
ఈసారి ఎలాగైనా పశ్చిమ బెంగాల్లో పాగా వేయాలని బీజేపీ భావిస్తోంది. కిందటిసారే బీజేపీ సర్కార్ సీఎం మమతా బెనర్జీకి గట్టి షాకిచ్చేందుకు ప్రయత్నించింది. అయితే మమతా బెనర్జీ(దిదీ) ముందు బీజేపీ పప్పులు ఉడకలేదు. మోదీ-అమిత్ షా వ్యూహాలను దిదీ చాకచాక్యంగా ఎదుర్కొని పశ్చిమ బెంగాల్లో తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంది.
Also Read: సోనియా కి అధ్యక్ష పదవి రావడం వెనుక ఇంత రాజకీయం జరిగిందా..? పాపం రాహుల్….
తొలి నుంచి మమతా బెనర్జీ మోదీ సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడుతోంది. వీలుచిక్కినప్పుడల్లా ప్రధాని మోదీ వైఫల్యాలపై విరుచుకుపడుతోంది. ఇక బీజేపీ రెండోసారి అధికారంలోకి రావడంతో ఆయా రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకునేందుకు కమలం నేతలు పావులు కదుపుతున్నారు. తొలి నుంచి మోదీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న దిదీకి ఈసారి గట్టి షాకివ్వాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. ఇందులో భాగంగానే పక్కా ప్రణాళికతో బీజేపీ ముందుకెళుతోంది.
పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాదిలో జరుగనున్నాయి. దీంతో బీజేపీ ఇప్పటి నుంచే దిదీని ఎదుర్కొనేందుకు వ్యూహాలను రచిస్తోంది. ఇందులో భాగంగా భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని బీజేపీ రంగంలోకి దింపేందుకు రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతోనే మమతా బెనర్జీ సర్కార్ పాఠశాల నిర్మాణం కోసం తనకు కేటాయించిన రెండెకరాల స్థలాన్ని గంగూలీ తాజాగా తిరిగిచ్చాడనే టాక్ విన్పిస్తోంది.
Also Read: సుశాంత్ ను చంపి ఉరితీశారా? సీబీఐ విచారణలో కొత్త కోణం?
ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్న గంగూలీ బీజేపీ నేతలకు మాత్రం టచ్లోనే ఉంటున్నాడు. 2019లో గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడు అయ్యేందుకు ప్రస్తుతం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మరో ఇద్దరు కేంద్రమంత్రులు సాయం చేశారనే ప్రచారం ఉంది. కొద్దిరోజుల్లో బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటంతో గంగూలీ బీజేపీ తరుపున ప్రచారం చేస్తాడనే టాక్ విన్పిస్తోంది. వీలైతే బీజేపీ బెంగాల్ సీఎం అభ్యర్థిగా గంగూలీని బరిలో దింపేందుకు రెడీ అవుతోంది. దాదా చరిష్మాతో దిదీకి చెక్ పెట్టాలని బీజేపీ భావిస్తోంది. అయితే గంగూలీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాడా? లేదా అనేది వేచి చూడాల్సిందే..!