Home Blog Page 8346

బుక్కైన దేవినేని ఉమ.. నెక్ట్స్ టార్గెట్ అతడేనట?


ఒక మొక్కకు అంటుగట్టినట్టు.. ఓ గోడ కట్టినట్టు.. ఓ పద్ధతిగా తెలుగు దేశం పార్టీ మాజీ మంత్రులను బుక్ చేస్తోంది వైసీపీ ప్రభుత్వం. ఏపీ సీఎంగా గద్దెనెక్కాక పూర్తిగా సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసి వారికి దగ్గరయ్యారు జగన్.. ఏడాది పూర్తికాగానే ప్రతీకారం మొదలుపెట్టాడు. ఓ వైపు సంక్షేమ పథకాలతో తన స్థానాన్ని ప్రజల్లో సుస్తిరం చేసుకుంటూనే మరోవైపు టీడీపీ పునాదులు కూల్చేపనిలో జగన్ బిజీగా ఉన్నాడు.

Also Read: ఒకటా.. రెండా..? ఒకే రోజు జగన్ కు హై కోర్టు మూడు వాతలు !

తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష ఉపనేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడును ఇప్పటికే ఈఎస్ఐ స్కాంలో బుక్ చేసిన సీఎం జగన్ సర్కార్.. ఆయనకు బెయిల్ కూడా రాకుండా జైల్లోనే ఉంచింది. ఇక అనంతపురం జేసీ ప్రభాకర్ రెడ్డిని కటకటాల పాలు చేసింది. మాజీ మంత్రి కొల్లు రవీంద్రను హత్య కేసులో అరెస్ట్ చేసింది.

అచ్చెన్న, జేసీ, కొల్లు రవీంద్ర తర్వాత టీడీపీ ఎవరు టార్గెట్ అని ఎదురుచూస్తున్న వేళ.. వైసీపీ సర్కార్ కు తాజాగా ఓ లూప్ హోల్ దొరికిందట.. పార్ట్ 1ను దిగ్విజయంగా ముగించిన సీఎం జగన్.. ఇప్పుడు సెకండ్ పార్ట్ లో తనపై ఒంటికాలిపై లేచే టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమను బుక్ చేసినట్లు వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

టీడీపీ ప్రభుత్వ హయాంలోని అవినీతిపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్న వైసీపీ సర్కార్ కు తాజాగా పుష్కరాల పనుల్లో అవినీతిపై ఆధారాలు దొరికాయట.. దీంతో దీనిపై విచారణను ప్రభుత్వం వేగవంతం చేసింది. చంద్రబాబు హయాంలో పుష్కరాల పనుల్లో భారీ అవినీతి జరిగిందని.. దానిపై విచారణ చేపట్టారని తెలిసింది. ఈ పుష్కరాల పనులను దగ్గరుండి చూసింది నాటి మంత్రి దేవినేని ఉమ కావడం గమనార్హం. సో వైసీపీ నెక్ట్స్ టార్గెట్ ఉమా అని మీడియాలో వార్తలు లీక్ అవుతున్నాయి.

Also Read: ఆంధ్రకు అప్పుల తప్పులు అలవాటే… కానీ జగన్ ది మరీ ఓవర్ అయిపోయింది!

సీఎం జగన్ దగ్గరుండి మరీ ఈ పుష్కరాల్లో అవినీతి కేసును వేగంగా దర్యాప్తు చేయిస్తున్నారని తెలిసింది. మాజీ మంత్రి దేవినేనిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే పరిస్థితి లేదని వైసీపీ సర్కార్ భావిస్తున్నట్టు సమాచారం.

ఇప్పటికే ముగ్గురు టీడీపీ నేతలు జైలుపాలయ్యారు. ఇప్పుడు దేవినేని కూడా బుక్ అయితే టీడీపీ పరిస్థితి మరింత దయనీయంగా మారే అవకాశం ఉంది. వైసీపీలోకి నేతలు చేరడమో లేక టీడీపీకి దూరంగా నేతలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ ఉపద్రవాన్ని టీడీపీ ఎలా ఎదుర్కొంటుందో వేచిచూడాలి.

సుశాంత్ ప్రియురాలు రియా గుట్టు రట్టు?


బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం వెనుక రహస్యాలను సీబీఐ వెలికి తీస్తోంది. తవ్వినకొద్దీ ఆశ్చర్యకర విషయాలు వెలుగుచూస్తున్నాయి. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి మీదే సీబీఐ ప్రధానంగా ఫోకస్ చేసింది.. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఓ డ్రగ్ డీలరుతో జరిపిన వాట్సాప్ చాటింగ్ బయటకొచ్చింది. దీన్ని పరిశీలించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రియా చక్రవర్తిపై కేసు నమోదు చేసిందీ. దీంతో సుశాంత్ కేసు కీలక మలుపు తిరిగింది.

Also Read: ఆర్ఆర్ఆర్ పై క్లారిటీ ఇచ్చిన ఆలియా భట్‌

సుశాంత్ ముంబైలోని ఫ్లాట్ లో మరణించినప్పుడు ఆ ఇంటిలోని ఆధారాలన్నీ తుడిచిపెట్టారని సీబీఐ విచారణలో నిగ్గుతేలినట్టు సమాచారం. రియా సమక్షంలోనే హార్డ్ డిస్క్ ల ధ్వంసం జరిగినట్లు సీబీఐకి ఆధారాలు లభించినట్లు తెలిసింది.. రియాకు చెందిన రెండు మొబైల్ ఫోన్‌లను సీబీఐ జప్తు చేసింది. అయితే అప్పటికే చాలా డేటా ఆ ఫోన్ల నుంచి అదృశ్యమైనట్టు గుర్తించింది. తొలగించిన డేటాను తిరిగి పొందడానికి వారు వాటిని క్లోన్ చేశారని సమాచారం. ఇది సంచలనాత్మక ఫలితాలకు దారి తీస్తుందని సీబీఐ అధికారులు నమ్ముతున్నారు. ఈ కేసులో రియాతో సహా పలువురు సన్నిహితులపైనే సీబీఐ అనుమానం వ్యక్తం చేస్తోంది.

ఇక రియా చక్రవర్తికి డ్రగ్స్ ముఠాతోనూ సంబంధాలు ఉండడంతో ఈ డ్రగ్స్ లింకుతోనే రియా… సుశాంత్ ను చంపిందా అన్న కోణంలో సీబీఐ ఆరాతీస్తున్నట్టు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. సుశాంత్ మరణానికి డ్రగ్స్ కూడా కారణమని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే రియా డ్రగ్ వ్యాపారి గౌరవ్ ఆర్యతో చాటింగ్ చేసినట్లు అధికారులు గుర్తించారు.

సీబీఐ దర్యాప్తులో రియాకు సంబంధించిన కీలక విషయాలను సుశాంత్ స్నేహితుడు పితాని సిద్ధార్త్ ఈ గుట్టు బయటపెట్టినట్టు సమాచారం. జూన్ 8న సుశాంత్ తో రియా చక్రవర్తి తీవ్రంగా గొడవపడిందని.. జూన్ 15న సుశాంత్ మరణించడం వెనుక అదీ ఒక కారణం కావచ్చని సుశాంత్ స్నేహితుడు సిద్ధార్థ్ సీబీఐకి తెలిపాడు.

Also Read: దానికి కూడా రష్మికనే రికమెండ్‌ చేసిన విజయ్!

ఇక సుశాంత్ నివాసంలో ఆధారాలు దొరకకుండా 8 హార్డ్ డిస్క్ లు ధ్వంసం చేయడం..సుశాంత్ మేనేజర్, వంటమనిషి అక్కడే ఉన్నారని వివరించాడు. హార్డ్ డిస్క్ ల్లో ఏముందో తెలియదని సిద్ధార్థ్ తెలిపాడు.

రియా.. సుశాంత్ డెబిట్ కార్డుల పాస్‌వర్డ్‌లను దొంగిలించిందని, దీనికోసం ఆమె సుశాంత్ మేనేజర్ శామ్యూల్ మిరాండా సహాయం తీసుకుందని సీబీఐ వర్గాలు గుర్తించినట్టు సమాచారం. రియా బ్యాంక్ మోసాలతోపాటు మాదకద్రవ్యాలతో లింకు పెట్టుకుందని సీబీఐ దర్యాప్తులో తేలినట్టు సమాచారం. ఈ క్రమంలోనే సుశాంత్ మరణానికి రియానే కారణమన్న అనుమానాలకు బలం చేకూరుతోందన్న వార్తలు జాతీయ మీడియాలో వస్తున్నాయి.

సహోద్యోగిణితో తహశీల్దార్ రాసలీలలు…. వీడియో వైరల్…?

ఈ మధ్య కాలంలో ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకుని తోటి ఉద్యోగులతో రాసలీలలు నడిపిస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల బాగోతాలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో తహశీల్దార్ గా పని చేస్తున్న ఒక వ్యక్తి తోటి ఉద్యోగినితో కామకలాపాలు సాగిస్తున్న ఒక వీడియో వైరల్ అయింది. కర్ణాటకలోని కొప్పళ్ల జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉద్యోగినితో కామవాంఛలు తీర్చుకుంటున్న ఉద్యోగికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Also Read : బైక్, స్కూటర్ కొనుగోలు చేసే వారికి కేంద్రం శుభవార్త…?

పూర్తి వివరాల్లోకి వెళితే కొప్పగిలో ఆరు నెలల క్రితం గురుబసవరాజ్‌ అనే వ్యక్తి తహశీల్దార్ గా చేరారు. అక్కడ ఒక మహిళా ఉద్యోగినిని ప్రేమ పేరుతో లోబర్చుకుని కామ వాంఛను తీర్చుకున్నారు. అయితే తహశీల్దారు ఉద్యోగితో రాసలీలలు జరుపుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో కలెక్టర్ ఈ ఘటన గురించి విచారణకు ఆదేశించగా పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

పోలీసులు సీసీ ఫుటేజీను పరిశీలించి వైరల్ అవుతున్న వీడియోకు సంబంధించిన దృశ్యాలు చాలాకాలం నాటివని చెబుతున్నారు. ఎవరైనా కావాలనే ఈ వీడియోను ఇంతకాలం తరువాత సోషల్ మీడియాలో వైరల్ చేసి ఉండవచ్చని చెబుతున్నారు. పోలీసులు తహసీల్దార్ ను, యువతిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని తెలుస్తోంది. ఈ ఘటన గురించి స్థానికంగా తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది.

Also Read : 2,000 నోట్లు రద్దు అంటూ ప్రచారం.. ఆర్బీఐ ఏం చెప్పిందంటే?

ఆలియా లవర్ తోప్రేమలో పడ్డ ఇస్మార్ట్‌ హీరోయిన్‌


బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ బాట పట్టిన అందగత్తెల్లో నిధి అగర్వాల్‌ ఒకరు. ఈ బెంగళూరు బ్యూటీ తొలుత మోడలింగ్‌లో మంచి పేరు తెచ్చుకొని హిందీ దర్శకుల కంట్లో పడింది. దాంతో, 2017లో ‘ మున్నా మైఖేల్‌’ అనే మూవీలో ఆమెకు అవకాశం వచ్చింది. టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన ఆ చిత్రంతో నిధికి మంచి పేరే వచ్చినా అక్కడ సెకండ్ చాన్స్ రాలేదు. దాంతో, వెంటనే టాలీవుడ్‌ వైపు చూసిందామె. నిధిని టాలీవుడ్‌ బాగానే రిసీవ్‌ చేసుకుంది. 2018 లో అక్కినేని యువ హీరో నాగచైతన్య ‘సవ్యసాచి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా ఫ్లాప్‌ అయినప్పటికీ చైతూ తమ్ముడు అఖిల్‌తో ‘మిస్టర్ మజ్ఞూ’ చేసింది. అది కూడా నిరాశ పరచడంతో ఇక టాలీవుడ్‌లో నిధి పని అయిపోయినట్టే అనిపించింది. కానీ, పూరి జగన్నాథ్‌, పోతినేని రామ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్’లో ఆమెకు అవకాశం లభించింది. ఈ మూవీ భారీ విజయం సాధించడంతో పాటు నిధికి కూడా పేరొచ్చింది. దాంతో, మరిన్ని అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. తమిళ్‌లో ‘భూమి’ అనే సినిమాలో నటిస్తున్న నిధి.. మహేశ్‌ బాబు అల్లుడు గల్లా అశోక్‌ హీరోగా పరిచయం అవుతున్న చిత్రంలో హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే, ప్రభాస్‌- నాగ్‌అశ్విన్‌ కాంబినేషన్లో రాబోయే సైన్స్‌ థ్రిల్లర్ మూవీలో సెకండ్‌ హీరోయిన్‌గా నిధి పేరు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పాన్‌ ఇండియా మూవీలో చాన్స్‌ వస్తే నిధి లైఫ్ మారిపోవడం ఖాయం.

Also Read: ఆర్ఆర్ఆర్ పై క్లారిటీ ఇచ్చిన ఆలియా భట్‌

సినిమాల్లోనే కాకుండా ఫొటో షూట్స్‌లో హాట్‌ హాట్‌ అందాలు ప్రదర్శించే నిధి మళ్లీ బాలీవుడ్‌ వైపు చూస్తోందట. ఈ క్రమంలో బాలీవుడ్‌ సర్కిల్స్‌లో తరచూ తన పేరు వినబడాలని కోరుకుంటోందట. అందుకే ఈ మధ్య తన సోషల్‌ మీడియా అకౌంట్స్‌లో హాట్‌ ఫొటోలు పెట్టడంతో పాటు పలు మేగజైన్స్‌ కవర్ పేజీలకు పోజులిస్తోంది. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో భారీగా ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్న నిధి అభిమానులతో ముచ్చటించింది. ఈ చాట్ లో బాలీవుడ్ యువ హీరో రణబీర్ కపూర్ తన ఫేవరెట్‌ నటుడు అని చెప్పింది. అంతటితో ఆగకుండా అతనితో లవ్‌లో పడిపోయానని చెప్పింది . రణ్ బీర్ సరసన నటించాలన్నది తన కల అని చెప్పింది. అయితే, రణ్‌బీర్ ఇప్పటికే ఆలియా భట్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు. వీళ్లు తొందర్లోనే పెళ్లి చేసుకుంటారని బాలీవుడ్‌ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది. ఇలాంటి టైమ్‌లో ఆలియా ఘాడంగా ప్రేమిస్తున్న రణ్‌బీర్ ను ఇష్టపడుతున్నానని నిధి బోల్డ్‌ స్టేట్‌ మెంట్‌ ఇవ్వడం చర్చనీయాంశమైంది. అయితే, నిధి వార్తల్లో నిలవడం కోసమే ఆమె ఇలా మాట్లాడిందని కూడా కొందరు అంటున్నారు.

మహేష్ కోసం ప్రత్యేకమైన సెట్ స్టార్ట్ !


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో రానున్న ‘సర్కారు వారి పాట’ సినిమా సెట్ వర్క్ స్టార్ట్ అయింది ఈ రోజు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆర్ట్ డైరెక్టర్ తోట తరుణి ఆధ్వర్యంలో ప్రత్యేకమైన సెంట్రల్ బ్యాంక్ కి సంబంధించిన భారీ సెట్ ను నిర్మిస్తున్నారు. సినిమాలో ఓపెనింగ్ సన్నివేశాలు అన్ని ఈ బ్యాంక్ సెట్ లోనే జరుగుతాయట. ఈ సినిమా కాన్సెప్ట్ కూడా భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూనే సాగుతోందనే మ్యాటర్ ఇప్పటికే బయటకు తెలిసిన విషయం. ఇక ఈ సినిమాలో మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకుగా నటించబోతున్నాడు. అంటే తన తండ్రిని మోసం చేసి వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టడానికి మహేష్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడనేది సినిమాలో మెయిన్ కంటెంట్.

Also Read: దానికి కూడా రష్మికనే రికమెండ్‌ చేసిన విజయ్!

ఈ క్రమంలో మహేష్ వేసే ప్లాన్స్ ఏమిటనే అంశాల చుట్టూ.. అలాగే ఆ బిజినెస్ మెన్ ని ఎలా తన తెలివితో మోసం చేశాడు.. చివరకు ఇలాంటి బిజినెస్ మెన్ లను ఏం చేయాలనే మెసేజ్ తో ఈ సినిమా ముగుస్తోందట. అయితే సినిమా సీరియస్ టోన్ లో సాగకుండా కాస్త కామెడీ యాంగిల్ లోనే ఉంటుందని.. అనగా మహేష్ వేసే ప్లాన్స్ చుట్టూ వచ్చే సీన్స్ ఫుల్ ఎంటర్ టైన్ గా ఉంటాయని సమాచారం. అయినా, సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక కథ ఫిక్స్ చేసాడు అంటే.. ఆ కథలో గుడ్ కంటెంట్ ఉంటుందనేది మహేష్ గురించి బాగా తెలిసిన వాళ్ళు చెప్పే మాట. అందుకే మహేష్ చేసిన ప్లాప్ సినిమాల్లో కూడా మంచి కంటెంటే ఉంటుంది.

Also Read: ఆర్ఆర్ఆర్ పై క్లారిటీ ఇచ్చిన ఆలియా భట్‌

బహుశా అందుకేనేమో మహేష్ ప్లాప్ సినిమాలు కూడా టీవీల్లో టాప్ టీఆర్పీ రేటింగ్ ను తెచ్చుకుంటాయి. ఇక ఈ సినిమాలో మంచి యాక్షన్ తో పాటు థ్రిల్లింగ్ ట్విస్ట్ లు కూడా ఉన్నాయని.. అలాగే ఓ రొమాన్స్ ట్రాక్‌ కూడా ఉందని.. మహేష్ అభిమానులకు ఈ లవ్ స్టోరీ బాగా కనెక్ట్ అవుతుందని మేకర్స్ చెబుతున్నారు. అన్నిటికి మించి చాలా కాలం తర్వాత మహేష్ ఈ సినిమాలో లవర్ బాయ్‌ గా కనిపించబోతున్నాడు. ఈ లవర్ బాయ్ లుక్ కోసమే, మహేష్ తన హెయిర్ స్టైల్ ను కూడా కొత్తగా మార్చుకున్నాడు. ఇప్పటికే మహేష్ మార్చిన కొత్త లుక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. కాగా మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ మూవీని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.

నితిన్‌ సినిమాకు లెడీ విలన్‌ దొరికనట్టేనా?


టబు, అనసూయ, రమ్యకృష్ణ, శిల్పా శెట్టి, నయనతార.. ఏంటీ ఈ లిస్ట్‌ అనుకుంటున్నారా?. యువ హీరో నితిన్‌ సినిమాలో లేడీ విలన్‌ పాత్ర కోసం వినిపించిన పేర్లు. తాజాగా ఈ జాబితాలో కొత్త పేరు చేరింది. ఈ మధ్యే పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడైన‌ నితిన్‌ ఈ మధ్య వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఈ ఏడాది ‘భీష్మ’తో బ్లాక్ బాస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న అతను ప్రస్తుతం ‘రంగ్‌దే’ చిత్రంలో నటిస్తున్నాడు. దీనికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. కీర్తి సురేశ్ హీరోయిన్. అలాగే, చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో కూడా మరో ప్రాజెక్ట్‌ను అనౌన్స్‌ చేసిన నితిన్‌ బాలీవుడ్‌ సూపర్ హిట్‌ మూవీ ‘అంధాదున్’కు కూడా కొబ్బరి కాయ కొట్టాడు. ఠాగూర్ మధు సమర్పణలో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, అక్క నిఖితా రెడ్డి నిర్మించే ఈ మూవీకి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టు కథ, కథనంలో కొన్ని మార్పులతో పక్కా స్క్రిప్టు రెడీ చేశాడు మేర్లపాక.

Also Read: ఆర్ఆర్ఆర్ నుండి క్రేజీ అప్ డేట్స్ !

మాతృకలో బాలీవుడ్‌ టాలెంటెడ్‌ యాక్టర్ ఆయుష్మాన్‌ ఖురానా హీరోగా నటించగా, సీనియర్ నటి టబు విలన్‌ పాత్ర పోషించింది. రాధికా ఆప్టే హీరోయిన్‌గా చేసింది. ఈ చిత్రంలో హీరో అంధుడు. తనను అంతం చేయాలనుకునే ఓ మహిళ నుంచి హీరో ఎలా తప్పించుకున్నాడనేదే కథాంశం. హిందీలో ఆయుష్మాన్‌ ఇరగదీసిన అంధుడి పాత్రను తెలుగులో నితిన్‌ పోషించనున్నాడు. అయితే, సినిమాకు అత్యంత కీలకమైన విలన్‌ పాత్రను తెలుగులో ఎవరు పోషిస్తారనేది ఆసక్తిగా మారింది. ముందుగా చెప్పినట్టు ఈ పాత్ర కోసం చాలా పేర్లు వినిపించాయి. మాతృకలో చేసిన టబునే సంప్రదించగా ఆమె ఒప్పుకోలేదు. తర్వాత హాట్‌ యాంకర్ అనసూయ పేరు కూడా తెరపైకి వచ్చింది. కానీ, ఆమె కూడా అంగీకారం తెలపకపోవడంతో రమ్యకృష్ణ, అలనాటి అందాల నటి శిల్పా నటి పేర్లు కూడా వినిపించాయి. శిల్ప అయితే సినిమాకు ఒప్పుకుందని చాలా ఏళ్ల తర్వాత తెలుగులో రీ ఎంట్రీ ఇస్తుందని అన్నారు. కానీ, అందులో నిజం లేదని తేలింది. ఇక, ధైర్యం చేసి సౌత్‌ లేడీ సూపర్ స్టార్ నయనతారను కూడా సంప్రదించగా చిత్ర బృందానికి నిరాశే ఎదురైందట.

Also Read: ఎక్స్ క్లూజివ్ : మెగాస్టార్ – వినాయక్ సినిమా డిటైల్స్ !

ఇక లాభం లేదని చివరి ప్రయత్నంగా మరో సీనియర్ నటి శ్రియ శరణ్‌కు కథ వినిపించాడట మేర్లపాక గాంధీ. అటు సీనియర్ హీరోలు, ఇటు కుర్రాళ్ల సరసన నటిస్తూ… హీరోయిన్‌గానే కాకుండా ఐటమ్‌ సాంగ్స్‌, చిన్న పాత్రలు చేస్తూ తనదైన శైలిలో దూసుకెళ్తున్న శ్రియకు ఈ కథ బాగా నచ్చిందట. పైగా, తానిప్పటిదాకా నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్ర చేయకపోవడంతో ఈ మూవీతో ఆ లోటు కూడా పూడ్చినట్టు అవుతుందని ఆమె భావిస్తోందట. దాంతో, నితిన్‌ మూవీలో విలన్‌గా నటించేందుకు ఆమె డేట్స్‌ ఇచ్చేసిందని తెలుస్తోంది. దాంతో, చాన్నాళ్లుగా లేడీ విలన్‌ అన్వేషణలో ఉన్న ఈ చిత్ర బృందానికి ఎట్టకేలకు ఉపశమనం కలిగిందట. దీనిపై తొందర్లోనే ప్రకటన చేసి వీలైనంత త్వరగా చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లాలని చూస్తున్నారు.

‘ఆచార్య’ కథ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు !


సినిమాకి ఒక మంచి డైరెక్టర్ ఎంత ముఖ్యమో.. మంచి రైటర్ కూడా అంతే ముఖ్యం. సినిమా హిట్ ప్లాప్ లను డిసైడ్ చేసే కెపాసిటీ ఈ ఇద్దరికే ఎక్కువగా ఉంటుంది. కానీ రైటర్ కు ఎప్పుడూ అన్యాయమే జరుగుతుందని ఫిల్మ్ సర్కిల్స్ రెగ్యులర్ గా చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఒక్కోసారి కొంతమంది పేరు కోసమో.. లేక డబ్బులు కోసమో మొత్తానికి ఫలానా సినిమా కథ నాది, ఫలానా డైరెక్టర్ కాపీ కొట్టాడు అని అనవసర ఆరోపణలు చేస్తుంటారు. ఇలాగే మెగాస్టార్ ఆచార్య సినిమా కథ తనదే అంటూ ఓ కొత్త రచయిత ఆరోపించిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈ సినిమా నుండి మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసింది టీమ్.

Also Read: అనసూయ కోలీవుడ్‌ ఎంట్రీ ఖాయం

అయితే మోషన్ పోస్టర్ లో ధర్మస్థలి అనే నేమ్ ను బాగా హైలైట్ చేశారు. కాగా ఈ ధర్మస్థలి అనే పాయింట్ ను తన స్టోరీ పుణ్యభూమి నుండి కాపీ కొట్టారని, తన పుణ్యభూమి స్క్రిప్ట్ ను 2006లో రైటర్స్ అసోసియేషన్ లో రిజిస్టర్ కూడా చేశానని.. కొరటాల శివ తన స్క్రిప్ట్ ను కాపీ చేసి మెగాస్టార్ తో ఆచార్య సినిమా చేస్తున్నాడని.. నాకు అన్యాయం జరిగిందని అనిల్ అనే వ్యక్తి ఆరోపించారు. కాగా తాజాగా నిర్మాతలు ఈ ఆరోపణల పై స్పందించారు. ఆచార్య చిత్రాన్ని నిర్మిస్తోన్న మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ సంస్థలు ఓ ప్రెస్ నోట్ ను అధికారికంగా విడుదల చేశాయి.

నిర్మాతల మాటల్లో.. ‘ఆచార్య కథ పూర్తి కొత్తది, ఆ కథ కొరటాల శివ స్వయంగా రాసాడనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. బయట వినిపిస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. ఆచార్య కథ కాపీ స్టోరీ కానే కాదు. మెగాస్టార్ చిరంజీవిగారి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన మోస్టర్ పోస్టర్ కు విపరీతమైన ఆదరణను దక్కిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ ఆదరణ చూసిన దగ్గర నుండే కొంతమంది ఇలాంటి రూమర్స్ ను పుట్టిస్తున్నారు. దానికి తోడు కొంతమంది రచయితలు ఆచార్య కథ తమ కథ అని చెప్పుకుంటూ అవాస్తవమైన ఆరోపణలు చేస్తున్నారు.

Also Read: ఆర్ఆర్ఆర్ నుండి క్రేజీ అప్ డేట్స్ !

అసలు ఆచార్య కథను మేము ఎంతో గుప్తంగా ఉంచడం జరిగింది. ఈ కథ కేవలం అతికొద్ది మందికి మాత్రమే తెలుసు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాము. కేవలం మోషన్ పోస్టర్‌ను ఆదారంగా చేసుకుని ఈ కథ కాపీ అని చెప్పడం ఏ మాత్రం భావ్యం కాదు. ఈ కాపీ వార్తలన్నీ పూర్తి అవాస్తవాలే. అందరికీ మరోసారి మేము క్లారిటీగా చెబుతున్నాము. ఆచార్య కథ కాపీ అంటూ వస్తోన్న వార్తలన్నీ పూర్తి అవాస్తవాలే ’ అని నిర్మాతలు మొత్తానికి ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

ఆంధ్రకు అప్పుల తప్పులు అలవాటే… కానీ జగన్ ది మరీ ఓవర్ అయిపోయింది!

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఎంత దీనస్థితిలో ఉందో అందరం చూస్తూనే ఉన్నాం. సమయానికి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. అయితే ఇప్పుడు తీసుకున్న అప్పులు చాలట్లేదు అన్నట్లు ఏపీ ప్రభుత్వం మళ్ళీ కొత్తగా అప్పులు చేస్తోంది. ఇక అప్పులు చేయకుండా ఆంధ్రప్రదేశ్ రాష్టం ఒక్క రోజు కూడా ముందడుగు వేసే పరిస్థితి లేదు. అంత దీనావస్థకి వచ్చేశాం.

ఏపీ రాష్ట్రానికి దశాబ్దాలుగా అప్పులు చేసి పూట గడపడం అలవాటే. చంద్రబాబు, వైయస్సార్ మా ర్చిమార్చి ఇలా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకున్న వారే. ఒకానొక సమయంలో ప్రపంచ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ కు మేము మీకు ఇక అప్పులు ఇవ్వలేము బాబోయ్ అంటూ చేతులెత్తేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక గతంలో చంద్రబాబు చేస్తున్న అప్పుల పై ఆరోపణలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వచ్చాక బాబుని తలదన్నే రీతిలో అప్పులు చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇక ఈ స్థాయిలో అప్పులు చేస్తే రాష్ట్రం గతి తప్పడం అనివార్యం అని ఐవైఆర్ కృష్ణారావు తదితర మాజీ ఐఏఎస్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం మాత్రం తమ తీరు మార్చుకోవట్లేదు లేదు సరికదా కొత్త అప్పులు చేసేందుకు వెతుకుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ ఏడాది ఎఫ్ఆర్బీఏం పరిమితిని దాదాపుగా దాటేసి చేసినట్లు తెలుస్తోంది. ఈ పరిమితిని సవరించుకుంటే కొత్త అప్పులు వస్తాయి అన్న కోణంలో ఇప్పుడు అడుగులు వేస్తోంది. తొలుత ఆర్డినెన్స్ జారీ చేసి గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత ఆ ఆర్డినెన్స్ ను కేంద్రానికి ఫార్వర్డ్ చేసి అక్కడి నుండి ఆమోదముద్ర వేసుకోవలసి ఉంది. ఆ దిశగా కసరత్తులు ఇప్పటికే మొదలయ్యాయి. ఇదే కనుక జరిగితే ఏపీ ప్రభుత్వం మరో 20 వేల కోట్ల రూపాయల అరువు తెచ్చుకుంటుంది.

సరే ఈ అప్పులు తీసుకుని వచ్చి ఇండస్ట్రీలు ఏమన్నా పెడుతున్నారా? కంపెనీల్లో ఏమైనా పెట్టుబడులు పెడుతున్నారా? ఉపాధి కల్పించే కార్యక్రమాలు ఏమైనా చేపడుతున్నారా? ఊరికే ప్రజల ఖాతాల్లోకి నవరత్నాల పేరిట జమ చేస్తున్నారు. ఇప్పటివరకూ ఒక్క ఇన్వెస్టర్ రాష్ట్రానికి వచ్చిన పాపాన పోలేదు. ఉద్యోగావకాశాలు కల్పించడం లేదు. అభివృద్ధి చేసే ఆలోచనే లేదు కానీ అప్పులు మాత్రం చిటెకలో చేసేస్తారు. 2014 నుంచి 2019 వరకు చేసిన అప్పులకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యత వహిస్తారా? మరి 2024 లోపల తీసుకుంటున్న అప్పులకి జగన్ నేనే బాధ్యుడిని అని చేతులు కట్టుకుని నిలబడతారా? అప్పుల భారం చివరిగా మోయాల్సింది కూడా భవిష్యత్తులో రాష్ట్ర ప్రజలే..! అభివృద్ధిలో అడ్రస్ గల్లంతు అవుతున్నా మాత్రం ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులు సృష్టిస్తూనే ఉంది. ఇక జగన్ రాకతో రాష్ట్ర ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది.

మహేష్ బాబు రికార్డ్ ని బ్రేక్ చేసిన బన్నీ !


అల వైకుంఠపురములో.. బన్నీ రేంజ్ ని పెంచిన సినిమా. ఇప్పటికే కొత్త రికార్డ్ లను క్రియేట్ చేసిన ఈ సినిమా, మరో రికార్డును బ్రేక్ చేసింది. అదీ సౌత్ లోనే టాప్ రేంజ్ లో.. మొత్తానికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ ఇచ్చే న్యూస్ ఇది. ఇప్పటి వరకు ఉన్న పాత రికార్డులన్నింటినీ ఈ సినిమా తిరగరాసిందనేది ఒక్కఎత్తు అయితే, నాన్ బాహుబలి తెలుగు రికార్డులను బ్రేక్ చేయడం బన్నీ స్టార్ డమ్ కి దక్కిన అరుదైన ఘనత. తాజాగా ఈ సినిమా మరో రికార్డును క్రియేట్ చేసింది.

Also Read: ఆర్ఆర్ఆర్ నుండి క్రేజీ అప్ డేట్స్ !

నిజానికి ఈ సినిమా రిలీజ్ అయి ఇప్పటికే ఏడు నెలల అవుతుంది. అయినా ఇన్ని నెలల్లో కూడా ఏ ఓటీటీలోకి ఈ సినిమా రాలేదు. అలాగే టీవీలో కూడా ఈ సినిమాని ప్రసారం చేయలేదు. సినిమా రిలీజ్ అయిన చాలా గ్యాప్ తర్వాత ఇటీవల ఓ టీవీలో ఈ సినిమాని టెలికాస్ట్ చేశారు. ఎలాగూ సినిమా వచ్చే ఏడు నెలలు అవుతుంది. పైగా ఇది ఫైరసీ జనరేషన్. దానికి తోడు.. లాక్ డౌన్.. అందరూ నెట్ లో ఫైరసీ సినిమాలు చూస్తున్న కాలం.. మరి ఇలాంటి టైమ్ లో ఈ సినిమాని టీవీలో టెలికాస్ట్ చేశారు. రిలీజ్ డేట్ కి ఇప్పటికి చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి, టీఆర్పీ ఎక్కువ వచ్చే అవకాశం లేదని ఆ ఛానెల్ నిర్వాహకులు సైతం అభిప్రాయపడ్డారు.

Also Read: అనసూయ కోలీవుడ్‌ ఎంట్రీ ఖాయం

కానీ అనూహ్యంగా ఈ సినిమాకి భారీ టీఆర్పీ రేటింగ్ వచ్చింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. ఏకంగా రికార్డు స్థాయిలో టీఆర్పీని సొంతం చేసుకుంది. ఇప్పటివరకూ ఉన్న అత్యధిక టీఆర్పీని కూడా తొక్కేసి కొత్త ట్రెండ్ ను సెట్ చేస్తూ ఏకంగా 29.4 టీఆర్పీతో టాప్ ప్లేస్ లో నిలిచింది. ఇంతకు ముందు వరకూ ఈ రికార్డ్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ పేరిట ఉండేది. ఆ సినిమాకి 23.4 టీఆర్పీ ఉండేది. ఇప్పుడు బన్నీ సినిమా ఆ సినిమా రికార్డును కూడా బ్రేక్ చేసి… ఏకంగా 29.4 టీఆర్పీని సొంతం చేసుకోవడం విశేషం. ఇలా, అల వైకుంఠపురములో మరో మైలురాయిని అందుకోవడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తెగ హ్యాపీగా అవుతున్నారు.

ఆర్ఆర్ఆర్ నుండి క్రేజీ అప్ డేట్స్ !


జూనియర్ ఎన్టీఆర్ అంటే రాజమౌళికి ప్రత్యేకమైన అభిమానం ఉన్న విషయం తెలిసిందే. అందుకే ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో కోసం రాజమౌళి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. నిజానికి ‘ఆర్ఆర్ఆర్’లోని తారక్ ఫస్ట్ లుక్ వీడియోను రాజమౌళి ఎప్పుడు రిలీజ్ చేస్తాడా అని తారక్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ ఎలా కనిపించబోతున్నాడు.. అసలు రాజమౌళి ఎన్టీఆర్ పై ఎలాంటి వీడియోను రిలీజ్ చేయనున్నాడు ఇలా ఎన్టీఆర్ వీడియో పై ఫ్యాన్స్ లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం దసరాకి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ కి సంబంధించిన వీడియోని రాజమౌళి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడని.. ఇప్పటికే జక్కన్న దానికి సంబంధించిన షూట్ ను కూడా వచ్చే నెలలో ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది.

Also Read: షోలో ఆ తల్లీకూతుళ్లు ఉండాల్సిందేనట !

కాగా రాజమౌళి దర్శకత్వంలో తారక్ – రామ్ చరణ్ హీరోలుగా రాబోతున్న ఈ క్రేజీ భారీ మల్టీస్టారర్ లో ఓ గిరిజన యువతి రోల్ కూడా ఉందని.. ఈ రోల్ కోసం ఐశ్వర్య రాజేష్ ను అనుకుంటున్నారని.. ఎన్టీఆర్ పాత్రను చిన్నప్పటి నుండి ఐశ్వర్య రాజేష్ పాత్ర ప్రేమిస్తోందని.. అయితే ఆమె పాత్ర కేవలం గెస్ట్ రోల్ లాంటిదని తెలుస్తోంది. గెస్ట్ రోల్ అయినా ఇలాంటి భారీ సినిమాలో ఛాన్స్ రావడం అంటే.. ఐశ్వర్య రాజేష్ కెరీర్ కే అది పెద్ద ఛాన్స్. మొదట ఈ పాత్రకు ఓ బాలీవుడ్ హీరోయిన్ తీసుకోవాలనుకున్నా.. గిరిజన యువతిగా ఐశ్వర్య రాజేష్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుందని ఆమెను తీసుకుంటున్నారు.

Also Read: ఆ ఘనత ఒక్క ‘అర్జున్‌ రెడ్డి’ డైరెక్టర్ కే దక్కింది !

ఇక ఈ సినిమాలో ప్రధాన హైలెట్స్ లో ఎన్టీఆర్ డైలాగ్స్ మెయిన్ హైలెట్ అట.. ముఖ్యంగా తెలంగాణ యాసలో ఎన్టీఆర్ పలికే డైలాగ్ లు కొమరం భీం గొప్ప తనాన్ని ధైర్యాన్ని ఎలివేట్ చేస్తాయని.. పైగా డైలాగ్ చెప్పడంలో తారక్ గొప్పతనం గురించి కొత్తగా చెప్పేది ఏముంది. ఇప్పటికే రామ్ చరణ్ ఫస్ట్ లుక్ వీడియోలో చరణ్ బిల్డప్ షాట్స్ కంటే కూడా.. తారక్ మాడ్యులేషన్ స్టైలే మెయిన్ హైలైట్ గా నిలిచింది. కాగా డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కరోనా నుండి బయటపడ్డారు.

అనసూయ కోలీవుడ్‌ ఎంట్రీ ఖాయం


అనసూయ.. చాలా పాత పేరు. కానీ, తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకే చాలా మంది అభిమానులున్నారు. దానికి కారణం హాట్‌ యాంకర్ అనసూయ భరద్వాజ్‌ అనే చెప్పొచ్చు. న్యూస్‌ ప్రెజెంటర్గా బుల్లితెరపై కనిపించిన ఈమె ఈటీవీలో ప్రసారం అయ్యే ‘జబర్దస్త్‌’తో భారీ క్రేజ్‌ సంపాందించుకుంది. చిట్టి పొట్టి డ్రెస్సులు, మత్తెక్కించే చూపులు, బోల్డ్‌ కామెంట్స్‌ పాపులర్ అయిందామె. దాంతో, టీవీల్లో టాప్‌ యాంకర్గా కొనసాగుతోంది. అక్కడితో ఆగకుండా వెండితెరపై కూడా అడుగుపెట్టిందామె. తొలుత ‘క్షణం’ సినిమాలో నెగెటివ్‌ రోల్‌లో పోలీసాఫీసర్ పాత్ర చేసినా… చిన్న పాత్ర చేసిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమానే ముందుగా రిలీజైంది. అక్కడి నుంచి టాలీవుడ్‌ దర్శకులు, హీరోలు కన్ను అనసూయపై పడింది. చిన్న పాత్రలో లేదంటే స్పెషల్‌ సాంగ్‌లో అయినా ఆమెను తమ సినిమాలో భాగం చేసుకోవాలని ఆశిస్తున్నారు. ఈ క్రమంలో సాయి ధరమ్‌ తేజ్‌ ‘విన్నర్’ మూవీలో తన పేరుపైనే రాసిన ఓ ఐటమ్‌ సాంగ్‌లో నర్తించిందామె. కానీ, ఆ తర్వాత పాత్రల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.

Also Read: షోలో ఆ తల్లీకూతుళ్లు ఉండాల్సిందేనట !

మోహన్‌ బాబు ‘గాయత్రి’ చిత్రంలో చిన్న పాత్ర చేసిన ఆమె.. రామ్‌చరణ్‌ హీరోగా నటించిన ‘రంగస్థలం’ల రంగమ్మత్త క్యారెక్టర్తో తనలోని నటిని బయటపెట్టింది అనసూయ. డీ గ్లామర్ పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించడంతో పాటు ఫిల్మ్‌ఫేర్, సైమా సహా పలు అవార్డులు అందుకుంది. ఆ తర్వాత ఎఫ్2లో ప్రత్యేక పాత్ర చేసిన ఆమె, సచ్చింది గొర్రె, యాత్ర, మీకు మాత్రమే చెప్తాలో చిన్న పాత్రలు చేసింది. కథనం అనే సినిమాతో పూర్తిస్థాయి హీరోయిన్‌గా మారింది. కానీ, గతేడాది విడుదలైన ఈ చిత్రం తీవ్రంగా నిరాశ పరిచింది. అయినా ఆమెకు ఆఫర్లు తగ్గడం లేదు. ఓవైపు టెలివిజన్‌ రంగంలో బిజీగా ఉన్నప్పటికీ మరోవైపు సినిమాలకూ సమయం కేటాయిస్తోందామె. ప్రస్తుతం ఆమె మూడు పెద్ద సినిమాల్లో నటిస్తోంది. బన్నీ, సుక్కూ కాంబినేషన్లో వస్తున్న ‘పుష్ప’, కృష్ణవంశీ ‘రంగ మార్తాండ’, మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’లో ఆమె నటిస్తోంది.

Also Read: ఆ ఘనత ఒక్క ‘అర్జున్‌ రెడ్డి’ డైరెక్టర్ కే దక్కింది !

ఇప్పుడామె కోలీవుడ్‌పై కూడా దృష్టి పెట్టింది. తొందర్లోనే తమిళ్‌ ఇండస్ట్రీలో అడుగు పెట్టనుంది. యువ నటుడు సందీప్‌ కిషన్‌ హీరోగా నటించిన ‘నిను వీడని నీడను నేనే’ అనే హిట్‌ సినిమాకు దర్శకత్వం వహించిన కార్తీక్‌ రాజు ప్రస్తుతం ‘శూర్పణగై’ అనే సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్నాడు. రెజీనా ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు వచ్చేసింది. దాంతో, తన తదుపరి ప్రాజెక్టుపై దృష్టి పెట్టాడు కార్తీక్‌ రాజు. రజియా విల్సన్‌ ప్రధాన పాత్రలో మరో తమిళ్‌, తెలుగు సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాలని చూస్తున్నాడు. ఈ ఎమోషన్‌ల్‌ థ్రిల్లర్లో అనసూయ కూడా నటిస్తుందని కార్తీక్‌ తెలిపాడు. ఈ చిత్రంతో అనూ తమిళ్‌లో కూడా అడుగు పెట్టబోతోందని రివీల్‌ చేశాడు. చిత్రంలో అనసూయది కీలక పాత్ర అని సమాచారం. రెండు వెర్షన్లలోనూ ఆమె నటిస్తోందని సమాచారం. మరోవైపు తెలుగు వెర్షన్‌లో సత్యం రాజేశ్‌, మధునందన్‌ కూడా కనిపిస్తారని కార్తీక్‌ రాజు తెలిపాడు. ఏదేమైనా ఇప్పుడు తెలుగు టీవీతో పాటు సినిమా రంగంలోనూ గుర్తింపు తెచ్చుకున్న అనసూయ తమిళ్‌లోనూ అడుగు పెట్టేందుకు రంగం సిద్ధమైంది.

ఒకటా.. రెండా..? ఒకే రోజు జగన్ కు హై కోర్టు మూడు వాతలు !

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అసలైన ప్రత్యర్థి, ప్రతిపక్షంలా వ్యవహరిస్తుంది మాత్రం టిడిపి కాదు…. బిజెపి జనసేన కూటమి అసలే కాదు. ఆ పాత్ర పోషిస్తోంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. అవును..! గత కొద్ది నెలలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గుక్క తిప్పుకోనివ్వవ్వకుండా ఏపీ హైకోర్టు వరుసగా షాకుల మీద షాకులు ఇస్తోంది. సచివాలయానికి రంగులు, ఇంగ్లీష్ మీడియం గొడవ నుండి మొదలైన వీరి వైరం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక తాజాగా గురువారం నాడు హైకోర్టు జగన్ ప్రభుత్వానికి ఒకటికి మూడు షాకులు ఇచ్చింది.

వివరాల్లోకి వెళితే…. ఏపీ రాజధాని మార్పు పై హైకోర్టు వారు విధించిన స్టేటస్ కో ని సెప్టెంబర్ 21వ తేదీకి పొడిగించారు. ఇదే విషయమై జగన్ స్టేటస్ కో ని ఎత్తివేయాలని సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేయగా కోర్టువారు ఆ పిటిషన్ ను కొట్టి వేసి ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పారు. ఇది మొదటి షాక్.

ఇక గత కొద్ది రోజులుగా జగన్ ప్రభుత్వం పై అమరావతి రైతుల నుండి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారి పొలాలకు సంబంధించిన కౌలు డబ్బులు రెండు నెలల క్రితమే ఇవ్వవలసి ఉండగా ప్రభుత్వం వాటిని తమ అకౌంట్ లోకి జమ చేస్తామని చెప్పి రెండు నెలల నుండి వేయకుండా జాప్యం చేస్తోందని మరొక పిటిషన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నమోదయింది. వెంటనే హైకోర్టు స్పందించి ముందుగా రెండు రోజుల్లో డబ్బులను రైతుల అకౌంట్లో జమ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఏమైందో ఏమో కానీ మళ్ళీ వెంటనే ఇప్పటికిప్పుడు డబ్బులన్నీ ఎకౌంట్లో ఉండాలని చెప్పడం గమనార్హం.

“ఇదెక్కడి గొడవరా బాబూ….” అని జగన్ అనుకుంటున్న నేపథ్యంలో వెంటనే ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా పాల్పడిన చర్యలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము రాజధాని తరలింపు పై ఇచ్చిన స్టేటస్ కో ని ఉల్లంఘిస్తూ వైజాగ్ లో ఏపీ ప్రభుత్వం అధికారిక గెస్ట్ హౌస్ నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన జరగడం పట్ల హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

“మేము ఇక్కడ స్టేటస్ కో ప్రకారమ్ విశాఖలో ఎటువంటి పనులు జరగడానికి వీల్లేదు అని ఆదేశించాము. తర్వాత కూడా మీరు దానిని ఉల్లంఘించి ఇలా శంకుస్థాపన చేయడం ఏమిటి? అయినా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ఐదు ఎకరాల్లో ఉంటే ప్రభుత్వం వారి గెస్ట్ హౌస్ కి 30 ఎకరాలు కావాలా?” అని నిలదీసింది. ఈ విషయమై వెంటనే ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని హైకోర్టుకి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇలా ఒకటే రోజు ఒకటికి మూడు దెబ్బలను హై కోర్టు నుండి ఎదుర్కొన్న జగన్ ప్రభుత్వం ఇప్పట్లో కోరుకునేది కష్టంగానే కనిపిస్తోంది.

దానికి కూడా రష్మికనే రికమెండ్‌ చేసిన విజయ్!


చాలా తక్కువ టైమ్‌లో మంచి గుర్తింపు, స్టార్డమ్‌ తెచ్చుకున్న హీరో హీరోయిన్లు విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా. వెండితెరపై హాట్‌ పెయిర్ ఇది. వీరిద్దరి కాంబినేషన్లో రెండు సినిమాలు వచ్చాయి. అందులో ‘గీత గోవిందం’ సూపర్ హిట్‌ అయింది. ‘డియర్ కామ్రేడ్‌’ మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ, రెండు సినిమాల్లో విజయ్‌, రష్మిక రొమాన్స్‌ మాత్రం బాగా పండింది. ముఖ్యంగా డియర్ కామ్రేడ్‌లో హాట్ హాట్ లిప్‌ లాక్స్‌తో యూత్‌ను కనువిందు చేశారు ఈ ఇద్దరూ. అలాగే, ఈ మూవీ ప్రమోషన్స్‌లోనూ వీళ్లు చేసిన హంగామా అంతా ఇంత కాదు. దాంతో, ఇద్దరి మధ్య ఏదో ఉందన్న పుకార్లు కూడా వచ్చాయి.

Also Read: ఎక్స్ క్లూజివ్ : మెగాస్టార్ – వినాయక్ సినిమా డిటైల్స్ !

తాజాగా ఈ వీళ్లు మరోసారి కలిసి నటించబోతున్నారు. అలాగని విజయ్‌, రష్మిక మూడోసారి వెండితెరపై జోడీ కట్టడం లేదు. వీళ్లిద్దరూ కలిసి ఓ ప్రకటనలో యాక్ట్‌ చేయబోతున్నారు. ప్రముఖ వస్త్ర కంపెనీ కి సంబంధించిన ప్రకటనలో ఇద్దరూ కనిపిస్తారని తెలుస్తోంది. ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. ఈ బ్రాండ్‌కు తనతో పాటు లేడీ అంబాసిడర్గా రష్మిక పేరును విజయ్ దేవరకొండనే సిఫారసు చేశాడని తెలుస్తోంది. ప్రస్తుతం యూత్‌లో ఇద్దరికీ మంచి క్రేజ్‌ ఉంది. గతంలో ఇద్దరూ కలిసి నటించిన యాడ్స్‌కు కూడా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. దాంతో, విజయ్‌ ప్రపోజల్‌కు సదరు కంపెనీ వెంటనే ఓకే చెప్పిందట. తొందర్లోనే జరిగే యాడ్‌ షూట్‌లో విజయ్, రష్మిక పాల్గొంటారని సమాచారం.

Also Read: ఆ ఫ్లాప్‌ మూవీ సీక్వెల్‌ను నమ్ముకున్న షారూక్‌ ఖాన్‌

సినిమాల విషయానికి వస్తే ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్’తో తీవ్రంగా నిరాశ పరచిన దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్‌తో ‘ఫైటర్’ అనే పాన్‌ ఇండియా మూవీలో నటిస్తున్నాడు. ఈ చిత్రంతో హిందీలో కూడా అడుగు పెట్టబోతున్నడు విజయ్. దీనిపై అతను ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ మూవీలో విజయ్‌ సరసన బాలీవుడ్‌ యువ నటి అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. హిందీ, తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడ, మలయాళంలో కూడా రిలీజ్‌ కాబోతోంది ఈ మూవీ. మరోవైపు రష్మిక వరుస విజయాలు, అవకాశాలతో జోరు మీదుంది. ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరూ, భీష్మతో రెండు సూపర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, తమిళ్ లో సుల్తాన్, కన్నడలో పొగరు చిత్రాలు కూడా చేస్తోందామె.

శకుంతలా దేవి రికార్డును బ్రేక్ చేసిన హైదరాబాదీ


ప్రముఖ గణితవేత్త, హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవి జీవితాధారంగా ఇటీవలే బాలీవుడ్లో మూవీ వచ్చింది. శకుంతలా దేవీగా విద్యాబలన్ అద్భుతంగా నటించి మెప్పించింది. నేటితరం యువతకు ఆమె ప్రతిభ తెలియజేసేలా ఈ మూవీని దర్శకుడు చక్కగా తీర్చిదిద్దిన సంగతి తెల్సిందే. అలాంటి శకుంతలా దేవీ రికార్డును ఓ హైదరాబాదీ యువకుడు బ్రేక్ చేశారు. 20ఏళ్లకే వేగవంగతమైన మానవ కంప్యూటర్ గా సరికొత్త రికార్డు సృష్టించి అందరిచేత ఔరా అనిపించుకున్నాడు.

Also Read: ఆన్ లైన్ విద్య.. అందరికీ ‘పరీక్ష’గా మారనుందా?

హైదరాబాద్ కు చెందిన నీలకంఠ భానుప్రకాశ్ కు చిన్నతనం నుంచే గణితంపై అమితాసక్తిని పెంచుకున్నాడు. అప్పుడే ఎస్ఐపీ వారి అబాకస్ ప్రోగ్రామ్‌లో చేరి గణితంపై మరింత పట్టును సాధించాడు. అదేవిధంగా ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి మ్యాథ్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. 2011, 2012సంవత్సరాల్లో జాతీయ అబాకస్ చాంపియన్‌షిప్.. 2013లో అంతర్జాతీయ అబాకస్ చాంపియన్‌షిప్ లో పాల్గొని భానుప్రకాశ్ విజేతగా నిలిచాడు. తాజాగా లండన్‌లో జరిగిన ‘మెంటల్ కాలిక్యులేషన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌’లో భానుప్రకాశ్ పాల్గొని బంగారు పతకం సాధించి సరికొత్త రికార్డు సృష్టించాడు.

1997సంవత్సరం నుంచి ప్రతియేటా మెంటల్ కాలిక్యులేషన్ ప్రపంచ చాంపియన్‌షిప్ జరుగుతోంది. ఈ ఏడాది కరోనా వైరస్ కారణంగా ఈ చాంపియన్‌షిప్‌ను ఆన్‌లైన్లో నిర్వహించారు. ఇందులో యూకే.. జర్మనీ.. యూఏఈ.. ఫ్రాన్స్.. గ్రీస్.. లెబనాన్ తదితర 13దేశాల నుంచి 30మంది పోటీదారులు పాల్గొన్నారు. వీరిలో భానుప్రకాశ్ విజేతగా నిలువడమే కాకుండా పలురికార్డులను తిరగరాశాడు. గతంలో వేగవంతమైన మానవ కాలిక్యులేటర్లుగా రికార్డులు సృష్టించిన శకుంతలా దేవి, స్కాట్ ఫ్లాన్స్‌బర్గ్ రికార్డులను భాను 20ఏళ్ల వయస్సులోనే తిరగరాయడం విశేషం. త్వరలోనే గణితవేత్తలు, మానవ కాలిక్యులేటర్‌లతో ఒక కమ్యూనిటీ ఏర్పాటు చేయడమే తన లక్ష్యమని భానుప్రకాశ్ చెబుతున్నాడు.

Also Read: టీడీపీపై బీజేపీ ఎందుకు కోపంగా ఉంది?

ఇప్పటికే భానుప్రకాశ్ ఎక్స్‌ప్లోరింగ్ ఇన్‌ఫైనెట్స్ పేరుతో ఒక స్టార్టప్ సంస్థను నిర్వహిస్తున్నాడు. దీని ద్వారా పాఠశాలల్లో వర్క్‌షాప్‌లు నిర్వహిస్తూ చిన్నారులకు గణితంపై ఆసక్తిని పెంచుతున్నాడు. తెలంగాణ, టీ-శాట్ నెట్‌వర్క్‌తో కలిసి 6-10 తరగతుల వారి కోసం 700గంటల మ్యాథ్స్ కంటెంట్‌ను అందించేందుకు భానుప్రకాశ్ ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. గణిత బోధనల్లో మార్పు తీసుకొచ్చి విద్యార్థుల్లో మేధాస్సును పెంచేందుకు కృషి చేస్తానని భానుప్రకాశ్ అంటున్నాడు. 20ఏళ్లకే ఫాసెస్ట్ హ్యుమన్ కంప్యూటర్ గా హైదరాబాద్ కుర్రాడు నిలువడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజారోగ్యం కేసీఆర్ సార్ కు పట్టదా?


తెలంగాణలో కరోనా చికిత్సకు ఓ కార్పొరేట్ ఆస్పత్రి రూ.32 లక్షలు వసూలు చేసిన వైనం అందరినీ షాక్ కు గురిచేసింది.. ఇంకో ఆస్పత్రి 23 లక్షలు ముక్కుపిండి కొల్లగొట్టింది.. శవాలు కూడా ఇవ్వకుండా ఆస్పత్రులు డబ్బులు పిండుకున్నాయి. ఇవి పైసాలా? పెంకాసులా? పైసలు ముందు ప్రాణాలు కూడా లెక్కలేకుండా పోయాయి. కరోనా చికిత్సకు ఆస్తులు అమ్ముకుంటున్నవారు.. బంగారం పుస్తెలు తాకట్టుపెడుతున్న వారు ఎందరో ఉన్నారు. పక్కనున్న ఏపీలో కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చడంతో ఆ జనాలు బతికిపోయారు. కరోనా టెస్టు కిట్ ల ధరలను ఈరోజు సీఎం జగన్ తగ్గించారు. కానీ తెలంగాణ ప్రజలు ఏం పాపం చేశారు కేసీఆర్ సార్? ఇంత నిర్లజ్జగా తెలంగాణ ప్రైవేటు ఆస్పత్రులు దోచుకుంటున్న కళ్లుండి చూడలేక కేసీఆర్ సర్కార్ ఏం చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read: టీడీపీపై బీజేపీ ఎందుకు కోపంగా ఉంది?

నీళ్లు, నిధులు, నియామకాలు.. కేసీఆర్ తెలంగాణ కోసం పోరాడింది వీటి మీదే.. నీళ్లొచ్చాయి.. నిధులు ఖర్చయ్యాయి. నియామకాల మాట దేవుడెరుగు.. తెలంగాణలోని కీలకమైన రెండు రంగాల్లో కేసీఆర్ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. విద్య, వైద్యం. ప్రజలందరికీ ఇవి నిత్యావసరం.. కేజీ-టు పీజీ ఉచిత విద్యను అటకెక్కించిన కేసీఆర్ కార్పొరేట్ దోపిడీకి ద్వారాలు తీశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు కరోనా వేళ అత్యంత కీలకమైన ప్రజారోగ్యం విషయంలో కేసీఆర్ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.

మార్చి నెల మొదటి వారంలో రాష్ట్రంలో మొదటి కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. ఇప్పుడు ఆ సంఖ్య లక్ష దాటింది. ఇంకా ఈ సర్కార్‌‌ కరెక్ట్‌గా టెస్టులు చేసి.. సరైన లెక్కలు చెప్తే ఇంకా ఆ సంఖ్య ఎప్పుడో మరో మూడు లక్షలు దాటేది. పక్క రాష్ట్రంలో ఇప్పటికే 35లక్షల టెస్టులు చేస్తే మన రాష్ట్రంలో ఇంకా 11 లక్షల దగ్గరే ఉన్నాం. దీన్ని బట్టి చూస్తే అర్థమవుతోంది మన ప్రభుత్వం తీరు. దీనికితోడు పాజిటివ్‌ కేసుల సంఖ్య కూడా ప్రభుత్వం దాస్తోందనేది ప్రధాన ఆరోపణ. శ్మశాన వాటికల్లో కాల్చే శవాలకి.. ప్రభుత్వం చెబుతున్న మరణాల కూడా లెక్కలకు పొంతన లేకుండా పోయిందన్న విమర్శలున్నాయి. ఇటీవల ఒకేరోజు 50 శవాలకు దహన సంస్కారాలు చేపడితే.. ఆ రోజు ప్రభుత్వం ప్రకటించిన కరోనా మృతుల లెక్క కేవలం 11 మందే.

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ప్రజలు కోరుతున్నా.. ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదు. ఎందుకంటే ప్రధాన కార్పొరేట్‌ హాస్పిటల్స్‌తో ప్రభుత్వం కుమ్మక్కైందనేది ప్రధాన ఆరోపణ. పక్క రాష్ట్రంలో ఆరోగ్యశ్రీలో చేర్చితే ఇక్కడ ఎందుకు చేర్చడం లేదనేది ఇప్పటికీ ఎవరికీ అర్థం కాని ప్రశ్నే.

‘ఎంతటి వీఐపీ అయినా సరే.. కరోనా వచ్చిందంటే గాంధీ ఆస్పత్రిలోనే ట్రీట్‌మెంట్‌ తీసుకోవాలి’ అంటూ కరోనా ప్రారంభంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ బహిరంగంగా ప్రకటించారు. కానీ.. కరోనా వచ్చిన ఏ ఒక్క లీడర్‌‌ కూడా గాంధీకి పోలేదు. ప్రైవేటు ఆస్ప్రతుల్లోనే చికిత్స తీసుకున్నారు. అంటే వారికే గవర్నమెంట్‌ హాస్పిటల్స్‌ మీద నమ్మకం లేకుండా పోయిందన్నమాట. ఇక ట్రీట్‌మెంట్‌ కోసం పోయిన సామాన్య ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. కొన్ని సందర్భాల్లో పేషెంట్లను పట్టించుకోక.. టైంకి ఆక్సిజన్‌ అందక ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి వీడియోలు ఎన్నో బయటికి వచ్చాయి. స్వయానా ఓ టీవీ జర్నలిస్టుకు కూడా ఇన్‌టైంలో ట్రీట్‌మెంట్‌ అందక చనిపోయాడు. మరో సంఘటనలో గాంధీలో ఓ వృద్ధుడు కరోనాతో చనిపోయినా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ డెడ్‌బాడీని ఎవరూ తీయలేదు. దీంతో ఆ దుర్వాసనతో తోటి పేషెంట్లు అక్కడి నుంచి పరుగులు పెట్టాల్సిన పరిస్థితి. దీనికితోడు డాక్టర్లు, నర్సులు పట్టించుకోవడం లేదనేది ప్రధాన ఆరోపణ. ఇక ఖమ్మం జిల్లాలో అయితే ఫుడ్‌ సరిగా పెట్టడం లేదని ఇళ్ల నుంచి క్యారియర్లు తెప్పించుకుంటున్నారు. ఇదే పరిస్థితి అంతటా కనిపిస్తోంది. ప్రభుత్వ హాస్పిటల్స్‌ను బలోపేతం చేయాల్సిన సర్కార్‌‌ ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నట్లు..? ప్రైవేటు హాస్పిటల్స్‌ను బతికించేందుకేనా..? అన్న ప్రశ్న సామాన్యుల్లో ఉదయిస్తోంది.

Also Read: ఆన్ లైన్ విద్య.. అందరికీ ‘పరీక్ష’గా మారనుందా?

కరోనా కట్టడి విషయంలో పక్కనే ఉన్న ఏపీ ప్రభుత్వాన్ని చూసి సీఎం కేసీఆర్‌‌ ఎంతో నేర్చుకోవాలి. మొదటి నుంచీ అక్కడి ప్రభుత్వం దూకుడుగా టెస్టులు చేస్తోంది. ఎక్కడ కూడా రాజీ పడడం లేదు. ప్రైవేటు ఆస్పత్రులకూ కళ్లెం వేసింది. తాము నిర్ణయించిన ధరలనే తీసుకోవాలని హుకూం జారీ చేసింది. అక్కడ అధికారులు.. మంత్రులు, సీఎం స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కానీ.. తెలంగాణ రాష్ట్రంలో అలాంటివి ఏవీ అమలు కావడం లేదు. సర్కార్‌‌ ఆస్పత్రులపై నమ్మకం లేక ప్రాణాలు దక్కించుకోవాలని కార్పొరేట్‌ బాట పట్టిన పలువురు పేదలకు చుక్కలు చూపిస్తున్నారు. ముక్కుపిండి లక్షలు వసూలు చేస్తున్నారు. మొత్తం బిల్లు కట్టేదాకా శవాలను కూడా ఇవ్వడం లేదు. ఏదో నామమాత్రంగా రెండు హాస్పిటల్స్‌లో కరోనా ట్రీట్‌మెంట్‌ క్యాన్సిల్‌ చేసిన సర్కార్‌‌.. తదుపరి హాస్పిటల్స్‌ మీద చర్యలకు వెనుకడుగు వేసింది. ఇది ఎందుకో అందరికీ తెలిసిన విషయమే..!

ఇక ఎన్ని విమర్శలు వచ్చినా ఒకే ఒక దెబ్బతో కేసీఆర్ వాటిని పటాపంచలు చేయడం ఆయన నైజం. ఆర్టీసీ కార్మికులు అన్ని రోజులు సమ్మె చేసినా తిట్టిపోసినా వారికి భోజనాలు పెట్టి 100 కోట్లు నిధులు, జీతాలు ఇచ్చి కూల్ చేశాడు. ‘దిశ’ హత్యాచారంలోనూ కేసీఆర్ సర్కార్ పై విమర్శలు వచ్చిన వేళ నలుగురి ఎన్ కౌంటర్ తో దేశవ్యాప్తంగా కేసీఆర్ పేరు మారుమోగింది. ఇక కల్నల్ సంతోష్ మరణంపై స్పందించక విమర్శలు ఎదుర్కొన్న కేసీఆర్ చివరకు ఆమె స్థలం, ఉద్యోగం.. సకల సౌకర్యాలు కల్పించి ఒక్కసారిగా హీరోగా అయ్యాడు. ఇలా ఒక్కటేమిటీ.. ప్రతీ విషయాన్ని తెగదాకా నాన్చడం.. అనంతరం దానకర్ణుడిలా డబ్బులు పంచి ఒక్కసారిగా హీరో అయిపోవడం కేసీఆర్ నైజం అని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తుంటుంది. అలాంటి కేసీఆర్ ఇప్పుడు తెలంగాణలో అధ్వానంగా ఉన్న కరోనాకు కూడా చివర్లో ఏదో ట్విస్ట్ ఇచ్చి మళ్లీ మార్కులు కొట్టేస్తాడని టీఆర్ఎస్ వర్గాలు నమ్మకంగా ఉన్నాయి. ఈ ఉపద్రవంపై కేసీఆర్ సార్ ఏం చేస్తాడో చూడాలి మరీ..

చంద్రబాబుకు జగన్ మరో షాక్…వైసీపీలోకి టీడీపీ కీలక నేత…?

ఏపీలో ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి రాజకీయ నాయకులు జంప్ చేయడం సాధారణంగా జరిగేదే. ప్రత్యర్థి పార్టీలను దెబ్బ తీయాలనే ఉద్దేశంతో అధికార పార్టీ నేతలు ఇతర పార్టీలలోని ముఖ్య నేతల చేరికలను ఆహ్వానిస్తూ ఉంటారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు 23 మంది టీడీపీలో చేరగా ప్రస్తుతం టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా మరో ముఖ్య టీడీపీ నేత వైసీపీలోకి చేరడానికి సిద్ధమయ్యాడు.

Also Read : టీడీపీ ఆయువుపట్టుపై కొడుతున్న వైసీపీ

టీడీపీ మాజీ ఎమ్మెల్యే చందన రమేష్ ఇప్పటికే వైసీపీలో చేరగా గంటా సహా ఇతర ముఖ్య నేతలు త్వరలో వైసీపీలో చేరే అవకాశాలు ఉన్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో ఒక బలమైన నేత వైసీపీలో చేరడానికి సిద్ధమయ్యాడని తెలుస్తోంది. గతంలో వైసీపీ నుంచి టీడీపీకి వెళ్లిన ఆ ఎమ్మెల్యే ఇప్పుడు మళ్లీ వైసీపీలోకి వెళ్లబోతున్నారనే ప్రచారం జరిగింది. కాకినాడకు చెందిన చెలమల శెట్టి సునీల్ స్థానికంగా మంచి పేరు ఉన్న నేత.

ఎంపీ కావాలనే లక్ష్యంతో వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేసినా మూడుసార్లు ఆయనను ఓటమే పలకరించడం గమనార్హం. మొదట 2009లో ప్రజారాజ్యం నుంచి ఎంపీగా పోటీ చేసిన ఆయన 2014లో వైసీపీ నుంచి 2019లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమిని చవిచూశారు. కాపు వర్గానికి చెందిన సునీల్ కు రాజ్యసభ సీటు ఇస్తానని జగన్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్న విధంగా జరిగితే వచ్చే వారం ఆయన పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.

Also Read : ప్రధానికి లేఖ రాసిన సీఎం జగన్… ఎందుకోసమంటే..?

ఆర్ఆర్ఆర్ పై క్లారిటీ ఇచ్చిన ఆలియా భట్‌


బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ మృతి హిందీ చిత్ర పరిశ్రమను కుదిపేసింది. ఇండస్ట్రీలో బంధుప్రీతి అంశం చర్చనీయాంశమైంది. బాలీవుడ్‌ కొన్ని కుటుంబాల గుప్పిట్లోనే ఉందని, వారసుల పిల్లలకే అవకాశాలకు ఇస్తున్నారని, ఇతర ప్రతిభావంతులను తొక్కేస్తున్నారన్న విమర్శలు చెలరేగాయి. సుశాంత్‌ మరణానికి ఇదే కారణం అన్న ఆరోపణలు వచ్చాయి. బాలీవుడ్‌ను ఏలుతున్న కపూర్, భట్‌, ఖాన్ల కుటుంబ సభ్యలుపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. వాళ్లను, వాళ్ల సినిమాలను బ్యాన్‌ చేయాలని పలువురు డిమాండ్‌ చేశారు. సుశాంత్‌ మరణం వెనుక అతని ప్రేయసి రియా చక్రవర్తి హస్తం ఉందని ఆరోపణలు రావడంతో ఆమె చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అదే టైమ్‌లో రియాకు నిర్మాత మహేశ్‌ భట్‌కు సన్నిహిత సంబంధం ఉందంటూ కొన్ని ఫొటోలు, వాట్సప్‌ చాట్స్‌ బయటకు వచ్చాయి.

Also Read: ఆ ఫ్లాప్‌ మూవీ సీక్వెల్‌ను నమ్ముకున్న షారూక్‌ ఖాన్‌

దాంతో, మహేశ్‌ భట్‌ కుటుంబ సభ్యులపై విమర్శల తాకిడి ఎక్కువైంది. ముఖ్యంగా అతని కూతురు ఆలియా భట్‌ను టార్గెట్‌ చేస్తున్నారు. ఆమె చేస్తున్న సినిమాలపై దుమ్మెత్తిపోస్తూ సోషల్‌ మీడియాలో నెగెటెవ్‌ టాక్‌ ఎక్కువైంది. ఆలియా హీరోయిన్‌గా నటించిన సడక్ 2 మూవీ ట్రైలర్ అత్యధిక డిస్‌లైక్స్‌ పొందిన ట్రైలర్‌గా రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో ఆలియా ఓ హీరోయిన్‌గా నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాపై కూడా ప్రభావం పడుతుందన్న అభిప్రాయాలు ఎక్కువయ్యాయి. దాంతో, ఆర్ఆర్ఆర్ నుంచి ఆలియా భట్‌ను తీసేసి, ఆమె ప్లేస్‌లో గ్లోబల్‌ స్టార్ ప్రియాంక చోప్రాను తీసుకున్నారనే వార్త చక్కర్లు కొడుతోంది.

Also Read: గుడ్‌న్యూస్‌ చెప్పిన కోహ్లీ.. తల్లి కాబోతున్న అనుష్క

ఆలియాను ప్రేక్షకులు ఇష్టపడక పోవడం వల్లే ఆర్ఆర్ఆర్ టీమ్‌ ఈ నిర్ణయం తీసుకుందన్న ప్రచారం జరుగుతోంది. తెలుగులోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా ఇది వినిపిస్తోంది. అయితే, ఈ విషయంపై ఆలియా క్లారిటీ ఇచ్చింది. తన టీమ్‌ ద్వారా ఈ వార్తలను ఖండించింది. ఆర్ఆర్ఆర్ లో ఆలియా కొనసాగుతోందని ఆమె టీమ్‌ స్పష్టం చేసింది. ఈ మూవీలో తన పాత్ర కోసం ఆమె కసరత్తులు చేస్తోందని, తెలుగు కూడా నేర్చుకునే పనిలో ఉందని తెలిపింది. ఆలియాకు చెడ్డ పేరు తెచ్చేందుకే కొందరు కావాలనే ఇలాంటి పుకార్లు వ్యాప్తి చేస్తున్నారని చెప్పింది. అయితే, ఆలియా వైపు నుంచి క్లారిటీ వచ్చినప్పటికీ ఈ విషయంపై చిత్ర బృందం వైపు నుంచి కూడా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. దీనిపై రాజమౌళి స్పందిస్తేనే ఈ పుకార్లకు పుల్‌స్టాప్‌ పడేలా ఉంది.