
బాలీవుడ్ నుంచి టాలీవుడ్ బాట పట్టిన అందగత్తెల్లో నిధి అగర్వాల్ ఒకరు. ఈ బెంగళూరు బ్యూటీ తొలుత మోడలింగ్‌లో మంచి పేరు తెచ్చుకొని హిందీ దర్శకుల కంట్లో పడింది. దాంతో, 2017లో ‘ మున్నా మైఖేల్’ అనే మూవీలో ఆమెకు అవకాశం వచ్చింది. టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన ఆ చిత్రంతో నిధికి మంచి పేరే వచ్చినా అక్కడ సెకండ్ చాన్స్ రాలేదు. దాంతో, వెంటనే టాలీవుడ్ వైపు చూసిందామె. నిధిని టాలీవుడ్ బాగానే రిసీవ్ చేసుకుంది. 2018 లో అక్కినేని యువ హీరో నాగచైతన్య ‘సవ్యసాచి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ చైతూ తమ్ముడు అఖిల్‌తో ‘మిస్టర్ మజ్ఞూ’ చేసింది. అది కూడా నిరాశ పరచడంతో ఇక టాలీవుడ్‌లో నిధి పని అయిపోయినట్టే అనిపించింది. కానీ, పూరి జగన్నాథ్, పోతినేని రామ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’లో ఆమెకు అవకాశం లభించింది. ఈ మూవీ భారీ విజయం సాధించడంతో పాటు నిధికి కూడా పేరొచ్చింది. దాంతో, మరిన్ని అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. తమిళ్‌లో ‘భూమి’ అనే సినిమాలో నటిస్తున్న నిధి.. మహేశ్ బాబు అల్లుడు గల్లా అశోక్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రంలో హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే, ప్రభాస్- నాగ్‌అశ్విన్ కాంబినేషన్లో రాబోయే సైన్స్ థ్రిల్లర్ మూవీలో సెకండ్ హీరోయిన్‌గా నిధి పేరు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పాన్ ఇండియా మూవీలో చాన్స్ వస్తే నిధి లైఫ్ మారిపోవడం ఖాయం.
Also Read: ఆర్ఆర్ఆర్ పై క్లారిటీ ఇచ్చిన ఆలియా భట్
సినిమాల్లోనే కాకుండా ఫొటో షూట్స్‌లో హాట్ హాట్ అందాలు ప్రదర్శించే నిధి మళ్లీ బాలీవుడ్ వైపు చూస్తోందట. ఈ క్రమంలో బాలీవుడ్ సర్కిల్స్‌లో తరచూ తన పేరు వినబడాలని కోరుకుంటోందట. అందుకే ఈ మధ్య తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో హాట్ ఫొటోలు పెట్టడంతో పాటు పలు మేగజైన్స్ కవర్ పేజీలకు పోజులిస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో భారీగా ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్న నిధి అభిమానులతో ముచ్చటించింది. ఈ చాట్ లో బాలీవుడ్ యువ హీరో రణబీర్ కపూర్ తన ఫేవరెట్ నటుడు అని చెప్పింది. అంతటితో ఆగకుండా అతనితో లవ్‌లో పడిపోయానని చెప్పింది . రణ్ బీర్ సరసన నటించాలన్నది తన కల అని చెప్పింది. అయితే, రణ్‌బీర్ ఇప్పటికే ఆలియా భట్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు. వీళ్లు తొందర్లోనే పెళ్లి చేసుకుంటారని బాలీవుడ్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది. ఇలాంటి టైమ్‌లో ఆలియా ఘాడంగా ప్రేమిస్తున్న రణ్‌బీర్ ను ఇష్టపడుతున్నానని నిధి బోల్డ్ స్టేట్ మెంట్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. అయితే, నిధి వార్తల్లో నిలవడం కోసమే ఆమె ఇలా మాట్లాడిందని కూడా కొందరు అంటున్నారు.