Home Blog Page 8385

భారీ చిత్రాల సంస్థలో కొత్త డైరెక్టర్లు !


యూవీ క్రియేష‌న్స్ అనే బ్యానర్ కి టాలీవుడ్ లో ఓ విలువ ఉంది. భారీ చిత్రాల ‘సినిమా సంస్థ’గా వెలిగిపోతుంది. మిర్చి, సాహో లాంటి భారీ సినిమాలు ఎవరి సపోర్ట్ లేకుండా నిర్మించే కెపాసిటీ.. బహుశా ఇప్పుడున్న పరిస్థితుల్లో యూవీ క్రియేష‌న్స్ కు తప్ప మరో సంస్థకి లేదేమో . ప్రస్తుతం రాధే శ్యామ్‌ నిర్మాణంలో ఉన్నప్పటికీ.. ఆ సినిమా తప్ప ఇంతవరకూ మరో భారీ సినిమాని సెట్ చేసుకోలేదు. ఇప్పటికే ప్రభాస్ నాగ్ అశ్విన్ తో అశ్విన్ దత్ బ్యానర్ లో సినిమాకి కమిట్ అయ్యాడు. మరో రెండేళ్లు దాకా ప్రభాస్ డేట్స్ ఖాళీ లేవు.

Also Read: రానా- మిహీకా పెళ్లి.. కండిషన్స్‌ అప్లై!

దాంతో యూవీకి ఇక మిగిలింది రామ్ చరణ్ డేట్ లే. చరణ్ యూవీకి ఒక సినిమా చేయాలి. కానీ రామ్ చరణ్ ఇప్పటికే ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయాలని ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. ఆ సినిమాకి చినబాబు నిర్మాత అయ్యే అవకాశం ఉంది. ఆ రకంగా యూవీకి భారీ సినిమాలు లేవు. అందుకే యూవీ ఇక నుండి వరుసగా వెబ్ సిరీస్ లను అండ్ చిన్న సినిమాల మీద దృష్టి పెడుతోందట. ఇప్పటికే కొత్త డైరక్టర్లను కొంతమందిని రెడీ చేసినట్లు తెలుస్తోంది.

Also Read: క్రేజీ ఆఫర్ కొట్టేసిన మహేశ్‌ హీరోయిన్‌!

నిజానికి కొత్త డైరెక్టర్లను పరిచయం చేస్తూ చిన్న సినిమాలు చేసే కంటే కూడా, మారుతి లాంటి డైరెక్టర్ డైరక్షన్ లో నాని లాంటి హీరోను పెట్టి సినిమాని చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి. చిన్న సినిమాలు నాలుగు ప్రాజెక్టులు చేసినా వాటిలో ఎన్ని సక్సెస్ అవుతాయో చెప్పలేము. అదే నాని లాంటి హీరో సినిమాని ముందే లాభాలకు అమ్ముకోవచ్చు. లాభం కోసం ఇన్ని అవకాశాలు ఉన్నా.. ఇండస్ట్రీలో కొత్త డైరెక్టర్లు రావాలని.. అది తమ సంస్థ ద్వారే రావాలని యూవీ సంస్థ ప్లాన్ చేస్తోంది.

తుస్సుమన్న మాతృభాష మాధ్యమ బోధన విధానం

ఆంధ్రప్రదేశ్ ఇంగ్లీష్ మీడియం బోధన వివాదాస్పదమైన సంగతి అందరికీ తెలిసిందే. ఎంతమంది వ్యతిరేకించారో అంతమంది మద్దత్తు తెలిపారు. వాస్తవానికి దీనిపై మాతృభాషలో విద్యావిధానం మంచిదా కాదా అనేదానికన్నా సగం మంది పిల్లలు ప్రైవేటు స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం లో ఎందుకు చదువుతున్నారనే  దానిమీద ఆధారపడి ప్రభుత్వం ప్రజలను ఒప్పించింది. పెద్దవాళ్ళ పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియం లో చదువుతున్నప్పుడు పేద వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియం లో ఎందుకు చదవకూడదో చెప్పాలని మేధావుల్ని ప్రశ్నించింది. అంటే యోగ్యతా యోగ్యతల కన్నా అమలులో అది ఎలా సామాజిక విభజన చేసిందనే వాదన తో ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం ని తీసుకొచ్చింది. ఈ వాదనను పూర్తిగా కొట్టి పారేయలేము. నిజమే మధ్యతరగతి , ఉన్నత తరగతి వర్గాల పిల్లలు ఒక్కరు కూడా తెలుగు మీడియం లో చదవనప్పుడు యోగ్యతా యోగ్యతల గురించి ఉపదేశాలు కేవలం పేద పిల్లలకేనా? అన్నింటికన్నా ముఖ్యం ఎవరయితే మాతృభాషలో విద్యాబోధన గురించి ఉపన్యాసాలు  దంచుతున్నారో వాళ్ళ పిల్లలు ఎవరూ మాతృభాషలో చదవకపోవటం తో వాళ్ళ వాదనకు విలువలేకుండా పోయింది. ఇదంతా ఒక ఎత్తయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ నూతన విద్యావిధానం తో చర్చ మళ్ళీ మొదటికొచ్చింది.

భాషా మాధ్యమంపై నూతన విద్యావిధానం ఏం చెబుతుంది?

నూతన విద్యావిధానం లో భాషా మాధ్యమంపై విపులంగా చర్చిటం  జరిగింది. మాతృ భాష/ ఇంటి భాష/ ప్రాంతీయ భాషను ప్రోత్సహించాలని చెప్పింది. ఇందులో భాగంగా 5వ తరగతి వరకు మాతృ భాషలోనే విద్యా బోధనా జరగాలని చెప్పింది. అది 8 వ తరగతి వరకయితే ఇంకా మంచిదని చెప్పింది. అలాగే పై తరగతుల్లో కూడా దీన్ని ప్రోత్సహించాలని చెప్పింది. దీనితో ప్రచార మాధ్యమాల్లో చర్చోప చర్చలు జరిగాయి. అదీకాక ఇది ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ళల్లో కూడా అమలుచేయాలని చెప్పింది. దీనితో వివక్ష అంశం వెనకపట్టు పట్టింది. అంటే ఇంతకుముందు మాట్లాడుకున్నట్లు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ళల్లో తేడా లేకుండా అందరికీ ఒకే విద్యావిధానం అమలవుతుందని చెప్పింది. దానితోబాటు త్రిభాషా సూత్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తామని కూడా చెప్పింది. అందులో సంస్కృతాన్ని అన్ని తరగతులల్లోనూ కావాలంటే తీసుకోనేవిధంగా ప్రోత్సహించింది. మొట్టమొదటి సారి విదేశీ భాషల ప్రత్యామ్నాయాన్ని కూడా 9 నుంచి 12 వరకు పొందుపర్చింది. అయితే మూడింటిలో రెండు తప్పనిసరిగా భారతీయ భాషలై  వుండాలి. ఇదీ స్థూలంగా భాషా విధానం. నూతన విద్యా విధానం ఎన్నో అంశాలపై విన్నూత్న ఆలోచనలను ప్రవేశపెట్టినా  భాషా మాధ్యమమే అందరి దృష్టిని ఆకర్షించింది.

ఆంధ్రాలో ఇది మరో వివాదాస్పద అంశ మయ్యింది 

ఈ విద్యావిధానం ప్రకటించగానే ఇంకేముంది జగన్ పని గోవిందా , ఆర్భాటంగా ప్రకటించిన విద్యా విధానం అంతే ఆర్భాటంగా ముగిసిందని పత్రికలు, చానళ్ళు ప్రచారం చేసాయి. కానీ వాళ్ళు ఒక సంగతి మరచిపోయారు. నూతన విద్యావిధానం ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ళకు ఒకేలాగా వుండాలని చెప్పిన విషయం. అప్పుడు అది అందరికీ ఒకేలాగా వర్తిస్తుంది. కాబట్టి వివక్ష వుండదు. వాస్తవానికి ఇందులో జగన్ విధానం దెబ్బతిందని చెప్పటానికేమీలేదు. మాతృ భాషా మాధ్యమం అందరికీ వర్తిస్తే ఇప్పటిదాకా దానిమీదే వ్యాపారం చేసుకుంటున్న ప్రైవేటు స్కూళ్ళు అన్నింటికీ ఇది దెబ్బే. ఇందులో ఒకరికి నష్టం ఒకరికి లాభం కన్నా అందరికీ ఒకే విధానం అనే సూత్రం పైనే ఇది ఆధారపడింది. ఇంతవరకూ బాగానే వున్నా రాను రాను ఇది పూర్తిగా నీరుకారిందని చెప్పొచ్చు. మొదట్లో భావించినట్లు ఇది అందరికీ ఖచ్చితంగా వర్తించే విధానం కాదని తేలిపోయింది. ఇది స్వచ్చందమే కానీ నిర్బంధం కాదు అని వివరణ ఇచ్చారు. స్కూళ్ళు స్వేచ్చగా నిర్ణయం తీసుకోవచ్చని చెప్పారు. అంటే ప్రైవేటు స్కూళ్ళు ఈ మాతృ భాషా మాధ్యమ విధానాన్ని అమలు చేయొచ్చు చేయకపోవచ్చు. దీనితో ప్రైవేటు స్కూళ్ళు పాత విధానాన్నే కొనసాగించే అవకాశముంది. రెండోది రాష్ట్రాలు దీనిపై స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవచ్చు. అంటే ప్రభుత్వ పాటశాలల్లో ఈ మాధ్యమ విధానం అమలుచేయోచ్చు, చేయకపోవచ్చు. మరి అటువంటప్పుడు దీనిపై ఇంత గందరగోళం దేనికి? ఇంత రాజకీయ ప్రచారం దేనికి? 10+2 స్థానం లో 5+3+3+4 ఖచ్చితంగా అమలవుతుంది. కానీ ఇంగ్లీష్ మాధ్యమం నుంచి 5 వ తరగతి వరకు ఖచ్చితంగా తెలుగు మాధ్యమం ప్రవేశపెట్టాలని లేదనీ అది స్కూళ్ళు, రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టమని వివరణ ఇచ్చిన తర్వాత దీనిపై రాజకీయాలు తుస్సుమన్నాయని చెప్పాల్సి వుంది.

క్రేజీ ఆఫర్ కొట్టేసిన మహేశ్‌ హీరోయిన్‌!


‘1 నేనొక్కడినే’తో ఇండస్ట్రీకి పరిచయమైన నటి కృతి సనన్. మోడలింగ్‌ నుంచి సినిమా రంగంలోకి వచ్చిన ఆమె తన ఫస్ట్‌ మూవీనే టాలీవుడ్‌ సూపర్ స్టార్ మహేశ్‌తో చేసే చాన్స్‌ కొట్టేసింది. మొదటి సినిమానే అయినా తన నటన, అంద చందాలతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. మహేశ్‌కు సరిజోడీ అనిపించుకుంది. ఆ మూవీ ఆశించినంత హిట్‌ కాలేకపోయినా కృతికి వెంటనే మరో ఆఫర్ వచ్చింది. అక్కినేని నాగచైతన్య హీరోగా ‘దోచేయ్’ మూవీలో నటించింది. కానీ, అప్పటికే బాలీవుడ్‌ బాట పట్టిన ఆమె సాబిర్ ఖాన్‌ డైరెక్షన్‌లో ‘హీరోపంటీ’ మూవీతో హిందీకి పరిచయమైంది. ఫిల్మ్‌ ఫేర్ బెస్ట్‌ ఫీమేల్‌ డెబ్యూ అవార్డు గెలుచుకున్న ఆమె అక్కడే సెటిలైంది. ఆక్కడ వరుసగా అవకాశాలు రావడంతో టాలీవుడ్‌కకు పూర్తిగా దూరమైంది.

Also Read: నితిన్‌కు నో చెప్పిన బుట్టబొమ్మ!

పలు స్టార్హీరోలు, డైరెక్టర్లు సంప్రదించినా కూడా ఆమె తెలుగులో మళ్లీ నటించేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ క్రమంలో దిల్‌వాలే, రాబ్తా, బారెలీ కి బర్ఫీ, లుకా చుప్పి, అర్జున పటియాలా అనే మూవీస్‌ చేసింది. కానీ, అవేవీ కమర్షియల్‌గా హిట్‌ కాలేకపోయాయి. కానీ, గతేడాది అక్షయ్‌ కుమార్ హీరోగా వచ్చిన హౌస్‌ఫుల్‌లో భారీ విజయం సాధించడంతో కృతి ఖాతాలో సక్సెస్‌ చేరింది. అప్పటి నుంచి ఆమెకు ఆఫర్ల తాకిడి పెరిగింది. ఆ వెంటనే పానీపట్‌ అనే భారీ యాక్షన్‌ మూవీలో నటించింది. పతీ పత్నీ ఔర్ఓ అనే చిన్న యూవీ చేసినా అంతగా ఆడలేదు. ప్రస్తుతం ‘మిమి’ అనే లేడీ ఓరియెంటెడ్‌ చిత్రంలో నటిస్తోందామె. ఈ ముద్దుగుమ్మకు ఇప్పుడు బాలీవుడ్‌లో మరో భారీ చాన్స్‌ వచ్చిందట.

Also Read: చెర్రీ, పూరీ రెండోసారి..

హృతిక్ రోషన్ హీరోగా రూపొందే ‘క్రిష్ 4’ చిత్రంలో కథానాయికగా నటించే చాన్స్ కృతిని వరించినట్లు సమాచారం. తొలుత కత్రినా కైఫ్, అలియా భట్ ను సంప్రదించినప్పటికీ కృతి సనన్‌ను ఫైనల్‌ చేసినట్టు తెలుస్తోంది. ఈ వార్త నిజమైతే కృతి కెరీర్ మలుపు తిరగడం ఖాయమే. ఎందుకంటే క్రిష్ సిరీస్‌లకు ప్రేక్షకుల్లో భారీ క్రేజ్‌ ఉంది. తొలి రెండు పార్టులు సూపర్ హిట్‌ అయ్యాయి. భారీ బడ్జెట్‌, తారాగణంతో తెరకెక్కిన క్రిష్‌ 3 బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా కొట్టింది. ఈ మధ్య హిట్లు లేని హృతిక్‌ క్రిష్‌4పై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఇందులో అతను నాలుగు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తాడని సమాచారం. కుమారుడికి విజయం అందించడమే లక్ష్యంగా రాకేశ్‌ రోషన్‌ ఇప్పటికే పక్క స్క్రిప్ట్ రెడీ చేశాడట. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత షూటింగ్‌ ప్రారంభించాలని చూస్తున్నాడు.

రానా- మిహీకా పెళ్లి.. కండిషన్స్‌ అప్లై!


కరోనా కారణంగా ఈ ఇయర్ ఇండస్ట్రీ పూర్తిగా దెబ్బతిన్నది. సినిమాలు, షూటింగ్‌లు ఆగిపోయాయి. చాలా మంది ఉపాధి కోల్పోయారు. కోట్లు పెట్టి తీసిన సినిమాలు రిలీజ్‌ కాకుండా ల్యాబ్స్‌లో ఉండడంతో నిర్మాతలు గగ్గోలు పెడుతున్నారు. నిత్యం షూటింగ్స్‌తో బిజీగా ఉండే హీరోలు, హీరోయిన్లు, సాంకేతిక నిపుణులు ఇప్పుడు నాలుగు గోడలకు పరిమితమయ్యారు. ఇంటి పనులు, వంట పనులు చేసుకుంటూ టైం పాస్‌ చేస్తున్నారు. ఇండస్ట్రీకి ఇంత ఇబ్బంది పడుతున్న టైమ్‌లో కొన్ని శుభకార్యాలకు మాత్రం సమయం దొరికింది. పలువురు యువ హీరోలు తమ బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెబుతున్నారు. నిఖిల్‌, నితిన్‌ ఇప్పటికే ఓ ఇంటివాళ్లయ్యారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌ రాజు రెండో పెళ్లి చేసుకొని కొత్త జీవితం ప్రారంభించాడు. రీసెంట్‌గా యంగ్‌ డైరెక్టర్ సుజీత్‌ పెళ్లి కూడా జరిగింది. ఇప్పుడు రానా వంతు వచ్చింది. తన ప్రేయసి మిహీకా బజాజ్‌ను రానా.. పెద్దల సమక్షంలో ఈ నెల 8వ తేదీన వివాహం చేసుకోబోతున్నాడు. ఇప్పటికే నిశ్చితార్ధం జరిగింది. బిజినెస్‌ ఫ్యామిలీకి చెందిన మిహీకాతో ప్రేమ విషయాన్ని మేలో బయటపెట్టాడు రానా. ఇరు కుటుంబాలు కూడా అంగీకరించడంతో పెళ్లికి రంగం సిద్ధమైంది.

Also Read: పాపకు మేకప్ ఒక్కటే కాదు, టెక్కు కూడా ఎక్కువే !

హై ప్రొఫైల్‌ ఫ్యామిలీ కావడంతో రానా- మిహీకా పెళ్లిపై అందరి దృష్టి నిలిచింది. కరోనా ప్రభావం లేకపోతే ఈ వివాహాన్ని ఆకాశంత పందిరి వేసి అన్న సినిమాటిక్‌ రేంజ్‌లో చేసేది దగ్గుబాటి ఫ్యామిలీ. వధువు సంప్రదాయం ప్రకారం రోకా వేడుక, ఆపై ఎంగేజ్‌మెంట్‌ జరిగినా.. కరోనా ప్రభావం తగ్గాక ఘనంగా పెళ్లి చేద్దామని కొంతకాలం వేచి చూసింది. కానీ, జూలై పోయి ఆగస్టు వచ్చినా పరిస్థితిలో మార్పు లేదు. ఇప్పట్లో సాధారణ పరిస్థితులు నెలకొనే పరిస్థితి కనిపించేలా లేకపోవటంతో ఆగస్టు 8న పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా లాక్‌ డౌన్‌ నిబంధనలు పాటిస్తూ పెళ్లి జరిపించాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో తొలుత నితిన్‌ పెళ్లి జరిగిన ఫలక్‌నుమా ఫ్యాలెస్‌లో భారీగా పెళ్లి వేడుక నిర్వహించాలని భావించినా తర్వాత వెనుకడుగు వేశారు. నగరంలో కరోనా కేసులు విపరీతంగా పెరగడంతో అతిథుల సంఖ్యలను వీలైంతన కుదించాలని నిర్ణయించారు. పెళ్లిని కూడా రోకా వేడుక నిర్వహించిన రామానాయుడు స్టూడియోస్‌లోనే అది కూడా ఇరు కుటుంబాలకు చెందిన సన్నిహితుల సమక్షంలో జరపాలని డిసైయ్యారు. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫ్యామిలీ మెంబర్స్‌ కాకుండా అతి కొద్దిమంది అతిథులు మాత్రమే పెళ్లికి హాజరు కానున్నారు. ఆ అతిథుల్లో కూడా ఫిల్మ్‌ ఇండస్ట్రీకి చెందిన వాళ్లలో అక్కినేని ఫ్యామిలీ మాత్రమే ఉంటుందని సమాచారం.

Also Read: నితిన్‌కు నో చెప్పిన బుట్టబొమ్మ!

మొత్తంగా 30 మంది సమక్షంలో పెళ్లి వేడుక జరుగుతుందని, కనీసం క్లోజ్‌ ఫ్రెండ్స్‌కు కూడా ఆహ్వానం పలుకలేదని దగ్గుబాటి సురేశ్‌ బాబు చెబుతున్నాడు. కరోనా టైమ్‌లో ఆడంబరాలకు దూరంగా ఉండాలని, ఎవరి ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెట్టకుండా పది మందికి ఉదాహరణగా నిలవాలని భావిస్తున్నట్టు చెప్పాడు. అంతేకాదు పెళ్లి జరిగే ప్రాంతంలో బయో సెక్యూర్ ఎన్విరాన్మెంట్‌ ఏర్పాటు చేసి అత్యంత సురక్షితంగా మార్చుతామని తెలిపాడు. పెళ్లి వచ్చే ప్రతి ఒక్కరికీ కరోనా పరీక్షలు కూడా నిర్వహిస్తామని, సోషల్‌ డిస్టెన్స్‌ పాటిస్తామని సురేశ్‌ బాబు వెల్లడించాడు. పెళ్లికి ముందు వధూవరుల కుటుంబాల సంప్రదాయం ప్రకారం జరిగే ఇతర వేడుకల్లో మాత్రం మార్పు లేదు. పెళ్లికొడుకు పంక్షన్‌, హల్దీ, మెహింది, మాతా కి చౌకి (ఉత్తరాది వేడుక) కూడా నిర్వహించనున్నారు.

పాపం రకుల్.. మొత్తం పోయేదాకా తెచ్చుకుంది !


ర‌కుల్‌ ప్రీత్ సింగ్‘.. పెద్దగా అందాల తార ఏమి కాదు, అద్భుతంగా కూడా నటించలేదు. అయినా అదృష్టం కలిసి వచ్చి స్టార్ హీరోయిన్ అయిపొయింది. నాలుగేళ్లల్లోనే ఎన్టీఆర్, మహేష్, బన్నీ, చరణ్ లాంటి అందరీ స్టార్ హీరోలతో రొమాన్స్ చేసేసింది. గత ఏడాది వరకూ స్టార్ హీరోయిన్ల లిస్ట్ లో రకుల్ పేరు ఉండేది. కానీ ఎంత స్పీడ్ గా రకుల్ ఎదిగిందో, అంతే స్పీడ్ గా పడిపోయింది. ప్రతి ఏడాది పదుల సంఖ్యలో మ్యాటర్ ఉన్న హీరోయిన్స్ వస్తుండటం.. వాళ్లల్లో రష్మిక లాంటి హీరోయిన్లు స్టార్ డమ్ తెచ్చుకుని స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలను అందుకోవడంతో రకుల్ లాంటి ఏవరేజ్ ఫిగర్లు మన స్టార్ డైరెక్టర్లకు అండ్ హీరోలకు ఆనట్లేదు.

Also Read: నితిన్‌కు నో చెప్పిన బుట్టబొమ్మ!

నిజానికి తెలుగులో హీరోయిన్ గా మంచి విజయాలనే అందుకున్న ఈ భామ.. అటు తమిళంలో కూడా స్టార్ హీరోల సినిమాల్లో నటించి సూపర్ హిట్స్ కొట్టింది. మొదటి నుండి తెలుగు పైనే ఎక్కువ ఫోకస్ పెడుతూ వచ్చిన ఈ బ్యూటీ.. తమిళ్ ఇండస్ట్రీని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు తెలుగు సినిమాల్లో రకుల్ కు ప్లేస్ లేకుండా పోతుంది. స్టార్ హీరోలు ఇప్పటికే రకుల్ ను తమ లిస్ట్ లో నుండి తప్పించారు. నితిన్, రామ్ లాంటి హీరోల పక్కన ఛాన్స్ కోసం ఆశగా ఎదురు చూస్తుంది. అందులో భాగంగానే చంద్ర‌శేఖ‌ర్ యేలేటి ద‌ర్శ‌క‌త్వంలో నితిన్ హీరోగా రాబోతున్న సినిమాలో ర‌కుల్ కి ఛాన్స్ ఇప్పించాడు నితిన్.

కానీ ఇంతకు ముందు ర‌కుల్ ఒక్కో సినిమాకు కోటిన్న‌ర రూపాయ‌ల వరకూ రెమ్యున‌రేష‌న్ తీసుకుంది. ప్రస్తుతం రకుల్ రెమ్యున‌రేష‌న్ అరవై లక్షలకు పడిపోయింది. చిత్రబృందం ఇప్పటికే ఈ విషయాన్ని రకుల్ కి స్పష్టం చేసిందట. మళ్ళీ సినిమా రిలీజ్ అప్పుడు అన్ని ప్రమోషన్స్ కి హాజరు కావాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. ఏంటో ఈ సినీ మాయ.. ఎప్పుడెవ‌రికి డిమాండ్ ఉంటుందో.. ఎవ‌రి డిమాండ్ ఎప్పుడు పోతుందో పోయే దాక అర్ధం కాదు.

Also Read: పాపకు మేకప్ ఒక్కటే కాదు, టెక్కు కూడా ఎక్కువే !

రకుల్ కూడా ప్రస్తుతం ఆ ఫీల్ లోనే ఉందట. సడెన్ గా తనకు ఎందుకు ఛాన్స్ లు తగ్గాయో అని ఆలోచనలో పడిందట. అయినా అమ్మడుకు సంవత్సరం నుండే పెద్దగా ఛాన్స్ లు లేవు. అప్పుడే అలెర్ట్ అయి ఉంటే.. కాజల్ లాగా కొన్నాళ్ళు బండి నడిపించేది. కానీ అందరూ తన దగ్గరికే వస్తారనే భ్రమలో పడి మొత్తం పోయేదాకా తెచ్చుకుంది.

అక్కడ బీజేపీ ఆకర్ష్ మొదలెట్టిందా?


దేశంలో కరోనా తనపని తాను చేసుకుంటూ పోతుంది.. దీంతో పాజిటివ్ కేసులు సంఖ్య నిత్యం వేలల్లో నమోదువుతున్నాయి. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అయితే ఇవేమీ పట్టించుకోకుండా రాజకీయ నేతలు మాత్రం ఇతర పార్టీల నేతలను తమ పార్టీలోకి చేర్చుకుంటూ.. ప్రభుత్వాలను పడగొట్టేందుకు సిద్ధమవుతుండటం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలను కైవసం చేసుకుంటూ పోతుంది. కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అసంతృప్తిని బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకుంటుండటంతో పలు రాష్ట్రాల్లో ఇప్పటికే కాంగ్రెస్ అధికారం కోల్పోగా బీజేపీ అధికారంలోకి వచ్చింది.

Also Read: బాబుకు టీడీపీ నేతల ‘వెన్నుపోటు’!

ఇటీవల రాజస్థాన్ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు బయటపడ్డాయి. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య నెలకొన్న వివాదాలు తారాస్థాయికి చేరడంతో కాంగ్రెస్ అధికారంలో కోల్పోయే స్థితికి చేరుకుంది. సచిన్ పైలట్ కు 19మంది కాంగ్రెస్ నేతలు మద్దతు ఇస్తున్నారు. వీరిని బీజేపీ తమవైపు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంది. అయితే సచిన్ పైలట్ బీజేపీలోకి వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో అక్కడి రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతోన్నాయి. అయితే బీజేపీ మాత్రం ఛాన్స్ దొరికితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

తాజాగా బీజేపీ మహారాష్ట్రలో ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. గతంలో బీజేపీ మహారాష్ట్రలో ఆపరేషన్ లోటస్ చేపట్టి విఫలమైంది. మహారాష్ట్ర సీఎం ఉద్ధావ్ థాక్రేకు కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. అయితే ఎన్సీపీ పార్టీకి ఇచ్చిన గౌరవం కాంగ్రెస్ నేతలకు ఇవ్వడంలేదని థాక్రేపై కాంగ్రెస్ నేతలు గుర్రుగా ఉన్నారని సమాచారం. అలాగే మహారాష్ట్ర మంత్రి వర్గంలోనూ కాంగ్రెస్ నేతలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఆరడజను నేతలు అసంతృప్తితో ఉన్నారట. ఈ విషయాన్ని ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

Also Read: రాజధానుల రాజకీయ రగడ మొదలైయింది

అయితే కాంగ్రెస్ నేతలను బీజేపీ తనవైపు ఆకర్షించేందుకు యత్నిస్తుంది. గతంలో బీజేపీ చేసిన తప్పు మరోసారి జరుగకూడదని అధిష్టానం భావిస్తోంది. దీంతో పక్కా ప్రణాళికతో ఈసారి మహారాష్ట్ర సర్కార్ ను కూలదోసేందుకు యత్నిస్తుందని ప్రచారం జరుగుతోంది. గతంలో ఎన్సీపీ నేత శరద్ పవర్ కు బీజేపీ గాలం వేయగా ఆయన శివసేనకు మద్దతు తెలుపడంతో ఆ ప్లాన్ బెడిసి కొట్టింది. దీంతో ఈసారి బీజేపీ శివనసేనతో సఖ్యత ఉంటూనే కాంగ్రెస్ నేతలను ఆకర్షిస్తోంది. బీజేపీ ఓవైపు శివసేనతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తానంటూ ఆఫర్ ఇస్తూనే మరోవైపు ప్రభుత్వాన్ని కూల్చేందుకు యత్నిస్తుందనే ప్రచారం జరుగుతోంది.

ఈ విషయంపై ఎన్సీపీ అధినేత శరద్ పవర్ తాజాగా స్పందిస్తూ బీజేపీ మహారాష్ట్ర సర్కార్ ను కూలదోసేందుకు యత్నిస్తుందంటూ సంచనల వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో శివసేన అలర్ట్ అయింది. అయితే రానున్న మరో రెండు నెలల్లో మహారాష్ట్ర రాజకీయాలు మరిన్ని మలుపులు తిరిగే అవకాశం కన్పిస్తోంది. సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్న సీఎం ఉద్ధవ్ థాక్రే బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ నుంచి ఎలా బయటపడుతారనేది ఆసక్తికరంగా మారింది.

ఏపీ రాజకీయం.. బీజేపీ వెయిట్ అండ్ సీ పాలసీ?


ఏపీలో మూడు రాజధానుల బిల్లు ఆమోదం పొందిన మరుక్షణం రాజకీయం వేడెక్కింది. చంద్రబాబు తొడగొట్టేసి జగన్ ప్రభుత్వానికి 48 గంటల డెడ్ లైన్ విధించాడు. రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్లాలని.. ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామంటున్నాడు. కానీ వైసీపీ మాత్రం చంద్రబాబు పని అయిపోయిందని.. అమరావతి భూ స్కాం కోసం ఉత్తరాంధ్ర, సీమను అన్యాయం చేస్తున్నారంటూ కౌంటర్ ఇస్తున్నాయి.

Also Read: సీఎం జగన్ కు నిమ్మగడ్డ రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడా?

ఇక మరో ప్రతిపక్షం జనసేన మాత్రం ఎటూ తేల్చకుండా మీనమేషాలు లెక్కిస్తోంది. ఆచితూచి స్పందిస్తోంది. అయితే బీజేపీ స్ట్రాటజీ మాత్రం అర్థం కాకుండా తయారైందని పరిణామాలను బట్టి తెలుస్తోంది.

ప్రస్తుతానికి మూడు రాజధానులపై అటు సీఎం జగన్ కు మద్దతు ఇవ్వకుండా.. ఇటు చంద్రబాబులా వ్యతిరేకించకుండా వెయిట్ అండ్ సీ పాలసీని బీజేపీ అవలంబిస్తున్నట్టు పరిణామాలను బట్టి తెలుస్తోంది.

టీడీపీని తొక్కేసి ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలని బీజేపీ భావిస్తోంది. చంద్రబాబు పని అయిపోయిందని.. ఆ నేతలను లాగాలని చూస్తోంది. చంద్రబాబును వ్యతిరేకించే సోమువీర్రాజుకు అందుకే బీజేపీ రాష్ట్ర పగ్గాలు అప్పగించిందని అంటారు. ఇప్పుడు జనసేనతో కలిసి బీజేపీ ముందుకెళ్తోంది. ఈ క్రమంలోనే చంద్రబాబులా వ్యతిరేకించకుండా అలానే.. అధికార వైసీపీకి సపోర్టు చేయకుండా పరిణామాలు గమనిస్తూ వెయిట్ అండ్ సీ పాలసీని అవలంభిస్తున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ నేతలు మౌనం దాల్చాలని అంటున్నారు.

Also Read: బాబుకు టీడీపీ నేతల ‘వెన్నుపోటు’!

ఇప్పటికే బీజేపీలోని నేతలు కూడా ప్రాంతాల వారీగా మూడు రాజధానులపై విడిపోయారు. ఉత్తరాంధ, సీమ నేతలు మూడు రాజధానులను స్వాగతిస్తున్నారు. ఇక అమరావతి నేతలు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ తేనెతుట్టెకు దూరంగానే బీజేపీ రాజకీయం చేస్తోదని చెప్పవచ్చు.

-ఎన్నం

మూడు రాజధానులపై హైకోర్టు స్టే.. జగన్ సర్కార్ కు షాక్..!


ఏపీలో ఇప్పుడు ఎక్కడా చూసిన మూడు రాజధానుల అంశం గురించే వాడివేడిగా చర్చ నడుస్తోంది. కరోనా సమయంలో ఏపీలో రాజకీయాలు జోరుగా సాగుతోన్నాయి. అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటలయుద్ధంగా కొనసాగుతోంది. సీఆర్డీఏ బిల్లు రద్దు, మూడు రాజధానులకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో వీలైనంత తర్వాత రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించాలని జగన్ సర్కార్ భావిస్తోంది. అయితే తాజాగా జగన్ సర్కార్ స్పీడుకు హైకోర్టు బ్రేక్ వేయడం ఆసక్తికరంగా మారింది.

Also Read: బీటెక్ రవి రాజీనామా వెనుక అసలు కారణం ఇదేనా?

జగన్ సర్కార్ తీసుకున్న వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలుపడంపై అమరావతి ప్రాంతవాసుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో రాజధాని కోసం భూములిచ్చిన రైతులు న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. అమరావతి నుంచి రాజధానిని ప్రభుత్వం విశాఖ తరలించడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం మూడు రాజధానుల బిల్లుపై ఈనెల 14వరకు తాత్కాలికంగా స్టే విధించింది. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది

దీంతో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసేందుకు పది రోజుల గడువు కావాలని ప్రభుత్వ తరుపు లాయర్లు అడిగినట్లు సమాచారం. మూడు రాజధానుల బిల్లుపై హైకోర్టు స్టే విధించడంతో ప్రభుత్వం కూడా న్యాయపరంగా ఎలాంటి చిక్కులు రాకుండా చర్యలు తీసుకుంటోంది. దీంతో వెంటనే కౌంటర్ దాఖలు చేయకుండా పదిరోజుల సమయం అడిగినట్లు సమాచారం. అయితే పిటిషన్ల తరుపున వాదిస్తున్న న్యాయవాదులు మాత్రం మూడు రాజధానుల బిల్లు రాజ్యాంగ విరుద్ధమంటూ కోర్టులో తమ వాదనలు విన్పించారు.

Also Read: సీఎం జగన్ కు నిమ్మగడ్డ రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడా?

వీలైనంత త్వరగా రాజధానిని విశాఖకు తరలించి ఆగస్టు 15న అధికారికంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించాలని జగన్ సర్కార్ భావించింది. ప్రస్తుతం ఈ బిల్లుపై హైకోర్టు స్టే విధించడంతో మరోసారి జగన్ స్పీడుకు హైకోర్టు బ్రేక్ వేసినట్లయింది. ప్రభుత్వం సైతం హైకోర్టులో తమ వాదనలు బలంగా విన్పించేందుకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో హైకోర్టు మూడు రాజధానుల విషయంలో ఎలాంటి తీర్పు ఇస్తుందో వేచి చూడాల్సిందే..!

ఆస్పత్రుల కరోనా దోపిడీ.. చోద్యం చూస్తున్న కేసీఆర్?


తెలంగాణలో కరోనా కల్లోలం వేళ హైదరాబాద్ లోని ఆస్పత్రులు దోచుకుంటున్నాయన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యలు, ప్రముఖులు అంతా కరోనా చికిత్సల కోసం హైదరాబాద్ లోని కార్పొరేట్ ఆస్పత్రులపై పడడంతో అవి దోపిడీని మొదలుపెట్టాయని ఆరోపణలున్నాయి.

Also Read: కేసీఆర్ కుటుంబం నుంచి మరొకరు రాజకీయాల్లోకి?

ఇటీవలే ఓ వ్యక్తి కరోనాతో చనిపోతే ఏకంగా 17లక్షల బిల్లు వేసింది ఓ ప్రైవేట్ ఆస్పత్రి. ఆ విషయం కేటీఆర్ కు తెలిసి ఆగ్రహం వ్యక్తం చేయడంతో దానిపై కోవిడ్ చికిత్సలకు మాత్రమే నిషేధం విధించి మమ అనిపించారు. నిజానికి ఆ ఆస్పత్రినే సీజ్ చేయాల్సింది.. కానీ అలా జరగలేదు.

వాస్తవానికి చూస్తే ఆ ఒక్క ప్రైవేట్ ఆస్పత్రినే కాదు.. హైదరాబాద్ లోని చాలా ప్రైవేట్ ఆస్పత్రులు 10లక్షలపైనే కోవిడ్ చికిత్సకు ముక్కుపిండీ మరీ వసూలు చేస్తున్నాయి. ప్రజలు సంపాదించిందంతా ఆస్పత్రులకే తగలేస్తున్న దైన్యం కనిపిస్తోంది.

తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మాత్రం ఆక్సిజన్ లేకుండా రూ10వేలతో ప్రైవేట్ లో చికిత్స అయిపోతుందని చెబుతున్నాడు. కానీ ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరితే రూ.5 లక్షలు, రూ.10లక్షలు వసూలు చేస్తున్నారు. బిల్ కట్టకపోతే కనీసం శవాలను కూడా ఇవ్వడం లేదు.

Also Read: బాబుకు టీడీపీ నేతల ‘వెన్నుపోటు’!

ఇటీవలే ఓ బాధితుడు ప్రైవేట్ ఆస్పత్రి అధిక ఫీజులపై హైకోర్టును ఆశ్రయించాడు. లక్షలు కట్టనందుకు చనిపోయిన మృతదేహాన్ని ఇవ్వని ఆస్పత్రిపై మరో బాధితుడు పంజాగుట్ట ఆస్పత్రిని ఆశ్రయించాడు. ఇలా తెలంగాణలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సల పేరిట దోపిడీ జరుగుతున్నా కేసీఆర్ సర్కార్ చోద్యం చూస్తోందన్న ఆరోపణలున్నాయి.

కానీ ఇంత దారుణంగా పరిస్థితులున్నా కేవలం ఒక ఆస్పత్రిలో కరోనా చికిత్సలకు మాత్రమే నిషేధించారు. తప్పితే ఆస్పత్రిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇక మిగతా ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీని అరికట్టడం లేదు. సీఎం కేసీఆర్ సార్ నిర్లక్ష్యం వల్ల ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళుతూ ఉన్న ఆస్తిపాస్తులను బిల్లులకే ఖర్చు పెట్టుకుంటున్న దైన్యం కనిపిస్తోందని బాధితులు ఆరోపిస్తు

నితిన్‌కు నో చెప్పిన బుట్టబొమ్మ!


టాలీవుడ్‌ ‘బుట్టబుమ్మ’ పూజా హెగ్డే ఇప్పుడు ఓ రేంజ్‌లో దూసుకెళ్తోంది. తెలుగులో ఆమెను నెంబర్ వన్‌ హీరోయిన్‌ అనొచ్చు. అన్ని హిట్లు, ఆఫర్లు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయిప్పుడు. చాలా తక్కువ టైమ్‌లో తెలుగు ఇండస్ట్రీలో పూజ క్రేజీ హీరోయిన్‌గా మారింది. లక్కీ హ్యాండ్‌ అనే ముద్ర పడింది. హీరోలు, డైరెక్టర్ల పాలిట అదృష్ట దేవతగా మారింది. దాంతో, పూజను తమ సినిమాల్లో హీరోయిన్‌గా తీసుకోవాలని చాలా మంది చూస్తున్నారు. ఆమె డేట్స్‌ కోసం ఎదురు చూస్తున్నారు. స్టార్ హీరోలు సైతం ఆమె డేట్స్‌ను బట్టి తమ డేట్స్‌ను అడ్జస్ట్‌ చేసుకుంటున్నారనడంలో అతిశయోక్తి లేదు.

Also Read: బాలయ్యా.. హీరోయిన్ల పై ఇష్టాన్ని మానుకో !

రీసెంట్‌గా ‘అల వైకుంఠపురములో’ భారీ హిట్‌ కావడంతో పూజ స్టార్డమ్‌ అమాంతం పెరిగింది. అక్కినేని అఖిల్ సరసన ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్’లో నటిస్తున్న పూజా.. ప్రభాస్‌ ప్యాన్‌ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్‌’లో హీరోయిన్‌ కూడా. అలవైకుంఠపురములో కంటే ముందే ఈ రెండు సినిమాలకు ఆమె ఓకే చెప్పింది. ‘రాధేశ్యామ్‌’పై దేశం మొత్తం దృష్టి ఉండడంతో పాటు భారీ అంచనాలు ఏర్పడడంతో దానిపై ఎన్నో అంచనాలు పెట్టుకుంది పూజ. దాంతో, తదుపరి సినిమాల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. కేవలం కథ నచ్చితే కాదు స్టార్ హీరోలు , పెద్ద బడ్జెట్‌ ఉండాలన్న లెక్కులు కూడా వేసుకోంటోందట. అందుకే చిన్న హీరోలు, ఓ మాదిరి స్టార్లతో మూవీస్‌ అంటే అస్సలు లెక్క చేయడం లేదట.

Also Read: నిన్ను పెట్టుకుందే అలా కనిపించడానికే !

ఈ క్రమంలో యువ కథానాయకుడు నితిన్‌ ఆమె షాకిచ్చింది. అతని సినిమాలో నటించేందుకు అస్సలు ఒప్పుకోలేదట. ‘భీష్మ’ హిట్‌తో జోరు మీదున్న నితిన్‌ ఈ మధ్య వరుస సినిమాలతో బిజీగా మారాడు. రీసెంట్‌గా పెళ్లి చేసుకొని ఓ ఇంటి వాడైన అతను ప్రస్తుతం ‘రంగ్‌దే’ మూవీతో పాటు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. వీటితో పాటు మరో రెండు సినిమాలకు కూడా కమిట్మెంట్‌ ఇచ్చాడు. అందులో హిందీలో సూపర్ హిట్‌ అయిన ‘అంధాదున్‌’ రీమేక్‌. ఆయుష్మాన్‌ ఖురానా, రాధాకా ఆప్టే, టబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ బాలీవుడ్‌లో ఘన విజయం సాధించింది. నితిన్‌ హీరోగా మేర్లపాక గాంధీ దీన్ని తెలుగులో రీమేక్‌ చేయనున్నాడు. ఈ మూవీలో హీరోయిన్‌గా నటించమని చిత్ర బృందం పూజా హెగ్డేను సంప్రదించారట. కానీ, తాను నటించనని వాళ్ల మొహం మీదే చెప్పేసిందట పూజ. మాతృకలో హీరోయిన్‌ పాత్ర నిడివి తక్కువ కావడం, తాను అడిగినంత రెమ్యునరేషన్‌ ఇచ్చేందుకు చిత్ర బృందం సిద్ధంగా లేకపోవవడంతోనే బుట్టబొమ్మ ఈ ప్రాజెక్ట్‌కు నో చెప్పిందని అంటున్నారు. కానీ, స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్ల నుంచి కాల్స్‌ వస్తుండడంతోనే రిజెక్ట్‌ చేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

బాబుకు టీడీపీ నేతల ‘వెన్నుపోటు’!


రాజకీయాల్లో చంద్రబాబు చర్రిత 40ఇయర్స్ ఇండస్ట్రీ.. అత్యధిక కాలం సీఎంగా, ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్న నేతల్లో చంద్రబాబు ఒకరు. అధికారంలో ఉన్నా.. లేకున్నా చంద్రబాబు పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకోవడం చంద్రబాబు దిట్ట అని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. అలాంటి చంద్రబాబును ప్రత్యర్థి పార్టీలు ఒక విషయంలో నిత్యం ఇరుకున పెడుతుంటాయి. చంద్రబాబు తన మామకు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారనే విమర్శలు చేస్తుంటాయి. నిజానికి బాబు తనకు పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారో లేదో తెలియదుగానీ జనాల్లోకి వెళ్లిపోయింది.

Also Read: సీఎం జగన్ కు నిమ్మగడ్డ రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడా?

ఎన్టీఆర్ వీరాభిమానులు, ప్రత్యర్థి పార్టీల నేతలు ఇప్పటికే చంద్రబాబును వెన్నుపోటుదారుడిగానే చిత్రీకరిస్తుంటాయి. చంద్రబాబు సైతం ఈ విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇచ్చిన దాఖలాల్లేవు. చంద్రబాబు అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఆయనను ప్రత్యర్థులు ఈ విషయంలోనే టార్గెట్ చేస్తుంటారు. కుర్ర సీఎం జగన్, వైసీపీ నేతలు పలుమార్లు అసెంబ్లీలో చంద్రబాబుకు వెన్నుపోటు రాజకీయాల్లో పేటెంట్ హక్కు ఉందని అది తమ వల్ల కాదంటూ సెటైర్లు వేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి. అయితే ఇప్పుడు మరోసారి టీడీపీలో వెన్నుపోటు రాజకీయాలపై చర్చ నడుస్తోంది.

చంద్రబాబుతో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న తెలుగు తమ్ముళ్లు ఆయనకే చెక్ పెట్టేందుకు రెడీ అవుతున్నారని టాక్ విన్పిస్తోంది. గత ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ఓటమిపాలయ్యాక చంద్రబాబు పరపతి దారుణంగా పడిపోయింది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు సీఎం జగన్ కు జై కొట్టారు. మరికొందరు కూడా అదే దారిలో ఉన్నారనే టాక్ విన్పిస్తుంది. ఇదిలా ఉంటే ఏపీలో మూడు రాజధానుల విషయంలో చంద్రబాబుకు దూకుడుగా వెళుతున్నారు. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని(అమరావతి) డిమాండ్ తో టీడీపీ నేతలందరికీతో కలిసి ఆయన కూడా రాజీనామా చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే చంద్రబాబుకు తమను సంప్రదించకుండా రాజీనామా నేతలు ప్రకటించడంతో తెలుగు తమ్ముళ్లు ఆయనకు జలక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. .

చంద్రబాబు అమరావతి రాజధాని డిమాండ్ కు కౌంటర్ గా తెలుగు తమ్ముళ్లు ఇటీవల కర్నూలు రాజధానిని తెరపైకి తీసుకొచ్చారు. సీఎం జగన్ అసెంబ్లీని రద్దుచేసి ప్రజాక్షేత్రంలో అమరావతి రాజధాని అంశాన్ని తేల్చుకోవాలని చంద్రబాబు సవాల్ విసురుతున్నారు. అయితే బాబుకు సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధమవుతున్నారు. రాజీనామాల విషయంలో చంద్రబాబుతో కలిసి నడించేందుకు ససేమిరా అంటున్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులో ప్రజలంతా ఆర్థికంగా చితికిపోయి ఉన్నారని.. ఇలాంటి పరిస్థితుల్లో రాజీనామా చేసే ముందుకెళితే మళ్లీ గెలువడం కష్టమని అంటున్నారు.

Also Read: రాజధానుల రాజకీయ రగడ మొదలైయింది

టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చంద్రబాబుకు అందుబాటులో లేకుండా తమ ఫోన్లను స్వీచ్ ఆఫ్ చేసుకుంటున్నారు. తాము రాజీనామా చేసేది లేదని అవసరమైతే మీరు రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లండి అంటూ బాబుకు తెగేసి చెబుతున్నారని టాక్ విన్పిస్తుంది. అమరావతి రాజధాని వల్ల టీడీపీ ఒక ప్రాంతంలో నెగ్గుతుందని.. మిగిలిన ప్రాంతాల్లో గెలిచే అవకాశం లేదని బాబుకు తేల్చి చెబుతున్నారట. తెలుగు తమ్ముళ్లను నమ్ముకొని బాబు రాజీనామా అంశాన్ని తెరపైకి తెస్తే తీరా కీలక సమయంలో వారంతా ఆయనకు వెన్నుపొటు పొడిచేందుకు సిద్ధమవుతుండటం చర్చనీయాంశంగా మారింది

ప్రస్తుత పరిస్థితుల్లో తమ్ముళ్లు చంద్రబాబుతో కలిసి నడిచే ప్రసక్తి లేకపోవడంతో రాజీనామాల అంశాన్ని బాబు ఏవిధంగా కొండెక్కిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే వెన్నుపొటు విషయంలో తమ్ముళ్లు చంద్రబాబును మించిపోయారే.. అనే సైటర్లు ఏపీలో విన్పిస్తున్నాయి. అయితే రానున్న రోజుల్లో చంద్రబాబు తమ్ముళ్లను ఎలా కట్టడి చేస్తారో వేచి చూడాల్సిందే..!

సీఎం జగన్ కు నిమ్మగడ్డ రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడా?


నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శిగా పునర్నియామకమయ్యారు. కొద్దిరోజుల క్రితం జగన్ సర్కార్ నిమ్మగడ్డను పదవీ నుంచి తొలగించి కొత్తవారిని నియమించింది. దీనిపై నిమ్మగడ్డ న్యాయపోరాటం చేయడంతో ఈ వివాదంకాస్తా సీఎం జగన్ వర్సెస్ నిమ్మగడ్డ అన్నట్లుగా మారింది. హైకోర్టులో నిమ్మగడ్డకు అనుకూలంగా తీర్పు వచ్చినా ప్రభుత్వం మాత్రం ఆయన తిరిగి నియమించలేదు. దీంతో హైకోర్టు సూచన మేరకు నిమ్మగడ్డ గవర్నర్ ను సంప్రదించారు. గవర్నర్ ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం నిమ్మగడ్డను తిరిగి ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శిగా తిరిగి పునర్నియమిస్తున్నట్లు గురువారం అర్ధరాత్రి జీవో జారీ చేసిన సంగతి తెల్సిందే.

Also Read: బీటెక్ రవి రాజీనామా వెనుక అసలు కారణం ఇదేనా?

దీంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ సోమవారం ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శిగా తిరిగి బాధ్యతలు చేపట్టారు. దీంతో సీఎం జగన్ విషయంలో నిమ్మగడ్డ పైచేయి సాధించారనే టాక్ విన్పిస్తుంది. అయితే నిమ్మగడ్డ ఇష్యూ సుప్రీం కోర్టులో ఉండటంతో తీర్పు ఎలా ఉన్నా ప్రస్తుతం నిమ్మగడ్డ జగన్ సర్కార్ విషయంలో ఏవిధంగా ముందుకెళుతారనేది చర్చనీయాంశంగా మారింది. అయితే నిమ్మగడ్డ సైతం ఆయన తిరిగి నియామకమైన రోజునే అధికార పార్టీ నేతలు రాజ్యాంగ వ్యవస్థలను ఎలా కించపరిచేలా వ్యవహరిస్తున్నారనే విషయాన్ని ఆయన సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అధికార పార్టీ నేతల తీరుపై సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేయడం మరింత ఆసక్తిని రేపుతోంది.

ఏపీలో ప్రస్తుతం కరోనా విజృంభిస్తుంది. దీంతో నిమ్మగడ్డ ప్రస్తుతానికి ఏపీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ కొనసాగిన ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదు. ఆయన పదవీకాలం వచ్చే మార్చితో ముగియనుంది. దీంతో ఆయన పదవీకాలం మరో ఏడునెలలు మాత్రం ఉండనుంది. కరోనా కారణంగా ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు కన్పించడం లేదు. అయితే మధ్యలో నిలిచిపోయిన స్థానిక సంస్థల ఎన్నికలపై ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే పలుచోట్ల ఎన్నికలు ఏకగ్రీవంకాగా వీటిపై రమేష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

Also Read: రాజధానుల రాజకీయ రగడ మొదలైయింది

గతంలో జగన్ ప్రభుత్వంపై తనపై కక్ష సాధింపు చర్యలకు నిమ్మగడ్డ రిటర్న్ గిప్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే గతంలో ఏకగ్రీవమైన పంచాయతీలపై నిమ్మగడ్డ నిర్ణయం తీసుకోనున్నారు. ఏకగ్రీవ పంచాయతీలన్నీ దాదాపు అధికార పార్టీ ఖాతాలోకి వెళ్లాయి. దీంతో ఈ ఎన్నికలను నిమ్మగడ్డ తిరిగి రీ షెడ్యూల్ చేసే అవకాశముందనే టాక్ విన్పిస్తుంది. గతంలో ఏకగ్రీవ స్థానాలకు మళ్లీ నిర్వహించాల్సి వస్తే అది సీఎం జగన్ కు కొంత ఇబ్బందిగా మారే అవకాశం ఉండనుంది. దీంతో నిమ్మగడ్డ ఏకగ్రీవ పంచాయతీలను రద్దుచేసి మరోసారి ఎన్నికలకు రీ షెడ్యూల్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారట. దీంతో నిమ్మగడ్డ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఏవిధంగా ముందుకెళుతారనేది ఆసక్తికరంగా మారింది.

పాపకు మేకప్ ఒక్కటే కాదు, టెక్కు కూడా ఎక్కువే !


‘ఆర్ఎక్స్ 100’ అనే సినిమాలో ఆడదానిలో ఎంత కసి ఉంటుందో చాల సహజంగా చేసి చూపించింది ‘పాయల్ రాజ్‌పుత్‘. ఆ సినిమా కథను బట్టి అందాల ఆరబోతలో ఏ మాత్రం వెనకాడకుండా తనకున్న యావత్తు సౌదర్యాన్ని మొత్తం ఒక్క షోకే ప్రదర్శించేసింది. దెబ్బకు సినిమా సూపర్ హిట్ అయింది. పాప కెరీర్ పీక్ లోకి వెళ్ళింది. పెద్ద సినిమాల పేర్లల్లో పాయల్ పాప పేరు బాగా వినిపించేది ఆ మధ్య. కట్ చేస్తే.. రెండేళ్లు పూర్తయిపోయాయి. స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతుందనుకున్న పాయల్ చివరికీ ఐటెమ్ సాంగ్స్ కి ఒక ఆప్షన్ లా మిగిలిపోయింది.

Also Read: ఎక్స్ క్లూజివ్: ప్రభాస్ ‘రాధే శ్యామ్’ స్టోరీ సీక్రెట్స్ !

పోనీ స్టార్ హీరోల సినిమాల్లో అన్నా పాయల్ కి స్పెషల్ ఐటమ్ సాంగ్ వస్తున్నాయా అంటే.. సెకెండ్ లెవల్ హీరోల సినిమాల్లో అడుగుతున్నారు. మొత్తానికి ఈ హాట్ బ్యూటీ కెరీర్ టాలీవుడ్ లో ఇక క్లోజ్ అయినట్లే. ప్రస్తుతం చిన్నాచితకా హీరోలు కూడా పాయల్ ను హీరోయిన్ లా ట్రీట్ చేయడం లేదు. ఐటెమ్ క్వీన్ గానే చూస్తున్నారు. పాయల్ కి ఉన్న గ్లామర్ కి, బాడీకి మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ రోల్స్ చేయాలి. ఆమెకున్న టాలెంట్ కి స్టార్ హీరోయిన్ అవ్వాలి. కానీ, పాయల్ కెరీర్ ప్లానింగ్ లో పూర్తిగా ఫెయిల్ అయింది. మనలో ఎంత ఉంది అని కాదు, ఉన్న దాన్ని ఎంత ఉపయోగించుకుంటున్నాం అనే సూత్రాన్ని ఈ భారీ అందాల తార తెలుసుకోలేకపోయింది. కెరీర్ ను నాశనం చేసుకుంది.

Also Read: మోహన్‌బాబు ఇంటికెళ్ళి బెదిరించింది వారే !

రవితేజ – రమేష్ వర్మ కలయికలో వస్తోన్న సినిమాలో కూడా తాజాగా పాయల్ ను తప్పించారు. నిజానికి పాయల్ చేతిలో ఉన్న చెప్పుకోతగ్గ సినిమా ఇది ఒక్కటే. ఇప్పుడు అది కూడా పోయింది. దానికి తోడు వచ్చిన ఐటమ్ సాంగ్స్ ను కూడా చేయను అంటుందట. అంతా అయిపోయాక ఇప్పుడు బాధ పడి ఆ సాంగ్స్ ను కూడా మానుకుంటే.. కొన్నాళ్ళకు అవి కూడా రాకుండా పోతాయని పాయల్ కి ఎప్పుడు అర్ధమవుతుందో. ఏమైనా ఈ ముద్దుగుమ్మ ఇలా ఐటమ్ సాంగ్స్ కూడా పనికిరాకుండా పోతుందని ఎవ్వరూ ఊహించలేదు. అన్నట్టు తన పరిస్థితి గురించి బయటపడకుండా, పాయల్ బాగానే కవర్ చేస్తోందండోయ్. మంచి కంటెంట్ ఉన్న పాత్రలు చేయాలనే.. ఇంతవరకూ ఏ సినిమా ఒప్పుకోవలేదు అంటుంది. పాపకి మేకపే కాదు, టెక్కు కూడా ఎక్కువే.

బాలయ్యా.. హీరోయిన్ల పై ఇష్టాన్ని మానుకో !


బాల‌కృష్ణ కొత్త సినిమా విష‌యంలో ఎప్పుడూ అర‌డ‌జ‌ను మంది హీరోయిన్ల పేర్లు వినిపిస్తాయి. అదేంటో చివరికీ వాళ్లల్లో ఒక్కరు కూడా బాలయ్య సినిమాలో కనిపించరు. ఆ మాటకొస్తే అరవై దాటిన హీరోలు చాలా మందే ఉన్నా.. హీరోయిన్ల బాధ ఒక్క బాలయ్యకే అందరి కంటే ఎక్కువ. ఎందుకయ్యా అంటే బాలయ్య బాబు పక్కన చేస్తే.. ఇక ఆ హీరోయిన్ షెడ్ కి వెళ్లడమే అనే టాక్ ఉంది. అందుకే ద‌క్షిణాది మొత్తం గాలించినా బాలయ్యకు హీరోయిన్ కొర‌త తీరదు. నిజంగా బాలయ్యకి ఇది ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితే.. లేకపోతే ఒకప్పుడు టాప్ హీరోల్లో ఒకడిగా వెలిగిపోయిన బాలయ్య బాబుకి హీరోయిన్ దొరకపోవడం ఏమిటి ?

Also Read: చెర్రీ, పూరీ రెండోసారి..

పోనీ గతంలో తనతో నటించిన హీరోయిన్ల‌ను రిపీట్ చేద్దామా అంటే.. ప్లాప్ కాంబినేషన్ అవుతుంది. సరే అని తనకు ఉన్న రెండు మూడు హిట్ సినిమాల్లోని హీరోయిన్ తీసుకుందామా అంటే నయనతార, రాధికా ఆప్టే తప్ప మరో హీరోయిన్ లేకపాయే. రాధికా ఆప్టే పై న్యూడ్ ఇమేజ్ పడి బి గ్రేడ్ హీరోయిన్ అయిపొయింది. కాస్త కష్టమే అయినా నయనతారను పట్టుకుందామా అంటే సూపర్ స్టార్ సినిమాలకే నయనతార హ్యాండ్ ఇస్తోంది, ఇక బాలయ్య సినిమాకి ఎందుకు ఒప్పుకుంటుంది. ఎలాగోలా కొత్త వారితోనే చేద్దామంటే.. బాల‌కృష్ణ‌ పక్కన వాళ్ళు కూతురులాగా అనిపిస్తున్నారు. పైగా బాల‌కృష్ణ‌ పక్కన వారిని జోడీగా ఊహించుకోవ‌డానికి కూడా భయం వేస్తోందాయే.

Also Read:  సుక్కు పైత్యం.. బాధలో బన్నీ !

ఏది ఏమైనా బాలయ్యకు ఈ హీరోయిన్లు స‌మ‌స్య‌ తీరాలంటే.. బాలయ్య కుర్ర హీరోల పాత్రలు వేయడం మానుకోవాలి. లేదంటే.. బాల‌కృష్ణ‌కు ఈ హీరోయిన్ల ఇబ్బంది ఇంకా కొన‌సాగుతూనే ఉంటుంది. దీనికి తోడు బాలయ్య బాబుకు ఒక్క హీరోయిన్ సరిపోదు. కనీసం ఇద్దరైనా ఉండాలి. కుదిరితే ముగ్గురు ఉన్నా హ్యాపీనే. మరి అంత మంది హీరోయిన్లు తమ కెరీర్ ను రిస్క్ లో పెట్టి బాలయ్య సినిమాలో చేయడానికి వస్తారనుకోవడం అపోహే. అయినా అరవై దాటిన హీరోలు అందరూ కథల విష‌యంలో హీరోయిన్ల విషయంలో త‌మ అభిరుచులను మార్చేసుకోవడం ఉత్తమం. ఇంకా గ్లామ‌రస్ హీరోయిన్లతో రొమాన్స్ చేస్తే.. ఫ్యాన్స్ కి కూడా అసహ్యం వేస్తోంది. కాబట్టి బాలయ్య అండ్ సీనియర్లూ హీరోయిన్ల పై ఇష్టాన్ని మానుకోండి.

నిన్ను పెట్టుకుందే అలా కనిపించడానికే !


జబర్దస్త్ సెట్ లో యాంకర్ అనసూయ ఫైర్ అయిందట. జబర్దస్త్ టీం ఇచ్చిన ఓ గ్లామర్ డ్రెస్ పై ఈ హాట్ బ్యూటీ చిరుబుర్రులాడిందట. ఎక్స్ పోజింగ్ కి తానూ వ్యతిరేఖం కాదని.. కాకపోతే నాకు సెక్సీ బాడీ ఉందని చెప్పి అవసరం లేకపోయినా, ఇలా సెక్సీ డ్రెస్సులు వేసుకోమనడం బాగాలేదని.. కాస్త సీరియస్ టోన్ లోనే తన కోపాన్ని వ్యక్తపరిచిందట. మరి రోజుకు లక్ష రూపాయిలు పైనే తీసుకుంటూ ఆ మాత్రం మోడ్రన్ దుస్తులు వేసుకోను అంటే ఎలా అమ్మడు..? అయినా అనసూయను చూసేదే ఆమెగారి అందచందాలను తప్ప.. ఆవిడిగారి నటనా చాతుర్యాన్ని కాదు కదా.

Also Read: చెర్రీ, పూరీ రెండోసారి..

ఆ మాటకొస్తే మంచి మాటకారి అని అనసూయను యాంకర్ గా పెట్టుకోలేదు. మంచి బాడీ ఉందని పైగా రోజురోజుకు సెక్సీగా కనబడుతుందని, అన్నిటికి మించి ఐటమ్ గర్ల్ కూడా బుల్లితెర పై పరచలేని అందాలను పరిచి, కుర్రాళ్లను కూడా జబర్దస్త్ కు అలవాటు చేస్తోందనే ఉద్దేశ్యంతోనే అనసూయను యాంకర్ గా పెట్టుకున్నారు. అంతేగాని ఆవిడగారి మాటలు వినడానికి కాదు. ఈ విషయాన్నే జబర్దస్త్ నిర్మాణ బృందం వివరంగా చెప్పిందట. గ్లామర్ డ్రెస్ వేసుకుంటేనే షో నడుస్తోంది.. నువ్వు సాధ్యమైనంతగా వెస్ట్రన్ లుక్ లో కనిపిస్తేనే షో హిట్ అవుతుందని మొత్తానికి అనసూయను ఎలాంటి డ్రెస్ వేసుకోవడానికైనా ఒప్పించారట.

Also Read: సుక్కు పైత్యం.. బాధలో బన్నీ !

అయినా అనసూయ ఇప్పుడు కొత్తగా మోడ్రన్ గా, గ్లామరస్ గా కనిపించేది ఏముంది. మామాలుగానే అనసూయ అలా ఉంటుందయ్యే. అసలు అలాంటి అనసూయ కూడా సెక్సీ డ్రెస్ అని భయపడింది అంటే.. ఇక ఆ డ్రెస్ ఏ రేంజ్ లో ఉందో..! ఈ మధ్య మల్లెమాల సంస్థవాళ్ళు కూడా డబ్బులు చేసుకోవాడనికి కాస్త హద్దులు దాటుతున్నారులేండి. ఇక అనసూయ రీసెంట్ గా తన మేకోవర్ ను అలాగే తన హెయిర్ స్టయిల్ ను పూర్తిగా మార్చేసిందట.

బీటెక్ రవి రాజీనామా వెనుక అసలు కారణం ఇదేనా?


కడప ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవి రాజీనామా ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో మూడురాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తాను రాజీనామా చేస్తున్నట్లు బీటెక్ రవి ప్రకటించారు. ఈమేరకు ఆయన రాజీనామా లేఖను టీడీపీ అధినేత చంద్రబాబుకు, శానస మండలి ఛైర్మన్ కు పంపించారు. అయితే మూడు రాజధానుల అంశానికి బీటెక్ రవికి ఏమాత్రం సంబంధం లేదని.. అలాంటప్పుడు ఆయన రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చిందనే చర్చ ఏపీలో జోరుగా సాగుతోంది.

Also Read: ఎలా దెబ్బకొట్టాలో.. కేసీఆర్ ఆదర్శం అంతే!

కడప జిల్లాకు మూడు రాజధానులకు సంబంధం లేదని విశ్లేషకులు అంటున్నారు. ఇలాంటి సమయంలో బీటెక్ రవి తన ఎమ్మెల్సీకి రాజీనామా చేయడం వెనుక పెద్ద తతాంగమే నడిచినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ సొంత జిల్లా కడప అయినందుకే అక్కడి నుంచే అమరావతి సెగ తాకాలనే ఉద్దేశ్యంతోనే టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనతో రాజీనామా చేయించారనే టాక్ విన్పిస్తోంది. సీఎం సొంత జిల్లా నుంచి అమరావతి రాజధాని కోసం బీటెక్ రవి రాజీనామా చేస్తే అది జాతీయ స్థాయిలో చర్చగా మారుతుందని బాబు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. పక్కా వ్యూహాంలో భాగంగా బీటెక్ రవి రాజీనామా అస్త్రాన్ని బాబు తెరపైకి తీసుకొచ్చారనే ప్రచారం జరుగుతోంది.

బీటెక్ రవి 2017లో కడప స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో వైఎస్ వివేకానందపై 38ఓట్ల స్వల్ప మోజార్టీతో విజయం సాధించారు. ఆయన పదవీకాలం మరో మూడేళ్లు ఉండనుంది. సీఎం జగన్ శానస మండలి రద్దుకే మొగ్గుచూపుతుండటంతో ఎమ్మెల్సీల పదవీ కాలం ఎన్ని రోజులు ఉంటుందో తెలియడం లేదు. ఆయన రాజీనామా చేసినా తిరిగి ఎన్నికల్లో గెలిచే అవకాశం లేదని తెల్సినా రాజీనామా చేయడం వెనుక బాబు వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. శానన మండలి ఛైర్మన్ టీడీపీకి చెందిన వ్యక్తే ఉండటంతో ఆయన రాజీనామా వెంటనే ఆమోదించే అవకాశం లేనట్లు తెలుస్తోంది.

Also Read:జగన్ భాద్యత వహిస్తాడా ?

బీటెక్ రవి రాజీనామాను చంద్రబాబు ఒక ఆయుధంగా ప్రభుత్వంపై ఉపయోగించినట్లు తెలుస్తోంది. అంతేతప్ప బీటెక్ రవి రాజీనామాతో ప్రభుత్వం ఇరుకున పడే పరిస్థితులు లేవు. అమరావతి రాజధానికి టీడీపీ కట్టుబడి రాజీనామాలు కూడా చేసిందనే బాబు ప్రజల్లోకి తీసుకెళ్లి వైసీపీ ఆ ప్రాంతంలో దోషిగా నిలబెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా టీడీపీ నేతలతో రాజీనామాలు చేయించి ఆ ప్రాంతంలో మరింత సానుభూతి పెంచేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే బాబు ఎత్తుగడ ఏమేరకు ఫలిస్తుందనేది వేచి చూడాల్సిందే..!

చెర్రీ, పూరీ రెండోసారి..


మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా పరిచయమైన రామ్‌ చరణ్‌ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. తక్కువ టైమ్‌లోనే మంచి సినిమాలు చేశాడు. క్లాస్, మాస్‌ ప్రేక్షకులకు చేరవై మెగా పవర్ స్టార్ అనే బిరుదుకు న్యాయం చేస్తున్నాడు. ‘రంగస్థలం’తో నటనలో మరో మెట్టుఎక్కడమే కాకుండా బ్లాక్‌ బస్టర్ విజయాన్ని అందుకున్న చెర్రీ.. తండ్రి కోసం నిర్మాతగా కూడా మారాడు. చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150 తీసి ఫ్యాన్స్‌కు ట్రీట్‌ ఇచ్చాడు. ఆపై, మెగాస్టార్ కలల మూవీ ‘సైరా నరసింహారెడ్డి’ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా భారీ బడ్జెట్‌తో నిర్మించాడు. సైరా అనుకున్న కలెక్షన్స్‌ రాబట్టలేకపోయినా తండ్రి కల నెరవేర్చిన సంతృప్తి చరణ్‌కు కలిగింది.

Also Read: మోహన్‌బాబు ఇంటికెళ్ళి బెదిరించింది వారే !

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని చేస్తున్నాడు రామ్ చరణ్. జూనియర్ఎన్టీఆర్ మరో కథానాయకుడు. ఈ పాన్‌ ఇండియా మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. పలు భాషల్లో విడుదలయ్యే చిత్రం కోసం దేశం మొత్తం ఎదురు చూస్తోంది. మన్యం వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ జీవితం ఆధారంగా వచ్చే ఫిక్షనల్‌ మూవీలో సీతారామరాజుగా చెర్రీ, భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన చెర్రీ రామరాజు టీజర్కు విపరీతమైన స్పందన వచ్చింది. లాక్‌డౌన్‌కు ముందు వరకూ రామోజీఫిల్మ్‌ సిటీలో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంది. కరోనా దెబ్బకు షూటింగ్‌ ఆగిపోవడంతో ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా కొమురం భీమ్‌ టీజర్ను రిలీజ్‌ చేయడం కూడా సాధ్యపడలేదు. దర్శకుడు రాజమౌళికి కరోనా సోకడంతో ఈ చిత్రం షూటింగ్‌ తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతుందనేదానిపై క్లారిటీ లేదు.

Also Read: ఎక్స్ క్లూజివ్: ప్రభాస్ ‘రాధే శ్యామ్’ స్టోరీ సీక్రెట్స్ !

ఈ టైమ్‌లో మిగతా యూనిట్‌ సభ్యులు ఇతర ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. ఎన్టీఆర్… త్రివిక్రమ్‌తో సినిమా చేయబోతున్నాడు. రాజమౌళి సైతం తన నెక్ట్స్‌ ప్రాజెక్టు మహేశ్‌ బాబుతో అనుకుంటున్నాడు. కానీ, రామ్‌ చరణ్‌ తదుపరి చిత్రం ఏదనేదానిపై ఇప్పటిదాకా క్లారిటీ లేదు. . తన తదుపరి చిత్రాన్ని చరణ్ ఫలానా దర్శకుడితో చేస్తాడంటూ పలురకాల వార్తలు వచ్చినప్పటికీ, ఇంకా ఏదీ ఖరారు కాలేదు. అయితే, లాక్‌డౌన్‌ బ్రేక్‌లో చెర్రీ కొన్ని స్టోరీలు విన్నాడట. ఈ క్రమంలో పూరి జగన్నాథ్‌ చెప్పిన ఓ ఇంట్రస్టింగ్‌ స్టోరీ చెర్రీకి బాగా నచ్చిందట. దాంతో, తన తర్వాతి చిత్రాన్ని జగన్‌తోనే చేయాలని చరణ్‌ భావిస్తున్నట్టు సమాచారం. కొన్ని రోజుల కిందట పూరీ… మెగాస్టార్ ఇంటికి వచ్చాడు. దాంతో, అతను చిరంజీవికి స్టోరీ చెప్పేందుకే వచ్చాడని.. ఎప్పటి నుంచో మెగాస్టార్ తో సినిమా తీయాలని భావిస్తున్న పూరి ఈ సారి చిరు నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ కొట్టేశాడన్న వార్తలు వచ్చాయి. కానీ, అతను రెడీ చేసిన స్టోరీ చరణ్‌ కోసమే అని తెలుస్తోంది. చెర్రీ చేసే మూవీస్‌ కథలు చిరంజీవి కూడా వింటాడు. ఈ నేపథ్యంలో పూరి చెప్పిన స్టోరీ మెగాస్టార్ కు నచ్చిందట. దాంతో, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చరణ్ ఓ చిత్రాన్ని చేయనున్నాడంటూ తాజాగా టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. దీనిని ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు నిర్మిస్తారని సమచారం. చరణ్ ను హీరోగా చిత్రసీమకు పరిచయం చేసింది పూరీనే కావడం గమనార్హం. చెర్రీ ఫస్ట్‌ మూవీ ‘చిరుత’కు అతనే దర్శకత్వం వహించాడు. అంతా సవ్యంగా సాగితే ఇన్నేళ్ల తర్వాత వీరిద్దరూ మళ్లీ కలిసి పని చేయబోతున్నారు.