
ఛీ..ఛీ.. బోడి మ్యాటర్ చెప్పేందుకు ఇంత బిల్డప్ అవసరమా? పైగా ఆ ప్రమోషన్ కోసం ప్రభాస్ పేరు వాడుకోవడమా? అంటూ అభిమానులు ఓ మెగా హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ మెగా హీరో ఎవరు? అభిమానులకు ఎందుకు కోపం తెప్పించాడు.. అనుకుంటున్నారా? అతను మరెవరో కాదు మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. అతను ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే సినిమాలో హీరోగా నటించిన సంగతి తెలిసిందే. సుబ్బు దర్శకత్వం వహించిన ఈ సినిమాను బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఎస్ తమన్ మ్యూజిక్ డైరెక్టర్. షూటింగ్ కంప్లీట్ అయిన ఈ చిత్రం రిలీజ్‌కు రెడీగా ఉంది. ముందుగా మే 1వ తేదీనే విడుదల చేయాలని భావించారు. కానీ, కరోనా దెబ్బకు వాయిదా పడింది. టీజర్, ‘నో పెళ్లి దాంతల్లి.. ఈ తప్పేం చేయకురా వెళ్లి’ అనే లిరికల్ సాంగ్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి.
Also Read : బ్రేకింగ్ : బాలుగారికి కరోనా నెగిటివ్ !
అయితే, ప్రభాస్ పేరు వాడుకొని ట్విట్టర్లో నిన్న అతను చేసిన హడావుడంతా కేవలం సోలో బ్రతుకే సినిమా ప్రమోషన్ కోసమే అని స్పష్టమైంది. దాంతో, కొంత మంది తేజుపై విమర్శలు ఎక్కు పెట్టారు. సినిమా ప్రమోషన్ విషయాన్ని నేరుగా చెప్పాలి గానీ.. ఇంత బిల్డప్ ఇవ్వడం ఎందుకు? దానికి ప్రభాస్ పేరు వాడుకోవడం ఎందుకు? ఇదంతా చీప్ పబ్లిసిటీ స్టంట్ అంటూ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సాయి రియాక్షన్ ఎలా ఉంటుందో మరి?