Home Blog Page 8351

‘ఆచార్య’ మోషన్ పోస్టర్ పై వివాదం


మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబోలో ‘ఆచార్య’ చిత్రం రానుంది. ఈ మూవీ ఇప్పటికే దాదాపు 40శాతం షూటింగు పూర్తి చేసుకుంది. కరోనా వల్ల ఈ సినిమా షూటింగు నిలిచిపోయింది. త్వరలోనే ‘ఆచార్య’ను పట్టాలెక్కించేందుకు దర్శకుడు కోరటాల శివ సన్నహాలు చేస్తున్నారు. అయితే తాజాగా ‘ఆచార్య’పై ఓ వివాదం చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Also Read: సుశాంత్ ను చంపి ఉరితీశారా? సీబీఐ విచారణలో కొత్త కోణం?

చిరంజీవి 65వ పుట్టిన రోజు సందర్భంగా ‘ఆచార్య’ చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఆచార్య ఫస్టు లుక్, మోషన్ పోస్టర్ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. అయితే ఈ మోషన్ పోస్టర్ చూపించిన ధర్మస్థలి సన్నివేశం తన కథ నుంచి కాపీ చేశారని రచయిత అనిల్ కృష్ణ ఆరోపిస్తున్నారు.

2006లో పుణ్యభూమి అనే టైటిల్‌తో పేరుతో తాను ఓ కథను రచయితల సంఘంలో రిజిస్ట్రేషన్ చేయించున్నట్లు తెలిపాడు. ఆచార్య మోషన్ పోస్టర్‌లో చూపిన ధర్మస్థలి సన్నివేశం తన కథలోని దేనని అనిల్ కృష్ణ ఆరోపిస్తున్నాడు. దీంతో ఆచార్య మూవీ కాపీ కథేనా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. దీనిపై దర్శకుడు కోరటాల శివ ఎలా స్పందిస్తాడో అనేది ఆసక్తికరంగా మారింది.

Also Read: రానా ‘హిరణ్య కశ్యప’లో అల్లు అర్జున్‌?

ఇక ఈ సినిమాలో చిరంజీవితోపాటు మెగాపవర్ స్టార్ రాంచరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. చిరంజీవికి జోడీగా కాజల్ ఆగర్వాల్ నటిస్తుండగా ఓ స్పెషల్ సాంగులో రెజీనా ఆడిపాడింది. మ్యూజికల్ బ్రహ్మ మణిశర్మ చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి మూవీకి అదిరిపోయే సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఒకరి తర్వాత ఒకరు భలే తగులుకున్నారు… ఆర్కే కి ఊపిరి ఆడుతోందా?

0

ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎం.డి వేమూరి రాధాకృష్ణ ఇటీవల కాలంలో బిజెపి నుండి అనేక చావుదెబ్బలు తింటున్నారు. అటువైపు టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయంగా భూస్థాపితం అవుతున్నా…. ఆయన పరమ భక్తుడు ఆర్కేకు మాత్రం ఆ పార్టీ పై, ఆ పార్టీ అధినాయకుడి పై భక్తి చావలేదు. దీంతో తన వారాంతపు పలుకులో పొంతనలేని వ్యాఖ్యలు చేస్తూ అభాసు పాలు అవుతున్నారు.

Also Read : జగన్ మరో సంచలనం.. అంతా షేక్ అవుతున్నారా?

గత ఆదివారం రాసిన కొత్తపలుకు వ్యాసం చాలా వివాదాస్పదమైన విషయం తెలిసిందే.మీ జీవితం మీ ఇష్టం అంటూ బీజేపీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తున్నారని తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఆర్కె అక్షర విన్యాసం చేశారు. అయితే వెంటనే సోము వీర్రాజు ఆర్కే కు సరైన రీతిలో బుద్ధి చెప్పడం జరిగింది. జీవీఎల్ పై ఆర్కే చేసిన కామెంట్లకు వీర్రాజు రిప్లై ఇస్తూ గతంలో అడ్డగోలుగా మోడీని అతని కుటుంబాన్ని, బీజెపీ ని టార్గెట్ చేసిన మీకు ఒక్కసారిగా మా పార్టీ పై ఇంత ప్రేమ పుట్టిందని… ఆంధ్రప్రదేశ్లో మేము ఎదగడం లేదని మీరు ఇంతలా బాధ పడుతున్నారని మీ విశ్లేషణ ద్వారా తెలిసింది. చంద్రబాబు గారిని రక్షించే ప్రయత్నాలు మీరు మానుకోకపోతే కష్టమని…. ఇంత నిర్లజ్జగా పత్రికను అడ్డం పెట్టుకొని మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మీకు తగునా? అంటూ బహిరంగంగానే ఒక ఉత్తరం రాసి… ఆర్కె వీపు విమానం మోత మోగించారు

ఇక వీర్రాజు నుండి స్ఫూర్తి తీసుకున్నారో ఏమో జివిఎల్ కూడా మీడియాతో మాట్లాడుతూ పరోక్షంగా.. ఆర్కేకు ఎక్కడ తగలాలో అక్కడ తగలాల్సిన మాటలు మాట్లాడారు. కేంద్రంలో కాంగ్రెస్ తరహాలోనే టిడిపి కూడా ఉంది. ఏపీలో టీడీపీ కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బిజెపి ప్రజల అభిమానం చూరగొని అధికారంలోకి వస్తుందన్న నమ్మకం నాకుంది. తెలుగు దేశం పార్టీని అభిమానించే పత్రిక అధినేత ఉన్నారు. కాంగ్రెస్ టిడిపిలను కూడా “మీ రాహుల్ మీ ఇష్టం…. మీ లోకేష్ మీ ఇష్టం” అని అంటారో లేదో చూడాలి అంటూ చణుకులు విసిరారు.

Also Read : అమరావతి విషయంలో బాబు వ్యూహం…. మొదటికే మోసం?

ఇటీవల కాలంలో వీర్రాజు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత ఎల్లో మీడియా వారి పార్టీని ఒక మాట అనాలంటేనే భయపడి చస్తుంది. ఇన్ని రోజులు బిజెపిని ప్రజల్లో ఏపీ బిజెపి ని అభాసుపాలు చేసేందుకు తన వంతు ప్రయత్నం చేసిన ఎల్లోమీడియా డ్రామాలకు చెక్ పెట్టాలా సోము వీర్రాజు నాయకత్వంలో ఏపీ బీజేపీ పావులు కదుపుతోంది. ఏబిఎన్ ఆర్కే కి ఈ విషయాలన్నీ మింగుడుపడుతున్నాయా…?

ఉలిక్కి పడిన నగరం.. జంట పేలుళ్లకు నేటికి 13ఏళ్లు


ప్రశాంతంగా ఉండే హైదరాబాద్ నగరం వరుస బాంబు పేలుళ్లతో ఉలిక్కిపడింది. 2007 ఆగస్టు 25న సాయంత్రం హైదరాబాద్ మహానగరం బాంబుపేలుళ్లతో దద్దరిల్లింది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కొద్దినిమిషాల వ్యవధిల్లోనే నగరంలో వరుస బాంబు పేలుళ్లతో నగరమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడిపోయింది. ఈ సంఘటనలో 42మంది మృత్యువాతపడగా వందలాది మంది క్షతగాత్రులుగా మారారు.

Also Read: అపెక్స్ కౌన్సిల్ లో కేసీఆర్ టార్గెట్ ఇదే…!

ఈ సంఘటన జరిగి 13ఏళ్లు కావస్తున్నా నేటికి నగరానికి ఈ విషాద ఘటన మానని గాయంగా కన్పిస్తోంది. జంట పేలుళ్ల ఘటన గుర్తు చేసుకుంటేనే నగరవాసుల గుండెల్లో నేటికీ వణుకుపుడుతోంది. 2007 ఆగస్టు 25 సాయంత్రం 7.15 నిమిషాలకు నగరంలోని లుంబీని పార్క్‌లో తొలి బాంబు పేలింది. ఆ తర్వాత కొద్ది క్షణాల్లోనే కోఠిలోని గోకుల్ చాట్‌లో మరో బాంబు పేలింది. లుంబినీపార్క్ పేలుడులో తొమ్మిది మంది, గోకుల్ చాట్ వ‌ద్ద 33మంది మృత్యువాతపడగా వంద‌లాది మంది గాయ‌ప‌డ్డారు. క్షతగాత్రుల రోధనలతో ఆప్రాంతమంతా భీతిల్లిపోయింది.

Also Read: బండిగారు… స్పీడ్ తగ్గించండి!

వెంటనే పోలీసులు రంగంలోకి దిగి నగరంలోని రద్దీ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. 19బాంబులను బాంబ్ స్క్వాడ్ బృందం గుర్తించి నిర్వీరం చేసింది. జంట పేలుళ్ల వెనుక ఇండియన్ ముజాహిదీన్ సంస్థ హస్తం ఉన్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. మక్కా పేలుళ్ల అనంత‌రం పోలీసుల కాల్పులకు ప్రతీకారంగా నిందితులు పేలుళ్లు జరిపినట్టు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ఏ-1 గా ఉన్న హానిక్ షఫిక్ సయ్యద్, ఏ-2 మహమ్మద్ ఇస్మాయిల్ చౌదరి లను దోషులుగా తేల్చి ఎన్ఐఏ కోర్టు శిక్ష ఖరారు చేసింది. నేటికి తీర్పు అమలు కాకపోవడం శోచనీయంగా మారింది. కాగా నాటి భయంకర పరిస్థితులు నేటికి నగరానికి మాననిగాయంగా కన్పిస్తోంది.

సోనియా కి అధ్యక్ష పదవి రావడం వెనుక ఇంత రాజకీయం జరిగిందా..? పాపం రాహుల్….

0

దేశంలో ప్రస్తుతం నడుస్తున్న హార్ట్ ట్రెండింగ్ టాపిక్ సోనియా మళ్లీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వ బాధ్యతలను స్వీకరించడమే. కాంగ్రెస్ లో నాయకత్వ మార్పు విషయంలో నెలకొన్న అంతర్గత సంక్షోభం తారస్థాయికి చేరింది. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టేందుకు సముఖంగా లేరని నిన్నటితో తేటతెల్లమైంది. అయితే లోపల మాత్రం చాలా విషయం జరిగిందని అందుకు భిన్నమైన కథనాలు వినిపిస్తున్నాయి.

Also Read : అమరావతి విషయంలో బాబు వ్యూహం…. మొదటికే మోసం?

2019 ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ పార్టీ నాయకత్వ బాధ్యతలను వదులుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో సోనియా పార్టీ పగ్గాలు చేపట్టారు. ఆమె ఆరోగ్యం బాగా లేకపోవడంతో ప్రియాంక గాంధీ కూడా గాంధీ కుటుంబం నుండే కాకుండా ఇతర నేతలకు పార్టీ పగ్గాలు అప్పగించడం పై తాము సానుకూలంగా ఉన్నామని ప్రకటించేసింది.

అయితే ఇదంతా నాణానికి ఒక వైపు. మరొక వైపుకి వస్తే…. రాహుల్ కు పార్టీ పగ్గాలు అప్పగించే విషయంలో పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. పార్టీ ప్రక్షాళన అవసరం అని పేర్కొంటూ…. రాహుల్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ పార్టీలో 23 మంది సీనియర్ నేతలు అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాయడంపై సోమవారం నాటి సిడబ్ల్యుసి సమావేశంలో హాట్ హాట్ చర్చ జరిగింది. ఒకవైపు తన అధ్యక్ష పదవిని వద్దంటున్నారు…. తన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ లేఖ రాశారు కానీ వారు మాత్రం అధ్యక్ష పదవిని చేపట్టేందుకు సిద్ధంగా లేరు. ఇదే రాహుల్ గాంధీని తీవ్రమైన మండిపాటుకి గురిచేసింది.

ఒకపక్క మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాజకీయాలు  క్లిష్టతరంగా  ఉన్న సందర్భంలో సోనియా ఆరోగ్యం కూడా బాగా లేని పరిస్థితుల్లో అసలు సీనియర్లు ఆమెకు లేఖ రాయాల్సిన అవసరం ఏముందని రాహుల్ నిలదీశారు. అసమ్మతి సభ్యులు బిజెపితో చేతులు కలిపారని.. అతి తీవ్రమైన వ్యాఖ్యలు చేసారట. పార్టీ తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో ఇలాంటి రాజకీయాలు చేయడం భావ్యమా అని ప్రశ్నించాడట. దీంతో ఒక్కసారిగా సమావేశంలో కలకలం రేగింది.

Also Read : గెలుపు కోసం మోదీ నే నమ్ముకున్న ట్రంప్

సీనియర్ నేతలు కపిల్ సిబాల్, గులాం నబీ ఆజాద్ రాహుల్ కి సమాధానం ఇచ్చారు. “ఇక మీరు ఆరోపించినట్లు ఒకవేళ నేను బీజేపీ ఏజెంట్ అని నిరూపించబడితే ఇప్పుడే రాజీనామా చేసి బయటకు వెళ్లి పోతాను” అని ఆజాద్ రాహుల్ గాంధీతో పేర్కొనడం గమనార్హం. తాము లేఖ రాయడానికి సీడబ్ల్యూసీ సభ్యుల వ్యవహార శైలి కారణమని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఎంతైనా కానీ వారు తమ నిజాయితీని విశ్వసనీయతను చాటుకునే అవకాశం రాహుల్ ఇస్తారా లేదా అన్న సంగతి పక్కన పెడితే…. సోనియాగాంధీ వేరే గత్యంతరం లేక తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ నాయకత్వ పగ్గాలను అందుకున్నారని అర్థమవుతోంది.

నిరుద్యోగ యువతకు జగన్ గుడ్ న్యూస్


ఇప్పుడు కరోనా వైరస్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ఇప్పుడు అందరు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా నిరుద్యోగ సమస్యనే. ఎందుకంటే ఈ కరోనాతో కోట్ల మంది ఉద్యోగాలు పోయాయి. అందరూ ఇంటికే వచ్చి ఉపాధి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ఉద్యోగాల కల్పన మృగ్యం అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఏపీలోని నిరుద్యోగుల పాలిట వరంగా మారారు సీఎం జగన్.

Also Read: జగన్ మరో సంచలనం.. అంతా షేక్ అవుతున్నారా?

ఎక్కడ ఎలా ఉపాధి సృష్టించవచ్చో సీఎం జగన్ కు తెలిసినంతగా మరెవరికీ తెలియదని అంటుంటారు. అప్పట్లో 1080 అంబులెన్స్ సర్వీసులు ప్రవేశ పెట్టి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిన జగన్.. ఇప్పుడు మరోసారి కొత్త ఉపాధి అవకాశాలు సృష్టించి మరీ నిరుద్యోగులకు ఉపాధి చూపించారు. సీఎం జగన్ చొరవకు ప్రశంసలు కురుస్తున్నాయి.

మొన్నటి కేబినెట్ భేటిలో లబ్ధిదారులకు ఇంటికే బియ్యాన్ని సరఫరా చేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఆ దిశగా చర్యలు చేపట్టింది. నిరుద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. వారి కోసం ఏకంగా 9260 వాహనాలను కొని ఇచ్చేందుకు సిద్ధం చేసింది.

ఏపీ ప్రభుత్వం నాణ్యమైన బియ్యాన్ని లబ్ధిదారులకు ఇంటికే చేరవేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆర్థిక భారం తగ్గించే దిశగా ప్రభుత్వం తరుఫున 9260 వాహనాలను ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాటి ద్వారా నిరుద్యోగ యువతకు వాహనాలు ఇచ్చి ఇంటింటికి బియ్యం సరఫరా చేసే ఉద్యోగాలను కట్టబెడుతోంది.

స్వయం ఉపాధి పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ, ఈబీసీ నిరుద్యోగులకు ఈ ఉద్యోగాల్లో అవకాశం ఇవ్వనున్నట్టు చెబుతున్నారు. ఇక ఈ వాహనాలు కొనుగోలుకు 60శాతం సబ్సిడీ, 30శాతం లోన్ గా సర్కార్ అందించనుంది. ఇక మిగిలిన పదిశాతం డబ్బు చెల్లించి యువత వాహనం సొంత చేసుకోవచ్చు.

Also Read: అమరావతి విషయంలో బాబు వ్యూహం…. మొదటికే మోసం?

ఇక ఈ లోన్ తిరిగి చెల్లించేందుకు సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ హామీ ఇచ్చేట్టు ఉత్తర్వులు జారీ చేశారు. లబ్ధిదారుల పేరుతోనే వాహనం రిజిస్ట్రేషన్ అవుతుంది. వాహనాల సబ్సిడీ కోసం 331 కోట్లు లోన్ తీసుకునేందుకు సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ కు అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ ఖర్చులతో కలిపి బియ్యం డోర్ డెలివరీకి ప్రతీ ఏడాది 776.45 కోట్ల రూపాయలు అదనపు నిధులు మంజూరు చేశారు.

ఇలా లబ్ధిదారులకే వాహనం కొనిచ్చి.. అది ప్రభుత్వమే భరించి వారికి ఉపాధిని కల్పిస్తూ సీఎం జగన్ నిరుద్యోగుల పాలిట ఆశాకిరణంలా మారారు. లేనిచోట కూడా కొత్త ఉద్యోగాలు సృష్టించిన సీఎం జగన్ కు నిరుద్యోగులు నీరాజనం పలుకుతున్నారు. పాలాభిషేకాలతో ఏపీ వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సుశాంత్ ను చంపి ఉరితీశారా? సీబీఐ విచారణలో కొత్త కోణం?


బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం వెనుక ఏదో దాస్తున్నారనే అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి. ముంబై పోలీసులు రెండు నెలలుగా విచారణ జరిపి తేల్చింది ఏమీ లేదు. కానీ సుశాంత్ నివాసం ఉండే సీసీ టీవీ ఫుటేజ్ ఇమేజ్ లను కూడా సంపాదించలేదు. అనుమానితులను కనిపెట్టలేదు. సుశాంత్ మృతి వెనుక బాలీవుడ్ సినీ మాఫియా ఉందనే అనుమానులున్నాయి.

Also Read: ప్రభాస్‌ మూవీలో నిధి అగర్వాల్‌కు గోల్డెన్‌ చాన్స్!

ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు పకడ్బందీగా విచారణ జరుపుతున్నారు. కీలక విషయాలను ఆరాతీస్తున్నారు. బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో సీబీఐ ఆరు బృందాలుగా విడిపోయి పలు కోణాల్లో విస్తృతంగా విచారణ జరుపుతోంది.ఈ విచారణలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా బాంద్రాలోని నివాసంలో సుశాంత్ డెత్ సీన్ ను రీక్రియేట్ చేశారు.

ఈ విచారణలో సుశాంత్ చనిపోయిన జూన్ 14న ఏం జరిగిందనే దానిపై సుశాంత్ హౌస్ కీపర్ నీరజ్ సింగ్ వాంగ్మూలం సేకరించారు.‘సుశాంత్ ఉదయం 8 గంటలకు గది నుంచి బయటకు వచ్చి నీరు అడుగగా తాను తీసుకెళ్లి ఇచ్చానని.. ఆ తర్వాత నవ్వుతూ తన గదిలోకి వెళ్లారని’ నీరజ్ సింగ్ తెలిపారు. ఆ తరువాత ఉదయం 9.30 గంటలకు తనను అరటిపండ్లు, కొబ్బరి నీళ్లు, జ్యూస్ తీసుకొని రమ్మని సార్ గదిలోకి వెళ్లారని.. తాను తీసుకురాగా కేవలం కొబ్బరినీళ్లు మాత్రమే సుశాంత్ తాగాడని నీరజ్ సింగ్ వాంగ్మూలంలో తెలిపాడు. ఆ తర్వాత ఉదయం 10.30 గంటలకు గదిలోకి వెళ్లి లాక్ వేసుకున్నాడని.. పిలిచినా స్పందన లేదని వివరించాడు. ఈ విషయాన్ని కిందనున్న దీపేష్, సిద్ధార్త్ లకు చెప్పగా వారు వచ్చి డోర్ కొట్టినా స్పందన రాలేదు. సుశాంత్ ఫోన్ కు కాల్ చేసినా స్పందన రాలేదు.

ఆ తర్వాత సుశాంత్ సోదరి మీతు దీదికి ఫోన్ చేసి చెప్పామని.. ఆమె గది తలుపులు తెరవమని మాకు చెప్పారని నీరజ్ వివరించారు. ఒక తాళం తీసే వ్యక్తిని తీసుకొచ్చి ప్రయత్నించి విఫలమయ్యారని.. ఆ తర్వాత తామంతా తలుపులు పగులకొట్టి గదిలోకి ప్రవేశించామని.. సుశాంత్ సోదరి వచ్చారని.. ఫ్యాన్ కు వేలాడుతూ సుశాంత్ కనిపించాడని నీరజ్ సింగ్ వివరించాడు.. పోలీసులను పిలిపించామని తెలిపారు.

Also Read: ఆర్జీవీకి షాక్‌.. ‘మర్డర్’ రిలీజ్‌కు కోర్టు బ్రేక్

సుశాంత్ డెత్ సీన్ క్రియేషన్ తర్వాత అతడి పడకకు సీలింగ్ కు ఉన్న ఫ్యాన్ మధ్య దూరాన్ని సీబీఐ అధికారులు అంచనావేసి అనుమానం వ్యక్తం చేశారు. ఎందుకంటే సుశాంత్ దేహానికి పైన, కింద ఉన్న బెడ్ మధ్య ఉన్న పొడవుపై అనుమానించారు. ఎందుకంటే సుశాంత్ పొడవుపై అనుమానాలు వచ్చాయి. సుశాంత్ 6 ఫీట్లు హైట్ అని రాశారు. కానీ సుశాంత్ పోస్ట్ మార్టంలో అతడి హైట్ కేవలం 5.10 ఫీట్లు అని తేలింది. ఈ క్రమంలోనే సీలింగ్ ఫ్యాన్ కింద బెడ్ కు మధ్య దూరం ఎక్కువగా ఉండడంతో సీబీఐ అధికారులు ఇది హత్యనా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే సుశాంత్ ఉరివేసుకున్నాడా? లేదా అపస్మారక స్థితిలోకి జారుకున్న తర్వాత ఎవరైనా ఫ్యానుకు ఉరివేశారా అన్న కోణంలో సీబీఐ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.

గెలుపు కోసం మోదీ నే నమ్ముకున్న ట్రంప్

అగ్రరాజ్యం అమెరికాలో ప్రస్తుతం ఎన్నికల సందడి మొదలైంది. ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు ట్రంప్ ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్నాడు. అతని గెలవడం చాలా కీలకం. కరోనా వైరస్ నేపథ్యంతో పాటు అతని సొంత తప్పిదాలతో ఇప్పటికే అమెరికా మొత్తం విపరీతమైన నెగటివిటీని మూటగట్టుకున్నాడు. దీంతో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో కొత్త కొత్త ఎత్తుగడలతో ముందుకు వెళ్తున్నాడు. గత ఎన్నికల్లో స్థానిక అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో విజయం సాధించిన ట్రంప్… ఈసారి మాత్రం భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇమేజ్ ను నమ్ముకున్నాడు.

Also Read : జగన్ మరో సంచలనం.. అంతా షేక్ అవుతున్నారా?

విషయం ఏమిటంటే…. ప్రవాస భారతీయుల సంఖ్య అమెరికాలో చాలా అసాధారణంగా ఉంటుంది. వారు ఏకంగా అమెరికా దేశ అధ్యక్షుడి పదవిని ప్రభావితం చేయగల సమర్ధత కలిగిన వారు. ఇక ఇలాంటి సమయంలో ఎన్నికల ప్రకటనల లో నమస్తే ట్రంప్ హౌడీ మోదీ వీడియోలను ఆయన వాడుకున్నారు. అయితే మరోసారి విజయం సాధించడం అంత ఈజీ కాదు అన్న విషయం కూడా తెలుసు. ప్రస్తుతం ఉన్న సర్వేల ప్రకారం ట్రంప్ మళ్లీ అధికారం చేపట్టడం అనేది అసాధ్యం అంటున్నారు.

ఇకపోతే ప్రత్యర్ధి పార్టీ నుండి ఉపాధ్యక్ష పదవికి ఎంతో వ్యూహాత్మకంగా భారత సంతతికి చెందిన కమలా హరిస్ ను బరిలోకి దిగడంతో…. ప్రవాస భారతీయుల మద్దతు కోసం నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పట్లో మోదీ అమెరికా పర్యటనకు వెళ్లారు…. దాని తర్వాత ట్రంప్ అప్పుడు ఏర్పాటుచేసిన సమావేశంలో కూడా పాల్గొన్నారు. ఈ ఏడాది ట్రంప్ భారత్ కి వచ్చినప్పుడు మోడీ అహ్మదాబాద్లో పెద్ద మీట్ ఏర్పాటు చేయగా ఇద్దరు ఎంతో సాన్నిహిత్యం గా కనిపించారు. ఒకరినొకరు మెచ్చుకుంటూ మాటలు కూడా మాట్లాడారు. దీన్ని మొత్తం కలిపి ఎన్నికల ప్రచారం కోషం చక్కటి వీడియో తయారు చేసింది ట్రంప్ టీమ్. ఇది చూస్తే ప్రవాస భారతీయులు కచ్చితంగా తనకు ఓటు వేస్తారన్న బలమైన నమ్మకం ట్రంప్ ది.

Also Read : అమెరికా ఎన్నికల్లో డెమోక్రాట్లు గెలుస్తారా?

ఇక ఇదంతా పక్కన పెడితే ‘అమెరికా లవ్స్ ఇండియా అమెరికా రెస్పెక్ట్ ఇండియా’ అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను వీడియోలో జతపరిచి బ్రహ్మాండమైన యాడ్ ను ఎన్నికల బృందం తయారు చేశారు. మొత్తంగా ప్రవాస భారతీయుల ఓట్ల కోసం తెగ కష్టపడుతున్న ట్రంప్ కు అది ఏమేరకు సక్సెస్ అవుతుంది అన్నది అతనికే తెలియాలి. మనకూ తెలియాలంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిందే…!

స్టార్స్ కు కూడా న్యాయం జరగదా ?


సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం పై విచారణ గత కొన్ని రోజులుగా ఒక థ్రిల్లర్ సినిమా స్క్రీన్ ప్లేలా సాగుతూ ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. అసలు బాలీవుడ్ లాంటి మహా సముద్రంలో మునిగిపోకుండా తనకంటూ ఒక స్థాయిని క్రియేట్ చేసుకున్న సుశాంత్.. ఒక అనాముకుడిలా ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు ? నిజంగానే ఆత్మహత్య చేసుకున్నాడా ? లేక ఎవరైనా ప్లాన్ చేసి హత్య చేశారా ? అనే విషయాలు ఎటూ తేలడం లేదు. చివరకు సీబీఐ కూడా రంగంలోకి దిగినా ఇంతవరకూ ఇది జరిగింది అని వాళ్ళు కూడా క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. ఇంకా సీబీఐ సుశాంత్ కేసును దర్యాప్తు చేస్తోంది. మరి అసలు నిజాలను కొన్ని రోజులు విచారణ తరువాత అయినా బయటపెడుతుందా చూడాలి.

Also Read: ఆర్జీవీకి షాక్‌.. ‘మర్డర్’ రిలీజ్‌కు కోర్టు బ్రేక్

మరోవైపు రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి మాత్రం సుశాంత్ కేసు పై ఎప్పటికప్పుడు ఏదొక ఆరోపణలు చేస్తూ.. అనేక అనుమానాలను రేకెత్తిస్తోన్నారు. ఇప్పటికే సుబ్రహ్మణ్య స్వామి.. సుశాంత్ మరణించడానికి కొన్ని గంటల ముందే దుబాయ్ డ్రగ్ డీలర్ అయూష్ ఖాన్ తో మాట్లాడారని.. పైగా అతన్ని సుశాంత్ చాలా సార్లు కలిశారని స్వామి ఆరోపణలు చేస్తున్నారు. మరి ఈ స్వామి ఇలాంటి ఆరోపణలు చేయడానికి ఆయనకున్న ఆధారాలు ఏమిటో ఆయన ఇంతవరకూ బయటపెట్టలేదు. అయితే స్వామి చెబుతున్నట్లు.. సుశాంత్ మరణానికి ముందు డ్రగ్ డీలర్ అయూష్ ఖాన్ ఎందుకు కలిసినట్లు.. ? ఈ విషయం పై తనకు కూడా క్లారిటీ లేదని సుబ్రహ్మణ్య స్వామి తెలిపినా.. ఒక డ్రగ్ డీలర్ తో సంబంధాలు ఉన్నాయంటే.. సుశాంత్ లైఫ్ స్టైల్ మీద ఇప్పుడు అనేక అనుమానాలు వస్తున్నాయి.

Also Read: ప్రభాస్‌ మూవీలో నిధి అగర్వాల్‌కు గోల్డెన్‌ చాన్స్!

కానీ, సీబీఐ మాత్రం సుశాంత్ కేసును ఇంకా సీరియస్ గా విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతికి, దుబాయ్ కి మధ్య ఏదో లింక్ ఉందని సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించిన ఆరోపణల పై సీబీఐ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సుశాంత్ అభిమానులు కోరుకుంటున్నారు. అసలు సుశాంత్ కేసుతో పాటుగా శ్రీదేవి మరణం మీద కూడా అభిమానులకు అనేక అనుమానాలు ఉన్నాయి. అసలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సెలబ్రిటీలు, స్టార్స్ కేసులనే మన వ్యవస్థ బయటపెట్టలేని అప్పుడు, ఇక మాములు జనానికి ఈ న్యాయ వ్యవస్థలో న్యాయం జరుగుతుందని ఎలా నమ్మగలం.

అమరావతి విషయంలో బాబు వ్యూహం…. మొదటికే మోసం?

అమరావతి విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఒక మాట…. ఎన్నికల తర్వాత మరొక మాట చెబుతుందని ఎప్పటినుండో ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు ఇక పరిస్థితి చేయి దాటిపోతుంది అనుకుంటున్న తరుణంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే ప్రజాతీర్పు కోరాలని కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్న చంద్రబాబు…. ప్రజల మద్దతు అమరావతికే ఉందని పూర్తిస్థాయిలో నమ్ముతున్నారు. అయితే ఈ విషయంపై వైసిపి నుండి ఎలాంటి స్పందన కనిపించలేదు. కానీ ప్రజా తీర్పుకి మాత్రం వెళ్లే అవసరం కూడా వైసిపికి ప్రస్తుతం లేదనే చెప్పాలి. అంతేకాకుండా తాము రాజీనామాలు కూడా చేయబోమని వైసీపీ నేతలు ఇప్పటికే తేల్చేశారు.

Also Read : జగన్ ను చావు దెబ్బ కొట్టేందుకు కేసీఆర్ రె’ఢీ’..!

ఇక ఇలాంటి సమయంలో వైసీపీ పై మరింత ఒత్తిడి పెంచేందుకు చంద్రబాబు ప్రజాభిప్రాయాన్ని వెల్లడించే వేదికను ప్రారంభించారు. www.apwithamaravthi.com అనే పేరుతో ఒక వెబ్సైట్ ను ప్రారంభించారు. 13 జిల్లాల ప్రజలు ఏపీ రాజధానిగా ప్రజలు అమరావతినే కోరుతున్నారా…. లేదా అనే విషయాన్ని ఈ వెబ్సైట్ ద్వారా తెలియజేయవచ్చని చంద్రబాబు చెబుతున్నారు. వాస్తవానికి అమరావతి విషయంలో ప్రజాభిప్రాయం ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉందని జాతీయ మీడియా తో పాటు సోషల్ మీడియాలో వైసిపి ఫ్యాన్స్ పెట్టిన పోస్టుల్లో కూడా తేటతెల్లమైంది. దాదాపు అందరూ అమరావతి కి మద్దతు పలుకుతున్నారని… ప్రాంతాలకు అతీతంగా రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగాలను అందరూ గుర్తించాలని టిడిపి నాయకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఎంతో ధైర్యంగా వారు ఇప్పుడు ప్రజాభిప్రాయాన్ని సేకరించి ఒక వెబ్సైట్ ని ప్రారంభించారు.

అయితే జగన్ సర్కార్ ఇప్పటివరకు ప్రజాభిప్రాయం అనే పదం ఎక్కడా వాడలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు ఒకటి మొదలు పెట్టాడు కనుక కచ్చితంగా దానిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పవర్ లో ఉన్న గవర్నమెంట్, అత్యంత ప్జాదరణ కలిగిన జగన్ వెబ్ సైట్ రిజల్ట్స్ ను తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అందుకు తగ్గట్లు ఎక్కువ ఓట్లు కూడా అమరావతి కి వ్యతిరేకంగా పడేలాగా సన్నాహాలు జరుగుతున్నాయట. అందులో వైసీపీ విజయం సాధిస్తే చంద్రబాబు నోరు పర్మినెంట్ గా వైసిపి వారు మూసివేయవచ్చు. అంతేకాకుండా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలకు అవగాహన కల్పించేందుకు క్షేత్రస్థాయిలో సన్నాహాలు జరుగుపుతున్నారట లోకల్ వైసీపీ నేతలు. ఇది సక్సెస్ అయితే ఓటింగ్ లో అమరావతికి వ్యతిరేకంగా భారీగా ప్రజలు విశాఖకు మద్దతు తెలిపే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక అదే జరిగితే బాబు ప్లాన్ వల్ల తెదేపా పార్టీకి మొదటికే మోసం వస్తుంది. మరి చూద్దాం ఏమవుతుందో.

Also Read : జగన్ మరో సంచలనం.. అంతా షేక్ అవుతున్నారా?

అపెక్స్ కౌన్సిల్ లో కేసీఆర్ టార్గెట్ ఇదే…!

ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం ముదురుతున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సై అంటే సై అంటున్నారు. ఇక జరగబోయే అపెక్స్ కౌన్సిల్ భేటీ కు సంబంధించి కేసీఆర్ పక్కా వ్యూహాత్మకంగా సిద్ధం అయ్యాడని తెలుస్తోంది. ఇప్పటికే క్రితంసారి అపెక్స్ కౌన్సిల్ భేటీకి జగన్ సిద్ధమైన తర్వాత కూడా కేసీఆర్ క్యాబినెట్ మీటింగ్ ఉంది అన్న సాకుతో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ వాయిదా వేయించడం చూశాం. అప్పటికీ కేసీఆర్ కు ఈ మీటింగ్ పై ఎలాంటి అవగాహన, ముందస్తు ప్రిపరేషన్ లేకపోయాయి.

Also Read : అమరావతి విషయంలో బాబు వ్యూహం…. మొదటికే మోసం?

అయితే గత కొద్ది రోజులుగా కేసీఆర్ వరుస క్యాబినెట్ సమావేశాలు నిర్వహిస్తూ తన అధికారులకు అపెక్స్ కౌన్సిల్ విషయమై పూర్తి వివరాలను అందిస్తున్నాడు. అక్కడ జగన్ కి ధీటుగా చెప్పవలసిన పాయింట్లు ఇంకా తమ ప్రాజెక్టు విషయమై లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేస్తూ అవతల వారిని నోరెత్తనివ్వకుండా చేయాల్సిన విషయం గురించి కెసిఆర్ పదేపదే గుర్తు చేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే జగన్ నేరుగా తెలంగాణలో కట్టబడిన ప్రాజెక్టులన్నీ అక్రమమైన అని మాట్లాడటం…. వారి వద్ద ఏది సరిగ్గా ఉండదు అని వ్యాఖ్యానించడం కెసిఆర్ ఇగో నీ భారీగా హార్ట్ చేసింది.

ఇదే సమయంలో పనిలో పనిగా కేంద్రంపై కూడా కేసీఆర్ ఒకేసారి సమయంలో పగ తీర్చుకోవాలని భావిస్తున్నాడు. శ్రీశైలం వంటి ప్రాజెక్టులపై కేంద్రం ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తుందని ఆరోపిస్తున్న కేసీఆర్ మీటింగ్ లో మీరు జగన్ కి వత్తాసు పలుకుతున్నారు అని వారిని నిలదీసేసేస్తాడని టిఆర్ఎస్ పార్టీ వర్గాల సమాచారం. అయితే అటువైపు నుండి జగన్ కూడా ఏమీ తక్కువ తినలేదు. క్రితంసారి జరగాల్సిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కే అతను పూర్తిగా సన్నద్ధమై ఆధారాలతో సహా రెడీగా ఉన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల వచ్చిన ఈ ప్రాబ్లం యొక్క పరిష్కారానికి ఎలా తనవైపుకి ఎప్పుకోవాలో అతనికి కూడా తెలుసు అని వైసిపి వర్గాలు అధికారులు ఎంతో నమ్మకంగా ఉన్నారు. మరి వీరిద్దరిలో పైచేయి ఎవరిది?

Also Read : జగన్ మరో సంచలనం.. అంతా షేక్ అవుతున్నారా?

రానా  ‘హిరణ్య కశ్యప’లో అల్లు అర్జున్‌?   

allu arjun in rana hiranya kashyapa movie

తెలుగు చిత్ర పరిశ్రమలో  ప్రతిభావంతులైన దర్శకుల్లో గుణశేఖర్ ఒకరు. భారీ సెట్లు, పెద్ద తారాగణంతో  పౌరాణిక, కమిర్షియల్‌ కూడా  సినిమాలు తీస్తుంటారాయన. నంది అవార్డుల డైరక్టర్గా ఆయనకు పేరుంది.  ఆయన తీసిన సినిమాలకు ఇప్పటిదాకా తొమ్మిది నంది అవార్డులు వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి, మహేశ్‌ బాబు వంటి బడా స్టార్లతో  పలు సార్లు పని చేశారాయన. కానీ, ఈ కొంతకాలంగా గుణ శేఖర్ పరాజయాల్లో ఉన్నారు. విజయం రుచి చాలా ఏళ్లవుతోంది. 2003లో  ‘ఒక్కడు’తో బ్లాక్‌ బస్టర్ అందుకున్న ఆయన తర్వాత అర్జున్, సైనికుడు సినిమాలతో నిరాశ పరిచాడు. 2010లో అల్లు అర్జున్‌ హీరోగా తీసిన వరుడు ఓ పెద్ద డిజాస్టర్. రెండేళ్ల తర్వాత రవితేజతో నిప్పు తీసిన ఆయన మళ్లీ చేతులు కాల్చుకున్నాడు. ఆపై, అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో రుద్రమ దేవి కోసం చాలా సంవత్సరాలు కష్టపడ్డారు. 2015లో వచ్చిన ఈ చిత్రం విమర్శల ప్రశంసలు అందుకుంది కానీ బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా కొట్టింది. దీనికి నిర్మాత కూడా తానే కావడంతో గుణశేఖర్ కష్టాలు రెట్టింపయ్యాయి. అయితే, ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆయన ‘హిరణ్య కశ్యప’  అనే సినిమాతో మళ్లీ ముందుకురాబోతున్నారు.

Also Read : మళ్లీ ఈనాడు గ్రూపుకు ఊపు.. రంగంలోకి రామోజీ

రుద్రమదేవి తర్వాత కొంత విరామం అనంతరం ఈ ప్రాజెక్టుపైనే దృష్టి పెట్టారు. గుణశేఖర్,  సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో దగ్గుబాటి రానా హీరో. పాన్‌ ఇండియా స్థాయిలో దీన్ని రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.  భక్త ప్రహ్లాద కథలోని హిరణ్య కశ్యపుడి కోణంలో గుణశేఖర్‌ కథ,  కథనం రాసుకున్నట్టు సమాచారం. బాహుబలి స్థాయిలో రూపొందించాలని చూస్తున్న ఈ ప్రాజెక్టుపై హీరో రానా చాలా ఆసక్తిగా ఉన్నాడు. తొందర్లోనే సెట్స్‌ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రి ప్రొడక్షన్‌ పనులు పూర్తవగా.. ఇప్పుడు ఇతర నటీనటులు, సాంకేతిక సిబ్బందిని ఖరారు చేసిన పనిలో ఉన్నారు గుణశేఖర్. ఈ క్రమంలో చిత్రంలో ఓ  పాత్రకోసం అల్లు అర్జున్ ను తీసుకోవాలని భావిస్తున్నాడని సమాచారం. అది సినిమాలో కీలక పాత్ర అని,  చాలా ప్రత్యేకంగా ఉంటుందని, బన్నీ దృష్టిలో ఉంచుకొని గుణ శేఖర్  ఆ పాత్ర తీర్చిదిద్దారని అంటున్నారు.
గుణ చివరి చిత్రం రుద్రమదేవిలో సైతం బన్నీ.. గోన గన్నారెడ్డి అనే కీలక పాత్ర చేశాడు. పైసా తీసుకోకుండా ఆ సినిమాకు ఒప్పుకున్న బన్నీ.. గన్నారెడ్డి పాత్ర కోసం తెలంగాణ యాస నేర్చుకున్నాడు. ఎన్నో కసరత్తులు చేసిన అద్భుతంగా మేకోవర్ అయ్యాడు. ఆ పాత్రలో లీనమై నటించి సినిమాకు ప్లస్‌ అయ్యాడు. ఆ సినిమా, ముఖ్యంగా గోన గన్నారెడ్డి క్యారెక్టర్బన్నీకి మంచి పేరు తెచ్చి పెట్టింది.  వరుడు తీవ్రంగా నిరాశ పరిచినా గుణశేఖర్ అంటే  అతనికి గౌరవం ఉంది. ఈ క్రమంలోనే హిరణ్యకశ్యపలో ఓ పాత్ర కోసం గుణ.. అతడిని సంప్రదించారట. కానీ, ప్రస్తుతం బన్నీ ఫుల్‌ బిజీగా ఉన్నాడు. సుకుమార్తో ‘పుష్ప’ చేస్తున్న అల్లువారి హీరో కొరటాల శివతో  ఓ సినిమాకు ఓకే చెప్పాడు. వేణు శ్రీరామ్‌ డైరెక్షన్‌లో ‘ఐకాన్‌’ కూడా చేయాల్సి ఉంది. మరి, ఇంత బిజీ షెడ్యూల్‌లో తన క్లోజ్‌ ఫ్రెండ్‌ రానాతో కలిసి నటించేందుకు అతను ఒప్పుకుంటాడో లేదో చూడాలి. ఒకవేళ అతను ఓకే అంటే మాత్రం మరో  క్రేజీ కాంబినేషన్‌ ప్రేక్షకులను అలరించడం పక్కా అనొచ్చు.

ఏపీలో లక్షణాలు లేకపోయినా 90 శాతం మందికి కరోనా…?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో నమోదవుతున్న కేసులు ప్రజలు రోడ్లపైకి అడుగు పెట్టాలంటేనే భయపడేలా చేస్తున్నాయి. వైరస్ గురించి అధికారులు చేస్తున్న సర్వేల్లో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్రంలో కరోనా లక్షణాలైన జ్వరం, దగ్గు లాంటి లక్షణాలు 90 శాతం మందిలో కనిపించడం లేదని సీరో సర్వైలెన్స్ సర్వేలో వెల్లడైంది.

Also Read : అమరావతి విషయంలో బాబు వ్యూహం…. మొదటికే మోసం?

నెల్లూరు, కృష్ణా, తూర్పుగోదావరి, అనంతపురం జిల్లాల్లో సర్వే నిర్వహించిన అధికారులు అనంతపురంలో ఏకంగా 99.5 శాతం మందిలో లక్షణాలు కనిపించపోయినా కరోనా నిర్ధారణ అయిందని నెల్లూరు జిల్లాలో 96.1 శాతం, కృష్ణా జిల్లాలో 99.4 శాతం, తూర్పుగోదావరి జిల్లాలో 92.8 శాతం మందికి కరోనా నిర్ధారణ అయిందని వెల్లడించారు. కృష్ణా జిల్లాలో 22.3 శాతం మందికి కరోనా వచ్చి పోయిందని వారిలో యాంటీబాడీలు డెవలప్ అయ్యాయని అధికారులు తెలిపారు.

కరోనా లక్షణాలు కనిపించకుండా పాజిటివ్ నిర్ధారణ అయిన వాళ్లు పది రోజుల పాటు ఐసోలేషన్ కేంద్రాలు లేదా ఆస్పత్రులలో ఉంటే సరిపోతుందని… వైరస్ లోడ్ పెరిగి లక్షణాలు కనిపిస్తే మందులు వాడాలని… లేకపోతే బలవర్థక ఆహారం తీసుకుంటే సరిపోతుందని అధికారులు వెల్లడించారు. లక్షణాలు కనిపించని వాళ్లు 11వ రోజు నుంచి బయట తిరిగినా వాళ్ల నుంచి వైరస్ ఇతరులకు వ్యాప్తి చెందదని… వాళ్లకు మళ్లీ కరోనా పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం కూడా లేదని ప్రకటన చేశారు.

Also Read : జగన్ ను చావు దెబ్బ కొట్టేందుకు కేసీఆర్ రె’ఢీ’..!

కరోనా మృతదేహాల్లో ఈ కొత్త లక్షణాలు!

ప్రపంచ దేశాల ప్రజలు కరోనా మహమ్మారి ధాటికి చిగురుటాకులా గజగజా వణుకుతున్న సంగతి తెలిసిందే. వైరస్ ను వీలైనంత తక్కువ సమయంలో కట్టడి చేయాలనే ఉద్దేశంతో శాస్త్రవేత్తలు వైరస్ గురించి అనేక పరిశోధనలు చేస్తున్నారు. ఈ పరిశోధనల్లో ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శాస్త్రవేత్తలు తాజాగా కరోనాతో మృతి చెందిన వారికి శవ పరీక్షలు నిర్వహించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

Also Read : ఆ పదార్దాలపై మూడు వారాల పాటు కరోనా జీవించే ఉంటుందట!

లండన్ శాస్త్రవేత్తలు కరోనా రోగుల మృతదేహాలపై పరిశోధనలు చేసి వైరస్ వల్ల మృతి చెందిన వారి ఊపిరితిత్తుల్లో గాయాలు ఉన్నాయని… రక్తం గడ్డకట్టడం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయని చెప్పారు. మృతి చెందిన వారిలో కరోనా వైరస్ ప్రారంభ లక్షణాలుగా కిడ్నీల్లో గాయాలు, ఊపిరితిత్తుల్లో మచ్చలు ఉన్నట్టు తెలిపారు. మృతి చెందిన వారి ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీలలో రక్తం గడ్డ కట్టినట్టు పేర్కొన్నారు.

ఇంపీరియల్ కాలేజ్ వెబ్ సైట్ లో తాజాగా ఇందుకు సంబంధించిన నివేదిక ప్రచురితమైంది. వెలుగులోకి వస్తున్న కొత్త వివరాల ద్వారా రోగులకు చికిత్స అందించడం మరింత సులభమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పరిశోధనల వల్ల కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు ఇన్‌ఫెక్షన్‌ ద్వారా సంభవించే మరణాలను ఆపవచ్చని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. ఈ పరిశోధనలు రోగులకు సరైన సమయంలో చికిత్స అందించటానికి ఉపయోగపడతాయని అన్నారు.

Also Read : ఏపీలో లక్షణాలు లేకపోయినా 90 శాతం మందికి కరోనా…?

సివిల్స్ సాధించాలంటే ఈ ఫోన్ వాడండి!

మనలో చాలామంది ఉన్నతమైన లక్ష్యాలను ఏర్పరచుకుంటారు. ఆ లక్ష్యాలను సాధించడానికి ఎంతో శ్రమించాలని అనుకుంటూ ఉంటారు. కానీ వివిధ కారణాల వల్ల ఆ లక్ష్యాలను సాధించలేక చిన్నచిన్న ఉద్యోగాలతో సరిపెట్టుకుంటూ ఉంటారు. స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా వాడకం వల్లే చాలామంది ఎంచుకున్న లక్ష్యాలను సాధించడంలో సఫలం కాలేకపోతున్నారు. మరి ఈ సమస్యలను అధిగమించడం ఎలా…? అనే ప్రశ్న చాలామందిని వేధిస్తోంది.

Also Read : ఆ విద్యార్థి చదువు కోసం ఊరికి ఇంటర్నెట్ సౌక‌ర్యం క‌ల్పించిన సోనూసూద్!

తాజాగా సివిల్ సర్వీసెస్ లో విజయం సాధించాలని అనుకున్న ఒక వ్యక్తి తన కలను నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో సోషల్ మీడియా వేదికలలో ఒకటైన ట్విట్టర్ ద్వారా సివిల్ సర్వీసెస్ సాధించాలంటే ఏం చేయాలని ఒక ఐపీఎస్ అధికారిని కోరాడు. తన ప్రశ్నకు ఒకే లైన్ లో సమాధానం కావాలని సదరు అభ్యర్థి కోరాడు. దానికి ఐపీఎస్ అధికారి ఎవరూ ఊహించని సమాధానం ఇచ్చి ప్రశ్న అడిగిన వ్యక్తితో పాటు నెటిజన్లను సైతం ఆశ్చర్యపరిచాడు.

సివిల్స్ సాధించటానికి మొదట ప్రస్తుతం వినియోగిస్తున్న స్మార్ట్ ఫోన్ ను వదిలి నోకియా 5310 ఫోన్ ను వాడాలని ఐపీఎస్ అధికారి సలహా ఇచ్చాడు. ఒడిశా రాష్ట్రానికి చెందిన ఐపీఎస్ అధికారి అరుణ్ బోత్రా ఈ విషయాలను వెల్లడించాడు. ప్రసుత పరిస్థితుల్లో స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరికీ అవసరమే అయినా లక్ష్యాన్ని సాధించడానికి స్మార్ట్ ఫోన్ అడ్డుగా నిలుస్తోందని అరుణ్ బోత్రా అభిప్రాయపడ్డారు. అధికారి ఇచ్చిన సమాధానం కరెక్ట్ అని చాలామంది నెటిజన్లు చెబుతున్నారు. ఫీచర్ ఫోన్ వాడటం ద్వారా దృష్టి మరలదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : వలస కార్మికులకు విమాన టికెట్లు బుక్‌ చేసి నెటిజన్ల మనసు దోచిన రైతు!

జగన్ మరో సంచలనం.. అంతా షేక్ అవుతున్నారా?

CM Jagan

అవినీతి కేసులో ఆరోపణలతో దాదాపు 16 నెలలు జైల్లో ఉండి వచ్చిన జగన్ పై ఇంకా ఆ మరక పోలేదు. కోర్టులో విచారణ జరుగుతోంది. ఆదాయానికి మించి ఆస్తుల కేసు ఆయన మెడకు ఉంది.ఈ క్రమంలోనే సీఎం జగన్ గద్దెనెక్కితే రాష్ట్రాన్ని దోచుకుంటారని ప్రతిపక్ష చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా ఎన్నికల ముందర చేయని దుష్ప్రచారం లేదు.

Also Read: బాబు… నీకు రమేష్ లు తెలుసా…? మీ రిలేషన్ ఏమిటి అసలు?

కానీ జగన్ గద్దెనెక్కగానే తనపై పడిన ఈ మకిలిని పూర్తిగా దూరం చేసుకునేందుకు సంచలనమైన నిర్ణయాలు తీసుకుంటూ పారదర్శకతకు పెద్ద పీట వేస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే ఒక జడ్జిని నియమించి టెండర్లను ‘రివర్స్ టెండరింగ్’ ద్వారా చేయిస్తూ ప్రభుత్వానికి డబ్బును మిగులుస్తున్నారు. హైకోర్టు జడ్జి ద్వారానే టెండర్లను ఆమోదింప చేసుకుంటూ పారదర్శకతకు పెద్దపీట వేశారు.

ఇక ఈ క్రమంలోనే ఏపీలో అవినీతిపై ఇప్పుడు జగన్ బ్రహ్మాస్త్రం సంధిస్తున్నారు. జగన్ చేస్తున్న ఈ ప్లాన్ కు ఇప్పుడు అధికారులు వణికిపోతున్నారు. అది అమలైతే ఇక ఏపీలో అవినీతి చేయాలంటే భయపడే రోజులు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

అవినీతి నిరోధం, ప్రభుత్వ చర్యలపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, ఏసీబీ డీజీపీ ఆంజనేయులు, ఉన్నతాధికారులు, ఐఐఎం అహ్మదాబాద్ ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చించారు.

ముఖ్యంగా కోట్లు వ్యయం అయ్యే సాగునీటి ప్రాజెక్టుల విషయంలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ప్రభుత్వంలోని ప్రతీ విభాగంలోనూ రివర్స్ టెండరింగ్ చేయాలని.. టెండర్ విలువ కోటి రూపాయలు దాటితే రివర్స్ టెండరింగ్ కు వెళ్లాల్సిందేనని తేల్చారు. అవినీతిపై త్వరలోనే చట్టం తీసుకురానున్నట్టు తెలిసింది.

Also Read: ఎమ్మెల్యే వంశీకి గట్టి కౌంటర్ ఇచ్చిన దుట్టా..!

ఏపీలో ఇకపై లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికితే నిర్ధిష్ట సమయంలో చర్యలు తీసుకునేలా చట్టం తీసుకురావాలని జగన్ సంచలన నిర్ణయించారు. ‘దిశ’ తరహాలోనే అసెంబ్లీలో దీనిపై బిల్లు పెట్టే దిశగా జగన్ ఆలోచన చేస్తున్నారు. ఇందుకోసం ఏసీబీకి 14400 నంబర్ ను రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశపెట్టి గ్రామ, వార్డు సచివాలయాల నుంచి వచ్చే ఫిర్యాదులు అనుసంధానం చేయనున్నారు.

ఈ చట్టం చేస్తే ఏపీలో అధికారులు లంచాలు తీసుకొని తప్పించుకోవడానికి ఉండదు. జగన్ సర్కార్ కనుక బిల్లు పెట్టి పాస్ చేయిస్తే ఏపీలో అవినీతికి చెక్ పడుతుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

-ఎన్నం