
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు దూకుడు చూసి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ‘బ్యాటింగ్’ మొదలుపెట్టాడని ఆ పార్టీలో చెప్పుకుంటున్నారు. బీజేపీ సీనియర్లు, పెద్దలను ఇన్నాళ్లు గౌరవిస్తూ మెతకవైఖరిని అవలంభించిన బండి ఇక జూలు విదిలుస్తున్నాడని అంటున్నారు. తెలంగాణలో తన మార్క్ చూపించడానికి రెడీ అవుతున్నారట.. ఈ క్రమంలోనే ఫైరవీలకు.. సీనియర్లకు చెక్ చెప్పినట్టు తెలుస్తోంది.
Also Read: సెటైర్ : దెబ్బకు హరీష్ రావు పాలు అమ్ముతున్నాడు… కేటీఆర్ ఆ మజాకా?
బండి సంజయ్ అధ్యక్షుడు కాకమునుపు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా డాక్టర్ కె. లక్ష్మణ్ ఉన్నారు. ఆయన కాలంలోనే బీజేపీ తెలంగాణలో నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష్మణ్ ఘోరంగా విఫలమయ్యాడు. ఇప్పుడు ఆయన పదవీకాలం ముగియడంతో బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ పరిణామం తర్వాత రాష్ట్ర బీజేపీలో లక్ష్మణ్ పాత్ర లేదు. ఆయన బీజేపీ నుంచి పూర్తి దూరంగా జరగడం చర్చనీయాంశమవుతోంది.
సాధారణంగా రాష్ట్ర పార్టీ బాధ్యతలు చూసిన వారు తప్పుకుంటే వారిని బీజేపీ జాతీయ పార్టీలోని పదవుల్లోకి తీసుకుంటుంది. కొన్ని సందర్భాల్లో వారిని రాజ్యసభ ఎంపీలుగా కూడా చేస్తారు. లక్ష్మణ్ విషయంలో ఆ రెండూ జరగలేదు. ఆయనను బీజేపీ జాతీయకార్యవర్గంలోకి తీసుకోలేదు. రాజ్యసభ ఎంపీ ఆఫర్ ను కూడా ఇవ్వలేదట.. తెలంగాణ నుంచి ప్రస్తుత బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు రాజ్యసభ రేసులో ఉన్నారు. ఆయన తర్వాతే లక్ష్మణ్ కు ఏదైనా పదవులు దక్కవచ్చు. ప్రస్తుతానికి లక్ష్మణ్ బీజేపీలో ఎలాంటి పదవి లేకుండా మౌనంగానే ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
Also Read: శ్రీశైలంలో ప్రమాదం.. సాగర్ లో అలజడి!
ఇక ఇప్పటికే తీసేసిన అవమానంతో కృంగిపోయిన లక్ష్మణ్.. జాతీయ నాయకత్వం కూడా పట్టించుకోకపోవడంతో బీజేపీ కార్యక్రమాలకు పూర్తి అంటిముట్టనట్టుగా ఉంటున్నాడట.. ఇప్పుడు మరింత అవమానాన్ని కలిగిస్తూ కొత్త అధ్యక్షుడు బండి సంజయ్ తను కొత్తగా ఏర్పాటు చేసిన రాష్ట్ర కార్యవర్గంలో లక్ష్మణ్ సూచించిన పలువురి పేర్లను చేర్చలేదు. ఆయన మద్దతుదారులందరూ బండి సంజయ్ ను కలిసి కోరినా రాష్ట్ర బీజేపీ శాఖలో బండి చేర్చకుండా దూరంగా ఉంచారట. ఈ అవమానాన్ని చూసి లక్ష్మణ్.. పార్టీ అధ్యక్షుడు బండిపై గుర్రుగా ఉన్నాడట..
కేంద్రం పూర్తిగా లక్ష్మణ్ ను పక్కనపెట్టిందని తెలుసుకునే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణలో బ్యాటింగ్ మొదలుపెట్టాడని.. ఆ క్రమంలోనే లక్ష్మణ్ బ్యాచ్ ను చేర్చుకోలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.