
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలకు, సీఎం అభ్యర్థులకు కోదవ లేదు. అయితేనేమ్.. పార్టీని గట్టెక్కించేందుకు ఒక్క నేత కూడా ముందుకురాని పరిస్థితి. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సీనియారిటీ లెక్కన పదవులు అనుభవించిన నేతలు ఇప్పుడు ఏమయ్యారంటూ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నపుడు ముందుండి నడిపించాల్సిన సీనియర్ నేతలు సైలంటవడంపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. ఇలాంటి సీనియర్లు పార్టీలో ఉన్నా ఒక్కటే లేకపోయిన ఒకటేనంటూ బహిరంగగానే విమర్శలు గుప్పిస్తున్నారు.
Also Read: ఆ నేతలు టీఆర్ఎస్ చేరిన ఫలితం లేకపాయే?
రాష్ట్రంలో ప్రతిపక్ష హోదాలో ఉన్న కాంగ్రెస్ ఏమాత్రం అధికార పార్టీకి పోటీ ఇవ్వడం లేదని కాంగ్రెస్ కార్యకర్తలు నైరాశ్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాడాల్సిన నేతలంతా తామకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు నేతలు అడుపదడుప మీడియా ముందు హడావుడి చేస్తున్నారు. ఇక కరోనా ఎంట్రీ ఇచ్చాక కాంగ్రెస్ నేతలంతా ప్రజా సమస్యలను గాలికొదిలి ఇళ్లకే పరిమితమయ్యారని అంటున్నారు. కనీసం గాంధీభవన్ కు, పార్టీ సమావేశాలకు కూడా పార్టీలోని సీనియర్లు హాజరు కాకపోవడంతో వీరిపట్ల జూనియర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ లో సీనియర్లుగా చెలామణి అయ్యే మాజీ మంత్రులు జానారెడ్డి, దామోదర్ రెడ్డి, మహిళా నేతలు గీతారెడ్డి, రేణుకా చౌదరిలు ఎక్కడా కూడా యాక్టివ్ గా కన్పించడం లేదనే టాక్ విన్పిస్తుంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం సీనియారిటీ పేరుతో పదవులు అనుభవించేందుకు మాత్రం వీరంతా రెడీగా ఉంటారని ఇప్పుడు మాత్రం ఎందుకు సైలంట్ గా ఉంటున్నారని కిందిస్థాయి నేతలు ప్రశ్నలవర్షం కురిపిస్తున్నారు. ఇక పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, జగ్గారెడ్డిలు అప్పుడప్పుడు మీడియా ముందు హల్చల్ చేస్తుంటారని అంటున్నారు.
Also Read: మీడియా టైకూన్ పతనం ప్రారంభమైందా?
సీనియర్ నేతలు గ్రూపు రాజకీయాల కారణంగా అధికారంలోకి రావాల్సిన కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చిందంటూ కార్యకర్తలు వాపోతున్నారు. ఓవైపు టీఆర్ఎస్ రాష్ట్రంలో జరిగే ప్రతీ ఎన్నికలో దూసుకెళుతున్నా కాంగ్రెస్ సీనియర్ నేతల్లో చలనం రావడం లేదంటున్నారు. మరోవైపు బీజేపీ కూడా రాష్ట్రంలో పాగా వేసేందుకు చాపకిందనీరులా ప్రయత్నిస్తుందని అంటున్నారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు ముందుండి పార్టీని నడిపించాల్సిందిపోయి సైలంట్ గా ఉండటంపై కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కొన్నిచోట్ల జూనియర్లే రంగంలోకి దిగుతున్నా సీనియర్లు అడ్డుపడుతుండటం గమనార్హం.
కాంగ్రెస్ లోని సీనియర్ నేతల తీరుపై ఇప్పటికే పలువురు నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ అధిష్టానం పార్టీ మొత్తాన్ని ప్రక్షాళన చేసేందుకు రెడీ అవుతుంది. దీనిని ముందే గుర్తించిన సీనియర్లు అక్కడ కూడా తమ పలుకుబడితో పార్టీలో మార్పులు జరుగకుండా కాలయాపన చేస్తున్నారనే టాక్ విన్పిస్తుంది. కాంగ్రెస్ సీనియర్ల తీరుతో విసిగిపోతున్న నేతలంతా ఇతర పార్టీలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నాయి. మరికొందరు మాత్రం కాంగ్రెస్ పై అభిమానంతో పార్టీలోనే కొనసాగుతున్నారు.
ఇప్పటికైనా కాంగ్రెసులోని సీనియర్ నేతలు కళ్లు తెరవకపోతే ముచ్చటగా మూడోసారి కూడా కాంగ్రెస్ ప్రతిపక్షంలో కూర్చోవాల్సిందేనని టాక్ విన్పిస్తోంది. మరీ కాంగ్రెస్ సీనియర్లలో మార్పు వస్తుందో లేదో వేచి చూడాల్సిందే..!