Home Blog Page 8369

Himaja Beauty Clicks

Mega family at Niharika-Chaitanya Engagement

హైకోర్టు సాక్షిగా అమరావతి రైతులకి జగన్ బంపర్ ఆఫర్…?

Amaravati: Protests Continue Against Multiple Capital Proposal By ...

చంద్రబాబు స్థాపించిన ఏపీ రాజధాని అమరావతి కి బదులుగా జగన్ మూడు రాజధానుల ప్రపోజల్ పెట్టి దానిని ఎంతమంది వద్దంటున్నా…. పట్టుబట్టి మరీ.. ఏకంగా గవర్నర్ నుండి ఆమోదం తెచ్చుకున్న తరువాత కూడా రాజధాని ప్రాంత రైతులకు అన్యాయం జరుగుతోందని ప్రస్తుత రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది గగ్గోలు పెడుతున్న విషయం తెలిసిందే. ప్రతిపక్షంలో ఉండగా ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని తాను అనుకోవడం లేదని అమరావతిని రాజధానిగా తన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ప్రకటించిన జగన్…. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ప్లేటు ఫిరాయించి…. ప్రతిపక్షం నుంది అత్యంత తీవ్రమైన విమర్శలు ఎదురుకుంటున్నాడు. 

అంతేకాకుండా కోర్టువారు కూడా జగన్ కు వ్యతిరేకంగా వరుసబెట్టి తీర్పులు ఇవ్వడం మొదలు పెట్టేశారు. దీంతో జగన్…. తన దగ్గర ఉన్న ప్లాన్ బి ను బయట బయటపెట్టవలసి వచ్చింది. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే…. మూడు రాజధానుల నిర్ణయం పై స్టే విధించిన హైకోర్టు విచారణ సందర్భంగా రైతులతో గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల సంగతి ఏమిటని…. జగన్ సర్కార్ ను కచ్చితంగా అడుగుతుందని…. అప్పుడు ప్రభుత్వం ఇరుకున పడకుండా జగన్ ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారని సమాచారం. అమరావతిని ‘మెట్రోపాలిటన్ సిటీ’ గా అభివృద్ధి చేయనున్నట్లు ఇంతకుముందు ప్రకటించిన జగన్… ఈ విషయమై తాజాగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 

అమరావతిలో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న భవనాలు…. ఇంకా ఇతర నిర్మాణాలను పూర్తి చేయడానికి ఎంత ఖర్చవుతుందో…. వాటిని ఏవిధంగా మెట్రోపాలిటన్ సిటీ కి ఉపయోగించుకోవాలో…. అలాగే రైతుల ఫ్లాట్లను ఎలా అభివృద్ధి చేయాలనే విషయంపై అధికారులతో జగన్ చర్చించినట్లు తెలుస్తోంది. రాజధానికి ఏ మాత్రం తీసిపోకుండా మెట్రోపాలిటన్ సిటీని తాము తయారు చేస్తామని హైకోర్టు ముందు జగన్ రైతులకు హామీ ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి హైకోర్టు వారు అందుకు జరగాల్సిన ప్రక్రియ పూర్తి అయ్యే వరకైనా రాజధాని తరలించే అవకాశం లేదని జగన్ కు షాక్ ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. మరి జగన్ వేసుకున్న ప్లాన్ – బి హైకోర్టుకి నప్పుతుందా లేదా అన్నది ఇక్కడ చర్చనీయాంశం.

కరోనాను జయించినా.. వివక్ష కొనసాగుతుందా?


మనం పోరాడాల్సింది కరోనా(కోవిడ్-19)తోగానీ.. రోగితో కాదు.. ఈ విషయంపై వైద్యులు, సామాజిక సంస్థలు, ప్రభుత్వాలు ఎంత మొత్తుకుంటున్నా.. ఎవరీలో మార్పురాకపోవడం శోచనీయంగా మారుతోంది. ప్రజలు కరోనా రోగులను దూరం పెడుతున్నారంటే ఓ అర్థం ఉందిగానీ.. కరోనాను జయించిన వారిపట్ల సమాజంలో వివక్ష కొనసాగుతుండటం అందరినీ ఆలోచింపజేస్తోంది. అసలు ప్రభుత్వాలు కరోనాపై సరైన రీతిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కరోనాను జయించామని సంతోషపడేలోపే చుట్టూ ఉండే ప్రజలు చూపే వివక్షతతో వారంతా మానసిక ఒత్తిడులకు గురవుతుండటం చర్చనీయాంశంగా మారింది.

Also Read: ఎంపీ Vs ఎమ్మెల్యే! మరోసారి వివాదం షురూ..!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహ్మమరి పంజా విసురుతోంది. కరోనా మరణాలు పెరిగిపోతుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కంటికి కన్పించకుండా కరోనా దాడిచేస్తుండటంతో ప్రజలు వీలైనంత వరకు ఇంటికే పరిమితం అవుతున్నారు. ప్రభుత్వాలు కూడా కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. భౌతిక దూరం పాటించడం.. మాస్కులు ధరించడం.. శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు కరోనాపై ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చెబుతున్నా ప్రజల్లో మాత్రం కరోనాపై అపోహలు మాత్రం వీడడం లేదని తెలుస్తోంది.

కరోనా బారిన పడిన వారికి ప్రభుత్వం కోవిడ్ ఆస్పత్రుల్లో ఉంచి చికిత్స అందిస్తోంది. సల్ప లక్షణాలు ఉన్నవారికి మాత్రం హోం ఐసోలేషన్లో ఉంచి చికిత్స చేస్తున్నారు. వీరంతా కూడా కొద్దిరోజులు వైరస్ తో పోరాడి కోలుకుంటున్నారు. అయితే ఇలాంటి వారి పట్ల కూడా ప్రజలు వివక్ష చూపుతుండటం గమనార్హం. కరోనాను జయించి ఇంటికొచ్చిన వారిపట్ల చుట్టుపక్కల వాళ్లు.. సన్నిహితులు, బంధువులు తమతో ఇంతక ముందుగా వ్యవహరించడం లేదని పలువురు ఆవేదన చెందుతున్నారు. తమను శత్రువులా చూస్తుండటం ఎంతో బాధకు గురిచేస్తుందని పలువురు కరోనా పేషంట్లు కన్నీటి పర్యంతం అవుతున్నారు.

Also Read: మంత్రిగారి ‘కరోనా’ దోపిడీ.. పిండేస్తున్నాడట!

నిన్నటి వరకు కలిసి తిరిగిన వారంతా తమను చూస్తేనే భయపడిపోతుండటం ఆవేదన కలిగిస్తుందంటున్నారు. మరికొందరు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోతున్నారు. కరోనా భయం కంటే ఇతరుల చూపించే వివక్షే తమను మానసిక ఆందోళన కలిగిస్తుందని చెబుతున్నారు. ప్రజలకు ఈ వ్యాధిపట్ల సరైన అవగాహన లేకపోవడం వల్లే కరోనాను జయించినా వారిపట్ల కూడా పలువురు వివక్ష చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వాలు ప్రజలు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడంలో విఫలమయ్యాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.

వైద్యులు ఎంతో శ్రమించి కరోనా సోకిన వారిని బ్రతికిస్తుంటే.. చుట్టురా ఉండేవాళ్లు వారిపట్ల వివక్ష చూపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి సంఘటనలు జరుగకుండా తొలినాళ్లలోనే వీటికి చెక్ పెట్టేలా చర్యలు చేపట్టాలని వైద్యులు కోరుతున్నారు. లేకపోతే రానున్న రోజుల్లో ఈ సమస్య మరింత జఠిలంగా మారుతుందని అంటున్నారు.. దీనివల్ల మరిన్ని ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కరోనా వ్యాధిపై ప్రజలకు ఉన్న భయాందోళనలు దూరం చేసేలా మరింత అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు.

ఎస్పీ బాలసుబ్రణ్యం ఆరోగ్యం పై అధికార రిపోర్టు ఇదిగోండి…! విషయం ఏమిటంటే….

S P Balasubrahmanyam receives Virasat award | Entertainment News ...

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్న వార్త బయటకు వచ్చింది. ఈ నెల 5వ తేదీన కరోనా బారిన పడిన ఎస్పీ బాలు గారు తన ఆరోగ్య పరిస్థితి గురించి ఒక ఆడియో మెసేజ్ ద్వారా వివరించారు. తనకు కరోనా పాజిటివ్ రావడం తో చికిత్స తీసుకుంటున్నాను అని…. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. అయితే అప్పటి వరకు సాధారణ వార్డులో చికిత్స పొందుతున్న బాలుగారు గురువారం రాత్రి ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో వెంటిలేటర్ సపోర్టు శ్వాస తీసుకోవడం స్టార్ట్ చేశారు.

చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో ఐదు రోజులుగా ఉన్న బాలు గారు స్వల్ప లక్షణాలతో చేరిన తర్వాత ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి క్రమేపి విషమించింది. ఇక ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులు వైజాగ్ నుండి అతని ఆరోగ్యంపై వాకబు చేస్తున్నారు. వెంటిలేటర్ ద్వారా ఆయన చికిత్స తీసుకుంటున్నారని…. ప్రత్యేక వైద్య బృందం నిరంతరం పర్యవేక్షిస్తుందని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా వయసురీత్యా వస్తున్న ఆరోగ్యసమస్యల ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని బాగా ఇబ్బంది పెడుతున్నాయని…. కరోనా తీవ్రత పెరగడానికి కూడా అదే కారణమని వైద్యులు చెబుతున్నారట. 

ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని తెలియడంతో తమిళ, తెలుగు సినీ ఇండస్ట్రీ కి చెందిన ప్రముఖులు అతని కుమారుడితో పాటుగా ఆసుపత్రి వర్గాల తో కూడా మాట్లాడుతున్నారు. 74 ఏళ్ల వయసు ఉన్న ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం పరిస్థితి ఆందోళనకరంగా ఉండడం అతని అభిమానులను నిజంగా అందోళన పెడుతోంది. ఇక సినీ రంగ ప్రముఖులతో పాటు దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రజలు అతను ఆరోగ్యంగా తిరిగి కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

కాంగ్రెస్ ఇంత డేరింగ్ స్టెప్ తీసుకుందేంటి..? దెబ్బకి కేసీఆర్ వణికిపోయాడు

Cong cautions CM against self-certification on COVID free status

తెలంగాణలో టిఆర్ఎస్ ఎంతటి పవర్ ఫుల్ పార్టీ అన్నది తెలిసిందే. అడపాదడపా ఆటుపోట్లు తప్పించి…. మొత్తం రాష్ట్రమంతా ఎన్నికలు ఏకగ్రీవమే అన్న భావన అందరిలో స్థిరపడిపోయింది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నా.. టీఆరెస్ ఎప్పటికప్పుడు వారి ప్రయత్నాలన్నింటినీ విజయవంతంగా నిర్వీర్యం చేస్తోంది. అయితే ఇప్పుడు ఒక్కసారిగా తెలంగాణ కాంగ్రెస్ చూపించిన పోరాటపటిమ, తీసుకున్న స్ఫూర్తిదాయకమైన నిర్ణయాలు కేసీఆర్ సైతం అదిరిపోయేలా ఉన్నాయి.

వివరాల్లోకి వెళితే…. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తీవ్ర అనారోగ్యంతో చనిపోయిన విషయం తెలిసిందే. ఎవరైనా ఎమ్మెల్యే చనిపోతే అక్కడ ఉప ఎన్నికలు కచ్చితంగా జరుగుతాయి. ఇదే సమయంలో అందరూ ఈసారి కూడా టిఆర్ఎస్ గెలుపు లాంఛనమేనని.. అసలు కాంగ్రెస్ కనీసం ఉప ఎన్నికలను తమ భవిష్యత్తు కార్యాచరణలో ఒకటిగా పరిగణిస్తుందా లేదా అన్నది కూడా అనుమానమే అని ఫిక్స్ అయిపోయారు. అయితే ఒక్కసారిగా టీపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…. రాష్ట్రంలో కాంగ్రెస్ వెనుకబడిందని ఎంతో మంది అంటున్నారు కానీ తమ అసలు సత్తా ఏమిటో దుబ్బాక ఉప ఎన్నికల్లో చూపిస్తామని అంటున్నారు.

అలాగే మరొక పక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి…. టిఆర్ఎస్ పార్టీని వారు సోలిపేట కుటుంబసభ్యుల్లో ఎవరైనా నిలబెట్టుకోండని అని సవాల్ విసిరారు. అతనే దగ్గర ఉండి ఎన్నికలు ఏకగ్రీవంగా కాంగ్రెస్ గెలిచేలా చేస్తానని అన్నారు. అతను అలా మాట్లాడిన కొద్ది రోజులకే ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ నిర్ణయాన్ని ప్రకటించడం విశేషం. దీంతో ఈ మధ్యకాలంలో ఫామ్ హౌస్ రాజకీయాలకే పరిమితం అయిన కేసీఆర్…. క్షేత్ర స్థాయి రాజకీయం మొదలు పెట్టాల్సిన అవసరం వచ్చింది. ప్రజల్లో నెమ్మదిగా వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకొని.. కాంగ్రెస్ విసిరిన సవాలు కేసీఆర్ గుండెల్లో గుబులు రేపుతోందని అధికార పార్టీ వర్గాల సమాచారం. మరి కెసిఆర్….  కాంగ్రెస్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయానికి ఎలాంటి బదులిస్తాడో వేచి చూడాలి.

మెగాస్టార్ తో సినిమా ఫిక్స్.. కానీ.. !


తెలుగు డైరెక్టర్స్ లో త్రివిక్రమ్ కి ఉన్న డిమాండ్ ఎవరికీ లేదేమో. రాజమౌళిని కూడా మాతో సినిమా చేసి పెట్టమని నోరు తెరిచి ఏ స్టార్ హీరో తొందరగా అడగలేరు. కానీ, త్రివిక్రమ్ ను మాత్రం ప్రతి హీరో తనతో సినిమా చేసేదాకా వదిలిపెట్టరు. సహజంగా త్రివిక్రమ్ కి అందరి స్టార్ హీరోలతో అంత చనువు ఉంది. పర్సనల్ గా త్రివిక్రమ్ తో ఎప్పుడూ టచ్ లో ఉంటారు. అందుకే అందరి చూపు త్రివిక్రమ్ వైపే. అందుకేనేమో మెగా ఫ్యాన్స్ ఊహల్లోని డ్రీమ్ కాంబినేషన్లలో త్రివిక్రమ్ – మెగాస్టార్ కాంబినేషన్ అనేది ప్రధానమైనది. ఈ కలయికలో సినిమా అంటే నిజంగా ఎంతో క్రేజ్ తో కూడుకున్నది కూడా. ఎప్పటికైనా త్రివిక్రమ్, మెగాస్టార్ సినిమా చేస్తాడని మెగా ఫ్యాన్స్ ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు.

Also Read: స్టార్ హీరో ఇంటి కోడలు శృంగార పాఠాలు !

కానీ, త్రివిక్రమ్ ఇప్పటివరకూ మెగా ఫ్యాన్స్ కోరికను తీర్చే ప్రయత్నం చేయలేదు. అయితే ఈ సారి వారి కోరికను ఈ స్టార్ డైరెక్టర్ తీర్చేలా ఉన్నాడు. అవును, ఇప్పటికే మెగాస్టార్ కి త్రివిక్రమ్ ఒక ఇంట్రస్టింగ్ లైన్ చెప్పాడట. నిజానికి ఎన్టీఆర్ తో సినిమా తరువాత, త్రివిక్రమ్ మహేష్ బాబుతో సినిమాని ప్లాన్ చేసుకున్నాడు. అయితే సడెన్ గా మెగాస్టార్ సినిమాల వేగం పెంచడంతో.. త్రివిక్రమ్ ఇటీవలే ఆయనను కలిసి స్టోరీ లైన్ చెప్పాడు. ప్రస్తుతం ఆ లైన్ మీద త్రివిక్రమ్ వర్క్ చేస్తున్నాడట.

Also Read: బయటపడ్డ స్టార్ హీరోయిన్ బాగోతం !

పక్కా కమర్షియల్ గా ఈ సినిమా సాగనుందని.. అలాగే సినిమాలో దొంగ స్వామిజీల మీద ఒక మెసేజ్ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఏమైనా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమా వస్తోందంటే.. వంద శాతం కమర్షియల్ ఎంటెర్టైనర్ అనేది దాదాపు ఫిక్స్ అయిపోయారు. ఎలాగూ హాస్యాన్ని పండించడంలో మెగాస్టార్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే వీరి కలయికలో సినిమా రావడానికి మరో రెండేళ్లు సమయం పడుతుంది.

బైక్ నీళ్ళలో.. పెట్రోల్ గాల్లో… ‘బైక్’ని ఇలా కూడా నడపొచ్చట!

బైక్ ను నీటిలో నడపటం ఎంత కష్టమో వాహనదారులందరికీ తెలిసిందే. ఎప్పుడూ వేగంగా వెళ్లే బైకు నీటిలో నడపడానికి ప్రయత్నిస్తే మెల్లిగా వెళుతూ వాహనదారులను ఇబ్బందులు పెడుతుంది. బైక్ సైలెన్సర్ లోకి నీళ్లు వెళ్లాయంటే బైక్ ముందుకు కదలనే కదలదు. భారీ వర్షాలు, వరదల వల్ల రోడ్లు జలమయమైతే ఆ సమయంలో బైక్ పై వెళ్లే వాళ్లు పడే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. వరదల సమయంలో బైక్ పై తిరిగితే బైక్ పని చేయకపోయే అవకాశాలు కూడా ఉంటాయి.

అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో యువకులు పీకల్లోతు నీటిలో సైతం బైకును అవలీలగా నడుపుతున్నారు. పీకల్లోతు నీటిలో బైక్ ను నడిపితే బైక్ ముందుకు వెళ్లదు కదా…? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయా….? అయితే యువకులు బైక్ లో చిన్నచిన్న మార్పులు చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. బైక్ కిందకు ఉండే సైలెన్సర్ ను యువకులు బైకర్ తలపైకి ఉండే విధంగా మార్చారు.

అయితే పెట్రోల్ ట్యాంకులోకి నీరు వెళ్లినా బైక్ పని చేయదు అందుకని యువకులు బాటిల్ నుంచి బైక్ లోకి పెట్రోల్ వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. దీంతో ఇంజిన్ చక్కగా పని చేయడంతో సులభంగా బైక్ ముందుకు వెళుతోంది. ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ ట్వీట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. యువకుల తెలివికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఐఏఎస్ అధికారి అవనీష్ తాను గతంలో ఇలా బైక్ నడపడం చూద్లేదని ఇలా చేయడం ప్రమాదకరం అని చెప్పారు.

‘కాపు’లకు కొత్త నాయకుడు.. నెగ్గుకొస్తాడా?


కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాడి వదిలేశారు. కాపుల కొట్లాటలు.. కాపు రాజకీయాల్లో తాను బలికాలేను అంటూ పదవిని త్యజించాడు. తనపై దుష్ప్రచారం చేస్తున్నందుకు మనస్తాపం చెంది ఈ నిర్ణయం తీసుకున్నారు. దానివెనుక ఎవరి ప్రయోజనాలున్నాయో కానీ ఆయన మాత్రం పక్కకు జరిగారు.

Also Read: అప్పటివరకూ అమరావతే ఏపీ రాజధాని…! జగన్ కు దిమ్మతిరిగే షాక్

మరి రెడ్డిలకు జగన్ ఉన్నారు. కమ్మలకు చంద్రబాబు ఉన్నారు. మరి కాపులకు ఎవరున్నారు అనుకుంటుండగానే బీజేపీ ప్రయోగం చేసింది. కాపు నేత ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు బీజేపీ రాష్ట్ర పగ్గాలు అప్పగించింది. కాపుల తరుపున ఆయనకు నాయకత్వం ఇచ్చింది. అయితే సోము వీర్రాజు ఇప్పటిదాకా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసిన దాఖలాలు లేవు. పైగా పార్టీని లీడ్ చేసిన అనుభవం లేదు. సో కొత్తనేతపై బోలెడు ఆశలు బీజేపీలో ఉన్నాయి. ఆయన బీజేపీని బలపేతం చేస్తాడా? అధికారంలోకి తీసుకొస్తాడా అన్నది వేచిచూడాలి.

ఇక వీరే కాదు.. ముద్రగడ వైదొలగడంతో ఖాళీ అయిన కాపు ఉద్యమాన్ని, నాయకత్వాన్ని చేజిక్కించుకోవాలని తాజాగా ఓ నాయకుడు సన్నాహాలు చేస్తున్నారు. ఆయనే పేరు, ప్రఖ్యాతలు.. వారసత్వం ఉండి.. కనుమరుగైన నేత వంగవీటి రాధాకృష్ణ. వంగవీటి రాధాకృష్ణ తండ్రి రంగ ఏపీ రాజకీయాల్లో కాపుల తరుఫున పోరాడిన ఫేమస్ నాయకుడు. ఆయనకు ఇప్పటికీ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. రంగా ఇప్పటికీ బెజవాడలో ఆకర్షనీయమైన అభిమనగణం ఉన్న నాయకుడు. ఇప్పటికీ లక్షలాది మంది రంగాను ఆరాధిస్తారు.

వంగవీటి రాధాకృష్ణ తన తండ్రి రంగా వారసత్వాన్ని పొందారు. పైగా ప్రసిద్ధ తండ్రిని పోలి ఉన్నాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలంలో ఎమ్మెల్యేగా గెలిచి ప్రజా నాయకుడిగా నిరూపించుకున్నారు. 2019 ఎన్నికల వరకు ఉన్నారు.

Also Read: ఎంపీ Vs ఎమ్మెల్యే! మరోసారి వివాదం షురూ..!

అయితే వంగవీటి రాధా చేసిన పెద్ద పొరపాటు 2019 ఎన్నికల ముందు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరడం. టీడీపీలో కూడా ఆయనకు కావలసిన టికెట్ దక్కలేదు. జగన్ వైసీపీ సునామీలో రాధా తుడిచిపెట్టుకుపోయాడు. ప్రస్తుతం టీడీపీలో సైలెంట్ గా ఉంటున్నారు.

వంగవీటి రాధా గురించిన తాజా అప్ డేట్ ఏంటంటే.. అతడు కాపు రాజకీయాలకు వెళ్లాలని యోచిస్తున్నట్టు తెలిసింది. ఇటీవల కాపు ఉద్యమ నాయకత్వం నుంచి వైదొలగిన ముద్రగడ పద్మనాభం స్థానాన్ని స్వాధీనం చేసుకోవడం తనకు సరైనదని ఆయన భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బలిజనాడు నాయకుడు ఏ.ఓ రమణతో తాజాగా కీలక భేటి నిర్వహించారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించినందుకు ఇటీవల ఏఓ రమణను బీజేపీ నుంచి సస్పెండ్ చేశారు. కాబట్టి రమణ, రాధాకృష్ణ ఇద్దరూ కలిసి కాపు రాజకీయాలను మొదలుపెట్టాలని డిసైడ్ అయినట్టు సమాచారం.

కాపు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి పోరాడి.. ఏకం చేసి అధికారంలోకి తీసుకురావాలని ఈ ఇద్దరు నాయకులు భావిస్తున్నారు. కానీ వంగవీటి రాధా నాయకత్వ లోపాలు ఇప్పటికే చాలా బయటపడ్డాయి. వైఎస్ జగన్ పాలనలో కాపులకు చాలా ప్రయోజనాలే కల్పించారు. ఇక తండ్రి రంగా అంత పవర్ ఫుల్ కాదు రాధా. ముద్రగడ అంత నేత కూడా కాదు.. సో కాపు నాయకత్వాన్ని వంగవీటి రాధా నిర్వహించగలరా? లేదా అన్నది కాపుల్లోనూ అనుమానాలకు కారణమవుతోంది. చూడాలి మరీ కాపుల నేతగా వంగవీటి ఎదుగుతాడో లేదో..

-ఎన్నం

శరీరానికి నిప్పు అంటించుకొని ప్రపోజ్ చేశాడు.. చివరికి?

సాధారణంగా ప్రేమించడం కంటే ఆ ప్రేమను అవతలి వ్యక్తులకు వ్యక్తపరచటం, పెళ్లికి ఒప్పించడం చాలా కష్టంతో కూడుకున్న పని. కానీ అవతలి వ్యక్తులకు మనం అంటే ఇష్టం ఉంటే మాత్రం ఒప్పించడం సులభమే. ప్రేమను వ్యక్తపరచటానికి ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. అయితే ఒక వ్యక్తి మాత్రం ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోమని అడగటానికి పెద్ద రిస్క్ చేశాడు. తనను తాను మంటల్లో కాల్చుకుంటూ పెళ్లి చేసుకుంటావా…? అని ప్రియురాలిని అడిగాడు.

పెళ్లి చేసుకోమని అడగటానికి మంటల్లో కాల్చుకోవడం ఏంటి…? అనే అనుమానం కలుగుతుందా…? అయితే మీరు ఏ మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రేమను వ్యక్తపరిచిన వ్యక్తి స్టంట్ మ్యాన్ గా పని చేస్తాడు. గతంలో ఎన్నో స్టంట్లు చేసిన అనుభవం ఉన్న వ్యక్తి మంటల్లో కాల్చుకుంటూ చేసిన మ్యారేజ్ ప్రపోజల్ యువతికి ఎంతగానో నచ్చింది. వెంటనే సదరు యువతి పెళ్లి చేసుకోవడం ఇష్టమేనని పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

యూకేలో ఈ ఘటన చోటు చేసుకుంది. 52 సంవత్సరాల రికీ ఆష్ స్టంట్ మ్యాన్ గా పని చేసే వాడు. ఇప్పటివరకు పెళ్లి చేసుకోని అతనికి 48 సంవత్సరాల వయస్సు గల క్యాట్రినా డాబ్సన్ అనే నర్సు నచ్చింది. ఆమెను స్టూడియోకు రమ్మని ఆహ్వానించిన రికీ అక్కడ ఆమెను నల్ల తెర ముందు కూర్చోబెట్టి అతని స్నేహితులతో సూట్ కు నిప్పు పెట్టించుకున్నాడు. అనంతరం జేబులో నుండి రింగ్ ఇస్తూ క్యాట్రినాకు మ్యారేజ్ ప్రపోజల్ చేశాడు. ఇలా ప్రపోజ్ గతంలో తాను చూడలేదని క్యాట్రియా పేర్కొంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది.

సుక్కూతో కలిసి థ్రిల్‌ చేస్తానంటున్న సాయి ధరమ్‌


మెగా కాంపౌండ్‌ హీరోల్లో చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ శైలి వేరు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. కథలు, పాత్రల ఎంపికలో జాగ్రత్త తీసుకుంటాడు. ఎప్పటికప్పుడు విభిన్న కథలను ఎంచుకుంటూ కెరీర్ను జాగ్రత్తగా నిర్మించుకుంటున్నాడు. మొదట రిలీజైన ‘పిల్లా నువ్వు లేని జీవితం’తోనే మెగా నట వారసుడిగా ప్రతిభ నిరూపించుకున్నాడీ యువ హీరో. తనదైన నటన, డైలాగ్‌ డెలివరీ, డ్యాన్స్‌తో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. దాంతో కొద్ది సమయంలోనే మంచి పేరుతెచ్చుకున్నాడు సాయి తేజ్. ఆ మధ్య వరుస పరాజయాలతో సతమతమైన అతను ‘చిత్రలహరి’, ‘ప్రతి రోజూ పండగే’ చిత్రాలతో మళ్లీ విజయాల బాట పట్టాడు. ఈ రెండు చిత్రాలు హిట్‌ అవడంతో సాయి ధరమ్‌ జోరు పెంచాడు. వరుస ప్రాజెక్టులతో బిజీగా మారాడు.

Also Read: బయటపడ్డ స్టార్ హీరోయిన్ బాగోతం !

ఇప్పటికే కొత్త దర్శకుడు సుబ్బు తీసిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు దేవా కట్టాతో ఓ సినిమాకు ఓకే చెప్పాడు. అందులో యువ ఐఏఎస్‌ ఆఫీసర్గా నటించబోతున్నాడు. ఇప్పుడు మరో చిత్రానికి కూడా పచ్చజెండా ఊపేశాడు. తొలిసారి ఆధ్యాత్మిక థ్రిల్లర్ జానర్లో నటించబోతున్నాడు. ఇందుకోసం సుకుమార్తో చేతులు కలిపాడు సాయి. దీనికి సంబంధించి ఈ రోజు అధికారిక ప్రకటన విడుదలైంది. ఇంకా టైటిల్‌ ఖరారు చేసిన ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్‌ను రిలీజ్‌ చేశారు. సాయి ధరమ్‌కు ఇది 15వ చిత్రం. చెట్టు మొద్దుపై భయపడుతున్నట్టు కనిపిస్తున్న కన్ను, చుట్టూ నక్షత్రం గీతలతో ఆసక్తిరంగా ఉంది. ఈ ప్రీ లుక్‌ పోస్టర్ను ట్విట్టర్లో షేర్ చేసిన సాయి. ‘కొత్త జానర్లో సినిమాలు చేయడం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. అది కూడా నాకెంతో ఇష్టమైన దర్శకుడు సుకుమార్తో కలిపి పని చేయడం మరింత స్పెషల్‌. #SDT15 ఒక మిస్తికల్‌ (ఆధ్యాత్మిక) థ్రిల్లర్’ అని ట్వీట్‌ చేశాడు. ఈ మూవీకి సుకుమార్ స్క్రిప్టు అందించడం విశేషం. సుకుమార్ రైటింగ్స్‌ బ్యానర్పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంతో సుక్కూ శిష్యుడు కార్తీక్ దండు దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. మొదటిసారి ఆధ్యాత్మిక థ్రిల్లర్ ను ఎంచుకున్న సాయి తేజ్‌ ఎలా మెప్పిస్తాడో చూడాలి.

నవరాత్రి ఉత్సవాలపై కొనసాగుతున్న ఉత్కంఠ


మరో వారంరోజుల్లో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. 2020 ఆగస్టు 22న వినాయక చవితి రాబోతుంది. ప్రతియేటా తొమ్మిదిరోజులపాటు వైభవంగా వినాయక ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి కరోనా కారణంగా గణేశ్ ఉత్సవాల నిర్వహాణపై ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. పండుగ సమీపిస్తున్న నగరాల్లోగానీ, పల్లెల్లోగానీ ఎలాంటి సందడి లేకపోవడం శోచనీయంగా మారింది.

Also Read: తెలంగాణ కొత్త సెక్రటేరియట్ కు ఇక అతనే సీఎం..?

దేశంలో, రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు ఇంకా తగ్గుమఖం పట్టడం లేదు. దీంతో ఈ ఎఫెక్ట్ గణేష్ ఉత్సవాలపై పడేలా కన్పిస్తుంది. ఇప్పటికే ఉగాది, శ్రీరామనవమి, రంజాన్, బక్రీద్, బోనాల ఉత్సవాలపై కరోనా ఎఫెక్ట్ పడింది. తాజాగా వినాయక ఉత్సవాలకు కూడా కరోనా విఘ్నం ఎదురుకానుంది. గణేశ్ ఉత్సవాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చానా.. తొమ్మిది రోజులపాటు కరోనా నిబంధనలు పాటించడం సాధ్యమయ్యేనా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. దీంతో ఉత్సవ కమిటీ నిర్వాహకులు, ప్రజలు వేడుకలు ఎలా నిర్వహిస్తారనే చర్చనీయాంశంగా మారింది.

సాధారణంగా గణేష్ ఉత్సవాల ప్రారంభానికి ముందు నుంచే ఆయా పల్లెలు, నగరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటాయి. అయితే ఈసారి అలాంటి వాతావరణం ఎక్కడా కన్పించడం లేదు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుండటంతో ఇప్పటివరకు ప్రభుత్వం వేడుకలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. మండపాల ఏర్పాటు, తదితర అనుమతులపై స్పష్టత రాకపోవడంతో ఈసారి మండపాలు ఉంటాయా? ఉంటే ఎంత ఎత్తులో ఉండే వినాయక ప్రతిమలకు అనుమతి ఇస్తారనేది తేలాల్సి ఉంది. అయితే ఈసారి భారీ విగ్రహాలు, భారీ మండపాలు, డీజే సౌండ్స్ తదితర హంగులకు అనుమతి ఉండకపోవచ్చని టాక్ విన్పిస్తోంది.

Also Read: తండ్రి రాజ్యసభలో.. తనయుడు లోక్ సభలో

నవరాత్రి ఉత్సవాల్లో కరోనా నిబంధనలు పాటించే వారికి మాత్రమే పోలీస్ శాఖ అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. కేవలం మట్టి వినాయకుల ప్రతిమలకే అనుమతి ఉంటుందని.. ఇక బస్తీలు, గ్రామాల్లో నాలుగు అడుగులలోపు ప్రతిమలకే అనుమతి ఇవ్వాలని పోలీస్ శాఖ యోచిస్తోంది. ఇక బస్తీకే ఒకే గణేశుడుని పరిమితం చేసే ఆలోచనలో పోలీస్ శాఖ ఉంది. మండపాల వద్ద డీజేలు, తీర్థప్రసాద వితరణ వంటివి నిషేధించనున్నారు.

పోలీస్ శాఖ అనుమతుల మేరకే మండపాల వద్ద విగ్రహాల ప్రతిష్ట, నిమజ్జన ఊరేగింపులు ఉండేలా పోలీస్ శాఖ మానిటరింగ్ చేయనుంది. మొత్తంగా అందరీ విఘ్నాలను దూరంచేసే ఆదిదేవుడికే కరోనా విఘ్నం కలిగిస్తోంది. దేవదేవుడైనా వినాయకుడు ఇప్పటికైనా కరోనాపై కన్నెర్రచేసి మహమ్మరిని దూరం చేయాలని భక్తులు ప్రార్థిస్తున్నారు. మరీ ఈ కరోనా విఘ్నాన్ని వినాయకుడు ఎలా దూరం చేస్తాడో వేచి చూడాల్సిందే..!

వైరల్: పిల్లి నాకడంతో మహిళ మృతి.. ఎక్కడంటే?

మనలో చాలామంది పెంపుడు జంతువులను పెంచుకోవడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. కొందరు కుక్కలను పెంచుకోవడానికి ఇష్టపడితే మరికొందరు పిల్లులను పెంచుకుంటూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఆ పెంపుడు జంతువులే మన ప్రాణాలు పోవడానికి కారణమవుతూ ఉంటాయి. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా తాజాగా పిల్లి నాకడం వల్ల 80 సంవత్సరాల బామ్మ మృతి చెందింది.

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 80 ఏళ్ల బామ్మకు పిల్లులను పెంచుకోవడం అంటే మహా ఇష్టం. ఆ ఇష్టం వల్ల ఒక పిల్లిని పెంచుకుంటూ ఆ పిల్లికి మింటీ అనే పేరు పెట్టింది. అయితే మింటీ కొన్ని రోజుల క్రితం గోళ్లతో బామ్మను గీరింది. పిల్లి గీరిన భాగాన్ని బామ్మ అనుకోకుండా నాలుకతో నాకింది. కొన్ని రోజులపాటు బాగానే ఉన్న బామ్మ అనంతరం తీవ్ర అస్వస్థతకు గురైంది.

బామ్మను ఆమె కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అనంతరం కోమాలోకి జారుకున్న బామ్మ చికిత్సకు కోలుకోలేక 9 రోజుల చికిత్స అనంతరం మృతి చెందింది. వైద్యులు పిల్లులు, కుక్కలు గీరిన సమయంలో వాటి లాలాజలంలోని బ్యాక్టీరియా శరీరంపై ఉంటుందని.. ఆ గాయాలను నాకితే శరీరంలోని రక్తంలోకి బ్యాక్టీరియా చేరి కోమాలోకి వెళ్లే అవకాశం ఉందని చెప్పారు. కొన్ని నెలల క్రితం పెంపుడు కుక్క నాకడం వల్ల ఒక మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే.

పూజా హెగ్డే డబుల్ రోల్ అట !


రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘రాధే శ్యామ్’. సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ చిత్రంలో పూజా హెగ్డే డ్యూయెల్ రోల్ అట. ట్విన్స్ అయినా పూజాలు ఇద్దరూ ఒకరికి తెలియకుండా ఒకరు ప్రభాస్ పాత్రతో ప్రేమలో పడతారని.. అయితే చివర్లో ఒకరు మరొకరి కోసం తమ ప్రేమతో పాటు ప్రాణాన్ని కూడా త్యాగం చేస్తారని మొత్తానికి తాజాగా రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమా పీరియాడిక్ మూవీ కావడంతో పూజా గెటప్ కూడా ఆనాటి ట్రెడిషనల్ క్లాసిక్ డాన్సర్ ను పోలి ఉంటుందట. మరి పూజా డబుల్ రోల్ ఉండబోతుందో చూడాలి.

Also Read: బయటపడ్డ స్టార్ హీరోయిన్ బాగోతం !

ట్రెడిషనల్ గెటప్ లో ఎలాగూ పూజా అదిరిపోతుంది. ఆ మధ్య విడుదలైన గద్దలకొండ గణేష్ చిత్రంలో కూడా పూజా 90ల నాటి ట్రెడిషినల్ గెటప్ లోనే కనిపించింది. కాగా ప్రభాస్ కూడా ఈ సినిమాలో రెండు లుక్స్ లో కనిపిస్తారని సినీ వర్గాలు చెబుతున్నాయి. రివేంజ్ స్టోరీతో సాగే ఓ థ్రిల్లింగ్ ప్రేమకథగా రానున్న ఈ సినిమా లాక్ డౌన్ కి ముందు జార్జియాలో చిత్రీకరణ జరుపుకుంది. కానీ ఇప్పుడు మళ్లీ అక్కడ షూట్ చేసే పరిస్థితి లేదు. అందుకే మిగిలిన బ్యాలెన్స్ పార్ట్ షూట్ ను హైదరాబాద్ లోని అల్యూమినియమ్ ఫ్యాక్టరీలో నవంబర్ నుండి షూట్ చేయనున్నారు.

Also Read: స్టార్ హీరో ఇంటి కోడలు శృంగార పాఠాలు !

ఇక సాహో ప్లాప్ దెబ్బకు ప్రభాస్ ఈ సినిమాలో ఫుల్ ఎంటర్టైన్ మెంట్ ఉండేలా చూసుకుంటున్నాడు. స్క్రిప్ట్ ను మళ్లీ ఒక్కసారి మొత్తం సరి చూసుకోమని ఇప్పటికే దర్శకుడి చేత కామెడీ యాంగిల్ పెంచేలా చర్యలు తీసుకున్నాడు. కాగా మూడు భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్నీ గోపికృష్ణ మూవీస్ , యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

తిండిని మరిచేలా పబ్ జి ఆడాడు.. చివరికి?

ఈ మధ్య కాలంలో విద్యార్థులు, యువత ఆన్ లైన్ గేమ్స్ కు అడిక్ట్ అవుతున్నారు. ఈ అడిక్షన్ ఎంతలా అంటే కొందరు తినే తిండిని, నిద్రను పట్టించుకోకుండా రోజులో ఎక్కువ సమయం ఆన్ లైన్ గేమ్స్ కే పరిమితమవుతున్నారు. ఇలా విద్యార్థులు, యువత ఎక్కువ ఆసక్తి చూపుతున్న గేమ్స్ లో పబ్ జీ ప్రథమ స్థానంలో ఉంది. ఈ గేమ్ విద్యార్థులు, యువత జీవితాలతో ఆడుకుంటోంది. ఈ మొబైల్ గేమ్ వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు.

మరికొందరు ఈ గేమ్స్ కు బానిసలై లక్షల రూపాయలు పోగొట్టుకున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా పబ్ జీ గేమ్ వల్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని జాజులకుంట గ్రామానికి చెందిన 16 సంవత్సరాల బాలుడు పబ్ జీకి బానిసయ్యాడు. రోజులో చాలా సమయం పబ్ జీ గేమ్ ఆడుతూనే గడిపేసేవాడు. గేమ్ మధ్యలో ఆపడం ఇష్టం లేక ఆహారం, నీళ్లు తీసుకోవడం కూడా మానేశాడు.

కొన్ని రోజుల తర్వాత బాలుడు సరైన సమయంలో ఆహారం, నీళ్లు తీసుకోకపోవడం వల్ల అనారోగ్యం పాలయ్యాడు. వైద్యుడు బాలుడిని పరిశీలించి బాలుడు తీవ్రమైన డీహైడ్రేషన్ కు గురయ్యాడని చెప్పారు. బాలుడు చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. చేతికందిన కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. నిపుణులు తల్లిదండ్రులు పిల్లలను ఒక కంట గమనిస్తూ ఉండాలని సూచిస్తున్నారు.

హైదరాబాద్ నయా జర్నీ ప్రారంభం కానుందా?


తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు ప్రపంచ వ్యాప్తంగా మంచి బ్రాండ్ ఉంది. హైదరాబాదులో ఎన్నో చారిత్రక ప్రదేశాలు ఉండటం.. భూకంపాల తాకిడి ఎక్కువగా లేకపోవడంతో ఈప్రాంతం పెట్టుబడులకు స్వర్గధామంగా నిలిచింది. దేశవిదేశాలకు చెందిన ప్రఖ్యాత కంపెనీలు హైదరాబాదులో పెట్టుబడులు పెట్టేందుకు ఎప్పుడూ పోటీ పడుతూనే ఉంటాయి. ఇప్పటికే ఐటీరంగానికి చెందిన ఎన్నో ప్రఖ్యాత కంపెనీలు హైదరాబాదులో తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి.

Also Read: తండ్రి రాజ్యసభలో.. తనయుడు లోక్ సభలో

దేశంలోని మెట్రో నగరాలకు ధీటుగా హైదరాబాద్ పోటీ ప్రపంచంలో దూసుకెళుతోంది. అయితే హైదరాబాద్ అనేది అందరికీ అందుబాటులో లేదనే సంగతిని ఇక్కడ మనం గుర్తించుకోవాలి. హైదరాబాద్ నగరానికి ఇతర ప్రాంతాల నుంచి జాతీయ రహదారులు, రాష్ట్ర రోడ్డు రవాణా సౌకర్యాలు ఉన్నా రాజధానికి చేరుకునేందుకు బోలెడంత సమయం పడుతోంది. ఇతర జిల్లాల నుంచి హైదరాబాదు శివారుకు చేరుకోవడం ఒక ఎత్తయితే.. ఇక హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ సమస్య మరో ఎత్తనే చెప్పాలి. హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ రోజురోజుకు పెరిగిపోతుండటంతో నగరవాసులు సగం జీవితం రోడ్లపైనే గడిచిపోతున్నాయనే సైటర్లు విన్పిస్తుంటాయి.

ఇకపై అలాంటి కష్టాలు నగరవాసులకు, రాజధానికి వచ్చే ప్రజలకు ఉండబోవని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం కొండకల్ గ్రామ శివారులో మేధా సంస్థ నిర్మించనున్న రైల్ కోచ్ పరిశ్రమకు కేటీఆర్ శంకుస్థాపన చేసిన తర్వాత పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక హైదరాబాద్ మహానగరంలో అందరికీ అందుబాటులోకి రాబోతుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ నుంచి ఇకపై కరీంనగర్ కు గంటలో.. విజయవాడకు రెండు గంటల్లో.. బెంగూళూరుకు నాలుగు గంటల్లోనే చేరుకోవచ్చని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.

Also Read: తెలంగాణ కొత్త సెక్రటేరియట్ కు ఇక అతనే సీఎం..?

కేటీఆర్ చెప్పింది హైదరాబాదులో జరగడం సాధ్యమేనా? అనే ప్రశ్న ఎదురవుతుండగా.. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అసాధ్యం కాదని నిపుణులు అంటున్నారు. ఢిల్లీ-వారణాసి మధ్య నడిచే వందే భారత్ లాంటి హైస్పీడ్ రైళ్లు అందుబాటులోకి వస్తే సమయం ఎంతో ఆదా అవుతుందని అంటున్నారు. గంటకు 160కిలోమీటర్ల వేగంతో ఈ రైళ్లు ప్రయాణిస్తాయి. దీని ద్వారా ఇప్పుడు వీలైనంత తక్కువ సమయంలో జర్నీ పూర్తి కానుంది. దీని ద్వారా ప్రతీఒక్కరు హైదరాబాదులో ఉండి ఉద్యోగాలు చేయాల్సిన అవసరం ఉండదు. దీనితో హైదరాబాదులో ట్రాఫిక్ సమస్యకు కూడా చెక్ పడనుంది.

ఈ హైస్పీడు రైళ్లు అందుబాటులోకి వస్తే ఇప్పటివరకు 12గంటల పడుతున్న హైదరాబాద్-బెంగూళూరు జర్నీ కేవలం నాలుగు గంటల్లో పూర్తి కానుంది. అలాగే హైదరాబాద్ నుంచి కరీంనగర్ కు గంట.. బెజవాడకు రెండు గంటల సమయం పడుతుంది. దీని ద్వారా ఇతర ప్రాంతాలను నుంచి హైదరాబాదుకు రావాలనుకునే వారికి సమయం ఎంతో కలిసిరానుంది. ఇదే జరిగితే హైదరాబాద్ అందరికీ అందుబాటులో రావడం ఖాయంగా కన్పిస్తుంది. సొంతూరు నుంచి హైదరాబాద్ నగరంలో జాబ్ చేయాలనుకునే ఎంతోమంది కలలు సాకారం కానున్నాయి. త్వరలోనే హైదరాబాద్ నయా జర్నీ ప్రారంభం కానుండటంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబు, వైఎస్‌ఆర్ స్నేహం+వైరం= ఇంద్రప్రస్థం

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతిభావంతులైన దర్శకుల్లో దేవా కట్టా ఒకడు. సామాజిక, రాజకీయ పరిజ్ఞానం మెండుగా ఉన్న దేవా.. వైవిధ్యమైన చిత్రాలతో క్రియేటివ్‌ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. తొలి సినిమా ‘వెన్నెల’తోనే తనదైన ముద్ర వేసిన అతను.. ‘ప్రస్థానం’తో మంచి పేరు తెచ్చుకున్నాడు. కమర్షియల్‌గా సక్సెస్‌ కాకపోయినప్పటికీ ‘ఆటో నగర్ సూర్య’ కూడా ఓ ప్రత్యేక చిత్రంగా నిలిచింది. ప్రస్థానం మూవీని అదే పేరుతో హిందీలో రీమేక్‌ చేసిన అతను తాజాగా మరో సంచలన ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, దివంగత వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి మధ్య స్నేహం, రాజకీయ వైరం ఇతివృత్తంగా సినిమా తీస్తున్నట్టు ప్రకటించాడు. దీనికి ‘ఇంద్రప్రస్థం’ అనే వర్కింగ్‌ టైటిల్‌ పెట్టిన దేవా కట్టా.. ఈ రోజు (శుక్రవారం) మోషన్‌ పోస్టర్ను రిలీజ్‌ చేశారు.

Also Read: బయటపడ్డ స్టార్ హీరోయిన్ బాగోతం !

అభివాదం చేస్తున్న సీబీఎన్‌, వైఎస్‌ఆర్ షాడోస్‌తో కూడిన పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ‘ప్రపంచంలో జరిగే పోటీలన్నిటికీ పర్పస్ ఒక్కడే.. విన్నర్స్ ని ఎంచుకోవడం. విన్నర్స్ ప్రపంచాన్ని ఏలుతారు. అయితే ఆ పోటీలో అనుకోకుండా ఇద్దరు స్నేహితులు ఎదురైతే..! ఆ ఆటకున్న కిక్కే వేరు’ అంటూ దేవా కట్టా వాయిస్ ఓవర్ ఇచ్చాడు. పోస్టర్పై ‘ నైతికత మారుతుంది కానీ, అధికారం కోసం జరిగే యుద్ధం మాత్రం అలానే ఉంటుంది’ అని ఇంగ్లిష్‌లో ఉన్న కొటేషన్‌ ఆలోచింపజేసేలా ఉంది. సత్యానికి రెండు వైపులు ఉండవు. ఒకవైపు మాత్రమే ఉంటుంది అంటూ ‘ఇంద్రప్రస్థం’ పోస్టర్ను దేవ తన ట్విట్టర్లో షేర్ చేశాడు. ప్రూడోస్ ప్రొడ‌క్షన్స్‌ బ్యాన‌ర్‌పై హ‌రీష్, తేజ‌.సి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ ప్రాజెక్టు వెబ్‌ సిరీస్‌ రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. సాయి ధరమ్‌ తేజ్‌తో చేసే సినిమా పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్టు సెట్స్‌పైకి వెళ్లనుంది.

Also Read: స్టార్ హీరో ఇంటి కోడలు శృంగార పాఠాలు !

దేవా కట్టా రాసుకున్న ఈ ఫిక్షనల్ పొలికల్‌ థ్రిల్లర్ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. దీనిపై ఇప్పటికే కొంత వివాదం మొదలైంది. ఏపీ రాజకీయాల స్పూర్తితో మూడేళ్ల క్రితమే తాను ఈ కథ రాసి, అనేక వెర్షన్స్‌ను రిజిస్టర్ చేయించానని దేవా తెలిపాడు. కానీ, ఈ కాన్సెప్ట్‌ను తస్కరించే ప్రయత్నం చేస్తున్నారని ఎన్టీఆర్ బయోపిక్‌ నిర్మాత విష్ణు ఇందూరిపై కొన్ని రోజుల కిందట ఆరోపణలు చేశాడు . ఎన్టీఆర్ బయోపిక్‌ కథ కూడా తనదే అని, దాన్ని కూడా తస్కరించారని ఆరోపించాడు. తన కథతో తీసిన ఎన్టీఆర్ బయోపిక్‌ ఫ్లాప్‌గా తీశారని, మరోసారి అలాంటి పరిస్థితి రాకుండా చూసుకుంటానని చెప్పాడు. ఏదేమైనా చంద్రబాబు, వైఎస్‌ఆర్ రాజకీయ వైరం బహిరంగమే అయినా.. ఎవరూ టచ్ చేయని వాళ్ల స్నేహాన్ని దేవా కట్టా ఎలా తెరకెక్కిస్తాడన్నది ఆసక్తికరం.

https://twitter.com/devakatta/status/1294078851195138048