
హీరో రామ్ కి ఈ మధ్య రాజకీయ సమస్యలు ఎక్కువైపోయాయి. విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ లో జరిగిన అగ్ని ప్రమాదం పై రామ్ ట్విట్టర్ లో స్పందించడంతో.. జగన్ ప్రభుత్వం పైకి అది విమర్శలుగా అనిపించడంతో అందరూ రామ్ ను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా.. ఏపీ మంత్రి కొడాలి నాని, రామ్ పై స్పందిస్తూ.. రామ్ కు కొన్ని ఉచిత సలహాలు కూడా పడేశారు. సలహా అనే కంటే కూడా కౌంటర్ వేశాడు అనుకోవడం బెటర్ ఏమో. కొడాలి నాని మాటల్లోనే.. ‘ఇదిగో రామ్.. నువ్వు నారా చంద్రబాబు నాయుడు మాట వింటే ఇక నీ కెరీర్ అంతే. అసలు చంద్రబాబు గురించి నీకు ఏమి తెలుసు. ఆయన ఎవరి కాళ్లు పట్టుకొని టీడీపీలో చేరారో తెలుసా.. చంద్రబాబు తిన్నింటి వాసాలు లెక్కపెట్టె రకం. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి.. టీడీపీ పార్టీని బలవంతంగా లాక్కున్న సంగతి అందరికీ తెలిసిన విషయాలే.
Also Read: రాశి ఖన్నా డేరింగ్ స్టెప్..
చంద్రబాబు నాయుడు మాట వింటే బతుకు ఎలా అవుతుందో నీకు తెలియదు అనుకుంటా. బాబును నమ్ముకుంటే ఏమవుతుందో నీకు తెలియాలంటే నీ తోటి హీరోలు పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ లను అడిగి తెలుసుకో. వాళ్లే నీకు చంద్రబాబు గురించి పూసగుచ్చినట్టు వివరిస్తారు. ఇప్పటికైనా ఆలోచించు.. చంద్రబాబు మాటలు వింటే సినిమా కెరీర్ కూడా ఇక గోవిందానే.. అంటూ రామ్ కు కొడాలి నాని కాస్త ఘాటు సలహాలనే ఇచ్చాడు. అయినా రామ్ బంధువు రమేశ్ ఆసుపత్రి ఎండీ రమేశ్ బాబు ఏం తప్పు చేయకపోతే ఎందుకు పారిపోయినట్లు.. రమేశ్ బాబు వెనుక కొంతమంది బడా బాబులు ఉన్నారనేది నిజం కాదా..అంటూ నాని విమర్శలు చేశారు. ముఖ్యంగా రమేశ్ ఎక్కడ దాక్కున్నాడో ఏపీ మొత్తానికి తెలుసు అని.. ప్రస్తుతం చంద్రబాబు ఇంట్లోనే రమేశ్ బాబు దాక్కున్నాడని నాని చెప్పుకొచ్చాడు.
Also Read: ముందు ఆచార్య ఆ తర్వాతే ఆర్ఆర్ఆర్ అంటున్న చెర్రీ
పాపం రామ్… ఇన్నేళ్లు తన సినీ కెరీర్ తప్ప.. మరో మాట మాట్లాడకుండా ఇన్నాళ్ళు సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. మొదటిసారి పొరపాటున ఒక ట్విట్ చేసిన పాపానికి ఏపీ ప్రభుత్వ పెద్దల అందరి చేత నానామాటలు పడాల్సి వస్తోంది. ఏమైనా రామ్ చేసిన ట్వీట్లు ఏపీ రాజకీయాల్లో కాస్త హీటును పెంచాయనేది నిజం.