
ఒకప్పుడు హిట్ సినిమా తీసిన దర్శకులు తక్కువుగా ఉండేవారు, దానికి తోడు ఏ దర్శకుడు సినిమా చేయాలన్నా.. ముందుగా కావాల్సిన కథను.. తానే రైటర్స్ చేత ప్రత్యేకంగా రాయించుకునే వాడు. అలా గతంలో వేరే వాళ్ల కథలతో సినిమాలు చేసేవారు ముందుతరం దర్శకులు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఎవరు మంచి కథ తెచ్చుకుంటే.. వాళ్లే దర్శకులుగా మారుతున్నారు. అలా దర్శకులుగా మారినవాళ్లు, మళ్ళీ మరో కథ రాయడానికి చాలా టైం తీసుకుంటున్నారు. పోనీ, ఆ రాసిన కథ అయినా ఏ హీరోకైనా నచ్చాలి.. లేదంటే ఇక మళ్ళీ ఆ దర్శకుడికి ఛాన్స్ రావట్లేదు.
Also Read: ఆ నలుగురినీ కాదని త్రివిక్రమ్‌కే వెంకీ ఓటు!
అందుకే ఎందుకొచ్చిన రిస్క్ అనుకుంటున్నారేమో మన దర్శకులు. మొత్తానికి రీమేక్ అయితే, రిస్క్ తక్కువ అనుకుంటున్నారు. పెద్దగా క్రియేటివిటీ కూడా అక్కర్లేదు. మార్పులు చేర్పులు సంగతి ఎలా వున్నా, సీన్ టు సీన్ హ్యాపీగా దింపేయచ్చు. దానికంటే ముందు ఓ సినిమా డైరక్ట్ చేసే చాన్స్ వచ్చేస్తుంది. అందుకే సినిమాలు చేతిలో లేక ఖాళీగా వున్న చాలా మంది డైరక్టర్లు ఇప్పుడు రీమేక్ ల మీద పడ్డారు. పక్క భాషలో బాగున్న సినిమాని చూసుకుని.. ఆ రీమేక్ చేద్దాం అంటూ నిర్మాతల వెంట పడుతున్నారు.
Also Read: కేజీఎఫ్ లాంటి క్రేజీ యాక్షన్ డ్రామాలో చరణ్ !
ఇప్పటికే పక్క భాషా చిత్రాల రైట్స్ కొంతమంది నిర్మాతలు కొని పెట్టుకున్నారు. దాంతో అలాంటి నిర్మాతలకు ఫోన్ చేసి ఈ దర్శకులంతా, మీరు ఫలానా బాషలోని సినిమా రీమేక్ రైట్స్ కొన్నారట కదా? ఆ సినిమా నేను డైరక్ట్ చేస్తాను.. కథ నాకు పర్సనల్ గా బాగా నచ్చింది అంటూ ఛాన్స్ లు అడుగుతున్నారు. ఈ లిస్ట్ లో చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు. అయినా తాను కొన్న సినిమాని ఏ డైరెక్టర్ తో చేయాలనే క్లారిటీ లేకుండా ఏ నిర్మాత సినిమాని కొనడు కదా. మరి ఆ విషయం ఈ దర్శకులకు ఎందుకు అర్ధం కాదో !