Home Blog Page 8349

బాలయ్య బాబుకు హీరోయిన్ గా జయసుధ !


నందమూరి బాలకృష్ణ భార్యగా సహజ నటి జయసుధ నటించబోతుంది. నట సింహంగా పిలిపించుకునే బాలయ్య బాబు, ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సీనియర్ బాలయ్యకు భార్య పాత్ర ఉందట. ఈ పాత్రలో సిమ్రాన్ తీసుకోవాలని మొదట భావించారు. అయితే ఈ మధ్య జయసుధ అందరికీ ఫోన్ చేసి.. మీ సినిమాలో నా కోసం ఒక క్యారెక్టర్ చూడండి… కరోనా అనంతరం షూట్ లో పాల్గొంటాను అని అడుగుతుందట. ఈ క్రమంలో బాలయ్య బాబుకు ఫోన్ వచ్చినట్టు ఉంది. అసలుకే బాలయ్య బాబు ఎప్పుడూ ఎవరికి వరం ఇద్దామా అన్నట్టు ఉంటాడు. జయసుధ అడగటం ఆలస్యం.. వెంటనే బోయపాటి శ్రీనుకి ఆర్డర్ వెళ్ళింది.. ఆ రకంగా జయసుధ బాలయ్య బాబుకు భార్యగా ఫిక్స్ అయింది.

Also Read: మిల్కీ బ్యూటీ తమన్నా ఇంట్లో కరోనా కలకలం…?

ఆయితే బోయపాటి సీనియర్ బాలయ్య క్యారెక్టర్ కి కూడా ఒక సీన్ లో కొంచెం రొమాన్స్ రాసుకున్నాడట. ఓ సాంగ్ కూడా ఉంటుందట. మొదట సిమ్రాన్ అనుకున్నాడు కాబట్టి.. బాలయ్య సిమ్రాన్ ల మధ్య సాంగ్ కూడా బాగా వర్కౌట్ అవుతుందని లెక్కలు వేసుకున్నాడట. ఇప్పుడు ఈ పాత్రలో జయసుధను పెట్టుకోవాల్సి రావడంతో బోయపాటి, ఈ పాత్ర గురించి జయసుధకు వివరించాడని.. కాస్త సాంగ్ లో కూడా చేయాల్సి ఉంటుంది అని చెప్పగా.. జయసుధ కూడా చేస్తాను అని అంటుందట. మరి ఈ వయసులో జయసుధ, బాలయ్య భార్య పాత్రకు ఎంతవరకు న్యాయం చేయగలుగుతుందో చూడాలి.

Also Read: అందరూ ఐపోయారు… ఇక తన జీవితాన్నే సినిమాగా తీస్తున్న ఆర్జీవీ

ఇక బాలయ్య ముదురు పాత్రకు హీరోయిన్ విషయాన్ని పక్కన పెడితే.. బాలయ్య యంగ్ క్యారెక్టర్ కి హీరోయిన్ మాత్రం దొరకడం లేదు. కొత్త హీరోయిన్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నా.. బాలయ్య బాబు పక్కన మరీ ఇప్పుడే ఇండస్ట్రీకి వచ్చిన హీరోయిన్ ఏం బాగుంటుంది. అందుకే ఇంకా హీరోయిన్ ఫిక్స్ చేయకుండానే కరోనాకి ముందు ఈ మూవీకి సంబంధించిన ఒక యాక్షన్ షెడ్యూల్ ని కూడా ఫినిష్ చేశారు. కరోనా అనంతరం జరిగే షూట్ లో కూడా హీరోయిన్ పార్ట్ కు సంబంధించిన సీన్స్ ను లేకుండా బోయపాటి షూట్ ప్లాన్ చేస్తున్నాడట. ఏమైనా బాలయ్యకి హీరోయిన్ సమస్య ప్రతి సినిమాకి ఉండేదే. నిజానికి ఈ సినిమా కోసం చాలామంది హీరోయిన్లను అడిగినా.. బాలయ్య అనేసరికి కాస్త వెనకడుగు వేస్తున్నారట.

అన్నీ చేసినా.. పెద్దగా సంపాదించలేకపోయాను !


హాట్ బ్యూటీ ‘శ్రద్దా దాస్’కి అందం ఉంది, అభినయం ఉంది.. అన్నిటికిమించి సినిమా కోసం ఒళ్ళు దాచుకోకుండా నగ్న ప్రదర్శనలకు సర్వదా సహస్రా కట్టుబడి ఉంది. కానీ ఏం లాభం సినిమాల్లో పెద్దగా సక్సెస్ కాలేకపోతుంది. స్టార్ హీరోల సినిమాల్లో సెకెండ్ లీడ్ క్యారెక్టర్స్ కూడా శ్రద్ధా దాస్ కి రావడం లేదు అంటే.. ఈ బ్యూటీ అవకాశాల దాహం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. పాపం అందుకేనేమో నాకు ఛాన్స్ లు ఇవ్వండి మహాప్రభో అంటూ ఎప్పుడూ హాట్ హాట్ లుక్స్ తో కుర్రకారుకు హీట్ పెంచుతుంది. ఏమైనా బోల్డ్ ఎక్స్ పోజింగ్ విషయంలో శ్రద్ధా దాస్ గురించి ఎంత చెప్పుకున్నా అది ముమ్మాటికీ తక్కువే అవుతుందనేది నెటిజన్ల అభిప్రాయం.

Also Read: అందరూ ఐపోయారు… ఇక తన జీవితాన్నే సినిమాగా తీస్తున్న ఆర్జీవీ

నిజానికి శ్రద్దాకి కాస్త నటన బాగా వచ్చినా.. ఈ పాటికి స్టార్ హీరోయిన్ అయిపోయేది. ఎలాగూ అందాలను పదర్శించడంలో అసలు మొహమాట పడదు. పైగా రొమాంటిక్ సీన్స్ నటించడంలో ఇప్పటికే ఆరితేరిపోయింది. బికిని వేసినా హాఫ్ సారీ కట్టినా శ్రద్దా రెచ్చగొట్టే చూపులు, తన సొగసుల అందాలతో చేసే కనువిందుల గురించి ఏం చెప్పాలి ఎంతని చెప్పాలి. కానీ, ప్చ్…ఎంత చేసినా శ్రద్ధా సాధించింది ఏమి లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు సంపాదించినంత కూడా తానూ సంపాధించలేకపోయాను అని శ్రద్దా తాజాగా ఓ మలయాళ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బాధల బంధిని తీరిగ్గా వెల్లడించింది. తన కెరీర్ లో తానూ ఎక్కడ తప్పు చేశానో అర్ధం కావడం లేదని.. ముందు నుంచీ ఇండస్ట్రీ పెద్దలతో చాలా సన్నిహితంగా ఉన్నానని అంది

Also Read: మెగా మేనల్లుడు క్లిక్ అయ్యేలా ఉన్నాడు !

అయినా కూడా నాకు రావాల్సిన స్థాయిలో అవకాశాలు గాని, గుర్తింపు గాని రాలేదు అని.. లేకపోయి ఉంటే.. ‘ఆర్య 2, డార్లింగ్, గుంటూరు టాకీస్, గరుడవేగ’ లాంటి హిట్ చిత్రాల్లో నటించినా.. నాకు ఆ తరువాత అవకాశాలు ఎందుకు రావు.నా ఈ జర్నీ మొత్తంలో నేను అర్ధం చేసుకున్న దాని ప్రకారం.. ఇండస్ట్రీలో సక్సెస్ కావాలంటే.. చాలా తక్కువ మంది సక్సెస్ పీపుల్ తోనే ట్రావెల్ అవ్వాలని..పిలిచిన ప్రతి ఒక్కరితో జర్నీ చేస్తే.. మనం అందరికీ న్యాయం చేయలేమని.. అప్పుడు మనకు ఎవ్వరూ అవకాశాలు ఇవ్వరని.. నాకు అలాగే జరిగిందని.. నా కెరీర్ లో నేను మంచి రోల్స్ చేసినా హీరోయిన్ గా మాత్రం ఒక బ్రాండ్ ను తెచ్చుకోలేకపోయానని.. చివరకు చిన్నాచితకా రోల్స్ కు పరిమితం అవాల్సి వచ్చిందని ఈ హాట్ బ్యూటీ తన బాధను వ్యక్తపరిచింది.

మిల్కీ బ్యూటీ తమన్నా ఇంట్లో కరోనా కలకలం…?

భారత్ లో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి బారిన సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, వారి కుటుంబ సభ్యులు పడుతున్న సంగతి తెలిసిందే. అయితే వైరస్ బారిన పడుతున్న వారిలో చాలామంది త్వరగానే కోలుకుంటున్నారు. తాజాగా ప్రముఖ సినీ నటి తమన్నా తల్లిదండ్రులు కరోనా బారిన పడ్డారు. స్వయంగా తమన్నానే ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించడం గమనార్హం. బిగ్ బీ అమితాబ్, దర్శక ధీరుడు రాజమౌళి, ఎస్బీ బాలు లాంటి సినీ ప్రముఖులు కరోనా బారిన పడగా తాజాగా ఈ జాబితాలో తమన్నా చేరింది.

గత కొన్ని రోజుల నుంచి తమన్నా తల్లిదండ్రులలో కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. దీంతో వాళ్లు అప్రమత్తమై వెంటనే కరోనా పరీక్షలు చేయించారు. పరీక్షల్లో తమన్నా తల్లి, తండ్రికి పాజిటివ్ నిర్ధారణ అయింది. తమన్నాతో పాటు సిబ్బంది సైతం కరోనా పరీక్షలు చేయించుకోగా వాళ్లకు మాత్రం నెగిటివ్ నిర్ధారణ కావడం గమనార్హం. వాళ్లు త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నానని తమన్నా పేర్కొంది.

ప్రస్తుతం తమన్నా తల్లిదండ్రులు కరోనాకు చికిత్స పొందుతున్నారు. తమన్నా తల్లిదండ్రులకు కరోనా నిర్ధారణ కావడం ఆమె అభిమానులను సైతం కలవరపెడుతోంది. వాళ్లు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నామని ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. తమన్నా తల్లిదండ్రులు హోం ఐసోలేషన్ లో ఉండి వైద్యులచే చికిత్స చేయించుకుంటున్నారు. మరోవైపు తమన్నా నటించిన దటీజ్ మహాలక్ష్మి సినిమా ఓటీటీ వేదికగా విడుదల కానుందని తెలుస్తోంది.

అందరూ ఐపోయారు… ఇక తన జీవితాన్నే సినిమాగా తీస్తున్న ఆర్జీవీ


రామ్‌గోపాల్ వర్మ. ఈ పేరు చెబితే గొప్ప గొప్ప సినిమాలు గుర్తొస్తాయి. ఎన్నో చెత్త చిత్రాలూ కళ్ల ముందు కదలాడుతాయి. భారత సినిమా చరిత్రలో గొప్ప దర్శకుల్లో అతని పేరుంటుంది. చెత్త దర్శకుల లిస్ట్‌లో కూడా ముందుంటుంది. ప్రతి రోజూ ఏదో ఒక వివాదాన్ని రాజేసే ఆర్జీవీ ఏం చేసినా సంచలనమే. తన సినిమాలు, ఇంటర్వ్యూలు, ట్వీట్లతో అగ్గిరాజేస్తుంటాడు. సమజంలో జరిగే యాదార్థ సంఘటనల ఇతివృత్తంగా సినిమాలు తీయడంలో ఆర్జీవీని మించిన వాళ్లు లేరు. రక్తచరిత్ర, వంగవీటి, లక్ష్మీస్‌ ఎన్టీఆర్, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు.. అదే కోవలోకి చెందిన చిత్రాలు. బయోపిక్స్‌ తీయడంలోనూ ఆర్జీవీ దిట్ట. మాఫియా డాన్ల నుంచి రాజకీయ, సినీ ప్రముఖుల వరకూ అందరి జీవితాలను తెరకెక్కించాడు. అయితే, అతని లిస్ట్‌లో ఉన్న ప్రముఖులు అయిపోయినట్టున్నారు. ఇప్పుడు తన జీవితాన్నే సినిమాగా మలుస్తున్నాడు.

తన లైఫ్‌ ఆధారంగా మూడు పార్టుల బయోపిక్‌ తీస్తున్నట్టు ఆర్జీవీ ప్రకటించాడు. రాము, రామ్‌ గోపాల్‌ వర్మ, ఆర్జీవీ అనే టైటిల్స్‌తో మూడు పార్టులను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు తెలిపాడు. ఈ బయోపిక్‌ను బొమ్మకు మురళీ నిర్మించనుండగా.. దొరసాయి తేజ డైరెక్ట్‌ చేయనున్నాడు. రామ్‌ గోపాల వర్మ తన బయోపిక్‌ను పర్యవేక్షించనున్నాడు. సెప్టెంబర్లో సినిమా షూటింగ్‌ మొదలవనుంది. ఒక్కో పార్టు నిడివి రెండు గంటలు ఉంటుందని, మూడు పార్టులు కలిపి ఆరు గంటల్లో తన జీవితాన్ని చూస్తారని ఆర్జీవీ చెప్పాడు. 3 పార్టుల్లో ,ఒక్కొక్క పార్టు తన వేరు వేరు వయసుల్లో వేరు వేరు అంశాలను చూపెట్టబోతోంది అన్నాడు. చివరి పార్టులో తానే స్వయంగా నటిస్తానని తెలిపాడు.

‘పార్ట్ 1 లో నా 20 ఏళ్ళప్పుడు రోల్ ఒక కొత్త నటుడు నటించబోతున్నాడు. పార్ట్ 2 లో వేరే నటుడు, పార్ట్ 3 లో నేనే నాలగా నటించబోతున్నా’ అని ట్వీట్‌ చేశాడు. ఒక్కో పార్ట్‌ ఎలా ఉంటుందో వివరించాడు. ‘పార్ట్ 1 “రాము “.. దీంట్లో నా కాలేజ్ రోజులు, తోలి ప్రేమలు, గ్యాoగ్ ఫైట్స్ తో మొదలయ్యి శివ చేయడానికి ఎలాంటి పన్నాగాలు పన్నానన్నది ఉంటుంది. పార్ట్ 2 “రామ్ గోపాల్ వర్మ” -అండర్ వరల్డ్ తో ప్రేమాయణం . ఇది నా ముంబై జీవితంలో అమ్మాయిలు, గ్యాంగ్ స్టర్స్ ,అమితాబ్ బచ్చన్ లతో ఉన్న అనుబంధాల గురించి. పార్ట్ 3 ఆర్జీవీ -ది ఇంటెలిజెంట్ ఇడియట్. ఇది నా ఫేయిల్యూర్లు, వివాదాలు, దేవుళ్ళ పట్ల, సెక్స్ పట్ల , సమాజం పట్ల నాకున్న విపరీత వైఖరుల గురించి’ అని ఆర్జీవీ పేర్కొన్నాడు. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్ ను మరికొన్ని గంటల్లో రిలీజ్‌ చేయనున్నాడు.

 

షో మొదలు కాకముందే రచ్చ మొదలైంది !


ఎన్టీఆర్ స్టార్ డమ్ పుణ్యమా అని బిగ్ బాస్ అనే షో తెలుగు వాకిట్లో అమ్మలక్కల ముచ్చట్లులో ఒక భాగమైపోయింది. దాంతో బిగ్ బాస్ 4 మొదలు కాకుండానే ఎక్కడా లేని హడావుడి కనిపిస్తోంది. షో పై తిట్ల వర్షం ఒకవైపు, ప్రశంసల జల్లు మరోవైపు. ఈ లోపు అనుకున్నది అంతా అయ్యింది. షో మొదలు కాకముందే.. షో పై రచ్చ మొదలైంది. ఏది మొదలైన ఈ షోకి అదంతా ఫ్రీ పబ్లిసిటీనే. ఏమైనా ఈ విద్యార్థి సంఘాలు.. కుల సంఘాలు.. మ‌హిళా సంఘాలు ఇలా ఏ సంఘాలైనా సరే.. ఇలాంటి సంఘాలు తెచ్చేంత ఫ్రీ పబ్లిసిటీ ఇంకెవ‌రూ తేలేరు. ఉన్న బురద తక్కువ అయితే.. ఆ బురదలో దిగి మొత్తానికి అందరికీ బురద పూసేదాకా మన సంఘాలు ఊరుకోవు కదా. నిజానికి గ‌త మూడు సీజ‌న్స్ లో బిగ్ బాస్ షోలో జరిగిన బాగోతాలు కంటే కూడా.. మన వాళ్ళు షో పై చేసే పంచాయితీనే ఎక్కువ ఉంటుంది

Also Read: మెగా మేనల్లుడు క్లిక్ అయ్యేలా ఉన్నాడు !

కాగా తాజాగా మన మాన‌వ హ‌క్కుల సంఘాలు కూడా యాడ్ అయి.. షోకి కావాల్సినంత ప‌బ్లిసిటీ తెస్తున్నాయి. ఆ మాటకొస్తే.. ఈ రియాలిటీ షో అనేది తెలుగు రాష్ట్రాల్లో పాశ్చాత్య ధోర‌ణి పెట్రేగిపోవ‌డానికి ప్ర‌ధాన కారణం అవుతుంది అంటూ ఎప్పటినుండో సాంప్ర‌దాయ‌వాదులు విమ‌ర్శిస్తూనే ఉన్నారనుకోండి. గ‌త మూడు సీజ‌న్ల‌లోనూ ఈ విమర్శల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈసారి కూడా అలాగే కొనసాగింది. తాజాగా విద్యార్థి సంఘం నాయకులు.. అలాగే తెలంగాణ రాష్ట్ర మహిళాధ్యక్షులు బ‌రిలో దిగి బిగ్ బాస్ షో పై మాన‌వ హక్కు‌ల సంఘానికి ఫిర్యాదు చేశారు. జ‌నాల‌కు త‌ప్పుడు సందేశం ఇచ్చే బిగ్ బాస్ షోని నిషేధించాల‌ని మ‌రోసారి ర‌చ్చ షురూ చేశారు.

Also Read: ఆదిపురుష్‌ మొదలయ్యేది ఎప్పుడంటే..?

బిగ్ బాస్ షో గురించి తెలియని మారుమూల గ్రామాలకు కూడా షో గురించి తెలియటానికి కాకపోతే.. ఈ రచ్చ వల్ల మరొక ఉపయోగం లేదని అందరికీ తెలుసు, ఈ సంఘాల నాయకులకు తప్ప. నిజానికి వీరి డిమాండ్ లో నిజాయితీ ఉంది. యూత్ ను త‌ప్పుదారి ప‌ట్టించే ఇలాంటి షోల‌ను ఆపేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి షోలు ఇలానే కొన‌సాగితే యువత మీద ప్రభావం చూపిస్తాయి. అయినా ప్రభావితం అయ్యే యువత ఉన్నప్పుడు వాళ్ళు ఇంకో రకంగా ప్రభావితం అవుతారు. సమాజంలో మార్పు రావాలంటే.. టీవీ షోల మీద పడితే ఏం మార్పు వస్తోంది. బిగ్ బాస్ షో లాంటివి మేం స‌హించం అంటూ మ‌హిళామండ‌ళ్లు వార్నింగులు ఇచ్చినా.. ఏం లాభం? అసలు ఇలాంటివ‌న్నీ మ్యానేజ్ చేయ‌డంలో బిగ్ బాస్ నిర్వాహ‌కులు సిద్ధ‌హ‌స్తులు అనేది ఇప్పటికే రుజువు అయిందయ్యే. వివాదంతో ప్ర‌చారం చేసుకోవడం వీళ్ల‌కో హ్యాబిట్.. మన సంఘాలన్నీ వీటిని అర్ధం చేసుకుంటే మంచింది.

వైరల్: భూమిపై నూకలు ఉన్నాయ్.. మృత్యుంజయుడైయ్యాడు!

 

మనకు ఈ భూమిపై జీవించే అదృష్టం ఉంటే ఎంత పెద్ద ప్రమాదంనుంచైనా ప్రాణాలతో బయటపడగలుగుతాం. తాజాగా నాలుగేళ్ల బాలుడు అలాంటి అదృష్టానికి ఉదాహరణగా నిలిచాడు. శిథిలాల కింద పడి 18 గంటలు ఉన్నా బాలుడు ప్రాణాలతో బయటపడగలిగాడు. మహారాష్ట్రలోని రాయ్ గఢ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలో సోమవారం సాయంత్రం ఐదంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది.

భవనం కూలిన ఘటనలో దాదాపు 75 మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. విషయం తెలిసిన వెంటనే ఎన్.ఢీ.ఆర్.ఎఫ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు శిథిలాల కింద చిక్కుకున్న 60 మందిని రక్షించగా 13 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఎన్.డీ.ఆర్.ఎఫ్ బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నాయి.

ఈ శిథిలాల కింద మహ్మద్ నదీమ్ బంగి అనే నాలుగేళ్ల బాలుడిని భవనం కూలిన 18 గంటల తరువాత గ్యాస్ కట్టర్ల సహాయంతో కడ్డీలను తొలగించి బయటకు తీశారు. ఘోర ప్రమాదం జరిగినా బాలుడు ప్రాణాలతో బయటపడటం గమనార్హం. అయితే బాలుడు బయటపడినా అతని కుటుంబ సభ్యులు మాత్రం ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు ఈ ఘటన విషయంలో ఐదుగురిపై కేసు నమోదు చేయగా ఈ ఘటన తీవ్ర విషాదకరమైన విషయమని మోదీ సంతాపం ప్రకటించారు. మరోవైపు మధ్యప్రదేశ్ లోని దేవాస్ నగరంలో నిన్న రెండస్తుల భవనం కుప్పకూలగా శిథిలాల కింద నుంచి 9 మందిని వెలికి తీశారు.

హీరో పై విష ప్ర‌యోగం.. నిజమేనా ?


బాలీవుడ్ హీరో సుషాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ‌హ‌త్య సంఘటన జరిగి నెలలు గడుస్తున్నా.. దేశ వ్యాప్తంగా ఇంకా ఈ కేసు సంచ‌ల‌నంగానే ట్రెండ్ అవుతోంది. ఒక హీరో.. పైగా స్టార్ డమ్ తెచ్చుకుని ఎంతో భవిష్యత్తు ఉన్న ఒక హీరో.. ఇలా అర్ధంతరంగా చనిపోవడం సినీ ప్రేముకుల మనసులను తీవ్రంగా కలిచివేసిందనేది ప్రతి ఒక్కరి మనోగతం. దానికి తోడు సుషాంత్ మ‌ర‌ణం పై రోజురోజుకూ అనేక ఆరోప‌ణ‌లు తెర‌పైకి వస్తుండటం.. అందుకు తగ్గట్టుగా ఈ కేసును సుప్రీంకోర్టు సీబీఐకి అప్ప‌గించ‌డంతో సుశాంత్ అభిమానులతో పాటు యావత్తు సినీ జనాలు కూడా అసలు ఏం జరిగిందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, విచారణ జరిపే కొద్దీ కేసు మ‌రింత జ‌ఠిల‌మైవుతుంది. సీబీఐ వేగంగా ద‌ర్యాప్తు చేస్తోన్నా.. నిజానిజాలు ఏమిటనేది ఇంకా స్పష్టత రాని పరిస్థితి.

Also Read: మెగా మేనల్లుడు క్లిక్ అయ్యేలా ఉన్నాడు !

మరోపక్క అధికారులు సుషాంత్ నివాసంలో మ‌రిన్ని వివ‌రాలు సేక‌రిస్తున్నారు. తాజాగా సుషాంత్ మ‌ర‌ణం పై బీజేపీ ఎంపీ సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి చేసిన మ‌రో సంచ‌ల‌న ఆరోప‌ణ ఇప్పుడు అందర్నీ షాక్ కి గురి చేస్తోంది. సుషాంత్ పై విష ప్ర‌యోగం జ‌రిగింద‌ని.. ఆ వాస్త‌వాలు బ‌య‌ట‌కు రాకుండా కొంద‌రు కుట్ర ప‌న్నార‌ని సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణ నిజమా అబద్దమా అనే విషయం పక్కన పెడితే.. సుశాంత్ పోస్ట్ మార్టం విషయంలో కావాలనే ఆల‌స్యం చేశారని ఇప్పటికే రుజువు అయింది. ఇది ఎంత దారుణం.. ఒక స్టార్ హీరో చనిపోతే.. అతని బాడీ పోస్టు మార్టం చేయడానికి ఆలస్యం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది. సుశాంత్ మరణం దేశంలోనే ప్రధాన వార్త.. అలాంటి ప్రాధాన్యత ఉన్న వ్యక్తి చావుకే న్యాయం జరగకపోతే సామాన్యుల పై అన్యాయాలకు ఇంక న్యాయం ఏమి జరుగుతోంది.

Also Read: ఆదిపురుష్‌ మొదలయ్యేది ఎప్పుడంటే..?

సుశాంత్ చావుకు బాధ్యులైన వారంద‌ర్నీ క‌ఠినంగా శిక్షించాల‌ని సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి ట్వీట్ చేసినట్లుగానే మోదీ ప్రభుత్వం ఈ కేసును ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి ట్వీట్స్ పై సీబీఐ అధికారులు ఎలా స్పందిస్తారు? సుషాంత్ మ‌ర‌ణం వెనుక ప‌లువురు బాలీవుడ్ సెల‌బ్రిటీలు ఉన్నారనే ఆరోపణలను అధికారులు ఎలా తీసుకుంటారో చూడాలి. ఇప్పటికే కొన్ని పెద్ద త‌ల‌కాయ‌ల్ని సైతం పోలీసులు విచారించారు. ఒక్క బాలీవుడ్ నుంచే దాదాపు 43 మందిని విచారించారంటే… సీబీఐ ఈ కేసు విషయంలో ఎంతగా విశ్వసనీయత చూపిస్తోందో అర్ధం చేసుకోవచ్చు. ఏమైనా సుషాంత్ పై విష ప్ర‌యోగం జ‌రిగింద‌నేది నిజమని తెలితే.. అందుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి.

రండి రండి.. నాకు కరోనా లేదు.. కూరగాయలు కొనండి!

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి వ్యాప్తికి అడ్డూఅదుపు లేకుండా పోయింది. ప్రజలు రోడ్లపైకి అడుగు పెడితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏ విధంగా వైరస్ సోకుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా కూరగాయల వ్యాపారులు, కిరాణా దుకాణాల యాజమాన్యాల నుంచి వైరస్ బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రజలు నిత్యావసర సరుకులు కొనుగోలు చేయాలన్నా గజగజా వణకాల్సిన పరిస్థితి నెలకొంది.

ప్రజలు కూరగాయలు కొనడానికి మార్కెట్ కు వెళ్లాలన్నా భయపడుతున్న నేపథ్యంలో అదిలాబాద్ జిల్లా ఉట్నూరుకు చెందిన కూరగాయల వ్యాపారి వినూత్నంగా ఆలోచించాడు. డోలి శంకర్ అనే కూరగాయల వ్యాపారి నిన్న స్థానికంగా ఉండే ఆస్పత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నాడు. ఆ పరీక్షల్లో తనకు నెగిటివ్ వచ్చింది. దీంతో నెగిటివ్ వచ్చిన సర్టిఫికెట్ ను ఫ్రేమ్ లా తయారు చేసి తనకు కరోనా సోకలేదని… తన దగ్గర ఎటువంటి భయం లేకుండా కూరగాయలు కొనుగోలు చేయవచ్చని చెప్పాడు.

అతని దగ్గర కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ ఉండటంతో ప్రజలు కూడా అతని దగ్గర కూరగాయలు కొనుగోలు చేయాడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కరోనా సర్టిఫికెట్ వల్ల కూరగాయలు కొనుగోలు చేసేవాళ్లలో కూడా భరోసా కల్పించిన వాడు అవుతున్నాడు. భవిష్యత్తులో ఇతర వ్యాపారులు సైతం డోలి శంకర్ తెచ్చుకున్న విధంగా కరోనా నెగిటివ్ సర్టిఫికెట్లు తెచ్చుకున్నా ఆశ్చర్యం లేదు. కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ వల్ల డోలీ శంకర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు.

కరోనా బాధిత ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త….?

0

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా బాధిత ఆర్టీసీ ఉద్యోగులకు అండగా నిలిచే దిశగా అడుగులు వేస్తున్నారు. కరోనా వైరస్ బారిన పడిన ఆర్టీసీ సిబ్బందికి కిట్లను అందజేయనున్నారు. ప్రభుత్వం అందజేసిన ఒక్కో కిట్ విలువ దాదాపు 1300 రూపాయలు అని సమాచారం. ఆర్టీసీ నుంచి ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి.

కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు ఎక్కువగా వైరస్ బారిన పడుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే చాలామంది ఈ విధంగా వైరస్ బారిన పడ్డారు. ఇప్పటికే 37 మంది ఆర్టీసీ ఉద్యోగులు వైరస్ సోకి మృతి చెందారని సమాచారం. తాజాగా 300 మంది ఉద్యోగులు వైరస్ బారిన పడగా కొందరు చికిత్స అనంతరం ఇళ్లకు వెళ్లిపోగా… ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో మిగిలిన వాళ్లు హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు.

ప్రభుత్వం రీజినల్ మేనేజర్లు, డిపో మేనేజర్లు, డివిజనల్ మేనేజర్లకు వైరస్ బారిన పడిన ఉద్యోగులకు కిట్లను అందజేయాలని అధికారులను ఆదేశించింది. ప్రభుత్వం ఈ కిట్లలో మందులు, గ్లౌజులు, మాస్కులను ఉంచింది. రోగులలో ఆక్సిజన్ లెవెల్స్ ను గుర్తించే పల్స్‌ ఆక్సీమీటర్లను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అధ్యక్షుడైనా బండి సంజయ్ సంతోషంగా లేడా?


తెలంగాణ బీజేపీ పగ్గాలు చేతికందినా బండి సంజయ్ సంతోషంగా లేడా? బీజేపీలో ఆయనది ఏం నడవడం లేదా? ఓ పక్క ఏపీ బీజేపీ అధ్యక్షుడైన సోము వీర్రాజు దూకుడుగా వెళుతుంటే బండి గోడకు కొట్టిన బంతిలా స్తబ్దుగా మారాడన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టి నెలరోజులు కూడా కాకముందే బీజేపీలో అసమ్మతులను ఏరివేస్తూ.. పార్టీ వ్యతిరేకుల మీద ఉక్కుపాదం మోపుతూ.. ప్రశ్నించిన మీడియాకు కౌంటర్ లేఖలు రాస్తూ.. అందరికీ సినిమా చూపించేస్తున్నారని టాక్ బీజేపీలో ఉంది. కానీ తెలంగాణలో పరిస్థితి రివర్స్ లో ఉందని బీజేపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Also Read: టీ.కాంగ్రెస్ కు ఊపుతెచ్చే ప్లాన్ చేశారు?

బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఇప్పుడు ఎటువంటి కీలక నిర్ణయం తీసుకోలేకపోతున్నాడని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బండిని అడుగడుగునా పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ మంత్రి శ్రీనివాసులు, గరికపాటి మోహన్ రావులు అడ్డుకుంటున్నారని టాక్ నడుస్తోంది. వాళ్లు చెప్పిందే బీజేపీలో నడుస్తోందని.. బండి కూడా ప్రతీ విషయంలోనూ వారినే సంప్రదించాల్సి వస్తోందన్న ప్రచారం సాగుతోంది

తెలంగాణ బీజేపీలో ఇప్పుడు గరికపాటి, మంత్రి శ్రీనివాసులు ఇద్దరూ బలమైన కోటరీగా అవతరించారనే ప్రచారం ఆ పార్టీలో సాగుతోంది. వారు అడుగడుగునా బండి సంజయ్ పనిలో జోక్యం చేసుకుంటున్నారని చెబుతున్నారు. సంజయ్ తన దగ్గరి సహచరులకు దీనిపై గోడు వెల్లబోసుకున్నట్టు సమాచారం.

పార్టీ విభాగాల కన్వీనర్ ల ఎంపికలో మంత్రి శ్రీనివాసులు చాలా మందిని నిర్ణయించారని.. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన గరికపాటి తన మనుషులను బీజేపీ శాఖల్లో పెట్టుకున్నాడని బండి సంజయ్ సన్నిహితుల వద్ద వాపోయినట్టు ప్రచారం సాగుతోంది.

Also Read: వైఎస్ జగన్ పాలనలో ఆ పార్టీ నేతలకు చిప్పే గతా?

ఇదే విషయమై రగిలిపోతున్న బండి సంజయ్ దీనిపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని కూడా ఓ దశలో అనుకున్నాడట..కానీ అధ్యక్షుడు అయ్యిండి కింది స్థాయి నేతల ఆధిపత్యానికి చెక్ పెట్టలేవా అన్న అపవాదు వస్తుందని.. చాలా తొందరగా చర్యలు తీసుకుంటే పార్టీలో తప్పుడు సంకేతాలు వెళుతాయని వారిపై చర్యలకు దూరంగా ఉన్నాడట.. రాబోయే రోజుల్లో బీజేపీలో వారిద్దరి పెత్తనానికి బండి సంజయ్ చెక్ చెప్పబోతున్నట్టు ప్రచారం సాగుతోంది.

మళ్లీ సోకుతున్న కరోనా వైరస్… భయాందోళనలో ప్రజలు…?

ఒకసారి కరోనా సోకిన వ్యక్తికి మళ్లీ కరోనా సోకుతుందా…? ఇప్పుడు ఈ ప్రశ్న చాలామందిని వేధిస్తోంది. హాంగ్ కాంగ్ శాస్త్రవేత్తలు తాజాగా ఒక వ్యక్తికి రెండోసారి కరోనా వైరస్ సోకిందని ప్రకటించారు. బెల్జియం, నెదర్లాండ్స్ లో సైతం ఇలాంటి కేసులు వెలుగులోకి వస్తున్నాయి. హాంకాంగ్ యూనివర్సిటీ పరిశోధకులు స్పెయిన్ నుంచి హాంకాంగ్ కు వచ్చిన ఒక వ్యక్తికి రెండోసారి కరోనా సోకినట్లు గుర్తించారు.

అయితే గతేడాది మార్చిలో సోకిన కరోనా రకం ప్రస్తుతం సోకిన కరోనా రకం వేరువేరు కావడం గమనార్హం. అయితే రెండోసారి కరోనా సోకిన సమయంలో సదరు వ్యక్తిలో ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించలేదని సమాచారం. దీంతో ఒకసారి కరోనా బారిన పడిన వాళ్లకు మరోసారి వైరస్ సోకే అవకాశాలు ఉన్నాయని తేలుతోంది. అయితే వైరస్ కొత్తగా సోకుతోందా…? లేక శరీరంలో ఉన్న వైరస్ తిరగబెడుతోందా…? అన్న విషయాలు తెలియాల్సి ఉంది.

కరోనా నుంచి కోలుకున్న వాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ అధ్యయనాలు తెలుపుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెంది తక్కువ కాలం కావడంతో వైరస్ నుంచి కోలుకున్న వాళ్లలో యాంటీబాడీలు ఎన్నిరోజులు ఉంటాయనే విషయం తెలియాల్సి ఉంది. శాస్త్రవేత్తలు మాత్రం కరోనా వైరస్ కు సంబంధించిన పరిశోధనలు కొనసాగుతున్నాయని… వైరస్ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉందా..? అని ప్రశ్నిస్తున్నారు.

సుప్రీం కోర్టు జగన్ కు షాక్ ఇచ్చింది…! కానీ జగన్ హ్యాపీ

As Expected, Supreme Court Raps Andhra Pradesh Government

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. పాలన వికేంద్రీకరణ బిల్లుపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు బుధవారం నాడు కొట్టివేసింది. రాజధాని అంశం పై హైకోర్టు విధించిన స్టేటస్ కో ను ఎత్తివేయాలని సుప్రీంకోర్టులో అభ్యర్థించిన జగన్ ప్రభుత్వానికి ఏ విషయాన్ని అయినా హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. హైకోర్టులో విచారణ సాగుతోంది…. ఈ విషయంలో తాము ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు చెప్పింది.

ఇకపోతే మూడు రాజధానులు అంశంపై హైకోర్టులో ఈ నెల 27న విచారణ జరగనుంది. జగన్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అందువల్ల హర్షించదగ్గ విషయం ఏదైనా ఉంది అంటే అది సుప్రీంకోర్టు హైకోర్టు వారిని త్వరగా విచారణ పూర్తి చేయాలని ఆదేశించడమే. ఇక ఇప్పటికే…. ఏపీ పాలన వికేంద్రీకరణ బిల్లుని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయాన్ని సవాలు చేసిన అమరావతి రైతులు పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

ఏపీ హైకోర్టు గతంలో ఇదే విషయంలో సంచలన తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల తరువాత అందరికీ హైకోర్టు విచారణ వేగవంతం చేయనుండగా… అమరావతి రైతులు తమకు న్యాయం జరిగే వరకూ విశాఖలో ఎటువంటి రాజధాని అమలుచేసేందుకు వీల్లేదని అంటున్నారు. ఇక హైకోర్టు కూడా దాదాపు రైతులకు మద్దతుగా వ్యవహరిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ వీలైనంత త్వరగా విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు చేయడం కష్టమే. 

ఇలా హైకోర్టుకి…. సుప్రీంకోర్టు కి వెళ్లి ఏపీ ప్రభుత్వం భంగపాటు కి గురి కావడం చాలా రెగ్యులర్ అయినప్పటికీ చంద్రబాబుకు జగన్ దీని ద్వారా ఒక సందేశాన్ని చేసినట్లు అయింది. తన మూడు రాజధానుల కలను నెరవేర్చుకునేందుకు ఎంత దూరమైనా వెళ్తానని అతను ఇన్ డైరెక్ట్ గా తెలియజేసినట్లు అయింది. మొత్తానికి హైకోర్టు మాత్రం ఈ విషయంలో ఎటువంటి జాప్యం చేయకుండా కచ్చితంగా విచారణను త్వరగా నిర్వహించి ఏదో ఒక తీర్పు వెలువరించాల్సి అవసరం ఉంది. దీనిని జగన్ తన విజయం గా పరిగణించవచ్చు.

కరోనా వల్ల జాబ్ కోల్పోయిన వాళ్లకు శుభవార్త…?

కరోనా మహమ్మారి విలయం దేశమంతటా కొనసాగుతోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు ప్రజల్లో భయాందోళనను పెంచుతున్నాయి. కరోనా వైరస్ వల్ల కోట్లాది మంది ఉద్యోగులు ఉద్యోగాలను కోల్పోయారు. కష్టపడే శక్తి ఉన్నా చాలామంది ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. అయితే టెక్నాలజీపై కొంచెం అవగాహన ఉంటే చాలా సులభంగా ఉద్యోగం సాధించడం సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

ట్రాన్స్ క్రైబింగ్, ఫ్రూఫ్ రీడింగ్, బ్లాగింగ్, గ్రాఫిక్ డిజైనర్, సోషల్ మీడియా మార్కెటింగ్ కన్సల్టెంట్, ఇన్స్టాగ్రామ్ కన్సల్టెంట్ లాంటి ఉద్యోగవకాశాలు చాలా ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉన్నవాళ్లు కస్టమర్లను ఆకట్టుకునే విధంగా చాట్ చేస్తే చాలు వేల రూపాయలు సొంతమవుతాయి. ఈ మార్కెటింగ్ ద్వారా ఇంట్లో నుండే సులభంగా డబ్బులను సంపాదించుకునే అవకాశం ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్ చేస్తూ కూడా సులభంగా డబ్బులు సంపాదించుకోవచ్చు.

సోషల్ మీడియా ఖాతాలలో ప్రముఖ కంపెనీలకు చెందిన ఉత్పత్తులకు ప్రచారం చేసి డబ్బులు పొందవచ్చు. యూట్యూబ్ ఛానెల్ ద్వారా కూడా లక్షల్లో సంపాదించే వాళ్లు ఎంతోమంది ఉన్నారు. ఆసక్తి ఉన్నవాళ్లు యూట్యూబ్ నే కెరీర్ గా మలుచుకుంటే వ్యూస్, సబ్ స్క్రైబర్లు పెరిగే కొద్దీ సంపాదన పెరుగుతుంది. గ్రాఫిక్ డిజైన్ తెలిసిన వాళ్లు ఇంట్లో నుంచె బ్లూ క్యాప్ కప్స్ ద్వారా సంపాదించుకోవచ్చు. బ్లాగింగ్, ప్రూఫ్ రీడింగ్, కంటెంట్ రైటింగ్ ద్వారా లక్షల రూపాయలు సంపాదించుకునే వాళ్లు ఎంతోమంది ఉన్నారు.

మెగా మేనల్లుడు క్లిక్ అయ్యేలా ఉన్నాడు !


మెగా మేనల్లుడు వైష్ణ‌వ్‌ తేజ్ కి మొదటి సినిమా కూడా రిలీజ్ అవ్వకుండానే ఇండస్ట్రీలో మంచి మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం క్రిష్, వైష్ణ‌వ్‌ తేజ్ ని హీరోగా పెట్టి.. రకుల్ ప్రీత్ సింగ్ ని హీరోయిన్ గా పెట్టి సినిమా చేస్తున్నాడు. నిజానికి ఈ సినిమాని క్రిష్, ఫామ్ లో ఉన్న హీరోతో చేద్దామనుకున్నాడు. కానీ, ‘ఉప్పెన’ సినిమాని చూసిన క్రిష్ కి, వైష్ణ‌వ్‌ తేజ్ నటన బాగా నచ్చిందట. అందుకే వైష్ణ‌వ్‌ తేజ్ తో ప్రస్తుతం అడవి నేపథ్యంలో సినిమా చేస్తున్నాడు. నిజానికి వైష్ణ‌వ్‌ తేజ్ ఏ యాక్షన్ కథతో లేక కామెడీ సినిమాతోనే మెగా హీరో రేంజ్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉన్నా.. వైవిధ్యమైన కథలను పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు.

Also Read: ఆదిపురుష్‌ మొదలయ్యేది ఎప్పుడంటే..?

క్రిష్ సినిమాలో వైష్ణ‌వ్‌ తేజ్ క్యారెక్టర్ ఓ విభిన్నమైన విషాదఛాయలు ఉన్న పాత్ర అని తెలుస్తోంది. ఈ సినిమా ఓ విషాద వంతమైన జీవిత కథ అని, అయితే జీవితంలో విఫలమైన ఓ యువకుడు అడవిలో మేకల కాపరిగా వెళ్లి అక్కడ ఎలాంటి సమస్యలను ఎదురుకున్నాడు. తన జీవితంలో తన తండ్రి కోసం ఏం చేశాడు అనే అంశాలు సినిమాలో హైలైట్ గా ఉంటాయట. అలాగే సెకెండ్ హాఫ్ లో హీరో పాత్రలో చాల వేరియేషన్స్ ఉంటాయని.. ముఖ్యంగా పులితో వచ్చే ఫైట్ సీక్వెన్స్ అలాగే ఈ సినిమా పాయింట్ కూడా కొత్తగా ఉండబోతుందని తెలుస్తోంది. అడవిలో రెండు రాత్రులు ఉండాల్సి రావడం.. ఆ క్రమంలో హీరో ఎలాంటి సమస్యలు ఎదురుకున్నాడు అనే కోణంలో సినిమా వెరీ ఇంట్రస్టింగ్ గా సాగుతోందట.

Also Read: ప్రదీప్‌ సినిమా విడుదలకు మోక్షం లభించిందా?

ఇక వైష్ణవ్ తేజ్ చేస్తున్న ‘ఉప్పెన’ సినిమా కూడా ఓ డిఫరెంట్ పాయింట్ తో చేస్తున్నారని తెలుస్తోంది. ఒక పేద ముస్లిమ్ కుర్రాడు, అప్పర్ క్యాస్ట్ లోని డబ్బు ఉన్న అమ్మాయిని ప్రేమించాడని.. ఏకంగా ఆ కుర్రాడి మర్మంగాన్ని కోసేసి అతన్ని పెళ్లికి పనికిరాకుండా చేస్తారని.. దాంతో అతను ప్రేమించిన అమ్మాయికి కనబడకుండా తిరుగుతూ చివరకు ఆ అమ్మాయి కోసమే చనిపోతాడని తెలుస్తోంది. ఇదే ఈ సినిమా మెయిన్ పాయింట్. నిజానికి మొదటి సినిమాలోనే ఇలాంటి పాత్రలో నటించాలంటే దమ్ము ఉండాలి. ఏమైనా ఇలాంటి కొత్త పాయింట్స్ తో సినిమాలు చేసుకుంటూ వెళ్ళితే.. వైష్ణవ్ తేజ్ క్లిక్ అవ్వడం గ్యారెంటీ. ఇక కరోనా లేకపోయి ఉంటే ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ అయ్యేది. అయితే ఈ చిత్రాన్ని నవంబర్ సెకెండ్ వీక్ లో విడుదల చేయాలని మేకర్స్ యోచిస్తున్నారు.

వైఎస్ జగన్ పాలనలో ఆ పార్టీ నేతలకు చిప్పే గతా?


వైఎస్ జగన్ ప్రజలపై వరాల వాన కురిపిస్తున్నారు. వేల కోట్ల సంక్షేమ పథకాలు వెదజల్లుతున్నాడు. అయినా పార్టీని నమ్ముకున్న వాళ్లకు మాత్రం ఏమీ చేయడం లేదనే అపవాదు ఉంది. ఇప్పుడు అదే నిజం అవుతోంది.

Also Read: రామచంద్రమూర్తి రాజీనామాకు కారణమిదేనా?

వైసీపీ పాలనలోనూ టీడీపీ నేతలకే కాంట్రాక్టులు.. అది వేల కోట్లవి.. ఏంటి దారుణం.. ఏంటీ అమానుషం.. పార్టీ కోసం పదేళ్లుగా జెండా మోసిన వారికి చిప్పే గతా? అని వైసీపీ నాయకులు.. శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ పాలనలో పార్టీ కోసం పనిచేసిన వారికి గుర్తింపు లేదని.. టీడీపీ నుంచి వలసవచ్చిన వారికే పదవులు, కాంట్రాక్టులని ఆ పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా అతిపెద్ద కాంట్రాక్టు మరోసారి టీడీపీ నేతకే దక్కడం అందరినీ షాక్ కు గురిచేసింది. నెల్లూరు జిల్లా పరిధిలోని 1000 ఎకరాల విలువైన సిలికా మైనింగ్ భూముల లీజును ఒకే కంపెనీకి కట్టబెట్టారు. ఇన్నాళ్లు ఈ 1000 ఎకరాలను విడదీసి సుమారు 80 కంపెనీలకు లీజు ఇచ్చారు. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం ఎంత ఉదారతతో లీజు విధానంలో మార్పులు తీసుకొచ్చి ఏకంగా టెండర్లలో పాల్గొనడానికి రూ.507 కోట్ల మైనింగ్ వార్షిక టర్నోవర్ నిబంధన పెట్టింది.

ఈ పరిణామంతో చిన్నా చితక కంపెనీలన్నీ టెండర్లలో పాల్గొనకుండా ఎగిరిపోయాయి. దీంతో ఈ టెండర్లలో టీడీపీ నామినేట్ చేసిన టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు.. ప్రముఖ పారిశ్రామికవేత్త శేఖర్ రెడ్డికి చెందిన అవంతిక ఎక్స్ పోర్ట్స్ సంస్థ ఈ 1000 ఎకరాల లీజును చేజిక్కించుకుంది. వైసీపీ ప్రభుత్వం ఇంత తంతగం చేసి ఆ భారీ కాంట్రాక్టును టీడీపీకి సానుభూతిపరుడైన పారిశ్రామికవేత్తకే కట్టుబెట్టడం నెల్లూరు జిల్లాలో కలకలం రేపింది.

Also Read: వలసవాదులతో వైసీపీలో పెరుగుతున్న అసంతృప్తి..!

దక్షిణ భారత దేశంలోనే నాణ్యమైన సిలికా మైన్లకు నెల్లూరు జిల్లా ప్రసిద్ధి. అలాంటి మైన్స్ ను టీడీపీకి చెందిన వ్యక్తికి కట్టబెట్టడంపై వైసీపీ నేతలు స్థానికంగా ఆగ్రహం వ్యక్తం అవుతోందట.. ఇప్పుడు ఇదే టాపిక్ నెల్లూరు జిల్లా వైసీపీలో సంచలనమైంది. టీడీపీ నేతకు కాంట్రాక్టు అప్పగించిన వైనంపై వైసీపీ నేతలు జీర్ణించుకోవడం లేదు.

అమరావతికే కాదు… రాష్ట్రంలో ప్రతీ రైతన్నకు ప్రభుత్వాలు నేర్పిన గుణపాఠం ఇదే..!

Andhra Pradesh: Amaravati farmers protest against CM Jagan Mohan's ...

అమరావతిలో రాజధాని నిర్మించేందుకు రైతులు తమ భూములు ఇచ్చారు. ప్రభుత్వం చెప్పిన మాటలను నమ్మిన వారు నిండా మోసపోయారు. సరే…. మరో ప్రభుత్వం వచ్చి వారి బ్రతుకుని బాగు చేస్తుందన్న ఆశ కూడా ఇప్పుడు చచ్చిపోయింది. ఇక ఈ ప్రభుత్వమూ వచ్చి తమకూ మీ భూములు కావాలని అడిగితే ఇస్తారా…? “అసలు సమస్యె  లేదు” అంటున్నారు రైతులు. గోదావరి-పెన్నా నదుల అనుసంధానం కోసం చంద్రబాబు హయాంలోనే ఒక ప్లాన్ సిద్ధమైంది. అందులో భాగంగా ఒక ప్రాజెక్టు నిర్మాణం కోసం కొన్ని భూములను సేకరించేందుకు అధికారులు రాజధాని అమరావతి పరిధిలోని అన్ని గ్రామాల్లో పర్యటించారు. గ్రామ సభలు నిర్వహించారు. ఎప్పటిలాగే జనాలను మభ్యపెట్టడం మొదలుపెట్టారు. భూముల మార్కెట్ రేటుకి 1.6% అదనంగా ఇస్తామన్నారు. కానీ రైతు మాత్రం ససేమిరా అన్నారు.

“ప్రభుత్వాలు చెప్పే మాటలను చచ్చినా నమ్మలేం.. గత ప్రభుత్వం అమరావతి విషయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయింది. ఒప్పందాలు నిలబడలేదు. ఈ ప్రభుత్వం మా బాధలను లెక్కచేయడం లేదు. అలాంటప్పుడు మేం ప్రభుత్వాన్ని ఎలా నమ్మగలం? ” అంటూ ఒక రైతు నేరుగా అధికారులను నిలదీశాడు. దీంతో ఒక్కసారిగా అధికారులకు ఏమి చేయాలో అర్థం కాలేదు. దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయినంత పని అయింది.

అమరావతి వేరే…. ఇతర ప్రాజెక్టుల భూసేకరణ వేరే. కానీ రైతు మనోభావాలు మాత్రం ఎక్కడ అయినా ఒక్కటే. అంతేకాదు భవిష్యత్తులో ప్రభుత్వానికి ఒక అమరావతి ప్రాంతం నుంచే కాకుండా ఏ ప్రాంతంలో కూడా రైతులు భూములను ఇచ్చే పరిస్థితి లేదు. అంత నమ్మకం పోగొట్టుకుంటే.. ఈ ప్రభుత్వం కావచ్చు, రేపు రాబోయే ప్రభుత్వం కావచ్చు, తమను ఇప్పటికే పాలించిన ప్రభుత్వం కావచ్చు…. ఎవరైనా సరే ప్రజలకు హామీ ఇచ్చి అది నెరవేర్చకపోతే పూర్తిగా వారి పై వ్యతిరేక భావం అనేది ఏర్పడుతుంది. ఇకపై భూసేకరణ ఈ రాష్ట్రంలో ఇది అంత తేలికైన వ్యవహారం కాదని అధికారులకు అర్థమైపోయింది.

చివరికి ఎవరైనా ఒక్కటే…. అధికారంలో ఉన్నవాళ్లు మారిన ప్రతిసారీ ఇలా హామీలు చేసుకున్న ఒప్పందాలకు విలువ లేకుండా లేకపోతే…. అసలు వ్యవస్థకు అర్థం ఏముంటుంది? ఏదో ఆషామాషీగా మూడు రాజధానులు లేదా ఇంకొక అడ్డంకిని చెప్పి ప్రభుత్వాలు అడ్డగోలుగా వ్యవహరిస్తూ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే దానికి రైతులు బాధలు అనుభవించాలా? వారు అందలం ఎక్కి కూర్చుని ఉన్న పల్లకిలిని ఎన్నాళ్ళని రైతులు మోస్తూ ఉంటారు..? చివరికి వెన్ను విరిగాక అయినా విశ్రమించాల్సిందేగా…! 

బాబు బినామీకి జగన్ బంపర్ ఆఫర్..!


రాష్ట్రంలో వైసీపీ నేతల కంటే టీడీపీ వారికే అగ్రతాంబూలం అని వైసీపీ ప్రభుత్వం మరోసారి నిరూపించింది.రాష్ట్రంలో ప్రస్తుతం ఒక విషయంపై విపరీంగా చర్చ జరుగుతుంది… అదేంటంటే టీడీపీ నాయకుడిగా ఉన్న ఒక వ్యక్తికి వెయ్యి ఎకరాల మైనింగ్ లీజులు కేటాయించడం. టీడీపీ హయాంలో శేఖర్ రెడ్డి టిటిడి బోర్డు సభ్యుడిగా ఉన్నారు. మరోవైపు చంద్రబాబు బినామీ అని వైసీపీ చెప్పుకొచ్చింది. ఇప్పడు శేఖర్ రెడ్డికి చెందిన సంస్థకు నెల్లూరు జిల్లాలోని మైకా లీజులు కట్టబెట్టడం కలకలం రేపుతోంది.

Also Read: వలసవాదులతో వైసీపీలో పెరుగుతున్న అసంతృప్తి..!

2016లో శేఖర్ రెడ్డి టిటిడి బోర్డు సభ్యుడిగా ఉండగా పెద్ద నోట్ల రద్దు సమయంలో రూ.107 కోట్లు నగదు ఐటి విభాగం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో విషయం ఏమిటంటే బ్యాంకుల వద్ద తక్కువగా ఉన్న రూ.2 వేల కొత్త నోట్లు శేఖర్ రెడ్డి ఇంట్లో కట్టలు కట్టలుగా లభ్యం అయ్యాయి. అదేవిధంగా 127 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో శేఖర్ రెడ్డిపై వైసీపీ నాయకులు చేయని విమర్శలు లేవు. నారా లోకేష్ కు డబ్బులు ఇచ్చి టీటీడీ బోర్డు సభ్యునిగా పదవి పొందారని వైసీపీ విమర్శించింది.

ఇప్పుడు ఉన్నట్లుండి నెల్లూరు జిల్లాలోని మైకా గనుల లీజులకు సంబంధించి నిబంధనలు మార్చి 80 చిన్న సంస్థలు గనుల తవ్వుకొంటుండగా వాటి లీజులను రద్దు చేసి కొత్త నిబంధనలుతో శేఖర్ రెడ్డికి చెందిన అవంతిక సంస్థకు మొత్తం వెయ్యి ఎకరాల గనులు లీజుకు ఇవ్వడం ఆ పార్టీ నేతులు జీర్ణించుకోలేకపోతున్నారు. చంద్రబాబు బినామీ అన్న పార్టీ నేతలు ఇప్పుడు ఉన్నట్లుంది నిబంధనలు సవరించి మరీ శేఖర్ రెడ్డి సంస్థకు గనులు కట్టబెట్టడానికి కారణాలేంటనే విషయాన్ని అన్వేషిస్తున్నారు.

Also Read: రామచంద్రమూర్తి రాజీనామాకు కారణమిదేనా?

మైకా ఘనుల లీజు వ్యవహారం వెనుక పెద్ద లాబీయింగ్ ఉంటుందని అందరూ భావిస్తున్నారు. టీడీపీ నాయకులను వివిధ రకాల కేసులు మోపుతున్న ప్రభుత్వం శేఖర్ రెడ్డి వ్యవహారంలో అవలంభిస్తున్న విధానం ఇందుకు విరుద్ధంగా ఉంది. ప్రభుత్వ పెద్దల హస్తం, లాబీయింగ్ లేకుండా ఈ తంతు చోటు చేసుకునే అవకాశం లేదని వైసీపీ నేతలే అంటున్నారు.