Home Blog Page 8371

షాకింగ్: పొగ తాగేవారికి 28 రకాల జబ్బులు!

ధూమపానం ఆరోగ్యానికి హానికరం అనే మాట మనం తరచూ వింటూ ఉంటాం. కానీ ఒక్కసారి ధూమపానానికి అలవాటు పడితే ఆ అలవాటును మానేయడం అంత తేలిక కాదు. కొందరు పొగ తాగడం మానేయడానికి ప్రయత్నించినా మానేయలేకపోతున్నామని చెబుతున్నారు. మొదట ఒక సిగరెట్ తో సరదాగా మొదలుపెట్టిన వారే ఆ తరువాత ధూమపానానికి అడిక్ట్ అవుతున్నారు. పొగ తాగటం వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు, క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఉంటాయి.

అయితే వైద్య నిపుణులు పొగ తాగే వారికి సంబంధించి షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. పొగ తాగే అలవాటు ఎంత పెరిగితే అంత ఆయుష్షు తగ్గుతుందని చెబుతున్నారు. పొగ తాగేవారు శారీరక సమస్యలతో పాటు మానసిక సమస్యలతో కూడా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయని ఫలితంగా మరణం సంభవించే అవకాశాలు ఉన్నాయని పరిశోధనల్లో తేలింది. ఆస్ట్రేలియాకు చెందిన యూనివర్సిటీ పరిశోధకులు అనేక పరిశోధనలు చేసి ఈ విషయాలు వెల్లడించారు.

152,483 మంది రోగులపై పరిశోధనలు జరిపి పొగ తాగే అలవాటు ఎక్కువగా ఉన్నవారు 28 రోగాల బారిన పడే అవకాశం ఉందని తేల్చారు. పొగ తాగని వారిని పొగ తాగే వారిని పోల్చి చూసినపుడు పొగ తాగే వారు 30 శాతం అధికంగా వ్యాధుల బారిన పడుతున్నట్టు తేలిందని చెప్పారు. పొగ తాగే వారు వారి ఆయుష్షులో పది సంవత్సరాల ముందే మరణించే అవకాశం ఉందని ఈ అధ్యయనంలో వెల్లడైంది. పొగ తాగే వారు గుండె సమస్యలు, శ్వాస సంబంధిత సమస్యలు, కంటి, రక్త సంబంధిత వ్యాధులు, న్యూమోనియా బారిన పడే అవకాశం ఉందని అధ్యనంలో తేలింది.

ఫోర్బ్స్‌ సంపన్నుల జాబితాలో బాలీవుడ్ నటుడు


ప్రపంచంలోనే అత్యంత సంపన్న నటుల జాబితాలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కు చోటు దక్కింది. ఫోర్బ్స్ సంపన్నుల జాబితా-2020లో భారతదేశం నుంచి అక్షయ్ కుమార్ ఒక్కడికే చోటుదక్కడం గమనార్హం. ఫోర్బ్స్ లిస్టులో అక్షయ్ కుమార్ 48.5మిలియన్ల డాలర్ల సంపాదనతో ఆరో స్థానంలో నిలిచారు. ఇది ఇండియన్ కరెన్సీలో 363కోట్ల రూపాయాలతో సమానం. అయితే కిందటేడాది ఫోర్బ్స్ లిస్టులో అక్షయ్ కుమార్ నాలుగో స్థానం దక్కించుకోగా ఈసారి మాత్రం ఆరోస్థానానికి పరిమితమయ్యాడు.

Also Read: సక్సెస్ లేని డైరెక్టర్ కు ఇగో ఎందుకో !

ఫోర్బ్స్-2020 జాబితాలో హాలీవుడ్ నటుడు డ్వేన్‌ జాన్సన్‌ 87.5 మిలియన్‌ డాలర్లతో తొలిస్థానం దక్కించుకున్నాడు. కిందటేడాది కూడా ఆయనే తొలిస్థానంలో నిలువడం గమనార్హం. రెండో స్థానంలో డెడ్‌పూల్‌ స్టార్‌ ర్యాన్ రెనాల్డ్ 71.5మిలియన్ల డాలర్లతో ఉన్నాడు. మార్క్‌ వాల్బర్గ్‌ మూడు, బెన్ అఫ్లెక్‌ నాలుగు, విన్‌ డీజిల్‌ ఐదో స్థానంలో ఉన్నారు.

ఫోర్బ్స్-2020 జాబితాలో భారతీయుల నుంచి అక్షయ్ కుమార్ మినహా మరేవరికీ చోటుదక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్లో అక్షయ్ కుమార్ కంటే ఎక్కువ పారితోషికం తీసుకొని నటించే హీరోలు ఎంతమంది ఉన్నా అక్షయ్ ఒక్కడికే ఫోర్బ్స్-2020 జాబితాలో చోటు దక్కడం ఆసక్తిని రేపుతోంది. అయితే అక్షయ్ బాలీవుడ్లో వరుసబెట్టి సినిమాలు చేస్తుండటం వల్లే ఆయన ఆదాయం పెరిగినట్లు తెలుస్తోంది. మిగతా హీరోలంతా ఏడాదికి ఒకటి రెండు సినిమాలతోనే సరిపెట్టుకోవడంతో వారంతా సంపాదనలో అక్షయ్ కుమార్ కు పోటీ ఇవ్వలేకపోయారనే టాక్ విన్పిస్తుంది.

Also Read: పాపం కాజల్.. కరోనా హీరోతో కిస్ !

మహారాష్ట్రలో కరోనా విజృంభణతో సినిమా షూటింగులన్నీ నిలిచిపోయాయి. దీంతో అక్షయ్ కుమార్ సైతం ఇంటికే పరిమితయ్యాడు. అయితే ఈ సమయంలో కరోనా నివారణ కోసం ప్రధాని సహాయనిధికి రూ.25కోట్ల సాయం ప్రకటించి వార్తల్లో నిలిచారు. అదేవిధంగా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కు రూ.3కోట్ల సాయం చేశారు. ఈ విరాళంలో మున్సిపల్ కార్మికులకు అవసరమైన పీపీఈ కిట్స్ అందించారు. ఇక ప్రస్తుతం దర్శకుడు రాఘవ లారెన్స్ నటించిన ‘లక్ష్మీబాంబ్’ మూవీని బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నాడు. దీంతోపాటు బెల్ బాటమ్, బచ్చన్ పాండే, పృథ్వీరాజ్ సినిమాలను అక్షయ్ లైన్లో పెట్టాడు.

ఇంటిపోరుతో సతమతమవుతున్న మంత్రి?


తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కేసీఆర్ క్యాబినెట్లో మహిళలకు మంత్రి పదవులు దక్కలేదని అందరికీ తెల్సిందే.. దీంతో అప్పట్లో టీఆర్ఎస్ సర్కార్ పై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడం రెండోసారి కూడా బంపర్ మెజార్టీతో అధికారంలోకి రావడం చకచకా జరిగిపోయాయి. ఈసారి ప్రభుత్వంపై విమర్శలు రాకుండా సీఎం కేసీఆర్ తన క్యాబినెట్లోకి ఇద్దరు మంత్రులను తీసుకున్నారు. వీరిలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ చేరిన సబితా రెడ్డికి అనుహ్యంగా మంత్రి పదవీ దక్కింది.

Also Read: చదువులా.. ప్రాణాలా? ఇప్పుడు ఏది ముఖ్యం?

దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో సబితా ఇంద్రారెడ్డి హోం మంత్రిగా పనిచేశారు. ఇక సీఎం కేసీఆర్ క్యాబినెట్లోనూ విద్యాశాఖ మంత్రిగా సబితారెడ్డి ప్రస్తుతం కొనసాగుతున్నారు. అయితే మంత్రి పదవీ దక్కించుకున్నప్పటికీ సబితా ఇంద్రారెడ్డికి ఇంటిపోరు.. పార్టీ పోరుతో మనశ్శాంతి కరువైందనే టాక్ విన్పిస్తోంది. ఓవైపు కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి.. మరోవైపు పార్టీలో ఆధిపత్య పోరుతో తాను ఉక్కిరిబిక్కిరి అవుతున్నానని సన్నిహితుల వద్ద వాపోతున్నారట.

2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం కుటుంబంలో ఒక్కరికే అవకాశం అని సూచించడంతో ఆ ఎన్నికల్లో సబితా పోటీ చేయలేదు. ఆమె తనయుడు కార్తీక్ రెడ్డి ఆ ఎన్నికల్లో చేవేళ్ల ఎంపీగా పోటీచేసి ఓటమిపాలయ్యాడు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డిపై గెలుపొందారు. అయితే నాటి నుంచి ఆమె కాంగ్రెస్ లో ఉంటూనే సైలంటయ్యారు. ఒకనొక సమయంలో ఆమె రాజకీయాల నుంచి తప్పుకుంటారనే టాక్ విన్పించింది. అయితే అనుహ్యంగా టీఆర్ఎస్ లో చేరి మంత్రి పదవీ దక్కించుకున్నారు.

అయితే ఆమె కుమారుడికి ప్రభుత్వంలో ఎలాంటి నామినేటేడ్ పదవీ లేకపోవడంతో ఆమెను ఒత్తిడి తెస్తున్నాడట. తన కుమారుడి భవిష్యత్ కోసం సబితా టీఆర్ఎస్ లో చేరినా తనయుడి ఎలాంటి పదవీ లేకపోవడంతో ఆలోచనలో పడ్డారట. ఇప్పట్లో ఎన్నికలు లేకపోవడంతో నామినేటేడ్ పదవీనైనా కట్టబెట్టాలని చూస్తున్నారట. అయితే టీఆర్ఎస్ ఇంకా నామినేటేడ్ పదవుల భర్తీ చేయకపోవడంతో ఆమెపై ఇంటి నుంచి ఒత్తిడులు పెరుగుతున్నాయట. మంత్రిగా జిల్లాలో సత్తా చాటుతుండంతో జిల్లాలోని తన మేనల్లుళ్లు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిలు తనను శత్రువులా చూస్తున్నారట.

Also Read: జగన్ పని అయిపోయినట్లే… బాబు కి ఛాన్స్ ఇచ్చేశాడు మరి!

ఇక తన తమ్ముడు నరసింహారెడ్డికి కూడా టీఆర్ఎస్ లో ఎలాంటి పదవీ లేదు. 2009లో జెడ్పీటీసీగా ఓడినప్పటికీ నుంచి తాను సబితా ఇంద్రారెడ్డి వెంటే ఉంటున్నాడు. తనకు ఏదైనా పదవీ కట్టబెట్టాలని ప్రయత్నం చేస్తున్నారట. ఇక జిల్లా నుంచి మంత్రి పదవీ ఆశించిన నేతలంతా ఆమెపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారు. జిల్లాలోని టీఆర్ఎస్ నేతలు ఆమెకు వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో ఆమెపై ఇంటా, బయట ఒత్తిడులు అధికమవుతున్నాయట.

త్వరలోనే టీఆర్ఎస్ నామినేటేడ్ పదవుల భర్తీ చేస్తే తనకు కొంత ఉపశమనం లభిస్తుందని సన్నిహితులతో వాపోతున్నారు. దీంతో ఆమెకు నామినేటేడ్ పోస్టు భర్తీ తర్వాతనైన ఉపశమనం లభిస్తుందా? లేదో వేచి చూడాల్సిందే..!

తెలంగాణ కొత్త సెక్రటేరియట్ కు ఇక అతనే సీఎం..?

KTR, Telangana's rising star and 'CM-in-waiting' - The Hindu ...

తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు.. కేటీఆర్ పట్టాభిషేకానికి రంగం సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మధ్య కేసీఆర్ ఎక్కువగా ఫామ్ హౌస్ కే పరిమితమవుతున్నారు. పాలనా వ్యవహారాలు అన్నీ అతని కొడుకు కేటీఆర్ చూసుకుంటున్నారు. ఇప్పటికే కేటీఆర్ కరోనా విషయమై అప్డేట్లు, విమర్శలకు సమాధానాలు ఇస్తూ పర్యటిస్తున్నారు.. కీలక స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు.. తాజాగా ఒక డమ్మీ భేటీ కూడా నిర్వహించి తన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాను అన్న సంకేతాలను పంపేశారు.

కేంద్రంలో క్రియాశీలక రాజకీయాలు చేసేందుకు కేసీఆర్ ఇదే సరైన సమయం అని భావిస్తుండడంతో ఎప్పటినుండో కేటీఆర్ పగ్గాలు చేపడతారని అందరూ చెబుతున్నారు. అయితే కరోనా సంక్షోభం వల్ల ఈ ప్రక్రియ ఆలస్యమైనా…. ఇక ఇప్పుడు మాత్రం కేటీఆర్ టైం మొదలవబోతోంది అన్న సంకేతాలు పంపించేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ కొత్త సెక్రటేరియట్ అన్ని హంగులతో.. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని కళ్లకు కట్టినట్లుగా సిద్ధమవుతోంది. ఆరు నెలలో నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. కొత్త సెక్రటేరియట్ లో కేటీఆర్ సీఎంగా బాధ్యతలు తీసుకునే అవకాశాలు ఉన్నాయన్నమాట చాలా బలంగా వినిపిస్తోంది.

కేసీఆర్ ఈ ఆరు నెలలు లోపల ఎప్పుడైనా తన పదవి నుండి వైదొలగి కేటీఆర్ కు బాధ్యతలు ఇవ్వచ్చు అని ప్రజలు, టిఆర్ఎస్ కేడర్ మానసికంగా సిద్ధం అయిపోయారు. మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడే తన కొడుక్కి ముఖ్యమంత్రి బాధ్యతలు ఇస్తానని కె.చంద్రశేఖర రావు ప్రకటించారు. ప్లీనరీలో తీర్మానం చేయబోతున్నానని కూడా చెప్పుకొచ్చారు. ఇక జాతీయ రాజకీయాల్లో ఫెడరల్ ఫ్రంట్ అంశం తీసుకొచ్చిన కెసిఆర్…. ముందు నుంచి ఈ విషయమై సంకేతాలు ఇస్తూనే ఉన్నారు. ఇక రాబోయే రోజుల్లో కేటీఆర్ మరింత కీలకమైన బాధ్యతలు చేపట్టడం ఖాయమని అభిప్రాయం రాష్ట్రమంతా ఏర్పడడం మొదలైపోయింది.

చదువులా.. ప్రాణాలా? ఇప్పుడు ఏది ముఖ్యం?


ఆ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తిక్కలోడు.. మన పవన్ కళ్యాణ్ లాగానే ‘నాక్కొంచం తిక్కుంది.. దానికి లెక్కలేదు’ అంటూ కరోనా వేళ అన్నింటిని వదిలేశాడు. ప్రాణాలంకటే తనకు అమెరికా ఆర్థిక వ్యవస్థనే ముఖ్యమని లాక్ డౌన్ విధించలేకపోయాడు. దీంతో కరోనా వైరస్ తో అమెరికా అల్లకల్లోలం అయిపోయి లక్షలమంది ప్రాణాలు పోయాయి.

Also Read: కేసీఆర్ తో కయ్యానికి సిద్ధమవుతున్న జగన్?

అయితే దేశప్రజలను కరోనాకు ఫణంగా పెట్టిన ట్రంప్.. మొండిపట్టుదలకు పోయి ఇప్పుడు ఆ దేశ చిన్నారులను బలిగొంటున్నాడు. జూలై నెల మధ్యలో అమెరికాలో స్కూళ్లు, యూనివర్సిటీలను రీఓపెన్ చేసిన అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నాడు. స్కూల్లు ఓపెన్ చేయగానే విద్యార్థులు పాఠశాలలకు వచ్చారు. ఇప్పుడు మూడు వారాలు గడిచేసరికి దాదాపు 97,000మంది అమెరికా పిల్లలకు కరోనా పాజిటివ్ గా తేలింది.

జూలై 16 నుండి 30 వరకు అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ నుంచి తీసుకున్న గణాంకాల ప్రకారం.. దేశంలో ఐదు మిలియన్ల కేసులలో అగ్రస్థానంలో ఉంది. వీటిలో 338,000 మంది పిల్లలకు వైరస్ సోకడం దిగ్భాంతి కలిగిస్తోంది. 162,000 మంది మరణించారు.

అమెరికాలో స్కూల్లు తెరిస్తే ఎంతటి విధ్వంసం నెలకొన్నదో చూశాం. ఇప్పుడు అంతుకుమించి జనాభా గల భారతదేశంలో గనుక స్కూళ్లు ఓపెన్ చేస్తే వినాశనమే అనడంలో ఎలాంటి సందేహం లేదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also Read: తెలంగాణ పీసీసీ ఛీఫ్ కోసం కర్ణాటకలో రాజకీయాలు?

అగ్రరాజ్యం అమెరికాతో పోలిస్తే మన దేశంలో స్కూలు, ఆసుపత్రుల్లో మౌళిక వసతులు, భద్రతా చర్యలు చాలా దారుణంగా ఉంటాయి. కుప్పలు తెప్పలుగా చిన్నారులను గదుల్లో కుక్కుతారు. దీంతో కరోనా వైరస్ ఒక్కరికున్నా అది అందరికీ సోకుతుంది. అసలే పిల్లల ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుంది. వారికి సోకితే ఇక కంట్రోల్ చేయడం ప్రభుత్వాలకు కూడా చేతకాదు.. మనదగ్గర ఆసుపత్రుల్లో అన్ని బెడ్స్ కూడా లేవు. దీంతో రోడ్లమీదనే చిన్నారులు పడిపోయే దృశ్యాలు కనిపించవచ్చు.

ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సెప్టెంబర్ నుంచి స్కూలు తెరవడానికి రెడీ అవుతోంది. కేంద్రం కూడా సెప్టెంబర్ నుంచే ఆలోచిస్తోంది. మరి అమెరికాలో స్కూల్లు తెరిచాక జరిగిన వినాశనం చూశాకైనా మన దేశ ప్రభుత్వాలు కళ్లు తెరిస్తే చాలని విద్యావేత్తలు హితవు పలుకుతున్నారు.

-ఎన్నం

జగన్ పని అయిపోయినట్లే… బాబు కి ఛాన్స్ ఇచ్చేశాడు మరి!

Atchannaidu Arrestపై స్పందించిన Chandrababu - Telugu ...

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కరోనా వైరస్ నివారణ చర్యల అమలులో తడబపడుతున్న విషయం తెలిసిందే. టెస్టులు జరుగుతున్నాయి…. కుప్పలు తెప్పలుగా కేసులు బయటకు వస్తున్నాయి కానీ ఎక్కడా కూడా పరిస్థితి మెరుగుపడిన జాడ కనిపించడం లేదు. అటు ఢిల్లీలో దాదాపు 90% కి పైగా రికవరీ రేటు ఉంటే మన రాష్ట్రంలో మాత్రం రోజు రోజుకి మరణాల సంఖ్య కొంచెం కూడా తగ్గడం లేదు. ఇక రాష్ట్రంలో సామాన్యుని నుండి ప్రజాప్రతినిధుల వరకు అందరూ ఈ మహమ్మారికి భయపడుతున్నారు. ఇదే సమయంలో టిడిపి సీనియర్ నేత అచ్చెన్నాయుడుకి కరోనా పాజిటివ్ రావడం గమనార్హం. జుడిషియల్ రిమాండ్ లో ఉన్న అచ్చెన్నాయుడు గుంటూరులోని రమేష్ ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాడు.

ఇప్పటికే అచ్చెన్నాయుడు అరెస్ట్ విషయంలో వైసిపి కుట్రపూరితంగా కేసులు పెట్టి అతని ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోయినా ఇబ్బంది పెడుతున్నారని టిడిపి నేతలు మండిపడ్డారు. ఇక ఈ సమయంలో అతనికి కరోనా సోకడం పై వారు నానా రాద్ధాంతం చేయడం ఖాయం. అదీ కాకుండా అఫీషియల్ గా జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న అచ్చెన్నాయుడుకి ఇలా పాజిటివ్ అని తేలడంతో కుటుంబసభ్యులు, అభిమానులు కార్యకర్తలు, ఆందోళన చెందుతున్నారు. ఇక టిడిపి వారు కావాలని జగన్ ప్రభుత్వం అతని పట్టించుకోవట్లేదని…. చివరికి అతనికి కరోనా వచ్చేదాకా వారి నిర్లక్ష్యం వెళ్లిందని ఎన్నో ఆరోపణలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా టిడిపి వర్గాల్లో వాతావరణం కనిపిస్తోంది. అదుపులో ఉన్న మాజీ మంత్రి పరిస్థితే ఇలా ఉందంటే.. ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి అన్నది వారి ప్రశ్న.

ఈఎస్ఐ మందుల స్కాం లో అరెస్టయిన అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించారు. జూన్ 12న అచ్చెన్నాయుడు స్వగ్రామంలో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే కొంత మంది అధికారులను కూడా ఎసిబి అదుపులోకి తీసుకుంది. అయితే వీరిలో అచ్చెన్నాయుడుకి కరోనా సోకడం ఇప్పుడు తీవ్ర వివాదం లేపుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి జగన్ చంద్రబాబు కు ఇంత పెద్ద ఛాన్స్ ఇస్తే ఇప్పటికే అమరావతి విషయమై కక్కలేక మింగలేక ఉంటున్న బాబు చెలరేగిపోవడం ఖాయం.

సక్సెస్ లేని డైరెక్టర్ కు ఇగో ఎందుకో !


ఎట్టకేలకు తన గత సినిమా `రాక్ష‌సుడు`తో హిట్ అందుకున్న యువ క‌థానాయ‌కుడు బెల్లంకొండ శ్రీనివాస్ ను హీరోగా పెట్టి.. కందిరీగ‌, ర‌భ‌స, హైప‌ర్‌ ఫేమ్ సినిమాల డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం అక్టోబర్ నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ చేయటానికి ఈ చిత్రానికి సంబంధించిన సెట్ వర్క్ జరుగుతుంది. అయితే తాజాగా ఈ సినిమా టీం గురించి ఓ ఆసక్తికరమైన అప్ డేట్ తెలిసింది. దర్శకుడు సంతోష్ శ్రీనివాస్‌, ఈ సినిమా కెమెరామెన్ విషయంలో మొదటి నుండి అసంతృప్తిగా ఉన్నాడట. మెయిన్ గా సంతోష్ వర్కింగ్ స్టైల్ కు, ఈ చిత్రానికి కెమెరామెన్ గా పనిచేస్తోన్న డూడ్లీ వర్కింగ్ స్టైల్ కి అసలు సింక్ అవ్వట్లేదట. కరోనాకి ముందు చేసిన షెడ్యూల్ లోనే కొన్ని షాట్స్ మేకింగ్ లో ఇద్దరి మధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు వ‌చ్చాయని.. ప్రస్తుతం అప్పుడు తీసిన షాట్స్ కి సంబంధించిన డిఐ జరుగుతున్న క్రమంలో కూడా ఇద్దరి మధ్య తేడా వచ్చిందని తెలుస్తోంది.

Also Read: పాపం కాజల్.. కరోనా హీరోతో కిస్ !

ఆ కారణంగానే కెమెరామెన్ డూడ్లీ ఈ చిత్రం నుండి తప్పుకున్నాడట. నిజానికీ డూడ్లీ మంచి కెమెరామెనే. డూడ్లీ బాలీవుడ్‌లో ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌, సింగం’ వంటి సూపర్ హిట్ చిత్రాలకు సినిమాటోగ్రాఫ‌ర్‌ గా ప‌నిచేసిన చరిత్ర ఉంది ఆయనకు. మరి అలాంటి కెమెరామెన్ తో సంతోష్ శ్రీనివాస్ లాంటి డైరెక్టర్ గొడవ పడటం ఏమిటో.. అయినా సక్సెస్ ట్రాక్ లో లేని డైరెక్టర్ కు ఇగోలు ఉండకూడదు. అసలుకే చాలా గ్యాప్ తరువాత సంతోష్ శ్రీనివాస్ కి సినిమా ఛాన్స్ వచ్చింది. ఇలాంటి టైంలో కూడా అనవసరంగా గొడవలు పడి ఉన్న విలువను కూడా ఎందుకు పోగొట్టుకోవడం.

Also Read: పెళ్లి మూడ్ నుండి బిజినెస్ మూడ్ లోకి !

ఇక సంతోష్ శ్రీనివాస్ బెల్లంకొండ శ్రీనివాస్ కోసం కామెడీగా సాగే పక్కా యాక్షన్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశాడట. బెల్లంకొండ మీద యాక్షన్ వర్కౌట్ కాదని ఇప్పటికే లెక్కకు మించి ప్రూవ్ అయిపోయింది. అలాంటప్పుడు, మనోడు ఇక ఎంత యాక్షన్ చేస్తే ఏం లాభం… ఏంటో ఈ బెల్లంకొండకు యాక్షన్ సెట్ అవ్వదని ఇక ఎప్పుడు అర్ధం చేసుకుంటాడో. అన్నట్టు సుమంత్ మూవీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై జి.సుబ్ర‌హ్మ‌ణ్యం ఈ సినిమాని భారీగా నిర్మించే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఆయన ప్రయత్నం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

పిల్లలకు డ్యాన్స్ నేర్పుతున్న పక్షి.. వీడియో వైరల్!

సాధారణంగా జంతువుల, పక్షుల తల్లులు పిల్లలకు ఆహారం సంపాదించుకోవడం, జీవించడం, ప్రమాదాలు ఎదురైన సమయంలో తప్పించుకోవడం నేర్పిస్తూ ఉంటాయి. కానీ ఒక పక్షి మాత్రం తన పిల్లలకు డ్యాన్స్ నేర్పిస్తోంది. పక్షి పిల్లలకు డ్యాన్స్ నేర్పించడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా…? వినడానికి కొంత ఆశ్చర్యంగానే ఉన్నా నిజంగానే ఒక తల్లి పక్షి తన రెండు పిల్ల పక్షులకు డ్యాన్స్ నేర్పిస్తోంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో పక్షి పిల్లలకు డ్యాన్స్ నేర్పిస్తున్న వీడియో తెగ వైరల్ అవుతోంది. సినిమాల్లో కొరియోగ్రాఫర్స్ ఏ విధంగా డ్యాన్స్ నేర్పిస్తారో అదే విధంగా తల్లి పక్షి పిల్ల పక్షులకు డ్యాన్స్ నేర్పిస్తోంది. వయ్యారంగా ఊగుతూ తల్లి పక్షి, పిల్ల పక్షులు వేస్తున్న స్టెప్పులు నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. బ్యూటెంగేబీడెన్ అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన వీడియో సోషల్ నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.

పక్షుల డ్యాన్స్ కు అనుగుణంగా మ్యూజిక్ యాడ్ చేయడం వీడియోకు మరింత ప్లస్ అయింది. అమేకా వుడ్ కాక్ అనే తల్లి పక్షి ఏ విధంగా స్టెప్పులు వేస్తుందో పిల్ల పక్షులు కూడా అదే విధంగా స్టెప్పులు వస్తున్నాయి. పక్షుల వయ్యారమైన కదలికలు ఎన్నిసార్లు చూసినా మళ్లీ చూడాలనిపించేలా చేస్తున్నాయి. తల్లిపక్షి, పిల్ల పక్షుల స్టెప్పులను తప్పక చూసి తీరాల్సిందే.

రేవంత్ రెడ్డి సీఎం.. కాంగ్రెస్ లో బయటపడ్డ నిప్పు


నోరున్నవాడిదే ఇప్పుడు లోకం.. ఆ నోరు లేకుంటే వెనుకబడి పోతాం.. ఆ నోరు సోషల్ మీడియా కావచ్చు. లేదా ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు.. వెబ్ మీడియాను కావచ్చు. ఒక ప్రచారాన్ని అదే పనిగా రిపీట్ చేస్తుంటే నిజంగానే అదే జరిగిపోతుంటుంది. దాన్నే గోబెల్స్ ప్రచారం అంటుంటారు.

తాజాగా తెలుగు మీడియాలో ఒక వార్త విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. అది కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రచారం చేయిస్తున్నాడో లేక ఆయన అభిమానులు వైరల్ చేస్తున్నారో కానీ.. రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్ గా కాంగ్రెస్ అధినేత్రి కూతురు ప్రియాంక గాంధీ ఖాయం చేశారని.. అధికారంలోకి తీసుకొస్తే సీఎం నువ్వేనని రేవంత్ కు అభయం ఇచ్చారనే వార్త రెండు మూడు రోజులుగా మీడియాలో హైలెట్ అవుతోంది.

Also Read: తెలంగాణ పీసీసీ ఛీఫ్ కోసం కర్ణాటకలో రాజకీయాలు?

దేశ రాజకీయాల్లో ఇప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కంటే ప్రియాంక గాంధీ యాక్టివ్ అయ్యారు. రాజస్థాన్ లో సచిన్ పైలెట్ ను చేరదీసి మళ్లీ అక్కడి ప్రభుత్వాన్ని కాపాడడంలో కీలకపాత్ర పోషించారు.దేశ కాంగ్రెస్ రాజకీయాల్లో ఇప్పుడు ప్రియాంక గాంధీ కీలకపాత్ర పోషించబోతోందని తెలిసింది. ఈ క్రమంలోనే సీనియర్లకు మంగళం పాడి యువ నేతలకు అందలం ఎక్కించాలని ఆమె పక్కా ప్లాన్ సిద్ధం చేసినట్టు తెలిసింది.

ప్రియాంక గాంధీ అన్ని రాష్ట్రాల్లో యూత్ ని ప్రమోట్ చేయాలని డిసైడ్ అయ్యిందట.. అందులో భాగంగానే తెలంగాణలో కాంగ్రెస్ కు జవసత్వాలు నింపేందుకు నిర్ణయం తీసుకుందని సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ కు విపరీతంగా ఓటు బ్యాంకు ఉంది.. కర్ణాటక తర్వాత రెడ్డి సామాజికవర్గం అండ తెలంగాణలో కాంగ్రెస్ కే ఉంది. తెలంగాణలో రెడ్డి సామాజికవర్గానికే పీసీసీ పీఠం ఇవ్వాలని ప్రియాంక ఒత్తిడి తెస్తోందట.. అందులో యువనేత రేవంత్ రెడ్డి , కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్లను ప్రియాంక గాంధీ పరిశీలిస్తున్నట్టు ఢిల్లీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే కోమటిరెడ్డిని సెంట్రల్ టీమ్ లో వేసి.. రేవంత్ రెడ్డికి రాష్ట్ర పీసీసీ ఇస్తే సరిపోతుందని ప్రియాంక భావిస్తోందని వార్తలు వెలువడ్డాయి. తెలంగాణ పీసీసీ చీఫ్ గా త్వరలోనే రేవంత్ రెడ్డిని నియమించడం ఖాయమని.. ఆయన ప్రియాంక టీంలోకి వెళ్లిపోతున్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

Also Read: కేసీఆర్ తో కయ్యానికి సిద్ధమవుతున్న జగన్?

ఈ వార్తలపై తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ నిప్పులు చెరిగారు. 40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో రేవంత్ రెడ్డి లాంటి నేతలను చూడలేదని.. సీఎం అంటూ ఇప్పుడే ప్రచారం చేసుకోవడం ఆపాలంటూ హితవు పలికారు. మాలాంటి సీనియర్ నేతలపై సోషల్ మీడియాలో అడ్డగోలు కామెంట్స్ చేస్తున్నారని అన్నారు. వెంటనే కోర్ కమిటీ సమావేశం పెట్టి రేవంత్ అంతు తేలుస్తామని వీహెచ్ తొడగొట్టారు. ప్రియాంక టీం అంటూ సోనియా కుటుంబంలోనూ రేవంత్ చిచ్చు పెడుతున్నాడని.. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.

ఇక ఇప్పటికే రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ కాకుండా కాంగ్రెస్ సీనియర్లంతా అడ్డుకుంటున్నారన్న ప్రచారం సాగుతోంది. ఇప్పుడు ప్రియాంక టీంలో చేరిన రేవంత్ పై సీనియర్లు అంతా కలిసి అడ్డుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. మరి ప్రియాంక వర్గం పట్టుదల గెలుస్తుందా? కాంగ్రెస్ సీనియర్ల పంతం నెగ్గుతుందా అన్నది వేచిచూడాలి. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ కాకుండా బాగానే అడ్డుకుంటున్నారని తెలుస్తోంది.

-ఎన్నం

ఫ్రెండ్ అని రూ.2 కోట్ల కారు ఇచ్చాడు.. పచ్చడి చేశాడు!

సాధారణంగా మన దగ్గర లేని వస్తువులు మన స్నేహితుల దగ్గర ఉంటే అవసరానికి తగినట్లుగా అడిగి వినియోగించుకుంటూ ఉంటామనే సంగతి తెలిసిందే.  బైక్ లేదా కార్ మన అవసరాన్ని బట్టి స్నేహితుల దగ్గర తీసుకుంటూ ఉంటాం. అయితే మన స్నేహితుడు ఇచ్చిన వాహనాన్ని యథావిధిగా ఇస్తే ఎటువంటి సమస్య ఉండదు కానీ అలా చేయకపోతే మాత్రం గొడవలు జరుగుతాయి.

ఒకవేళ స్నేహితుడు ఇచ్చిన వాహనం ఏదైనా ప్రమాదానికి గురైతే బాధ వర్ణానాతీతం. తాజాగా అలాంటి ఘటన ఒకటి స్పెయిన్ లోని హ్యూయెల్వాలో చోటు చేసుకుంది. షికారు కోసం స్నేహితుడి కారును తీసుకున్న ఒక యువకుడు కారును అతివేగంతో తోలాడు. అయితే వేగం ఎక్కువ కావడంతో అదుపు చేయాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. వేగంగా వెళ్లిన కారు పవర్ కంట్రోల్ రూమ్ ను ఢీ కొట్టింది.

దీంతో కారు నుజ్జునుజ్జయింది. నుజ్జునుజ్జయిన కారు విలువ 2 కోట్ల రూపాయలు కావడం గమనార్హం. అత్యంత ఖరీదైన లంబోర్ఘిని కారును తీసుకున్న స్నేహితుడు యాక్సిడెంట్ అయిన వెంటనే అక్కడినుంచి పరారయ్యాడు. పోలీసులు కారు నంబర్ ఆధారంగా యజమానిని అదుపులోకి తీసుకోగా తనకే పాపం తెలీదని తన స్నేహితుడికి కారు ఇచ్చానని చెప్పాడు. యజమాని కారు ఇచ్చిన స్నేహితుడికి ఫోన్ చేయగా అతను గాయాలపాలై ఆస్పత్రిలో ఉన్నానని చెప్పాడు. పోలీసులు ఆస్పత్రిలో ఉన్న స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నారు. కారు ఢీ కొట్టడం వల్ల పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఆగిపోయిందని సమాచారం.

పాపం కాజల్.. కరోనా హీరోతో కిస్ !


సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కాజల్ అగర్వాల్ కి చాల మంచి నేమ్ ఉంది. సినిమా కోసం ఆమె ఏమైనా చేయడానికి ఎప్పుడు ముందుంటుందని, అవసరమైతే అందనపు రోజులను కూడా సినిమాకి కేటాయిస్తోందని.. అన్నిటికీ మించి దర్శకనిర్మాతలకు నచ్చినట్టు ఎడ్జెస్ట్ అయిపోతుందని.. ఇక షూటింగ్స్ హోటల్స్ విషయంలో కూడా ఎక్కువ డిమాండ్స్ చేయదని.. ఇలా కాజల్ కి అద్భుతమైన నేమ్ ఉంది. పైగా అందరి హీరోలతో పర్సనల్ గా ఎప్పుడు రెగ్యులర్ గా టచ్ లో ఉంటుందని.. అందుకే వయసు ముదిరిన అమ్మడుకు మెయిన్ హీరోయిన్ గానే ఇంకా చాన్స్ లు వస్తున్నాయని అంటున్నారు ఫిల్మ్ జనాలు.

Also Read: అటు తిరిగి ఇటు తిరిగి.. అఖిల్ దగ్గరకే వచ్చాడు !

ఏమైనా హీరోయిన్ల అనగానే వాళ్ల రెమ్యున‌రేష‌న్‌, డేటింగ్‌, ఇత‌ర‌త్రా ఎఫైర్స్ గురించే గుసగుసలాడుకుంటారు గాని, వాళ్ల కష్టాన్ని మాత్రం ఎవ్వరు పట్టించుకోరని కాజల్ తెగ ఫీల్ అవుతుందట. ఆ మధ్య కాజల్ కి ఒక తమిళ సినిమా వచ్చింది. ఆ హీరోకి ఇటివలే కరోనా కూడా వచ్చింది. త్వరగానే కరోనా నుండి కోలుకున్నాడు అనుకోండి. ఇలా కొలుకున్నాడో లేదో.. అంతలోనే షూటింగ్ కి ప్లాన్ చేస్తున్నాడట. అది రొమాంటిక్ సాంగ్ ను. సాంగ్ లో కాస్త ఆ హీరోగారి మీద కాజల్ మనసు పడి, తన ఒంటిని కూడా పడేసుకోవాలి. రెగ్యులర్ డేస్ లో అయితే ఇలాంటి రొమాంటిక్ సాంగ్స్ అండ్ లిప్ కిస్ లు కాజల్ చాల అవలీలగా చేసి పారేస్తోంది.

Also Read: ప్రేమ విఫలమైనా ఫీల్ చావలేదు !

కానీ, ఇది కరోనా టైం కదా, ఇలాంటి టైంలో కూడా రోమాన్స్ ఏమిటి అంటుంది కాజల్. తాను డేట్స్ ఇవ్వలేనని చెప్పినా, ఆ హీరో మాత్రం ఒక్క నాలుగు రోజులు కేటాయిస్తే సినిమాని ఓటిటిలో రిలీజ్ చేసుకోవచ్చు, కొంచెం కోపరేట్ చేయి అంటూ డైలీ సతాయిస్తున్నాడట. పాపం కాజల్ ఏమి చేయలేని పొజిషన్. డేట్స్ ఇవ్వక తప్పదు. కరోనా వచ్చిన ఆ హీరో పెదవులను బుగ్గలను ముద్దు చేయాలి. నిజానికి హీరోయిన్లను ఎంత సేపూ అందాల ఆర‌బోత‌గానే చూస్తాం గానీ, వారి కష్టాలు ఒక్కోసారి చాల బాధాకరంగా కూడా ఉంటాయి. అయినా సినిమా అంటే గ్లామ‌ర్ బిజినెస్‌ కాబట్టి గ్లామర్ బ్యూటీలను వ్యాపార కోణంలోనే చూడాలి. అలాగే చూస్తారు.

‘చికెన్’లో కరోనా.. బయటపడ్డ షాకింగ్ నిజం.. ఎక్కడంటే?

 

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తున్న కరోనా వైరస్ గురించి శాస్త్రవేత్తల పరిశోధనల్లో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా దక్షిణ చైనాలోని షెంజన్ ప్రభుత్వం బ్రెజిల్ నుంచి దిగుమతి చేసిన చికెన్ లో కరోనా వైరస్ ఆనవాళ్లను గుర్తించామని తెలిపింది. సాధారణ చెకప్ లో భాగంగా నిర్వహించిన పరీక్షల్లో చనిపోయిన కోడికి కరోనా నిర్ధారణ అయిందని తేలింది.

గత సంవత్సరం డిసెంబర్ నెలలో చైనాలో కరోనా వైరస్ విజృంభించగా అధికారులు షింఫడీ సీపుడ్ మార్కెట్లో కరోనా ఆనవాళ్లు కనిపించడంతో ఈ మార్కెట్ పై దృష్టి పెట్టారు. అప్పటినుంచి లోకల్ గా ఉండే వైద్యులు తరచుగా వ్యాపారులు, వినియోగదారులు, సిబ్బందికి పరీక్షలు నిర్వహించి వైరస్ సోకిందో లేదో నిర్ధారిస్తున్నారు. పరీక్షలు నిర్వహిస్తున్న క్రమంలో బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకున్న కోడి రెక్కల్లో వైరస్ నిర్ధారణ అయింది.

అధికారులు తక్షణమే మాంసం కొనుగోలు చేసిన వారందరికీ ముందస్తు చర్యల్లో భాగంగా పరీక్షలు చేయగా నెగిటివ్ నిర్ధారణ అయింది. చైనాలొని బ్రెజిల్ ఎంబసీ ఈ ఆరోపణలపై స్పందించాల్సి ఉంది. డ్రాగన్ మరో ప్రకటనలో ఈక్వెడార్ నుంచి దిగుమతి చేసుకున్న సీ ఫుడ్ ప్యాకేజీల్లో కరోనా వైరస్ ను నిర్ధారించినట్లు తెలిపింది. మరోవైపు కోడి రెక్కల్లో వైరస్ నిర్ధారణ కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

పెళ్లి మూడ్ నుండి బిజినెస్ మూడ్ లోకి !


ఒక సామాన్య డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన దిల్ రాజు, ఇప్పుడు టాలీవుడ్ లోనే నెంబర్ వన్ నిర్మాతగా మారి, థియేటర్లను కంట్రోల్ లో పెట్టుకోవడంతో పాటు.. తనకు భవిష్యత్తులో పోటీ రావొచ్చు అనే అనుమానం ఉన్న యువి, గీతా లాంటి సంస్థలను కూడా తనతోనే కలుపుకుని, మొత్తానికి ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగాడు. దిల్ రాజు ప్రస్తుతం కొత్త పెళ్లి కొడుకులా టైంను స్పెండ్ చేస్తున్నా.. త్వరలో మళ్ళీ బిజీ కాబోతున్నాడు.

Also Read: అటు తిరిగి ఇటు తిరిగి.. అఖిల్ దగ్గరకే వచ్చాడు !

నవంబర్ లో ఓ చిన్న సైజ్ ఓటిటి ప్లాట్ ఫామ్ ను స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. అలాగే కంటెంట్ ఏజెన్సీ కూడా పెట్టబోతున్నాడు. అంటే ఎవరైనా అవుట్ ఫుట్ తో వస్తే.. దాన్ని మార్కెట్ చేసే సంస్థ అన్నమాట. ఓటిటికి కంటెంట్ విక్రయించే పనితో పాటు కంటెంట్ ను తయారు చేసే విధంగా తన సంస్థను మార్చబోతున్నాడు. ఇప్పటికే దిల్ రాజుకు శాటిలైట్ హక్కుల కొనుగోలు, అమ్మకాల బిజినెస్ కూడా వుంది. ఇప్పుడు అలాగే ఓటిటిలోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

ఏమైనా దిల్ రాజు మాత్రం ఇండస్ట్రీలో తనకున్న ఇమేజ్ ను నిలబెట్టుకోవడానికి బాగానే ప్రయత్నం చేస్తోనట్లు తెలుస్తోంది. ఆ మధ్య యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్ట్ అనే ఒక కొత్త ఆలోచన చేసి, మెయిన్ నిర్మాతలందర్నీ ఒకచోటుకు చేర్చి.. దానికి హెడ్ గా ఉంటూ స్టార్ హీరోల సినిమాల రిలీజ్ వ్యవహారాలను కూడా తన అదుపులోకి తెచ్చుకున్న టాలెంట్ దిల్ రాజుది. మరి ఇప్పుడు కూడా అలాంటి టాలెంట్ నే ఓటిటి రంగంలో కూడా చూపించబోతున్నాడు.

Also Read: ప్రేమ విఫలమైనా ఫీల్ చావలేదు !

అన్నట్టు దిల్ రాజుకి మరో ఆలోచన కూడా ఉందట. ఫుల్ అండ్ గుడ్ స్క్రిప్ట్ తో వస్తే.. దానికి ఫండింగ్ చేయడనికి కూడా దిల్ రాజు తన సంస్థ డిజైన్ చేస్తున్నాడట. మరి కొత్త డైరెక్టర్స్ కి ఇదే మంచి టైం అనుకోవాలి. ఇంట్రస్టింగ్ స్క్రిప్ట్ లు ఉంటే, వెంటనే దిల్ రాజు సంస్థలో వాలిపోండి. అదృష్టం కలిసొస్తే డైరెక్టర్ అయిపోవచ్చు.

కేసీఆర్ తో కయ్యానికి సిద్ధమవుతున్న జగన్?


ఏపీ ప్రభుత్వం తాజాగా చేపడుతున్న పోతిరెడ్డి ఎత్తిపోతల పథకం ఇరు రాష్ట్రల సీఎం మధ్య చిచ్చు పెట్టేలా కన్పిస్తుంది. తెలంగాణ, కొస్తా, రాయలసీమ ప్రాంతాలు కలిసి ఉన్నప్పటి నుంచే తెలంగాణకు నీటివాటా విషయంలో అన్యాయం జరిగిందనే ఆరోపణలున్నాయి. నిధులు.. నీళ్లు.. ఉద్యోగాల నినాదంతోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. తెలంగాణ తొలి సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టాక తెలంగాణలోని కోటి ఎకరాలను నీరందించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే మూడున్నరేళ్ల లోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి లక్షల ఎకరాలకు నీరందిస్తున్నారు.

Also Read: ఏకంగా రాష్ట్రపతి కంట్లో పడ్డ వైసీపీ…! ఇక చిక్కులు తప్పవా…?

కేసీఆర్ మాదిరిగానే సీఎం జగన్ ఏపీలో సాగునీటి ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టారు. దీనిలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు పనులను వేగవంతం చేస్తున్నారు. మరోవైపు రాయలసీమ ప్రాంతానికి నీటిని తరలించేందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. పోతిరెడ్డిపాడు నుంచి రోజుకు మూడు టీఎంసీల చొప్పున రాయలసీమకు నీటిని తీసుకెళ్లాలని ఏపీ సర్కార్ భావిస్తుంది. ఈ పథకంపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలోని ప్రతిపక్షాలన్నీ సీఎం కేసీఆర్ టార్గెట్ చేస్తుండటంతో తమ వాదనను అపెక్స్ కమిటీకి బలంగా విన్పించాలని ఆయన అధికారులకు ఆదేశాలిచ్చారు.

సముద్రంలోకి వృథాగా వెళుతున్న గోదావరి జలాలను వాడుకోనేలా ప్రాజెక్టులు చేపట్టకుండా తెలంగాణ ప్రాజెక్టులను ఎండగట్టేలా ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపడుతుండటాన్ని కేసీఆర్ తప్పుబట్టారు. ఈసందర్భంగా ఏపీ ప్రభుత్వం తీరును ఎండగడుతూ పలు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఏపీ ప్రాజెక్టులపై చేసిన వ్యాఖ్యలను ఏపీ జలవనరుల శాఖ అధికారులు సీఎం జగన్ వద్దకు తీసుకెళ్లారు. అయితే జగన్ మాత్రం కేసీఆర్ మాటలను పట్టించుకోవద్దంటూ వారికి సూచిస్తుండటం గమనార్హం.

Also Read: తెలంగాణ పీసీసీ ఛీఫ్ కోసం కర్ణాటకలో రాజకీయాలు?

గతంలో సీఎం కేసీఆర్ పొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా మెలిగి ఎలాగైతే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశారో అదేవిధంగా జగన్ సైతం పొరుగు రాష్ట్రాలతో సఖ్యత ఉండేందుకు మొగ్గుచూపుతున్నారు. ఏపీ శ్రీశైలం నుంచి రావాల్సిన నీటినే రాయలసీమకు తరలిస్తున్నట్లు ఆయన పేర్కొంటున్నారు. ఉమ్మడి ఆంధప్రదేశ్లోనే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి బీజం పడిందనే ఆయన గుర్తు చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఈనెల 20న జరిగే అపెక్స్ కౌన్సిల్ లో విన్పించాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది.

తెలంగాణ సీఎం కేసీఆర్ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి నీటి తరలింపును బలంగా వ్యతిరేకిస్తుస్తున్నారు. మరోవైపు సీఎం జగన్ తమకు రావాల్సిన నీటిని తరలిస్తున్నామని చెబుతుండటంతో నీటి వివాదాలు రాజుకునేలా కన్పిస్తున్నాయి. దీంతో ఇప్పటివరకు సఖ్యత మెలిగిన ఇరు రాష్ట్రాల సీఎంలు నీటి కోసం కయ్యానికి దిగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. జలవివాదాలు రాకుండా ఈ సమస్యను ఇరు రాష్ట్రాల సీఎంలు ఎలా పరిష్కరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులు ఈనెల 20న అపెక్స్ కౌన్సిల్లో తమ వాదనలు బలంగా విన్పించేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఎవరీ వాదనలు బలంగా నిలుస్తాయనేది ఆసక్తిని రేపుతోంది.

Niharika Konidela Engagement Pictures

ఏ సెక్షన్ల కింద కేస్ బుక్ అయితే ఎలాంటి శిక్షలు వేస్తారో మీకు తెలుసా?

మనలో చాలామందికి రాజకీయాలు, సినిమాల గురించి అవగాహన ఉన్నా చట్టాల గురించి మాత్రం అవగాహన ఉండదు. బలవన్మరణానికి ప్రేరేపించడం, దొంగతనం, బెదిరింపులు, మోసాలకు పాల్పడటం లాంటి వాటికి ఎలాంటి శిక్షలు వేస్తారనే విషయం తెలియదు. అయితే మనం ఖచ్చితంగా చట్టాల గురించి కనీస అవగాహనను ఏర్పరచుకోవాలి. మనం ఇతరులు ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించినా మన మాటల వల్ల అవతలి వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నా సెక్షన్ 306 కింద కేసు నమోదు చేసి నిరూపితమైతే జైలు శిక్ష విధిస్తారు.

ఏ వ్యక్తినైనా అక్రమంగా అడ్డగించడం లాంటి పనులు చేస్తే సెక్షన్ 341 కింద కేసు నమోదు చేసి జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. ఏ వ్యక్తినైనా అక్రమంగా నిర్భంధిస్తే సెక్షన్ 342 కింద కేసు నమోదు చేసి శిక్షతో పాటు ఫైన్ విధిస్తారు. ఇంట్లో నుండి దొంగతనం చేస్తే సెక్షన్ 380 కింద 7 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఉద్దేశపూర్వకంగా ఇతరులను నమ్మించి మోసం చేస్తే సెక్షన్ 406 కింద కేసు నమోదు చేసి కేసు తీవ్రతను బట్టి రెండేళ్ల నుంచి ఏడేళ్ల వరకు శిక్ష విధిస్తారు.

ఇతరుల నుంచి ఆస్తి లేదా విలువైన వస్తువులను మోసపూరితంగా తీసుకుంటే సెక్షన్ 420 కింద కేసు నమోదవుతుంది. వీళ్లకు కోర్టు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ఇతరులపై బెదిరింపులకు పాల్పడితే సెక్షన్ 506 కింద కేసు నమోదు చేసి కేసు తీవ్రతను బట్టి రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది కలిసి కుట్రకు పాల్పడితే సెక్షన్ 120 బి కింద కేసు నమోదు చేస్తారు. కేసు ప్రూవ్ అయితే రెండేళ్ల నుంచి గరిష్టంగా ఏడేళ్ల వరకు శిక్ష పడుతుంది.

సినిమా వాళ్ళు తనని వాడుకోవట్లేదట !


ఎంత అందచందాలు ఉన్నా తమ కెరీర్లో ఎప్పుడో ఒకసారి ప్రతి బ్యూటీ డల్ ఫేజ్ చూడాల్సిందే. హాట్ యాంకర్ రష్మి గౌతమ్ కూడా ప్రస్తుతం అలాంటి డల్ పేజ్ లోనే ఉందట. టీవీ షోలలో అవకాశాలు ఉన్నప్పటికీ సినిమాల్లో మాత్రం ఈ ముదురు బ్యూటీకి చెప్పుకోదగ్గ ఆఫర్లు లేవని.. కనీసం కరోనా అనంతరం అయినా తను మూవీస్ లో కూడా బిజీ కావాలని తెగ ఆరాట పడుతుంది. ఏది ఏమైనా వెండితెరైనా బుల్లితెరైనా రష్మీ గౌతమ్ తనకున్న గ్లామర్ ను ఒళ్ళు దాచుకోకుండా బాగానే ప్రదర్శన చేస్తోంది. కాకపోతే హీరోయిన్ మెటీరియల్ కాకపోవడం, ఐటమ్ సాంగ్స్ కి పెర్ఫెక్ట్ ఫిగర్ కావడం..అన్నిటికి మించి ఆంటీ వయసు వచ్చేయడంతో రష్మీ సినిమాల్లో బిజీ కాలేకపోతుంది.

Also Read: కావాలని ఎక్స్ పోజింగ్ చేస్తోందట !

అయినా ముప్పై ప్లస్ లో కూడా ఈ అమ్ముడు మాత్రం తన అందాల ప్రదర్శనను తాను ప్రదర్శిస్తూ.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కుర్రకారును రెచ్చగొట్టే ప్రోగ్రామ్ చేసుకుంటూ.. ఎప్పుడూ లైమ్ లైట్ లో ఉండటానికి తరచుగా హాట్ ఫోటో షూట్లు చేస్తూ అన్ని విధాలుగా ముందుకు పోతుంది. అసలు రష్మి చూపుల్లోనే ఫుల్ హాట్ నెస్ ఉంటుందాయే. అయినప్పటికీ ఆల్ టైం బ్యూటీ అనసూయ భారీ అందాల ముందు రష్మి బిలౌవ్ ఎవరేజ్ వయ్యారాలు పెద్దగా వర్కౌట్ అవ్వట్లేదు. నిజానికి మన టాలీవుడ్ డైరెక్టర్స్ అనసూయ కోసం రాసినట్టు రష్మి కోసం రోల్స్ రాయరు. ఆ మాటకొస్తే.. అనసూయకి ఇచ్చే రెమ్యునరేషన్ లో సగం కూడా రష్మీకి ఇవ్వరు.

Also Read: ప్రేమ విఫలమైనా ఫీల్ చావలేదు !

ఇప్పటివరకూ రష్మీ చేసిన సినిమాలన్నీ చిన్న చితకా సినిమాలే. ఆ బి గ్రేడ్ సినిమాలకే ఆ మధ్య ఓ స్టార్ హీరోయిన్ రేంజ్ లో బాగానే హడావుడి చేసిందనుకోండి. అయితే గత సంవత్సరం నుండి రష్మి సినిమాలు లేకుండా ఖాళీగా ఉంటుందట. ఆ అసహనం రోజురోజుకు పెరుగుతుందట. అసలు సినిమా వాళ్ళు తనని వాడుకోవట్లేదని రష్మి తెగ ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది. మరి డైరెక్టర్స్.. రష్మీని అదే ఆమెలోని టాలెంట్ ని ఫుల్ వాడుకోండి.. లేకపోతే మరో శ్రీరెడ్డిలా తయారయ్యేలా ఉంది.