Home Blog Page 8370

తొలి కాంగ్రెసేతర ప్రధాని..రికార్డ్ సృష్టించిన మోడీ

shock to Modi for the first time
shock to Modi for the first time


100 ఏళ్ల కాంగ్రెస్ ను ఎదుర్కొన్నాడు. కమలదళాన్ని నడిపించాడు. ఒంటిచేత్తో దేశంలో బీజేపీకి అధికారం తెప్పించాడు. పొత్తుల సంసారంలో కొట్టుమిట్టాడే భారత ప్రజాస్వామ్య చరిత్రలో రెండు సార్లు పూర్తి మెజారిటీతో బీజేపీని గద్దెనెక్కించి ప్రధాని కొలువులో కూర్చున్నాడు మోడీ. ఇప్పుడు స్వతంత్ర భారతంలోనే కొత్త ఘనతను సృష్టించాడు.

Also Read: చదువులా.. ప్రాణాలా? ఇప్పుడు ఏది ముఖ్యం?

ప్రధాని మోడీ కొత్త రికార్డ్ సృష్టించాడు. దేశంలో ప్రధానిగా అత్యధిక కాలం సేవలందించిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా మోడీ సంచలనం రేపారు.

ఇంతకాలం ఆ రికార్డ్ బీజేపీకి చెందిన దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి పేరిట ఉంది.వాజ్ పేయి రెండు సార్లు దేశ ప్రధానిగా 2268 రోజులు పనిచేశారు. నరేంద్రమోడీ ఈ గురువారంతో దానిని అధిగమించారు.

ప్రస్తుత మన దేశ చరిత్రలో నెహ్రూ, ఇందిరాగాంధీ, మన్మోహన్ సింగ్ తర్వాత అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన నాలుగో వ్యక్తిగా మోడీ రికార్డ్ సృష్టించారు. దేశంలో అత్యధిక కాలం ప్రధానిగా సేవలందించిన ఘనత తొలి ప్రధాని నెహ్రూ సొంతం. ఆయన 16 ఏళ్ల 286 రోజుల పాటు దేశ ప్రధానిగా సేవలందించారు.

ఇక ఇందిరాగాంధీ రెండోస్థానంలో ఉన్నారు. ఆమె 11 ఏళ్ల 59రోజులు దేశాన్ని పాలించారు. మన్మోహన్ సింగ్ మూడో వ్యక్తి. ఈయన 10 ఏళ్ల 4 రోజులు ప్రధానిగా సేవలందించారు.

Also Read: భారత మీడియా ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీనా?

వీళ్లందరి తర్వాత దేశ ప్రధానిగా అత్యధిక కాలం సేవలందించింది మన నరేంద్ర మోడీనే.. దేశ ప్రధానిగా 2014 మే 26న మోడీ తొలిసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇక రెండోసారి కూడా 2019లో అఖండ మెజారిటీతో గెలిచి మే 30న రెండోసారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. వాజ్ పేయి 5వ స్థానానికి పడిపోయాడు.

ఇక ఈ హయాంలో ముగిసేసరికి మోడీ ఖచ్చితంగా మూడు లేదా నాలుగో స్థానంలో నిలుస్తారు. 10 ఏళ్లు పూర్తి చేసుకొని మన్మోహన్ సింగ్ ను అధిగమించే చాన్స్ ఉంది. ఇక వచ్చేసారి కూడా గెలిస్తే ఏకంగా నెహ్రూ తర్వాత అత్యధిక కాలం దేశ ప్రధానిగా సేవలందించిన ఘనతను మోడీ సొంతం చేసుకుంటారు. కానీ వచ్చే సారి ఏం జరుగుతుందనేది మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఇప్పటికైతే మోడీ కాంగ్రెసేతరుల్లో నంబర్ 1 ప్రధానిగా నిలిచారు.

-ఎన్నం

అప్పటివరకూ అమరావతే ఏపీ రాజధాని…! జగన్ కు దిమ్మతిరిగే షాక్

Despite multiple problems, why Jagan can't shift Andhra's capital ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం గందరగోళంగా మారింది. పాలనా వ్యవహారంతో రాజకీయ పార్టీల అవసరాలను ముడి పెట్టే విధంగా జగన్ తీసుకున్న నిర్ణయానికి ఇప్పుడు ఒక్కసారిగా ఏపీ రాజకీయ సారూప్యత అంతా మారిపోయింది. గవర్నర్ నుంచి ఆమోదం వచ్చిన తర్వాత కూడా ఏపీ రాజధాని మార్పు సమస్య పరిష్కారం కాలేదు…. అంటే అసలు జగన్ తీసుకున్న నిర్ణయం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న ఇపుడు ప్రజల్లో నెమ్మదిగా కలగడం మొదలైంది.

ఏదైనా నిర్ణయం తీసుకుని దానిలో నిజంగా పక్షపాతం లేని ఉద్దేశం ఉంటే అది అమలు కావడానికి ఎంతో సమయం పట్టదు అన్నది ఎప్పటినుండో చరిత్ర మనకు చెబుతున్న మాట. ప్రస్తుతం న్యాయ చిక్కుల్లో ఇరుక్కున్న ఏపీ మూడు రాజధానులు విషయం తాజాగా విచారణకు వచ్చి జగన్ కు హై కోర్టు మరో షాక్ ఇచ్చింది.

వివరాల్లోకి వెళితే… ఏపీ రాజధాని తరలింపు పై ‘స్టేటస్ కో’ ఇచ్చిన హైకోర్టు ఈ నెల 27 వరకు దానిని పొడిగించి ఏపీ సర్కార్ ను… రాజధాని మార్పు అత్యవసరతను మరొకసారి సమీక్షించుకోమని ఇన్ డైరెక్ట్ గా చెప్పింది. కేసు వాయిదా వేయడం కానీ స్టేటస్ కో పొడిగించవద్దని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరిన తర్వాత కూడా హైకోర్టు అందుకు అంగీకరించకుండా స్టేటస్ కో ను పొడిగించడం గమనార్హం. ఈ పరిణామం రాజధాని తరలింపు పై జగన్ సర్కార్ కు పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. 

అసలు గట్టిగా మాట్లాడితే ఈ కరోనా సమయంలో రాజధాని మార్చేంత ఎమర్జెన్సీ ఏముందని హైకోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణ ను ఆగస్టు 27కు వాయిదా వేసింది. ఈ విచారణలు…. వాదోపవాదాలు పూర్తయ్యేసరికి కనీసం మరో రెండు నెలలు అయినా పడుతుంది.. ఇక అప్పటి వరకూ జగన్ రాజధానిని అమరావతి నుండి తరలించే అవకాశం అయితే లేదు. ప్రస్తుతానికైతే రాజధానిపై యథాతథ స్థితి కొనసాగాలని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. మరి జగన్ ప్రభుత్వం… కోర్టు వారి ఆదేశాలను బేఖాతరు చేస్తుందా.. లేక ఈ సారి మాత్రం రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటుందా అన్న విషయం వేచి చూడాలి.

పెళ్లిలో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన వధువు.. బంధువులు ఏం చేశారంటే?

 

పెళ్లిళ్లు దైవ నిర్ణయం అంటారు పెద్దలు. అందువల్లే కొన్ని సందర్భాల్లో ఊహించని విధంగా పెళ్లిళ్లు జరిగితే మరికొన్ని సందర్భాల్లో పెళ్లిపీటల వరకు వచ్చి ఆగిపోతూ ఉంటాయి. తాజాగా కృష్ణా జిల్లాలో ఒక పెళ్లి సినిమా సన్నివేశాన్ని తలపించే విధంగా ఆగిపోయింది. పెళ్లి ఆగిన తరువాత ఊహించని రీతిలో బంధువులు భోజనాలు చేసి వెళ్లిపోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరుకు చెందిన ఒక యువకుడికి దూర ప్రాంతానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది.

నిన్న ఉదయం చర్చిలో యువతీయువకుల వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి తంతు మొదలైన కొంత సమయం తరువాత మత పెద్ద వరుడికి పెళ్లి సమ్మతమో కాదో అడిగాడు. వరుడు తనకు ఈ పెళ్లి ఇష్టమేనని చెప్పాడు. అదే సమయంలో మత పెద్ద వధువును పెళ్లి ఇష్టమో కాదో అడగగా ఆమె మాత్రం ఇష్టం లేదని చెప్పింది. వధువు పెళ్లి ఇష్టం లేదని చెప్పడంతో మత పెద్దతో పాటు వధువు, వరుడి బంధువులను షాక్ కు గురి చేసింది.

మతపెద్ద వధువుకు ఇష్టం లేకుండా వివాహం జరిపించకూడదని ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోండని చెప్పారు. అనంతరం యువతి బంధువులు ఆమెకు నచ్చజెప్పి వివాహానికి అంగీకరించేలా చేశారు. అయితే యువకుడు తాను ఆ అమ్మాయిని వివాహం చేసుకోలేనని చెప్పాడు. దీంతో పెళ్లి ఆగిపోగా అప్పటికే భోజనాలు సిద్ధం కావడంతో వధువు, వరుడి తరపు బంధువులు భోజనాలు చేసి అక్కడినుంచి వెళ్లిపోయారు.

తరలింపును అడ్డుకోవడం సబబు కాదంటున్న ప్రభుత్వం..!


రాజధాని తరలింపు విషయంలో హై కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్ఢీఏ రద్దు బిల్లులు ఇప్పడు చట్ట రూపంలోకి వచ్చాయని, ఈ రెండు చట్టాలు అమలులో ఉన్నందున రాజధాని తరలింపుపై అభ్యంతరాలు సబబు కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. మరో వైపు కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ పిటీషన్ లోని అంశాల ఆధారం చేసుకునే రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ పిటీషన్ పలు అంశాలను ప్రస్తావించింది. కేంద్రం రాజధాని విషయం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుందని చెప్పిన విషయం విధితమే. ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని పదే పదే కోరుతున్నట్లు పేర్కొన్నారు.

Also Read: ఈశ్వరయ్య వ్యవహారంతో ప్రభుత్వానికి చిక్కులు తప్పవా?

రాష్ట్ర ప్రభుత్వం ఇదే విషయాన్ని తెలియజేసింది. రాజధాని పూర్తిగా విషయం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమని, కేంద్ర ప్రభుత్వం ఇదే విషయాన్ని స్సష్టం చేసిందని తన కౌంటర్ లో పేర్కొంది. ఈ కౌంటర్ పిటీషన్ ను పురపాలక శాఖ పత్యేక కార్యదర్శి వి.రామమనోహరరావు దాఖలు చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన పి.శ్రీనివాసరావు 2018లో ప్రత్యేక హోదా విషయంపై పిటీషన్ దాఖలు చేశారు. అనంతరం దీనికి అనుబందంగా పునర్యవస్థీకరణ చట్టం అమలు, రాజధాని తరలింపు తదితర అంశాలపై పలు పిటీషన్లు దాఖలు అయ్యాయి. వీటిని హై కోర్టు విచారించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది.

Also Read: చదువులా.. ప్రాణాలా? ఇప్పుడు ఏది ముఖ్యం?

విచారణలో భాగంగా గత నెల 4వ తేదీ నుంచి 14వ తేదీ వరకూ రాజధాని తరలింపు, పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై హై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ రోజుతో మధ్యంతర ఉత్తర్వుల గడువు ముగిసింది. కేసు తదుపరి విచారణ హై కోర్టు త్రి సభ్య ధర్మాసనం ఈ రోజు చేపట్టనుంది. దీంతో కోర్టు ఆదేశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు రాజధాని తరలింపునకు అవసరమైన చర్యలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుటుంది. మూడు రాజధానుల నిర్మణానికి అవసరమైన రూ.5,099 కోట్లు అవసరం అవుతాయని, ఈ నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాధనలు పంపింది. రాజధాని తరలించినా ఇక్కడి రైతులకు ఎటువంటి నష్టం ఉండదని ప్రభుత్వం తన కౌంటర్ లో పేర్కొంది. భూములిచ్చిన రైతుల ప్రయోజనాలు రక్షించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని కోర్టుకు తెలిపారు.

Malavika Latest Photo Stills

వజ్రోత్సవాల నాటికి పార్లమెంట్ కొత్త భవనం?


కేంద్ర ప్రభుత్వం కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించేందుకు ఇప్పటికే సన్నహాలు చేస్తోంది. 2022 ఆగస్టు 15 నాటికి భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు 75ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నాయి. ఆ సమయానికి కల్లా పార్లమెంట్ కొత్త భవనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి భారత స్వాతంత్ర్య వజోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చాక దేశంలో ఇప్పటికే సంచలన నిర్ణయాలు తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచారు. తాజాగా పార్లమెంట్ భవనాన్ని వజ్రోత్సవాల నాటికి అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తుండటం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

Also Read: భారత మీడియా ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీనా?

ప్రస్తుత పార్లమెంట్ భవన నిర్మాణం 1921లో నిర్మాణం మొదలుపెట్టగా 1937లోముగిసింది. సుమారు వందేళ్ల చరిత్ర కలిగిన ఈ భవనం ఇప్పటికే ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. ప్రస్తుత అవసరాలకు ఈ భవనం తగ్గట్టులేకపోవడం.. ఫైర్ సెప్టీ లేకపోవడంతో కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించాలని యూపీఏ-2 హయాంలోనే నాటి స్పీకర్ మీరా కుమారి ఓ కమిటీ వేశారు. ఇక కేంద్రంలో మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చాక దీనిని ముందుకు తీసుకెళుతున్నారు. గతేడాది ఆగస్టు 5న కొత్త భవనం నిర్మించాలని ప్రధాని మోడీకి ప్రతిపాదించగా కరోనా కారణంగా ఈ ప్రక్రియ నిలిచిపోయింది.

ఇప్పటికే పార్లమెంట్ కొత్త భవన నిర్మించేందుకు అనుమతి ఇవ్వాలంటూ కేంద్రం సుప్రీం కోర్టుకు విన్నవించింది. సుప్రీం తీర్పు వచ్చిన వెంటనే పనులు వేగవంతంగా పూర్తి చేసేలా కేంద్రం సన్నహాలు చేస్తుంది. ఇందులో భాగంగానే కొత్త పార్లమెంటు భవన నిర్మాణ చేపట్టేందుకు కేంద్రం మూడు కంపెనీలని ఎంపిక చేసింది. మొత్తం ఏడు కంపెనీలు బిడ్డింగ్ కోసం ఆసక్తి చూపగా నాలుగు కంపెనీలకు కేంద్రం తిరస్కరించి మూడు కంపెనీలను షార్ట్ లిస్టు చేసింది. వీటిలో ముంబైకి చెందిన లార్సెన్‌ అండ్‌ టుబ్రో(ఎల్‌ అండ్‌ టీ) లిమిటెడ్‌, టాటా ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌, షపూర్‌జీ పల్లాంజీ అండ్‌ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఉన్నాయి.

Also Read: కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సచిన్ పైలట్?

షార్ట్‌ లిస్ట్‌ అయిన మూడు కంపెనీలు త్వరలోనే తమ ఫైనాన్షియల్‌ బిడ్స్‌ను సమర్పించనున్నాయి. గుజరాత్ కు చెందిన బిమల్ పటేల్ ఆర్కిటెక్ట్ సంస్థ ‘హెచ్.సీ.పీ డిసైన్స్’ కొత్త పార్లమెంట్ రూపకల్పన బాధ్యతలను పర్యవేక్షిస్తోంది. నూతన భవనం కోసం కేంద్రం రూ.889 కోట్లను బడ్జెట్లో ప్రతిపాదించింది. పాత పార్లమెంట్ తరహాలోనే త్రిభుజాకారంలో కొత్త పార్లమెంట్ ను డిజైన్ రూపొందించారు. 21 నెలల్లో కొత్త భవన పనులు పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. దీనిలో ఒకేసారి 1345మంది సభ్యులు కూర్చునేలా సువిశాలంగా సెంట్రల్ మాల్ ను నిర్మిస్తుడం విశేషం.

తండ్రి రాజ్యసభలో.. తనయుడు లోక్ సభలో


ధర్మపురి అరవింద్ ప్రస్తుతం నిజామాబాద్ ఎంపీగా కొనసాగుతున్నారు. బీజేపీ నుంచి కిందటి ఎన్నికల్లో పొటీచేసి ఘన విజయం సాధించారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవితపై ఘన విజయం సాధించి సంచలనం సృష్టించారు. సీఎం కూతురిపై గెలుపొందడం ద్వారా ఆయన పేరు గత ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా మార్మోగింది.

Also Read: ఇంటిపోరుతో సతమతమవుతున్న మంత్రి?

మాజీ పీసీసీ చీఫ్, ప్రస్తుత టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్(డీఎస్)కు ఇద్దరు కుమారులు. వీరిలో సంజయ్ నిజామాబాద్ మేయర్ పదవీని గతంలో చేపట్టారు. ప్రస్తుతం తండ్రితోపాటు టీఆర్ఎస్ లో కొనసాగుతున్నారు. ఇక అరవింద్ కుమార్ 1976 ఆగస్టు 25న జన్మించారు. పోస్టు గ్రాడ్యుయేట్ చేశారు. అరవింద్ తండ్రి డీఎస్ టీఆర్ఎస్ లో కొనసాగుతుండగా ఆయన మాత్రం తన తాతను ఆదర్శంగా తీసుకొని బీజేపీలో చేరారు. అరవింద్ తాత గతంలో జనసంఘంలో ఉన్నారని ఆయన భావజాలమే తనలో ఉందని చెబుతుంటాడు. ప్రధాని నరేంద్రమోదీ యువత కోసం చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితుడై ఆయన బీజేపీలో చేరాడు. కిందటి పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ బీజేపీ అభ్యర్థిగా అరవింద్ కుమార్ పోటీ చేసి కేసీఆర్ కూతురు కవితపై గెలుపొందాడు.

ఇక టీఆర్ఎస్ నుంచి డీఎస్ రాజ్యసభకు వెళ్లగా.. బీజేపీ నుంచి అరవింద్ ఎంపీగా గెలిచి లోక్ సభకు వెళ్లారు. ఒకే ఫ్యామిలీ నుంచి ఒకరు రాజ్యసభకు.. మరొకరు లోక్ సభకు వెళ్లడం గమనార్హం. ఇక చదువుకునే రోజుల్లోనే మంచి క్రికెట్ ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కుడిచేతి బ్యాట్సమెన్ అయిన అరవింద్ 1995-96 సంవత్సరంలో హైదరాబాద్ ఫస్టు క్రికెట్ మ్యాచుల్లో ఆడారు. రాజకీయాల్లోకి రాకముందు నుంచే అరవింద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఎంపీగా గెలిచాక ప్రజా సేవ చేస్తూనే వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. గత ఎన్నికల్లో నిజామాబాదులో పసుపు బోర్డు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని అక్కడి రైతులకు హామీ ఇచ్చారు. కేంద్రంతో మాట్లాడి పసుపు బోర్డు తెచ్చేందుకు ఆయన కృషి చేస్తున్నారు.

Also Read: తెలంగాణ కొత్త సెక్రటేరియట్ కు ఇక అతనే సీఎం..?

అధికార టీఆర్ఎస్ చేపడుతున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు. జిల్లాలో బీజేపీని బలోపేతం చేస్తూ ముందుకెళుతున్నారు. ఆయన రాజకీయాల్లో తొలి నుంచి దూకుడు పంథాలోనే వెళుతున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో రాష్ట్రంలో ప్రజా సమస్యలపై ఆయన మరింత దూకుడుగా వెళుతున్నారు. అరవింద్ మాటల దాడిని ఎదుర్కొలేక ఇటీవల టీఆర్ఎస్ నేతలు వరంగల్ జిల్లాలో ఆయనపై దాడి చేశారు. దీంతో బీజేపీ వర్సస్ టీఆర్ఎస్ ఇష్యూ అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే అరవింద్ మాత్రం ‘నేను దేశ భక్తుడిని.. నా దేశం.. ప్రధాని కోసం నా జీవితాన్ని అర్పిస్తా’నని చెబుతుంటారు.

ఎంపీ Vs ఎమ్మెల్యే! మరోసారి వివాదం షురూ..!


నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు, వైసీపీ నాయకుల మధ్య మరోసారి వార్ షురూ అయ్యింది. ఇందుకు కారణం లేకపోలేదు… ఎంపీ రాఘురామ కృష్ణంరాజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగారు. దీంతో ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ఎంపీపై అదే స్థాయిలో విమర్శలకు దిగారు. ఇరువురి విమర్శలు తీవ్ర స్థాయిలో ఉండటంతో ఈ వ్యవహారం రాజకీయంగా ప్రకంపనలు సృష్టించేదిగా ఉంది.

Also Read: ఈశ్వరయ్య వ్యవహారంతో ప్రభుత్వానికి చిక్కులు తప్పవా?

ఎంపీ రఘురామ కృష్ణంరాజు మీడియా ముఖంగా సిఎం జగన్మోహన్ రెడ్డికి కొన్ని సూచనలు చేశారు. రాష్ట్రంలో రెడ్డి రాజ్యం కొనసాగుతుందని, ఆ సామాజిక వర్గానికే ప్రాధాన్యత దక్కుతుందని, అన్ని కులాలతో ఓటు వేయించుకుని రెడ్డి కులానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి పదవులు కట్టబెడుతున్నారని ఇది సరైన విధానం కాదని సూచించారు. ప్రతి రెండు రోజులకు ఒక రెడ్డి సామాజికి వర్గానికి చెందిన వారికి ప్రభుత్వ పోస్టుల్లో నియమిస్తూ ఉత్తర్వులు విడుదల అవుతున్నాయని ఆరోపించారు. క్రైస్తవుడైన జగన్ అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు ప్రాధాన్యత దక్కుతుందని ప్రజలు భావించినట్లు తెలిపారు. రాఘురామ కృష్ణంరాజు సిఎం జగన్మోహన్ రెడ్డిని క్రైస్తవుడు అని కొద్ది రోజుల నుంచి పదే పదే చెప్పేందుకు ప్రయత్నం చేస్తుండటం విశేషం. అదేవిధంగా రాష్ట్రంలో అర్హత లేని వారికి ప్రభుత్వ పదువులు కట్టబెడుతున్నారని, ఇతర కులాలు లేవని ప్రభుత్వం భావిస్తుందా అని ప్రశ్నించారు.

Also Read:చదువులా.. ప్రాణాలా? ఇప్పుడు ఏది ముఖ్యం?

దీంతో వైసీపీ ఎమ్మెల్యే కారుమూరు నాగేశ్వరరావు ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజులకు అత్యధిక పదవులు వైసీపీ ఇచ్చిందని చెప్పారు. ఎంపీ రాజు తేడా అనే విషయాన్ని మరోమారు స్పష్టం చేస్తూ, ఆతనికి మతి స్థిమితం లేదన్నారు. గతంలో యాదవులు, కాపులు, దళితులు అందరి గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ఒక పార్టీలో ఉండి ఆ పార్టీ అధినాయకుణ్నే వెన్నుపోటు పోడుస్తున్నారని విమర్శించారు. ఎంపీ వల్ల క్షత్రియ సామాజిక వర్గం తీవ్ర ఇబ్బందులు పడుతుందని చెప్పారు. గతంలో బాపిరాజు, శివరామరాజు, కృష్ణంరాజు వంటి వారు ఎన్ని పదవులు అలంకరించినా హుందాగా ప్రవర్తించే వారన్నారు. నర్సాపురం ఎంపీ క్షత్రియుల పరువు మంటగలుపుతున్నారని తెలిపారు, వారే రాఘురామ కృష్ణంరాజును వెలివేస్తారని చెప్పారు. టీడీపీ పాలనాలో ఏం చేశావని ప్రశ్నించారు. ఈ వివాదం పార్టీలో మరింత దుమారం రేపేదిగా ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

షాకింగ్.. 6 అడుగుల దూరం వరకు కరోనా వ్యాప్తి!

దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతోంది. ప్రతిరోజూ దేశంలో 60,000కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఈ వైరస్ గురించి మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఫ్లోరిడా యునివర్సిటీ పరిశోధకులు కరోనా వైరస్ గురించి విసృతంగా పరిశోధనలు చేసి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. కరోనా వైరస్ ఆరు అడుగుల దూరం కంటే ఎక్కువ దూరం వ్యాప్తి చెందుతుందని తెలిపారు.

వినడానికి కొంత షాకింగ్ గా అనిపించినా వైరస్ గురించి వెల్లడవుతున్న విషయాలు ప్రజల్లో భయాందోళనను పెంచుతున్నాయి. సాధారణంగా దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు మాత్రమే కరోనా వైరస్ సోకుతుందని ఇప్పటివరకు చాలామంది శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. కానీ మాట్లాడినపుడు, అరిచినప్పుడు కూడా వైరస్ వ్యాప్తి చెందుతోందని ఫ్లోరిడా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తాజాగా నోట్లో నుంచి వచ్చే తుంపరల ద్వారా బయటకు వస్తున్న వైరస్ కణాలు అంతకంతకూ పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి ఆరడుగుల భౌతిక దూరం ఏ మాత్రం సరిపోదని అభిప్రాయపడ్డారు. ప్రజలు భౌతిక దూరం పాటించే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. తాము చేసిన పరిశోధనల ఫలితాలను పరిశీలించి కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందన్న విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశీలించాలని అన్నారు.

ఆ రాష్ట్రంలోని జైళ్లలో వెయ్యి మందికిపైగా కరోనా.. ?

దేశంలో కరోనా మహమ్మారి విలయం కొనసాగుతోంది. ఎప్పుడు, ఎక్కడ, ఎవరినుంచి వైరస్ సోకుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. వైరస్ గురించి శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జనం గుంపులుగుంపులుగా గుమికూడే ప్రాంతాల్లో వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. ఒకే చోట ఎక్కువమంది ఉంటే ఒక్కరికి వైరస్ సోకినా ఇతరులకు అంతే వేగంతో వ్యాప్తి చెందుతోంది.

మన దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా ధాటికి మహారాష్ట్ర గజగజా వణుకుతోంది. ప్రజలు, పోలీసులు, జైలు సిబ్బంది సైతం కరోనా బారిన పడుతున్నారు. మహారాష్ట్రలో ని 292 జైళ్లలో 1000 మందికి పైగా ఖైదీలు కరోనా బారిన పడ్డారు. కరోనా బారిన పడిన వాళ్లలో 814 మంది ఖైదీలు, 286 మంది సిబ్బంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

ఇప్పటివరకు ఆరుగురు ఖైదీలు మాత్రం చికిత్సకు కోలుకోలేక మృతి చెందారు. జైళ్లలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు కరోనా నిర్ధారణ అయిన జైళ్లలో శానిటైజేషన్ చేస్తున్నారు. అదే సమయంలో జైళ్లలో కరోనా కేసులు నమోదు కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు జైళ్లలో కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ఖైదీలను జైళ్ల నుంచి విడుదల చేస్తున్నారు.

‘ఎన్‌కౌంటర్’ శంకర్ 23 ఏళ్ళ సినీ ప్రస్థానం


ఆయన సామాజిక స్ఫూర్తి కలిగించే సినిమాలు తెరకెక్కించడంలో దిట్ట. తన తొలిసినిమా ఎన్ కౌంటర్ తోనే సంచలనానికి తెరతీసి ఆ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. 1997లో ఎన్‌కౌంటర్ సినిమాతో కెరీర్ మొదలుపెట్టి శ్రీరాములయ్య, జయం మనదేరా, భద్రాచలం లాంటి స్ఫూర్తి కలిగించే సినిమాలు ఎన్నో తీశారు. అనేక అవార్డులు, రివార్డులతో పాటు దర్శకుల సంఘం అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో సమకాలీన పరిణామల, తెలంగాణ ఉద్యమం, విద్యార్థుల ఆత్మహత్యలు, కేంద్ర ప్రభుత్వ వైఖరిను కథగా అల్లుకుని ఆయన తీసిన ‘జై బోలో తెలంగాణా’ సినిమా ‘మినియేచర్ ఆఫ్ ఎ మూమెంట్’గా ప్రశంసలు అందుకుంది. ఈ ఎన్ కౌంటర్ శంకర్ ఇంకా ఏమేం విశేషాలు చెబుతున్నారో చూద్దాం. ఎన్ కౌంటర్, శ్రీరాములయ్య సినిమాలు ఈ ఆగస్టు 14వ తేదీనే విడుదల కావడం మరో విశేషం. వేదిక పేరుతో మరో విశేషానికి తెరతీస్తున్నారాయన.

– ఇన్ని సంవత్సరాల మీ సినిమా ప్రయాణంలో మీరు ఏం నేర్చుకున్నారు?

నేను నా సినిమాలో ఒక డైలాగ్ చెప్పా ‘ఆటుపోట్లులేని సముద్రం ఉండదు… గెలుపు ఓటములు లేని యుద్ధం ఉండదు’ అని. సో ఏ బ్యాగ్రౌండు లేకుండా వచ్చిన నాలాంటివాడికి ఇలాంటివి తప్పదు. కచ్చితంగా నా సినిమా కథల్లోనూ సంఘర్షణ ఉంటుంది, జీవితంలోనూ సంఘర్షణ ఉంటుంది. నా జీవితం, నా అనుభవాలు, నేను నేర్చుకున్న అంశాలన్నీ నా సినిమాల్లో ఉంటాయి. సినిమాలు అనేవి నాకు ఆసక్తి లేని అంశం చిన్నపుడు. సమాజానికి సరిపడే నూతన ఆలోచనా విధానం కావచ్చు, నేనుభవించిన ఆర్థిక, సాంఘిక పరిస్థితులు, నన్ను ప్రభావితం చేసిన వ్యక్తులు కావచ్చు వీళ్లందరి ప్రభావం నా జీవితం మీద ఉంటుంది, నా సినిమాల మీద కూడా ఉంటుంది. అకస్మాత్తుగా ఈ పరిశ్రమకు వచ్చాను. సినిమా యాక్టర్ ప్రభాకర్ రెడ్డిగారిది, మాది పక్కపక్క ఊర్లు. నేను నల్గొండలో శ్రీశీగారి కవిసమ్మేళనంలో ఓ కవిత చదివాను. అది చూసి నువ్వు సినిమాల్లోకి రారా బాబూ అని ఆయన అన్నారు.అలా ఆయన నన్ను సినిమా రంగంలోకి తీసుకెళ్లడం జరిగింది. 1984లో మద్రాసు వెళ్లాను. భారతంలో శంఖారావం అనే సినిమాకి అసిస్టెంటు డైరెక్టర్ గా చేరాను. దానికి బి. భాస్కరరావు దర్శకుడు. అక్కడిని సినిమాని నేర్చుకుంటున్న సమయంలో దాని మీద ఆసక్తి ఏర్పడింది. దీని ద్వారా సమాజానికి ఏమైనా చెప్పొచ్చు అనే అభిప్రాయం కలిగింది. స్టూడెంట్స్ ఆర్గనైజర్ గా ఉన్న నేను సినిమా అనే మాధ్యమం ద్వారా మనం ఏదైనా బలంగా చెప్పొచ్చనే అభిప్రాయం కలిగింది. నా ఆలోచనలను పంచుకోడానికి ఇది ఒక మంచి వేదిక అవుతుందని కూడా భావించాను. దర్శకత్వ శాఖలో 13 ఏళ్లు వివిధ హోదాల్లో పనిచేశాను.

– ఎన్ కౌంటర్ సినిమా విడుదలై శుక్రవారానికి దాదాపు 23 ఇయర్స్ కావస్తోంది. ఈ మీ మొదటి సినిమా అనుభవాలు చెప్పండి?

తెలంగాణలోగాని, ఉత్తరాంధ్రలోగాని, రాయలసీమ కొన్ని ప్రాంతాల్లోని, కొన్ని కల్లోలిత ప్రాంతాల్లోగాని కూంబింగ్ పేరుతో చిన్నపిల్లలను సైతం ఎన్ కౌంటర్ పేరుతో కాల్చి చంపడం నాకు బాధేసింది. నేను సినిమా దర్శకుడు అవ్వాలనుకుంటున్న తరుణంగా ఇలాంటి సంఘటనలు జరిగాయి. నా ఆలోచనలను, నా ఆవేదనను సినిమాల ద్వారా చెప్పటమే నా ఉద్ధేశం కాబట్టి ఎన్ కౌంటర్ పైనే సినిమా చేయాలనుకున్నా. ఆయన సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేశాను కాబట్టి ఆ పరిచయంతోనే ఈ సినిమా తెరకెక్కగలిగింది. అసలు ఈ సినిమాని సెల్వమణి చేయాల్సి ఉన్నా కొంత గ్యాప్ రావడంతో నాకు ఈ అవకాశం వచ్చింది. సినిమా మొదలైనపుడు కూడా సినిమా షూటింగ్ మీద చాలా నిఘా ఉండేది. ఆ రోజుల్లో ఎన్ కౌంటర్ వార్త లేని పేపర్ ఉండేది కాదు. మారుమూల ప్రాంతాల్లో ఒక భయానక వాతావరణం ఉండేది. పైగా నక్సల్స్ ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. సామన్య ప్రజలు తిరగడానికి కూడా భయపడే వాతావరణం ఉన్న తరుణంలో ఈ సినిమాని పూర్తి చేయగలిగాను. ఈ సిననిమా షూటింగ్ జరిగేటప్పుడే నిన్న ఎన్ కౌంటర్ చేసేస్తారని చాలా మంది భయపెట్టారు కూడా. నువ్వ గవర్నమెంటుకు వ్యతిరేకంగా వెళుతున్నావంటూ హెచ్చరించారు.

– కృష్ణగారు ఈ పాత్రకు సరిపోతారని ఎలా అనుకున్నారు?

కచ్చితంగా సరిపోతారని అనుకున్నా. ఎందుకంటే నేను కృష్ణగారి అల్లూరి సీతారామరాజు సినిమాని నా చిన్నపుడు చూశా. ఆ సినిమా నా మీద చాలా ముద్ర వేసింది. అప్పటినుంచి ఆయనంటే అభిమానం కూడా పెరిగింది. మొదట మూడు భాషల్లో ఈ సినిమాని చేయాలనుకున్నారు. తమిళం, మలయాళం, తెలగు భాషల్లో ఈ సినిమా చేయాలని అనుకున్నారు. ఇందులో కృష్ణ గారితో పాటు మమ్ముట్టి, రాధిక, రోజా, ప్రశాంత్ తారాగణం. అయితే మమ్ముట్టి స్థానంలో వినోద్ కుమార్, ప్రశాంత్ స్థానంలో రమేష్ బాబుతో సినిమాని ప్రారంభించాం. తెలుగు సినిమాని మాత్రమే చేయగలిగాం. కృష్ణ గారు కథ విన్న 15 రోజులకే షూటింగ్ ప్రారంభమైంది.మూడు నెలల్లో సినిమాని ఆగస్టు 14న విడుదల చేయడం కూడా జరిగిపోయింది. ఆ తర్వాత చేసిన శ్రీరాములయ్య సినిమా కూడా ఇదే రోజు విడుదల కావడం కాకతాళీయమే. ఆ సినిమా షూటింగ్ ప్రారంభమే కారు బాంబులు పేలడంతో జరిగింది. నవంబరు 16న నా పెళ్లి, 19వ తేదీన సినిమా షూటింగ్… భయమూ బాధ ఉన్నా కూడా సినిమా చేయగలిగాం.

– మీ సినిమాలన్నీ సామాజిక చైతన్యంతో ఉంటాయి ఎందుకు?

నాకంటూ ఒక శైలి కావాలనుకున్నా. సినిమాని కమర్షియల్ గానూ తీయవచ్చు, కళాత్మకంగా తీయవచ్చు. ఆర్ట్ ఫిలిమ్ లను ఎక్కువమంది చూసే అవకాశం లేదు. దర్శకత్వశాఖలో నేను చేసినవన్నీ కమర్షియల్ సినిమాలే. కమర్షియల్ సినమాల రీచింగ్ నాకు తెలుసు. కళాత్మకంగా సినిమా చేస్తే ఎంతమంది చూస్తారు అనే ప్రశ్న ఉండేది. కళ కళ కోసం కాదు ప్రజల కోసం అనే సిద్ధాంతం నాది. ఎక్కువమంది చూస్తేనే కదా ఆ కళకు ప్రయోజనం. నాకంటూ ఒక శైలి కావాలని కమర్షియల్ ఫార్మాట్ లో రియలిస్టిక్ కొలబద్దను మిక్స్ చేసి సినిమాలు చెయ్యాలని నిర్ణయించుకున్నా. నా సినిమాలన్ని అదే ఫార్ములాలో ఉంటాయి. నేను చెప్పలకున్నది ఎక్కువమందికి తెలియాలన్నదే నా ఉద్ధేశం. నా ప్రయాణం అలా కొనసాగింది. డాక్టర్ ప్రభాకరరెడ్డి నన్ను సినిమాకు పరిచయం చేస్తే కృష్ణ గారు నన్ను సినిమా దర్శకుడిని చేయగా నాకు ఒక వేదిక అనేది దొరికింది.

– ఎలాగూ మీకు వేదిక దొరికింది… మంచి విజయాలు అందుకున్నారు? మీ లైఫ్ యాంబిషన్ ఏమిటి?

దానికి కూడా ఒక వేదిక కావాలనేదే నా ప్రయత్నం. 2003లో ఆయుధం సినిమాకి ఐదుగురు కొత్తవారిని పాటల రచయితలుగా ఎంపిక చేశా. వారంతా 25 ఏళ్ల లోపువారే. వారంతా ఇప్పుడు చక్కగా సెటిలయ్యారు. చిన్ని చరణ్, గోరటి వెంకన్న లాంటి వారంతా నేను పరిచయిం చేసినవారే. ప్రతి సినిమా నాకు ఒక పోరాటమే. సినిమా రంగంలో ఎన్నో ఆటుపోట్లు నాకు తెలుసు. ఐదుగురిని నేను పరిచయం చేయడంతో చాలామంది నన్ను కలిసి అవకాశాల కోసం అడిగేవారు. ఆయుధంకు నేను నిర్మాతను. ఇంతమందికి మనం అవకాశం ఇవ్వాలంటే మనల్ని మనం విస్తరించుకోవాలని అర్థమైంది. నేనే వేదిక అవ్వాలనుకున్నా. అందుకే నేను వేదికను ప్రారంభించాలనుకున్నా. దీనికోసమే స్టూడియోకు భూమి ఇవ్వండి అడిగాను. అది మెటీరియలైజ్ కాలేదు. నా రెండు సినిమాలు విడుదలైన రోజున వేదిక అనే ఫ్లాట్ ఫామ్ ని ప్రకటించాలనకున్నా. అదే రేపే అవుతుంది. ఈ వేదిక ద్వారా ఐదు వెబ్ సిరీస్, మరో ఐదు వెబ్ మూవీస్, రెండు చిన్న సినిమాలు నిర్మించబోతున్నా. దర్శకుడిగా నేను ప్రపంచానికి పరిచయమైన రోజున ఈ విషయాలు ప్రకటించబోతున్నా. కథలు సిద్ధమయ్యాయి. అక్టోబరు నుంచి వీటిని ప్రారంభించాలనేది నా ఉద్ధేశం. కరోనా ఉంది కాబట్టి ఎలా ప్లాన్ చేసుకోవాలనే ఆలోచిస్తున్నా. రెండు దఫాలు దర్శకుల సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నా.అసోసియేషన్ తరఫున అనేక సహాయక కార్యక్రమాలు చేస్తున్నా.

– ఈ కరోనా సమయంలో ఎలాంటి సహాయక కార్యక్రమాలు చేస్తున్నారు?

దర్శకుల సంఘం తరఫున అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాను. రెండు దఫాలు నిత్యావసరాలు పంపిణీ చేశాం. ఐదు వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాం. త్వరలో మళ్లీ సహాకకార్యక్రమాలు ఉంటాయి. ఎవరూ తిరగని లాక్ డౌన్ టైమ్ లో మేం తిరిగి చాలాకార్యక్రమాలు చేపట్టాం.
సినిమాకి 23 ఏళ్లు

బయటపడ్డ స్టార్ హీరోయిన్ బాగోతం !


నిన్నటి నుండి ఫిల్మ్ సర్కిల్స్ లో బాగా వినిపిస్తోన్న రూమర్.. ఓ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాలు జారి కింద పడిందనే న్యూసే. అందరి స్టార్ హీరోలంద‌రి స‌ర‌స‌న న‌టించిన పెద్ద హీరోయిన్ అట ఆమె. పైగా ద‌ర్శ‌కులకి నచ్చినట్టు ఉంటుందట. కొంతమంది దర్శకులకు సీక్రెట్ గర్ల్ ఫ్రెండ్ గా కూడా ఆమె సేవలను అందిస్తూ ఉంటుందట. అలాగే నిర్మాత‌ల‌తో వారి ద్వారా కొందరు రాజకీయ నాయకులతో కూడా ఆ పెద్ద స్టార్ హీరోయిన్ కి ఘూఢమైన సాన్నిహిత్యం కూడా ఉందని.. ఎప్పటి నుండో మరో రూమర్ కూడా ఉందిలేండి. ఎనీ వే.. ఈ అమ్మడు ఒక చిన్న మిడిల్ క్లాస్ నుండి వచ్చి.. ఇప్పుడు కోట్లు వెనకేసుకుంది. హైదరాబాద్ సిటీలో అమ్మడుకు నాలుగైదు ఇల్లులు కూడా ఉన్నాయి. అందుకే ఈ బ్యూటీ బ‌య‌ట‌కు వెళ్లాలంటే గుమ్మం ముందుకి ఆడి రావాల్సిందే అని.. ఆ ఆడి వెనుక భ‌ద్ర‌త‌కు సంబంధించిన మ‌రో కారు కూడా ఈమె కోసం ఒక బడా బాబు ప్రత్యేకంగా ఏర్పాటు చేశాడని ఇలా ఈ హీరోయిన్ పై లెక్కకు మించి గుసగుసలు ఉన్నాయి.

Also Read: స్టార్ హీరో ఇంటి కోడలు శృంగార పాఠాలు !

ఇప్పుడు మరో గుసగుస కూడా చేరింది. అమ్మ‌డు చేయ‌కూడ‌ని ఓ త‌ప్పు చేసేసిందట. మనం తప్పు అనుకునేది ఆమె దృష్టిలో తప్పే కాదులేండి. ఇంతకీ విషయం ఏమిటంటే.. లాక్ డౌన్ కి ముందు ఈ స్టార్ భామ హైద‌రాబాద్ లోని ఓ హీరో ప‌బ్ కి స్నేహితుల‌తో క‌లిసి వెళ్లి.. ఫుల్ గా మద్యం సేవించి.. అక్కడ మరో వ్యక్తితో గొడవ పడి నానాయాగీ చేసిందట. చేస్తే చేసింది. కానీ, లెక్కకు మించి పెగ్ లను ల‌బ‌క్క‌న ఎత్తేసిందట. ఆ మత్తులో పక్కనే ఉన్న వ్యక్తితో డాన్స్ చేస్తూ.. మొత్తానికి గొడవ పడింది. పడితే పడింది.. మోతాదుకి మించి ఎందుకు తాగాలి. తాగింది కుదురుగా ఉందా.. అక్కడ కనబడ్డ ప్రతోడితో సేవించిన మత్తులో చిందులేసింది. అతిగా తాగడం వల్లో ఏమో గాని, అక్కడే కాలు జారిందిట‌. ఆ దెబ్బకి పాపకి కాలి వేళ్లు రెండు విరిగాయని, ప్రస్తుతం గాయాలు తగ్గినా.. ఆ రెండు వేళ్ల‌కు డాక్ట‌ర్ వేసిన కుట్లు తాలూకు మచ్చలు మాత్రం అమ్మడిని తెగ ఇబ్బంది పెడుతుందట.

Also Read: ఫోర్బ్స్‌ సంపన్నుల జాబితాలో బాలీవుడ్ నటుడు

ఇంతకీ ఆ హీరోయిన్ ఎవ‌రు అనేది అందరికీ డౌట్. ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ హాట్ హాట్ డ్రెస్సింగ్ సెన్స్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తూ ఉంటుంది. అలాగే అమ్మ‌డిలో మ‌రో స్పెషాలిటీ ఏంటంటే మంచి మాటకారి కూడా. పైగా అందరి స్టార్ హీరోలతో మంచి రిలేషన్ ఉంది. అంతకు మించి రాజకీయ నాయకులతో అనుబంధం ఉంది.

మంత్రిగారి ‘కరోనా’ దోపిడీ.. పిండేస్తున్నాడట!


అధికారం చేతిలో ఉంది.. మంత్రి పదవి వరంగా మారింది. ఇంకేం.. ఆ మంత్రిగారు దందా మొదలుపెట్టేశారట.. కరోనా వేళ ఎలా దోచుకోవాలో ఇప్పుడు సాటి మంత్రులకు ఆదర్శంగా నిలబడుతున్నాడట.. కరోనా టైంలో సర్వం ఆ మంత్రిగారి దోపిడీ చూసి ఇప్పుడు అందరూ ముక్కున వేలేసుకుంటున్నారట.. కాదేది కరోనా టైంలో దోపిడీకి అనర్హం అంటూ చెలరేగిపోతున్న మంత్రిగారి వ్యవహారం ఇప్పుడు బెజవాడలో కోడై కూస్తున్నారు.

Also Read: జగన్ పని అయిపోయినట్లే… బాబు కి ఛాన్స్ ఇచ్చేశాడు మరి!

మందు బిళ్ల నుంచి ఆస్పత్రి బెడ్డు వరకు.. కరోనా టెస్టు నుంచి ఆస్పత్రుల బిల్లు వరకు అంతా ఆ మంత్రిగారే వేస్తున్నారట.. కమీషన్లు, వాటాలు, బెడ్ కోసం వసూళ్లు చేస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నారని విజయవాడలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.

ఇటీవలే సదురు మంత్రిగారి అనుచరుడు ఒకరు ఫార్మా రంగంలో ఉన్నాడట.. దీంతో సదురు అనుచరులంతా నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులు, మందుల డిస్ట్రిబ్యూటర్లను సమావేశపరిచి కరోనా కాలంలో బాగా అమ్ముడు పోతున్న మందుల వివరాలు తెలుసుకున్నాడట.. వాటిని తానే సరఫరా చేస్తానని.. వాటిని విక్రయించాలని హుకూం జారీ చేశారు.మాట వినకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించాడు. రైడ్స్ జరుగుతాయని హెచ్చరికలు పంపారట..

ఇక మల్టీ విటమిన్లు టాబ్లెట్లు.. జింక్ టాబ్లెట్లు, కరోనా మందులను తామే తయారు చేయించి సరఫరా చేస్తామని.. ఈ పీసీడీ మందులనే వాడాలని అన్ని ఫార్మా, మెడికల్, ఆస్పత్రులకు ఆదేశాలిచ్చాడట.. వీటి ద్వారానే ఏకంగా రూ.50కోట్లు ఆర్జిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. వీటిల్లో నాణ్యత లేక పనిచేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

Also Read: చదువులా.. ప్రాణాలా? ఇప్పుడు ఏది ముఖ్యం?

కరోనా వేళ ఏపీలో రోజుకు 10వేల కేసులు నమోదవుతున్నాయి. బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో ఆస్పత్రుల్లో బెడ్స్ దొరకడం లేదు. కానీ మంత్రి అనుచరుడి వద్దకు వెళితే క్షణంలో బెడ్ దొరుకుతోందట.. అలా బెడ్ ఇప్పించినందుకు ఏకంగా రూ.50వేలు వసూలు చేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక మంత్రిగారి కోటా కింద కొన్ని బెడ్ లు పక్కన పెట్టాలని ఆస్పత్రులకు హుకూం జారీ చేసినట్లు ప్రచారం సాగుతోంది.

ఇక కరోనా పరీక్షలకు భారీక్యూ ఉంటోంది. కానీ ఇందులోనూ కాసుల కక్కుర్తితో డబ్బులు పిండుకుంటున్నాడని.. ఒక్కో టోకెన్ ను రూ.200 వరకు వసూలు చేస్తున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మెడికల్ టెండర్లలోనూ మంత్రి బినామీలదే రాజ్యమన్న ప్రచారం సాగుతోంది. మంత్రి బినామీ కంపెనీకే మెడికల్ సర్వీస్ టెండర్ దక్కిందట.దీంతో బెజవాడ చుట్టుపక్కల ఇప్పుడు మొత్తం కరోనా ట్రీట్ మెంట్ మందులు, బెడ్స్ అన్నీ ఆ మంత్రి కనుసన్నల్లోనే జరుగుతోందట.. ఈ టైంలో మంత్రిగారి వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్థిల్లుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇలాంటి నిర్లక్ష్యాల వల్లనే ఏపీ లో ఈ ప్రమాదాలు…! జగన్ తీరు మారదా?

Andhra government issues orders to hold special drive for safety ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారానికొక ప్రమాదం సంభవిస్తోంది. అది పరిశ్రమ కావచ్చు.. భవనం కావచ్చు లేదా లోతట్టు ప్రాంతాల్లో ముంపు కావచ్చు. ఏదైనా అధికారుల నిర్లక్ష్యం వల్లనో…. ప్రభుత్వం చాలా సులువుగా ఎక్స్ గ్రేషియా రూపంలో పరిహారాలు ఇచ్చి చేతులు దులుపుకోవడం వల్లనో ఇవి రిపీట్ అవుతూనే ఉన్నాయి. అయితే గత రెండు, మూడు నెలలుగా విశాఖ ప్రాంతంలోని పలు పరిశ్రమల్లో ప్రమాదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.పదుల సంఖ్యలో ప్రజలు అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇలాంటి సమయంలో రాష్ట్రంలోని పరిశ్రమలలో ఉన్న మౌలిక సదుపాయాల వివరాలు సేకరణ కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

దీని కింద ఏపీ లోని ప్రతి పరిశ్రమకు ఒక ప్రత్యేక సంఖ్య ఇవ్వాలని నిర్ణయించారు. ఆధార్ తరహాలో ఇవ్వనున్న ఈ ప్రత్యేక సంఖ్యను ‘పరిశ్రమ ఆధార్’ పేరుతో వ్యవహరించనున్నారు. దీనికోసం రాష్ట్రంలోని పరిశ్రమపై సర్వే నిర్వహించనున్నారు. ఇందుకు మొబైల్ యాప్, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో పరిశ్రమల్లోని వివరాలను సేకరించనుంది. ఏపీ సమగ్ర పరిశ్రమ సర్వే 2020 పేరుతో ప్రభుత్వం ఈ వివరాలు సేకరించనుంది.

ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. ఈ మధ్య పరిశ్రమలో జరుగుతున్న ప్రమాదాల దృష్ట్యా ఇందులో ఆయా పరిశ్రమలు పాటించాల్సిన లేదా నిబంధన లప్రకారం అమలు లో ఉండాల్సిన సేఫ్టీ ప్రక్రియలు క్రమంగా జరుగుతున్నాయా లేదా పాటిస్తున్నారా అన్న విషయాన్ని మాత్రం ప్రభుత్వం పట్టించుకుంటుందా…? అన్నది ఇక్కడ పలువురు ప్రశ్న.

ఈ విషయానికి వస్తే అక్టోబర్ 15 లోపు ఒక ఈ సర్వేను పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోండగా.. ఇందులో పరిశ్రమల్లో భూమి, కార్మికులు, విద్యుత్, నీరు సహా తొమ్మిది వివరాలు అంశాలను పరిశ్రమల శాఖ సేకరించనుండి. వీటిలో వనరులు, ఎగుమతులు, దిగుమతులు, ముడిసరుకు లభ్యత, మార్కెటింగ్ తో సహా మరికొన్ని అంశాలు ఉన్నాయి గాని ఒక ఉన్నత స్థాయి సర్వేను పనిలోపనిగా నిర్వహించి సేఫ్టీ పాటించని పరిశ్రమలపై చర్యలు తీసుకునేలా మాత్రం ముఖ్యమంత్రి వ్యవహరించకపోవడం గమనార్హం.

ఇప్పటికే చాలా సార్లుగా ప్రభుత్వం ఈ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అన్నట్లు వ్యవహరిస్తూ…. ఇప్పుడు కేవలం పరిశ్రమలో జరిగే కార్యకలాపాలు, వారి ఆదాయ వివరాలను సేకరిస్తున్నాయే కానీ వారు ప్రజలకు ఎటువంటి ముప్పు లేదు అని మాత్రం భరోసాను ఇవ్వలేకపోతున్నారు. కనీసం చర్యలు తీసుకోవటం మానేసి.. ఎన్నో మరణాలకు కారకులైన వారు బెయిల్ పై వచ్చి రోడ్ల మీద తిరుగుతుంటే.. కోట్లకు కోట్లు ప్రజాధనాన్ని బాధితులకు ఎక్స్ గ్రేషియా రూపంలో పంచిపెడుతూ చోద్యం చూస్తున్నారు అని విమర్శకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మరి ఇలాంటి వారికి జగన్ నుంచి సమాధానం ఉంటుంది?

ఈశ్వరయ్య వ్యవహారంతో ప్రభుత్వానికి చిక్కులు తప్పవా?


హై కోర్టు న్యాయమూర్తులను అప్రదిష్టపాలు చేసేందుకు కొందరు కుట్రలు చేశారని భావించిన హై కోర్టు ధర్మాసనం ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని నిర్ణయించింది. ఆయనకు సీబీఐ, కేంద్ర విజిలెన్స్ అధికారులు తగిన సహకారం అందించాలని ఆదేశించింది. ఈ కుట్ర వ్యవహారంపై హై కోర్టు చాలా సీరియస్ గా ఉంది. కొద్ది రోజుల కిందట హై కోర్టులో పని చేసే ఉద్యోగులకు కరోనా సోకింది. ఈ కారణంగానే కోర్టు రిజిస్ట్రార్ రాజశేఖర్ మరణించడం జరిగింది. ఆ సమయంలో హై కోర్టులో ఒక పిటీషన్ దాఖలయ్యింది.

Also Read: చదువులా.. ప్రాణాలా? ఇప్పుడు ఏది ముఖ్యం?

ఈ పిటీషన్ లో హై కోర్టును రెడ్ జోన్ గా ప్రకటించాలని, రిజిస్ట్రార్ రాజశేఖర్ మృతిపై విచారణ జరిపించాలని, మరికొన్ని అంశాలను పిటీషనర్ ప్రస్తావించారు. ఈ పిటీషన్ హై కోర్టు పేర్కొన్న అంశాలు సరైనవి కాదని హై కోర్టు పిటీషన్ కోట్టేసింది. ఈ క్రమంలో హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి పై రాష్ట్రపతికి, సుప్రీంకోర్టుకు కొన్ని ఫిర్యాదులు అందాయి. అప్పట్లో ఈ ఫిర్యాదుల విషయాన్ని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. చిత్తూరు జిల్లా సస్పెన్షన్ లో ఉన్న జడ్డి రామకృష్ణ పిటీషన్ పై విచారణ సందర్భంగా అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి.

జడ్జి రామకృష్ణకు హై కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య ఫోన్ చేసినట్లు ఆడియో వివరాలు బయటకు రావడం ఆ సంబాషణల్లో మరి కొందరు న్యాయమూర్తుల విషయంలో ఈశ్వరయ్య మాట్లాడిన మాటలు అందరిని విస్తుపోయేలా చేశాయి. ఆ ఫోన్ సంబాషణతో ఉన్నది తనేనన్న విషయాన్ని ఈశ్వరయ్య స్వయంగా దృవీకరించారు. అది వ్యక్తిగత సంబాషణగా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి పై ఫిర్యాదు చేసిన బీసీ సంఘానికి వ్యవస్థాపకుడుగా ఈశ్వరయ్య ఉండటంతో ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

Also Read: జగన్ పని అయిపోయినట్లే… బాబు కి ఛాన్స్ ఇచ్చేశాడు మరి!

జడ్డి రామకృష్ణ పిటీషన్ ను విచారిస్తున్న హై కోర్టుకు ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని రామకృష్ణ తరుపు న్యాయవాది కోరారు. ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో అభ్యంతరం వ్యక్తం చేయడం విశేషం. ఇది రామకృష్ణ కేసుకు సంబంధం లేని అంశమని ఈ వ్యవహారంపై ఎలాంటి విచారణ అవసరం లేదని ప్రభుత్వం తరుపు న్యాయవాది వాదించారు. హై కోర్టు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో విచారణకే మొగ్గు చూపింది. దీంతో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రవీంద్రన్ ను విచారణ అధికారిగా నియమిస్తూ ఆదేశాలు ఇచ్చింది. నాలుగు వారాల్లో ఇందుకు సంబంధించి నివేదిక అందజేయాలని ఆదేశించింది.

జస్టిస్ ఈశ్వరయ్య ఆంధ్రపదేశ్ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిటీ ఛైర్మన్ గా వ్యవహరిస్తుండటంతో ఈ వ్యవహారం వెనుక రాజకీయ కోణం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 62 కేసుల్లో వ్యతిరేక తీర్పులు వచ్చిన విషయం విధితమే. దీంతో ఈ కుట్ర వెనుక అధికార పక్షం హస్తం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఆ కుర్చీలో కూర్చొని ఏకంగా 200 మంది మృతి.. మిస్టరీ ఏంటంటే?

chair of death

ఈ భూ ప్రపంచంలో మనకు అర్థం కాని మిస్టరీలు ఎన్నో ఉంటాయి. కొన్ని విషయాల గురించి వింటే ఇలా కూడా జరుగుతుందా…? అని పలు సందర్భాల్లో ఆశ్చర్యపోతూ ఉంటాం. అదే విధంగా ఇంగ్లండ్ లోని ఒక కుర్చీ వెనుక సైతం ఆసక్తికరమైన కథ ఉంది. ఆ కథ గురించి తెలిస్తే ఆసక్తితో పాటు భయం కూడా కలుగుతుంది. ఇంగ్లండ్ లోని ఒక కుర్చీలో ఎవరైతే కూర్చుంటారో వారు కూర్చున్న కొన్ని రోజులకే వేర్వేరు కారణాల వల్ల మృతి చెందారు.

Also read: ఆ వయసు ఉన్నవారికి మాత్రమే కోవిడ్ వ్యాక్సిన్!

వినడానికి నమ్మశక్యంగా అనిపించకపోయినా వరుస మరణాలు ఈ కుర్చీ సాధారణ కుర్చీ కాదని డెత్ కుర్చీ అని ప్రజలు నమ్మేలా చేస్తున్నాయి. వివిధ కాలాల్లో 200 మంది ఈ కుర్చీపై కూర్చోగా వాళ్లంతా మరణించడం గమనార్హం. దాదాపు 400 సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్ లోని త్రిస్క్ అనే ప్రాంతంలో చిల్లర దొంగగా జీవనం సాగిస్తున్న డానియల్ ఔటి అనే వ్యక్తి కూతురు ఎలిజబెత్ కు థామస్ బస్సే అనే వ్యక్తితో వివాహం జరిగింది.

Read also: షాకింగ్: పొగ తాగేవారికి 28 రకాల జబ్బులు!

వివాహం అనంతరం ఎలిజబెత్, థామస్ మధ్య తరచూ ఒక కుర్చీ కోసం గొడవలు జరుగుతుండేవి. గొడవలు పెద్దవి కావడంతో డానియల్ తన కూతురుకు పుట్టింటికి తీసుకెళ్లాలని వచ్చి గొడవకు కారణమైన కుర్చీలో కూర్చున్నాడు. కుర్చీ వల్ల మామ డానియల్ కు అల్లుడు థామస్ కు జరిగిన గొడవలో థామస్ డానియల్ ను చంపేశాడు.

Read also: ‘చికెన్’లో కరోనా.. బయటపడ్డ షాకింగ్ నిజం.. ఎక్కడంటే?

అనంతరం కోర్టు ఉరిశిక్ష విధించగా థామస్ చివరి కోరికగా ఆ కుర్చీపై కూర్చుని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఆ తరువాత ఒక హోటల్ ఆ కుర్చీని తీసుకుంది. అప్పటినుంచి ఆ కుర్చీపై కూర్చున్న 200 మంది వివిధ కారణాల వల్ల మృతి చెందడంతో ఆ కుర్చీకి డెత్ చైర్ గా పేరు వచ్చింది. హోటల్ సిబ్బంది భయపడి ఒక మ్యూజియంకు ఆ చైర్ ను అందించగా మ్యూజియం సిబ్బంది సైతం భయపడి కుర్చీని గోడకు వేలాడదీసినట్టు అధికారులు చెబుతున్నారు.

కమలా హారిస్ ఎంపిక ‘గేమ్ చేంజరా’ లేక ‘సేఫ్ గేమా’?

kamala harris

kamala harris

కమలా హారిస్ ని జోడీగా బైడెన్ ఎన్నిక చేసుకోవటం అమెరికాలోని భారతీయ అమెరికన్ల తో పాటు , మనకు కూడా ఎంతో వుత్తేజాన్నిచ్చింది. దానికి కారణం లేకపోలేదు. అమెరికా ప్రపంచం లోనే శక్తివంతమైన ధనిక దేశం. అటువంటి దేశానికి ఇంతత్వరలో భారతీయ మూలాలున్న వ్యక్తి ఉపాధ్యక్ష స్థాయి పదవికి పోటీ పడతారని ఎవరూ ఊహించలేదు. ఇంతవరకు 100 మంది సభ్యులుగా వుండే సెనేట్ లో కూడా మొట్టమొదటగా భారతీయ మూలాలున్న వ్యక్తి గా కమలా హారిస్ ప్రవేశించి రికార్డు సృష్టించింది మూడు సంవత్సరాల క్రితమే. ఇంతలోనే దేశంలోనే రెండో వున్నత పదవికి పోటీపడే అవకాశం వస్తుందని ఊహించని విషయమే. ఈ సంవత్సరపు అధ్యక్ష డెమోక్రటిక్ అభ్యర్ధుల పోటీలో కమలా హారిస్ పోటీ చేసినా మధ్యలోనే విరమించుకోవాల్సి వచ్చింది.

Also Read: వైరల్: పిల్లి నాకడంతో మహిళ మృతి.. ఎక్కడంటే?

దానితో తను నాలుగు సంవత్సరాల తర్వాత జరిగే ప్రైమరీల వరకు నిరీక్షించవలసిందేనని, ఆ తర్వాత కూడా ఏమి జరుగుతుందో తెలియని భవిష్యత్తు గా తన పరిస్థితి వుంది. ఆ అనిశ్చిత స్థితి నుంచి ఒక్కసారి ఉపాధ్యక్ష పదవి అభ్యర్ధిగా పోటీ చేయటం , గెలిస్తే ( గెలిచే అవకాశాలు ఎక్కువగా వున్నాయి) వచ్చే ఎన్నికలకి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధిగా అధ్యక్షపదవికి పోటీ చేసే అవకాశాలు మెండుగా వుండటం తో భారతీయులకు, మీడియా కు సహజంగానే ఉద్వేగభరిత సంఘటనే. ఎన్ టి ఆర్  ఏదో ఒక సందర్భం లో తెలుగువాడు అమెరికా అధ్యక్షుడు గా ఎన్నిక కావాలని అన్నట్లు గుర్తు. తెలుగువాడు కాకపోయినా ఒక భారతీయ మూలాలున్న వ్యక్తి, అదీ ఒక మహిళ భవిష్యత్తులో అధ్యక్షురాలయ్యే అవకాశాలు ఊహించుకున్నామా? ఇది నిజంగా ఉద్వేగభరిత క్షణాలే ప్రతి భారతీయుడికి.

కమలా హారిస్ భారతీయ మూలాలు, వ్యక్తిత్వం 

కమలా హారిస్ పుట్టింది శాన్ ఫ్రాన్సిస్కో కి జంటనగరంగా వున్నఓక్ ల్యాండ్ లో. ఓక్ ల్యాండ్ లో నల్ల జాతీయులు ఎక్కువగా వుంటారు. తన తండ్రి జమైకా కి చెందిన నల్ల జాతీయుడైనా తను పుట్టిన 7 సంవత్సరాలకే తల్లి శ్యామల తో విడాకులు తీసుకోవటంతో తను, తన సోదరి మాయ తల్లి పెంపకం లోనే పెరిగారు. చిన్నప్పుడు రెండు సంవత్సరాల కొకసారి తాత, అమ్మమ్మ లతో గడపటానికి అందరూ కలిసి చెన్నై వచ్చేవారు. కేంద్రప్రభుత్వ అధికారి అయిన తాత గోపాలన్ తో కమలా అనుబంధం ఎక్కువని తనే ఇంతకుముందు చెప్పుకుంది. తన మేనమామ బాలచంద్రన్ ( తల్లి సోదరుడు) డిల్లీలో కేంద్ర రక్షణ శాఖ లో ఉద్యోగి. చెన్నై లో కమలా తాత తరఫు కుటుంబ సభ్యులు వుండనేవున్నారు. ఏ విధంగా చూసినా భారత్ తో కుటుంబ అనుబంధం ఇప్పటికీ కొనసాగుతూనే వుంది. భారతీయ వంటకాలు, సంస్కృతి తో కూడా అమ్మ ద్వారా బాగానే పరిచయం వుంది.

కానీ అమెరికా మీడియా లో ఎక్కువగా తను నల్ల జాతీయురాలిగానే గుర్తింపు పొందింది. దానికి కారణం అందరికీ తెలిసిందే. అమెరికా ఓటర్లలో అలా అయితేనే ఎన్నికల్లో ఉపయోగముంది. భారతీయ అమెరికన్లు అమెరికా ఎన్నికల్లో ప్రభావితం చేసేటంతగా లేరు. కమలా హారిస్ శాన్ ఫ్రాన్సిస్కో జిల్లా అటార్నీ గా, కాలిఫోర్నియా అటార్నీ జనరల్ గా పనిచేసింది. నిర్ణయాలు తీసుకోవటం లో గట్టిగానే ఉంటుందని పేరొచ్చింది. దానిపైనే పార్టీ లో కొంతమంది ‘వామపక్ష ఉదారవాదులు’ ఆమెను ఎన్నుకోవటం పై పెదవి విరచారని తెలుస్తుంది. అది ఒకవిధంగా జనరల్ ఓటర్లలో ప్లస్ పాయింట్ గానే చూడాల్సి వుంది. గత మూడు సంవత్సరాల్లో సెనేటర్ గా తన రికార్డ్ బాగా వుంది. జార్జి ఫ్లాయిడ్ ఉదంతం లో గట్టిగా నిరసనలు తెలపటం, నేర న్యాయ చట్టాల్లో సమూల మార్పులు రావాలని కోరటం డెమోక్రాట్ల లో తన ఇమేజ్ పెరిగిందని చెప్పొచ్చు. ఇంతవరకూ అమెరికా లో ఒక మహిళ అధ్యక్షురాలు కాలేకపోవటం శోచనీయం. కమలా హారిస్ ఎన్నికయితే వచ్చే ఎన్నికల్లో తన అభ్యర్ధిత్వం దాదాపు ఖాయంగానే కనిపిస్తుంది. ఎందుకంటే అప్పటికి బైడెన్ కి 82 సంవత్సరాలు దాటుతాయి. తిరిగి పోటీ చేసే అవకాశాలు దాదాపుగా లేనట్లే. కమలా హారిస్ కనక 2024 ఎన్నికల్లో అధ్యక్షురాలిగా ఎన్నికయితే ఎన్నో రికార్డులు స్వంతం చేసుకుంటుంది. మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా, మొట్టమొదటి ఆఫ్రికన్ అమెరికన్ ( నల్ల జాతీయురాలు)గా, మొట్టమొదటి భారతీయ అమెరికన్ గా, మొట్టమొదటి ఆసియన్ అమెరికన్ గా చరిత్ర సృష్టిస్తుంది. మామూలుగా అయితే ఉపాధ్యక్షుడి పదవి పై అంత ఉత్కంట వుండదు. ఇన్ని విధాలుగా ప్రభావం చేస్తుంది కాబట్టే ఈ సారి కమలా హారిస్ జోడీ పై ఇంత ఆసక్తి నెలకొంది.

భారత-అమెరికా సంబంధాల్లో మార్పులు ఎలా వుంటాయి?

ఇక గెలుపు అవకాశాలు చూస్తే ఈసారి బైడేన్-కమలా జోడీ గెలిచే అవకాశాలే మెండుగా వున్నాయి. కమలా హారిస్ ఎంపిక  ‘గేమ్ చేంజర్’ గా చెప్పలేము కానీ  ఒకవిధంగా ‘సేఫ్ గేమ్’ గా చెప్పొచ్చు. ఈసారి ఎన్నిక బైడేన్ మీద అనుకూలత కన్నా కరోనా మహమ్మారి ని ఎదుర్కోవటం లో ట్రంప్ పై వచ్చిన వ్యతిరేకత ప్రధానాంశంగా ముందుకొచ్చింది. కరోనా మహమ్మారి రాకుండా ఉన్నట్లయితే ట్రంప్ కే గెలుపు అవకాశాలు ఉండేవి. ఈ మహమ్మారి తో మొత్తం రాజకీయ వాతావరణం మారింది. ట్రంప్ మీద కోపం పెరిగింది. ఇదే చివరకు తన కొంప ముంచబోతుందని అనిపిస్తుంది.

Also Read: శరీరానికి నిప్పు అంటించుకొని ప్రపోజ్ చేశాడు.. చివరికి?

ఈ గెలుపుతో భారత- అమెరికా సంబంధాలు ఎలా వుండబోతున్నాయనేది ప్రతి భారతీయుడి మనస్సులో తొలుస్తున్న ప్రశ్న. నా దృష్టిలో గుణాత్మక మార్పు ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రస్తుత ప్రపంచ పరిణామాలు చూస్తే అటు అమెరికాకి ఇటు భారత్ కి సన్నిహిత సంబంధాలు పెట్టుకోవాల్సిన అగత్యం వుంది. రెండు దేశాలకి చైనా వుమ్మడి శత్రువుగా తయారయ్యింది. ఒకనాడు సోవియట్ యూనియన్ కి వ్యతిరేకంగా అమెరికా, చైనా దగ్గరయినట్లు ఇప్పుడు చైనా కి వ్యతిరేకంగా అమెరికా, భారత్ దగ్గరవుతాయి. ఏ పార్టీ గెలిచినా ఈ పరిస్థితుల్లో మార్పు వుండదు. ముఖ్యంగా భద్రత, వ్యాపారం , పరస్పర సంబంధాల్లో పార్టీలతో సంబంధం లేకుండా బంధం మరింత పటిష్టమవుతుంది. వలస విధానల్లోనే కొన్ని మార్పులు జరగొచ్చు. ముఖ్యంగా హెచ్ 1బి వీసాల విషయం లో కొంత సడలింపులు జరుగుతాయి. శాశ్వత నివాసం ( గ్రీన్ కార్డు) విషయం లో చెప్పలేము. ఇది అధ్యక్షుడి కన్నా అమెరికా కాంగ్రెస్ విధానం పైనే ఎక్కువ ఆధారపడివుంది. ఈసారి ప్రతినిధుల సభ, సెనేట్ రెండూ డెమోక్రాట్లు మెజారిటీ తెచ్చుకుంటే ఏమైనా మార్పులు జరగవచ్చునేమో. అదికూడా చెప్పలేము. వలస విధానం లో పార్టీలతో ప్రమేయం లేకుండా ప్రతినిధులు , సెనేటర్లు నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి ఈ ఎన్నికతో పరిస్తితు ల్లో మార్పు వస్తుందని ఖచ్చితంగా చెప్పలేము.

కమలా హారిస్ విధానాలు ఎలా వుండబోతున్నాయి?

మరి కమలా హారిస్ ఉపాధ్యక్ష ఎన్నిక తో ఏమైనా మార్పులు జరిగే అవకాశముందా అంటే లేదనే చెప్పాలి. అసలు ఉపాధ్యక్షురాలు విధానపర నిర్ణయాలు తీసుకోలేదు. అది అధ్యక్షుడి మీదే ఆధారపడి వుంటుంది. బైడేన్ స్వతహాగా విదేశీ వ్యవహారాల నిపుణుడు. భారత్ కి అనుకూలుడుగానే పేరుంది. దానికి భారతీయ మూలాలున్న కమలా హారిస్ చేరిక కొంత వుపయోగపడొచ్చు. కానీ స్థూలంగా చూస్తే డెమోక్రాట్ల కన్నా రిపబ్లికన్ల హయాం లోనే భారత-అమెరికా సంబంధాలు మెరుగ్గా వున్నాయి. కమలా హారిస్ వరకూ మానవహక్కుల సమస్యను తీవ్రంగానే తీసుకుంటుంది.  చైనా లో వీఘర్ ముస్లిం లపై జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల పై తీవ్రంగా ప్రతిస్పందించింది. అదే సమయం లో కాశ్మీర్ లో మానవ హక్కుల పై కూడా ప్రతిస్పందించింది. చైనా ప్రభుత్వం పై స్పందించిన పద్దతి లో మాట్లాడకపోవటం గమనార్హం. గత యేడాది ఇంకో భారతీయ మూలాలున్న ప్రతినిధి ప్రమీల జయపాల్ – విదేశాంగ మంత్రి జయశంకర్ వివాదం లో ప్రమీల వైపు గట్టిగా నిలబడింది. స్థూలంగా చూస్తే భారత్ తో సంబంధాలు మెరుగు పరుచుకోవాలని కోరుకుంటుంది. అదేసమయం లో తనే వలసవాద తల్లిదండ్రులకు జన్మించింది కాబట్టి వలసవాద సమస్యలపై వారికి గట్టి మద్దత్తుదారుగా నిలబడింది. కమలా హారిస్ మిగతా అధ్యక్ష అభ్యర్ధుల లాగా రాడికల్ అభిప్రాయాలు లేవు. మధ్యే వాదిగానే చూడాల్సివుంది. మొత్తం మీద చూస్తే కమలా హారిస్ ఎన్నికయితే భారత్ కు శ్రేయోభిలాషిగా వైట్ హౌస్ లో ఉండటమే కాకుండా 2024 ఎన్నికల్లో మొట్టమొదటి భారతీయ సంతతిరాలు అధ్యక్షపీఠం పై కూర్చునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనేది భారతీయులందరికీ ఆనందం కల్గించే వార్త. వాస్తవానికి భారత్ పై అమెరికా స్థానిక ప్రజల్లో అవగాహన పెద్దగా లేదు. ఇటీవలి కాలం లోనే కొంత మెరుగయ్యింది. ఇప్పుడు కమలా హారిస్ భారతీయ మూలాలు ఉన్నాయనే సరికి భారత్ ని గురించి గూగుల్ లో వెదకటం ఎక్కువయ్యిందట. దీనితో భారత్ అమెరికా ప్రజలకి మరింత చేరువగా వచ్చింది. కమలా హారిస్ ఎంపిక  ఆ విధంగా  భారత్ ప్రతిష్ట పెంపుదలకు దోహదం చేసింది.