సీఆర్డీఏ బిల్లు రద్దు.. మూడు రాజధానులకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏపీ రాజకీయాలు హీటెక్కాయి. అధికార ప్రతిపక్ష పార్టీ మధ్య మాటలయుద్ధంగా తారాస్థాయికి చేరుకుంటోంది. టీడీపీ అధినేత చంద్రబాబు రాజీనామాకు సిద్ధమవుతున్నారు. ఈనేపథ్యంలోనే చంద్రబాబు వైసీపీ నేతలకు సవాల్ విసురుతున్నారు. 48గంటల డెడ్ లైట్ సీఎం జగన్ కు విధించడం ఆసక్తిని రేపుతోంది. ‘దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేయి.. ఎన్నికలకు వెళదాం.. అమరావతిపై ప్రజల్లోనే తేల్చుకుందాం..’ అంటూ బాబు తొడగొట్టడం చర్చనీయాంశంగా మారింది.
Also Read: అమరావతి టీడీపీకి.. విశాఖ వైసీపీకి లాభం? పవన్ వస్తే.?
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పదేళ్లు కష్టపడి గత ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చారు. జగన్ ఇటీవలే ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు. ఇంకా నాలుగేళ్లు ఆయనకు పదవీకాలం ఉంది. ఈ సమయంలో చంద్రబాబు అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికల్లో తేల్చుకుందాం.. అంటే మాత్రం జగన్ మాత్రం సిద్ధమవుతారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. కిందటి ఎన్నికల్లో టీడీపీకి కేవలం 23సీట్లు దక్కాయి. ఇందులో నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పటికే సీఎం జగన్ కు జై కొడుతున్నారు. ఈ లెక్కన టీడీపీలో బాబుతో కలిపి మొత్తంగా 20మంది ఎమ్మెల్యేలు ఉంటారు.
సీఎంగా ఏడాది కాలంలో జగన్ సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి దూసుకెళుతున్నారు. మునుపటి కంటే ఆయన గ్రాఫ్ ఇటీవలే చాలా పెరిగిందని సర్వేలు చెబుతున్నాయి. ఇలాంటి సమయంలో చంద్రబాబు అమరావతి రాజధానిని అడ్డుపెట్టుకొని ప్రజాక్షేత్రంలోకి వెళుతారా? రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఎంతవరకు నెగ్గుతుందని ఆ పార్టీ నేతలే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిజంగా బాబు రాజీనామా చేస్తే ఆయన వెంటే నడించేందుకు తమ్ముళ్లు సిద్ధంగా ఉన్నారా? అనే ప్రశ్న తలెత్తుతోంది. టీడీపీలో రాజీనామాలు చేసేందుకు కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని సమాచారం.
Also Read: జగన్ భాద్యత వహిస్తాడా ?
తమ నియోజకవర్గాల్లో పరిస్థితి అంచనా వేయకుండా బాబు ఎలా రాజీనామా కోరుతారని మిగితా ఎమ్మెల్యేలు ఎదురు ప్రశ్నిస్తున్నారట. కిందటేడాదే కోట్లు ఖర్చుపెట్టి ఎన్నికల్లో గెలిస్తే బాబు ఆవేశానికి తాము బలికావాలా? అంటూ తమ్ముళ్లు వాపోతున్నారట. ఒక్క అమరావతి రాజధాని కోసం రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలకు వెళితే మిగతా ప్రాంతాల్లో టీడీపీ గెలిచే అవకాశం లేదని నేతలు చెబుతున్నారు. టీడీపీ అధికారంలోకి రానప్పుడు మళ్లీ రాజీనామా చేసి గెలువడం ఎందుకని నైరాశ్యం నేతల్లో కన్పిస్తుంది.
చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనూ వైసీపీ ఇటీవల ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది. సంక్షేమ పథకాలు అమలును చూపిస్తూ టీడీపీ నేతలను వైసీపీలోకి చేర్చుకుంటోంది. ఇలాంటి సమయంలో బాబు ఎన్నికలకు వెళితే ఆయన కూడా గెలిస్తాడో లేడో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు రాజీనామాల అంశాన్ని ఎలా వెనక్కి తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఇది నిజంగా బాబుకు పరీక్ష మారనుందని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. మరీ బాబు ఈ పరీక్షలో ఏమేరకు నెగ్గుతారనేది వేచి చూడాల్సిందే..!
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: How many mlas were running along chandrababu
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com