
దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అలాగే, మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న ఆచార్య సినిమా కోసం తెలుగు చిత్ర పరిశ్రమ, తెలుగు ప్రేక్షకులు కూడా అంతే ఆత్రుతగా ఉన్నారు. అయితే, కరోనా కారణంగా రెండు సినిమాల చిత్రీకరణ ఆగిపోయింది. ఆర్ఆర్ఆర్ లో జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా కనిపించనుండగా.. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. అలాగే, ఆచార్యలో సైతం చెర్రీ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. వరుసగా నాలుగు బ్లాక్‌బస్టర్ హిట్స్‌తో స్టార్డమ్ తెచ్చుకున్న కొరటాల శివ ఎప్పట్లాగే తన మార్కు సోషల్ మెసేజ్‌ను మిలితం చేసి ఈ సినిమా తీస్తున్నారు. ఈ నెల 22 చిరంజీవి పుట్టిన రోజు కానుకగా.. ఆచార్య ఫస్ట్‌లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని 2021 వేసవిలో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. దాంతో వీలైనంత తొందర్లో షూటింగ్ ప్రారంభించాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. తాజా సమాచారం మేరకు రామ్‌చరణ్ కూడా ఆచార్య షూటింగ్ పాల్గొనబోతున్నాడు. ఈ సినిమాలో అతను విద్యార్థి నాయకుడి పాత్ర పోషిస్తున్నాడని సమాచారం.
Also Read: సీక్రెట్: ‘హన్సిక బ్యాగ్’లో ఏముందో మీకు తెలుసా?
ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఇప్పట్లో మొదలయ్యే అవకాశం లేకపోవడంతో చెర్రీ తన తొలి ప్రాధాన్యత ఆచార్యకే ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ చిత్రానికి నిర్మాత కూడా అయిన చెర్రీ దీన్ని వీలైనంత తొందర్లో పూర్తి చేయాలని చూస్తున్నాడు. ఇంతకుముందు మాత్రం ఫస్ట్ ఆర్ఆర్ఆర్ కంప్లీట్ చేసి..ఆపై ఆచార్యపై దృష్టి పెట్టాలని ప్లాన్ వేసుకున్నాడు. కానీ, కరోనా దెబ్బకు లెక్కలన్నీ తలకిందలయ్యాయి. ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టుగా ప్లాన్స్ మార్చుకున్నాడు. ఆచార్య షూటింగ్‌లో పాల్గొనేందుకు రాజమౌళి నుంచి అనుమతి కూడా తీసుకున్నాడని తెలుస్తోంది. కాగా, ఈ చిత్రంలో చిరంజీవి నక్సలైట్‌గా కనిపించబోతున్నాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్.