Home Blog Page 8368

కేంద్ర మంత్రి పదవి వీరిద్దరికి ఖాయమేనా?


కేంద్రంలో బీజేపీ సర్కార్ రెండోసారి బంపర్ మెజార్టీతో అధికారంలోని వచ్చిన సంగతి తెల్సిదే. మోడీ ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టి సుమారు 15నెలలు కావస్తోంది. అయితే ఇప్పటివరకు విస్తరణకు నోచుకోలేదు. తొలిసారి ప్రమాణ స్వీకారం చేసినప్పటి మంత్రులే ఇప్పటివరకు కొనసాగుతున్నారు తప్ప కొత్తగా ఎవరికీ ఛాన్స్ ఇవ్వలేదు. అయితే మారుతున్న రాజకీయ సమీకణాల దృష్ట్యా మోదీ మరోసారి తన మంత్రవర్గాన్ని విస్తరించేందుకు రెడీ అవుతున్నారు.

Also Read: హైకోర్టు సాక్షిగా అమరావతి రైతులకి జగన్ బంపర్ ఆఫర్…?

గతంలో కంటే కూడా రాజ్యసభలో బీజేపీకి బలం పెరిగింది. దీంతో లోక్ సభలోనూ.. రాజ్యసభలోనూ బీజేపీకి తిరుగులేకుండా పోతుంది. ఈనేపథ్యంలోనే ఆయా రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు.. గతంలో నేతలకు ఇచ్చిన హామీలను నెరవెర్చేందుకుగాను కొత్తగా క్యాబినేట్ విస్తరణ చేయాల్సిన అవసరం కన్పిస్తోంది. అయితే ఆశావహుల లిస్టు చాలా పెద్దగానే ఉండటంతో ఎవరికీ క్యాబినెట్లోకి తీసుకోవాలనే దానిపై ఇప్పటికే మోదీ-షాలు చర్చించినట్లు సమాచారం. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమందికి కేంద్ర మంత్రి పదవులు దక్కుతాయనేది ఆసక్తికరంగా మారింది.

మోదీ సర్కార్ రెండోసారి అధికారంలోకి వచ్చాక తెలుగు రాష్ట్రాలకు పెద్దగా ఛాన్స్ దక్కలేదనే చెప్పాలి. ప్రస్తుతం కేంద్ర హోం సహాయ మంత్రిగా కొనసాగుతున్న కిషన్ రెడ్డి మాత్రమే తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాధాన్యం వహిస్తుండటం గమనార్హం. మోదీ క్యాబినెట్ విస్తరిస్తే తప్పనిసరిగా తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఏపీలో బీజేపీకి లోక్ సభ సభ్యులు.. రాజ్యసభ సభ్యులు లేరు. జగన్ ను పొత్తు పెట్టుకొని కేంద్రమంత్రి పదవీ ఇస్తారనుకుంటే అలాంటి వాతావరణం కన్పించడం లేదు. టీడీపీ ఫిరాయింపు నేతలు బీజేపీకి మద్దతు ఇస్తున్నా చంద్రబాబును బీజేపీ దూరం పెడుతుండటంతో వారికి కూడా ఛాన్స్ దక్కే అవకాశం లేదని తెలుస్తోంది.

మోదీకి అత్యంత సన్నిహితుడిగా ఉంటున్న వారణాసి రాంమాధవ్ కు ఏపీ నుంచి బెర్త్ దక్కుతుందని ప్రచారం జరుగుతుంది. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు మోదీ-షాలతో మంచి సంబంధాలు ఉన్నాయి. దశాబ్దాలుగా బీజేపీలో పని చేస్తుండటంతో ఆయనకు మంత్రి పదవీ ఖాయమనే మాటలు విన్పిస్తున్నాయి. రాంమాధవ్ కు ఛాన్స్ రాకుంటే ప్రకాశం జిల్లాకు చెందిన జీవీఎల్ నరసింహారావుకు చోటు దక్కుతందనే టాక్ విన్పిస్తుంది.

Also Read: కాంగ్రెస్ ఇంత డేరింగ్ స్టెప్ తీసుకుందేంటి..? దెబ్బకి కేసీఆర్ వణికిపోయాడు

తెలంగాణా నుంచి రేసులో మురళీధరరావు ఉన్నారు. ఈయన కూడా రాంమాధవ్ లాగే పార్టీ కోసం కష్టపడే నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలంగాణలో బీసీ సామాజిక వర్గాన్ని ఆకర్షించేలా మురళీధరరావుకు పదవీ ఇస్తారనే టాక్ విన్పిస్తోంది. ఆయనకు ఛాన్స్ రాకపోతే బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ కు దక్కతుందని ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో బీజేపీ బలపడేందుకు ఎక్కువ ఛాన్స్ ఉండటంతో తెలంగాణకు ప్రాధాన్యం దక్కడం ఖాయంగా కన్పిస్తోంది. త్వరలోనే దీనిపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం కన్పిస్తోంది.

మోడీ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా పదిహేను నెలలు కావస్తోంది. విస్తరణ అంటూ లేదు, ప్రమాణం చేసినపుడు ఉన్న వారే ఇప్పటికీ కొనసాగుతున్నారు. ఈ మధ్యలో ఎన్నో రాజకీయ పరిణామాలు జరిగాయి. రాజ్యసభలో బలం పెరిగింది. కొందరికి ఆశ పెట్టారు, మరికొందరికి కచ్చితంగా పదవులు ఇవ్వాలి. ఇంకొన్ని చోట్ల పార్టీని బలోపేతం చేసుకోవడానికి మంత్రులను తీసుకోవాలి. ఈ మొత్తం కసరత్తు మీద మోడీ, అమిత్ షా త్వరలోనే దృష్టి పెడతారని అంటున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు ఈసారి మరిన్ని పదవులు వస్తాయని చెబుతున్నారు.

బిత్తిరి సత్తికి కరోనా.. ఆందోళన లో ఫ్యాన్స్

Bittiri Satti Attacked In Front Of V6 Office

తెలుగు న్యూస్ మీడియాలో ‘బిత్తిరి సత్తి’ ఒక సంచలనం. “అసలు ఇలాంటి హావభావాలతో ఎవరైనా న్యూస్ చెప్తారా?” అనే రేంజ్ నుంచి.. “ఇలాంటి వాళ్ళు మాకు ఎందుకు దొరకడం లేదు..?” అని ఇతర ఛానెళ్ళు మదనపడే వరకు చేవెళ్ల రవి కుమార్ అలియాస్ బిత్తిరి సత్తి కెరీర్ కొనసాగుతూనే ఉంది. అయితే తన కెరీర్ లో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న సత్తికి కరోనా వైరస్ సోకింది. ఇప్పుడు ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లోనే ఉంటూ చికిత్స తీసుకున్నాడు.

Also Read: పూజా హెగ్డే డబుల్ రోల్ అట !

తాజాగా టీవీ9 నుండి బయటకు వచ్చి ‘సాక్షి’ ఛానల్ లో చేరాడు సత్తి. ‘గరం గరం వార్తలు’ వార్తలు అనే కార్యక్రమాన్ని అక్కడ ప్రవేశపెట్టగా ఒక్కసారిగా సాక్షి ఛానల్ టీఆర్పీలలో ఈ కార్యక్రమం అగ్రస్థానాన్ని సాధించింది. మొదటి నాలుగు స్థానాల్లో కూడా ఇదే కార్యక్రమం నిలవడం గమనార్హం. ఇలా ఒక వైపు ప్రోగ్రాం కి మంచి ఫాలోయింగ్ వస్తూ ఉంటే సత్తికి కరోనా సోకడం నిజంగా వారికి చాలా పెద్ద దెబ్బ.

Also Read: ఎన్టీఆర్ మీద ప్రేమే.. చరణ్ కి మైనస్ !

ఇక బిత్తిరి సత్తికి కరోనా సోకడంతో మొత్తం అతని టీం అంతా హోమ్ క్వారంటైన్ లోకి వెళ్ళిపోయింది. తన కార్యక్రమంతో దిల్ ఖుష్ దివ్య (టిక్ టాక్ దివ్య), వార్తల వాణి అనే ఇద్దరమ్మాయిల పరిచయం చేశాడు సత్తి. ఇప్పుడు వాళ్లు కూడా క్వారంటైన్ లో ఉన్నారు. అయితే గరంగరం వార్తలను ఎంతో ఉత్సాహంగా మొదలుపెట్టిన టీం సాక్షికి ఇప్పుడు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మరి ‘గరంగరం వార్తలు’ ప్రోగ్రాం ను సత్తి లేకుండా కొనసాగిస్తారేమో వేచి చూడాలి. అయితే రెండు రాష్ట్రాల్లో సత్తి అంటే ఇష్టపడే వాళ్ళు అంతా కొద్దిగా ఆందోళన చెందుతున్నా.. అతనికి ఎటువంటి ప్రమాదం లేదని రిపోర్టులు వచ్చాయి.

పాపం.. ఈ కాకి ఏం తప్పు చేసింది? తెల్లగా పుట్టడమే దీని తప్ప?

సాధారణంగా కాకి ఏ రంగులో ఉంటుందని ఎవరినైనా ప్రశ్నిస్తే నల్ల రంగులోనే ఉంటుందని ఎవరైనా చెబుతారు. ఎవరైనా కొంచెం నల్లగా ఉంటే కాకి నలుపు అని హేళన చేస్తూ ఉంటారు. అయితే ఈ కాకుల్లో కొన్ని కాకులు తెలుపు రంగులో కూడా ఉంటాయి. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. మన దేశంలోని పలు ప్రాంతాల్లో అప్పుడప్పుడూ తెల్ల కాకులు దర్శనం ఇస్తూ ఉంటాయి. కొన్ని రోజుల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో వందలాది నల్ల కాకుల మధ్యలో ఉన్న తెల్ల కాకి వీడియో తెగ వైరల్ అయింది.

Also Read: వెనక్కి వెళ్తున్న జలపాతం.. వీడియో వైరల్!

ఆ తెల్ల కాకిని చూసిన వాళ్లు గతంలో తెల్ల కాకి ఉందని విన్నామని కానీ నమ్మలేదని చూస్తే నమ్మాల్సి వస్తోందని సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ కామెంట్లు చేశారు. అయితే తాజాగా ఒడిశాలో సైతం ఒక తెల్లకాకి ఆకాశ వీధుల్లో విహరించింది. ఒడిశాలోని జార్సుగూడ పట్టణంలో కావ్ కావ్ అని అరుస్తూ తెల్ల కాకి సందడి చేసింది. అయితే ఢిల్లీ వాసుల్లా కాకుండా జార్సుగూడ వాసులు కాకికి చుక్కలు చూపించారు.

Also Read: రైతుల సరికొత్త ఆలోచన.. రేగు పండ్లతో బీర్.. భారీ లాభాలు!

ఎంతో శ్రమించి అరుదైన తెల్ల కాకిని బోనులో బంధించారు. బోనులో ఉన్న కాకికి జనాలు ముప్పుతిప్పలు పెట్టారు. బోనులో తెల్ల కాకి ఉందని సమీప గ్రామాల్లో సైతం జోరుగా ప్రచారం జరిగింది. దీంతో జనాలు గుంపులుగుంపులుగా గుమికూడి ఆ కాకిని చూడటానికి వచ్చారు. పదుల సంఖ్యలో జనం గుమికూడటంతో కాకి కావ్ కావ్ అంటూ కేకలు పెట్టింది. విషయం తెలిసిన అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని కాకిని బంధించిన స్థానికులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జంతు హక్కుల సంఘాలు కాకిని బంధించటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తెల్లగా పుట్టడమే ఆ కాకి చేసిన నేరమా…? అని ప్రశ్నిస్తున్నాయి.

మీకు తెలుసా? ఈ చీరతో కరోనా అంతం!

మన దేశంలో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారిని పూర్తి స్థాయిలో నియంత్రించే మందులు, వ్యాక్సిన్లు అందుబాటులోకి రాలేదు. వైద్యులు ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా సోకే అవకాశాలు తక్కువ చేసుకోవాలన్నా, కరోనా బారిన పడకుండా చూసుకోవాలన్నా రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం మాత్రమే మార్గమని చెబుతున్నారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రకరకాల ఇమ్యూనిటీ బూస్టర్లు మార్కెట్లో అందుబాటులోకి వస్తున్నాయి.

అయితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఏకంగా రోగ నిరోధక శక్తిని పెంచే చీరలు అందుబాటులోకి వచ్చాయి. మధ్యప్రదేశ్‌ హ్యాండ్లూమ్‌ అండ్‌ హ్యాండిక్రాఫ్ట్‌ కార్పొరేషన్‌ “ఆయుర్ వస్త్రా” పేరుతో ఈ చీరలను అందుబాటులోకి తెచ్చింది. అధికారులు రకరకాల సుగంధ ద్రవ్యాలతో ఈ చీరలను తయారు చేయించామని… ఇవి ధరిస్తే రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు వైరస్ సోకే అవకాశాలు తగ్గుతాయని చెబుతున్నారు.

ప్రస్తుతం రోగ నిరోధక శక్తిని పెంచే చీరలు తయారు చేయించామని… ఇమ్యూనిటీ పెంచే ఇతర దుస్తులను త్వరలో అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ చీరను ధరించిన వారికి కరోనా సోకదని అధికారులు తేల్చి చెబుతున్నారు. భోపాల్‌కు చెందిన వస్త్ర నిపుణుడు వినోద్‌ మాలేవర్‌ సర్కార్ ఆదేశాల మేరకు ఈ చీరను తయారు చేశాడు. ఇమ్యూనిటీ పెంచే ఈ చీరల తయారీకీ ఎంతో నైపుణ్యం అవసరమని… చీర తయారీ కోసం ఎక్కువ సమయం పడుతుంద్ని మాలేవర్ చెప్పారు.

నల్ల మిరియాలు, రాయల్‌ జీలకర్ర, బే ఆకు, యాలకులు, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగాలతో ఈ చీరను తయారు చేశామని అన్నారు. సుగంధ ద్రవ్యాలను పొడి చేసి నీటిలో నానబెట్టి ఆని ఆవిరిని చీర, మాస్క్ లేదా ఇతర దుస్తులకు పట్టిస్తారని… ఒక చీర తయారీకి ఆరు రోజుల సమయం పడుతుందని… రెండు నెలల పాటు శ్రమించి ఈ పద్ధతిని కనిపెట్టామని… ఈ పద్దతి వందల సంవత్సరాల నాటికి చెందిందని మాలేవర్ అన్నారు. ఈ చీర ఖరీదు కేవలం 3 వేల రూపాయలు కావడం గమనార్హం.

కరోనా.. టాలీవుడ్ కి శుభసూచికమే !


చూస్తుండగానే ఈ సంవత్సరం పూర్తవ్వబోతునట్లు అనిపిస్తుంది. మొత్తానికి బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమా పరిస్థితి ఈ ఏడాది మొత్తం ఖాళీ అయినట్టే. ఈ ఏడాది అనే కాదు, వచ్చే సంవత్సరం ఎలా ఉంటుందో అనే టెన్షనూ ఉంది. మరో పక్క కరోనా దెబ్బకు టాలీవుడ్ తన దిశ మార్చుకుని డిజిటల్ వైపు వెళ్ళిపోతుంది. పైగా ఏదో కొత్తధనం అంటూ ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పుడు రొటీన్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో సినిమాలను తీస్తే.. అవి థియేటర్స్ లో చూస్తారా అనేది పెద్ద డౌట్ అయిపోయింది. అలాంటి సినిమాలు చూసే రోజులు పోయి.. వైవిద్యమైన కంటెంట్ తో వచ్చే సినిమాలే చూస్తాం అన్నట్లు మన ప్రేక్షకులు అత్యధికంగా డిజిటల్ లో వచ్చే డిఫరెంట్ వెబ్ సిరీస్ లకు బ్రహ్మరథం పడుతుండటం చూస్తే.. ఇప్పుడు ఆల్ రెడీ సగం షూట్ చేసి ఉన్న పక్కా రొటీన్ కమర్షియల్ సినిమాల పరిస్థితి ఏమిటనేది ఇక్కడ మరో అతిపెద్ద అయోమయం.

Also Read: మెగాస్టార్ తో సినిమా ఫిక్స్.. కానీ.. !

నిజంగానే కంటెంట్ సినిమాలకే ఆదరణ ఉంటే.. ఎన్నో విభిన్నమైన కథాంశాలతో వచ్చే కొత్త తరహా చిత్రాలకు ఇది శుభసూచికం. ఒక విధంగా ఒకప్పటి మన స్వర్ణయుగ చిత్రాలను గుర్తుకుతెచ్చే కాలం ఇది. నిజానికీ అప్పట్లో అనగా మాయాబజార్ మిస్సమ్మ కాలంలో.. అద్భుతమైన సినిమాలు వచ్చాయి. ఆ తరువాత జనరేషన్ మారింది. కాలం మారింది. కాలానుగుణంగా మూవీ మేకర్స్ కూడా మారుతూ వచ్చారు. అలా తెలియకుండానే తెలుగు సినిమా అంటే… రొటీన్ యాక్షన్ స్టోరీలు, లాజిక్ లేని బిల్డప్ సీన్స్ లు, అర్ధం పర్ధం లేని పంచ్ డైలాగ్ లు అనేంతలా మన తెలుగు సినిమాలను మన మేకర్స్ తీసుకువెళ్లారు. గడిచిన రెండు దశాబ్దాలలో నాలుగైదు చిత్రాలు మినహాయించి.. అన్ని కమర్షియల్ సినిమాలే అంటే.. మన టాలీవుడ్ పై కమర్షియల్ అనే ముద్ర ఎంతలా పడిందో అర్ధం చేసుకోవచ్చు.

Also Read: మన కథల పై వాళ్లకు మోజు ఎక్కువ !

అయితే కరోనా దెబ్బకు అలాంటి కమర్షియల్ ఫార్మాట్ తో వచ్చే సినిమాలకు ఇక మనుగడ ఉండదేమో.. ఇప్పటికే మన జనం వరల్డ్ సినిమాలను విపరీతంగా చూస్తున్నారు. ఇలాంటి టైంలో ప్రేక్షకులు మీద డైరెక్టర్స్ కమర్షియల్ సినిమాలనే రుద్దే ప్రయత్నం చేస్తే.. ఇక ఆ దర్శకుల కెరీర్ కష్టమే. అందుకే డైరెక్టర్లు.. కంటెంట్ నమ్ముకుని డిఫరెంట్ సినిమాలు చేయండి.అప్పుడే తెలుగు సినీపరిశ్రమలో మీకు స్థానం లభిస్తుంది. లేదంటే.. కెరీర్ సైడ్ అయిపోతుంది జర జాగ్రత్త.

కరోనాకు చెక్ పెడుతున్న మాస్కు ఇదేనట?


ప్రస్తుతం మనమంతా ఉన్నది కరోనా కాలంలో.. ఈకాలంలో ప్రతీఒక్కరికి అవసరమైనది ఏదైనా ఉందంటే ముందు వరుసలో నిలిచేది మాస్కు మాత్రమే. మాస్కులేకుండా కరోనా కాలంలో జీవించడమంటే కొరివితో తలగొక్కునట్టే.. మాస్కుతోపాటు ప్రతీఒక్కరు భౌతిక దూరం పాటించడం.. వీలైనంత వరకు సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవడం.. తదితర కరోనా నిబంధనలు తూచ తప్పకుండా పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.

Also Read: హైకోర్టు సాక్షిగా అమరావతి రైతులకి జగన్ బంపర్ ఆఫర్…?

ఇప్పటికే రష్యా కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టింది. అయితే ఇది ఏమేరకు పని చేస్తుందనే సందేహాలు ప్రతీఒక్కరిలో ఉన్నాయి. రష్యా తయారు చేసిన వ్యాక్సిన్ ఏడాదిపాటు పని చేస్తుందని ఆ దేశం ప్రకటించింది. ఈలోపు భారత్ లాంటి దేశాలు మేలైన కరోనా వ్యాక్సిన్లను మార్కెట్లోకి విడుదల చేసే అవకాశాలున్నాయి. అయితే అప్పటివరకు ముఖానికి మాస్కులు ధరించడం తప్పనిసరి. మార్కెట్లో విరివిగా లభ్యమవుతున్న మాస్కుల్లో ఏది ఉత్తమమైన మాస్కు?.. ఏది కరోనా వైరస్ ను కట్టడి చేస్తుందని అనేక మందిలో సందేహాలు ఉన్నాయి.

ఈ విషయంపై అమెరికా, నార్త్ కరోలినాలోని డ్యూక్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధన అధ్యాయనం చేసి ప్రస్తుత పరిస్థితుల్లో ఏది ఉత్తమమైన మాస్కో వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా లభ్యమవుతున్న 14రకాల మాస్కులపై అధ్యాయనం చేశారు.లేజర్ సెన్సర్ డివైజ్‌తో 14రకాల మాస్క్‌లను, ఫేస్ కవరింగ్స్‌ను పోల్చి చూశారు. మాస్క్ ధరించిన సమయంలో డ్రాప్‌లెట్స్ ఎలా అడ్డుకుంటున్నాయో పరిశీలించి.. ఏ మాస్కు కరోనా వైరస్ ను సమర్థవంతంగా అడ్డుకుంటుందో తేల్చిచెప్పారు.

Also Read: కాంగ్రెస్ ఇంత డేరింగ్ స్టెప్ తీసుకుందేంటి..? దెబ్బకి కేసీఆర్ వణికిపోయాడు

14రకాల మాస్కుల్లో కరోనా(డ్రాప్‌లెట్స్)ను నిరోధించడంలో ఎన్-95 మాస్క్‌ ఉత్తమమని తేలిందట. కానీ ఎన్-95మాస్కులో వాల్వ్ లేనివి వాడాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. దీంతోపాటు త్రీ లేయర్ మాస్క్.. కాటన్ పొలిప్రోలిన్ కాటన్ మాస్క్.. టూ లేయర్ పొలిప్రోలిన్ అప్రాన్ మాస్క్‌లు ఉత్తమమని చెబుతున్నారు. ఇక నెక్ గెటర్ మాస్క్ కరోనా వ్యాప్తికి సహకరించే నోటి తుంపర్లను అడ్డుకోవడం లేదని తేలిందట. వీటిని ధరించడం వల్ల రిస్క్ ఓ పదిశాతం ఎక్కువనని గుర్తించారు. ఈ మాస్కును వాడకపోవడంమే బెటరని అంటున్నారు.

అయితే ఇటీవల పరిశోధనల్లో వాల్వ్‌లున్న ఎన్-95 మాస్క్‌లు తుంపర్లను అడ్డుకోవడంలో విఫమవుతున్నాయని తేలింది. దీంతో వాల్వ్ లేని ఎన్-95 మాస్కులను వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా కాలంలో మాస్కులు తప్పనిసరి కావడంతో ప్రతీఒక్కరు మాస్క్ విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అజాగ్రత్తగా ఉంటే మాస్కు ధరించిన ఉపయోగం ఉండదని హెచ్చరిస్తున్నారు.

మన కథల పై వాళ్లకు మోజు ఎక్కువ !


ఒకప్పుడు ఎక్కువగా బాలీవుడ్ కథలు సౌత్ ఇండస్ట్రీలో రీమేక్ అవుతూ వచ్చేవి. కానీ ఇప్పుడు కాలం మారింది. సౌత్ కథల శైలి మారింది. అన్నిటికి మించి సౌత్ లో మంచి కథకులు పుట్టుకొచ్చారు. యావత్తు భారతీయ సినీ పరిశ్రమలోనే ఇప్పుడు సౌత్ లో ఉన్న టాలెంట్ నార్త్ లో లేదు. అందుకే గత నాలుగేళ్లుగా బాలీవుడ్ నిర్మాతల చూపు సౌత్ సినిమాల స్టోరీల పై పడిందనేది వాస్తవం. దీనికి తోడు సౌత్ సినిమాలు కూడా బాలీవుడ్ లో రీమేక్ చేస్తే.. సూపర్ హిట్ అయిపోతున్నాయి. ఆ కారణంగానే మన దగ్గర హిట్టైన సినిమాలని హిందీలోకి రీమేక్ చేయడానికి అక్కడి నిర్మాతలు తెగ ఉబలాట పడుతున్నారు.

Also Read: పూజా హెగ్డే డబుల్ రోల్ అట !

ఈ క్రమంలోనే ఇప్పటికే ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ భారీ హిట్టై వసూళ్ల వర్షం కురిపించింది.. అలాగే తెలుగులో హిట్ అయిన ‘జెర్సీ, ఆర్ఎక్స్100’, ఎవడు సినిమాలు అక్కడ రీమేక్ చేస్తుంటే.. వాటి పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అలాగే విజయ్ దేవరకొండ క్రేజీ బ్యూటీ రష్మిక మండన్న రెండవ సారి జంటగా వచ్చిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రం మన దగ్గర పెద్ద ప్లాప్. కానీ బాలీవుడ్ లో ఆ సినిమాని అర్జున్ కపూర్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ప్లాప్ సినిమా రైట్స్ ను కూడా వాళ్ళు తెగ ఇష్టపడి కొనుక్కుని మరీ రీమేక్ చేస్తున్నారంటే.. మన కథలు వాళ్లకు ఎంత మోజు ఉందో అని.

Also Read: ఎన్టీఆర్ మీద ప్రేమే.. చరణ్ కి మైనస్ !

అన్నట్టు ఈ కరోనా అనంతరం మరొక తెలుగు సినిమా కూడా హిందీలోకి రీమేక్ చేయడానికి రెడీ అవుతోంది. అదే ‘ఇస్మార్ట్ శంకర్’.. ఈ సినిమా రీమేక్ లో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ హీరోగా కనిపించబోతున్నాడు. హీరో రామ్ – పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్ హీరోయిన్లుగా వచ్చిన ఈ సినిమా ఇక్కడి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను రాబట్టి.. ప్లాప్ ల్లో మునిగిపోయిన రామ్, పూరిల సినీ కెరీర్ కి మళ్ళీ ఊపు తీసుకొచ్చింది. మరి రణ్ వీర్ సింగ్ కి కూడా ఈ సినిమా ఆ రేంజ్ హిట్ ని ఇస్తుందేమో చూడాలి. ఇప్పటికే రణ్ వీర్ సింగ్ ఎన్టీఆర్ టెంపర్ ను రీమేక్ చేసుకుని బాలీవుడ్ లో సాలిడ్ హిట్ కొట్టాడు.

ఆగస్టు 15న కరోనా వ్యాక్సిన్ గురించి అద్భుతమైన మాట చెప్పిన మోడీ…!

భారతదేశం తన 74 వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా…. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోటలో మువ్వన్నెల జెండాను ఎగురవేసి దేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ…. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా…. టెస్టింగ్ ల్యాబ్ ల సంఖ్యను భారీగా పెంచినట్లు తెలిపారు. అలాగే కరోనా నుండి మనల్ని మనం కాపాడుకునేందుకు అవసరమైన మాస్కులు, రక్షణ హెల్మెట్లు ను కూడా ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నామని…. శాస్త్రవేత్తలంతా వ్యాక్సిన్ తయారీ కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు అని తెలిప్పారు.

Also Read: అక్కడ ఎన్ 95 మాస్కులు నిషేధం.. కారణం ఏంటంటే?

ప్రస్తుతం భారతదేశంలో ఒకటికి మూడు వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్ స్థాయి దాటి టెస్టింగ్ స్టేజి లోకి ప్రవేశించినట్లుగా మోడీ తెలపడం గమనార్హం. ఇక శాస్త్రవేత్తల నుండి ఒక్క గ్రీన్ సిగ్నల్ వచ్చిందంటే మాత్రం భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు అవసరమైన సదుపాయాలన్నింటినీ సమకూర్చుకుంటున్నట్లు మోడీ వివరించారు. దేశంలో కరోనా వైరస్ ప్రవేశించే సమయానికి భారతదేశంలో ఒకే ఒక్క టెస్టింగ్ ల్యాబ్ ఉందని…. అయితే ఇప్పుడు ఆ సంఖ్య 1400 కి వెళ్లడం గమనార్హం అని ఆయన అన్నారు. ఇక 130 కోట్ల భారతీయులందరూ ‘ఆత్మ నిర్భర్ భారత్’ ప్రతిజ్ఞ తీసుకోవాలని పిలుపునిచ్చారు.

Also Read: కరోనాకు చెక్ పెడుతున్న మాస్కు ఇదేనట?

‘ఆత్మ నిర్భర్ భారత్’ గురించి మోడీ మాట్లాడుతూ “ఇప్పుడు మన వ్యాక్సిన్ మనమే తయారు చేసుకుంటున్నాం…. అంతేకాకుండా గతంలో n95 మాస్క్ లను లను ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకున్న మనం ఇప్పుడు భారీ సంఖ్యలో వాటితోపాటు పిపీఈ కిట్లను, వెంటిలేటర్ లను కూడా ఇతర దేశాలకు అందిస్తున్నాం.. మన ప్రభుత్వ హయాంలో దేశం యొక్క వైద్య రక్షణకే పెద్ద పీట వేసింది” అని మోడీ తెలిపారు. ఇదిలా ఉండగా ఇప్పటికే రష్యా వారు మూడో దశ క్లినికల్ ట్రయల్స్ చేపట్టకుండానే మనుషులకు వ్యాక్సిన్ ను వేయడం అన్నది చూస్తున్నాం. దాని రిజల్ట్ ఎలా ఉందో తెలిసేలోపు…. భారత్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ మార్కెట్లోకి వస్తుందని పలువురు ఆశావహంగా ఉన్నారు.

భారత ‘స్వాతంత్య్రం’.. కొన్ని నిజాలు!


ఎర్రకోటపై భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. భారత ప్రధాని నరేంద్రమోడీ సగర్వంగా ఈరోజు జాతీయ జెండా ఎగురవేసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా ప్రారంభించారు. 73వ స్వాతంత్ర్య వేడుకలతో దేశం ఉప్పొంగిపోతోంది. అయితే ఈ స్వేచ్ఛ వాయువులు పీల్చడం వెనుక ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగం ఉంది. 200 ఏళ్ల బ్రిటీష్ పాలన నుంచి విముక్తి కోసం ఎందరో మహానుభావులు సుదీర్ఘ పోరాటం సాగించారు. దీని ఫలితంగా దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం సిద్ధించింది. అందుకే పంద్రాగస్టు భారత చరిత్రలో చిరస్మరణీయ రోజుగా నిలిచిపోయింది.

Also Read: తొలి కాంగ్రెసేతర ప్రధాని..రికార్డ్ సృష్టించిన మోడీ

భారత స్వాతంత్య్రోద్యమం గురించి చాలా మంది చరిత్ర పుస్తకాల ద్వారా తెలుసుకొని ఉంటారు. అలాగే స్వాతంత్య్రోద్యమంపై చాలా సినిమాలు కూడా వచ్చాయి. కానీ ఆగస్టు 15 వెనుక మరెన్నో విశేషాలు ఉన్నాయి. పుస్తకాలు, సినిమాలు, నాటకాల్లో ప్రస్తావించని ఎన్నో విషయాల్లో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆగస్టు 15, 1947 భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన రోజు. అయితే అదే రోజున బ్రిటీష్ వారు స్వాతంత్ర్యం ఎందుకు ప్రకటించారు. జూన్ లోనే నిర్ణయించిన స్వాతంత్ర్యాన్ని ఆగస్టు వరకు ఎందుకు పొడిగించారు.? 15వ తేదికి ఏమైనా ప్రత్యేకత ఉందా? అప్పటి భారత బ్రిటీష్ వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటెన్ కు ఆగస్టు 15తో ఏం సంబంధం ఉందనే చాలా ప్రశ్నలు భారతీయులకు ఎవరికీ తెలియవు. ఆగస్టు 15వ తేదీ అర్ధరాత్రి నుంచే మనం స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటాం. ఇదే రోజు భారత్‌తో పాటు కొరియా, కాంగో, బెహ్రయిన్, లీచెన్‌స్టీన్ దేశాలు కూడా స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటాయి. ఆగస్టు 15వ తేదీనే స్వాతంత్ర్యం ఎందుకిచ్చారన్నది తెలుసుకుందాం.

నిజానికి చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటెన్ ఫిబ్రవరి 1947లోనే భారత్ కు వచ్చారు. కానీ చాలా మంది భారతీయ నేతలతో ఆయన చర్చలు జరిపారు. అధికార మార్పిడి ప్రక్రియలో ఆయన కీలకంగా వ్యవహరించారు. అయితే అదంతా సులభంగా జరగలేదు.ఎన్నో చర్చల తర్వాత ఏకాభిప్రాయం కుదిరాకే భారత్ కు ఆగస్టు 15న స్వాతంత్ర్యం ప్రకటించారు.

నిజానికి అప్పటికే గాంధీ పిలుపుతో దేశంలో స్వాతంత్ర్య ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. మరోవైపు సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీతో కలిసి భారత్ పై దండెత్తి వస్తున్నాడు. ఇక అప్పటికే బ్రిటన్ దేశం రెండో ప్రపంచ యుద్ధంతో ఆర్థికంగా బాగా చితికిపోయింది. బ్రిటన్ పాలన కానకష్టమైంది. 1945లో బ్రిటన్ లో జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం సాధించడంతో ఆ దేశ నాయకులు అప్పటికే తాము ఎన్నికల్లో గెలిస్తే భారత్ కు స్వాతంత్య్రం ఇస్తామని ప్రకటించారు. దీంతో ఆ ప్రక్రియను ప్రారంభించారు.

Also Read: హైకోర్టు సాక్షిగా అమరావతి రైతులకి జగన్ బంపర్ ఆఫర్…?

జపాన్ లొంగిపోయి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆగస్టు 15వ తేదిని భారత స్వాతంత్ర్య దినంగా లార్డ్ మౌంట్ బాటన్ సూచించారు. సింగపూర్‌లో జపాన్ లొంగుబాటును అంగీకరించిన సౌత్-ఈస్ట్ ఆసియా కమాండ్‌కు మౌంట్‌బాటెన్ సుప్రీం అలైడ్ కమాండర్‌గా వ్యవహరించారు.ఆ తేది అంటే మౌంట్ బాటెన్ కు సెంటిమెంట్ గా మారింది. అందుకే ఆగస్టు 15న అర్ధరాత్రి దేశానికి స్వాతంత్ర్యం ప్రకటించారు.

భారత్, పాకిస్థాన్ విడిపోయినప్పుడు రాచరిక పాలనలో ఉన్న జమ్మూ కశ్మీర్ రాష్ట్రం తటస్థంగా ఉండిపోయింది. రాష్ట్రంలో ముస్లింలే అత్యధికంగా ఉన్నారు కాబట్టి పాకిస్థాన్‌లోనే కలుస్తుందని ఆ దేశం నమ్మింది. కానీ అప్పటి హిందూ రాజు జమ్మూ కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేశారు. 1947 అక్టోబర్‌లో జమ్మూ కశ్మీర్‌.. భారత్‌లో విలీనం అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీనిపై భారత్, పాక్ మధ్య వివాదం రగులుతూనే ఉంది.

భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దును సిరిల్ జాన్ ర్యాడ్‌క్లిఫ్ నిర్ణయించారు. ఈయన బ్రిటిష్ న్యాయ కోవిదుడు. భారత భౌగోళిక అంశాలపై పూర్తి అవగాహన లేకుండానే ర్యాడ్‌క్లిఫ్ సరిహద్దును నిర్ణయించారు. అదే ఇప్పుడు పాకిస్తాన్, భారత్ మధ్య 73 ఏళ్లుగా వైరానికి కారణమైంది. తన నిర్ణయంపై చనిపోయేంత వరకు ర్యాడ్‌క్లిఫ్ బాధపడుతుండేవారని చెబుతుంటారు.

-నరేశ్ ఎన్నం

టైమ్ పాస్ కోసం స్క్రాచ్ కార్డు కొన్నాడు.. కోటీశ్వరుడు అయ్యాడు!

అదృష్టం అనేది ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో ఎవరూ చెప్పలేరు. తాజాగా వర్జీనియాలో బాలుడిని స్క్రాచ్ కార్డ్ రూపంలో అదృష్టం వరించింది. వంద కాదు వెయ్యి కాదు ఏకంగా రెండు లక్షల డాలర్లు( ఇండియన్ కరెన్సీలో కోటీ 40 లక్షల రూపాయలు) బాలుడు గెలుచుకున్నాడు. ఊహించని విధంగా కోట్ల రూపాయలు రావడంతో బాలుడి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఇతరులు సైతం ఈర్ష్య పడేలా బంపర్ లాటరీ గెలుచుకున్న యువకుడి పేరు హెబర్ట్ స్రగ్స్.

Also Read: వెనక్కి వెళ్తున్న జలపాతం.. వీడియో వైరల్!

పూర్తి వివరాలలోక్ వెళితే హెబర్ట్ స్క్రగ్ తన తల్లితో కలిసి సరదాగా సరుకులు కొనుగోలు చేసే దుకాణానికి వెళ్లాడు. తల్లి సరుకులు కొనుగోలు చేసే పనిలో బిజీగా ఉండటంతో హెబర్ట్ కు బోర్ కొట్టింది. అదే సమయంలో స్క్రాచ్ కార్డ్ లాటరీలను ఆ దుకాణంలో విక్రయిస్తూ ఉండటంతో బాలుడు ఒక స్క్రాచ్ కార్డును కొనుగోలు చేశాడు. అంతలోనే తల్లి షాపింగ్ పూర్తి చేసి ఇంటికి వెళదామని చెప్పగా బాలుడు ఇంటికి వెళ్లిపోయాడు.

Also Read: రైతుల సరికొత్త ఆలోచన.. రేగు పండ్లతో బీర్.. భారీ లాభాలు!

అనంతరం ఆ స్క్రాచ్ కార్డును గీకగా అందులో 1.4 కోట్ల రూపాయలు గెలుచుకున్నట్లు ఉండటంతో బాలుడు ఎగిరి గంతేశాడు. అనంతరం ఆ విషయం తల్లికి చెప్పాడు. మొదట తల్లి నమ్మకపోయినా స్క్రాచ్ కార్డును చూసిన తరువాత కొడుకు నిజంగానే కోటీ 40 లక్షల రూపాయలు గెలిచాడని గుర్తించి సంతోషించింది. తల్లి షాపింగ్ చేసిన టైంలో కోట్లు సంపాదించిన బాలుడికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఎన్టీఆర్ మీద ప్రేమే.. చరణ్ కి మైనస్ !


జూనియర్ ఎన్టీఆర్ అంటే రాజమౌళికి ప్రత్యేక అభిమానం.. ఈ విషయం రాజమౌళినే ఎన్నో సందర్భాలలో వ్యక్తపరిచాడు. ఇక ఆయన దర్శకత్వంలో తారక్ – రామ్ చరణ్ హీరోలుగా రాబోతున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. అయితే ఈ సినిమాలో తారక్ కోసం చరణ్ పాత్రను తగ్గించబోతున్నాడట. రాజమౌళి మొదట 2 గంటల 50 నిముషాలు ఉండేలా ఈ సినిమాను ప్లాన్ చేసుకున్నా.. ఇప్పుడు మాత్రం ఒక ఇరవై నిముషాలు పాటు సినిమా లెంగ్త్ ను తగ్గించాలకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ ఇరవై నిముషాల కటింగ్ లో చరణ్ పార్ట్ నే ఎక్కువ ఉంటుందట. ఎన్టీఆర్ సీన్స్ అన్ని అద్భుతంగా వచ్చాయని, దాంతో ఎన్టీఆర్ సీన్స్ తీసేయడానికి జక్కన్న ఇష్టపడట్లేదని.. పైగా ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధం కారణంగా కూడా రాజమౌళి ఎన్టీఆర్ సీన్స్ ను టచ్ చేయట్లేదనేది తాజాగా వినిపిస్తోన్న గాసిప్.

Also Read: పూజా హెగ్డే డబుల్ రోల్ అట !

మొదటి నుండి ఎన్టీఆర్ ని సినిమాలో బాగా హైలైట్ అయ్యేలా రాజమౌళి చూసుకుంటున్నాడని.. అందులో భాగంగానే ఇప్పుడు తప్పనిసరి పరిస్తతుల్లో అంటూ చరణ్ కి చెప్పి.. చరణ్ సీన్స్ లో కొన్ని సీన్స్ ను కట్ చేయనున్నారు. అలా చేస్తే.. చరణ్ పాత్ర సినిమాలో ప్రేక్షక పాత్రగా మిగిలిపోతుందా అనే భయంతో టెన్సన్ పడుతున్నారు ఈ విషయం తెలిసిన మెగా సన్నిహితులు. మొత్తానికి ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానం, చరణ్ హీరోయిజాన్ని తగ్గించబోతుంది అన్నమాట. మరి చివరికి రాజమౌళి ఏమి చేస్తాడో… అన్నట్టు ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన ఇద్దరూ హీరోయిన్స్ కూడా రాజమౌళి తీసుకున్నారు. ఇప్పటికే మొదటి హీరోయిన్ గా విదేశీ భామను ఫైనల్ చేసి.. ఇక రెండో హీరోయిన్ గా ఓ బాలీవుడ్ భామను తీసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: చంద్రబాబు, వైఎస్‌ఆర్ స్నేహం+వైరం= ఇంద్రప్రస్థం

సినిమాలో ఓ గిరిజన యువతి ఎన్టీఆర్ పాత్రను ప్రేమిస్తోందని.. ఆ పాత్ర కేవలం గెస్ట్ రోల్ లాంటిదని.. ఆ గెస్ట్ రోల్ లోనే ఓ బాలీవుడ్ హీరోయిన్ నటించబోతుంది. ఈ సినిమాలో ప్రధాన హైలెట్స్ లో ఎన్టీఆర్ డైలాగ్స్ మెయిన్ హైలెట్ గా ఉంటాయట. తెలంగాణ యాసలో ఎన్టీఆర్ పలికే డైలాగ్ లు కొమరం భీం గొప్ప తనాన్ని ధైర్యాన్ని ఎలివేట్ చేస్తోందట.కాగా డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కరోనాతో పోరాడుతున్నారు.

వెనక్కి వెళ్తున్న జలపాతం.. వీడియో వైరల్!

సాధారణంగా జలపాతం ఎక్కడైనా ముందుకు పరుగులు తీస్తుంది. ఎవరైనా జలపాతం వెనక్కు వెళుతుందని చెబితే నవ్వుతారు. కానీ ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో మాత్రం జలపాతం వెనక్కు వెళుతోంది. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఆస్ట్రేలియాలో ఈ విచిత్రం చోటు చేసుకుంది. గత కొన్ని రోజుల నుంచి వరదలు, వర్షాలు ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాల వల్ల అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Also Read: పాపం.. ఈ కాకి ఏం తప్పు చేసింది? తెల్లగా పుట్టడమే దీని తప్ప?

ఈ క్రమంలో సిడ్నీ నగరంలోని జలపాతంలో ఒక అద్భుతం చోటు చేసుకుంది. నగరంలో ఉన్నరెండు జలపాతాల్లోని నీళ్లు వెనక్కు పారాయి. నీళ్లు వెనక్కు పారుతున్న దృశ్యాలను చూసిన నెటిజన్లు గతంలో తాము ఎప్పుడూ ఇలాంటి వింతను చూడలేదని కామెంట్లు చేస్తున్నారు. వెనక్కు వెళుతున్న జలపాతాల వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. కొందరు నెటిజన్లు ఈ జలపాతాలలా కాలం కూడా వెనక్కు వెళితే బాగుంటుందని చమత్కరిస్తున్నారు.

Also Read: రైతుల సరికొత్త ఆలోచన.. రేగు పండ్లతో బీర్.. భారీ లాభాలు!

రాయల్ నేషనల్ పార్క్ లోని కొండ చరియ దగ్గర ఉన్న జలపాతాలలో ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. 70 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తుండగా జలపాతాలు రివర్స్ లో పారుతుండటం గమనార్హం. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు, వీడియోలకు వేల సంఖ్యలో లైకులు, కామెంట్లు వస్తున్నాయి. నిపుణులు మాత్రం కొన్ని సందర్భాల్లో వివిధ కారణాల వల్ల జలాపతం పైకి పారుతుందని చెబుతున్నారు.

https://www.facebook.com/watch/?v=2721123021509252

రైతుల సరికొత్త ఆలోచన.. రేగు పండ్లతో బీర్.. భారీ లాభాలు!

మన దేశంలో రోడ్ల పక్కన ఎక్కువగా రేగు పండ్ల చెట్లు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం గంగు రేను పండ్లను ఎక్కువగా పండిస్తూ ఉంటారు. తియ్యగా, పుల్లగా ఉండే ఈ పండ్లను పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇండియా, చైనా దేశాల్లో ఎక్కువగా పండే ఈ పండ్లలో సి విటమిన్ అధికంగా ఉంటుంది. ఈ పండ్లు చైనా, ఇండియా దేశాల నుంచి ఆస్ట్రేలియాకు ఎక్కువగా ఎగుమతి అవుతూ ఉంటాయి.

ఆస్ట్రేలియాలో ఈ పండ్లకు డిమాండ్ అంతకంతకూ పెరిగింది. దీంతో అక్కడి రైతులు సైతం రేగు పండ్ల సాగును మొదలుపెట్టారు. ఈ సంవత్సరం పంట దిగుబడి ఆశాజనకంగా వచ్చింది. అయితే కరోనా, లాక్ డౌన్ వల్ల పంట కొనుగోళ్లు ఎక్కువగా జరగడం లేదు. పండ్లు డ్యామేజ్ అవుతూ ఉండటంతో ఏం చేయాలో రైతులకు అర్థం కాలేదు. కానీ బెన్ అనే రైతు మాత్రం భిన్నంగా ఆలోచించాడు. డ్యామేజ్ అయిన పండ్లను పులియబెట్టి ఆ పండ్లతో బీర్ తయారు చేయాలని భావించాడు.

ఈ ప్రతిపాదనతో రైతు ఒక మద్యం కంపెనీని సంప్రదించగా రేగు పండ్లతో బీరు సాధ్యం కాదని వాళ్లు రైతుకు చెప్పారు. కానీ బెన్ మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలా రుచికరమైన బీరును తయారు చేశాడు. డార్క్ కలర్ లో కనిపిస్తున్న బీరు ఎంతో రుచిగా ఉండటంతో మార్కెట్ లోకి ఈ బీరును రిలీజ్ చేసేందుకు మద్యం కంపెనీలు సిద్ధమవుతున్నాయి. రేగు పండ్ల బీర్ గురించి వార్తలు వైరల్ కావడంతో రేగు పండ్ల పంటకు అక్కడ భారీగా డిమాండ్ పెరిగింది.

ఉదారవాదులా? అవకాశావాదులా?

మూడు రోజుల క్రితం బెంగుళూరు లో జరిగిన సంఘటనలు ఆందోళనకరంగా వున్నాయి. ఆ తర్వాత వస్తున్న ప్రతిస్పందనలు కూడా అంతకన్నా ఆందోళనకరంగా వున్నాయి. మొదటిది ఓ మతాన్ని కించపరిచేవిధంగా సాంఘిక మాధ్యమం లో పోస్టు పెట్టారనే కారణంతో పోలీసు స్టేషన్లు, ఎంఎల్ ఏ ఇల్లు తగలబెట్టటం, ఆస్తులు ధ్వసం చేయటం, ప్రాణ నష్టం జరగటం చూస్తుంటే మనం మధ్యకాలపు సమాజం లో వున్నామా లేక నాగరిక సమాజం లో వున్నామా అనే సందేహం కలగకమానదు. రెండోది దానిపై ప్రతిస్పందన ఇంకా దారుణంగా వుంది. అలా దాడిచేయటాన్ని హేతుబద్దీకరించే విధంగా వుదారవాదాన్ని గుత్తకు తీసుకున్న కొన్ని పార్టీలు, మేధావులు, ఇస్లామిక్ వాదులు మాట్లాడటం దారుణం. ఇటువంటి తరుణంలో రాజకీయాలకన్నా ఇటువంటి ధోరణల్ని అరికట్టటానికి అందరూ ఒకటి కాకుండా ఒకరిమీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవటం చూస్తుంటే అసలు వీళ్ళకు సమాజం మీద , చట్టాలుమీద ఏమైనా గౌరవముందా అని కూడా సందేహం వస్తుంది.

సమస్యని ఎలా పరిశీలించాలి?

భారత సమాజం వివిధ మతాల, కులాల, ప్రాంతాల , సంస్కృతుల సమాహారం. అటువంటప్పుడు ఉద్భవించే సమస్యలు కూడా అలానే వుంటాయి. ఇప్పటికే ఎన్నో సార్లు మత ఘర్షణలతో దేశం అట్టుడికి పోయింది. 21వ శతాబ్దం లోకి ప్రవేశించి ఇప్పటికే రెండు దశాబ్దాలు గడిచిపోయాయి. మతాన్ని సమాజం నుంచి విడదీసినవారు, మత సమస్యలతో సతమతం కాని సమాజం లో నివశించే వారు మిగతా ప్రపంచం కన్నా ముందంజలో వున్నారు. ఉదాహరణకు ప్రాశ్చాత్య దేశాల్లో మతం పాత్ర రోజు రోజుకీ తగ్గుతుంది. పశ్చిమ యూరప్ , అమెరికా, చైనా, దక్షిణ కొరియా, జపాన్ లలో ఏ మతాన్ని నమ్మనివాళ్ళ సంఖ్య గణనీయంగా వుంది. మతాన్ని నమ్మేవాళ్ళు కూడా దాన్నో సాంఘిక సమస్యగా కాకుండా వ్యక్తిగతంగా మతాన్ని ఆచరించటం వరకే పరిమితమయ్యారు. ఒక్క చైనా లో ప్రధాన చైనా కాని జిన్జియాంగ్ , టిబెట్ లలోనే ఇది సమస్యాత్మకంగా వుంది. కానీ ప్రధాన భూభాగం లోని హాన్ జాతీయుల్లో ఇది అసలు సమస్యే కాదు. ఒక్కసారి ఈ దేశాల సామాజిక, ఆర్ధిక పరిస్తితులు పరిశీలిస్తే ఈ దేశాలు , సమాజాలు మిగతా ప్రపంచం కన్నా అభివృద్ధి లో ముందున్నారు. ఇందులో ఒక్క చైనా తప్పించి మిగతా దేశాలన్నీ ప్రజాస్వామ్య దేశాలు. ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థ ని నమ్మేవారు. ఇక్కడ భావ స్వేచ్చ పూర్తిగా వుంది. దాన్నే మనమూ రాజ్యాంగం లో పొందుపరుచుకున్నాము. కానీ ఆచరణ లో పాటించే దానికన్నా ఉల్లంఘించటమే చేస్తుంటాము.

ఉదాహరణకు అమెరికా లో భావ స్వేచ్చ అంటే మీ మనసులోని భావాలు ఎటువంటివైనా వ్యక్తపరిచే హక్కు వుంటుంది. క్రైస్తవ మతస్తులు అత్యధికంగా వున్న ఈ దేశం లో జీసస్ క్రీస్తు పుట్టుక దగ్గర్నుంచి ఎన్నో వివాదాస్పద పుస్తకాలు తన గురించి, క్రైస్తవమతం గురించి ప్రచురిస్తుంటారు. ప్రభుత్వం ఎక్కడా వీటిని నిషేదించిన దాఖలాలు లేవు. అదేవిధంగా మిగతా ఎన్నో వివాదాస్పద విషయాలపై కూడా. కానీ భారత్ లో ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థ ని రాజ్యాంగం లో పొందు పరుచుకున్నా స్వాతంత్రానంతరం నిషేధించిన పుస్తకాలు చాలా వున్నాయి. మత పరంగా చూస్తే ముఖ్యంగా ఇస్లాం మతానికి వ్యతిరేకంగా రాస్తే అవి నిషేధానికి గురయ్యే అవకాశాలు ఎక్కువ. అదే హిందూ మతాన్ని గురించి, హిందూ దేవుళ్ళ గురించి వ్యతిరేకంగా రాస్తే అవి ఎన్నో పునర్ముద్రణలు కూడా జరుగుతాయి. వ్యక్తిగతంగా అటువంటి ఎన్నో పుస్తకాలు నా చిన్నప్పుడు చదివిన అనుభవం వుంది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థ వ్యక్తి అభిప్రాయాన్ని గౌరవిస్తుంది. అటువంటి స్వేచ్చే లేకపోతే హేతువాదం ఎలా అభివృద్ధి చెందింది? చార్వాకుడు భౌతిక వాదాన్ని ఎలా ప్రచారం చేయగలిగాడు?

ఇంకో ఉదాహరణ కూడా ప్రస్తావిస్తాను. ఇరాన్ ఇస్లామిక్ విప్లవం పేరుతో అయతుల్లా ఖోమైనీ షా సామ్రాజ్యాన్ని కూల్చి ఇస్లామిక్ రిపబ్లిక్ ని స్థాపించటం ఎలా సాధ్యమయ్యింది? షా హయాం లో నిర్బంధాలకు లోనైతే యూరప్ వెళ్లి పారిస్ లో కొన్నాళ్ళు వున్నాడు. అది ఎలా సాధ్యమయ్యింది? ఆధునిక ప్రజాస్వామ్య దేశమైన ఫ్రాన్స్ ఆశ్రయమిచ్చింది కాబట్టే. అలా యూరప్ లో తలదాచుకున్న ఇతర దేశాల నాయకులు ఎంతోమంది వున్నారు. కానీ అదే అయతుల్లా ఖోమైనీ అధికారం చేపట్టిన తర్వాత అసమ్మతి వర్గీయుల ను ఏరిపారేసిన సంగతి తెలిసిందే. అంటే అర్ధం మీ రాజకీయ అభిప్రాయాలకు సంబంధం లేకుండా ఆధునిక ప్రజాస్వామ్య దేశం లో ఎవరైనా స్వేచ్చగా జీవించవచ్చు. కానీ దురదృష్టవశాత్తు ఇది నియంతృత్వ దేశాల్లో, ఇస్లామిక్ దేశాల్లో ( అత్యధిక దేశాల్లో , కొన్ని మినహాయింపు), కమ్యునిస్టు దేశాల్లో సాధ్యం కాదు. అక్కడ భావ వ్యక్తీకరణ నిర్బంధం వుంటుంది. ఉదాహరణకు తస్లీమా నస్రీన్ బంగ్లాదేశ్ ( కొంత మెరుగైన హక్కులున్న ఇస్లాం దేశం) నుంచి ప్రాణ భయం తో పారిపోయి ప్రపంచం అంతా తిరిగి భారత్ కి వచ్చి వుంటుంది. టిబెట్ రాజు దలైలామా చైనా కమ్యునిస్టు పరిపాలన కి భయపడి భారత్ కి వచ్చి తలదాచుకున్నాడు. అదే భారత్ లో మీ అభిప్రాయాలు ఎటువంటివైనా నివశించే హక్కు వుంది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలోనే సాధ్యం. కాబట్టి భావ స్వేచ్చనే ఆధునిక ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ. దాన్ని ఎట్టిపరిస్థితుల్లో కాపాడుకోవాల్సిన అవసరం వుంది.

మరి ఇప్పుడు జరిగిందేమిటి?

బెంగుళూరు స్థానిక ఎంఎల్ ఎ మేనల్లుడు పేస్ బుక్ లో ఇస్లాం మతం మీద ఒక పోస్టు పెట్టాడని ( అదేమిటో తెలియదు) మూక హింస కు పాల్పడ్డారు. అతన్ని బెదిరించటం, అతని మామ ఎంఎల్ఎ ఇంటిని తగలపెట్టటం, పోలీసు స్టేషన్ లను తగల పెట్టటం, ఎన్నో ఆస్తులను ధ్వసం చేయటం , ఈ దుర్ఘటనలో కొంతమంది ప్రాణాలు కోల్పోవటం ఎంతోమందికి గాయాలవ్వటం, అందులో పోలీసులే ఎక్కువగా వుండటం జరిగింది. వస్తున్న వార్తల్ని బట్టి ఇదంతా ఓ ప్లాన్ ప్రకారమే జరిగింది. ఉత్తర ప్రదేశ్ ఇమాం ఒకరు పోస్టు పెట్టిన నవీన్ ని చంపితే 51 లక్షల బహుమతి ప్రకటించాడు. అంటే చట్టాన్ని తమ చేతులోకి తీసుకొని శిక్షలు కూడా విధిస్తున్నారు. విశేషమేమంటే ఇస్లాం దేశాల్లో కూడా శిక్షలు చట్ట ప్రకారమే వేస్తున్నారు. కాకపోతే ఆ చట్టాలు దారుణంగా వున్నాయి అదివేరే విషయం. మన పక్కన పాకిస్తాన్ లో గవర్నర్ ని ఇస్లాం దూషణ పేరుతో చంపినా దిక్కులేదు. అది అక్కడున్న సమాజం తలనొప్పి, మనకొద్దు. కానీ మనం ప్రజాస్వామ్య దేశం లో ఉన్నాము. పరిపాలన చట్టప్రకారమే జరగాలి. ఎవరికివారు ఆటవిక రాజ్యం జరపరాదు. చట్టమంటే మనదేశంలో ఎవరికీ భయం లేదు, గౌరవం లేదు. లేకపోతే 51 లక్షల రివార్డ్ ప్రకటించటాన్ని ఏమనాలి? మత దూషణ పోస్టింగ్ ఎంత తప్పో చంపమని ప్రోత్సహించటం కూడా అంతకన్నా పెద్ద తప్పు.

ఇకపోతే ప్రతిస్పందన ఎందుకు దారుణమంటే మూక హింస ను ఖరాఖండిగా ఖండించాల్సింది పోయి సన్నాయి నొక్కులు నొక్కటం దారుణం. పోలీసుల వైఫల్యముందని, పేస్ బుక్ పోస్టు పెట్టటమే దీనికంతటకీ కారణమని మూక హింస ని పరోక్షంగా సమర్ధించటం చూస్తుంటే ఎవరికైనా మతిపోతుంది. మత దూషణలు ఈ రోజు కొత్తేమీ కాదు. నా చిన్నప్పుడు హిందూ మతం పై ఎన్నో సెటైర్లు, విమర్శలు వినటం, చదవటం జరిగేది. అప్పట్లో అన్నింటినీ విని సహించే ఓర్పు వుండేది. ఎంత దాకా అంటే డి కే ఉద్యమం లో పెరియార్ దేవుళ్ళకు చెప్పుల దండలు వేసి ఊరేగించిన చరిత్ర మనది. ఎం ఎఫ్ హుస్సేన్ సరస్వతి దేవి నగ్న చిత్రాలు గీయటం, రంగనాయకమ్మ రామాయణ విషవృక్షం పుస్తకం వ్రాయటం కూడా మన సమాజం లోనే చూసాం. మరి ఆ రచయితలందరికీ మరణశిక్షలు విధించారా? మరి ఒక్క ఇస్లాం మతం విషయం లోనే ఇలా అసహన చర్యలు ఎందుకు జరుగుతున్నాయో ఆలోచించాలి. అంటే వీటిని సమర్దించినట్లు కాదు. అవి ఎవరి మత సెంటిమెంట్ నైనా గాయపరిస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకొనే అవకాశం వుంది. అంతేగాని ఈ మూస హింస పద్దతుల్లో పరిష్కార మార్గాలు వెదుక్కోవటాన్ని ఎటువంటి పరిస్థితుల్లో సహించరాదు.

హేతువాదులు, ఉదారవాదులు ఎక్కడున్నారు?

హిందూ మతం పై, దాని ఆచారాలపై విరుచుకుపడే వీళ్ళు ప్రస్తుతం ఎక్కడ వున్నారు. హేతువాదులు హిందూ మతాన్ని, హిందూ దేవుళ్ళని దూషించినప్పుడు భావ స్వేచ్చని గురించి ఎంతోమంది మేధావులు పుంఖాను పుంఖాలుగా వ్యాసాలూ, ఉపన్యాసాలు దంచేశారు కదా. మరి ఇప్పుడు ఇస్లాం మతంపై పోస్టింగు పెడితే ఇంత హింస, హత్యా బెదిరింపులు చేస్తూ వుంటే ఏం చేస్తున్నారు. ఆరోజు కలబుర్గి, లంకా గౌరేష్ ని హత్య చేయటం ఎంత తప్పో ఇప్పుడు ఇస్లాం మత వ్యతిరేకులపై హత్యా బెదిరింపులు కూడా అంతే తప్పు. హత్యా విధానాలు ఎక్కడ జరిగినా తప్పే. ఆ రోజు ఆ హత్యలపై మాట్లాడిన హేతువాదులు ఈ రోజు ఏమయ్యారు? రామచంద్ర గుహ లాంటి మేధావులు వుండేది బెంగుళూరు లోనే కదా. నిర్ద్వందంగా ఖండించారా? ఎందుకీ ద్వంద ప్రమాణాలు? మనం నిజంగా ఆధునిక ప్రజాస్వామ్యాన్ని నమ్మితే అందరికీ భావ స్వేచ్చ వుందని మరిచిపోవద్దు. మతాన్ని నమ్మే వాళ్లకు ఎంత స్వేచ్చ వుందో, హేతువాదాన్ని నమ్మే వాళ్లకు కూడా అంతే స్వేచ్చ వుంది. ఉదారవాదమంటే ఏమిటి? అన్ని భావాల్ని సమంగా గౌరవించటమే. లేకపోతే మనది పేరుకు ప్రజాస్వామ్యం, ఆచరణలో ఆటవిక రాజ్యమవుతుంది. బెంగుళూరు లో జరిగిన ఘటనలను అరమరికలు లేకుండా ఖండించినప్పుడే మీరు నిజమైన ఉదారవాదులవుతారు. లేకపోతే ఉదారవాద ముసుగులో వున్న హిందూ వ్యతిరేకవాదులుగా మిగిలిపోతారు, గుర్తుంచుకోండి.

అక్కడ ఎన్ 95 మాస్కులు నిషేధం.. కారణం ఏంటంటే?

దేశంలో కరోనా మహమ్మారి అడ్డూఅదుపు లేకుండా శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. మాస్క్ ధరిస్తే మాత్రమే వైరస్ సోకకుండా మనల్ని మనం రక్షించుకునే పరిస్థితి నెలకొంది. ప్రజలు మాస్క్ లకు ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో మార్కెట్లో రకరకాల మాస్క్ లు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే శాస్త్రవేత్తలు, నిపుణులు అన్ని రకాల మాస్క్ లు కరోనా సోకకుండా ఆపలేవని చెబుతున్నారు.

ముఖ్యంగా వాల్వ్ ఉన్న మాస్క్ ల వల్ల అవతలి వ్యక్తులకు కరోనా సోకే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే శాస్త్రవేత్తలు, నిపుణులు హెచ్చరిస్తున్నా ప్రజల ఆలోచనా తీరు మాత్రం మారడం లేదు. కొందరు అవే మాస్కులను నేటికీ వినియోగిస్తున్నారు. దీంతో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మధ్యప్రదేశ్ సర్కార్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వాల్వ్ ఉన్న ఎన్ 95 మాస్క్ లతో పాటు వాల్వ్ ఉన్న ఇతర మాస్క్ లపై కూడా నిషేధం విధించింది.

వాల్వ్ లు ఉన్నవ్ మాస్కుల వల్ల కరోనా మహమ్మారిని కట్టడి చేయడం సాధ్యం కావడం లేదని భావించి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో వాల్వ్ ఉన్న మాస్కులపై నిషేధం విధిస్తూ ఇండోర్ కలెక్టర్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. కేంద్రం గతంలోనే వాల్వ్ లు ఉన్న మాస్కులు ప్రమాదకరం అని అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.

Pawan Kalyan Independence Day Celebrations Photos

Natasha Doshi New Stills