ప్రచారానికి వస్తే తనన్ని గృహ నిర్బంధం చేస్తే ఖండిస్తూ ప్రకటన కూడా ఇవ్వలేదు. కాశ్మీర్ కాదుగదా ఎయిర్ పోర్ట్ కి కూడా రావటానికి ప్రయత్నం చేయలేదని, ఇటువంటి అవకాశవాది ని తన జీవితంలో చూడలేదని తను వాడుకొని వదిలేసే రకమని చెప్పకనే చెప్పాడు. ఇంతకన్నా అవమానం నాయకుడికేముంటుంది? అయినా ఇప్పటికీ చంద్రబాబు నాయుడు దానిపై స్పందించలేదు. ఎన్నికలయిన తర్వాత ఒక్కసారి కూడా యు పిఎ లోని ఏ నాయకుడి తోటి మాట్లాడలేదు. ఎన్నికలముందు కూటమి కి అంతా తానై ప్రవర్తించిన వ్యక్తి కూటమి ఓటమి పాలవటం తో ఒక్కసారి ప్లేటు ఫిరాయించటం వాళ్లకు చంద్రబాబు పై ఆగ్రహంగా వుంది.

ఇప్పుడు పరిస్థితి రెండిటికి చెడ్డ రేవడిలాగా తయారయ్యింది. అటు యు పి ఎ , ఇటు బిజెపి రెండూ చంద్రబాబు పేరు చెప్పితేనే అసహ్యించుకునే పరిస్థితి కొని తెచ్చుకున్నాడు. గత చరిత్రలో రెండు మచ్చలు వెంటాడేవి. ఒకటి మామను వెన్నుపోటు పొడిచాడని ఆ మనో వ్యధ తోనే ఎన్ టి ఆర్ చనిపోయాడనేది. రెండోది వంగవీటి మోహన రంగా హత్యకు స్కెచ్ గీసిన సూత్రధారి చంద్రబాబు నాయుడే ననేది. అయినా ప్రజలు వాటిని మరిచిపోయి చంద్రబాబు కి పట్టం కడితే మరలా కుక్క తోక వంకరేనని నిరూపించుకున్నాడని జనం చెప్పుకుంటున్నారు. ఆస్తి పోతే తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ క్యారక్టర్ పోతే తిరిగి రాదు అని చంద్రబాబు తెలుసుకోలేకపోయాడు. పాపం చంద్రబాబు ఇప్పుడు నా అనేవాళ్ళు ఎవరూ లేకుండా పోయారు. చంద్రబాబు కనబడితే  అయ్యో పాపం   అనాలనిపిస్తుంది .

 

కాంగ్రెస్ పార్టీకి మాయావతి జలక్?


రాజస్థాన్ రాజకీయాలు రోజురోజుకు వేడిక్కిపోతున్నాయి. స్వతంత్ర ఎమ్మెల్సేల మద్దతుతో కాంగ్రెస్ రాజస్థాన్లో అధికారం చేపట్టింది. అలాంటిది సొంత నేతల విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సిపోయి ప్రభుత్వాన్ని కూల్చుకునే స్థాయికి తెచ్చుకుంది. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య నెలకొన్న విభేధాలు రాజకీయ సంక్షోభానికి దారితీశారు. పైలట్ తన వర్గం నేతలతో కాంగ్రెస్ పై తిరుగుబాటు చేయడంతో ప్రభుత్వం మైనార్టీలోకి వెళ్లింది.

Also Read: బాబు బ్రాండ్ ఇమేజ్ కాశ్మీర్ దాకా పాకింది.

కాంగ్రెస్ నెలకొన్న సంక్షోభాన్ని అధిష్టానం సర్దిబాటు చేయలేకపోయింది. సీఎం గెహ్లాట్ తనకు 103మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని కాంగ్రెస్ అధిష్టానానికి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పైలట్ వర్గానికి చెందిన నేతలపై కాంగ్రెస్ వేటు వేసేందుకు సిద్ధపడగా వారంతా హైకోర్టును ఆశ్రయించడంతో కథ అడ్డం తిరిగింది. తమపై వేటువేయకుండా పైలట్ వర్గం ముందస్తుగా హైకోర్టును ఆశ్రయించడంతో వారిపై వేటుపడలేదు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీఎస్పీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సేలను ఆపార్టీలో చేర్చుకుంది.

కాంగ్రెస్ లో బీఎస్పీ విలీనమైందని ఆపార్టీ ప్రకటించడంపై బీఎస్పీ అధ్యక్షులు మాయవతి న్యాయస్థానంలో సవాల్ చేశారు. బీఎస్పీ జాతీయ పార్టీ కావడంతో కాంగ్రెస్ లో విలీనం చెల్లందంటూ మాయవతి చెబుతున్నారు. అయితే తాజాగా తమ పార్టీకి చెందిన ఎమ్మెల్సేలకు మాయవతి విప్ జారీ చేయడం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని మాయవతి విప్ జారీ చేయనున్నారు. దీంతో ఆ ఎమ్మెల్యేలంతా న్యాయనిపుణులను సంప్రదిస్తున్నారు. పార్టీ విప్ దిక్కరిస్తే ఎమ్మెల్యేపై వేటు తప్పదని ఆమె హెచ్చరిస్తుంది.

Also Read: విద్యావ్యాపారాన్ని ప్రక్షాళించిన మోదీ

కాంగ్రెస్ కు ప్రస్తుతానికి 103మంది ఎమ్మెల్సే మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో నుంచి ఆరుగురు ఎమ్మెల్సేలను తీసేస్తే 97మంది మాత్రమే ఉంటారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయినట్లే. ఒకవైపు సచిన్ పైలట్ వర్గం కూడా అశోక్ బలపరీక్షకు సిద్ధమైనపుడు తన సత్తా చూపుతామంటోంది. మరోవైపు మాయవతి కూడా కాంగ్రెస్ పార్టీ షాకిచ్చేందుకు రెడీ అవుతోంది. దీంతో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గుతారా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

ఇలాగైతే టీడీపీ ఉనికి కోల్పోవడం ఖాయం


టీడీపీ నాయకులలో అమరావతిని కాపాడుకోలేమనే అభద్రతా భావం పెరిగిపోయినట్లుంది. వాళ్ళు పోరాటంలో పసలేకపోవడంతో ప్రతిరోజూ కేంద్రం జోక్యం చేసుకోవాలని భజన చేస్తున్నారు. టీడీపీ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణడు మీడియా ద్వారా వైసీపీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ లో ఫ్యూడల్ పాలన నడుస్తుందన్న ఆయన నిమ్మగడ్డ నియామకం ఎందుకు ఆలస్యం చేస్తున్నారు. అలాగే రాజధానుల వికేంద్రీకరణ మరియు సీఆర్డీఏ రద్దు బిల్లులను ఎందుకు రాష్ట్రపతి ఆమోదానికి పంపడం లేదని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం హద్దుమీరి ప్రవర్తిస్తున్న నేపథ్యంలో కేంద్రం కలుగజేసుకోవాలని ఆయన చెప్పడం విశేషం.

Also Read: బాబు మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తున్నారా?

అధికారంలో ఉన్నప్పుడు బాబుతో పాటు టీడీపీ నేతలు కేంద్రంపై చేసిన ఆరోపణలు గుర్తు చేసుకుంటే యనమల రామకృష్ణుడి నేటి వ్యాఖ్యలకు నవ్వురాకపోదు. ఒకప్పుడు రాష్ట్ర వ్యవహారాలలో కేంద్ర జోక్యం ఏమిటి? మీ పెత్తనం క్రింద మేము బ్రతకాలా? అని చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలోకి సీబీఐ ప్రవేశించకుండా ప్రత్యేక జీవో ప్రవేసిన పెట్టిన బాబు ఘనచరిత్రను ఆంధ్రప్రజలు మరచిపోయి ఉండరు. అలాంటిది ఇప్పుడు ప్రతి విషయంలో కేంద్రం జోక్యం కోరుకోవడంతో టీడీపీ నేతల నైతికత ఏమిటో అర్థం అవుతుంది.

Also Read: జగన్ ‘ఇంగ్లిష్ మీడియం’కు కొత్త చిక్కులు?

మరోవైపు ప్రతిపక్షంగా మేము పోరాటం చేయలేక పోతున్నాం, మీరు రంగంలోకి దిగండి అన్నట్లుగా టీడీపీ వ్యవహారం ఉంది. ఏడాది పాలకనే మేము ఏమి చేయలేకపోతున్నాం, కేంద్రం నువ్వే చూసుకో అంటే, ప్రజలకు వీరిపై ఏమి నమ్మకం కలుగుతుంది చెప్పండి. మరోవైపు బీజేపీ జనసేన కూటమి దూసుకు వస్తుంది. బలహీనపడిన టీడీపీ స్థానాన్ని కైవశం చేసుకోవాలని అనుకుంటుంది. ఈ సమయంలో టీడీపీ కి బీజేపీ ప్రత్యామ్యాయం కాదనేలా వారు ప్రజా పోరాటం సాగించాలి. అలా కాకుండా ప్రతి చిన్న విషయానికి కేంద్రం వైపు చూస్తే ప్రజలకు ప్రతిపక్షంపై ఉన్న ఆ నమ్మకం కూడా పోతుంది.

కాంగ్రెస్ వైపు చూస్తున్న డీఎస్?


ఒకప్పుడు రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన నేత ధర్మపురి శ్రీనివాస్(డీఎస్). కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పారు. పీసీసీ చీఫ్ గా, మంత్రిగా, ఎమ్మెల్సేగా, రాజ్యసభ సభ్యుడిగా ఎన్నో పదవులను చేపట్టారు. కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ కోసం పోరాడిన నేతల్లో డీఎస్ కూడా ఒకరు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలతో ఆయన మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసి తన అనుచరులతో కలిసి ఆపార్టీలో చేరిపోయారు.

Also Read: బాబు బ్రాండ్ ఇమేజ్ కాశ్మీర్ దాకా పాకింది.

టీఆర్ఎస్ లో డీఎస్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి తప్పు చేశానని పలుసార్లు బహిరంగగానే వాపోయారు. అయితే టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికలకు వెళ్లినపుడు డీఎస్ తిరిగి కాంగ్రెస్ లోకి చేరుతారనే ప్రచారం జరిగింది. దీనిని ఆయన పలుసార్లు ఖండించారు. ఆయన టీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నప్పటికీ యాక్టివ్ గా మాత్రం కన్పించడం లేదు. కిందటి లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీచేసిన ఆయన కుమారుడి గెలుపు కోసం పనిచేశారని కామెంట్స్ వచ్చాయి.

డీఎస్ తన అనుచరులను ముందస్తుగా బీజేపీకి పంపి తనయుడిని గెలిపించుకున్నారని టీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో కేసీఆర్ ఆయనను పక్కను పెట్టినట్లు సమాచారం. ఈ విషయంలో కేసీఆర్ కు వివరణ ఇచ్చేందుకు డీఎస్ ప్రయత్నించిన సీఎం ఆయనకు అపాయింట్ ఇవ్వలేదని సమాచారం. దీంతో తాను చేసేదేమీలేక సైలంటయ్యారనే టాక్ ఉంది. ప్రస్తుతం టెక్నికల్ గా టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా డీఎస్ కొనసాగుతున్నారు.

Also Read: తెలంగాణలో కరోనా.. ఆశ్చర్యపోయే లెక్కలు

డీఎస్ రాజ్యసభ సీటును కేసీఆర్ ఎలాగు రెన్యూవల్ చేసే అవకాశం లేదనే టాక్ విన్పిస్తుంది. దీంతో ఆయన సొంతగూటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన తనయుడు బీజేపీలో ఎంపీగా కొనసాగుతుండటంతో బీజేపీలో చేరాలా? లేక కాంగ్రెస్ లో చేరాలా? అని తేల్చుకోలేకపోతున్నారు. డీఎస్ అనుచరులు కూడా బీజేపీలోనే కొనసాగుతున్నారు. దీంతో ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతున్నా.. ఆయన మనస్సుంతా కాంగ్రెస్ వైపు లాగుతుందని డీఎస్ సన్నిహితులు చెబుతున్నారు.

ఓవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ నేతలతో తరుచూ టచ్లో ఉంటూ డీఎస్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారని టాక్ విన్పిస్తుంది. దీంతో ఆయన టీఆర్ఎస్ పార్టీని వీడటం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. దీనిపై డీఎస్ క్లారిటీ ఇస్తారో లేదో వేచి చూడాల్సిందే..!

మహేష్‌… ఆ వైబ్రేషన్స్‌ మొదలై 21 ఏళ్లు


‘మహేష్... ఆ పేరులోనే వైబ్రేషన్స్‌ ఉన్నాయి’ అంటుంది అష్టా చమ్మా మూవీలో హీరోయిన్‌ స్వాతి రెడ్డి. సూపర్ స్టార్ మహేష్‌ బాబుకు ఏ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉందో.. అతడిని అమ్మాయిలు ఎంతగా ఇష్టపడతారో చెప్పేందుకు రాసిన డైలాగ్‌ అది. నిజమే, మహేష్‌ అనే పేరునే ఓ బ్రాండ్‌గా మార్చేశాడు ఘట్టమనేని నట వారసుడు. అమ్మాయిల కలల రాకుమారిడిగా.. యూత్‌ ఐకాన్‌గా, కుటుంబ ప్రేక్షకులను అలరించే అతిథిగా..తెలుగు చిత్రపరిశ్రమ ఏలే రాజ కుమారిడిలా అన్ని వర్గాల అభిమానులను సొంతం చేసుకున్నాడు మహేశ్. తన పేరు చెప్పగానే వచ్చే వైబ్రేషన్స్ ‌ మొదలై 21 ఏళ్లు అవుతోంది. సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మహేశ్.. హీరోగా 21 వసంతాలు పూర్తి చేసుకున్నాడు. మహేష్‌ బాబు హీరోగా నటించిన తొలి చిత్రం ‘రాజకుమారుడు’ విడుదలై నేటికి (గురువారం) సరిగ్గా 21 ఏళ్లు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు డైరెక్ట్‌ చేసిన ఈ మూవీ 1999 జులై 30న విడుదలైంది. వైజయంతి మూవీస్‌ బ్యానర్లో సి. అశ్వినిదత్‌ రూ. 2 కోట్లతో నిర్మించిన ఈ మూవీ అప్పట్లోనే పది కోట్లు కలెక్ట్‌ చేసింది. కథానాయకుడిగా మహేష్‌కు బంగారు బాటలు వేసింది. అప్పటికే చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా తండ్రితో కలిసి పలు సినిమాలు చేసిన అతను ఎంతో పరిణతితో నటించాడు. బాలీవుడ్ భామ ప్రీతి జింతా, మహేశ్‌ మధ్య రొమాన్స్‌ ఆడియెన్స్‌ ఆకట్టుకుంది. మణిశర్మ మ్యూజిక్‌ కూడా ప్లస్‌ అయింది.

Also Read: ‘పూజా హెగ్డే’ పై నాగ్ అసంతృప్తి !

హీరోగా ఫస్ట్‌ సినిమానే సూపర్ హిట్‌ కావడంతో మహేష్‌ వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేదు. తర్వాతి ఏడాది యువరాజు, వంశీ యావరేజ్‌గా ఆడినా.. 2001లో వచ్చిన ‘మురారి’ మహేశ్‌ కెరీర్ను మలుపు తిప్పింది. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్‌ అయింది. రెండేళ్ల తర్వాత ఒక్కడుతో కమర్షియల్‌ హిట్‌ కొట్టిన మహేశ్‌ మాస్‌ ఆడియెన్స్‌కు కూడా చేరువయ్యాడు. ఆ వెంటనే తేజ దర్శకత్వం వహించిన నిజం మూవీ ఫ్లాప్‌ అయినా నటుడిగా మంచి మార్కులు కొట్టేశాడు. 2003కు గాను ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నాడు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో 2005లో వచ్చిన అతడు మూవీ మహేష్‌ స్టార్డమ్‌ను అమాంతం పెంచేసి మరో నంది అవార్డు తెచ్చిపెట్టింది. తర్వాతి ఏడాదే వచ్చిన పోకిరి ఇండస్ట్రీ రికార్డున్నీ తిరగరాయడంతో సూపర్ స్టార్ తెలుగులో నంబర్ వన్‌ హీరో అయ్యాడు. కానీ, ఆ సక్సెస్‌ను కొనసాగించలేక సైనికుడు, అతిథి మూవీస్‌తో నిరాశ పరిచాడు. 2010లో ఖలేజాలో తనలోని హ్యూమర్ను బయటపెట్టిన మహేశ్‌ దూకుడుతో మళ్లీ జోరు పెంచాడు. మధ్యలో కొన్ని ఫ్లాప్స్‌ పడ్డా… బిజినెస్‌మ్యాన్‌, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, 1 నేనొక్కడినే, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి.. రీసెంట్‌గా సరిలేరు నీకెవ్వరూ వంటి మూవీస్‌తో దూసుకెళ్తూనే ఉన్నాడు. 44 ఏళ్లు వచ్చినా పాతికేళ్ల కుర్రాడి లుక్‌తో అలరిస్తూనే ఉన్నాడు యాక్టింగ్‌ను మరింత ఇంప్రూవ్‌ చేసుకుంటూనే ఉన్నాడు.

Also Read: ‘రొమాంటిక్’లో ‘ఎన్టీఆర్ అత్త’ !

హీరోగా 21 ఏళ్ల కెరీర్లో 26 సినిమాలు చేసిన మహేశ్‌కు రాజకుమారుడు ఎంతో స్పెషల్‌. అది రిలీజై 21 ఏళ్లు అయిన సందర్భంగాన్ని పురస్కరించుకొని హీరోయిన్ ప్రీతి జింతా, దర్శకుడు రాఘవేంద్రరావుతో కలిసి ఉన్న ఆ మూవీ వర్కింగ్ స్టిల్‌ ఫొటోను ట్విట్టర్లో పోస్ట్‌ చేశాడు. తన తొలి చిత్రాన్ని చాలా స్పెషల్‌గా మార్చిన దర్శకుడికి థ్యాంక్స్‌ చెప్పాడు . రాఘవేంద్రరావు కూడా మహేశ్‌, కృష్ణతో తీసుకున్న ఫొటోలనూ, మూవీ పోస్టర్లను ట్వీట్‌ చేశాడు. ‘రాజకుమారుడు కి 21 వసంతాలు… ఎన్నో మధుర జ్ఞాపకాలు… మా అశ్వినీదత్ కి మరియు చిత్రబృందానికి శుభాకాంక్షలు. మా మహేష్ బాబు ఇంకెన్నో విజయాలు సాధించాలని ఆశీర్వదిస్తున్నాను’ అని అన్నాడు. ప్రస్తుతం సర్కారువారి పాట మూవీ చేస్తున్న మహేశ్‌ మరెన్నో విజయాలు సాధించాలని ఆశిద్దాం.

బాలీవుడ్ హీరోయిన్ కావాలంటే ‘రష్మికా’ని తీసేయ్


సౌత్ హీరోలందరికి ఇప్పుడు ఉన్న ఏకైక గోల్ పాన్ ఇండియా స్టార్ అనిపించుకోవడమే. అందుకే మంచు మనోజ్, విజయ్ దేవరకొండ లాంటి హీరోలతో పాటు స్టార్ హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే, తమ సినిమా పాన్ ఇండియా సినిమా అవ్వాలంటే కచ్చితంగా బాలీవుడ్ స్టార్స్.. తమ సినిమాలో ఉండాలి. వాళ్ళు ఉంటేనే సినిమాకి పాన్ ఇండియా ముద్ర వస్తోంది. కేజిఎఫ్ కోసం ‘సంజయ్ దత్’కి భారీ మొత్తం ఇచ్చి తీసుకుంది. అందుకోసమే ఆర్ఆర్ఆర్ లో ఆలియాకి కూడా భారీ మొత్తాన్ని ముట్టజెప్పారు. కానీ మిగతా హీరోల సినిమాల్లో కూడా బాలీవుడ్ స్టార్స్ నటించాలి.. ఇక్కడే వచ్చింది సమస్య.

Also Read: ‘రొమాంటిక్’లో ‘ఎన్టీఆర్ అత్త’ !

అల్లు అర్జున్ లాంటి హీరోకే బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దొరకడం లేదు. బన్నీ – సుకుమార్ కలయికలో రానున్న ‘పుష్ప‘ సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌ ఉంది, అంటే ఐటమ్ సాంగ్ అన్నమాట. ఎలాగైనా ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ను ఆ ఐటమ్ సాంగ్ కోసం ఒప్పించాలని మేకర్స్ ఎప్పటి నుండో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా.. ఏ స్టార్ హీరోయిన్ బన్నీతో ఐటమ్ చేయడానికి ఒప్పుకోవట్లేదట. ఇలా అయితే అల్లు అర్జున్ కి పాన్ ఇండియా స్టార్ అనిపించుకోవాలనే కోరిక తీరదు. అందుకే ఐటమ్ సాంగ్ కోసం తనతో స్టెప్స్ వేయడానికి బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఒప్పుకునేలా చూడాలని.. బాలీవుడ్ కి చెందిన ఓ స్టార్ నిర్మాతను అప్రోచ్ అయ్యారట బన్నీ టీం.

Also Read: మెగాస్టార్ ను చూసి బాలయ్య ఇలా చేయడం విశేషమే !

మరి బన్నీ కోసం ఏ స్టార్ హీరోయిన్ ఒపుకుంటుందో.. ఒకవేళ ఎవ్వరు ఒప్పుకోకపోతే బాలీవుడ్‌ హాట్ బ్యూటీ ఇషా గుప్తాను తీసుకోవాలనుకుంటున్నా.. నిజానికి ఇషాకి బాలీవుడ్ స్టార్ అనే స్టేటస్ లేదు. అప్పుడు ఇషాని తీసుకున్నా ఉపయోగం ఏముంది ? మరి బన్నీకి స్టార్ హీరోయిన్ దొరుకుతుందో లేక ఇషాతోనే ఎడ్జెస్ట్ అవ్వాలో చూడాలి. అయితే ఈ సినిమాలో బన్నీకి జోడీగా రష్మిక మందన్న నటిస్తోంది. అసలు రష్మికను తీసేసి.. మెయిన్ హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ట్రై చేస్తే వాళ్ళు ఒప్పుకోవచ్చు, అంతేగాని ఐటమ్ సాంగ్ కి అంటే ఎవ్వరు మాత్రం ఒప్పుకుంటారు.