Home Blog Page 8384

కాంగ్రెస్ సీనియర్లకు పార్టీని నిలబెట్టే దమ్ము లేదా?


కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలకు, సీఎం అభ్యర్థులకు కోదవ లేదు. అయితేనేమ్.. పార్టీని గట్టెక్కించేందుకు ఒక్క నేత కూడా ముందుకురాని పరిస్థితి. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సీనియారిటీ లెక్కన పదవులు అనుభవించిన నేతలు ఇప్పుడు ఏమయ్యారంటూ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నపుడు ముందుండి నడిపించాల్సిన సీనియర్ నేతలు సైలంటవడంపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. ఇలాంటి సీనియర్లు పార్టీలో ఉన్నా ఒక్కటే లేకపోయిన ఒకటేనంటూ బహిరంగగానే విమర్శలు గుప్పిస్తున్నారు.

Also Read: ఆ నేతలు టీఆర్ఎస్ చేరిన ఫలితం లేకపాయే?

రాష్ట్రంలో ప్రతిపక్ష హోదాలో ఉన్న కాంగ్రెస్ ఏమాత్రం అధికార పార్టీకి పోటీ ఇవ్వడం లేదని కాంగ్రెస్ కార్యకర్తలు నైరాశ్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాడాల్సిన నేతలంతా తామకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు నేతలు అడుపదడుప మీడియా ముందు హడావుడి చేస్తున్నారు. ఇక కరోనా ఎంట్రీ ఇచ్చాక కాంగ్రెస్ నేతలంతా ప్రజా సమస్యలను గాలికొదిలి ఇళ్లకే పరిమితమయ్యారని అంటున్నారు. కనీసం గాంధీభవన్ కు, పార్టీ సమావేశాలకు కూడా పార్టీలోని సీనియర్లు హాజరు కాకపోవడంతో వీరిపట్ల జూనియర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్ లో సీనియర్లుగా చెలామణి అయ్యే మాజీ మంత్రులు జానారెడ్డి, దామోదర్ రెడ్డి, మహిళా నేతలు గీతారెడ్డి, రేణుకా చౌదరిలు ఎక్కడా కూడా యాక్టివ్ గా కన్పించడం లేదనే టాక్ విన్పిస్తుంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం సీనియారిటీ పేరుతో పదవులు అనుభవించేందుకు మాత్రం వీరంతా రెడీగా ఉంటారని ఇప్పుడు మాత్రం ఎందుకు సైలంట్ గా ఉంటున్నారని కిందిస్థాయి నేతలు ప్రశ్నలవర్షం కురిపిస్తున్నారు. ఇక పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, జగ్గారెడ్డిలు అప్పుడప్పుడు మీడియా ముందు హల్చల్ చేస్తుంటారని అంటున్నారు.

Also Read: మీడియా టైకూన్ పతనం ప్రారంభమైందా?

సీనియర్ నేతలు గ్రూపు రాజకీయాల కారణంగా అధికారంలోకి రావాల్సిన కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చిందంటూ కార్యకర్తలు వాపోతున్నారు. ఓవైపు టీఆర్ఎస్ రాష్ట్రంలో జరిగే ప్రతీ ఎన్నికలో దూసుకెళుతున్నా కాంగ్రెస్ సీనియర్ నేతల్లో చలనం రావడం లేదంటున్నారు. మరోవైపు బీజేపీ కూడా రాష్ట్రంలో పాగా వేసేందుకు చాపకిందనీరులా ప్రయత్నిస్తుందని అంటున్నారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు ముందుండి పార్టీని నడిపించాల్సిందిపోయి సైలంట్ గా ఉండటంపై కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కొన్నిచోట్ల జూనియర్లే రంగంలోకి దిగుతున్నా సీనియర్లు అడ్డుపడుతుండటం గమనార్హం.

కాంగ్రెస్ లోని సీనియర్ నేతల తీరుపై ఇప్పటికే పలువురు నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ అధిష్టానం పార్టీ మొత్తాన్ని ప్రక్షాళన చేసేందుకు రెడీ అవుతుంది. దీనిని ముందే గుర్తించిన సీనియర్లు అక్కడ కూడా తమ పలుకుబడితో పార్టీలో మార్పులు జరుగకుండా కాలయాపన చేస్తున్నారనే టాక్ విన్పిస్తుంది. కాంగ్రెస్ సీనియర్ల తీరుతో విసిగిపోతున్న నేతలంతా ఇతర పార్టీలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నాయి. మరికొందరు మాత్రం కాంగ్రెస్ పై అభిమానంతో పార్టీలోనే కొనసాగుతున్నారు.

ఇప్పటికైనా కాంగ్రెసులోని సీనియర్ నేతలు కళ్లు తెరవకపోతే ముచ్చటగా మూడోసారి కూడా కాంగ్రెస్ ప్రతిపక్షంలో కూర్చోవాల్సిందేనని టాక్ విన్పిస్తోంది. మరీ కాంగ్రెస్ సీనియర్లలో మార్పు వస్తుందో లేదో వేచి చూడాల్సిందే..!

ఆ నేతలు టీఆర్ఎస్ లో చేరిన ఫలితం లేకపాయే?


తెలంగాణ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నిలిచింది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండే ఈ జిల్లా క్రమంగా గులాబీమయంగా మారింది. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఏ పని మొదలుపెట్టాలన్న ఈ జిల్లా నుంచే ప్రారంభించడం ఆనవాయితీగా మారింది. దీంతో ఈ జిల్లాలో టీఆర్ఎస్ బలంగా మారింది. ఇక టీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ చెందిన ముఖ్యనేతలంతా కారు పార్టీలోకి జంపయ్యారు.

Also Read: ఆస్పత్రుల కరోనా దోపిడీ.. చోద్యం చూస్తున్న కేసీఆర్?

ఉమ్మడి జిల్లా పరిధిలోని మానుకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకున్నారు. టీఆర్ఎస్ అధికారంలో ఉండటంతో తమకు మున్ముందు అన్ని మంచిరోజులేనని భావించారు. అయితే వీరిని టీఆర్ఎస్ లోని ఎమ్మెల్యేలు, మంత్రులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని టాక్ విన్పిస్తోంది. ఈ ముగ్గురిని పార్టీ పదవుల్లోగానీ.. నామినేటేడ్ పదవుల విషయంలోగానీ ఏమాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదని సమాచారం. దీంతో ఈ నేతలు పార్టీలు మారిన ఫలితం దక్కకుండా పోతుందని సన్నిహితుల వద్ద వాపోతున్నారట.

దీనికితోడు నియోజవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందని టాక్ విన్పిస్తోంది. ఇక గెలిచిన ఎమ్మెల్యేలు తమ ఏమాత్రం పట్టించుకోవడం లేదని.. పార్టీ కార్యక్రమాలను కూడా పిలువడం లేదని వాపోతున్నారు. మానకొండూరులో తొలి నుంచి రసమయి బాలకిషన్ కు మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ కు పడటం లేదు. వీరిద్దరు ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నా ఆరెపల్లికి టీఆర్ఎస్ నేతలు తగిన గుర్తింపు ఇవ్వడం లేదట. దీనిపై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదట. గతంలో ప్రభుత్వ విప్ గా పనిచేసిన తనకు టీఆర్ఎస్ లో అడుగడుగునా అవమానాలు ఎదురవుతుండటంతో పునారోచనలో పడ్డారనే టాక్ విన్పిస్తోంది.

Also Read: మీడియా టైకూన్ పతనం ప్రారంభమైందా?

ఇక హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డికి పొసగటం లేదనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు నియోజకవర్గం అంతటా కలియ తిరిగిన ప్రవీణ్ టీఆర్ఎస్ లో చేరాక పూర్తిగా సైలంటయ్యారు. టీఆర్ఎస్ నేతలు తనకు సరైన గుర్తింపు ఇవ్వకపోవడంతో కాలం కలిసొచ్చే వారకు స్తబ్ధుగా ఉండాలని తన అనుచరులను ప్రవీణ్ రెడ్డి సముదాయిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ కూడా జిల్లాలో పెద్దగా కన్పించడం లేదు. టీఆర్ఎస్ లో చేరినా సరైన ప్రాధాన్యం లేకపోవడంతో ఆయన కూడా సైలంటయ్యారు.

కాలం కలిసొచ్చి పదవులు దక్కుతాయనుకున్న ఈ ముగ్గురు నేతల పరిస్థితి తలకిందులు కావడంతో తిరిగి సొంతగూటికి వెళ్లే ఆలోచన చేస్తున్నారట. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ లోకి వెళ్లినా మునుపటి గుర్తింపు ఉంటుందా అనే అనుమానంతో తిరిగి కారులోనే కంటిన్యూ అవుతున్నారట. టీఆర్ఎస్ లోనే ఏదో ఒక నామినేటేడ్ పదవీ దక్కించుకోవాలని భావిస్తున్నారట. ఇది కుదరకపోతే రానున్న రోజుల్లో పార్టీ వీడే అవకాశాలున్నాయనే టాక్ విన్పిస్తుంది. అయితే వీరి విషయంలో గులాబీ బాస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే..!

హీరోలతో పడుకోలేదని..నన్ను వేధించారు: రవీనా టాండన్‌


సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ అనుమానాస్పద మృతి తర్వాత బాలీవుడ్‌లో నెపోటిజానికి వ్యతిరేకంగా అనేక మంది ప్రముఖులు గళం విప్పుతున్నారు. కంగన రనౌత్‌, తాప్సీతో పాటు పలువురు దర్శక నిర్మాతలు తామకు ఎదురైన చేదు జ్ఞాపకాలను పంచుకున్నారు. తాజాగా అలనాటి మేటి హీరోయిన్‌.. 90ల్లో బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిసిన సీనియర్ నటి రవీనా టాండన్‌ దీనిపై స్పందించింది. ఫిల్మ్‌ మాఫియాపై సంచలన కామెంట్లు చేసింది. చెప్పినట్టు వినలేదని, మంచం మీదకు రాలేదని చాలా మంది హీరోలు, వాళ్లకు చంచాలుగా వ్యవహరించిన జర్నలిస్టులు తనను వేధించారంటూ సంచలన ఆరోపణలు చేసింది.

Also Read: క్రిష్’ బ్యాడ్ లక్.. పవర్ స్టార్ తోనే మూడేళ్లు

మనం 90ల్లోని బాలీవుడ్‌ హీరోయిన్ల గురించి మాట్లాడుకుంటే రవీనా టాండన్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. కామెడీ,డ్రామా, యాక్షన్ ఇలా అన్ని రకాల చిత్రాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకుందామె. కానీ ఈ రహదారి తనకు అంత సులభం కాదని ఆమె వెల్లడించింది. బంధుప్రీతి, హీరోయిన్లపై వేధింపులు, ఇండస్ట్రీలో గుత్తాధిపత్యం ప్రదర్శించే పెద్దలు, కొన్ని వర్గాలు తమ మాట వినని యాక్టర్లను టార్గెట్‌ చేయడం ఇప్పుడే కాదని 90ల్లో కూడా ఉందని రవీనా చెప్పింది. ఆ టైమ్‌లో అమ్ముడుపోయిన జర్నలిస్టులు కొందరికీ తొత్తులుగా మారి ఎవ్వరి అండలేని తన లాంటి వాళ్లను ఎంతగానో బాధ పెట్టారని చెప్పింది.

బాలీవుడ్‌లో కొన్ని ముఠాలు, మేల్ యాక్టర్లు, కొందరు హీరోయిన్లు, వాళ్ల చంచా జర్నలిస్టులు తనను ఎలా వేధించారో ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవీనా వివరించింది. కొంత మంది హీరోలు చెప్పినట్టు వినకపోవడం, వాళ్ల పక్కలో పడుకోవడానికి నిరాకరించడంతో తనకు అఫైర్లు అంటగట్టడంతో పాటు సినిమాల నుంచి తప్పించే వరకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోన్నానని చెప్పింది. తన కెరీర్ను అంతం చేయాలని చాలా మంది ప్రయత్నించినా.. వాటి నుంచి బయట పడ్డానని తెలిపింది.

Also Read: చైతు ‘లవ్ స్టోరీ’కి కొత్త కష్టం !

‘ఈ ముఠాల్లో హీరోలు, వారి గర్ల్ ఫ్రెండ్స్‌తో పాటు వారి చంచా జర్నలిస్టులు ఉండేవాళ్లు. ఇందులో నన్ను షాక్‌కు గురిచేసిన విషయం ఏంటంటే, ఈ ముఠాలోని మహిళా జర్నలిస్టులే సాటి మహిళల కెరీర్ను నాశనం చేశారు. ఇప్పుడైతే మేము స్త్రీవాదులం, అల్ట్రా -ఫెమినిస్ట్ కాలమ్స్‌ రాస్తున్నామని వాళ్లు గొప్పలు చెప్పుకుంటుంటే నాకు నవ్వొస్తోంది. గతంలో వాళ్లు నాకెప్పుడూ అండగా నిలబడలేదు. ఎందుకంటే నాపై బురద చల్లితే హీరో వారికి డబ్బుల కవర్లు ముట్టజెప్పేవాళ్లు. ఆ సమయంలో పూర్తిగా గుత్తాధిపత్యం నడిచింది. నిజాయితీగా ఉండడంతో ఆ టైమ్‌లో నేను సినిమాలు కోల్పోలేదు గానీ నా గురించి చాలా తప్పు వార్తలు రాశారు. ఇండస్ట్రీలో నాకు గాడ్‌ఫాదర్స్ లేరు. ఆ ముఠా క్యాంపుల్లో నేను భాగం కాలేదు. నన్ను ప్రోత్సహించే హీరోలు లేరు. నేను పాత్రల కోసం హీరోలతో పక్క పంచుకోలేదు. వారితో అఫైర్లు పెట్టుకోలేదు. చాలా సందర్భాల్లో నాపై అహంకారి అనే ముద్ర వేశారు. ఎందుకంటే హీరోలు నా గురించి ఏం అనుకున్నా పట్టించుకోలేదు. వాళ్లు నవ్వమన్నప్పుడు నవ్వడం, కూర్చోమన్నప్పుడు కూర్చోవడం నాకు చేతకాలేదు. నాకు ఇష్టమైన పనులే చేశా. ఆత్మాభిమానంతో బ్రతికా. కానీ, ఆశ్చర్యకరంగా మహిళా జర్నలిస్టులే నన్ను కిందకు లాగడానికి ప్రయత్నించారు. అయినా సరే నాకు నచ్చినట్టు నేను జీవించాలనుకున్నా’ అని రవీనా చెప్పుకొచ్చింది.

సీనియర్ హీరోకి దేవుడు పట్టాడు !


తెలుగు సీనియర్ హీరోల్లో ఒక హీరో ఉన్నాడు. మొదటి నుండి కాస్త దేవుడి పట్ల భయం భక్తి ఉన్నవాడు. పైగా భక్తి పుస్తకాలు కూడా ఎక్కువగా చదువుతాడు. దేనికయ్యా ఈ భక్తి అని ఎంతమంది కామెంట్స్ చేసినా ఆయన తీరు మారలేదు. అయితే మరో సీనియర్ హీరోలా పూజలు ముహూర్తం వంటి అలవాట్లు ఈ హీరోకి లేవు. కాకపోతే ఈ మధ్య ఈయనకు ఒక అలవాటు వచ్చి పడింది. కనిపించిన ప్రతి ఒక్కరికి తనదైన శైలిలో ప్రవచనం చెబుతున్నాడట. సహజంగా అందరికీ దూరంగా ఉండే ఈ హీరో వయసు మీద పడేకొద్ది కాస్త మనుషులతో మమేకం అవుతున్నాడు.

Also Read: క్రిష్’ బ్యాడ్ లక్.. పవర్ స్టార్ తోనే మూడేళ్లు

అయితే అయ్యాడు. ఇప్పుడు ఉన్నట్లు ఉండి ఈ భక్తి ప్రవచనాల గోల ఏందిరా బాబు అని ఆ హీరో తాలూకు సన్నిహితులు చాటుగా గుసగుసలాడుతున్నారు. అన్నట్లు ఈ హీరోగారి ప్రవచనం గురించి ఫిల్మ్ నగర్ లోని కుర్ర డైరెక్టర్లు ఇలా మాట్లాడుకుంటూ కామెడీ చేసుకుంటున్నారు. హీరోగారి మాటల్లో.. ఏ మనిషి అయినా తన లైఫ్ ను ఎంజాయ్ చేద్దాం అనుకుంటే.. దేవుడు బాధ్యతలను గుర్తు చేసి డబ్బు మీద ఆశను పుట్టిస్తాడట. డబ్బు మోజులో పడి జీవితాన్ని కోల్పోతుంటే ఆరోగ్యం జాగ్రత్త అని ఏదొక సమస్య ఇచ్చి మనల్ని మనకు గుర్తు చేస్తాడట. శక్తి లేనప్పుడు మనల్ని చూసుకోవడానికి దేవుడు ఉన్నాడనుకున్నప్పుడు.. మొహం చాటేస్తాడట.. అదే దేవుడు అట.. పిల్లల భవిష్యత్తు కోసం మనం డబ్బు వెంట పరిగెడితే, మన వెంట పరిగెడతాడు. అది చూసి మనం దేవుడు ప్రేమని కోరుకుంటున్నట్లు మనం ఆయన వెంట పడితే.. నిన్ను నువ్వు చూసుకో అని గుర్తు చేస్తాడు. మొత్తానికి ఇలా అన్ని పుస్తకాల్లోని సారాన్ని మొత్తం కలిపేసి దేవుడు గురించి ఆ హీరోగారు ఏదేదో చెబుతున్నాడట.

Also Read: చైతు ‘లవ్ స్టోరీ’కి కొత్త కష్టం !

పాపం చదివితే ఉన్న మతి పోయినట్టు ఈ హీరోగారు ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తుంటే ఆయన సన్నిహితులు బాధ పడుతున్నారు. ఈ కరోనా వచ్చినప్పటి నుండే హీరోగారిలో ఈ గోల ఎక్కువైందట. ఎవరు మాత్రం ఏమి చేయగలరు. ఎవరి భవిష్యత్తు అయినా దేవుడి చేతిలోనే ఉంటుందని చాలామంది నమ్మకం. మరి ఆ దేవుడి ఆలోచనలో గడుపుతున్న ఈ సీనియర్ హీరో భావవ్యక్తీకరణకి ఆ దేవుడు హీరో భవిష్యత్తును ఏమి చేయకుండా ఉంటే అదే పదివేలు అనుకోవాలి ఇక.

కరోనాను క్యాష్ చేసుకుంటున్న మంత్రులు?


తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతుండటంతో కార్పొరేట్ ఆస్పత్రులకు కాసుల వర్షాన్ని కురిపిస్తున్నాయి. కరోనా బాధితుల భయాన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రి సిబ్బంది క్యాష్ చేసుకుండటం శోచనీయంగా మారింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా రోగులకు సరైన చికిత్స అందకపోవడంతో కరోనా బాధితులు కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేరుతున్నారు. అదే అదనుగా భావిస్తున్న కార్పొరేట్ ఆస్పత్రులు ఒక్కో పేషంట్ కు లక్షల్లో బిల్లులు వేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో దోపిడి కట్టడి చేయాల్సిన ప్రభుత్వం పెద్దగా పట్టించుకోకపోవడంతో వారి ఆగడాలు మితిమీరిపోతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతోన్నాయి.

Also Read: ఆస్పత్రుల కరోనా దోపిడీ.. చోద్యం చూస్తున్న కేసీఆర్?

ప్రభుత్వ ఆస్ప్రతుల్లో రోగులకు మెరుగైన సదుపాయాల్లేవని ప్రచారం జరుగుతుండటంతో రోగులకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేరేందుకు మొగ్గుచూపుతున్నారు. రాష్ట్రంలోని 55ప్రైవేట్‌ ఆస్పత్రులకు ప్రభుత్వం కరోనా చికిత్సకు అనుమతి ఇచ్చింది. ఒక్కో ఆస్పత్రిలో 50బెడ్ల నుంచి 300ల బెడ్స్ అందుబాటులో ఉంచారు. వీటితోపాటు అనధికారికంగా అనేక ఆస్పత్రుల్లో కరోనా సేవలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిబంధనల మేరకు కరోనా చికిత్స ఎంత ట్రీట్మెంట్ చేసినా రూ.10నుంచి 15వేలలోపు బిల్లు అవుతుంది. కానీ ఇందుకు భిన్నంగా కరోనా రోగికి ఒక్క రోజుకు చికిత్సకే లక్షల్లో బిల్లు వేస్తుండటం గమనార్హం.

రాష్ట్రంలో ఇలాంటి కేసులు ఇటీవల కాలంలో విరివిగా బయటపడుతున్నారు. ఇటీవల ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఓ కరోనా పేషంట్ కు రూ.17.50లక్షల బిల్లు వేసి షాకిచ్చింది. ఇంత బిల్లు వేసి కూడా కరోనా రోగిని ఆస్పత్రి బృందం కాపాడలేకపోయింది. ఆ రోగి తరుపు బంధువులు అప్పటికే 8లక్షలు చెల్లించారు. మిగతా డబ్బులు చెల్లిస్తేనే శవం ఇస్తామని చెప్పడంతో ఈ విషయం కాస్తా బయటికి వచ్చింది. అయినప్పటికీ మృతుడి బంధువులతో బేరసారాలాడి చివరికీ కొంత బిల్లు కట్టించుకొని శవాన్ని అప్పగించచడం శోచనీయంగా మారింది. హైదరాబాద్లోని పలు ఆస్పత్రులు ఇప్పటికే కరోనా పేషంట్లకు బిల్లుల రూపంలో చుక్కలు చూపిస్తుండటం గమనార్హం.

Also Read: ఉద్యమం బాబుదైతే, త్యాగం మాత్రం జగన్ చేయాలట..!

మరోవైపు కార్పొరేట్ ఆస్పత్రుల్లో బెడ్స్ కావాలంటే మంత్రుల సిఫార్సు ఉండాల్సిదేననే టాక్ విన్పిస్తోంది. ప్రతీ ప్రైవేట్ ఆస్పత్రికి ఎవరో ఒక మంత్రి లేదా రాజకీయ నాయకుడు అండగా ఉంటున్నారనే ప్రచారం జరుగుతోంది. వీరి అండతోనే ప్రైవేట్ ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్నాయట. మంత్రుల కోసం కార్పొరేట్ ఆస్పత్రులు ప్రత్యేకంగా మూడు నుంచి నాలుగు బెడ్స్ కేటాయిస్తున్నాయట. ఆ బెడ్స్ లో పేషంట్లను నిర్ణయించేది మంత్రులు, వారి పీఏలేనని టాక్ విన్పిస్తుంది. దీంతో రోగులకు మంత్రులు అండగా ఉంటున్నారా? లేక ప్రైవేట్ ఆస్పత్రులను ప్రోత్సహిస్తున్నారనేది అర్థంకావడం లేదనే పలువురు వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కార్పొరేట్ ఆస్పత్రుల్లో కరోనా దోపిడిని అరికట్టే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

హ్యాపీగాపెళ్లి చేసుకునే లోపే బాధ పెట్టారు !


మెగాస్టార్ మలయాళ ‘లూసిఫర్‘ తెలుగు రీమేక్ గురించి రోజుకొక వార్త పుట్టుకొస్తోంది. వాస్తవానికి ఇంతవరకూ మెగాస్టార్ కి కూడా ఈ సినిమా విషయంలో ఏమి చేస్తున్నాడో అధికారికంగా అప్ డేట్ ఇవ్వలేదు. నిజమే.. దర్శకుడు వినాయక్ అంటే.. మెగాస్టార్ కి సాఫ్ట్ కార్నర్. పైగా వినాయక్ ఇప్పుడు కష్టాల్లో ఉన్నాడు. ఏ స్టార్ హీరో పిలిచి ఛాన్స్ ఇచ్చే స్థితిలో వినాయక్ లేడు. నిజానికి వినాయక్ సినిమాలు లేక యాక్టర్ గా మారుతున్నాడు. ఇలాంటి పరిస్తితుల్లో మెగాస్టార్ పిలిచి మరీ వినాయక్ కి లూసిఫర్ అవకాశం ఇచ్చారని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అనేక రకాలుగా గాసిప్ రాయుళ్లు రాసి పడేస్తున్నారు.

Also Read:  ఖాకీ కాదు ఖద్దరు వేయనున్న పవన్‌!

పాపం మెగాస్టార్ తో సినిమాని ఓకే చేయించుకుని, శుభమా అని పెళ్లి చేసుకుని ఆనంద పడేలోపే డైరెక్టర్ సుజీత్ కి ఈ న్యూస్ పెద్ద చికాకు పెట్టించిందట. తానూ చేస్తోన్న ‘లూసిఫర్’ సినిమాను వినాయక్ చేతిలో పెట్టారని వార్తలు రావడంతో సుజీత్ బాగానే ఫీల్ అయ్యాడట. హ్యాపీగా పెళ్లి చేసుకునే లోపే బాధ పెట్టారు అన్నమాట. అసలు ఇంతకీ ఈ వార్త గురించి ఫిల్మ్ సర్కిల్స్‌ లో వినిపిస్తోన్న లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే, వినాయక్ కి మెగాస్టార్ ఇంకా ఈ సినిమా ఛాన్స్ ఇవ్వలేదు. కథ ఉంటే చెప్పు అని మాత్రమే వినాయక్ ని చిరు కోరారు. అది కూడా మరో ఏడాది తరువాతే. ఈ లోపు స్క్రిప్ట్ రెడీ చేసుకో అనే సెన్స్ లో మెగాస్టార్ వినాయక్ కి ఓ భరోసా ఇచ్చారు. ఆయితే ఈ వార్త అలా అలా చేరి లూసిఫర్ సినిమాకి వినాయక్ ను డైరెక్టర్ ను చేసే స్థాయికి వెళ్ళింది.

Also Read: చైతు ‘లవ్ స్టోరీ’కి కొత్త కష్టం !

అయినా లూసిఫర్ మలయాళంలో సూపర్ హిట్ అయింది. అంతమాత్రాన మెగాస్టార్ చిరంజీవి చేయాల్సిన మూవీనా అంటే కాదనే చెప్పాలి. మొదట ఈ సినిమాకి డైరెక్షన్ చేయమని సుజీత్ ని అడిగినప్పుడు అతను చెప్పిన మాట కూడా ఇదేనట. మీ స్థాయి సినిమా కాదు ఇది, మీ కోసం నేను ఒక కథ రాస్తాను అని ఒక లైన్ కూడా చెప్పాడట. కానీ సాహో ప్లాప్ కి సుజీత్ ను పూర్తిగా నమ్మలేక.. లేదు లూసిఫర్ మూవీనే చేద్దామని మెగాస్టార్ చెప్పాడట. ఇక తెలుగు ఆడియన్స్ కోరుకునే ఎమోషన్స్ కి తగ్గట్టుగా లూసిఫర్ స్క్రిప్ట్‌లో డైరెక్టర్ కొన్ని కీలకమైన మార్పులను చేసాడు.

క్రిష్’ బ్యాడ్ లక్.. పవర్ స్టార్ తోనే మూడేళ్లు


సెన్స్ బుల్ డైరెక్టర్ క్రిష్ కి అసలు టైమ్ కలిసి రావడం లేదు. మణికర్ణిక అంటూ కంగనాతో గొడవ.. ఆ తరువాత ఎన్టీఆర్ బయోపిక్ అని బాలయ్యతో డిజాస్టర్ల పర్వం మొత్తానికి క్రిష్ ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. అందుకే ఈ సారి ఎంతో కసితో సినిమాని ప్లాన్ చేశాడు. ఏకంగా పవర్ స్టార్ ని ఒప్పించాడు. దాంతో క్రిష్ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అనగానే పవర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుండి క్రిష్ పర్సనల్ లైఫ్ తో పాటు సినిమా లైఫ్ కూడా బాగా ఇబ్బందులు కలుగజేసింది. వీటికి తోడు కరోనా వచ్చి సినిమా కూడా పోస్ట్ ఫోన్ అయిపోయింది. ఇది అందరి సమస్యే. కానీ కరోనా అనంతరమైన మిగితా డైరెక్టర్ల సినిమాలు మొదలవుతాయి. క్రిష్ సినిమా తప్ప.

Also Read: ఇండస్ట్రీపై కరోనా పంజా.. ఎస్పీ బాలుకు పాజిటివ్

నిజానికి ఈ సినిమాకి సంబందించి అప్ డేట్ కోసం పవన్ ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.. వారికి నిరాశ తప్పేలా లేదు. కరోనా కారణంగా ‘పవన్ – క్రిష్’ సినిమాని ఈ ఏడాది మొత్తం పోస్ట్ ఫోన్ చేయనున్నారు. పైగా వచ్చే ఏడాది కూడా పవన్ ముందుగా వకీల్ సాబ్ కి డేట్స్ ఇస్తాడు. ఆ సినిమా ఫినిష్ చేసి.. అప్పుడు క్రిష్ సినిమా మీదకు వస్తాడు. అంటే అన్ని బాగుంటే.. వచ్చే ఏడాది సమ్మర్ కి గాని షూటింగ్ స్టార్ట్ అవ్వదు. ఒకవేళ కరోనా అప్పటిదాకా వదలకపోతే ఇక క్రిష్ సినిమా 2022లోనే. ఈ లోపు ఎన్నో మారొచ్చు. నిజానికి ఇది చాలా టైం. క్రిష్ ని బాగా ఇబ్బంది పెట్టే టైం. మాములుగా అయితే ఈ లోపు క్రిష్ మూడు నుంచి నాలుగు సినిమాలు చేస్తాడు. కానీ పవర్ స్టార్ తో సినిమాని మాత్రం ఇప్పుడు క్రిష్ మూడు సంవత్సరాలు చేసేలా ఉన్నాడు.

Also Read: తెలుగు డైరెక్టర్ తో మరో బాలీవుడ్ స్టార్ !

ఇక ఈ చిత్రంలో పవన్ సరసన హీరోయిన్ గా జాక్వెలిన్ చేస్తోంది. సినిమాలో ఆమె ఒక పేరున్న ఓ రాజుకి సోదరి పాత్రలో నటించబోతుందని సమాచారం. ఇక పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారట. ప్రస్తుతానికి అయితే ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ అనే పేరును అనుకుంటున్నారు. భారీ సెట్లతో భారీ స్థాయిలో ఈ సినిమాని క్రిష్ చేస్తున్నాడు. ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం ఈ భారి చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

చైతు ‘లవ్ స్టోరీ’కి కొత్త కష్టం !


మజిలీ, వెంకీమామ లాంటి సూపర్ హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్న నాగచైతన్య హీరోగా చేస్తోన్న సినిమా లవ్ స్టోరీ. ఫిదాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన నేచురల్ బ్యూటీ సాయిపల్లవి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండటం కూడా ఈ సినిమా మార్కెట్ లెవల్ ను పెంచింది. అన్నిటికి మించి శేఖర్ కమ్ముల ఈ సినిమాకి డైరెక్టర్. ప్రస్తుతం టాలీవుడ్ లో బలమైన ఎమోషనల్ కథలతో సినిమాలు చేసే సెన్సిబుల్ డైరెక్టర్ గా శేఖర్ కు మంచి పేరు ఉండటం.. పైగా ముగ్గురు సక్సెస్ లో ఉండటం కూడా ఈ సినిమా పై ఉన్న అసక్తిని రెట్టింపు చేసింది. కానీ కొత్తగా ఈ సినిమాకి ఒక కష్టం వచ్చి పడింది. సినిమా ఇప్పటికే రఫ్ ఎడిటింగ్ పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీకి రెడీగా ఉంది.

Also Read: ఇండస్ట్రీపై కరోనా పంజా.. ఎస్పీ బాలుకు పాజిటివ్

దాంతో ఈ సినిమా నిర్మాతలు తమ సన్నిహితుడైన ఓ డిస్టిబ్యూటర్ కు సినిమాని చూపించారు. ఆయన సినిమా చూసాక చెప్పిన పాయింట్స్ చూస్తే.. నిజమే అనిపించిందట. సినిమా బాగా స్లోగా ఉందని.. సాయి పల్లవి పాత్ర.. హీరో పాత్రను పూర్తిగా డామినేట్ చేస్తోందని ఇలా అయితే హీరో చివరకు డమ్మీ అయ్యే ప్రమాదం ఉందని.. పైగా శేఖర్ కమ్ముల గత సినినాలన్ని కలిపితే వచ్చిన సినిమాలా ఈ సినిమా ఉందని.. కచ్చితంగా సినిమాలో కొన్ని హీరోయిన్ సీన్స్ ను లేపేయాలని చెప్పాడట. ఆయితే లవ్ స్టోరీకి ఆ సీన్స్ చాలా కీలకం అట. అవి తీసేస్తే ఇక లవ్ స్టోరీ కష్టమే అని శేఖర్ కమ్ముల తన వెర్షన్ చెప్పుకొస్తున్నాడట.

Also Read: తెలుగు డైరెక్టర్ తో మరో బాలీవుడ్ స్టార్ !

మొత్తానికి ఫిదా లాంటి సెన్సేషనల్ హిట్ అందుకున్న తరువాత కూడా శేఖర్ కమ్ములను నమ్మకపోవడం అవమానమే. అసలు శేఖర్ కమ్ముల ప్రతి సినిమాకి ఇలాంటి రచ్చే ఉంటుంది. రిలీజ్ కు ముందు ఇలాంటి కామెంట్స్ నే వినిపిస్తాయి. కాకపోతే క్రేజీ కాంబినేషన్ తో చేస్తోన్న సినిమాకి కూడా ఇలాంటి కామెంట్స్ రావడం బాధాకరం. అన్నట్టు డిస్ట్రిబ్యూటర్స్ గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను రిలీజ్ చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ చిత్రంతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి రాబోతుందనే యాంగిల్ కూడా ఈ సినిమాకి మైనస్ అని.. వాళ్లకు సినిమా అవుట్ ఫుట్ పై సరైన అవగాహన లేకపోవడంతో అనుమానంతో కొంతమందికి సినిమాని చూపించడం.. వాళ్ళు తెలిసి తెలియక ఏదేదో చెప్పడంతో అది శేఖర్ కమ్ములకు బాగా ఇబ్బంది కలిగిస్తోందని టాక్.

ఖాకీ కాదు ఖద్దరు వేయనున్న పవన్‌!


పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ను వెండితెరపై చూసి చాన్నాళ్లు కావస్తోంది. రెండేళ్ల కింద ‘అజ్ఞాతవాసి’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు పవన్‌. అదేమో డిజాస్టర్గా మిగిలింది. ఆపై, ఏపీ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పూర్తిగా రాజకీయాలపైనే దృష్టి పెట్టాడు . ఓ దశలో సినిమాలకు దూరం అవుతున్నట్టు కూడా ప్రకటించాడు. కానీ, ఎన్నికల్లో ఘోర ఓటమి చవి చూడడంతో మనసు మార్చుకున్నాడు. వేరే వ్యాపారాలు కూడా లేకపోవడంతో అన్నం పెట్టిన ఇండస్ట్రీకే తిరిగొచ్చాడు. ఒకే టైమ్‌లో మూడు సినిమాలకు ఓకే చెప్పేసిన పవన్‌ అందరినీ ఆశ్చర్యపరిచాడు.

Also Read: ఇండస్ట్రీపై కరోనా పంజా.. ఎస్పీ బాలుకు పాజిటివ్

‘వకీల్‌ సాబ్‌’తో వీలైనంత తొందరగా ప్రేక్షకులను పలకరించాలని అనుకున్నాడు. హిందీ హిట్ మూవీ ‘పింక్‌’కు రీమేక్‌గా ఈ చిత్రంలో పవన్‌ ఫస్ట్‌ టైమ్‌ లాయరు పాత్రలో కనిపిస్తున్నాడు. వేణు శ్రీరామ్ డైరెక్టర్. దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మాతాలు. ఇప్పటికే సగం కంటే ఎక్కువ షూటింగ్‌ పూర్తయింది. వేసవి లేదంటే దసరా కానుకగా రిలీజ్‌ చేద్దామనుకున్న యూనిట్‌ ప్లాన్‌పై కరోనా నీళ్లు కుమ్మరించింది. ప్రాణాంతక మహమ్మారి కారణంగా షూటింగ్‌ ఆగిపోయింది. వ్యాక్సిన్‌ వచ్చే వరకూ చిత్రీకరణ వద్దని పవన్‌ చెప్పడంతో ఇది ఈ ఏడాది రిలీజ్‌ అవడం కష్టమే.

Also Read: క్రేజీ ఆఫర్ కొట్టేసిన మహేశ్‌ హీరోయిన్‌!

వకీల్‌సాబ్‌ షూటింగ్‌ నిలిచిపోవడంతో కరోనా బ్రేక్‌ టైమ్‌లో పవన్‌ ఇతర ప్రాజెక్టులపై దృష్టి పెట్టాడు. జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో చేసే పీరియాడికల్‌ డ్రామాకు సంబంధించి స్క్రిప్టు వర్క్‌ కంప్లీట్‌ అయినట్టు తెలుస్తోంది. ఇప్పుడు హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించే సినిమాపై కూడా క్లారిటీ వచ్చిందని సమాచారం. పవన్‌ వీరాభిమాని అయిన హరీశ్‌ గబ్బర్ సింగ్‌తో ఇప్పటికే అతనికి ఇండస్ట్రీ హిట్‌ అందించాడు. సర్దార్ గబ్బర్ సింగ్‌ తీసే అవకాశం చేజారినప్పటికీ గద్దలకొండ గణేష్తో తన స్టామినా నిరూపించుకున్నాడు హరీశ్‌. దాంతో, పవన్‌ నుంచి అతనికి మరో చాన్స్‌ వచ్చింది. అయితే, ఈ మూవీ గురించి ఆసక్తికర విషయాలు బయటికొస్తున్నాయి. గబ్బర్ సింగ్‌ మాదిరిగా ఇందులో కూడా పవన్‌ పోలీస్‌ పాత్రలో చేస్తాడని తొలుత వార్తలు వచ్చాయి. కానీ, అది నిజం కాదని ఇది పక్కా పొలిటికల్‌ సబ్జెక్ట్‌ అని తాజా సమాచారం. హీరోగా, పొలిటీషియన్‌గా పవన్‌ స్టార్డమ్‌ను దృష్టిలో ఉంచుకొని హరీశ్‌ పవర్ఫుల్‌ పొలిటికల్‌ డ్రామాతో కథను సిద్ధం చేశాడట. ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను ప్రస్తావిస్తూ పక్కా కథనం రెడీ చేస్తున్నాడని సమాచారం. వకీల్‌ సాబ్‌, క్రిష్‌తో మూవీ తర్వాత ఇది తెరకెక్కే అవకాశం ఉంది. ఎంతలేదన్న కనీసం ఏడాదిన్నర నుంచి రెండేళ్ల తర్వాతే రిలీజ్‌ కావొచ్చు. అప్పటికి రాజకీయంగా కూడా పవన్‌కు ప్లస్‌ రీతిలో ఈ మూవీని తీర్చిదిద్దాలన్నది చిత్ర బృందం ప్లాన్‌ అనిపిస్తోంది. అదే నిజమైతే పవన్‌ వెండితెరపై ఫస్ట్‌టైమ్‌ ఖద్దరు బట్టలతో పొలిటీషియన్‌గా కనిపిస్తాడు. ఈ ఫిల్మ్‌ ప్రీ ప్రొడక్షన్‌ దాదాపు చివరి దశకు వచ్చేసింది. షూటింగ్‌ గురించి చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇండస్ట్రీపై కరోనా పంజా.. ఎస్పీ బాలుకు పాజిటివ్


దేశంలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతోంది. రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రాణాంతక మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. దేశవ్యాప్తంగా సాధారణ ప్రజలనే కాకుండా రాజకీయ, సినీ ప్రముఖులపై పంజా విసురుతోంది. అప్రమత్తంగా ఉంటున్నప్పటికీ వైరస్‌ ముప్పు నుంచి తప్పించుకోవడం కష్టంగా మారింది. ముఖ్యంగా తెలుగు సినీ ప్రముఖులను కరోనా వెంటాడుతోంది. ఇప్పటికే స్టార్ డైరెక్టర్లు ఎస్‌ఎస్‌ రాజమౌళి, తేజ కరోనా బారిన పడ్డారు. తాజాగా గాన గాంధర్వుడు, ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యంకు కరోనా పాజిటివ్‌ అని తేలడంతో ఇండస్ట్రీ మరోసారి ఉలిక్కిపడింది. మంగళవారమే ఫిమేల్ సింగర్ స్మిత, ఆమె భర్తకు పాజిటివ్‌ అని నిర్ధారణ కాగా ఇప్పుడు బాలుకు కూడా వైరస్‌ సోకింది. ఈ విషయాన్ని బాలునే వెల్లడించారు.

Also Read: తెలుగు డైరెక్టర్ తో మరో బాలీవుడ్ స్టార్ !

తనకు కోవిడ్19 పాజిటివ్‌ అని తేలిందని బుధవారం ఫేస్‌బుక్లో వీడియో పోస్టు చేశారు. గత మూడు రోజులుగా కాస్త అనారోగ్యంగా ఉండటంతో కరోనా పరీక్షలు చేయిస్తే పాజిటివ్‌గా తేలిందన్నారు. మెడిసిన్ ఇచ్చి హోం క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచించారని చెప్పారు. కానీ, కుటుంబసభ్యలుకు ఇబ్బంది కలగకూడదని భావించి హాస్పిటల్‌లో చేరినట్లు తెలిపారు. తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని ఏ ఆందోళన అక్కర్లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి జ్వరం తగ్గిందని, రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్‌ అయి ఆరోగ్యంగా ఇంటికి వెళ్తానని బాలు ధీమా వ్యక్తం చేశారు. తమ అభిమాన గాయకుడు కరోనా బారిన విషయాన్ని తెలుసుకొని అభిమానులు కంగారు పడ్డారు. అయితే, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉండడం.. వీడియో ద్వారా స్వయంగా ముందుకు రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. బాలు త్వరగా కోలుకోవాలని అభిమానులు, ఇండస్ట్రీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.

Also Read: సినిమా పోకడ ఏమైపోతుందో.. !

కాగా, పాప్‌ సింగర్ స్మిత తనకు కరోనా సోకిందని మంగళవారం వెల్లడించింది. తన భర్త శశాంక్‌ కూడా పాజిటివ్ అని తేలిందని చెప్పింది. మరోవైపు రాజమౌళి కుటుంబం హోమ్‌ క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటోంది. ఇప్పటికే కరోనా బారిన పడిన వాళ్లలో ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్‌, టీవీ నటులు నవ్య స్వామి, రవికృష్ణ, భరద్వాజ్‌, సాక్షి శివ తదితరులు మహమ్మారిని జయించారు. కానీ, టాలీవుడ్‌ నిర్మాత, ఈతరం ఫిలిమ్స్‌ సమర్పకుడు పోకూరి రామారావు (64) మాత్రం కరోనా సోకి కన్నుమూశారు. ఆయనకు ఇతర అనారోగ్య సమస్యలు ఉండడంతో కరోనాను జయించలేకపోయారు.

https://www.facebook.com/706849099372933/videos/309605840390909

మీడియా టైకూన్ పతనం ప్రారంభమైందా?


ప్రముఖ మీడియా టైకూన్.. ఓ పార్టీకి రాజగురువు అయిన ఆ పెద్దాయన పని అయిపోయిందా? అన్ని వ్యాపారాలు నష్టాల్లో మునుగుతున్నాయా? కరోనా దెబ్బకు కుదేలైన మీడియా రంగంలో ఆయన చేతిలో ఉన్న మీడియాకు కూడా భారీ దెబ్బనే తగిలింది. ఇప్పటికే ఉద్యోగులను కర్రవిరగకుండా పాముచచ్చేలా సాగనంపిన ఆయన ఇప్పుడు మరో వ్యాపారాన్ని కూడా వదిలేసి చేతులెత్తేసిన వైనం హాట్ టాపిక్ గా మారింది.

Also Read: మూడు రాజధానులపై హైకోర్టు స్టే.. జగన్ సర్కార్ కు షాక్..!

ప్రముఖ మీడియా టైకూన్ ఆయన ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలను శాసించారు. ఏకంగా సీఎంలను మార్చేసిన ఘనత ఆయన సొంతం. అలాంటి ఆయనను కరోనా షేక్ చేసిందని చెప్పవచ్చు. ఈ మధ్య 40 ఇయర్స్ ఇండస్ట్రీ రాజకీయనేత వచ్చి కలిసినా ఈ పెద్దమనిషి వ్యాపార ఫస్ట్రేషన్ లో సరిగా మాట్లాడలేకపోయాడట..

చాలా అభిరుచి, ఆసక్తితో ప్రారంభించిన ఆయన వ్యాపార సామ్రాజ్యం అంతా ఇప్పుడు ఒక్కటొక్కటిగా కూలుతుంటే తీవ్ర డిప్రెషన్ లోకి జారిపోయినట్టు తెలిసింది. సదురు పెద్ద మనిషి వ్యాపారాల్లో లాభాలు వస్తే విస్తరిస్తాడు. నష్టాలు వస్తే మాత్రం వెంటనే ఎక్కువ సమయం వాటిపై ఖర్చు చేయకుండా ఉన్న ఫళంగా మూసివేస్తాడు.

1980లోనే నేటి యాపీ, మజా లాంటి ఫ్రూట్ డ్రింక్ ను సదరు మీడియా టైకూన్ లాంచ్ చేశాడు. కానీ నాడు దీనికి ఆదరణ లేకపోవడంతో వెంటనే కంపెనీని మూసివేశాడు. ఇక తెలుగు మీడియాలో నంబర్ 1గా ఉన్న ఆయన అప్పట్లో ఇంగ్లీష్ దినపత్రికను తీసుకొచ్చి చేతులు కాల్చుకున్నాడు. దేశంలోని దిగ్గజ పాత్రికేయులను తీసుకొచ్చి నష్టాల పాలు కావడంతో వారందరినీ తీసేశాడు.

Also Read: ఉద్యమం బాబుదైతే, త్యాగం మాత్రం జగన్ చేయాలట..

ఇప్పుడు ఆయన గతంలో ప్రారంభించిన సినిమా డిస్ట్రిబ్యూషన్ కంపెనీని మూసివేశాడని సమాచారం అందుతోంది.ఒకప్పుడు బాలీవుడ్, టాలీవుడ్ లో సినిమాలు పంపిణీ చేసిన సంస్థను ఇప్పుుడు మూసివేశాడట.. భారీ మౌలిక సదుపాయలుండి.. థియేటర్లను లీజుకు తీసుకున్న సదురు మీడియా టైకూన్ ఇప్పుడు పూర్తిగా ఆ బిజినెస్ కు స్వస్తి పలికాడని చెబుతున్నారు.

ఇక ఇప్పటికే సినిమాల నిర్మాణ రంగాన్ని నిలిపివేసిన పెద్దమనిషి.. ఇప్పుడు కరోనా లాక్ డౌన్ తో సినిమాలు ఎప్పుడు విడుదల అవుతాయో.. అసలు రిలీజ్ అవుతాయో లేదోనన్న సందేహంతో డిస్ట్రిబ్యూషన్ ను వదిలేయడంతో సినీ రంగం నుంచి పూర్తిగా పక్కకు తొలిగినట్టే కనిపిస్తోంది.

నదీజలాల కోసం కేసీఆర్, జగన్ ఫైట్


ఏపీ సీఎం జగన్ గెలుపు కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ సహకరించారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. అలాగే తనకు సహకరించిన కేసీఆర్ కు స్వయంగా వచ్చి మరీ కృతజ్ఞతలు తెలిపారు జగన్. ఈ జోడీ అన్నాదమ్ముల వలే కలిసిపోయి సాగడం తెలుగు రాష్ట్రాల్లో సహృద్భావ వాతావరణాన్ని సృష్టించింది.

Also Read: మూడు రాజధానులపై హైకోర్టు స్టే.. జగన్ సర్కార్ కు షాక్..!

ఇదేకాదు.. రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల బదిలీలు.. నదీజలాలు, సచివాలయ భవనాల అప్పగింత విషయంలో రెండు రాష్ట్రాల సీఎంల మధ్య అంగీకారం కుదిరింది. ప్రస్తుతం కూల్చివేస్తున్న సచివాలయ ప్రాంగణంలో ఏపీకి కేటాయించిన భవనాలను జగన్ సర్కార్ కేసీఆర్ కు అప్పగించి సహకరించింది.

అయితే తాజాగా నదీజలాల వివాదాలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి తెరమీదకి వచ్చాయి. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటీషన్ వేయడంతో వివాదం రాజుకుంది. ఈ ప్రాజెక్టు టెండర్లను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంను కోరింది.

ఎంత అన్నాదమ్ములైనా సరే నదీ జలాలు.. తెలంగాణ అస్తిత్వం విషయం వచ్చేసరికి కేసీఆర్ వెనక్కితగ్గడం లేదు.అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ వైఖరుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. సీమ ప్రజల కోసం తెలంగాణతో ఫైట్ కు జగన్ వెనుకాడడం లేదు.

Also Read: ఉద్యమం బాబుదైతే, త్యాగం మాత్రం జగన్ చేయాలట..

పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచితే దక్షిణ తెలంగాణ రాష్ట్రం ఎడారిగా మారుతుంది. నాగార్జున సాగర్ లోకి చుక్క నీరు రాక నల్లగొండ, మహబూబ్ నగర్ తోపాటు ఖమ్మం జిల్లాలకు తీవ్రనష్టం. సాగర్ కింద దాదాపు 25 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. అందుకే కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాల కోసం వెనక్కి తగ్గకుండా ఆంధ్రతో ఫైట్ కు రెడీ అయ్యారు. ఇక కృష్ణ నదిలో తమకు కేటాయించిన నీటినే వాడుకుంటామంటూ జగన్ సైతం రాయలసీమ ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టుముట్టడంతో ఈ వివాదం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి అగ్గిరాజేస్తోంది. నదీజలాల విషయంలో ఇచ్చిపుచ్చుకునేలా సామరస్యంగా వెళదామనుకున్న సీఎం జగన్, కేసీఆర్ లు ఇప్పుడు సుప్రీం కోర్టుల వరకు వెళ్లడం రెండు రాష్ట్రాల మధ్య వివాదాలను పెంచుతోంది.

ఉద్యమం బాబుదైతే, త్యాగం మాత్రం జగన్ చేయాలట..!

Chandrababu Naidu


చంద్రబాబు పసలేని సవాల్ చూసి ఆంధ్ర ప్రజలు మరియు రాజకీయ విశ్లేషకులు నవ్వుకుంటున్నారు. విషయం లేని ఈ సవాల్ వల్ల ఒరిగే ప్రయోజనం ఏమిటని చర్చించుకుంటున్నారు. రెండు రోజుల క్రితం వైసీపీ ప్రభుత్వానికి బాబు అమరావతి విషయమై ఓ సవాల్ విసిరారు. 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో ఎన్నికలకు దిగి మరలా గెలవాలట. అలా కనుక వారు మరలా విజయం సాధిస్తే మూడు రాజధానుల నిర్ణయానికి ప్రజామద్దతు ఉందని, అమరావతి అంశాన్ని వదిలివేస్తాం అన్నారు. ఈ విషయమై వైసీపీకి 48గంటల డెడ్ లైన్ విధించిన చంద్రబాబు తనకు ఏ విషయం చెప్పాలని సవాల్ విసిరారు. బాబు చేసిన ఈ వీర సవాల్ ని టీడీపీ మీడియా ఒక రేంజ్ లో ఎలివేట్ చేస్తుంది. బాబు సవాల్ ని స్వీకరించే దమ్ము వైసీపీ ప్రభుత్వానికి, నేతలకు ఉందా అని ఆవేశ పూరిత కథనాలు వండివార్చుతుంది.

Also Read: ఉప ఎన్నికలపై పవన్ భవితవ్యం ఆధారపడి ఉందా?

ఐతే అసలు ఉద్యమం ఎవరిదీ? ఎవరు రాజీనామాలు చేయాలి? అనేది ఇక్కడి ప్రశ్న. అమరావతి ఉద్యమం బాబు మరియు టీడీపీ నేతలది అయినప్పుడు రాజీనామాలు చేయాల్సింది వారు, నిరసన తెలపాల్సింది వారు. అలా కాకుండా వైసీపీ నాయకులు రాజీనామా చేయాలని, అసెంబ్లీ రద్దు చేయాలని కోరడం, బాబు పసలేని పోరాటానికి తార్కాణం. తెలంగాణా ఉద్యమం కోసం కెసిఆర్ మరియు ఆ పార్టీ ఎమ్మెల్యేలు పలుమార్లు రాజీనామా చేసి, మరలా గెలిచి ప్రజామద్దతు తమకు ఉందని నిరూపించుకున్నారు. అమరావతిని రాజధానిగా రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారని బాబు చెబుతున్న పక్షంలో ఆయన పార్టీ తరుపున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు అన్నీ ప్రాంతలకు చెందినవారు ఉన్నారు. కాబట్టి బాబు రాజీనామా చేసి 23 నియోజకవర్గాలలో గెలిచిన పక్షంలో జగన్ తెచ్చిన పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు ప్రజామద్దతు లేదని తేలిపోతుంది. అప్పుడు బాబు కోరుకున్నట్లు జగన్ అమరావతినే రాజధానిగా కొనసాగించే అవకాశం ఉంటుంది.

Also Read: ఏపీ రాజకీయం.. బీజేపీ వెయిట్ అండ్ సీ పాలసీ?

ఉద్యమం నీదైనప్పడు త్యాగం కూడా నీదేకావాలి. స్వాతంత్య్ర పోరాటకాలం నుండి ఉద్యమాలు చేసేవారు త్యాగాలు చేసి నిరసన తెలియజేశారు. బాబు మాత్రం ఉద్యమంలో కొత్త నీతి, తనకు అనుకూల సిద్దాంతం తెరపైకి తెచ్చారు. బాబు ఈ విషయంలో ఎంత గొంతు చించుకున్నా, ప్రజలలో కనీస స్పందన రావడం లేదు. రాష్ట్ర ప్రయోజనాలు మొత్తం ఒక ప్రాంత ప్రజలకే కట్టబెడతాను అంటే ఎవరు మాత్రం ఊరుకుంటారు చెప్పండి. ఇక జగన్ మ్యానిఫెస్టోలో మూడు రాజధానుల అంశం లేదని టీడీపీ నేతలు విమర్శించడం కూడా హాస్యాస్పదంగా ఉంది. 2014 ఎన్నికలలో బాబు అమరావతిని రాజధానిని చేస్తాను అని చెప్పలేదు కదా. అలాగే నిపుణుల కమిటీ సిపార్సులకు విరుద్ధంగా అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారు. బాబు చేసిన అప్పటి తప్పిదాల ఫలితమే నేటి అమరావతి ఉద్యమం.

ఉప ఎన్నికలపై పవన్ భవితవ్యం ఆధారపడి ఉందా?


అమరావతి రాజధాని అంశం ఏపీలో ఉప ఎన్నికలకు దారితీసేలా కన్పిస్తున్నాయి. మూడు రాజధానుల నిర్ణయానికి సీఎం జగన్ కట్టుబడి ముందుకెళుతుండగా.. ప్రతిపక్ష నేత చంద్రబాబు దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని(అమరావతి) అంటూ చంద్రబాబు పోరాడుతున్నారు. తాజాగా జగన్ సర్కార్ ఏపీలో చేపట్టిన వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం లభించడంతో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటలయుద్ధం తారాస్థాయికి చేరుకుంది. చంద్రబాబు నాయుడితోసహా టీడీపీ ఎమ్మెల్సేలంతా రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు. అమరావతి రాజధాని అంశాన్ని ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందాంమంటూ చంద్రబాబు సీఎం జగన్ కు సవాల్ విసురుతున్నారు.

Also Read: ఏపీ రాజకీయం.. బీజేపీ వెయిట్ అండ్ సీ పాలసీ?

చంద్రబాబు సవాలుకు జగన్ స్పందిస్తారా? లేదా అన్నది పక్కకు పెడితే.. ఈ విషయంలో బాబు తన చిత్తశుద్ధి చాటుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. టీడీపీకి చెందిన 23మంది ఎమ్మెల్సేలతో బాబు రాజీనామా చేయిస్తే తప్పనిసరిగా ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఈ ఎన్నికల్లో అధికార పార్టీ టీడీపీకి చెక్ పెట్టేందుకు శతవిధలా ప్రయత్నించడం ఖాయం కన్పిస్తోంది. అయితే ఈ ఉప ఎన్నికలు జనసేన పార్టీకి కత్తిమీద సాములా మారనున్నాయి. జనసేన-బీజేపీ కూటమి ఈ ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుంది. దీంతో పవన్ కల్యాణ్ ఏదో ఒక చోటు నుంచి తప్పనిసరిగా పోటీ చేయాల్సి ఉంటుంది.

ఉప ఎన్నికల ఫలితాలు జనసేన-బీజేపీ కూటమి భవిష్యత్ ను నిర్ణయించనున్నాయి. ఈ ఎన్నికల్లో పవన్ పోటీచేసి సత్తా చాటితే రానున్న రోజుల్లో ఏపీలో జనసేనకు తిరుగుండదనే వాదనలు విన్పిస్తున్నాయి. ఉప ఎన్నికల్లో పవన్ ఎమ్మెల్యేగా గెలిస్తే అసెంబ్లీలో జనసేనకు మరింత బలం చేకూరనుంది. మరోవైపు 2024ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థిపై మరింత క్లారిటీ రానుంది. ఉప ఎన్నికల్లో పవన్ గెలిస్తే ఖచ్చితంగా బీజేపీ పవన్ కల్యాణ్ ను బీజేపీ-జనసేన కూటమికి సీఎం అభ్యర్థిగా ప్రకటించి ముందుకెళ్లడం ఖాయమనే వాదనలు విన్పిస్తున్నాయి.

Also Read: తుస్సుమన్న మాతృభాష మాధ్యమ బోధన విధానం

ఒకవేళ పవన్ ఓడిపోతే ఏంటనే చర్చ ఏపీలో జోరుగా సాగుతోంది. ఉప ఎన్నికల్లో పవన్ ఓటమి చెందితే 2024 ఎన్నికల్లో బీజేపీకి చెందిన వ్యక్తే సీఎం అభ్యర్థి అవుతారని ప్రచారం జరుగుతోంది. త్వరలో జరిగే ఉప ఎన్నికలు బీజేపీ-జనసేన కూటమి భవిష్యత్ నిర్ణయించేలా కన్పిస్తున్నాయి. ఇక ఏపీలో ఎన్నికలు జరిగి ఏడాదే అవుతుండటంతో పవన్ కల్యాణ్ కు ఉప ఎన్నికల్లో గెలుపు అంత ఈజీ కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ సంవత్సర కాలంలో పవన్ పెద్దగా ప్రజా మద్దతు కూడగట్టుకున్నది కూడా ఏం లేదని.. దీంతో ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండటమే బెటరని కొందరు పవన్ అభిమానులు సూచిస్తున్నారట.

దీంతో జనసేనాని ఉప ఎన్నికల విషయంలో ఎలా ముందుకెళుతారనేది ఆసక్తికరంగా మారింది. అలాగే పవన్ సినిమాల్లో కొనసాగాలా? లేదా రాజకీయాల్లో కొనసాగాలా అనేది కూడా ఈ ఉప ఎన్నికలే తేల్చే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఏపీలో ఉప ఎన్నికలు పవన్ సత్తాకు పరీక్ష పెట్టేలా కన్పిస్తున్నాయి. మరీ పవన్ సత్తా చాటుతారా? లేదా అనేది వేచి చూడాల్సిందే..!

తెలుగు డైరెక్టర్ తో మరో బాలీవుడ్ స్టార్ !


అర్జున్ రెడ్డి‘ లాంటి బోల్డ్ సినిమాని రెండు ప్రధాన భాషల్లో తీసి తనకంటూ సొంత మార్కెట్ తెచ్చుకున్నాడు దర్శకుడు సందీప్ వంగ. నిజానికి అర్జున్ రెడ్డికి ముందు సందీప్ పరిస్థితి అసిస్టెంట్ డైరెక్టర్ కి కూడా తక్కువే. అలాంటి స్థితి నుండి ఒక్కసారిగా ఒక్క సినిమాతో నేషనల్ డైరెక్టర్ రేంజ్ గుర్తింపు తెచ్చుకోవడం అంటే.. టాలెంట్ కంటే ముందు అదృష్టం ఉండాలి. లేకపోతే హిందీలో ‘కబీర్ సింగ్’ లాంటి సినిమాలు చాలా వచ్చాయి. అలాంటిది ఈ రీమేక్ సినిమాని భారీ బ్లాక్ బస్టర్ చేయడం ఏమిటి. ఏమైనా సందీప్ అక్కడ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు.

Also Read: క్రేజీ ఆఫర్ కొట్టేసిన మహేశ్‌ హీరోయిన్‌!

ఇప్పుడు సందీప్ రెడ్డి సినిమాకి నిర్మాతలు ఎంత బడ్జెట్ అయినా పెట్టడానికి ముందుకొస్తున్నారంటే అది ‘కబీర్ సింగ్’ ఇచ్చిన నమ్మకమే. కాగా సందీప్ తన తరువాత సినిమాని అర్జున్ కపూర్ తో ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే అర్జున్ కి కథ కూడా చెప్పాడట. అర్జున్ కపూర్ కూడా సినిమా చేయడానికి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కరోనా అనంతరం ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాని నిర్మాత టీ-సిరీస్ భూషణ్ కుమార్, సినీ 1 స్టూడియోస్ మురాద్ ఖేతాని కలిసి భారీ స్థాయిలో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో సంజయ్ దత్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. నిజానికి సందీప్ కి ఇది బెస్ట్ ప్రాజెక్ట్.. మళ్లీ వంద కోట్ల సినిమా ఖాయంలా కనిపిస్తోంది.

Also Read: రానా- మిహీకా పెళ్లి.. కండిషన్స్‌ అప్లై!

కాగా ఈ సినిమాకి సందీప్ సోదరుడు, ‘అర్జున్ రెడ్డి’ నిర్మాత ప్రణయ్ వంగ కూడా చిత్ర నిర్మాణంలో పాలుపంచుబోతున్నాడు. మరి పాన్ ఇండియా సినిమా.. పైగా స్టార్ హీరో.. అన్నిటికి మించి మినిమమ్ గ్యారెంటీ మూవీ. అందుకే ప్రణయ్ ఈ సినిమా నిర్మాణం పై ఆసక్తిగా ఉన్నాడట. ఇక ఈ సినిమా క్రైమ్ డ్రామాగా ఉండబోతోందని.. అలాగే సినిమాలో కొంతభాగం పిరియాడిక్ నేపథ్యంలో సాగుతోందని తెలుస్తోంది. ఏమైనా సందీప్ వంగ సినిమాలు భిన్నంగా ఉన్నా లేకపోయినా మంచి మసాలా కంటెంట్ ఉంటుంది

సినిమా పోకడ ఏమైపోతుందో.. !


సినిమాలకు ఒకప్పుడు లేని భరోసా.. ఇప్పుడు కొత్తగా ఏదైనా వచ్చి పడిందీ అంటే.. అది ఓటిటీల వ్యవహారమే. ఇప్పుడు ఏ సినిమా చేయాలన్నా.. ఎలాంటి నటీనటులను పెట్టాలన్నా, ఓటిటీలోని అభిరుచులను ఆలోచించుకోవాలి. ముఖ్యంగా ఓటిటీల క్రియేటివ్ హెడ్స్ అభిప్రాయాలకు ఆలోచనలకు తగ్గట్లుగానే సినిమాని తీయాలి. అల తీసిన సినిమాకి ఓటిటీ బిజినెస్ అదనపు ఆదాయం. కాకపోతే కరోనా పుణ్యమా అంటే.. ఇప్పుడు చిన్న సినిమాలుకు అదే మెయిన్ ఆదాయం అయిపొయింది. అందుకే ఎట్టిపరిస్థితుల్లో ఓటిటీ వారి మనో భావాలను దృష్టిలో పెట్టుకుని వాటికి అనుగుణంగానే సినిమాలను తీస్తున్నారు మేకర్స్. ఇంతవరకు బాగానే ఉంది.

Also Read: పాపం రకుల్.. మొత్తం పోయేదాకా తెచ్చుకుంది !

కానీ, ఈ మధ్య వస్తోన్న వెబ్ ఫిల్మ్స్ లో కాస్త హద్దులు మీరిన శృంగార తాలుకు బీభత్స రసం బాగా పొంగి పోర్లుతుందనేది సగటు ప్రేక్షకుడి అభిప్రాయం కూడా. ఇప్పుడు ఈ విధానం అన్ని సినిమాలకి అలవాటు అయ్యేలా ఉంది. ఓటిటిలకు తీసే వెబ్ ఫిల్మ్ లోనే కాక, థియేటర్స్ కోసం తీసే సాధారణ ఫిల్మ్స్ కి కూడా ఈ విధానం ఆనవాయితీగా మారేలా కనిపిస్తోంది. అయినా మహిళలను కించపరిచే అంశాలు.. వారి అందాలను హద్దు మీరి ప్రదర్సనలతోనే సినిమాలు బతుకుతాయి అనే దోరణి నిజమే అయితే.. భవిష్యత్తులో ఇంగ్లీష్ సినిమాలోని బిట్ సీన్స్ అన్ని.. ఇక తెలుగు సినిమాల్లో కూడా రెగ్యులర్ అయిపోతాయేమో. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా మారకుండా ఉండాలంటే ప్రేక్షకుల టేస్ట్ మారాలి. వాళ్ళు మంచి సినిమాలనే ఆదరించాలి.

Also Read: క్రేజీ ఆఫర్ కొట్టేసిన మహేశ్‌ హీరోయిన్‌!

అయినా ఒటిటి మాత్రం నిర్మాతలకు ఓ పెద్ద ఊరట.. దీనిలో సినిమాని రిలీజ్ చేయడానికి ఎదురు డబ్బులు కట్టే పని లేదు, ఏ దిల్ రాజు లాంటి వ్యక్తీ చుట్టూ తిరగే పని లేదు. పైగా వారికి ఈ ప్లాట్ ఫామ్ సంబంధించినది కాదు. ఇక ఏం తీసినా ఎవరి గురించి తీసినా మాస్ హడావుడి, గొడవలు పెట్టేంత వ్యవహారం అసలే ఉండదు. మొత్తానికి ఆన్ లైన్ లో వెబ్ మూవీ చేయడం మంచి ఆప్షన్ లాగే ఉంది చిన్న నిర్మాతలకు. కాకపోతే బోల్డ్ అండ్ క్రైమ్ సినిమాలనే హద్దులు దాటి తీస్తే.. సినిమా పోకడే ఏమైపోతుందో..!

అయోధ్యలో భూమి పూజపై.. రావణ గుడి పూజారి ఏమన్నారంటే?


హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడు.. ఆయనను మనసారా కొలువని హిందువు ఉండడంటే అతిశయోక్తి కాదేమో.. దేశంలోని రామాలయం లేని ఊరు.. విధి ఉండాదు.. అలాంటిది రామ జన్మభూమి అయోధ్యలో రామాలయం లేదనే చింత దేశప్రజల్లో ఉండేది. అయితే దశాబ్దాలుగా రామాలయం నిర్మాణంలో నెలకొన్న స్తబ్ధత నేటి భూమిపూజతో వీడనుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో నేడు రామలయ నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు. బుధవారం మధ్యాహ్నం 12.30గంటల నుంచి 12.45మధ్యలో భూమిపూజ కార్యక్రమం జరుగనుంది. ఇప్పటికే ప్రధాని అయోధ్యకు బయలుదేరి వెళ్లారు. ఇదిలా ఉంటే అయోధ్యలో భూమిపూజపై రావణ గుడి పూజారి ఆనందం వ్యక్తం చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Also Read: అక్కడ బీజేపీ ఆకర్ష్ మొదలెట్టిందా?

అయోధ్యలో శ్రీరాముడి ఆలయం భూమిపూజపై రావణ గుడి పూజారి మహంత్ రామదాస్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. శ్రీరాముడికి అయోధ్య ఎలాగో.. రావణుడికి బిస్ రాక్ అలాంటిదేనని ఆయన అన్నారు. అయోధ్యకు దాదాపు 650కిలోమీటర్ల దూరంలోని గౌతమ్ బుద్ద నగర్ జిల్లాలో బిస్ రాస్ అనే గ్రామం ఉందని తెలిపారు. బిస్ రాక్ రావణుడి జన్మ స్థలమని ఇది గ్రేటర్ నోయిడాకు పది కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతంలోని రావణ గుడిలో తాను విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నేడు అయోధ్యలో రామాలయ భూమి పూజ అనంతరం తాను అందరికీ స్వీట్లు పంచుతానని చెబుతున్నారు.

రాముడికి బద్ధవిరోధి అయిన రావణుడి గుడి పూజారి ఇలా కామెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇందుకు ఆయన పలు కారణాలను వివరిస్తున్నారు. ‘అయోధ్యలో భూమి పూజ జరుగుతున్నందుకు.. అక్కడ గొప్ప ఆలయ నిర్మాణించబోతున్నందుకు.. నాకు చాలా సంతోషంగా ఉంది.. రావణుడు లేనిదే ఎవరికీ రాముడి గురించి తెలియదు.. అలాగే రాముడు లేకపోతే రావణుడిని కూడా ఎవరూ పట్టించుకునేవారు కాదు.. అని రామదాస్ చెప్పుకొచ్చారు. అదేవిధంగా రావణుడు గొప్ప జ్ఞానవంతుడు.. ఎన్నో కళల్లో నిష్ణాతుడని.. సీతను అపహరించుకొని వెళ్లాక ఆయన తన భవనానికి తీసుకుని వెళ్లకుండా అశోక వనంలో ఉంచాడని.. అలాగే ఆమెకు కాపలాగా స్త్రీలనే ఉంచాడని తెలిపారు.

Also Read: ఆస్పత్రుల కరోనా దోపిడీ.. చోద్యం చూస్తున్న కేసీఆర్?

ఇక శ్రీరాముడి గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. ఆయన ఎన్నో గొప్ప గుణాలున్న సుగుణాభిరాముడని కొనియాడారు. రాముడిలాగే రావణుడిలోనూ చాలా మంచి లక్షణాలున్నాయని రావణుడిపై తన భక్తిని చాటుకున్నాడు రామదాస్. ఇక తాను పూజారిగా విధులు నిర్వహిస్తున్న బిస్ రాక్ లోని రావణుని గుడిలో శివపార్వతులు, కుబేరుల విగ్రహాలు కూడా ఉన్నాయని తెలిపారు. ఇక్కడికి వచ్చే భక్తులు శివపార్వతులు, కుబేరులతోపాటు రావణుడిని కూడా పూజిస్తారని తెలిపారు. ఈ ఆలయానికి వచ్చే భక్తుల్లో 20శాతం మంది వరకు రావణుడిని ఆరాధకులు ఉన్నారని రామదాస్ చెప్పడం గమనార్హం.

ఇక దశాబ్దాలుగా రామాలయ నిర్మాణం కోసం వేచి చూస్తున్న అయోధ్య వాసుల కలకు నేటితో బీజం పడనుంది. 300కోట్లతో మూడున్నర ఏళ్లలో రామాలయం నిర్మాణం పూర్తికానుంది. రామాలయ భూమి పూజ నేపథ్యంలో ఇప్పటికే అయోధ్యనగరం సర్వాంగ సుందరంగా ముస్తాబై.. రామనామ స్మరణతో మార్మోగిపోతుంది.