Home Blog Page 8383

వచ్చింది ప్రభాస్‌ మరి..


ఇది కరోనా కాలం. మనుషుల మధ్య దూరం పెంచిన సమయం. దూరమే మనుషులను కాపాడుతోంది. మనసులను దగ్గర చేస్తోంది. ఇంట్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఎదురెదురుగా నిలుచునేందుకు భయపడుతున్నారు. సొంత కుటుంబ సభ్యులను ముట్టుకోవాలన్నా ఒక్క క్షణం ఆలోచిస్తున్నారు. వైరస్‌ భయంతో మాస్కులు, శానిటైజర్లు ఉపయోగిస్తూ అనేక జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లేందుకు జంకుతున్నారు. అలాంటి వాళ్లు ఎదురుగా బహుబలి ప్రభాస్‌ కనిపించేసరికి అన్నీ మరిచిపోయారు. సోషల్‌ డిస్టెన్స్‌, కరోనా రూల్స్‌ను పక్కనపెట్టేసి ఆ ఆజానుబాహుడికి దగ్గరగా వచ్చేశారు. ఇది కలా నిజమా అనుకుంటేనే సిల్వర్ స్క్రీన్‌‌ డార్లింగ్‌ను తమ మొబైల్‌ కెమెరాలతో బంధించారు. అతనితో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. హైదరాబాద్‌ ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయం ఇందుకు వేదికైంది.

Also Read: ‘శర్వానంద్’ ఓ వికలాంగుడు అట !

షూటింగ్స్‌ ఆగిపోవడంతో ఇంటికే పరిమితమైన ప్రభాస్‌ ఉన్నట్టుండి బుధవారం ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయంలో ప్రత్యక్ష్యమయ్యాడు. వ్యక్తిగత పని కోసం ప్రభాస్‌ అక్కడికి వచ్చాడు. బ్లూ షర్ట్‌, కళ్ల జోడు, ముఖానికి వైట్‌ మాస్కుతో సింపుల్‌గా ఆర్టీఏ ఆఫీసుకు వచ్చిన డార్లింగ్‌ ను చూసి అక్కనున్న ఉద్యోగులంతా ఆశ్చర్యపోయారు. తన పని పూర్తి చేసుకొని ప్రభాస్‌ తిరుగు ముఖం పడుతుండగా అక్కడున్న పెద్ద ఆఫీసర్ల నుంచి చిన్న ఉద్యోగుల వరకూ అతని దగ్గరికి వచ్చేశారు. ఒక్క ఫొటో, ఒక్క సెల్ఫీ ప్లీజ్‌ అంటూ అతనితో ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. ఎప్పట్లాగే కూల్‌గా ఉన్న డార్లింగ్‌ అందరికీ ఫొటోలు ఇచ్చాడు. దీనికి కొంత సమయం పట్టినప్పటికీ ఓపిగ్గా ఉన్నాడు. అభిమానులందరినీ సంతృప్తి పరిచాక..చెరగని చిరునవ్వుతో తన కారెక్కాడు.

Also Read: పాపం.. సీనియర్ హీరోకి నిర్మాణ కష్టాలు !

ఇప్పుడు ఈ ఫొటోలన్నీ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. లాక్‌డౌన్‌ టైలో కూడా అభిమానుల దగ్గరికొస్తే ఆప్యాయంగా పలుకరించి వారి చిరు కోరికలను తీర్చిన ప్రభాస్‌పై ప్రశంసలు కురిపిస్తున్నాయి. చివరగా సాహోతో ప్రేక్షకుల ముందుకొచ్చిన రెబల్‌ స్టార్.. ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ మూవీ చేస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. లాక్‌డౌన్‌ ముందు వరకూ జార్జియాలో శరవేగంగా షూటింగ్‌ చేశారు. కానీ, కరోనా కారణంగా చిత్రీకరణకు బ్రేక్‌ పడింది. తొందర్లోనే మళ్లీ షూటింగ్ ప్రారంభించాలని చిత్ర బృందం భావిస్తోంది. మరోవైపు నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో ఓ మూవీకి కూడా ప్రభాస్‌ సైన్‌ చేశాడు.

https://twitter.com/BollywudPrabhas/status/1291219689188651009

జగన్ కు గుడి కట్టడానికి కారణమిదేనా?


రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గుడి కట్టడుతున్న అంశం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గంలో రాజుపాలెం గ్రామంలో నిర్మిస్తున్న ఈ గుడికి స్థానిక ఎమ్మెల్యే తలారి వెంకట్రావు శంఖుస్థాపన చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ వైసీపీ నాయకులకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందనే సందేహం అందరికీ తలెత్తుతుంది. ఈ వ్యవహారం వెనుక చాలా కథ ఉన్నట్లు అక్కడి వైసీపీ నాయకులు కొందరు చెబుతున్నారు.

Also Read: ఉప ఎన్నికలపై పవన్ భవితవ్యం ఆధారపడి ఉందా?

ఎంతో కాలంగా వైసీపీలో నాయకుడిగా ఉన్న తలారి వెంకట్రావు 2014 ఎన్నికల్లో ఓటమి పాలవగా, 2019 విజయం సాధించి ఎమ్మెల్యే అయ్యారు. రెండేళ్లకు మంత్రుల్లో సగం మందిని మారుస్తానని సిఎం కేబినెట్ ఏర్పాటు సమయంలోనే చెప్పారు. ఈ క్రమంలో భవిష్యత్తులో దళిత సామాజిక వర్గం నుంచి తలారి వెంకట్రావు పేరు పరిశీలనలో ఉందని ఆయనకు సమాచారం అందిందంట. దీంతో అప్పటి నుంచి తలారి జగన్ మెప్పు పొందేందుకు కొత్తగా ఏం చేయాలా అని ఆలోచన చేస్తూ చివరికి ఈ నిర్ణయం తీసుకున్నారు.

అంతటితో తలారి వెంకట్రావు ఆగలేదండోయ్… తనకు పరిచయం ఉన్న మంత్రుల వెంట పర్యటనలు చేస్తూ మంత్రులుగా వాళ్లు ఏం చేస్తున్నారు. ఎలా పని చేస్తున్నారు. ఏం చేయాలి అనే విషయాలతోపాటు మంత్రి వర్గ సమావేశాలు జరిగినప్పుడల్లా సచివాలయానికి వస్తున్నాడని స్థానికి వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఇంత చేస్తున్నా ఆ జిల్లాలోని దళిత సామాజిక వర్గానికి చెందిన మంత్రి తానేటి వనితతో మాత్రం తలారి వెంకట్రావుకు సత్సంబందాలు లేవంట.

Also Read: ముందు చంద్రబాబు స్థానం, ఆ తరువాత సీఎం పీఠం..!

ముఖ్యమంత్రి జగన్ కు గుడి కట్టి హిందువుల మనోభావాలు దెబ్బతీయవద్దని అదే జిల్లాకు చెందిన నర్సాపురం ఎంపీ రాఘురామ కృష్ణంరాజు ఎమ్మెల్యే తలారి వెంకట్రావుకు హితవు పలికారు. అయోధ్యలో రామాలయానికి భూమిపూజ చేసిన సమయంలో సిఎం జగన్ గుడి నిర్మాణానికి శంఖుస్థాపన చేయడాన్ని ఆయన తప్పబట్టారు. మీకు అభిమానం ఉంటే జగన్ కోసం చర్చి నిర్మించుకోవాలని సూచన ఇచ్చారు. గుడి అనేది హిందువులకు ఎంతో సెంటిమెంట్ ఆ సెంటిమెంట్ తో ఆటలాడుకోవద్దని సూచించారు. గుడి నిర్మాణానికి శంఖుస్థాపన చేసిన తలారి వెంకట్రావు దానిని చర్చిగా మారుస్తాడా… గుడి నిర్మాణాన్నే పూర్తి చేస్తారో భవిష్యత్తే తెల్చాలి.

‘శర్వానంద్’ ఓ వికలాంగుడు అట !


తెలుగు హీరోలందరిలో మొదటి నుండి వైవిధ్యమైన పాత్రలను చేస్తూ వస్తోన్న హీరో ‘శర్వానంద్‘. పాతికేళ్ల వయసులోనే నలభై ఏళ్ల వ్యక్తిగా నటించి మెప్పించిన టాలెంట్ శర్వాది. కానీ సెకెండ్ గ్రేడ్ స్టార్ ల వరుసలో ఇంతవరకూ శర్వానంద్ పేరు లేకపోవడం బాధే. ఆ మాటకొస్తే ఈ మధ్య శర్వానంద్ కి సాలిడ్ హిట్ వచ్చి చాలా కాలం అయిపోయిందనుకుంటా. గత కొన్ని సినిమాలుగా వరుస ప్లాప్ లతో శర్వానంద్ సతమతమవుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా కొత్త కథలను ఎన్నుకోవడం నిజంగా డేరింగే. ఆ డేర్ శర్వాలో ఉంది. అందుకే ఈ జనరేషన్ లో ఏ హీరో చేయలేని కథను శర్వా లైన్ లో పెట్టాడట. ఒక వికలాంగుడికి సంబంధించిన కథలో శర్వానంద్ హీరోగా నటించబోతున్నాడు.

Also Read: భార్య బాధితుడిగా రవితేజ !

ఇంతకీ ఇది తెలుగు సినిమా కాదట. డైరెక్ట్ తమిళ సినిమా. కాకపోతే తమిళంతో పాటు ఒకేసారి తెలుగులో కూడా తెరకెక్కబోతుంది. మరి తెలుగులో హిట్ లేని టైంలో శర్వానంద్ తమిళంలో సినిమా చేస్తున్నాడు. మరి అక్కడైన హిట్ వస్తోందా.. ఇప్పటికే గతంలో 2011లో వచ్చిన తమిళ్ సినిమా ‘ఎంగేయుమ్ ఇప్పోతుమ్’ (తెలుగులో జర్నీ)లో శర్వానంద్ ప్రధాన పాత్రలో నటించి తమిళ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు. అప్పట్లో తమిళ యంగ్ హీరోకు ఉన్నంత క్రేజ్ ఉండేది శర్వానంద్ కి తమిళంలో. అయితే తమిళ సినిమా చేసి దాదాపు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ ఇన్నేళ్ల తరువాత ఇప్పుడు తమిళ సినిమాలో నటించబోతున్నాడు.

Also Read: ఇండస్ట్రీలో ఉప్మా యవ్వారాల పై కరోనా చెక్ !

ఈ సినిమాకి మరో విశేషం ఏమిటంటే.. ఫేమస్ కొరియోగ్రఫర్ రాజు సుందరం డైరెక్షన్ చేస్తున్నాడు. రాజు సుందరం శర్వానంద్ కాంబినేషన్ అనగానే ఈ సినిమా పై తమిళ ప్రేక్షకుల్లో కూడా బాగానే ఆసక్తి క్రియేట్ అయ్యేలా ఉంది. కొన్నిరోజులుగా చర్చల దశలోనే ఉన్న ఈ చిత్రం తాజాగా ఫిక్స్ అయింది. మరి రాజు సుందరం అయినా శర్వానంద్ కి మంచి హిట్ ఇస్తాడేమో చూడాలి. అన్నట్లు కరోనా ఎఫెక్ట్ తగ్గాక ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

పాపం.. సీనియర్ హీరోకి నిర్మాణ కష్టాలు !


సీనియర్ హీరో డా. రాజశేఖర్ ఇప్పుడు ఏదో కామెడీ పీస్ అయిపోయాడు గాని, గతంలో రాజశేఖర్ కి కూడా ఇప్పుడు విజయ్ దేవరకొండ, నానికి ఉన్నంత క్రేజ్ ఉండేది. పైగా చిరు, బాలయ్య, నాగ్, వెంకీల తరువాత లిస్ట్ లో రాజశేఖర్ పేరే ముందుగా వినిపించేది. ఇండస్ట్రీలోని బంధుప్రీతి అనే ఐటమ్ రాజశేఖర్ కెరీర్ ను తెలియకుండానే బాగానే ఇబ్బంది పెట్టింది. మొత్తానికి ఏది అయితే ఏం హీరోగా ముప్పై ఏళ్ళు బండి నడిపించాడు రాజశేఖర్. ఇంకా హీరోగానే కొనసాగడానికి కిందామీద పడుతున్నాడు.. పడి మళ్లీ లేవలేక లేపేవారి కోసం చూస్తున్నాడు. అయినప్పటికీ ఇంకా గట్టిగానే హీరో పాత్రల కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఆ మధ్య వచ్చిన ‘గరుడవేగ’ హిట్ తో తెలుగు ప్రేక్షుకులకు తనలో మిగిలిపోయిన హీరోయిజాన్ని చూపించినా.. ఆ తరువాత కల్కి అంటూ చేతులెత్తేశాడు.

Also Read: భార్య బాధితుడిగా రవితేజ !

ఇక ప్రస్తుతానికి వస్తే.. రాజశేఖర్ తన తరువాత సినిమాని ‘పూలరంగడు, అహన పెళ్ళంట’ చిత్రాల డైరెక్టర్ వీరభద్రం చౌదరితో ప్లాన్ చేసుకున్నాడు. అయితే ఈ సినిమాకి ఫైనాన్స్ సమస్య. ఎవరైనా డబ్బు పెడతారా అని చాలా రోజుల నుండి వెతుకుతున్నా, రాజశేఖర్ పై డబ్బు పెట్టే ఆ ప్రొడ్యూసర్ ఇంకా దొరకలేదు. అందుకే మనమే సినిమా చేద్దాం అని జీవితతో పదే పదే అంటున్నాడట. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓన్ ప్రొడక్షన్ మంచింది కాదనేది జీవిత అభిప్రాయం. అలా అని సినిమా చేయకుండా ఇంట్లో కూర్చోమని రాజశేఖర్ తో చెప్పలేదు. కాబట్టి తమతో గతంలో సినిమాలు చేయటానికి వచ్చిన ప్రొడ్యూసర్ల లిస్ట్ తీసుకుని వారిని అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక రాజశేఖర్ అయితే సినిమాలోని తన పాత్ర పై చాల సీరియస్ గా దృష్టి పెట్టాడట.

Also Read: ఇండస్ట్రీలో ఉప్మా యవ్వారాల పై కరోనా చెక్ !

ఇవ్వన్నీ బాగానే ఉన్నాయి గాని, అసలు వీరభద్రం చౌదరి అంటేనే ప్లాప్ లో ఉన్న డైరెక్టర్. మరి ఆయనను నమ్మి ఏ ప్రొడ్యూసర్ అయినా ఎందుకు కోట్లు పెడతాడు. పైగా సరికొత్త తరహా కథాంశంతో రానున్న ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా కోసం ఏ ప్రొడ్యూసర్ మాత్రం ఎందుకు రిస్క్ చేయాలనుకుంటాడు. అయితే సినిమాలో రాజశేఖర్ పాత్రకు ఆయన కూతురు పాత్రకు మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్స్ చాలా బాగుంటాయని టాక్ ఉంది. కాకపోతే ఈ ఓటిటి జమానాలో ఇంకా పాత కాలం సెంటిమెంట్ ట్రాక్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది మరో సమస్య. మొత్తం మీద రాజశేఖర్ కి గరడవేగ తర్వాత మళ్ళీ అలాంటి చిత్రం రావాలంటే.. కచ్చితంగా విషయం ఉన్న డైరెక్టర్ పడాలి. ఈ వీరభద్రం చౌదరిలను నమ్ముకుంటే కష్టమే.

రాజధానిపై కేంద్రం వైఖరి ఇదే..!


రాష్ట్ర రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు తన వైఖరిని స్పష్టం చేసింది. ఇన్నాళ్లూ బీజేపీ నాయకులు తలో ప్రకటన చేసి ప్రజలను మభ్యపెట్టారు. రాజధాని తరలింపుపై హై కోర్టులు పలు పిటీషన్ లు దాఖలు అయ్యాయి. ఈ పిటీషన్ లలో కేంద్ర ప్రభుత్వం ప్రస్తావన ఉండటంతో… హై కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఈ విషయంపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ రోజు కౌంటర్ దాఖలు చేసింది. కౌంటర్ లో రాజధాని విషయంలో తన వైఖరిని స్పష్టం చేసింది. రాష్ట్ర రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పేసింది.

Also Read: ముందు చంద్రబాబు స్థానం, ఆ తరువాత సీఎం పీఠం..!

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేకపోవడంతో ప్రత్యేక ప్యాకేజిలో భాగంగా 22,111.88 కోట్లు మంజూరు చేయడం జరిగిందని, ఈ నిధుల్లో రాజధాని అభివృద్ధికి కేటాయించిన నిధులు ఉన్నాయని కౌంటర్ లో పేర్కొంది. 2015 ఏప్రిల్ 23న అప్పటి ప్రభుత్వం రాష్ట్ర రాజధానిగా అమరావతిని నోటిఫై చేసిందని, 2020 జూలై 31న ప్రస్తుత ప్రభుత్వం మూడు రాజధానులకు సంబంధించి గెజిట్ ను ముద్రించిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ పై రాజధాని ప్రాంత ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వానికి కేంద్రం పరోక్షంగా సహకారం అందిస్తుందనే వాదనలు ఎప్పటి నుంచో ఉన్నాయి. రాజధాని విషయంలో మరోసారి ఇది స్పష్టమయ్యింది. శాసన మండలి రద్దు విషయం మినహా మిగిలిన అనేక అంశాల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగానే వ్యవహరిస్తూ వచ్చింది. రాజ్యసభలో ఆరుగురు సభ్యులు ఉన్న నాల్గవ అతిపెద్ద పార్టీగా వైసీపీ ఉండటంతో బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగానే నడుస్తుంది.

Also Read: ఉప ఎన్నికలపై పవన్ భవితవ్యం ఆధారపడి ఉందా?

దీంతో టిడిపి నుంచి బీజేపీలోకి వెళ్లిన నేతలు చెబుతున్నవన్నీ వట్టిమాటలేననే విషయం తేలిపోయింది. బిజెపి ఎంపిగా ఉన్న సుజనా చౌదరి ఇన్నాళ్లు అమరావతి విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందని రాజధాని రైతులను, రాష్ట్ర ప్రజలను నమ్మిస్తూ వచ్చారు. దీని వెనుక టిడిపి హస్తం ఉందని బిజెపి నాయకులు విమర్శిస్తున్నారు. రాజధాని రైతుల్లో ఆశలు రేకెత్తించి, చంద్రబాబుపై వ్యతిరేకత రాకుండా చేసేందుకే ఈ వ్యవహారాన్ని నడిపించారని వారు ఆరోపిస్తున్నారు.

భార్య బాధితుడిగా రవితేజ !


టాలీవుడ్ లో స్పీడ్ గా సినిమాలు చేసే హీరోల లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ మాస్ మహరాజా రవితేజదే. గత ఏడేళ్ల నుండి మంచి సాలిడ్ హిట్ లేకపోయినా వరుస సినిమాలను అంగీకరిస్తూ తన స్పీడ్ ను మాత్రం రవితేజ ఎక్కడా తగ్గించడం లేదు. ఈ క్రమంలో రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ రాసిన కథతో, ‘నేను లోకల్’ ఫేమ్ నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా రానుందని, ముఖ్యంగా సినిమాలో రవితేజ క్యారెక్టరైజేషన్ ఫుల్ కామెడీ టైమింగ్ తో అద్భుతంగా ఉండబోతుందని.. ఒక విధంగా రాజేంద్రప్రసాద్ పాత సినిమాకి ఈ సినిమా సీక్వెల్ గా ఉండబోతున్న విషయం తెలిసిందే.

Also Read: ఇండస్ట్రీలో ఉప్మా యవ్వారాల పై కరోనా చెక్ !

అయితే తాజాగా ఈ సినిమా బృందంలోని సభ్యుడి సమాచారం ప్రకారం ఈ సినిమాలో రవితేజ భార్యా బాధితుడిగా కనిపించబోతున్నాడట. మన చట్టాల్లోని స్త్రీలకు అనుగుణంగా ఉన్న చట్టాలతో రవితేజ పాత్ర ఎన్ని ఇబ్బందులు పడిందో ఫుల్ కామెడీగా చూపించబోతున్నారని తెలుస్తోంది. అయితే చివర్లో మగాళ్లకు సంబంధించి ఫేవర్ గా ఒక మెసేజ్ తో సినిమా ముగుస్తుందట. అలాగే మన చట్టాల్లోని లొసుగులను బాగానే ఎలివేట్ చేస్తూ.. కొన్ని పేరడీ ట్రాక్ లు కూడా ఉన్నాయని సమాచారం. ఇక కరోనా రాకపోయి ఉంటే… ఈ పాటికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లి రిలీజ్ డేట్ ను కూడా ఎనౌన్స్ చేసుకునేది.

Also Read: బిగ్ బాస్ హౌస్ లో.. మసాలా లవ్ డ్రామాలు!

ఏమైనా రవితేజ భార్య బాధితుడిగా అదీ ఫుల్ కామెడీతో అంటే సినిమా పై బాగానే ఆసక్తి క్రియేట్ అవుతుంది. పైగా ఈ మధ్య రవితేజ నుండి ఇలాంటి కామెడీ రాలేదు. ఏది ఏమైనా ఈ సారి రవితేజ ప్రేక్షకులను ఫుల్ గా నవ్వించబోతున్నాడు. ఎలాగూ త్రినాథరావ్ నక్కిన కామెడీని బాగా హ్యాండిల్ చేస్తారు. ఆయన గత చిత్రాలు కూడా ‘సినిమా చూపిస్తా మామ’ ‘నేను లోకల్ వంటి కామెడి సినిమాల్లో గుడ్ ఎంటెర్టైమెంట్ ఉంది. ఆ రకంగా ఇప్పుడు రవితేజతో చేయబోయే సినిమాలోనూ గుడ్ కామెడీ ఉండటం ఖాయం. పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

ముందు చంద్రబాబు స్థానం, ఆ తరువాత సీఎం పీఠం..!

Chandrababu Naidu


బలహీనంగా ఉన్నప్పుడు శత్రువు కొట్టే చిన్న దెబ్బ కూడా గట్టిగా తగులుతుంది. దాని నుండి కోలుకోవడం కష్టం అవుతుంది. ప్రస్తుతం టీడీపీ పరిస్థితి అలాగే ఉంది. ఓ ప్రక్క జగన్ దూకుడు నిర్ణయాలతో ముప్పతిప్పలు పెడుతుంటే మరో ప్రక్క బీజేపీ-జనసేన కూటమి దాడి ఇబ్బంది పెడుతుంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజు మొదటి టార్గెట్ చంద్రబాబుగా కనిపిస్తుంది. అధికార పక్షం కంటే కూడా ఆయన ఎక్కువగా బాబునే టార్గెట్ చేస్తున్నారు. అమరావతి విషయంలో తోడుగా ఉంటారనుకుంటే, మాకేమి సంబంధం లేదని పక్కకు తప్పుకున్నారు. బీజేపీ వ్యూహం కూడా ముందు బాబును బలహీనపరచడమే అనిపిస్తుంది.

ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీని బలహీనపరిచి ఆ స్థానంలోకి బీజేపీ-జనసేన కూటమి చేరాలని ఆశపడుతోంది. క్షేత్ర స్థాయిలో టీడీపీ మరుగునపడేలా చేయాలన్నది వారి వ్యూహం. అమరావతి ఉద్యమంతో బాబు రెండు ప్రాంతాల ప్రజలకు దూరం అయ్యారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతించడం జరిగింది. ఈ రెండు ప్రాంతాలకు చెందిన టీడీపీ నాయకులు ఈ అంశంపై నోరుమెదపడం లేదు. కొందరైతే జగన్ కి మద్దతు పలుకుతున్నారు. గత ఎన్నికలలో ఎదురైన ఘోర ఓటమి తరువాత 23సీట్లతో కుదేలైన టీడీపీ ప్రభావం ఏపీలో తగ్గించడం అంత కష్టమైన పనేమీ కాదు. అలాగే దానికి ఇది అదునైన సమయంగా బీజేపీ పార్టీ భావిస్తుంది.

తెలంగాణలో బలమైన పార్టీగా ఉన్న టీడీపీ తుడిచిపెట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ క్యాడర్ మొత్తం గులాబీ దళంలో చేరింది. అతి తక్కువ శాతం కాంగ్రెస్, బీజేపీ లకు వచ్చి చేరింది. ప్రజలు ఎప్పుడు ఓ బలమైన పార్టీకి మరో బలమైన ప్రత్యామ్నాయం కోరుకుంటారు. టీడీపీ పార్టీపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిన నేపథ్యంలో ఆ పార్టీ క్యాడర్ బీజేపీ-జనసేన కూటమి వైపు మొగ్గు చూపే ఆస్కారం లేకపోలేదు. ఏపీలో వైసీపీ అంత బలమైన పార్టీగా ఎదగడానికి టీడీపీ వ్యతిరేకులు, కాంగ్రెస్ ఓటు బ్యాంకు జగన్ కి మద్దతు తెలపడమే. అందుకే బీజేపీ మొదట బాబు ప్రతిపక్ష స్థానానికి ఎసరుపెట్టి, ఆ హోదా దక్కించుకోవాలని చూస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో జగన్ మేనియాతో మరలా అధికారంలోకి వచ్చినా, భవిష్యత్తులో ఈ కూటమి సీఎం పీఠం ఎక్కే అవకాశం ఉంటుంది. అందుకే టార్గెట్ టీడీపీగా బీజేపీ రాజకీయం సాగుతుందనిపిస్తుంది.

కేసీఆర్.. మళ్లీ అదే మ్యాజిక్ రిపీట్ చేశాడా?

cmkcr


ఎక్కడ తగ్గాలో కాదు.. ఎక్కడ నెగ్గాలో తెలిసినవాడే అసలైన రాజకీయ నాయకుడు అని అంటారు. ఆ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ నాలుగు ఆకులు ఎక్కువే చదివాడని అంటుంటారు. కేసీఆర్ వేసే ప్రతీ అడుగులోనూ రాజకీయం ఉంటుందని చెబుతుంటారు.

Also Read: హోం ఐసోలేషన్ బాధితుల గోడు పట్టదా?

ప్రస్తుతం కేసీఆర్ తీవ్రమైన క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. తెలంగాణలో కరోనాను కంట్రోల్ చేయలేదన్న పెద్ద అపవాదు ఆయనపై ఉంది. మొదట్లో హడావుడి చేసి కరోనా కేసులు పెరుగుతున్న వేళ ప్రభుత్వ వైద్యాన్నీ గాలికి వదిలేశాడన్న విమర్శలున్నాయి. ప్రైవేటు ఆస్పత్రులు దోచుకుంటున్నా.. హైకోర్టు చీవాట్లు పెడుతున్నా స్పందించక విమర్శలపాలయ్యాడు.

అయితే ఎప్పుడు విమర్శలు ఎదురైనా.. తెలంగాణ ప్రజలు ఎంత తిట్టినా.. ఒకే ఒక చర్యతో వారిని మెస్మరైజ్ చేయగల సామర్థ్యం కేసీఆర్ సొంతం. ఇప్పుడూ అదే చేశాడు.

ప్రస్తుతం వానాకాలం.. నీటి అవసరం పొలాలకు బాగా అవసరం. అందుకే కాళేశ్వరం నుంచి తెలంగాణ ప్రాజెక్టులు నింపే పనిని తాజాగా కేసీఆర్ మొదలుపెట్టారు. కాళేశ్వరం నుంచి మిడ్ మానేరు మీదుగా కొండపోచమ్మ సాగర్ వరకు నీళ్లు ప్రవహించేలా మోటార్లన్నీ ఆన్ చేస్తున్నారు.

Also Read: కేసీఆర్, మోడీలకు ఒకేరోజు అసదుద్దీన్ షాక్

దీంతో కరోనా వైఫల్యాలన్నీ మరుగునపడి కేసీఆర్ పై రైతాంగం.. ప్రజల్లో సానుభూతి వెల్లువెత్తుతోంది. బీడువడిన పొలాలకు, కాలువలకు నీళ్లు పారిస్తూ కేసీఆర్ చేస్తున్న భగీరథ యాత్నానికి ఆయన వైఫల్యాలన్నీ కొట్టుకుపోతున్నాయి.

తెలంగాణలోని ప్రాజెక్టులను నీటి కుండలా సిద్ధం చేస్తున్న వైనం నీటి కోసం తండ్లాడిన తెలంగాణ బిడ్డలకు కడుపు నింపుతోంది. కేసీఆర్ తప్పుల్ని లైట్ తీసుకుందామని ప్రజల్లో భావన కలిగిస్తోంది. తెలంగాణ ప్రజలకు ఏమిస్తే.. తనను నెత్తిన పెట్టుకుంటారో తెలిసిన కేసీఆర్ నేర్పరితనాన్నే మరోసారి రిపీట్ చేశారు. అదే ఆయనకు శ్రీరామరక్షగా చెప్పక తప్పదు. ఇలా ఎంతటి గడ్డు పరిస్థితులైనా కేసీఆర్ చాకచక్యంగా పరిష్కరిస్తూ ముందుకు వెళుతుంటారు. మళ్లీ అదే మాజిక్ రిపీట్ చేశారు.

-ఎన్నం

హోం ఐసోలేషన్ బాధితుల గోడు పట్టదా?


తెలంగాణలో కరోనా పంజా విసురుతోంది. రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. తొలినాళ్లలో కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం యంత్రాంగం ఉరుకులు పరుగులు పెట్టింది. అయితే కరోనా ఎప్పుడైతే విజృంభించడంతో మొదలైందో ప్రభుత్వం కూడా చేతులేత్తిసినట్లు కన్పిస్తోంది. కరోనాతో సహజీవనం అనే స్లోగన్ బయటికి తీసి మీ చావు మీరు చావండి అన్నట్లు ప్రభుత్వతీరు ఉండటం శోచనీయంగా మారింది.

Also Read: ఆస్పత్రుల్లో కరోనా దందా.. చోద్యం చూస్తున్న నేతలు?

తెలంగాణలో ఆన్ లాక్ 1.0కు ముందు కరోనా మహ్మమరి కేవలం జీహెచ్ఎంసీకే పరిమితమైంది. ఆన్ లాక్ అమలు చేసే విషయం ప్రభుత్వం చూపిన నిర్లక్ష్యం వల్ల ప్రస్తుతం తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. నగరాల నుంచి పల్లెలకు కరోనా పాకుతున్నా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వ యంత్రాంగం మొద్దునిద్ర పోతుందనే విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి.

ప్రభుత్వం చెబుతున్న మాటలకు ఆచరణలో చేస్తున్న పనులకు ఏమాత్రం పొంతన లేకుండా పోతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా హోం ఐసోలేషన్ బాధితులను గోడును ప్రభుత్వం గాలికొదిలేసిందనే టాక్ విన్పిస్తుంది. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో 25శాతం బాధితుల్లో మాత్రమే లక్షణాలు కన్పిస్తుండగా మిగిలిన 75శాతం మందిలో స్పల్ప లక్షణాలు కనిపిస్తున్నాయి. దీంతో తీవ్రంగా ఉన్నవారిని మాత్రమే ప్రభుత్వం ఆస్పత్రుల్లో చేర్పిస్తుండగా మిగిలిన వారంతా హోం ఐసోలేషన్లో చికిత్స చేయించుకోవాలని సూచిస్తుంది.

Also Read: కేసీఆర్, మోడీలకు ఒకేరోజు అసదుద్దీన్ షాక్

హోం ఐసోలేషన్లో ఉన్నవారికి కరోనా కిట్స్ పేరిట ప్రభుత్వం మాస్కులు, శానిటైజర్లు, మందులు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే కరోనా కిట్స్ కేవలం హైదరాబాద్ నగరానికే పరిమితం అవుతున్నాయి. జిల్లాల్లో కరోనా కిట్స్ అందకపోవడంతో కరోనా రోగుల కుటుంబ సభ్యులు, బంధువులు బెంబేలేత్తిపోతున్నారు. బాధితులకు కేవలం వైద్య సిబ్బంది మందులు మాత్రమే ఇస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఇప్పటికైనా ఐసోలేషన్ బాధితుల గోడు పట్టించుకోవాలని కోరుతున్నారు.

ఇండస్ట్రీలో ఉప్మా యవ్వారాల పై కరోనా చెక్ !


కరోనా సినీ పరిశ్రమలను నాశనం చేసిందని విన్నాం. సినీ కార్మికులకు అత్యంత చేదు సంవత్సరంగా మిగిలిపోయిందని విన్నాం. రోజూ కరోనా చేసిన చేస్తున్న మానసిక ఆరోగ్య ధ్వంసాలను వింటూనే ఉన్నాం. కానీ, కరోనా మేలు కూడా చేసింది. ఎంత చెడులోనైనా ఒకానొక సందర్భంలో మంచి కూడా జరుగుతుందనే నానుడి ప్రకారం కరోనా.. సినీ పరిశ్రమకి మేలు చేసింది. సినిమా అనే రాజ్యంలో తమకంటూ సొంతగా సామ్రాజ్యాలను సృష్టించుకుని కొత్త రక్తాన్ని అణిచి వేస్తోన్న ఎందరో రాజులను కరోనా కుదిపేస్తోంది. వాళ్ళ రాజ్యాలను కూల్చేస్తోంది. సినిమా రంగం పుట్టిన దగ్గర నుండి ఇలాంటి పరిస్థితిని ఎన్నడూ ఎదురుకున్న దాఖలాలు లేకపోవడం.. అన్నిటికి మించి డిజిటల్ విప్లవం రావడం.. సినిమాని ఇలాగే చేయాలి.. సినిమాని ఇలాగే రిలీజ్ చేయాలి.. సినిమా ఇండస్ట్రీలో నిలబడాలంటే నీకు మా దయ ఉండాలి లాంటి చచ్చుబారిన మాటలు ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో వినబడటం లేదు.

Also Read: బిగ్ బాస్ హౌస్ లో.. మసాలా లవ్ డ్రామాలు!

ఏంటి నువ్వు రైటరా.. ఒక్క సినిమాకి కూడా పని చేయకుండానే డైరెక్టర్ అయిపోతావా.. అసలు మ్యూజిక్ అంటే ఏంటో నీకు తెలుసా.. సినిమాల్లో ఎదగాలంటే, ఎదిగిన వాళ్ళ కింద కొన్ని ఏళ్ళు పడి ఉండాలి.. వారికి నీకు వచ్చిన విద్యని, నీ టాలెంట్ ని గోస్ట్ అనే పదం తగిలించుకుని ధారాదత్తం చేయాలి.. లాంటి ఉప్మా యవ్వారాలను కరోనా నిర్దాక్షిణ్యంగా కాటేసింది. విషయం ఉన్నోడే.. స్క్రిప్ట్ రాసుకోవడం వచ్చినోడు ఇప్పుడు ఇండస్ట్రీలో ఏదైనా చేయగలడు. డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఇప్పుడు వస్తోన్న సినిమాలు బయట నుండి వచ్చిన కొత్త కుర్రాళ్లు తీస్తున్నవే. మొదటిసారి ఇలాంటి ఈజీ అవకాశాలు ఇండస్ట్రీలో వచ్చాయి. కరోనా మరో ఏడాది ఇలాగే ఉంటే..ఇండస్ట్రీ పూర్తిగా మారిపోవడం ఖాయం.

Also Read: కీర్తి సురేశ్‌ పెళ్లి.. మళ్లీ లొల్లి

పాపం ఇండస్ట్రీని చాలా ఏళ్ల నుండి ఏలుతున్న వాళ్లకు ఈ పరిస్థితులను ఎలా ఫేస్ చేయాలో.. ఈ కష్ట కాలాన్ని ఎలా నెట్టుకురావాలో అర్ధం కాక అందరిలానే ఏం చేయలేక.. ఇండస్ట్రీలో తమకున్న పట్టును వదిలేస్తున్నట్లు కనిపిస్తుంది. తమ కింద ఉన్న థియేటర్ల వ్యవస్థను వదిలేస్తున్నారు. ఎవరికి వారు కొంత టాలెంట్ కోసం అన్వేషిస్తున్నారు. అయితే సినిమాని నమ్ముకుని బతుకుతున్న కార్మిక బతుకులకు మాత్రం కష్టాలు తప్పడం లేదు. కరోనా వారిని అయోమయంలో పడేసింది. ఇప్పుడు కష్టాలు పడినా.. మళ్లీ మంచి రోజులు వస్తాయనే ఆశతో సినీ కార్మికులు కాలాన్ని కష్టంగా నెట్టుకొస్తున్నారు. అయితే డిజిటల్ లో సినిమా నిర్మాణం పెరిగితే.. వారికి గతంలో దొరికిన స్థాయిలో కరోనా అనంతరం పని దొరకక పోవొచ్చు. కాబట్టి వారు ఇప్పటి నుండే మరో ఆదాయ మార్గాన్ని వెతుక్కోవడం ఉత్తమం అనిపించుకుంటుంది.

బిగ్ బాస్ హౌస్ లో.. మసాలా లవ్ డ్రామాలు!

Tearful tales of 'Bigg Boss 4' contestants
Tearful tales of 'Bigg Boss 4' contestants


బిగ్ బాస్.. ఎమోషన్స్ అండ్ వీక్ నెస్ లనే ఒక గేమ్ లా మార్చిన పక్కా కమర్షియల్ రియాల్టీ షో. ఇలాంటి షోలు తెలుగులో పెద్దగా వర్కౌట్ అవ్వవు అనే దృఢ నమ్మకం ఉండేది ఒకప్పుడు. అందుకే ఇలాంటి షోలు హిందీలో ఎప్పుడో వచ్చినా తెలుగులో రావడానికి చాలా ఏళ్లే పట్టింది. అయితే ఆ క్రెడిట్ ఎన్టీఆర్ కే దక్కుతుంది. సీజన్ వన్ కి హోస్ట్ గా చేసి.. షోని తెలుగు వాకిట్లోకి తీసుకువెళ్ళాడు. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్‌బాస్ సీజ‌న్‌-4 త్వరలో మొదలవుతుంది. క‌రోనా వైర‌స్ వ్యాప్తి వేగంగా ఉన్నా.. బిగ్ బాస్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. పైగా ఈ సారి గత సీజన్ ల కంటే కూడా ఫుల్ మసాలాను యాడ్ చేయబోతున్నారు. అందుకే సాధ్యమైనంత వరకూ హౌస్ లో అమ్మాయిలే ఎక్కువగా ఉండేలా.. వారితో ఉండే అబ్బాయిలతో కాస్త కిక్ ఇచ్చే లవ్ డ్రామాలు యాడ్ చేసేలా బిగ్ బాస్ నిర్వాహకులు ప్లాన్ లో ఉన్నారు.

Also Read: హీరోలతో పడుకోలేదని..నన్ను వేధించారు: రవీనా టాండన్

ఇక ఈ సారి షో షెడ్యూల్ ను కుదించారని.. రెగ్యులర్ గా ఉండే వంద రోజులను అరవై రోజులకు కుదించారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదట. గ‌త మూడు సీజ‌న్ ల్లో వంద రోజుల‌కు త‌గ్గ‌కుండా షోలు ఎలా నడిచాయో.. ఈ ద‌ఫా కూడా వంద రోజుల‌కు తగ్గకుండా బిగ్‌బాస్ రియాల్టీ షో కొన‌సాగనుంది. ప్రస్తుతం ఉన్న ఎంటర్ టైన్మెంట్ కొరతను కవర్ చేసేలా.. అవసరం అయితే షోను మరో పది రోజులు పొడిగించే ఉద్దేశ్యం కూడా ఉందట. ఇక నాలుగో సీజ‌న్‌కు కూడా హోస్ట్‌గా హీరో నాగార్జున వ్యవ‌రించ‌బోతున్నాడు. అయితే కరోనా కారణాన్ని చూపి మొదట నాగ్ హోస్ట్ గా చేయను అన్నాడు. ఆ తరువాత బిగ్ బాస్ టీం నాగ్ ను ఎలాగోలా ఒప్పించిందనుకోండి.

Also Read: నితిన్‌కు విలన్‌గా నయనతార.. సాధ్యమేనా?

కాగా నాగార్జున‌ కోసం బిగ్‌బాస్ టీం ప్ర‌త్యేక జాగ్రత్తలు తీసుకుంటుంది. ముఖ్యంగా నాగ్ కోసం ప్రత్యేక రూమ్స్ ను అండ్ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తోంది. పైగా నాగ్ హౌస్ లోకి రాకుండానే డిజిటల్ లో కనిపిస్తూ హౌస్ ను మధ్యమధ్యలో నడిపించే విధంగా ప్లాన్ చేశారు. క‌రోనా మ‌హ‌మ్మారిని దృష్టిలో పెట్టుకుని నాగ్ కోసం బిగ్ బాస్ టీం మొత్తానికి తమ కండీష‌న్స్ ను పక్కన పెట్టిన‌ట్టు కనిపిస్తుంది. అన్నిటికి మించి నాగ్ ప్రతి వారం నేరుగా కంటెస్టెంట్స్‌తో ఇంట‌రాక్ష‌న్ చేయాల్సిన అవసరం లేకుండా గేమ్ ని డిజైన్ చేసారట.

బాలయ్య తన విలువ కాపాడుకుంటాడా ?


బాలయ్య బాబు ఒకప్పుడు టాప్ హీరోనే. కానీ ఇప్పుడు ఏవరేజ్ హీరో రేంజ్ మార్కెట్ కూడా లేని హీరో. బాలయ్య సినిమా మార్కెట్ ఎప్పుడూ.. ఆయనతో కలిసి పని చేసే డైరెక్టర్లను బట్టే ఉంటుంది. బోయపాటి, క్రిష్ లాంటి స్టార్ డైరెక్టర్ అయితే బాలయ్య సినిమాకి ముందే మార్కెట్ అయిపోతుంది. కానీ, ఫామ్ లో లేని డైరెక్టర్ అయితే… బాలయ్య రూలర్ సినిమాలా ఉంటుంది పరిస్థితి. అందుకే బాలయ్యతో సినిమా చేసేకంటే.. కొత్త హీరోతో డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమా చేయడం బెటర్ అని ఫీల్ అవుతున్నారు ప్రొడ్యూసర్లు. సి కళ్యాణ్ ఇవే మాటలను ఓ డైరెక్టర్ తో పంచుకున్నారట. నిజానికి బాలయ్యతో సి కళ్యాణ్ మరో సినిమా ప్లాన్ లో ఉంది. అసలు కళ్యాణ్ సినిమా అంటే బాలయ్య రెమ్యునరేషన్ గురించి పెద్దగా పట్టించుకోరు.

Also Read: సీనియర్ హీరోకి దేవుడు పట్టాడు !

పైగా సినిమాకి బాలయ్య బల్క్ డేట్స్ కూడా ఇస్తాడు. రోజూ నాలుగు గంటలు ఎక్కువ షూట్ చేయమన్నా కోపరేట్ చేస్తాడు. ఇంత చేసినా బాలయ్యతో సినిమా చేయడానికి ప్రొడ్యూసర్లు ఎప్పుడూ భయపడుతూనే ఉండటం బాలయ్యకు ఇబ్బందే. సి.కళ్యాణ్ బాలయ్యతో ఇప్పటికే మూడు సినిమాలను ప్రొడ్యూస్ చేశారు. అలాంటి ఆయనే ఇప్పుడు బాలయ్య సినిమా నుండి తప్పుకుంటే ఇక మరో ప్రొడ్యూసర్ ఎందుకు ధైర్యం చేస్తాడు. మరి ఈ విషయం ఇండస్ట్రీలో అందరికి అర్ధం అవుతున్నా.. బాలయ్య వరకూ ఎందుకు వెళ్లడం లేదో. తోటి హీరోలంతా తమ మార్కెట్ పరిధిని పెంచుకోవడానికి ఎప్పుడూ ఆరాటపడుతూ ఉంటే.. బాలయ్య బాబు ఒక్కడే అసలు తన సినిమాకి కలెక్షన్స్ ఎన్ని వస్తున్నాయో అని కూడా అడగరు.

Also Read: హీరోలతో పడుకోలేదని..నన్ను వేధించారు: రవీనా టాండన్‌

అడిగినా ఆ ఫిగర్లు బాలయ్యను ఇబ్బంది పెట్టేవే. అసలు తన కెరీర్ లో అనేక సూపర్ హిట్ చిత్రాలతో ఇండస్ట్రీ టాప్ కలెక్షన్స్ ను రాబట్టిన బాలయ్య మొత్తానికి బాక్సాఫీస్ వద్ద చల్ల బడ్డారు. ఇది బాలకృష్ణ తప్పే. మొదటి నుండి కథల విషయంలో డైరెక్టర్ ల విషయంలో సరైన జడ్జ్ మెంట్ లేకుండా తనకు ఇష్టమైన వ్యక్తులకి ఏదో వరం ఇచ్చిన లెవల్లో ఛాన్స్ లు ఇచ్చి ఉన్న మార్కెట్ ని పోగొట్టుకున్నాడు. ఇప్పటికైనా సరైన కథలను, విశ్వసనీయత ఉన్న డైరెక్టర్ లను ఎంపిక చేసుకుంటేనే బాలయ్యకి బాక్సాఫీస్ వద్ద కనీస గౌరవం దక్కుతుంది. నిజానికి బాలయ్య మార్కెట్ రేంజ్ టాలీవుడ్ లో ఒకప్పుడు సెకెండ్ ప్లేస్.. మళ్ళీ తన సెకెండ్ పొజిషన్ ను సాధించలేక పోయినా అవమానకరమైన ప్లాప్స్ లేకుండా చూసుకున్నా బాలయ్య తన విలువను కాపాడుకున్న వాడు అవుతాడు.

కీర్తి సురేశ్‌ పెళ్లి.. మళ్లీ లొల్లి


సౌత్‌లో ఇప్పుడు భారీ డిమాండ్‌ ఉన్న హీరోయిన్లలో కీర్తి సురేశ్‌ ముందుంటుంది. మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న ఆమె ఇప్పుడు వరుస సినిమాలతో బీజీగా మారింది. తమిళ నిర్మాత సురేశ్ కుమార్, నటి మేనక కుమార్తె గా చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా వెండితెరకు పరిచయం అయిన ఆమె తక్కువ టైమ్‌లోనే తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయంతో తెలుగు, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమల్లో పాపులర్ హీరోయిన్‌గా ఎదిగింది. మహానటి తర్వాత క్షణం తీరికలేకుండా మారిందామె. కెరీర్ పరంగా ఇంత బిజీగా ఉన్న కీర్తి సురేశ్‌ త్వరలోనే పెళ్లి చేసుకోనుందంటూ వార్తలు వస్తున్నాయి. ఓ వ్యాపారవేత్తతో ఆమె మ్యారేజ్‌ ఫిక్స్‌ అయిందని, తల్లిదండ్రులు కుదిర్చిన వివాహం ఇదని వార్తలు వినిపించాయి. కానీ, రీసెంట్‌ ఇంటర్వ్యూస్‌లో వీటిని కీర్తి కొట్టి పారేసింది. ‘పెళ్లి వార్తలు నాకు కూడా ఆశ్చర్యం కలిగించాయి. ఇలాంటి పుకార్లు ఎలా సర్క్యూలేట్‌ అవుతున్నాయో నాకు కూడా అర్థం కావడం లేదు. ప్రస్తుతం నాకు అలాంటి ప్రణాళికలు లేవని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన నాకు లేదు’ అని వెండితెర మహానటి స్పష్టం చేసింది.

Also Read: నితిన్‌కు విలన్‌గా నయనతార.. సాధ్యమేనా?

అయితే, ఫిల్మ్‌ ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు కీర్తి తొందర్లోనే పెళ్లి పీటలు ఎక్కనుందట. కీర్తి సురేశ్‌ ఈ మధ్య కొత్త సినిమాలు ఒప్పుకోవడం లేదు. కొత్త కథలు కూడా వినడం లేదట. దానికి కారణం ఏమిటో ఆమె స్పష్టం చేయనప్పటికీ పెళ్లికి ప్రిపేర్ అవడం కోసమే ఆమె ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. అయితే, తన వివాహం గురించి కీర్తి నుంచి గానీ, ఆమె కుటుంబ సభ్యుల గురించి గానీ ఇంత వరకూ అధికారిక ప్రకటన ఏదీ లేదు. కానీ, పెళ్లి గోల మళ్లీ మొదలవడంతో యువ నటి స్పందించకపోతే అది నిజమే అన్న అభిప్రాయం కలుగుతోంది.

Also Read: ఫాలో ఫాలో.. రకుల్ ఇన్‌స్టా‌ ఫాలోవర్లు కోటిన్నర

కాగా, సినిమా విషయానికి వస్తే కీర్తి చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. మలయాళంలో మరక్కార్, సింహం, తమిళ్‌లో రజనీకాంత్‌ అన్నార్తె మూవీలో నటిస్తున్న ఆమె.. తెలుగులో మిస్‌ ఇండియా, గుడ్‌ లక్‌ సఖీ, రంగ్‌ దే చిత్రాలు చేస్తోంది. పరశురామ్‌, మహేశ్‌ బాబు కాంబినేషన్లో వస్తున్న సర్కారు వారి పాటకు కూడా ఒప్పుకున్నట్టు కీర్తినే వెల్లడించింది.

72 సంవత్సరాల తర్వాత భారత్ గా మారిన ఇండియా

Now India transformed as Bharat

Now India transformed as Bharat

ఆగస్టు 5 చరిత్రలో మరపురాని రోజుగా మిగిలిపోతుంది. పోయిన సంవత్సరం ఇదే రోజు ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్మూ-కాశ్మీర్ ని భారత్ లో పూర్తిగా మమేకం అయ్యే పునాదులు నిర్మించారు. ఈ సంవత్సరం ఇదే రోజు కోట్లాది హిందువుల మనోభావాలకు అనుగుణంగా రాముని జన్మభూమి లో మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. ఈ రెండు చర్యలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేవే. ఈ రెండు పనులు విజయవంతంగా , చాకచక్యంగా చేయటం లో మోడీ నాయకత్వ పటిమను అభినందించకుండా ఉండలేము. ఒకటి 72 సంవత్సరాల సమస్య, రెండోది 500 సంవత్సరాల సమస్య. ఈ రెండూ స్వాతంత్రం వచ్చినప్పటినుంచీ మనకు గుదిబండలాగా వేలాడుతూనే వున్నాయి. వీటికి పరిష్కారం కనుగొనటానికి నిజాయితీగా ఇంతకుముందు పాలకులు ప్రయత్నం చేసిన దాఖలాలు లేవు. మొదటిది పాలకుల స్వయంకృతాపరాధం అయితే రెండోది చారిత్రక వారసత్వం . గత వారం రోజులనుంచి ఈ రెండింటిపై పుంఖాను పుంఖాలుగా వ్యాఖ్యానాలు వస్తున్నాయి. మేధావుల్లో ఎక్కువమంది ప్రభుత్వం తీసుకున్న చర్యలపై విమర్శల జోరు పెంచారు. కానీ ఒక్కరుకూడా ఇంతకుమించి శాశ్వత పరిష్కారమేమిటో చూపించలేదు. కాశ్మీర్ సమస్య పై ఈ మాట్లాడే వాళ్ళు ఒక్కరుకూడా ఎలా పరిష్కరించాలో చెప్పరు. ఎందుకు ఈ సమస్యను ఇంతకుముందు పాలకులు పరిష్కరించలేకపోయారో చెప్పరు. కానీ ఈ ప్రభుత్వం ఆర్టికల్  370 రద్దు చేయటంతో కాశ్మీర్ అల్లకల్లోలం అయినట్లు అంతకుముందు పరిస్థితులు సాఫీగా వున్నట్లు ఓ భావన సృష్టిస్తున్నారు. దీనిపై మరింత లోతుగా తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతం రామమందిర భూమిపూజకే పరిమితమవుదాం.

అయోధ్య రామజన్మ భూమి వివాదానికి ముగింపు 

గత వారం రోజులనుంచి జాతీయ చానళ్లలో ప్రధానమంత్రి రామమందిర భూమిపూజకు వెళ్ళటం పై చర్చల మీద చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వం సెక్యులర్ ప్రభుత్వం కాబట్టి ప్రధానమంత్రి వెళ్లకూడదని వామపక్ష మేధావులు, ఇస్లాం వాదులు , ఉదారవాదులు వాదించారు. రాజకీయపార్టీలు బిజెపి  దాని మద్దత్తుదారులు తప్పించి అన్ని రాజకీయపార్టీల ప్రతినిధులు కూడా దాదాపు అదే పద్దతిని అవలంబించారు. కానీ కాంగ్రెస్ ఎప్పటిలాగే రెండు నాల్కల ధోరణిని అవలంబించింది. ముందుగా మౌనం వహించిన సోనియా గాంధీ కుటుంబం చివరకు ఒంటరివాల్లమవుతున్నామని భావించి చివరిలో రామమందిర నిర్మాణానికి  మద్దత్తుగా మాట్లాడవలసి వచ్చింది. ఈలోపు జరగాల్సిన నష్టం జరగనే జరిగింది. ఉదాహరణకు మధ్యప్రదేశ్ లో కమలనాథ్ పూర్తి మద్దత్తు ప్రకటిస్తే దిగ్విజయ్ సింగ్ హిందూ భక్తుల ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది. ఈ డోలాయమానం చివరకు మైనారిటీ లలోనూ కాంగ్రెస్ ని నమ్మని పరిస్థితి తెచ్చింది. కేరళలో ముస్లిం లీగ్ ఏకంగా ప్రియాంక గాంధీ ప్రకటన పై తీర్మానమే చేసింది. ఇక అసదుద్దీన్ ఒవైసీ సరే సరి. దీన్ని అదనుగా తీసుకొని కాంగ్రెస్ పై నిప్పులు చెరిగాడు. అటు హిందువుల్లోనూ ఇటు ముస్లింల లోనూ కాంగ్రెస్ ఒంటరి అయ్యిందని చెప్పొచ్చు. సిపిఎం కూడా దీన్ని అవకాశంగా తీసుకొని కాంగ్రెస్ ది ఎప్పుడూ అవకాశవాదమేనని వెక్కిరించింది.

పరస్పర విరుద్ధ సిద్ధాంతాల కలయిక 

అప్పటికీ ఇప్పటికీ గట్టిగా వ్యతిరేకిస్తున్న మేధావులు వామపక్షవాదులు, ఇస్లాం వాదులు. విశేషమేమంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజాస్వామ్య దేశాల్లో వామపక్ష మేధావులు, ఇస్లాం అనుకూల వాదులు దాదాపు ఒకే పంధాని అనుసరిస్తున్నారు. అమెరికాలో ఇస్లామిక్ వాదులు, వామపక్షవాదులు డెమోక్రటిక్ పార్టీలో ఇస్లాం దేశాల అనుకూల వైఖరిని అనుసరిస్తున్నారు. అలాగే బ్రిటన్ లో లేబర్ పార్టీలోనూ ఇదే తంతు నడుస్తుంది. యూరప్ దేశాల్లోనూ ఇటువంటి వైఖరే కనబడుతుంది. కానీ ఇస్లామిక్ దేశాల్లో వామపక్ష వాదుల్ని నానా హింసలు పెడుతున్నారు. ఇరాన్ , పాకిస్తాన్ , మిగతా గల్ఫ్  దేశాల్లోనూ ఇదేపరిస్థితి. వామపక్ష సిద్దాంతాన్ని  ముఖ్యంగా కమ్యూనిస్టులను దగ్గరకు కూడా రానియ్యరు. కాబట్టి వీరి సఖ్యత కేవలం ప్రజాస్వామ్య దేశాల్లోనే. అంతెందుకు మనదేశం లో కాశ్మీర్ లోగానీ, కేరళ లోగానీ, ఉత్తర ప్రదేశ్ లోగానీ, బీహార్ లోగానీ ముస్లిం ప్రజానీకం కమ్యూనిస్టులను ఆదరించలేదు. పశ్చిమ బెంగాల్ లో మొదట్లో మద్దతిచ్చినా ఒక్కసారిగా మొత్తం తృణముల్ కాంగ్రెస్ వైపు మళ్ళారు. చెప్పొచ్చేదేమిటంటే ప్రపంచం మొత్తం ఇస్లామిక్ సమాజం లో కమ్యూనిస్టులను ముఖ్యంగా భౌతికవాద సిద్ధాంతాన్ని శత్రువుగా చూస్తారు. అందుకే అక్కడ కమ్యూనిజం నిలదొక్కుకోలేదు. చాలా దేశాల్లో దాని ఉనికినే సహించరు. చివరకు పాకిస్తాన్ లో చానాళ్లు కమ్యూనిస్టులను నిషేదించారు. ప్రస్తుతం నామమాత్రంగా  వున్నా ఇస్లాం మతానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఇస్లాం దూషణ చట్టం కింద కఠిన శిక్షలు విధిస్తారు. ఇటీవల అలా మాట్లాడినవాళ్ళ సంగతి ఏమయిందో మనందరికీ తెలుసు. అక్కడిదాకేందుకు కమ్యూనిస్టులు అధికారం లో వున్న చైనా లో వీఘర్ ముస్లింలు , హువే ముస్లింలు ఎటువంటి నిర్బంధాలు ఎదుర్కుంటున్నారో చూస్తున్నాం. కాబట్టి ఈ ఇస్లాం అనుకూల విధానం శాశ్వతంగా నిలబడదు. ఇస్లాం సమాజానికి ఉదార వాదానికి చుక్కెదురు. ఇస్లాం సమాజానికి కమ్యూనిజం బద్ద శత్రువు. చివరకు  సెక్యులర్ టర్కీ లో ఏమయిందో చూస్తున్నాం. ఆధునిక టర్కీ నిర్మాత కమాల్ అటాటుర్క్ హగియా సోఫియా ని మ్యూజియం గా మారిస్తే ప్రస్తుత టర్కీ అధ్యక్షుడు ఎర్డ్ గోవన్ దాన్ని మసీదుగా మార్చిన సంగతి మన కల్లెదుటనే జరిగింది. ఇది నిన్నగాక మొన్న జరిగిన సంఘటన. దానిపై ఒక్క ఉదారవాది మేధావీ భారత దేశంలో ఖండించిన పాపాన పోలేదు. ఇస్లాం సమాజంలో ఉదారవాదులు, హేతువాదులు ఉన్నప్పటికీ వాళ్ళు మనలేని పరిస్థితి. మతవాదం పురులు విప్పి నాట్య మాడే వేళ ఈ ఉదారవాదుల గొంతుక మూగపోవటం చరిత్రలో చూసాం. మరి ఈ ఇస్లామిక్ వాదులతో ఉదారవాదులు, కమ్యునిస్టులు మైత్రి తాత్కాలిక మే నని చెప్పాలి. ఇద్దరూ మైనారిటీ లో వున్నప్పుడు మైత్రి, నిర్ణయాత్మక స్థానంలో వుంటే అణిచివేత చరిత్రలో చూసాం. సిద్ధాంతపరంగా రెండువాదనలు స్థూలంగా ప్రజాస్వామ్య వ్యతిరేకులేనని చరిత్ర చెబుతున్న సత్యం.

భారతీయ సంస్కృతి ఏం చెబుతుంది?

సనాతన ధర్మమైన హిందూ మతం , వైదికాన్ని వ్యతిరేకించిన జైన, బుద్ధ మతాలూ కలిసి శతాబ్దాల తరబడి సహజీవనం చేసాయి. కొద్దిమంది రాజులు తప్ప ఎక్కువమంది అన్ని మతాల్ని సమానంగా గౌరవించారు. చివరకు భౌతికవాదాన్ని ప్రచారం చేసిన చార్వాకుడి ఆలోచనల్ని కూడా గౌరవించిన సమాజం మనది. అరబ్బుదేశాలనుంచి మన కేరళ తీరానికి వచ్చిన క్రైస్తవం, ఇస్లాం ను కూడా అక్కున చేర్చుకున్న ఘనత మనది. కాకపోతే ఉత్తరాది పశ్చిమ తీరాన్నుంచి వచ్చిన ఇస్లాం మాత్రం పూర్తి హింసాత్మకంగా , హిందూ సమాజం పై విరుచుకుపడిన అసహన , అరాచక వాదంగా అవతరించింది. అప్పటివరకు ఇస్లాం సామ్రాజ్యం జయించిన అన్ని ప్రాంతాల్లో ప్రజల్ని ముస్లింలుగా మార్చగలిగినా భారత్ లో అది సాధ్యంకాలేదు. కేవలం కొన్ని ప్రాంతాల్లోనే ఆ మార్పు జరిగింది. ప్రజల్ని భయభ్రాంతుల్ని చేయటానికి వేల దేవాలయాల్ని నేలమట్టం చేసినా, ఇస్లమేతరులపై పన్నులు విధించినా ఇంకా ఎన్నో నిర్బంధాలకు గురిచేసినా ఫలితం మాత్రం పాక్షికమే. ఇది చరిత్రకారులు పరిశీలించాల్సిన అంశం.

చివరకు సెక్యులరిజం పేరుతో క్రైస్తవ మిషనరీలను తీసుకొచ్చి విద్యా, వైద్య రంగాల ద్వారా ప్రజల్ని ఆకర్షించి మతమార్పిడి చేయాలని చూసినా దాని ఫలితమూ పాక్షికమే. ఇప్పటికీ నూటికి మూడొంతుల ప్రజలు హిందూ మతం లోనే వుండిపోయారు. భారతీయ సంస్కృతి లో సింహభాగం సనాతన ధర్మం, ఇతర భారతీయ మతాలదే ననేది దాచేస్తే దాగని సత్యం. కానీ మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ భారతీయ సంస్కృతి కి సింహభాగం దక్కలేదు. ఎప్పుడో వలసవాదులు రాసిన చరిత్రనే చదువుకుంటూ మూలాలను సృజించటం మరిచిపోయాము. అందుకే ఈ తిరుగుబాటు. గత రెండు మూడు దశాబ్దాల హిందూ సామాజిక చైతన్యాన్ని ప్రజలు ఆదరించటాన్ని లోతుగా పరిశీలించకుండా దీన్ని పరిమితమైన కోణం నుంచే చూసి ఇదేదో కొంతమంది పనిగట్టుకొని రెచ్చగొట్టారని అనుకోవటం నిజాన్ని మసిపూసి మారేడుకాయ చేయటమే. రామజన్మభూమి ఉద్యమాన్ని ఈ కోణం నుంచి పరిశీలించాల్సి వుంది. కోట్లాది హిందువుల విశ్వాసానికి సంబంధించిన విషయంగా అర్ధం చేసుకోవటం లో  మేధావులు  విఫలమయ్యారని చెప్పాల్సివుంది. ఇదే ఒక మక్కా విషయం లోనో, ఒక బెత్లేహాం విషయం లోనో జరిగితే ప్రతిచర్య ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించుకుంటే సెక్యులరిజం పేరుతో మనం చేస్తున్న నిర్వాకం అర్ధమవుతుంది. వందల ఏళ్ళు క్రుసేడ్ల పేరుతో జెరూసలెం కోసం కొట్టుకున్న చరిత్రను ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే మత సమస్య ఎంత సున్నితమైనదో గుర్తుకొస్తుంది.చివరకు సుప్రీం కోర్టు తీర్పు తర్వాత కూడా ధోరణి మారలేదంటే వీళ్ళ మనస్సుల్లో హిందూ వ్యతిరేకత గూడుకట్టుకుందని చెప్పాలి.

వీళ్ళు చెప్పే సెక్యులరిజం నేతిబీరకాయలో నేయిలాంటిది. ముమ్మూరు తలాఖ్ నిషేదాన్ని వ్యతిరేకించటం, వుమ్మడి పౌర స్మృతి ని వ్యతిరేకించటం వీళ్ళ సెక్యులరిజం ఏ స్థాయిదో అర్ధమవుతుంది. ఇఫ్తార్ విందులకు ప్రభుత్వ ఖజానా ఖర్చు పెట్టి పార్టీలు ఇచ్చినప్పుడు సెక్యులరిజం గుర్తుకు రాదు. చర్చీలకు ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టినప్పుడు సెక్యులరిజం గుర్తుకు రాదు. సుప్రీం కోర్టు తీర్పు తర్వాత ప్రధానమంత్రి భూమిపూజకు హాజరయితే మాత్రం సెక్యులరిజం గుర్తుకొస్తుంది. ఒవైసీ పార్టీ పేరులోనే మతాన్ని పెట్టుకొని సెక్యులరిజాన్ని గురించి మాట్లాడుతుంటే ఇంతకన్నా హాస్యాస్పదం ఇంకోటి వుండదు. సెక్యులరిజం పేరుతో హిందూ వ్యతిరేక ముస్లిం, క్రైస్తవ కూటమిని కట్టటం దానికి మతానికి వ్యతిరేకమని చెప్పే కమ్యునిస్టులు మద్దత్తివ్వటం, ఏ మతానికి అనుకూలం కాదనే ఉదారవాదులు కేవలం హిందూ వ్యతిరేక పంధాని అవలంబించటం సెక్యులరిజమయితే అటువంటి సెక్యులరిజం మనకొద్దు. భారతీయ సంస్కృతి అన్ని మతాలను గౌరవించే సంస్కృతి. అంటే అర్ధం హిందూ మత విశ్వాసాలను బలిపెట్టి ఇతరమతాలను గౌరవించటం కాదు. మెజారిటీ మత విశ్వాసాలను గౌరవిస్తూనే ఇతర మత విశ్వాసాలను గౌరవించటం. అలా కాకుండా మెజారిటీ మతస్తుల ను రెచ్చగొట్టి గౌరవం కావాలనుకుంటే అది మొదటికే మోసం వస్తుంది. నిన్నటి ఒవైసీ ప్రకటన అత్యంత ప్రమాదకరమైనది. హగియా సోఫియా లాగా తిరిగి రామమందిరం స్థానం లో బాబ్రీ మసీదు ని నిర్మిస్తామని చెప్పటం అంటే అర్ధమేమిటి? టర్కీ లో నూటికి తొంభై మంది ముస్లింలు. మరి ఇక్కడ నూటికి 75 శాతం హిందువులు. ఇక్కడ రామ మందిరం స్థానం లో ఎప్పటికైనా బాబ్రీ మసీదు నిర్మించాలంటే మెజారిటీ హిందువుల్ని ముస్లింలుగా మార్చినప్పుడే అది సాధ్యమవుతుంది. ఈ దేశంలోని కమ్యూనిస్టులు, ఉదారవాదులు ఈ ప్రకటనను ఎందుకు ఖండించరు? సెక్యులరిజాన్ని ఓటు బ్యాంకు రాజకీయాల్లో చూడటమంటే ఇదే.

రామరాజ్యమంటే ఏమిటి?

రాముని పరిపాలన ని ఆదర్శవంతంగా భారతీయ ప్రజలు భావిస్తారు. ధర్మం కోసం, విలువల కోసం ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపిన ఆదర్శమూర్తిగా భారతీయులు రామున్ని పూజిస్తారు. చట్టబద్ద పరిపాలనను నిజాయితిగా అమలుచేసిన పరిపాలనా దక్షుడు. అందుకే మహాత్మా గాంధీ రామరాజ్యం కావాలని కోరుకున్నాడు. గాంధీ కనుక ఆ మాట చెప్పివుండకపోతే ఈ ఉదారవాదులు, కమ్యూనిస్టులు దానిపై పెద్ద రగడే చేసివుండేవాళ్ళు. అప్పటికీ అక్కడక్కడా దీనిపై విపరీత వ్యాఖ్యానాలు వస్తూనే వున్నాయి. అప్పటి సమాజ విలువల్ని, ధర్మాన్ని ఈనాటి విలువలతో పోల్చి దాన్ని వ్యతిరేకించటం సరైనదికాదు. విలువలు ఎప్పుడూ సాపేక్షకమైనవి. అవి కాలాన్ని బట్టి మారుతూ వుంటాయి. ఆరోజుకి ఏవి సమాజహితంగా వున్నాయో వాటికోసం నిబద్దతతో పనిచేయటం కొలబద్దగా వుండాలి. ఆ కోణంలో చూసినప్పుడు రాముడు ఆదర్శపురుషుడు, రామరాజ్యం సర్వజన హితం.అందుకే పార్టీలకతీతంగా , మతాల కతీతంగా, దేశాల కతీతంగా రామున్ని ఆరాధిస్తున్నారు. భారతీయ సమాజాన్ని నిర్మించాలంటే భారతీయ సంస్కృతి మూలాలను మరిచిపోకూడదు. మనతో పాటు ప్రాచీన సంస్కృతి వున్న చైనా లో ఈ విషయాన్ని కమ్యూనిస్టులు గుర్తించి ఇటీవలికాలంలో కన్ఫ్యుషియాస్, టాంగ్ మతాలను వాటి సంప్రదాయాల్ని ప్రోత్సహిస్తున్నట్లు అనేకమంది పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఏ దేశం కూడా వాటి మూలాల్ని మరిచిపోతే మనుగడ సాగించలేదు. అందుకే రామ మందిర నిర్మాణాన్ని జాతీయ సంస్కృతిలో భాగంగా చూద్దాం, మత కోణంలో కాదు. మనం నిర్మించాల్సింది ఇండియా ను కాదు భారత్ ని.

నితిన్‌కు విలన్‌గా నయనతార.. సాధ్యమేనా?


రీసెంట్‌గా పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడైన‌ యువ హీరో నితిన్‌ రెడ్డి ప్రొఫెషనల్‌ లైఫ్‌లో యమ స్పీడుగా ఉన్నాడు. ఈ మధ్య వరుసగా సినిమాలు చేస్తున్నాడు. భిన్న కథలతో వేగంగా ప్రాజెక్టులు ఒప్పుకుంటున్నాడు. ఈ క్రమంలో ఈ ఏడాది ‘భీష్మ’తో బ్లాక్ బాస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు ‘రంగ్‌దే’ చిత్రంలో నటిస్తున్నాడు. దీనికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. కీర్తి సురేశ్ ఇందులో హీరోయిన్. నితిన్‌ పెళ్లి రోజు కానుకగా వచ్చిన టీజర్ చాలా ఇంట్రస్టింగ్‌ ఉంది. అలాగే, చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో కూడా మరో ప్రాజెక్ట్‌ను అనౌన్స్‌ చేశాడు. వీటితో పాటు బాలీవుడ్‌ సూపర్ హిట్‌ మూవీ ‘అంధాదున్’కు కూడా కొబ్బరి కాయ కొట్టాడు. మేర్లపాక గాంధీ దీనికి డైరెక్టర్. ఠాగూర్ మధు సమర్పణలో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, అక్క నిఖితా రెడ్డి నిర్మించనున్నారు. శ్రేష్ట మూవీస్‌ మూడున్నర కోట్లకు రీమేక్ రైట్స్‌ కొనుగోలు చేసింది.

Also Read: హీరోలతో పడుకోలేదని..నన్ను వేధించారు: రవీనా టాండన్‌

కథానుసారం ఇందులో నితిన్‌ అంధుడిగా నటిస్తాడు. మాతృకలో లేడీ విలన్‌ ఉంది. సినిమాకు మెయిన్‌ అసెట్‌ అదే. హిందీలో ఈ పాత్రను సీనియర్ యాక్ట్రెస్‌ టబు పోషించింది. అద్భుత నటనతో సినిమాను రక్తికట్టించింది. తెలుగు రీమేక్‌లో ఈ పాత్ర కు ఎవరిని తీసుకోవాలా అని చిత్ర బృందం చాన్నాళ్లుగా అన్వేషిస్తోంది. టబునే సంప్రదించగా.. మొదట సంసిద్ధత వ్యక్తం చేయలేదు. చిత్ర బృందం అదే పనిగా అడిగితే భారీ రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేసిందట. దాంతో, హాట్‌ యాంకర్ అనసూయ పేరు తెరపైకి వచ్చింది. గతంలో ‘క్షణం’లో విలన్‌గా మెప్పించిన అనసూయ కూడా నో చెప్పిందని సమాచారం.

Also Read: పాపం రకుల్.. మొత్తం పోయేదాకా తెచ్చుకుంది !

ఆ తర్వాత రమ్యకృష్ణ, అలనాటి అందాల నటి శిల్పా శెట్టి పేర్లు కూడా వినిపించాయి. శిల్ప అయితే ఒప్పుకున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. కానీ, అందులో నిజం లేదని తేలడంతో విలన్‌ అన్వేషణ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజా సమాచారం మేరకు లేడీ సూపర్ స్టార్ నయనతారను అప్రోచ్‌ అయిందట చిత్ర బృందం. అయితే, సౌత్‌లో స్టార్ హీరోలను తలదన్నే పాపులారిటీ సొంతం చేసుకున్న నయన్‌కు ఇప్పుడు ఫుల్‌ డిమాండ్‌ ఉంది.ఆడియో ఫంక్షన్స్‌, సినిమా ప్రమోషన్లకు కూడా డేట్స్‌ ఇచ్చే తీరిక లేకుండా బిజీగా ఉన్న నటి ఆమె. అలాంటి స్టార్ హీరోయిన్..‌ నితిన్‌ లాంటి యంగ్‌ హీరో సినిమాలో పైగా విలన్‌ పాత్రలో నటించేందుకు ఒప్పుకుంటుందా? అంటే సమాధానం చెప్పలేం. పైగా, ఈ మూవీలో హీరోయిన్‌గా నటించేందుకు పూజా హెగ్డే నో చెప్పిందట. మరి, నయన్‌ సంప్రదించే సాహనం చేసిన నితిన్‌ అండ్‌ కో ప్రయత్నం ఫలిస్తుందో లేదో చూడాలి.

ఫాలో ఫాలో.. రకుల్ ఇన్‌స్టా‌ ఫాలోవర్లు కోటిన్నర


రకుల్‌ ప్రీత్‌ సింగ్. కొన్నాళ్లు పాటు టాలీవుడ్‌ను ఊపు ఊపిన హీరోయిన్‌.స్టార్ హీరోలతో పెద్ద సినిమాల్లో నటించి యమ స్పీడులో దూసుకెళ్లింది. మోడలింగ్‌ నుంచి చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌గా ఎదిగిందామె. తెలుగులో తన ఫస్ట్‌ మూవీ ‘ కెరటం’. ఈ చిన్న చిత్రం విడుదలైన సంగతి, అందులో రకుల్‌ హీరోయిన్‌ అన్న విషయమే చాలా మందికి తెలియదు. కానీ, తన రెండో సినిమా ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ ఘన విజయం సాధించడంతో రకుల్‌ కెరీర్ టర్న్‌ అయింది. అక్కడి నుంచి వరుసగా అవకాశాలు రావడంతో ఫుల్‌ బిజీగా మారింది. కన్నడ, హిందీ చిత్రాలను వదులుకొని మరీ టాలీవుడ్‌లో సినిమాలు చేసింది. చాకచక్యంగా తీసుకున్న ఈ నిర్ణయం ఆమెకు మంచి ఫలితాన్నే ఇచ్చింది. రామ్‌ చరణ్, ఎన్టీఆర్, బన్నీ, మహేశ్‌ బాబు ఇలా స్టార్లందరితో తెర పంచుకోవంతో రకుల్‌ స్టార్డమ్‌ అమాంతం పెరిగింది.

Also Read: హీరోలతో పడుకోలేదని..నన్ను వేధించారు: రవీనా టాండన్‌

సక్సెస్‌ రేట్‌ ఎక్కువగానే ఉండడంతో తన రేటు కూడా పెంచేసింది. అత్యధిక రెమ్యునరేషన్‌ అందుకునే స్థాయికి వెళ్లిన ఆమె వచ్చిన డబ్బులతో హైదరాబాద్‌లోనే జిమ్‌ వ్యాపారంలో ఇన్వెస్ట్‌ చేసింది. కానీ, వరుసగా రెండు ఫ్లాప్స్‌ పడడంతో అంతా రివర్సైంది. మహేశ్‌ బాబుతో చేసిన స్పైడర్, నాగార్జున సరసన నటించిన మన్మధుడు-2 డిజాస్టర్లు కావడంతో టాలీవుడ్‌లో రకుల్‌ కెరీర్ డీలా పడింది. అంతే ఆమె వెంటనే ముంబై చెక్కేసింది. ఒకవైపు హిందీ, మరోవైపు తమిళ్‌ చిత్రాలు చేసిందామె. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు చిత్రాలున్నాయి. అయితే, టాలీవుడ్‌కు దూరమైనా అభిమానులకు మాత్రం ఆమె దూరం కాలేదు. సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే రకుల్‌ ఫ్యాన్స్‌కు తరచూ టచ్‌లోకి వస్తోంది. ఫిట్‌నెస్‌ అంటే ప్రాణం పెట్టే ఈ అందగత్తె జిమ్‌ సూట్‌లో కసరత్తులు చేస్తున్న ఫొటోలు, వీడియోలు పోస్ట్‌ చేస్తూ అందాల ట్రీట్‌ ఇస్తూ ఉంటోంది. దాంతో, సోషల్‌ మీడియాలో ఆమె ఫాలోవర్లూ క్రమంగా పెరుగుతున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్‌, కన్నడ చిత్రాలు చేస్తుండడంతో అక్కడి ఫ్యాన్స్‌ కూడా ఆమెను సోషల్‌ మీడియాలో అనుసరిస్తున్నారు.

Also Read: హ్యాపీగాపెళ్లి చేసుకునే లోపే బాధ పెట్టారు !

నాన్నకు ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్ ఐ వన్న ఫాలో ఫాలో ఫాలో యూ అని పాట పాడినట్టుగా రకుల్‌ను ఓ రేంజ్‌లో ఫాలో అవుతున్నారు. దాంతో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఫాలోవర్ల సంఖ్య 15 మిలియన్లు అంటే అక్షరాల కోటిన్నర దాటింది. 15 మిలియన్స్‌ ఫాలోవర్స్ ‌ క్లబ్‌లో చేరడంతో రకుల్‌ తెగ సంబరపడిపోతోంది. ఫ్యాన్స్‌కు థ్యాంక్స్‌ చెబుతూ ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్ట్‌ చేసింది. ‘15 మిలియన్ల బలమైన బంధం. నా పని గురించి, నైపుణ్యాల గురించి, సోషల్‌ మీడియా గురించి పెద్దగా అవగాహన లేని చిన్న వయసులోనే కెరీర్ ప్రారంభించా. కానీ, మీరంతా నాకు అండగా ఉన్నారు. నాపై ఎంతో ప్రేమ కురిపించారు. అందుకే నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. అన్నింటా నేను పర్ఫెక్ట్‌ కాకపోవచ్చు కానీ బాగా కష్టపడుతూ మిమ్మల్ని ఎంటర్ చేస్తానని ప్రామిస్‌ చేస్తున్నా. నా ఇన్‌స్టా ఫ్యాన్స్‌ అందరికీ పెద్ద హగ్‌ ఇస్తున్నా. వాళ్లు లేకుండా నేను ఈ స్థాయికి వచ్చేదాన్ని కాదు. లవ్‌ యు ఆల్‌’ అని రకుల్‌ పేర్కొంది.

https://www.instagram.com/p/CDfiyG9h169/

కేసీఆర్, మోడీలకు ఒకేరోజు అసదుద్దీన్ షాక్


ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ దేశంలోని హిందువులంతా కళ్లు ఆర్పకుండా చూసిన అయోధ్య రామాలయ భూమిపూజపై పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అటు మోడీనే కాదు.. ఇటు కేసీఆర్ ను కూడా సెక్యులరిజం లేని నేతలుగా ప్రొజెక్ట్ చేశారు. కేసీఆర్ మిత్రుడే అయినా సచివాలయంలో మసీదు కూలగొట్టినందుకు కాస్త గట్టిగానే డిమాండ్ చేశారు. ఈ రెండు విమర్శల్లో తమ వర్గానికి చెందిన మత ప్రార్థనల భవనాలు కూల్చివేయడమే అసద్ ఆగ్రహానికి కారణంగా కనిపిస్తోంది.

Also Read: ఉద్యమం బాబుదైతే, త్యాగం మాత్రం జగన్ చేయాలట..!

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ అయోధ్యలో రామ మందిరం నిర్మాణం వేళ మోడీని టార్గెట్ చేశారు. పలు లాజిక్ ప్రశ్నలు సంధించారు. భారతదేశానికి ప్రధాని నరేంద్రమోడీ. అలాంటి ఆయన దేశంలోని అన్ని మతాలను సమానంగా చూడాలి. కానీ ఒక వర్గానికి చెందిన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మోడీ వ్యవహరిస్తున్నారని అసద్ సంధించిన ప్రశ్న తూటాలానే పేలింది. రాజ్యాంగ ప్రమాణాన్ని మోడీ ఉల్లంఘించాడని అసద్ ఆరోపించారు. ఈ రోజు చరిత్రలో నిలిచిపోయిందని.. లౌకికవాదాన్ని మోడీ అవమానపరిచాడని ఆయన మాటలను ఖండిస్తున్నట్టు అసద్ విమర్శించారు.

అసద్ అన్న మాటల్లో నిజంగానే లాజిక్ ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. హిందూ వాదాన్ని ఎవరూ వ్యతిరేకించరు. దేశంలో మెజార్టీ వాళ్లే కావడం కాదనరు. కానీ లౌకిక భారత దేశంలో లౌకికత్వం రాజ్యాంగంలో దేశం ముఖ్య భాగం.. దానిని అందరూ తప్పనిసరిగా గౌరవించాలనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆర్ఎస్ఎస్ చీఫ్ అయోధ్యలో కనిపించడం నిజంగానే లౌకికవాదులకు ఆగ్రహం తెప్పిస్తోంది. హిందుత్వ శక్తులను కొత్త భారతదేశాన్ని ప్రజల ముందుకు తీసుకువస్తున్నారని అసద్ ఆరోపించడంలో నిజంగానే మైనార్టీల్లో అభద్రతా భావాన్ని పెంచుతోందంటున్నారు.

అయోధ్య చరిత్ర నుంచి బాబ్రీ మసీదు ఘటన ఎప్పటికీ తుడిచిపెట్టుకుపోదని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. అయోధ్యలో బాబ్రీ మసీదు ఉండేదని.. ఉందని.. ఖచ్చితంగా ఉంటుందని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. చరిత్రను ఎవరూ మార్చలేరంటూ అసదుద్దీన్ వ్యాఖ్యానించారు.

Also Read: నదీజలాల కోసం కేసీఆర్, జగన్ ఫైట్

ఇక తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో కూల్చివేసిన మసీదును అదే ప్రాంతంలో ప్రభుత్వమే బేషరుతుగా పునర్ నిర్మించాలని అసద్ డిమాండ్ చేశారు. ఖచ్చితమైన తేది చెప్పాలని కేసీఆర్ ను కలిసి కోరతానన్నారు.

ఇలా ఒకే టైంలో తమ వర్గం విషయంలో జరిగిన అన్యాయంపై అసద్ గళమెత్తారు. విశేషం ఏంటంటే.. అక్కడా.. ఇక్కడా రెండూ కూల్చివేసి కడుతున్నావే.. సామీప్యాలున్న ఈ రెండు సమస్యలపై అసద్ తన వర్గం తరుఫున గళం వినిపించడం విశేషం.