
కేంద్ర ప్రభుత్వం కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించేందుకు ఇప్పటికే సన్నహాలు చేస్తోంది. 2022 ఆగస్టు 15 నాటికి భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు 75ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నాయి. ఆ సమయానికి కల్లా పార్లమెంట్ కొత్త భవనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి భారత స్వాతంత్ర్య వజోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చాక దేశంలో ఇప్పటికే సంచలన నిర్ణయాలు తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచారు. తాజాగా పార్లమెంట్ భవనాన్ని వజ్రోత్సవాల నాటికి అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తుండటం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
Also Read: భారత మీడియా ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీనా?
ప్రస్తుత పార్లమెంట్ భవన నిర్మాణం 1921లో నిర్మాణం మొదలుపెట్టగా 1937లోముగిసింది. సుమారు వందేళ్ల చరిత్ర కలిగిన ఈ భవనం ఇప్పటికే ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. ప్రస్తుత అవసరాలకు ఈ భవనం తగ్గట్టులేకపోవడం.. ఫైర్ సెప్టీ లేకపోవడంతో కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించాలని యూపీఏ-2 హయాంలోనే నాటి స్పీకర్ మీరా కుమారి ఓ కమిటీ వేశారు. ఇక కేంద్రంలో మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చాక దీనిని ముందుకు తీసుకెళుతున్నారు. గతేడాది ఆగస్టు 5న కొత్త భవనం నిర్మించాలని ప్రధాని మోడీకి ప్రతిపాదించగా కరోనా కారణంగా ఈ ప్రక్రియ నిలిచిపోయింది.
ఇప్పటికే పార్లమెంట్ కొత్త భవన నిర్మించేందుకు అనుమతి ఇవ్వాలంటూ కేంద్రం సుప్రీం కోర్టుకు విన్నవించింది. సుప్రీం తీర్పు వచ్చిన వెంటనే పనులు వేగవంతంగా పూర్తి చేసేలా కేంద్రం సన్నహాలు చేస్తుంది. ఇందులో భాగంగానే కొత్త పార్లమెంటు భవన నిర్మాణ చేపట్టేందుకు కేంద్రం మూడు కంపెనీలని ఎంపిక చేసింది. మొత్తం ఏడు కంపెనీలు బిడ్డింగ్ కోసం ఆసక్తి చూపగా నాలుగు కంపెనీలకు కేంద్రం తిరస్కరించి మూడు కంపెనీలను షార్ట్ లిస్టు చేసింది. వీటిలో ముంబైకి చెందిన లార్సెన్ అండ్ టుబ్రో(ఎల్ అండ్ టీ) లిమిటెడ్, టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్, షపూర్‌జీ పల్లాంజీ అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నాయి.
Also Read: కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సచిన్ పైలట్?
షార్ట్ లిస్ట్ అయిన మూడు కంపెనీలు త్వరలోనే తమ ఫైనాన్షియల్ బిడ్స్‌ను సమర్పించనున్నాయి. గుజరాత్ కు చెందిన బిమల్ పటేల్ ఆర్కిటెక్ట్ సంస్థ ‘హెచ్.సీ.పీ డిసైన్స్’ కొత్త పార్లమెంట్ రూపకల్పన బాధ్యతలను పర్యవేక్షిస్తోంది. నూతన భవనం కోసం కేంద్రం రూ.889 కోట్లను బడ్జెట్లో ప్రతిపాదించింది. పాత పార్లమెంట్ తరహాలోనే త్రిభుజాకారంలో కొత్త పార్లమెంట్ ను డిజైన్ రూపొందించారు. 21 నెలల్లో కొత్త భవన పనులు పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. దీనిలో ఒకేసారి 1345మంది సభ్యులు కూర్చునేలా సువిశాలంగా సెంట్రల్ మాల్ ను నిర్మిస్తుడం విశేషం.