
ఇండస్ట్రీలో ఫామ్ లో ఉన్న హీరోకు ఉండే క్రేజ్, దర్శకుడికి గాని, నిర్మాతకు గాని అలాగే మరో ఏ క్రాఫ్ట్ లోని వ్యక్తికి గాని ఉండదనేది వాస్తవం. అందుకే ఏజ్ అయిపోయినా ఇంకా హీరోగానే కొనసాగడానికి డా. రాజశేఖర్ లాంటి వాళ్ళు కిందామీదా పడుతూ ఉంటారు. నిజానికి రాజశేఖర్ హీరోగా ఆ మధ్య వచ్చిన ‘గరుడవేగ’ సినిమా మంచి హిట్ అయింది. ఆ హిట్ తో సహజంగానే రాజశేఖర్ కి డిమాండ్ పెరిగింది. కానీ, తనకున్న డిమాండ్ ను నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అయ్యాడు రాజశేఖర్. కల్కి అంటూ తెలుగు ప్రేక్షుకులకు తన హీరోయిజాన్ని చూపించే ప్రయత్నం చేసి, బోల్తా పడ్డాడు. దాంతో రాజశేఖర్ కి వచ్చిన డిమాండ్ కాస్త తగ్గిపోయింది.
Also Read: ఆ నలుగురినీ కాదని త్రివిక్రమ్‌కే వెంకీ ఓటు!
మొత్తానికి తనకు థియేటర్ మార్కెట్ లేదని గ్రహించిన రాజశేఖర్, ఇప్పుడు ఓటిటి ల కేసి చూస్తున్నాడు. అసలు ఆన్ లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్ లో ఎంత వస్తోంది.. మన సినిమాకి వాళ్ళ దగ్గర ఎంత డిమాండ్ ఉంటుంది అని లెక్కలు అడుగుతున్నాడట జీ5 ఓటీటీకి సంబంధించిన నిమ్మకాయల ప్రసాద్ అనే అతన్ని. తనకు ఎంత మార్కెట్ ఉందో తెలిస్తే ఆ బడ్జెట్ లో సినిమా చేసి, ఓటీటీలకు అమ్ముకుందామనే ఆలోచనలో రాజశేఖర్ ఉన్నాడట. ఎంత లేదన్నా రాజశేఖర్ ఒకప్పుడు హిట్లు ఉన్న హీరో. అందుకే ఇప్పటికి ఆయనకు కాస్త డిమాండ్ ఉంది. రెండు, మూడు కోట్ల రేంజ్ లో సినిమా చేసి.. ఐదారు కోట్లకు ఈజీగా ఓటీటీలకు అమ్ముకోవచ్చు.
Also Read: కేజీఎఫ్ లాంటి క్రేజీ యాక్షన్ డ్రామాలో చరణ్ !
ప్రస్తుతం బ్యాడ్ ఫేజ్ లో వున్న రాజశేఖర్ కి, ఈ ఓటీటీ వర్కౌట్ అయ్యేదే. పైగా తన తరువాత సినిమాలను కూడా వీలయినంత తక్కువ బడ్జెట్ లో తీసి క్యాష్ చేసుకునే వెసులుబాటు రాజశేఖర్ కి ఉంది. ఇక ప్రస్తుతం రాజశేఖర్ ‘పూలరంగడు, అహన పెళ్ళంట’ చిత్రాల డైరెక్టర్ వీరభద్రం చౌదరి దర్శకత్వంలో సరికొత్త తరహా కథాంశంతో ఓ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలో నటిస్తున్నాడు.