
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాడి వదిలేశారు. కాపుల కొట్లాటలు.. కాపు రాజకీయాల్లో తాను బలికాలేను అంటూ పదవిని త్యజించాడు. తనపై దుష్ప్రచారం చేస్తున్నందుకు మనస్తాపం చెంది ఈ నిర్ణయం తీసుకున్నారు. దానివెనుక ఎవరి ప్రయోజనాలున్నాయో కానీ ఆయన మాత్రం పక్కకు జరిగారు.
Also Read: అప్పటివరకూ అమరావతే ఏపీ రాజధాని…! జగన్ కు దిమ్మతిరిగే షాక్
మరి రెడ్డిలకు జగన్ ఉన్నారు. కమ్మలకు చంద్రబాబు ఉన్నారు. మరి కాపులకు ఎవరున్నారు అనుకుంటుండగానే బీజేపీ ప్రయోగం చేసింది. కాపు నేత ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు బీజేపీ రాష్ట్ర పగ్గాలు అప్పగించింది. కాపుల తరుపున ఆయనకు నాయకత్వం ఇచ్చింది. అయితే సోము వీర్రాజు ఇప్పటిదాకా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసిన దాఖలాలు లేవు. పైగా పార్టీని లీడ్ చేసిన అనుభవం లేదు. సో కొత్తనేతపై బోలెడు ఆశలు బీజేపీలో ఉన్నాయి. ఆయన బీజేపీని బలపేతం చేస్తాడా? అధికారంలోకి తీసుకొస్తాడా అన్నది వేచిచూడాలి.
ఇక వీరే కాదు.. ముద్రగడ వైదొలగడంతో ఖాళీ అయిన కాపు ఉద్యమాన్ని, నాయకత్వాన్ని చేజిక్కించుకోవాలని తాజాగా ఓ నాయకుడు సన్నాహాలు చేస్తున్నారు. ఆయనే పేరు, ప్రఖ్యాతలు.. వారసత్వం ఉండి.. కనుమరుగైన నేత వంగవీటి రాధాకృష్ణ. వంగవీటి రాధాకృష్ణ తండ్రి రంగ ఏపీ రాజకీయాల్లో కాపుల తరుఫున పోరాడిన ఫేమస్ నాయకుడు. ఆయనకు ఇప్పటికీ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. రంగా ఇప్పటికీ బెజవాడలో ఆకర్షనీయమైన అభిమనగణం ఉన్న నాయకుడు. ఇప్పటికీ లక్షలాది మంది రంగాను ఆరాధిస్తారు.
వంగవీటి రాధాకృష్ణ తన తండ్రి రంగా వారసత్వాన్ని పొందారు. పైగా ప్రసిద్ధ తండ్రిని పోలి ఉన్నాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలంలో ఎమ్మెల్యేగా గెలిచి ప్రజా నాయకుడిగా నిరూపించుకున్నారు. 2019 ఎన్నికల వరకు ఉన్నారు.
Also Read: ఎంపీ Vs ఎమ్మెల్యే! మరోసారి వివాదం షురూ..!
అయితే వంగవీటి రాధా చేసిన పెద్ద పొరపాటు 2019 ఎన్నికల ముందు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరడం. టీడీపీలో కూడా ఆయనకు కావలసిన టికెట్ దక్కలేదు. జగన్ వైసీపీ సునామీలో రాధా తుడిచిపెట్టుకుపోయాడు. ప్రస్తుతం టీడీపీలో సైలెంట్ గా ఉంటున్నారు.
వంగవీటి రాధా గురించిన తాజా అప్ డేట్ ఏంటంటే.. అతడు కాపు రాజకీయాలకు వెళ్లాలని యోచిస్తున్నట్టు తెలిసింది. ఇటీవల కాపు ఉద్యమ నాయకత్వం నుంచి వైదొలగిన ముద్రగడ పద్మనాభం స్థానాన్ని స్వాధీనం చేసుకోవడం తనకు సరైనదని ఆయన భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బలిజనాడు నాయకుడు ఏ.ఓ రమణతో తాజాగా కీలక భేటి నిర్వహించారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించినందుకు ఇటీవల ఏఓ రమణను బీజేపీ నుంచి సస్పెండ్ చేశారు. కాబట్టి రమణ, రాధాకృష్ణ ఇద్దరూ కలిసి కాపు రాజకీయాలను మొదలుపెట్టాలని డిసైడ్ అయినట్టు సమాచారం.
కాపు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి పోరాడి.. ఏకం చేసి అధికారంలోకి తీసుకురావాలని ఈ ఇద్దరు నాయకులు భావిస్తున్నారు. కానీ వంగవీటి రాధా నాయకత్వ లోపాలు ఇప్పటికే చాలా బయటపడ్డాయి. వైఎస్ జగన్ పాలనలో కాపులకు చాలా ప్రయోజనాలే కల్పించారు. ఇక తండ్రి రంగా అంత పవర్ ఫుల్ కాదు రాధా. ముద్రగడ అంత నేత కూడా కాదు.. సో కాపు నాయకత్వాన్ని వంగవీటి రాధా నిర్వహించగలరా? లేదా అన్నది కాపుల్లోనూ అనుమానాలకు కారణమవుతోంది. చూడాలి మరీ కాపుల నేతగా వంగవీటి ఎదుగుతాడో లేదో..
-ఎన్నం