Home Blog Page 8350

కాంగ్రెస్ భవిష్యత్తు ను నాశనం చేస్తున్న గాంధీలు

సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ పేర్లు తెలియనివాళ్ళు ఎవరూ వుండరేమో. కానీ వాళ్ళు నకిలీ గాంధీ పేరుతో చలామణి అవుతున్నారని ఎంతమందికి తెలుసు? వీరికి గాంధీ కి ఎటువంటి రక్త సంబంధం లేదని ఈ తరంలో ఎంతమందికి తెలుసు? ఇందిరా నెహ్రూ ఫిరోజ్ జహంగీర్ ఘండి ( కొంతమంది ఫిరోజ్ ఖాన్ అని కూడా చెబుతారు) ని పెళ్లి చేసుకోవటం తెలిసిందే. ఫిరోజ్ ఘండి/ఖాన్ పార్సీ తెగకు చెందినవాడు. తన మతం పార్సీ అని కొంతమంది, ఇస్లాం అని కొంతమంది చెబుతారు. ఏ మతానికి చెందినవాడైనా, ఏ తెగకు చెందినవాడైనా భారతీయుడే కదా. కాకపోయినా ఏమవుతుంది ప్రేమకు మతాలూ, దేశాలు అడ్డుకాదు కదా. అటువంటప్పుడు ఆ పెళ్ళికి సెక్యులర్ వాది, అభ్యుదయవాది అయిన నెహ్రూ కి అభ్యంతరం ఉండాల్సిన అవసరం ఏమిటో తెలియదు. మహాత్మా గాంధీ సహాయంతో ఫిరోజ్ ఘండి/ఖాన్ పేరును ఫిరోజ్ గాంధీగా లండన్ లో అఫిడవిట్ దాఖలు చేసి మార్పు చేసారని తెలుస్తుంది. దానితో ఇందిరా ఘండి/ఖాన్ పేరు కూడా ఇందిరా గాంధీ గా మారిందని దానితో నెహ్రూ మనసు కుదుటపడి శాంతించిందని చెబుతారు.  ఈ విధంగా గాంధీ వారసత్వాన్ని దొంగచాటుగా స్వంతం చేసుకొని అసలు గాంధీ కుటుంబానికి తామే వారసులుగా భ్రమింప చేయటం లోనే వీరి రాజకీయ చాకచక్యం తేటతెల్లమవుతుంది. పుట్టుకతో వచ్చిన వారసత్వాన్నే మార్చగలిగినవాళ్ళు తమ మనుగడ కోసం కాంగ్రెస్ భవిష్యత్తుని ఫణంగా పెట్టటంలో విశేష మేముంది.

Also Read : కాంగ్రెస్ తో కటీఫ్ అంటున్న కోదండరాం?

23 మంది రాసిన లేఖపై కోపం ఎందుకు?

వీళ్ళందరూ గాంధీ కుటుంబానికి అత్యంత విశ్వాస పాత్రులే. ఇన్నాళ్ళూ గాంధీ కుటుంబం మీద ఈగ వాలనివ్వకుండా కాపాడిన వాళ్ళే. మరి ఒక్కసారి  కానివాళ్ళు ఎలా అయ్యారు? ఇంతకీ వాళ్ళు చేసిన పాపమేంటి? పార్టీ బతికి బట్టకట్టాలంటే ఏంచేయాలో వాళ్ళ అనుభవాన్ని రంగరించి కొన్ని సలహాలు చేశారు. దానికే అంతగా విరుచుకు పడాల్సిన అవసరం ఏంటి? వాళ్ళు లేవనెత్తిన అంశాలపై చర్చించే బదులు ఇదా టైం అని రాహుల్ గాంధీ ( ఘండి) ఘర్జించటం లో ఆంతర్య మేంటి? దానికి సెంటిమెంట్ కూడా జోడించి సోనియా గాంధీ ఆరోగ్యం బాగాలేనప్పుడు ఈ పని చేయటం వలన బిజెపి కి లాభం కలగదా అని రెట్టించటం వెనక అసలు భావమేమిటి? (కపిల్ సిబాల్ ట్వీట్ వేరు ఇది వేరు). అంటే వాళ్ళు లేవనెత్తిన అంశాలకు జవాబు చెప్పకుండా సమస్యను దాటవేయటానికే ఈ పని చేసినట్లు స్పష్టమవుతుంది. రాజస్తాన్ , మధ్య ప్రదేశ్ ల్లోసమస్యల్లాంటివి సంవత్సరం పొడవునా వస్తూనే వుంటాయి. వచ్చే కొద్ది నెలల్లో బీహార్ ఎన్నికలు, ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఇలా ఏవో ఒకటి దేశంలో వస్తూనే వుంటాయి. కాబట్టి టైం కరెక్టు కాదనేది కుంటిసాకు. ఇక సోనియా గాంధీ ఆరోగ్యం బాగానే వుందని , ఇది రొటీన్ మెడికల్ చెక్ అప్ అని అధికార ప్రతినిధే చెప్పాడు. ఇకపోతే క్రమశిక్షణ ఉల్లంఘన గురించి కాంగ్రెస్ మాట్లాడటం హాస్యాస్పదం.

ఎవరి ఇష్టమొచ్చినట్లు వాళ్ళు మాట్లాడటం కాంగ్రెస్ కి కొత్తేమీ కాదు. వాళ్లకు నచ్చితే అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయమని వాళ్ళను సేవ్ చేయటం  పరిపాటే. వాళ్ళ లెటర్ లీక్ అయ్యిందని అదేదో జరగరానిది జరిగిందనీ అందుకని వీరిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కొంతమందిచేత బహిరంగంగా ప్రకటనలు ఇప్పించటం క్రమశిక్షణ ను ఉల్లంఘించటం కాదా?  ఈ వుత్తరం రాసిన వాళ్ళందరూ గాంధీ కుటుంబం దయతో ఇచ్చిన పోస్టులు అనుభవించి కూడా ఇలా మాట్లాడటం విశ్వాస రాహిత్యమట. అది ఆ మాట్లాడే వాళ్లకు కూడా వర్తిస్తుందని మర్చిపోవద్దు. మన్మోహన్ సింగ్ దగ్గర్నుంచీ , చిదంబరం, ఆదిర్ రంజన్ చౌదరి దాకా అందరూ ఆ కోవలోకే వస్తారు కదా. మరి ఇదేదో వీళ్ళకే వర్తించటం ఎందుకు? కాబట్టి అసలు విషయం అది కాదు. గాంధీ కుటుంబం పై ఏమాత్రం ప్రశ్నించినట్లు కనబడినా వెంటనే వాళ్ళను బిజెపి కి అంటగట్టటం , ఇదంతా బిజెపి కుట్ర లో భాగమేనని చెప్పటం పరిపాటి అయ్యింది. సచిన్ పైలట్ పై ఇదే ఆరోపణలు చేసారు. తర్వాత అది అబద్దమని తేలింది. ఇప్పుడు వీరిపై కూడా కొంతమంది చేత అదే ఆరోపణలు చేయిస్తున్నారు. అంటే బిజెపి బూచిని చూపించి తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకుంటున్నారు.

Also Read : వలసవాదులతో వైసీపీలో పెరుగుతున్న అసంతృప్తి..!

లేఖలో ప్రస్తావించిన అంశాలు గాంధీ కుటుంబానికి వ్యతిరేకమా?

ఇవన్నీ కాంగ్రెస్ అనుకూల , కాంగ్రెస్ శ్రేయోభిలాషుల అభిప్రాయాలే. పత్రికల్లో ఎప్పట్నుంచో ఇటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ వాళ్ళు చెప్పిందట్లో తప్పేమిటో చెప్పాలి. 2014 నుంచి పార్టీ పరిస్థితి రోజు రోజుకీ దిగజారిపోతుందని వాపోయారు. బిజెపి ని సమర్ధంగా ఎదుర్కోవాలంటే పార్టీ ని తిరిగి పునరుజ్జీవనం చేయాలని చెప్పారు. నాయకత్వం అందరికీ అందుబాటులో వుండాలని , నిరంతరం పనిచేసేటట్లు వుండాలని చెప్పారు. అదేసమయం లో పార్టీని శక్తివంతంగా చేయాలంటే ఏమి చేయాలో కొన్ని సూచనలు ఇచ్చారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కి ఎన్నికలు జరపాలని , అధికార వికేంద్రీకరణ జరగాలని, రాష్ట్ర కమిటీలకు మరింత స్వేచ్చ వుండాలని, పార్లమెంటరీ బోర్డు ని ఏర్పాటు చేయాలని చెప్పారు. గాంధీ కుటుంబం ఇందులో ప్రముఖ పాత్ర వుండాలని కూడా చెప్పారు. ఇందులో ఏ ఒక్కటీ పార్టీ వ్యతిరేక చర్యగా చెప్పగలరా?

సంవత్సరం పైనుండీ కాంగ్రెస్ కి అధ్యక్షుడు లేకుండా తాత్కాలిక అధ్యక్షురాలి తో నడపడటం ఎంతవరకు సబబు? ఓ పెద్ద పార్టీకి ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి లేదు. అంటే ఏమిటి . రాహుల్ గాంధీ కి ఇష్టం లేకపోతే కాంగ్రెస్ పార్టీ పోయినా పర్వాలేదు కానీ ఇంకొకరు రాకూడదు. మోడీ కి ప్రత్యామ్నాయంగా గట్టి ప్రతిపక్ష పార్టీ గా తయారుకావాలంటే మంచి సలహాలు స్వీకరించి పటిష్టపరుచుకొనే బంగారు అవకాశాన్ని చేజార్చుకొని కాంగ్రెస్ భవిష్యత్తుని తామే నాశనం చేసుకోవటమంటే ఇదేనేమో. ఎప్పటికైనా రాహుల్ గాంధీ పగ్గాలు చేపట్టాల్సిందే , అప్పటిదాకా కాంగ్రెస్ పని కుంటుబడి పార్టీ దెబ్బతిన్నా పర్వాలేదు. వుంటే మేముండాలి లేకపోతే ఏమయినా పర్వాలేదు అనే స్వార్ధం సోనియా గాంధీ కుటుంబం లో వుందని ఈ పరిణామంతో ప్రతిఒక్కరికీ అర్ధమయ్యింది. పరిస్థితులు ఇలానేవుంటే బిజెపి ని వ్యతిరేకించే శక్తులన్నీ కలిసి వేరే కుంపటి పెట్టుకోవటం ఖాయం. ఈ పరిస్థితులు చూస్తుంటే 2024లో కూడా 2019 ఫలితాలే పునరావృతమవుతుందా అనిపిస్తుంది. ప్రజాస్వామ్యం లో కనీసం రెండు బలమైన జాతీయ పార్టీలు ఉంటేనే ప్రజలకు ప్రయోజనముంటుంది. ఇంకా నాలుగు సంవత్సరాలు వుంది కాబట్టి ఆ దిశగా అడుగులు పడతాయని ఆశిద్దాం.

Also Read : టీ.కాంగ్రెస్ కు ఊపుతెచ్చే ప్లాన్ చేశారు?

వలసవాదులతో వైసీపీలో పెరుగుతున్న అసంతృప్తి..!


టీడీపీ నుంచి అధికార పార్టీ వైసీపీలో చేరిన వలస నాయకులతో వైసీపీకి కొత్త తలనొప్పులు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ మోహన్ (గన్నవరం), మద్దాలి గిరిధర రావు (గుంటూరు వెస్ట్), కరణం బలరామ్ (చీరాల) వైసీపీ తీర్ధం పుచ్చుకోకున్నా పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. పదవుల్లో లేనీ టీడీపీ నాయకులకు చట్టపరంగా ఎటువంటి ఇబ్బంది లేకపోవడంతో వారు పార్టీ తీర్ధం పుచ్చుకుంటున్నారు.

Also Read: స్వర్ణ ప్యాలెస్ ఘటన.. జగన్ సర్కార్ కు షాక్

టీడీపీ నాయకుల చేరికతో ఇప్పుడు వైసీపీ నాయకుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుంది. గన్నవరం వల్లభనేని వంశీ, దుట్టా రామచంద్రరావుల మధ్య కోల్డ్ వార్ సాగుతున్న విషయం విధితమే. మరోవైపు చీరాలపై పట్టు సాధించిన ఆమంచి కృష్ణమోహన్ ఉండగా కరణం బలరామ్ కుమారుణ్ని పార్టీలో చేర్చుకుని నియోజకవర్గాన్ని వారికి అప్పగించారు. ఆమంచిని చీరాల వదిలి అద్ధంకి ఇన్ఛార్జిగా కొనసాగాలని పార్టీ అధిష్టానం ఆదేశించడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారు.

మరోవైపు ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కడపలోను పార్టీ నాయకుల తీవ్ర అంసతృప్తితితో ఉన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో మాజీ మంత్రి టీడీపీ నాయకులు రామసుబ్బారెడ్డిని పార్టీలో చేర్చుకోవడం ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న మూలె సుధీర్ రెడ్డి అదిష్టానంపై ఆగ్రహంతో ఉన్నారని జిల్లాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. జిల్లాలో మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వడంతో ఇతర వర్గాల నాయకులు అసంతృప్తితో ఉన్నారు.

Also Read: ఒంటరి పోరాటం చేస్తున్న చంద్రన్న..!

టీడీపీ నుంచి వలస వచ్చి వైసీపీలో చేరిన నాయకులు నియోజకవర్గాల్లో హావా కొనసాగించడంతో ఇంత కాలం పార్టీ కోసం పని చేసిన వారికి ఇబ్బందిగా మారింది. గన్నవరం నియోజకవర్గంలో అసలైన వైసీపీ నాయకులను పక్కనపెట్టి ఎమ్మెల్యే వంశీ తన వెంట టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు. జమ్మలమడుగులోను సుధీర్ రెడ్డిని పక్కన పెట్టి రామసుబ్బారెడ్డి హవా కొనసాగించడంతో సుధీర్ రెడ్డి వర్గం ఇబ్బందుల్లో పడింది. పార్టీ కోసం పని చేసిన వారికి ఇలా అన్యాయం చేయడం సరైన నిర్ణయం కాదనే విషయం అదిష్టానం గుర్తించాలని వైసీపీ నాయకులు కోరుతున్నారు.

రామచంద్రమూర్తి రాజీనామాకు కారణమిదేనా?


ప్రభుత్వ సలహాదారు, సీనియర్ జర్నలిస్టు రామచంద్రమూర్తి తన పదవికి రాజీనామా చేయడం రాష్ట్రంలో చర్చనీయాంశమయ్యింది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం సలహాదారుల పేరుతో వైసీపీ, సాక్షి మీడియా సంస్థలో పని చేసిన అనేక మందికి పోస్టులు ఇచ్చి రూ.లక్షల్లో జీతాలను ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ పోస్టులు సలహాదారులకు ఉపాధి చూపడానికి తప్ప ప్రభుత్వానికి ఎటువంటి ఉపయోగం లేదనే విమర్శలు కొద్ది నెలలుగా వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో ఈ సలహాదారుల పాత్ర ఏమీ ఉండదు. జగన్ మీడియా సంస్థలో డైరెక్టర్ గా పని చేసిన రామచంద్రమూర్తిని పబ్లిక్ పాలసీ సలహాదారుడిగా జగన్ నియమించుకున్నారు.

Also Read: ఒంటరి పోరాటం చేస్తున్న చంద్రన్న..!

రామచంద్రమూర్తి నియామకం అయిన అనంతరం ఆయనకు ప్రతి నెలా జీతం చెల్లించడం తప్ప ఆయన సలహాలు, సూచనలు స్వీకరించిన సందర్భాలు ఒక్కటీ లేదు. దీంతో ఏడాది అనంతరం ఆయన మానసిక ఆవేదనకు గురై తన బాధను ప్రభుత్వ పెద్దలు కొందరి వద్ద వ్యక్తం చేసినట్లు నాలుగు నెలల కిందట ప్రచారం జరిగింది. అంతేకాదు… అప్పటి నుంచి ఆయన జీతం తీసుకోవడం లేదని సమాచారం. ఇప్పడున్న పరిస్థితిలో జగన్ ఇటువంటి విషయాలను పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో రామచంద్రమూర్తి ఆవేదినపై పెద్దగా స్పందించలేదు.

Also Read: స్వర్ణ ప్యాలెస్ ఘటన.. జగన్ సర్కార్ కు షాక్

మరోవైపు సలహాదారుల పేరుతో ప్రభుత్వం ప్రజాధనం వృదా చేస్తుందని ప్రతిపక్ష పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల వైసిపి ఎంపీ రాఘురామ కృష్ణంరాజు ఈ విషయంలో ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సిఎస్ కు లేఖ సైతం రాశారు. దీంతో ప్రభుత్వ సలహాదారుల విషయం వివాదాస్పదం అయ్యింది. ఈ సంఘటలనతో తాను సలహాదారుగా పని చేయడం భావ్యం కాదని నిర్ణయించుకున్న సీనియర్ జర్నలిస్టు రామచంద్రమూర్తి తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. తన రాజీనామాను ప్రభుత్వ ముఖ్య సలహాదారులు అజయ్ కల్లం కు అందజేశారు. సీనియర్ జర్నలిస్టు రామచంద్రమూర్తి రాజీనామా చేయడంతో రాష్ట్రంలో ప్రభుత్వ సలహాదారుల వ్యవహారం ఇప్పడు చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ స్పందించారు… రామచంద్రమూర్తికి ఫోన్ చేసి అభినందించారు. ప్రభుత్వ సలహాదారులు అలంకారంగా మారారని, 14 నెలల కాలంలో సీఎం ఏ ఒక్క సలహాదారుడి సలహా స్వీకరించలేదన్నారు. వ్యక్తిత్వం ఉన్నవారెవరూ జగన్ పాలనలో ప్రభుత్వ సలహాదారులుగా కొనసాగలేరని పేర్కొన్నారు. మిగిలిన సలహాదారులు ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

బీజేపీ స్కెచ్.. దిదీకి పోటీగా దాదా..!


ఈసారి ఎలాగైనా పశ్చిమ బెంగాల్లో పాగా వేయాలని బీజేపీ భావిస్తోంది. కిందటిసారే బీజేపీ సర్కార్ సీఎం మమతా బెనర్జీకి గట్టి షాకిచ్చేందుకు ప్రయత్నించింది. అయితే మమతా బెనర్జీ(దిదీ) ముందు బీజేపీ పప్పులు ఉడకలేదు. మోదీ-అమిత్ షా వ్యూహాలను దిదీ చాకచాక్యంగా ఎదుర్కొని పశ్చిమ బెంగాల్లో తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంది.

Also Read: సోనియా కి అధ్యక్ష పదవి రావడం వెనుక ఇంత రాజకీయం జరిగిందా..? పాపం రాహుల్….

తొలి నుంచి మమతా బెనర్జీ మోదీ సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడుతోంది. వీలుచిక్కినప్పుడల్లా ప్రధాని మోదీ వైఫల్యాలపై విరుచుకుపడుతోంది. ఇక బీజేపీ రెండోసారి అధికారంలోకి రావడంతో ఆయా రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకునేందుకు కమలం నేతలు పావులు కదుపుతున్నారు. తొలి నుంచి మోదీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న దిదీకి ఈసారి గట్టి షాకివ్వాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. ఇందులో భాగంగానే పక్కా ప్రణాళికతో బీజేపీ ముందుకెళుతోంది.

పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాదిలో జరుగనున్నాయి. దీంతో బీజేపీ ఇప్పటి నుంచే దిదీని ఎదుర్కొనేందుకు వ్యూహాలను రచిస్తోంది. ఇందులో భాగంగా భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని బీజేపీ రంగంలోకి దింపేందుకు రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతోనే మమతా బెనర్జీ సర్కార్ పాఠశాల నిర్మాణం కోసం తనకు కేటాయించిన రెండెకరాల స్థలాన్ని గంగూలీ తాజాగా తిరిగిచ్చాడనే టాక్ విన్పిస్తోంది.

Also Read: సుశాంత్ ను చంపి ఉరితీశారా? సీబీఐ విచారణలో కొత్త కోణం?

ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్న గంగూలీ బీజేపీ నేతలకు మాత్రం టచ్లోనే ఉంటున్నాడు. 2019లో గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడు అయ్యేందుకు ప్రస్తుతం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మరో ఇద్దరు కేంద్రమంత్రులు సాయం చేశారనే ప్రచారం ఉంది. కొద్దిరోజుల్లో బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటంతో గంగూలీ బీజేపీ తరుపున ప్రచారం చేస్తాడనే టాక్ విన్పిస్తోంది. వీలైతే బీజేపీ బెంగాల్ సీఎం అభ్యర్థిగా గంగూలీని బరిలో దింపేందుకు రెడీ అవుతోంది. దాదా చరిష్మాతో దిదీకి చెక్ పెట్టాలని బీజేపీ భావిస్తోంది. అయితే గంగూలీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాడా? లేదా అనేది వేచి చూడాల్సిందే..!

ఆదిపురుష్‌ మొదలయ్యేది ఎప్పుడంటే..?


ఐదేళ్లు బాహుబలి సిరీస్‌కు, రెండేళ్లు సాహోకు కేటాయించిన యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ ఇప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. సాహో అనంతరం చేస్తున్న ‘రాధేశ్యామ్‌’ షూటింగ్‌ ఇంకా పూర్తి కాకముందే మరో రెండు పాన్‌ ఇండియా సినిమాలు ఒప్పుకున్నాడు. ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం అశ్వినీదత్‌ నిర్మించే ప్రతిష్టాత్మక చిత్రంలో భాగం కానున్నాడు. ఇందులో బాలీవుడ్‌ స్టార్ దీపిక పడుకోన్‌ హీరోయిన్‌గా నటించనుంది. ఈ చిత్రాన్ని ప్రకటించిన కొన్ని రోజులకే మన డార్లింగ్‌ మరో భారీ ప్రాజెక్టుకు ఓకే చెప్పాడు. తానాజీ ఫేం ఓం రౌత్‌ డైరెక్షన్‌లో ‘ఆదిపురుష్‌’లో హీరోగా నటించనున్నాడు.

Also Read: రాశి ఖన్నా డేరింగ్‌ స్టెప్‌..

అనూహ్యంగా ప్రకటించిన ఈ మూవీతో ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్‌ ఇచ్చాడు రెబల్‌ స్టార్. రామాయణ ఇతివృత్తంతో తెరకెక్కే ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడిగా కనిపించబోతున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ టీ సిరీస్‌ ప్రొడ్యూస్‌ చేస్తుండడంతో బాలీవుడ్‌ దృష్టంతా ఇప్పుడు ఈ సినిమాపైనే ఉంది. ఈ భారీ ప్రాజెక్టు రోజూ వార్తల్లో నానుతోంది. సినిమా గురించి రోజుకో విషయం తెలుస్తోంది. ఈ మూవీలో ప్రభాస్‌కు జోడీగా జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేశ్‌ను సీత పాత్ర కోసం పరిశీలిస్తున్నారని వార్తలు వచ్చాయి. విలన్‌గా బాలీవుడ్‌ స్టార్ సైఫ్‌ అలీఖాన్‌ నటిస్తాడని అంటున్నారు. అలాగే, ఈ మూవీ రూ. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుందని తెలిసింది. తాజాగా, సీత పాత్ర కోసం కీర్తిని కాకుండా కియారా ఆడ్వాణీ పేరు పరిశీలిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి.

Also Read: భారీ ఆఫర్ను కాదనుకున్న మెగా హీరో!

మరోవైపు పూర్తిగా త్రీడీలో తెరకెక్కబోయే ఈ సినిమా షూటింగ్‌ ఎప్పుడు మొదలవుతుందనే కుతూహలం అభిమానుల్లో పెరిగింది. ఒకవైపు ‘రాధేశ్యామ్‌’ షూటింగ్‌ ఇంకా పూర్తికాలేదు. మరోవైపు నాగ్‌ అశ్విన్‌ కథ, కథనం సిద్ధం చేసి చిత్రీకరణ జరిపేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సైన్స్‌ ఫిక్షన్‌ ప్రాజెక్టు కంప్లీట్‌ అయ్యేందుకు కనీసం ఒకటిన్నర సంవత్సరాలైనా పడుతుందని అంటున్నారు. అయినా మరో ప్రాజెక్టుకు రెబల్‌ స్టార్ ఒప్పుకున్నాడు. మరి, ప్రభాస్‌ చేస్తున్న తొలి హిందీ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందనేది చర్చనీయాంశమైంది. దీనిపై దర్శకుడు ఓం రౌత్ స్పష్టత ఇచ్చాడు. ఆదిపురుష్‌ షూటింగ్‌ వచ్చే ఏడాది జనవరిలోనే మొదలవుతుందని స్పష్టం చేశాడు. చిత్రీకరణ తొందరగానే ముగిసినా.. విజ్యువల్‌ ఎఫెక్ట్స్‌ పూర్తి చేసి రిలీజ్‌ చేసేందుకు చాలా టైమ్‌ పడుతుందని తెలుస్తోంది. ఈ లెక్కన ఆదిపురుష్ 2022 సెకండాఫ్‌లో రిలీజ్‌ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ లెక్కన నాగ్‌ అశ్విన్‌ సైన్స్‌ ఫిక్షన్‌ ప్రాజెక్టు కొంతకాలం వాయిదా పడుతుందా?

ప్రదీప్‌ సినిమా విడుదలకు మోక్షం లభించిందా?


కరోనా దెబ్బకు థియేటర్లు మూత పడడం.. తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియకపోవడడంతో మరో మార్గం లేక టాలీవుడ్ సినిమాలు ఓటీటీల బాట పట్టాయి. బాలీవుడ్‌లో పెద్ద పెద్ద సినిమాలు ఓటీటీల్లో వస్తుండగా దక్షిణాదిలో ఇప్పుడిప్పుడే పరిస్థితి మారుతోంది. తొలుత థియేటర్లు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొన్న సినిమాలు, చిన్న చిత్రాలు ఓటీటీల వైపు చూడగా ఇప్పుడు బడా నిర్మాతలు సైతం అదే దారి పడుతున్నారు. ఇంటర్నెట్‌ వినియోగం పెరిగి, సాంకేతిక రంగం కొత్త పుంతలు తొక్కుతున్న జమానాలో నిర్మాతలు మొన్నటిదాకా ఓటీటీల పేరు చెబితేనే అంతెత్తున లేశారు. కమల్‌ హాసన్‌, సూర్య లాంటి హీరోలు గతంలోనే డిజిటల్‌ రిలీజ్‌ల ప్రస్తావన తెచ్చినప్పుడు ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్యజమానులు ఒక్కటయ్యారు. వాళ్ల తదుపరి సినిమాలకు థియేటర్లు ఇవ్వబోమని బెదిరింపులకు దిగారు. కానీ, ఇప్పుడు ఆ ప్రొడ్యూసరే ఓటీటీల శరణుగోరుతున్నారు. టాలీవుడ్‌ బడా నిర్మాత అల్లు అరవింద్‌ ‘ఆహా’ పేరుతో ఏకంగా ప్రత్యేక ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఏర్పాటు చేయగా.. మరో స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు కూడా ఆ ప్రయత్నాల్లో ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే సురేష్ ప్రొడక్షన్స్‌ నిర్మించిన ‘కృష్ణ అండ్ హిజ్‌ లీల’ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఆ తర్వాత ‘ భానుమతి అండ్ రామకృష్ణ’, ‘47 డేస్’ తదితర సినిమాలు కూడా డిజిటల్ ప్లాట్ ఫామ్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. దాంతో, ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఒక్కో సినిమా ఓటీటీల బాట పడుతున్నాయి. ఇప్పట్లో థియేటర్లు ఓపెన్‌ అవడం సాధ్యమయ్యేలా లేదు ఒకవేళ తెరుచుకున్నా కరోనా వ్యాక్సిన్‌ వచ్చేదాకా ప్రేక్షకులు వస్తారని చెప్పలేం. ఇలా అన్ని ఆలోచనలు చేసిన నిర్మాతలు తమ సినిమాలను నేరుగా డిజిటల్‌ రిలీజ్‌ చేస్తున్నారు.

Also Read: భారీ ఆఫర్ను కాదనుకున్న మెగా హీరో!

కీర్తి సురేశ్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘పెంగ్విన్‌’ అమెజాన్‌లో విడుదలైంది. ఇప్పుడు నాని, సుధీర్ బాబు నటించిన మల్టీస్టారర్ ‘వి’ సెప్టెంబర్ 5వ తేదీన అమెజాన్‌లోనే లైవ్ స్ట్రీమ్‌ కానుంది. టాలీవుడ్‌ నుంచి ఓటీటీలో రిలీజ్‌ అయ్యే మొదటి పెద్ద సినిమా ఇదే కానుంది. అనుష్క ‘నిశ్శబ్దం’ టీమ్‌ కూడా ఆ సంస్థతో చర్చలు జరుపుతోంది. ఇలా పెద్ద సినిమాలే ఓటీటీలను ఆశ్రయిస్తున్న నేపథ్యంలో యాంకర్ ప్రదీప్‌ హీరోగా తెరంగేట్రం చేయనున్న ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ నిర్మాతలు ఆలోచనలో పడ్డారట. చాన్నాళ్ల కిందటే షూటింగ్‌ పూర్తయిన ఈ సినిమాను మార్చి 25న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, కరోనా రాకతో విడుదల నిరవధికంగా వాయిదా పడింది. హీరోగా ప్రదీప్‌కు ఫస్ట్‌ సినిమా అయినా దీనిపై బాగానే అంచనాలున్నాయి. ముఖ్యంగా ‘నీలి నీలి ఆకాశం’ వీడియో సాంగ్‌ తెగ ఆకట్టుకుంది. ఈ పాటకు ఇప్పటిదాకా 200 మిలియన్ల వ్యూస్‌ (20 కోట్లు) వచ్చాయి. సినిమా రిలీజ్‌ కాకుండానే ఎక్కువ వ్యూస్‌ వచ్చిన దక్షిణాది పాటగా రికార్డు సృష్టించింది. అలాగే, ఒక మిలియన్ పైచిలుకు లైక్స్‌ కూడా లభించాయి. అయితే, సినిమాను థియేటర్లలోనే విడుదల చేద్దామని నిర్మాతలు భావించారు. కానీ, వి లాంటి పెద్ద సినిమాలే ఓటీటీలో వస్తుండడంతో వెనక్కు తగ్గారట. ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌తో చర్చలు జరుపుతున్నారని సమాచారం. డీల్‌ ఓకే అయితే వచ్చే నెలలోనే ప్రదీప్‌ సినిమా డిజిటల్‌ రిలీజ్‌ కానుంది. దాంతో, ఈ సినిమా విడుదలకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది.

నయన్ తో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన విఘ్నేష్


సౌత్ ఇండియాలో నెంబర్ వన్ హీరోయిన్ గా నయనతార కొనసాగుతోంది. లేడి సూపర్ స్టార్ గా నయనతార స్టార్డమ్ సంపాదించుకుంది. ఈ అమ్మడు సినిమా విషయాల కంటే లవ్ ఎఫెర్స్ తోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటోంది. నయనతార వరుసగా ఒకటి రెండు సినిమాలు ఏ హీరోతోనైనా సినిమాలు చేస్తే చాలు కోలీవుడ్లో ఆమెపై గుసగుసలు విన్పిస్తుంటాయి. ఇండస్ట్రీలో నయనతారపై వచ్చిన లవ్ ఎఫెర్స్ మరో హీరోయిన్ పై రాలేదంటే అతిశయోక్తి కాదేమో..!

Also Read: భారీ ఆఫర్ను కాదనుకున్న మెగా హీరో!

నయనతార ప్రేమ.. పెళ్లి మీడియాలో నిత్యం హాట్ టాపిక్ గా ఉంటోంది. ఇప్పటికే పలువురు హీరోలతో ప్రేమాయణం నడిపిన నయనతార పెళ్లివరకు తీసుకెళ్లలేకపోయింది. ప్రేమలో విఫలమవుతూనే.. మళ్లీ ప్రేమలో పడుతూ లేస్తుంటుంది నయనతార. ఇటీవల ఓ ప్రముఖ కోరియోగ్రాఫర్ తో పెళ్లిపీఠల వరకు వెళ్లి చివరి నిమిషంలో క్యాన్సల్ చేసుకుంది. ఆ తర్వాత దర్శకుడు విఘ్నేష్ తో ప్రేమాయణం కొనసాగిస్తుంది.

తాజాగా నయన్ తో పెళ్లిపై ఆమె ప్రియుడు విఘ్నేష్ ఓ ఇంటర్య్వూలో స్పందించాడు. తనకు నయనతార ఇప్పటికే మీడియాలో 22సార్లు పెళ్లయిందని చమత్కరించాడు. తామిద్దరం వృత్తి విషయంలో సాధించాల్సి ఇంకా ఉందని చెప్పాడు. అందుచేత పెళ్లి గురించి పెద్దగా ఆలోచించడం లేదని చెప్పాడు. ప్రస్తుత కొనసాగిస్తున్న డేటింగ్ లైఫ్ బోర్ కొడితే.. అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తానంటూ విఘ్నేష్ చెప్పుకొచ్చాడు.

Also Read: రాశి ఖన్నా డేరింగ్‌ స్టెప్‌..

ఇదిలా ఉంటే ఇటీవల మీడియాతో తనకు.. నయనతారకు కరోనా పాజిటివ్ వచ్చిందని వార్తలు వచ్చాయని.. ఇది తనను ఎంతో బాధించిందని చెప్పాడు. కాగా విఘ్నేష్ ప్రస్తుతం ‘కాటు వాకుల రెండు కాదల్‌’ అనే మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తుండగా నయనతార, సమంత హీరోయిన్లుగా కనిపించనున్నారు. నయనతార పెళ్లికి ఇంకా చాలా టైంపడుతుందని విఘ్నేష్ ఇన్ డైరెక్టుగానే హింట్ ఇచ్చాడు. దీంతో వీరిద్దరు మరికొన్ని రోజులపాటు ప్రేమపక్షుల్లానే విహరించడం ఖాయంగా కన్పిస్తోంది.

టీ.కాంగ్రెస్ కు ఊపుతెచ్చే ప్లాన్ చేశారు?


తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. నేతలు తలోదారిలో వెళ్తున్నారు. నడిపించే నాయకుడు లేక కునారిల్లుతోంది. ఇక బీజేపీ దూసుకొస్తోంది. కాంగ్రెస్ స్థానాన్ని భర్తీ చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ ఊపుతెచ్చే ప్లాన్ కు సిద్దమైంది. కాంగ్రెస్ లో కథనోత్సాహాన్ని తేవాలని యోచిస్తోంది.

రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు గట్టి పోటీనివ్వాలని కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో రథయాత్ర చేపట్టాలని ఆలోచిస్తోంది.

Also Read: కాంగ్రెస్ తో కటీఫ్ అంటున్న కోదండరాం?

హైదరాబాద్ లో నిర్వహించే కాంగ్రెస్ రథయాత్రలో కాంగ్రెస్ నాయకులందరూ పాల్గొనేలా అధిష్టానం రంగం సిద్ధం చేస్తోంది. జంట నగరాల్లోని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఇందులో పాల్గొనేలా ప్లాన్ రెడీ చేశారు.

కాగా ఈ రథయాత్రకు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి నాయకత్వం వహిస్తారని.. సీనియర్ నేత వీ హనుమంతరావు కూడా అందులో భాగం అవుతాడని పార్టీ వర్గాలు చెబుతున్నారు.

ఒకప్పుడు హైదరాబాద్ లో కాంగ్రెస్ అత్యంత బలంగా ఉండేది.. దానం నాగేందర్ ముఖేష్ గౌడ్, పి. జనార్ధన్ రెడ్డి, శశిధర్ రెడ్డి లాంటి బలమైన నేతలు కాంగ్రెస్ లో ఉండేవారు. కానీ ఈ నాయకులలో ఎక్కువమంది టీఆర్ఎస్ లో చేరిపోయారు. కొందరు బలహీనపడ్డారు. దీంతో హైదరాబాద్ లో కొత్త నాయకత్వాన్ని సృష్టించాలని కాంగ్రెస్ యోచిస్తోంది. ఈ క్రమంలోనే రథయాత్రను అందుకు ఊతంగా ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది.

Also Read: అపెక్స్ కౌన్సిల్ లో కేసీఆర్ టార్గెట్ ఇదే…!

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోయిన సారి మూడో స్థానానికి కాంగ్రెస్ పడిపోయింది. ఈసారి అంతకంటే మెరుగైన ప్రదర్శన చేయాలని కోరుకుంటోంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ లో ఒక్క కార్పొరేటర్ కూడా జీహెచ్ఎంసీలో లేరు. రెండోస్థానంలో బీజేపీ ఉంది.

ప్రస్తుతం అధికార టీఆర్ఎస్ ను తట్టుకొని కనీసం రెండో స్థానం దక్కించుకోవాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. ఈ క్రమంలోనే రథయాత్ర ఎంత సక్సెస్ అవుతుందనే దానిపై కాంగ్రెస్ భవిష్యత్ ఆధారపడి ఉంది.

హీరోకి మంత్రిగారి సలహాలు !


హీరో రామ్ కి ఈ మధ్య రాజకీయ సమస్యలు ఎక్కువైపోయాయి. విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ లో జరిగిన అగ్ని ప్రమాదం పై రామ్ ట్విట్టర్ లో స్పందించడంతో.. జగన్ ప్రభుత్వం పైకి అది విమర్శలుగా అనిపించడంతో అందరూ రామ్ ను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా.. ఏపీ మంత్రి కొడాలి నాని, రామ్ పై స్పందిస్తూ.. రామ్ కు కొన్ని ఉచిత సలహాలు కూడా పడేశారు. సలహా అనే కంటే కూడా కౌంటర్ వేశాడు అనుకోవడం బెటర్ ఏమో. కొడాలి నాని మాటల్లోనే.. ‘ఇదిగో రామ్.. నువ్వు నారా చంద్రబాబు నాయుడు మాట వింటే ఇక నీ కెరీర్ అంతే. అసలు చంద్రబాబు గురించి నీకు ఏమి తెలుసు. ఆయన ఎవరి కాళ్లు పట్టుకొని టీడీపీలో చేరారో తెలుసా.. చంద్రబాబు తిన్నింటి వాసాలు లెక్కపెట్టె రకం. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి.. టీడీపీ పార్టీని బలవంతంగా లాక్కున్న సంగతి అందరికీ తెలిసిన విషయాలే.

Also Read: రాశి ఖన్నా డేరింగ్‌ స్టెప్‌..

చంద్రబాబు నాయుడు మాట వింటే బతుకు ఎలా అవుతుందో నీకు తెలియదు అనుకుంటా. బాబును నమ్ముకుంటే ఏమవుతుందో నీకు తెలియాలంటే నీ తోటి హీరోలు పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ లను అడిగి తెలుసుకో. వాళ్లే నీకు చంద్రబాబు గురించి పూసగుచ్చినట్టు వివరిస్తారు. ఇప్పటికైనా ఆలోచించు.. చంద్రబాబు మాటలు వింటే సినిమా కెరీర్ కూడా ఇక గోవిందానే.. అంటూ రామ్ కు కొడాలి నాని కాస్త ఘాటు సలహాలనే ఇచ్చాడు. అయినా రామ్ బంధువు రమేశ్ ఆసుపత్రి ఎండీ రమేశ్ బాబు ఏం తప్పు చేయకపోతే ఎందుకు పారిపోయినట్లు.. రమేశ్ బాబు వెనుక కొంతమంది బడా బాబులు ఉన్నారనేది నిజం కాదా..అంటూ నాని విమర్శలు చేశారు. ముఖ్యంగా రమేశ్ ఎక్కడ దాక్కున్నాడో ఏపీ మొత్తానికి తెలుసు అని.. ప్రస్తుతం చంద్రబాబు ఇంట్లోనే రమేశ్ బాబు దాక్కున్నాడని నాని చెప్పుకొచ్చాడు.

Also Read: ముందు ఆచార్య ఆ తర్వాతే ఆర్ఆర్ఆర్ అంటున్న చెర్రీ

పాపం రామ్… ఇన్నేళ్లు తన సినీ కెరీర్ తప్ప.. మరో మాట మాట్లాడకుండా ఇన్నాళ్ళు సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. మొదటిసారి పొరపాటున ఒక ట్విట్ చేసిన పాపానికి ఏపీ ప్రభుత్వ పెద్దల అందరి చేత నానామాటలు పడాల్సి వస్తోంది. ఏమైనా రామ్ చేసిన ట్వీట్లు ఏపీ రాజకీయాల్లో కాస్త హీటును పెంచాయనేది నిజం.

స్వర్ణ ప్యాలెస్ ఘటన.. జగన్ సర్కార్ కు షాక్


విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదంలో కరోనా చికిత్స కోసం వచ్చిన 12మంది అమయాకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ ఘటనలో అందరి తప్పు ఉంది. స్వర్ణ ప్యాలెస్ లో ఆసుపత్రి నిర్వహించిన రమేశ్ ఆసుపత్రికి.. జాగ్రత్తలు తీసుకోని స్వర్ణ ప్యాలెస్ హోటల్ నిర్వాహకులకు.. ఈ ఆసుపత్రికి పర్మిషన్ ఇచ్చిన ఫైర్ డిపార్ట్ మెంట్ కి.. హోటల్ ను కోవిడ్ సెంటర్ గా మార్చినందుకు అనుమతులు ఇచ్చిన కలెక్టర్, డీఎంహెచ్.వో ఇతర అధికారులకు కూడా ఇందులో తప్పు ఉంది. ఇందులో ఒక్కరిని తప్పు పట్టడానికి లేదు. ఇది ఆస్పత్రి కాకముందే ప్రభుత్వమే ఎయిర్ పోర్ట్ క్వారంటైన్ సెంటర్ గా నడిపింది. దీంతో ఒక్కరిపై నెపాన్ని నెట్టడానికి లేదు.

Also Read: ‘ఆచార్య’ మోషన్ పోస్టర్ పై వివాదం

కానీ ఈ మొత్తం వ్యవహారంలో జగన్ సర్కార్ రమేశ్ ఆస్పత్రినే బాధ్యులుగా చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయడానికి సిద్ధమైంది. దీనిపై డాక్టర్ రమేశ్ హైకోర్టును ఆశ్రయించాడు. ఇక టాలీవుడ్ హీరో రామ్ కూడా తన బాబాయ్ అయిన డాక్టర్ రమేశ్ ను వెనకేసుకొచ్చాడు. ఇది టీడీపీ, వైసీపీల మధ్య రాజకీయవైరంగా మారి మాటల యుద్ధం కూడా నడిచింది. తప్పు మీదంటే మీదని అందరూ నెపాన్ని తప్పించుకుంటున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఇంతకీ తప్పు అందరిదీ అని.. రమేశ్ ఆస్పత్రిని డాక్టర్లను ఎలా బాధ్యులను చేస్తారని తాజాగా హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని కడిగేసింది.

ఈ క్రమంలోనే డాక్టర్ రమేశ్ తోపాటు ఆస్పత్రిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి జగన్ సర్కార్ కు షాకిచ్చింది. అదే క్రమంలో డాక్టర్ రమేశ్ కు ఊరటనిచ్చింది.

స్వర్ణ ప్యాలెస్ ప్రమాదంలో తన అరెస్ట్ చేయకుండా స్టే విధించాలని డాక్టర్ రమేశ్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో డాక్టర్ రమేశ్ విషయంలో తదుపరి చర్యలు నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశించింది. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రమేశ్ హాస్పిటల్ పై ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ పై కూడా హైకోర్టు స్టే విధించింది.

Also Read: సీక్రెట్: ‘హన్సిక బ్యాగ్’లో ఏముందో మీకు తెలుసా?

ఏళ్ల తరబడి స్వర్ణ ప్యాలెస్ హోటల్ నిర్వహించారని.. ఇక హోటల్ లో కోవిడ్ సెంటర్ కు అనుమతిచ్చిన కలెక్టర్, జిల్లా వైద్యాధికారి కూడా ప్రమాదానికి బాధ్యులే కదా అని హైకోర్టు ప్రశ్నించింది. ఈ కేసులో అధికారులను నిందితులుగా చేరుస్తారా అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. డాక్టర్ రమేశ్ ను అరెస్ట్ చేయకుండా ఉంటారా? లేక ఉత్తర్వులు ఇవ్వాలా అని ఆగ్రహించింది. దీంతో ప్రభుత్వ లాయర్ దీనిపై విచారణ కొనసాగుతోందని.. అరెస్టులు ఇంకా చేయలేదని హైకోర్టుకు తెలిపారు.

రాశి ఖన్నా డేరింగ్‌ స్టెప్‌..


తెలుగులో ఇప్పుడు రాశి ఖన్నా హవా నడుస్తోంది. మూడు విజయాలు, ఆరు ఆఫర్లు అన్నట్టుంది ఆమె పరిస్థితి. యువ హీరోతో పాటు స్టార్లతోనూ నటిస్తూ దూసుకుపోతోందామె. ఉత్తరాది నుంచి వచ్చినా చక్కగా తెలుగు మాట్లాడుతూ తన అందచందాలతో అభిమానులను ఆకట్టుకుంటోంది. తన తొలి చిత్రం ఊహలు గుసగుసలాడే తోనే మెప్పించిన ఈ ఢిల్లీ బ్యూటీ ఆ తర్వాత అంచలంచెలుగా ఎదుగుతూ టాలీవుడ్‌లో ఇప్పుడు డిమాండ్‌ ఉన్న నటిగా ఎదిగింది. మధ్యలో కొస్త బొద్దుగా మారి ఇబ్బంది పడ్డా.. తర్వాత స్లిమ్‌గా తయారైంది. విజయ్‌ దేవరకొండ సరసన బోల్డ్‌గా నటించిన వరల్డ్‌ ఫేమస్‌ లవర్ బోల్తా కొట్టినా ఈ మధ్యే ప్రతిరోజూ పండగే, వెంకీమామతో రెండు విజయాలు సొంతం చేసుకుందామె. తన క్లోజ్‌ ఫ్రెండ్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ బాలీవుడ్‌కు చెక్కేయడంతో తెలుగులో అవకాశాలన్నీ రాశీకే దక్కుతున్నాయి. ఈ ఏడాది ఆమె చేతిలో మరో నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. రాశి స్పీడు చూస్తుంటే తొందర్లోనే తెలుగులో నంబర్ వన్‌ హీరోయిన్‌ అయ్యేలా కనిపిస్తోంది. ఈ మధ్యే తమిళ్‌ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి.

Also Read: ‘ఆచార్య’ మోషన్ పోస్టర్ పై వివాదం

ఇలా వరుస సినిమాలతో ఇంత బిజీగా ఉన్న టైమ్‌లో రాశి అనూహ్య నిర్ణయం తీసుకుంది. వెబ్‌ వరల్డ్‌లో అడుగు పెట్టేందుకు డేర్ చేసింది. ప్రస్తుతం అన్ని భాషల్లో వెబ్‌ సిరీస్‌ల హవా పెరుగుతోంది. పలువురు స్టార్ హీరోలు, హీరోయిన్లు ఇప్పటికే వెబ్‌ సిరీస్‌ల బాట పట్టారు.ఈ లిస్ట్‌లో సమంత నుంచి కాజల్‌ అగర్వాల్ వరకూ నటీమణులు ఉన్నారు. రాశి ఖన్నా కూడా వారి బాటలో నడవాలని డిసైడైంది. అయితే, ఓ హిందీ వెబ్‌ సిరీస్‌కు ఆమె సంతకం చేసింది. అది తొందర్లోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. వెబ్‌ సిరీస్‌ గురించి మేకర్స్‌ ఇంకా అధికారిక ప్రకటన చేయకపోయినా రాశి ఒప్పుకున్న వార్త మాత్రం చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం తెలుగు, తమిళ్‌లో పలు భారీ బడ్జెట్‌ సినిమాల కోసం రాశితో దర్శక నిర్మాతలు చర్చలు జరుపుతున్నాయి. ఇక, మాస్‌ మహారాజ రవితేజతో రాశి మరోసారి రొమాన్స్‌ చేయనుంది. రమేశ్‌ వర్మ దర్శకత్వం వహించే ఈ చిత్రానికి రాశిని హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు సమాచారం. ఈ సినిమాకు కిలాడి అనే టైటిల్‌ను ఖరారు చేశారని తెలుస్తోంది.

ముందు ఆచార్య ఆ తర్వాతే ఆర్ఆర్ఆర్ అంటున్న చెర్రీ


దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ కోసం యావత్‌ దేశం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అలాగే, మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న ఆచార్య సినిమా కోసం తెలుగు చిత్ర పరిశ్రమ, తెలుగు ప్రేక్షకులు కూడా అంతే ఆత్రుతగా ఉన్నారు. అయితే, కరోనా కారణంగా రెండు సినిమాల చిత్రీకరణ ఆగిపోయింది. ఆర్ఆర్ఆర్ లో జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా కనిపించనుండగా.. రామ్‌ చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. అలాగే, ఆచార్యలో సైతం చెర్రీ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. వరుసగా నాలుగు బ్లాక్‌బస్టర్ హిట్స్‌తో స్టార్డమ్‌ తెచ్చుకున్న కొరటాల శివ ఎప్పట్లాగే తన మార్కు సోషల్‌ మెసేజ్‌ను మిలితం చేసి ఈ సినిమా తీస్తున్నారు. ఈ నెల 22 చిరంజీవి పుట్టిన రోజు కానుకగా.. ఆచార్య ఫస్ట్‌లుక్‌ పోస్టర్ను రిలీజ్‌ చేశారు. ఈ చిత్రాన్ని 2021 వేసవిలో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. దాంతో వీలైనంత తొందర్లో షూటింగ్‌ ప్రారంభించాలని చిత్ర బృందం ప్లాన్‌ చేస్తోంది. తాజా సమాచారం మేరకు రామ్‌చరణ్‌ కూడా ఆచార్య షూటింగ్‌ పాల్గొనబోతున్నాడు. ఈ సినిమాలో అతను విద్యార్థి నాయకుడి పాత్ర పోషిస్తున్నాడని సమాచారం.

Also Read: సీక్రెట్: ‘హన్సిక బ్యాగ్’లో ఏముందో మీకు తెలుసా?

ఆర్ఆర్ఆర్ షూటింగ్‌ ఇప్పట్లో మొదలయ్యే అవకాశం లేకపోవడంతో చెర్రీ తన తొలి ప్రాధాన్యత ఆచార్యకే ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ చిత్రానికి నిర్మాత కూడా అయిన చెర్రీ దీన్ని వీలైనంత తొందర్లో పూర్తి చేయాలని చూస్తున్నాడు. ఇంతకుముందు మాత్రం ఫస్ట్ ఆర్ఆర్ఆర్ కంప్లీట్‌ చేసి..ఆపై ఆచార్యపై దృష్టి పెట్టాలని ప్లాన్‌ వేసుకున్నాడు. కానీ, కరోనా దెబ్బకు లెక్కలన్నీ తలకిందలయ్యాయి. ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టుగా ప్లాన్స్‌ మార్చుకున్నాడు. ఆచార్య షూటింగ్‌లో పాల్గొనేందుకు రాజమౌళి నుంచి అనుమతి కూడా తీసుకున్నాడని తెలుస్తోంది. కాగా, ఈ చిత్రంలో చిరంజీవి నక్సలైట్‌గా కనిపించబోతున్నాడు. కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. మణిశర్మ మ్యూజిక్‌ డైరెక్టర్.

పెళ్లి కోసం అనుష్క కీలక నిర్ణ‌యం !


అనుష్కలో డైల‌మా రోజురోజుకూ అంత‌కంత‌కు పెరుగుతోంద‌ని.. ఇక తన కెరీర్ గురించి త్వ‌ర‌లోనే ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోవాలని నిర్ణయించుకుందని స్వీటీ సన్నిహితులు నుండి అందుతుందన్న తాజా సమాచారం. ఇంత‌కీ ఏమిటా సంచ‌ల‌న నిర్ణ‌యం అని ఇప్పటికే రాతల రాయళ్లు సోషల్ మీడియాలో అనేక రూమర్స్ ను పుట్టించారనుకోండి. దానికి తోడు అనుష్క కూడా తన పై వస్తోన్న ర‌క‌ర‌కాల రూమ‌ర్లుకు ఏనాడు చెక్ పెట్టే ప్రయత్నం కూడా సరిగ్గా చేయలేదు. ముఖ్యంగా అనుష్క పెళ్లి పై ఆమె ఇంట్లో ప‌దే ప‌దే చ‌ర్చ‌ నడుస్తోందట. అనుష్క మాత్రం పెళ్లి పై ఇంట్రస్ట్ చూపించట్లేదట. కానీ, అనుష్కకు పెళ్లి చేసి లైఫ్ ని సెటిల్ చేయాలని ఆమె ఫ్యామిలీ మెంబర్స్ చూస్తున్నారట.

Also Read: ‘ఆచార్య’ మోషన్ పోస్టర్ పై వివాదం

కాగా నిరంత‌రం తన కుటుంబీకుల నుంచి పెళ్లి ఒత్తిడిని ఎదుర్కొంటున్న అనుష్క ఇక తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.. ఇప్పటికే ఆమె కుటుంబ సభ్యులు కూడా పెళ్లి సంబంధాలు చూడటం స్టార్ట్ చేశారని కోలీవుడ్ మీడియాలో ప్రముఖంగా వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే అనుష్క ఇకనుండి సినిమాల్లో కూడా నటించకూడదని.. ఇక‌ పై తన న‌ట‌నా వృత్తికి కూడా గుడ్ బాయ్ చెప్పేయ‌నుంద‌ని.. అందుకే ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తోంది. ఇక కొత్తగా వేరొక క‌మిట్ మెంట్ ను అంగీక‌రించ‌క‌పోవ‌డానికి కార‌ణం కూడా పెళ్లి ప్లానే అని తెలుస్తోంది.

Also Read: సీక్రెట్: ‘హన్సిక బ్యాగ్’లో ఏముందో మీకు తెలుసా?

నిజానికి స్వీటీ త్వరగా పెళ్లి కావాలనే ఇంత‌కుముందు త‌న కుటుంబ స‌భ్యుల‌తో శ్రీ‌కాళ‌హ‌స్తిలో ప్రత్యేకంగా పూజలు కూడా చేయించుకుంది. అయినా అనుష్కకి పెళ్లి సెట్ కాలేదు. ఇక అనుష్క సినీ కెరీర్ స్టార్ట్ అయి ఇప్ప‌టికే దాదాపు 15 ఏళ్లు పూర్త‌యింది. ఒక చిన్న హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఎదిగి టాలీవుడ్ లోనే నెంబర్ వన్ పొజిషన్ కి వచ్చి.. ముఖ్యంగా అరుంధ‌తి సినిమాతో బాక్సాఫీస్ జేజమ్మ‌గా సంచ‌ల‌నాలు సృష్టించింది. ఆ త‌ర్వాత బాహుబ‌లి లాంటి పాన్ ఇండియా సినిమాలో డీగ్లామ‌ర‌స్ పాత్ర లో నటించి నటిగా కూడా తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది.

భారీ ఆఫర్ను కాదనుకున్న మెగా హీరో!


ఇప్పటికే ఎంతో మంది హీరోలను టాలీవుడ్‌కు అందించిన మెగా కాంపౌండ్‌ నుంచి ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న తాజా వ్యక్తి పంజా వైష్ణవ్‌ తేజ్. ఇతను చిరంజీవి మేనల్లుడు. సాయి ధరమ్‌ తేజ్‌కు తమ్ముడు. అతను హీరోగా నటించిన తొలి చిత్రం ‘ఉప్పెన’. వైష్ణవ్‌ సరసన హీరోయిన్‌గా కృతి శెట్టి నటించింది. కన్నడ అగ్ర నటుడు విజయ్‌ సేతుపతి కీలక పాత్ర పోషించాడు. బుచ్చిబాబు సాన దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్‌, మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. దేవీశ్రీప్రసాద్‌ సంగీతం అందించిన ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకొని ఫస్ట్‌ కాపీతో విడుదలకు సిద్దంగా ఉంది. మెగా కాంపౌండ్‌ హీరో, సుకుమార్ కథ అందించడంతో ఈ మూవీపై ఇప్పటికే ఆసక్తి పెరిగింది. పైగా, ఈ చిత్రం ఫస్ట్‌ లిరికల్‌ వీడియో సాంగ్‌ ‘నీకల్లు నీలి సముద్రం’ యూ ట్యూబ్‌లో హల్‌చల్‌ చేస్తోంది.

Also Read: ‘ఆచార్య’ మోషన్ పోస్టర్ పై వివాదం

పలు పెద్ద చిత్రాలు ఇప్పుడు ఓటీటీ బాట పడుతుండడంతో ఈ చిత్రం కూడా డిజిటల్‌ రిలీజ్ అవుతుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ, ఓటీటీలో విడుదలకు హీరో వైష్ణవ్‌తో పాటు చిత్రబృందం ఆసక్తి కనబరచడం లేదు. ఈ చిత్రాన్ని దాదాపు 22 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ మధ్య భారీ డీల్‌ను చిత్ర బృందం తిరస్కరించింది. ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉప్పెన డిజిటల్‌ రిలీజ్‌ రైట్స్‌ కోసం రూ. 13 కోట్లు ఆఫర్ చేసినట్టు సమాచారం. కానీ, వైష్ణవ్‌, నిర్మాతలు ఆ ఆఫర్ను రిజెక్ట్‌ చేశారట. ఈ సినిమాను థియేటర్లలోనే రిలీజ్‌ చేయాలని భావిస్తున్నారట. చిన్న సినిమాకు 13 కోట్ల ఆఫర్ పెద్దదే అయినప్పటికీ నేరుగా రిలీజ్‌ చేస్తే పెద్ద మొత్తం వస్తుందని నిర్మాతలు ఆశిస్తున్నారు. అలాగే, మెగా కాంపౌండ్‌ నుంచి అరంగేట్రం చేస్తున్న హీరో వైష్ణవ్‌కు తగిన గుర్తింపు రావాలంటే థియేటర్ రిలీజ్‌ ఒక్కటే మార్గం అని డిసైడయ్యారట. షూటింగ్‌కు అనుమతులు వచ్చిన నేపథ్యంలో ఇంకొంత కాలం వేచి చూస్తే సినిమా హాళ్లు కూడా తెరుచుకుంటాయని భావిస్తున్నారు. దాంతో ఇంకో రెండు, మూడు నెలలైనా వేచి చూసేందుకు రెడీగా ఉన్నారని టాలీవుడ్‌ వర్గాల సమాచారం. కాగా, వైష్ణవ్‌ ఇప్పటికే తన రెండో సినిమాతో బిజీ అయ్యాడు. స్టార్ డైరెక్టర్ క్రిష్‌ తీస్తున్న ఈ చిత్రం ఈ మధ్యే మొదలైంది. వైష్ణవ్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఒంటరి పోరాటం చేస్తున్న చంద్రన్న..!

ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుకోవాల్సి వస్తే 2019 ఎన్నికలకు ముందు 2019 ఎన్నికలకు తరువాత అని మాట్లాడుకోవాల్సి వస్తోంది. తెలంగాణలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కథ ముగిసిపోగా ఏపీలో కూడా చంద్రబాబు నాయుడు ఒంటరి అవుతున్నాడా…? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. 2019 ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన టీడీపీ కేవలం 23 స్థానాలతో సరిపెట్టుకుంది.

Also Read : ఒకరి తర్వాత ఒకరు భలే తగులుకున్నారు… ఆర్కే కి ఊపిరి ఆడుతోందా?

అయితే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గత ఎన్నికలలో చూపినంత ప్రభావం కూడా చూపదని చెబుతున్నాయి. బాబు పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నా వామపక్షాలు మాత్రమే బాబుతో పొత్తుకు మొగ్గు చూపుతున్నాయి. అయితే ఏపీలో వామపక్షాలతో కలిసి పోటీ చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని టీడీపీ భావిస్తున్నా సోము వీర్రాజు చంద్రబాబుపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో అది జరిగే పని కాదు.

రాష్ట్ర బీజేపీ నేతలు భవిష్యత్తుల్లో టీడీపీ కలిసి పని చేయాలని అనుకోవడం లేదు. ఇప్పటికే బీజేపీ కీలక నేతలంతా చంద్రబాబుపై ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు లేదా టీడీపీ నేతలు బీజేపీపై విమర్శలు చేస్తే మాత్రం బీజేపీ టీడీపీకి మధ్య శత్రుత్వం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. బీజేపీ అద్యక్ష స్థానంలో మార్పు వచ్చిన నెల రోజుల్లోనే మారుతున్న పరిస్థితులు ఏపీలో చంద్రబాబు ఒంటరి అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాయి.

Also Read : ట్రెండ్ సెట్.. వాట్సాప్ గ్రూప్ లో లడ్డూ వేలం..!

సీక్రెట్: ‘హన్సిక బ్యాగ్’లో ఏముందో మీకు తెలుసా?

హీరోయిన్లకు సంబంధించిన ప్రతి విషయం అభిమానులకు ఆసక్తికరమే. హీరోయిన్ల హ్యాండ్ బ్యాగ్ లో ఉండే వస్తువుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అభిమానుల్లో ఉంటుంది. ఇప్పటికే కొంతమంది హీరోయిన్లు తమ హ్యాండ్ బ్యాగ్ లలో దాచుకునే వస్తువుల గురించి అభిమానులతో షేర్ చేసుకున్నారు. తాజాగా హన్సిక కూడా అభిమానులతో ఈ వివరాలను పంచుకుంది. తన హ్యాండ్ బ్యాగ్ లో ఎప్పుడూ ఒకే తరహా వస్తువులు ఉంటాయని అయితే హ్యాండ్ బ్యాగ్ మాత్రం ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటానని హన్సిక చెప్పింది.

Also Read : నిర్మాణంలో చరణ్ కి కొత్త భాగస్వామ్యం !

తాను ప్రతి సోమవారం హ్యాండ్ బ్యాగ్ మారుస్తానని… తన దగ్గర చాలా హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయని… వాటికి ప్రపంచాన్ని చూసే అవకాశాన్ని తాను కల్పిస్తానని అన్నారు. అందరూ పెంచుకునే పిల్లులు, కుక్కలకు ముద్దు పేర్లు పెట్టుకుంటూ ఉంటారని తాను మాత్రం తనకు ఎంతో ఇష్టమైన హ్యాండ్ బ్యాగ్స్ కు ముద్దు పేర్లు పెట్టుకుంటానని హన్సిక చెబుతున్నారు. ముద్దుపేర్లతో హ్యాండ్ బ్యాగ్స్ ను పిలవడం తనకు ఎంతో ఇష్టమని చెప్పారు.

తన హ్యాండ్ బ్యాగ్ లో ఏఏ వస్తువులు ఉంటాయో ఆ విషయాలను కూడా హన్సిక వెల్లడించారు. బ్యాగులో మాస్కులు, శానిటైజర్ తప్పక పెట్టుకుంటానని ఆమె చెప్పారు. ప్రస్తుతం తన హ్యాండ్ బ్యాగ్ లో మాస్కులు, శానిటైజర్ ఉంటున్నాయని 5 రకాల పెర్ఫ్యూమ్స్, మినీ మేకప్ కిట్, పర్స్ హ్యాండ్ బ్యాగ్ లో ఉంటాయని… మరో రకంగా చెప్పాలంటే తన హ్యాండ్ బ్యాగ్ లో ఉంటుందని… అయితే ఆహార పదార్థాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టనని హన్సిక చెబుతున్నారు.

Also Read : ‘ఆచార్య’ మోషన్ పోస్టర్ పై వివాదం

ట్రెండ్ సెట్.. వాట్సాప్ గ్రూప్ లో లడ్డూ వేలం..!


కరోనా మహమ్మరి కారణంగా ఈసారి గణేష్ నవరాత్రి ఉత్సవాలు కళ తప్పిపోయాయి. పల్లెలు, నగరాలు, బస్తీల్లో పెద్దగా వినాయకుడి విగ్రహాలు సందడి కన్పించడం లేదు. అడుగడుగునా కన్పించే వినాయక మండపాలు కరోనా కారణంగా ఈసారి పెద్దగా కన్పించడం లేదు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుండటంతో పోలీసులు వినాయక విగ్రహాలపై ఆంక్షలు విధించారు. నవరాత్రుల్లో కరోనా నిబంధనలు పాటించడం అంత సులువు కాకపోవడంతో ప్రజలు పెద్దగా ఆసక్తిని చూపడం లేదని తెలుస్తోంది.

Also Read: ఒకరి తర్వాత ఒకరు భలే తగులుకున్నారు… ఆర్కే కి ఊపిరి ఆడుతోందా?

ప్రతీయేటా ఎంతో వైభవంగా జరిగే గణేష్ ఉత్సవాలు ఈసారి సాదాసీదాగా జరుగుతున్నాయి. మాస్కులు ధరిస్తే వినాయక మండపాల్లోకి భక్తులకు ఎంట్రీ లభిస్తుంది. భౌతిక దూరం పాటించేలా.. శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకునేలా ఏర్పాట్లను ఉత్సవ కమిటీ నిర్వాహాకులు ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నారు. కరోనా నిబంధనలు పాటించేలా నిర్వాహకులు చర్యలు చేపడుతున్నారు. అయితే వినాయక ఉత్సవాల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచే లడ్డూవేలం ఎలా నిర్వహిస్తారనే ఆసక్తి అందరిలో నెలకొంది.

లడ్డూవేలంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని వేలంపాడటం ఆనవాయితీగా వస్తోంది. అయితే కరోనా నిబంధనలు ఉండటంతో లడ్డూ వేలం పాటలకు ఆటంకం కలిగే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఉత్సవ కమిటీ నిర్వహాకులు లడ్డూవేలం కోసం వాట్సాప్ గ్రూపులను నిర్వహిస్తున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని మొండేటి వీధి లక్ష్మీ గణపతి ఆలయంలో లడ్డూను వాట్సాప్ గ్రూప్ ద్వారా వేలం నిర్వహించి కొత్త ట్రెండ్ సెట్ చేశారు.

Also Read: నిరుద్యోగ యువతకు జగన్ గుడ్ న్యూస్

ఏకంగా నలుగురు వ్యక్తులు కలిసి రూ.1.03 లక్షలకు వినాయకుడి లడ్డూను దక్కించుకోవడం విశేషం. ఈ సందర్భంగా లక్ష్మీ గణపతి ఆలయ అధికారులు మాట్లాడుతూ వాట్సాప్ ద్వారా వేలం నిర్వహించడం కొత్తగా ఉందని.. కోవిడ్ మహామ్మరి దృష్ట్యా ఇలా చేయాల్సి వచ్చిందన్నారు. వాట్సాప్ లో లడ్డూ వేలంపాటలకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. దీంతో నిర్వాహాకులు కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో వినాయకుడి లడ్డూ వేలం పాటలు కొత్త ట్రెండ్ సృష్టించడం ఖాయంగా కన్పిస్తున్నాయి.